
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడిచేసుకున్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. గ్రామాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. చదవండి: (భర్తకు అన్నం వడ్డించి.. అంగడికి వెళ్లొస్తానని చెప్పి నవవధువు అదృశ్యం)