gundala village
-
ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలి
ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా): తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రాలోని ఎటపాక మండలం పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు ఆంధ్రాలోనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో విలీనం చేయాలని తీర్మానాలు చేసినట్టు వస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. పురుషోత్తపట్నంలో శుక్రవారం కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు. ఎంపీటీసీ సభ్యులు వర్సా బాలకృష్ణ, గొంగడి వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ బుద్దా ఆదినారాయణ, పార్టీ నేతలు మంత్రిప్రగడ నర్సింహరావులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికీ అందుతున్నాయని తెలిపారు. జిల్లాల పునర్విభజన సమయంలో పాడేరు దూరాభారం దృష్ట్యా విలీన మండలాలకు పాలన సౌలభ్యం కోరుతూ ఆ సమయంలో కొందరు తీర్మానాలు చేశారని, అయితే ఆ నాటి తీర్మానాల్లో కొందరి సంతకాలు ఫోర్జరీ చేసి ఇప్పుడు వాటిని వక్రీకరించి చూపిస్తూ తెలంగాణ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. భద్రాచలంలోని కొందరు వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలనే వాదనను తెరపైకి తెస్తున్నారని చెప్పారు. భద్రాచలాన్ని తిరిగి ఆంధ్రాలో కలపాలని డిమాండ్ చేశారు. (క్లిక్: పవన్ కళ్యాణ్ తీరుపై మత్స్యకారుల మండిపాటు) -
ఆదిలాబాద్ జిల్లా గుండాలలో తీవ్రఉద్రిక్తత.. ఇద్దరు మృతి
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడిచేసుకున్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. గ్రామాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. చదవండి: (భర్తకు అన్నం వడ్డించి.. అంగడికి వెళ్లొస్తానని చెప్పి నవవధువు అదృశ్యం) -
పోలీసుల వేధింపులు : యువకుడు ఆత్మహత్య
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా ఏటపాక మండలం గుండాల గ్రామంలో పోలీసుల వేధింపులు భరించలేక మంచిన పవన్‌కల్యాణ్ (18) అనే యువకుడు సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గత కొద్దిరోజుల క్రితం వెలుగు సీసీ సాంబశివరావు హత్య జరిగింది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో సాంబశివరావు కాల్ లిస్ట్‌లో పవన్‌కల్యాణ్ సెల్ నెంబర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పవన్ కల్యాణ్‌ను పోలీసులు విచారించారు. దాంతో తీవ్ర మనస్థాపం చెందిన అతడు... గత రెండు నెలల నుంచి పోలీసులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. సాంబశివరావు హత్యతో తమ పవన్‌కు ఎలాంటి సంబంధం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు విపరీతంగా వేధించినందువల్ల మనస్థాపంతో పవన్‌కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.