కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా ఏటపాక మండలం గుండాల గ్రామంలో పోలీసుల వేధింపులు భరించలేక మంచిన పవన్‌కల్యాణ్ (18) అనే యువకుడు సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గత కొద్దిరోజుల క్రితం వెలుగు సీసీ సాంబశివరావు హత్య జరిగింది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆ క్రమంలో సాంబశివరావు కాల్ లిస్ట్‌లో పవన్‌కల్యాణ్ సెల్ నెంబర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పవన్ కల్యాణ్‌ను పోలీసులు విచారించారు. దాంతో తీవ్ర మనస్థాపం చెందిన అతడు... గత రెండు నెలల నుంచి పోలీసులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. సాంబశివరావు హత్యతో తమ పవన్‌కు ఎలాంటి సంబంధం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు విపరీతంగా వేధించినందువల్ల మనస్థాపంతో పవన్‌కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.