పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి సైకోలను తయారుచేసి పంపించాడా? | Polavaram Public Fires On Janasena MLA Chirri Balaraju Over Sand Issue, More Details Inside | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి సైకోలను తయారుచేసి పంపించాడా?

Published Sat, Feb 22 2025 11:26 AM | Last Updated on Sat, Feb 22 2025 11:59 AM

Polavaram public Fires on Janasena MLA Chirri Balaraju

 జనసేన ఎమ్మెల్యేపై టీడీపీ కార్యకర్త ఆగ్రహం

సోషల్‌ మీడియోలో హల్‌చల్‌ చేస్తున్న సెల్ఫీ వీడియో 

సాక్షి, ఏలూరు: పోలవరం(Polavaram)ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై(Janasena MLA Chirri Balaraju) అసమ్మతి గళాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే, జనసేన నాయకుల తీరుపై ఓ టీడీపీ(TDP) కార్యకర్త ఆవేదనతో శు క్రవారం ఒక సెల్ఫీ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ప్రభుత్వం ఇసుక ఫ్రీ అని ప్రకటించిందని, ఇక్కడ మాత్రం జనసేన మండల ప్రెసిడెంట్‌ ట్రాక్టర్‌కు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నా రని ఆ సెల్ఫ్ లో ఆయన విమర్శించారు. 

పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ఇలాంటి సైకో ఎమ్మెల్యేను తయారు చేసి ఇక్కడికి పంపించాడా అంటూ ప్రశ్నించారు. ప్రతి కార్యకర్త కూడా ఇటువంటి సెల్ఫీ వీడియోలు పెట్టి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు చేరేలా చూడాలని చెప్పారు. బోర్‌ వేసుకోవాలన్నా, వృద్ధాప్య పింఛన్‌ కావాలన్నా, బెల్ట్‌ షాపు పెట్టుకోవాలన్నా లంచాలు వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే కంటే గత ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎంతో బెటర్‌ అంటూ చెప్పారు. 

ఆఖరికి పొలంలో బోరు వేసుకోవాలన్నా రూ.25 వేలు లంచంగా అడుగుతున్నారంటూ తెలిపారు. బెల్ట్‌ షాపు పెట్టుకోవాలంటే రూ.1.50 లక్షలు, వీఆర్వోల బదిలీకి రూ.10 వేల నుంచి రూ.లక్ష, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ భూములు మార్చుకుంటే రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారంటూ వివరించారు. రాత్రి సమయానికి ఆ కార్యకర్త మరో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను తాను గతంలో మనస్పర్థలు ఉన్నప్పుడు చేశానని, దానిని కొంతమంది కా వాలనే సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారని, అటువంటి వారిపై కేసు పెడతానంటూ ఆ కార్యకర్త అందులో పేర్కొనడం గమనార్హం.    

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement