Balaraju
-
పవన్ కల్యాణ్ ఇలాంటి సైకోలను తయారుచేసి పంపించాడా?
సాక్షి, ఏలూరు: పోలవరం(Polavaram)ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై(Janasena MLA Chirri BalarajuJanasena MLA Chirri Balaraju) అసమ్మతి గళాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే, జనసేన నాయకుల తీరుపై ఓ టీడీపీ(TDP) కార్యకర్త ఆవేదనతో శు క్రవారం ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రభుత్వం ఇసుక ఫ్రీ అని ప్రకటించిందని, ఇక్కడ మాత్రం జనసేన మండల ప్రెసిడెంట్ ట్రాక్టర్‌కు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నా రని ఆ సెల్ఫ్ లో ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇలాంటి సైకో ఎమ్మెల్యేను తయారు చేసి ఇక్కడికి పంపించాడా అంటూ ప్రశ్నించారు. ప్రతి కార్యకర్త కూడా ఇటువంటి సెల్ఫీ వీడియోలు పెట్టి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు చేరేలా చూడాలని చెప్పారు. బోర్ వేసుకోవాలన్నా, వృద్ధాప్య పింఛన్ కావాలన్నా, బెల్ట్ షాపు పెట్టుకోవాలన్నా లంచాలు వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే కంటే గత ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎంతో బెటర్ అంటూ చెప్పారు. ఆఖరికి పొలంలో బోరు వేసుకోవాలన్నా రూ.25 వేలు లంచంగా అడుగుతున్నారంటూ తెలిపారు. బెల్ట్ షాపు పెట్టుకోవాలంటే రూ.1.50 లక్షలు, వీఆర్వోల బదిలీకి రూ.10 వేల నుంచి రూ.లక్ష, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ భూములు మార్చుకుంటే రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారంటూ వివరించారు. రాత్రి సమయానికి ఆ కార్యకర్త మరో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను తాను గతంలో మనస్పర్థలు ఉన్నప్పుడు చేశానని, దానిని కొంతమంది కా వాలనే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, అటువంటి వారిపై కేసు పెడతానంటూ ఆ కార్యకర్త అందులో పేర్కొనడం గమనార్హం. -
మీడియా వాళ్ళు సినిమా చూసి రివ్యూ ఇవ్వండి
-
'సలార్' రిలీజ్: ప్రభాస్ వీరాభిమాని మృతితో..
శ్రీసత్యసాయి, సాక్షి: సలార్ సినిమా రిలీజ్ నేపథ్యంలో అభిమానులు పండుగు చేసుకుంటుండగా.. ఊహించని విషాదం చోటుచేసుకుంది. ధర్మవరంలో థియేటర్ వద్ద ప్రమాదవశాత్తూ ఓ వీరాభిమాని మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ కేంద్రంలోని రంగా సినిమా థియేటర్లో 'సలార్' సినిమా విడుదల సందర్భంగా బాలరాజు(27) థియేటర్ ఆవరణలో సలార్ మూవీ బ్యానర్ కడుతున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఫ్లెక్సీ రాడ్ పైనున్న హై వోల్టేజ్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే దగ్గరలోని హాస్పిల్‌కి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు బంధువులు, ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద న్యాయం చేయాలంటూ, మృతిచెందిన బాలరాజు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ఇవి కూడా చదవండి: కామారెడ్డిలో దారుణం: క్షణికావేశంలో కొడుకును పొడిచి, ఆపై తండ్రి కూడా.. -
వాలీబాల్ ఆడుతుండగా వర్షం.. చెట్టు కిందకు పరుగులు.. మరో చెట్టుపై పిడుగు
రావికమతం (అనకాపల్లి జిల్లా): చెట్టుపై ఆదివారం సాయంత్రం పిడుగు పడడంతో 11 మంది గిరిజన యువకులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురిని విశాఖ కేజీహెచ్‌కు, 8 మందిని 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రావికమతం మండలం తాటిపర్తి గిరిజన గ్రామంలో ఆ గ్రామానికి చెందిన సీదిరి శ్రీను, కుండ్ర బాలరాజు, షోమీల శ్రీను, పాడి చినబ్బాయి, బాలకృష్ణ, లోత కళ్యాణం, సుర్ల గణేష్ తదితర యువకులు ఆదివారం వాలీబాల్ ఆడుతుండగా వర్షం రావడంతో అంతా ఒక చెట్టు కిందకు పరుగులు తీశారు. ఆ సమయంలో వారికి సమీపంలోని మరో చెట్టుపై పిడుగుపడడంతో ఆ అదురుకు పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే ఉన్న మరికొంత మంది వెంటనే 108కు సమాచారం అందించడంతో హుటాహుటిన అంబులెన్స్ సిబ్బంది వచ్చి, గాయపడిన వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అందరూ కోలుకున్నారని ఆందోళన చెందాల్సిన పనిలేదని గ్రామ సర్పంచ్ వంజరి గంగరాజు తెలిపారు. -
గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్‌గా దూదిమెట్ల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నూతన చైర్మన్‌గా డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాసాబ్‌ట్యాంకులోని సమాఖ్య కార్యాలయంలో జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు హాజరై బాలరాజు యాదవ్‌ను అభినందించారు. అనంతరం అభినందన సభలో మంత్రులు మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమంలో బాలరాజు యాదవ్ పాత్రను అభినందిస్తూ, ఉద్యమంలో ఆయన కృషిని గుర్తిస్తూ సీఎం కేసీఆర్ పదవిని అప్పగించారన్నారు. రాష్ట్రంలో పాడి, మాంస, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశ పెట్టారని, గొర్రెల పంపిణీ పథకం ద్వారా మాంస పరిశ్రమ అభివృద్ధికి కేసీఆర్ బాటలు వేశారన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, దానం నాగేందర్, బేతి సుభా‹ష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పోలవరం’ ఘనత వైఎస్సార్‌దే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు అనేది రాష్ట్ర ప్రజలు కొన్ని దశాబ్దాలుగా కంటున్న కల అని, దీన్ని నిజం చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్పారు. శాసనసభలో బుధవారం పోలవరంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘దివంగత మహానేత వైఎస్సార్ దీనికి శంకుస్థాపన చేస్తే దీన్ని పూర్తిచేసి ప్రారంభించే అరుదైన అవకాశం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి లభిస్తోంది. పోలవరం ప్రాజెక్టు కడితే వైఎస్సార్‌కు పేరు వస్తుందనే స్వార్థంతో నాడు చంద్రబాబునాయుడు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ వారిని రెచ్చగొట్టి కోర్టుకు పంపించారు. పోలవరం భూసేకరణను అడుగడుగునా అడ్డుకునేలా కోర్టుల్లో కేసులు వేయించారు. అయినా వైఎస్సార్ ముందుకే వెళ్లారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే పోలవరానికి చంద్రగ్రహణం పట్టింది. సోమవారం పోలవారం అన్నది బాబు కిక్‌బ్యాగ్స్ కోసమే. పోలవరాన్ని చంద్రబాబు పాలిచ్చే ఆవులా మార్చుకున్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రే వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. నిర్వాసితులను చంద్రబాబు గోదావరిలో ముంచారు. ఆర్ అండ్ ఆర్‌లో అవకతవకలపై విచారణ జరిపించాలి. పోలవరం ప్రాజెక్టు వద్ద దివంగత నేత వైఎస్సార్ వంద అడుగుల విగ్రహం పెట్టాలని మా అందరి తరఫున సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నా. చిరస్మరణీయుడికి తెలుగుజాతి తరఫున ఇలా నివాళులు అర్పించాలని కోరుతున్నా..’ అని బాలరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారపక్ష సభ్యులంతా ఈ ప్రతిపాదనను బలపరుస్తూ.. జోహార్ వైఎస్సార్, జోహార్ వైఎస్సార్ అని నినాదాలు చేశారు. -
పోలవరం పూర్తి చేసే సత్తా వైఎస్ జగన్‌కే ఉంది
-
తగ్గని గోదా'వడి'
సాక్షి, అమరావతి/నెట్వర్క్: గోదావరిలో వరద ప్రవాహ తీవ్రత కొనసాగుతోంది. సోమవారం వేకువజామున 5 గంటలకు ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.70 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. క్రమేపీ తగ్గుతూ రాత్రి 7 గంటలకు 12.50 అడుగులకు చేరుకుంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 100 టీఎంసీలను సముద్రంలోకి వదిలారు. గడచిన ఐదు రోజుల్లో 500 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ధవళేశ్వరం, దాని దిగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గినా.. ఎగువన భద్రాచలం వద్ద పెరుగుతుండటంతో మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీని ప్రభావంతో మంగళవారం ధవళేశ్వరం వద్ద వరద తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి గోదావరి జిల్లాల ప్రజలను కలవరపెడుతోంది. ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు గోదావరిలోకి ఉప్పొంగి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6.40 గంటలకు భద్రాచలంలో నీటిమట్టం 43 అడుగులకు చేరింది. తూర్పు గోదావరి జిల్లా చింతూరు వద్ద 37.6 మీటర్లు, కూనవరం వద్ద 37.32 మీటర్లు, పోలవరం వద్ద 27.2 మీటర్లకు చేరింది. పోలవరం కాఫర్ డాŠయ్‌మ్ వద్ద వరద నీటి మట్టం 27.2 మీటర్లకు చేరడంతో.. స్పిల్‌వే మీదుగా రెండు మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 18 మండలాల పరిధిలోని 202 గ్రామాలను వరద ముంచెత్తింది. ఆ జిల్లాలో 87,850 మంది వరద వల్ల ఇబ్బందులు పడుతుండగా.. ఇప్పటివరకు 18,809 మందిని 85 పునరావాస కేంద్రాలకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 22 మండలాల్లోని 218 గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. 26,047 మందికి సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. తూర్పు ఏజెన్సీ, కోనసీమ లంక గ్రామాలు నాలుగు రోజులుగా ముంపులోనే ఉండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మామిడికుదురు, పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల పరిధిలో సుమారు 15 లంక గ్రామాలకు సైతం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎమ్మెల్యే, అధికారులకు తప్పిన ప్రమాదం పోలవరం మండలంలోని ముంపు గ్రామాల ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేందుకు వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు, అధికారులకు తృటిలో ప్రమాదం తప్పింది. వారు పోశమ్మగండి నుంచి టూరిజం బోటులో వెళ్తుండగా.. మూలపాడు వద్ద కొండపక్క వరద ప్రవాహంలో చిక్కుకున్న బోటు ఒక్కసారిగా ఊగిపోతూ నదిలో కిందకు దిగిపోయింది. బోటును నది మధ్య నుంచి వాడపల్లి వైపు మళ్లించటంతో ప్రమాదం తప్పింది. కమీషన్ల కక్కుర్తే కొంప ముంచింది పోలవరం ప్రాజెక్ట్‌లో కమీషన్ల కోసం కక్కుర్తిపడి నిర్వాసితులను గాలికొదిలేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల్లో వరదలకు కారణమయ్యారని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆక్షేపించారు. చంద్రబాబు పాపాలకు ప్రతిఫలమే ఈ వరదలన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్లే వరదలు వచ్చిపడ్డాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ముంపుబారిన పడిన గిరిజన గ్రామాల్లో సోమవారం మంత్రుల బృందం పర్యటించింది. జల దిగ్బంధంలో చిక్కుకున్న వీరవరం గ్రామానికి ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నాగులాపల్లి ధనలక్ష్మి, యువజన అధ్యక్షుడు అనంతబాబు, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మి ట్రాక్టర్లపై వెళ్లి పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. మరోవైపు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆచంట మండలంలో ముంపుబారిన పడిన అనగారలంక, పెదమల్లంలంక, పల్లిపాలెం, అయోధ్యలంక, పుచ్చలంక, రాయిలంకల్లో అధికారులతో కలిసి పర్యటించారు. 1,684 కుటుంబాల వారికి ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కందిçపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పామాయిల్ పంపిణీ చేశారు. శ్రీశైలం వద్ద పెరిగిన ప్రవాహం శ్రీశైలం జలాశయంలోకి సోమవారం వరద ప్రవాహం మరింత పెరిగింది. సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 2,36,331 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 42,378 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హంద్రీ–నీవా ద్వారా 1,200 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 863.8 అడుగుల మేర 118.05 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా విడుదల చేస్తున్న జలాల్లో 42,378 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌లోకి చేరుతున్నాయి. ప్రస్తుతం సాగర్‌లో 506.8 అడుగులతో 126.30 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మహాబలేశ్వర్ పర్వతాల్లో 38 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. దీంతో మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించిన నేపథ్యంలో.. కర్ణాటక సర్కార్ ముందు జాగ్రత్తగా ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో నీటి నిల్వలను ఖాళీ చేస్తూ భారీగా జలాలను దిగువకు విడుదల చేస్తోంది. కృష్ణా ప్రధాన ఉప నదులలో ఒకటైన బీమా ఉప్పొంగుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 1.60 లక్షల క్యూసెక్కుల వరద ఉజ్జయిని ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఉజ్జయిని గేట్లు అర్ధరాత్రి దాటాక ఎత్తే అవకాశం ఉంది. -
ట్యాంకెక్కి.. సజీవదహనం
చిల్పూరు: కేసులు ఎత్తివేయాలని కోరుతూ ఓ వ్యక్తి ట్యాంక్‌పైకెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలం వెంకటాద్రిపేటలో గురువారం చోటుచేసుకుంది. వెంకటాద్రిపేటకు చెందిన రాధమ్మ–రాజయ్య దంపతుల మూడో కుమారుడు బాలరాజు(37) పలు కేసుల్లో నిందితుడు. ఇద్దరు భార్యలు మృతి చెందగా జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఉదయం బాలరాజు ఐదు లీటర్ల పెట్రోలు క్యాన్, క్రిమిసంహారక మందు డబ్బా తీసు కుని గ్రామసమీపంలోని దేవాదుల రిజర్వాయర్‌లోకి వెళ్లి వాటర్ ట్యాంకు ఎక్కాడు. అక్కడి నుంచి 100 నంబర్‌కు డయల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. వారు చిల్పూరు ఎస్సై శ్రీనివాస్‌కు సమాచారం ఇవ్వగా.. ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తనకు అన్యాయం జరిగిందని, విలేకరులు వస్తేనే దిగుతానని అనడంతో వారంతా అక్కడికి చేరుకున్నారు. కిందికి దిగిన బాలరాజు.. తాను చేసిన తప్పు కారణంగా నా తమ్ముడిపైన కేసు పెట్టారు.. కేసు లేకుండా చేయాలని కోరాడు. ఇందుకు పోలీసులు హామీనిచ్చారు. అయితే.. వెంట తెచ్చుకున్న సామగ్రి తెచ్చుకుంటానని ట్యాంక్‌పైకెళ్లి ముందుగా క్రిమిసంహారక మందు తాగాడు. వెంటనే ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్నాడు. ఎస్పై 108 సిబ్బందికి సమాచారం ఇచ్చి ట్యాంకు పైకి వెళ్లి చూసేసరికే అప్పటికే సజీవదహనం అయ్యాడు. -
టీడీపీతో పొత్తు.. ఏపీలో కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బ
సాక్షి, విశాఖపట్నం : ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పొత్తుల వ్యవహారంతో పెద్ద కష్టం వచ్చిపడింది. చిరకాల రాజకీయ ప్రత్యర్ధి తెలుగుదేశంతో పొత్తు అంశం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టి స్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తును ఆంధ్రప్రదేశ్ సినీయర్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూడున్నర దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీమంత్రి బాలరాజు ఆపార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం విశాఖజిల్లా డీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తును బాలరాజు తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో బాలరాజు గిరిజనశాఖ మంత్రిగా పని చేశారు. కాగా, బాలరాజు జనసేనలో చేరనున్నట్టు తెలుస్తోంది. -
ఢిల్లీలో యాదాద్రి జిల్లా ఆర్మీ జవాన్ ఆత్మహత్య
ఆత్మకూరు(ఎం) (ఆలేరు): యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పెద్ది బాలరాజ్‌గౌడ్(27) బుధవారం ఉదయం ఢిల్లీలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలరాజ్‌గౌడ్ మూడేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నాడు. సంఘటన స్థలం వద్ద బాలరాజ్‌గౌడ్ రాసిన సూసైడ్ నోట్ లభించినట్లు గ్రామస్తులు తెలిపారు. తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడేంత సమస్యలు ఏమీ లేవని తల్లిదండ్రులు బాలనర్సయ్య, యాదమ్మ తెలిపారు -
నా భార్యకు మళ్లీ పెళ్లి చేస్తున్నారు
⇔ నన్ను చంపేస్తామంటున్నారు ⇔ జిల్లా ఎస్పీని కలసినా ఫలితం లేదు ⇔ విలేకరులతో వాపోయిన బాధితుడు చిత్తూరు : మేమిద్దరూ ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నాం. దీన్ని పెద్దలు నేరంగా భావించి మమ్మల్ని విడదీశారు. నా భార్యను ఎక్కడో దాచిపెట్టారు. ఆమెకు మళ్లీ పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామంలోకి వచ్చే నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. జిల్లా ఎస్పీని కలిసినా ఫలి తం లేదు’ అని ఎర్రావారిపాళెం మండలం ఎరుకలపల్లెకు చెందిన ఇసుకపల్లి బాలరాజు శనివారం విలేకరుల ఎదుట వాపోయాడు. అతని కథనం మేరకు.. ఉదయమాణిక్యం పంచాయతీ ఎరుకలపల్లెకు చెందిన ఎం.రూపారాణి(21), అదే గ్రామానికి చెందిన బాలరాజు(23) పక్కపక్క ఇళ్లలో ఉంటారు. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇద్దరి ఇళ్లలోనూ చెప్పారు. కులాలు వేరుకావడంతో పెళ్లికి వారు అంగీకరించలేదు. పైగా బెదిరించారు. దీంతో వారు ఇంటి నుంచి పారిపోయి ఈ నెల 12న మదనపల్లె సమీపంలోని ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి రక్షణ కల్పించా లని 16న జిల్లా ఎస్పీని కలిసి విన్నవించారు. వారికి రక్షణ కల్పించాలని ఎస్పీ మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రేమజంట ఎర్రావారిపాళెం పోలీ సులు సహాయం కోసం 17న వెళుతుండగా విషయం తెలుసుకున్న యువతి బంధువులు, అన్న, మామ వారిని తిరుపతి జూపార్క్ సమీపంలో అడ్డుకున్నారు. బాలరాజుపై దాడి చేసి రూపారాణిని తీసుకెళ్లారు. ఆమె కోసం వస్తే చంపేస్తామని బెదిరించారు. బాధితుడు ఎర్రావారిపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోలే దు. ఈ నేపథ్యంలో రూపారాణికి తల్లిదండ్రులు మళ్లీ పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు బాలరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. మా అమ్మాయి జోలికి వస్తే చంపేస్తామని వారు బెదిరిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని వాపోయాడు. -
‘బండారం బయటపడుతుందనే పారిపోయారు’
హైదరాబాద్: సభలో రైతు సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ పారిపోయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, బాలరాజు అన్నారు. తమ బండారం బయటపడుతుందనే కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎవరికైనా దమ్ముంటే ఒకరు రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. రైతులు కాంగ్రెస్ పార్టీపై తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని చెప్పారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన సీఎం కేసీఆర్‌కు రైతుల సమస్యల గురించి ఎక్కువగా తెలుసని చెప్పారు. -
అయ్యవార్లకు వేతన గుబులు!
► హెచ్.ఎం.లకు ► పదోన్నతులతో బిల్లులు పెట్టని వైనం ► ఫలితంగా జీతాలకు నోచుకోని పలువురు ► ఉపాధ్యాయులు ఇన్చార్జిలను సైతం నియమించని అధికారులు వీరఘట్టం మండలం తెట్టంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసిన డి.బాలరాజుకు సరుబుజ్జిలి ఎంఈఓగా మార్చి 26న ప్రమోషన్ వచ్చింది. వెంటనే ఆ మండల విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటి వరకూ పని చేసిన పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సంబంధించిన బిల్లులు పెట్టకపోవడంతో గత నెల జీతం అందక వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి చాలా పాఠశాలల్లో నెలకొంది. అయ్యవారికి పదోన్నతి వచ్చి హాయిగా వెళ్లిపోయారు... మా పరిస్థితి ఏమిటని ఉపాధ్యాయులు..ఇతర సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వీరఘట్టం: ఉపాధ్యాయులకు వేతన గుబులు పట్టుకుంది. ఏప్రిల్ నెల ప్రారంభమైంది వారం రోజులు గడుస్తున్నా.. గత నెల జీతానికి వందలాది మంది ఉపాధ్యాయులు నోచుకోలేదు. మార్చి 26న జిల్లాలోని 34 ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాశాఖాధికారులుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. వెంటనే వీరు తమకు కేటాయించిన చోట ఎంఈవోలుగా బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రధానోపాధ్యాయులు విడిచిన పాఠశాలల్లో ఇంతవరకు ఇన్చార్జిలుగా ఎవరినీ నియమించలేదు. కనీసం ఎఫ్ఏసీ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. దీంతో ఈ పాఠశాలలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా జీతాలు అందక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ విషయం.. ఉపాధ్యాయుల జీతాల బిల్లులపై సంతకాలు చేసి ప్రతి నెలా ఉన్నతాధికారులకు పంపించాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఉంది. అయితే ఇటీవల జిల్లాకు చెందిన 34 మంది ప్రధానోపాధ్యాయులు ఎంఈవోలుగా పదోన్నతి పొందారు. ప్రమోషన్ ఆనందంలో ఉన్నవారంతా బదిలీ స్థానాలకు వెళ్లిపోయారు. ఇంతవరకూ బాగానే ఉన్నా తాము పనిచేసిన పాఠశాలలో పరిస్థితిని చక్కబెట్టకుండా వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో ఉన్న 500 లకు పైబడి ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి గత నెల జీతాలు ఇప్పటికీ అందలేదు. దీంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మేల్కొని తమకు సకాలంలో వేతనాలు అందేలా చూడాలని కోరుతున్నారు. డీఈవో ఏమన్నారంటే... ఉపాధ్యాయులు జీతాలకు నోచుకోని విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి వి.ఎస్.సుబ్బారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. కొన్ని పాఠశాలలకు చెందిన సిబ్బందికి జీతాలు అందకపోవచ్చున్నారు. త్వరలోనే ఆయా పాఠశాలల్లో పదోన్నతుల ద్వారా హెచ్.ఎంలను నియమించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కొద్ది రోజుల్లో జీతాలు అందేలా చర్యలు చేపడతామని...జీతాలు అందని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. -
హోదా రాకపోతే పోలవరం పూర్తికాదు
బుట్టాయగూడెం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. శనివారం బుట్టాయగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందనే అక్కసుతోనే చంద్రబాబు పనులు పూర్తి చేయకుండా కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. బహుళ ప్రయోజనాలు ఉన్న పోలవరం ప్రాజెక్టును కాదని పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. 2018 నాటికి Sపోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఎలా పూర్తి చేస్తుందో శ్వేత పత్రం విడుదల చేయాలని బాలరాజు డిమాండ్ చేశారు. పార్టీ నేతలు ఆరేటి సత్యనారాయణ, గాడి వెంకటరెడ్డి, కొదం కడియ, కణితి ఉమ, ఎంపీటీసీ తెల్లం రమణ పాల్గొన్నారు -
ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మతి
చిలమత్తూరు : ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని వీరాపురం పంచాయతీ హుస్సేన్ పురం గ్రామం సమీపంలోని కర్ణాటక బందర్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు యర్రకొండ అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. కుందేళ్లు, జింకలు, అడవి పందులు తదితర జంతువుల వేట కోసం కర్ణాటకకు చెందిన కొందరు వేటగాళ్లు గత ఆదివారం అడవిలోకి వెళ్లారు. వీరిలో బందర్లపల్లి గ్రామానికి చెందిన హనుమంతప్ప, బాలమ్మ కుమారుడు బాలరాజు కూడా ఉన్నారు. వేట సమయంలో ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. కాగా మంగళవారం మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. -
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పై మరిన్ని చర్యలు
రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ఎన్సీసీ)లో నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనలో కాంట్రాక్టర్ కొండల్రావు, సైట్ ఇంజనీర్ సుధాకర్‌రావు, సెంట్రింగ్ కాంట్రాక్టర్ బాలరాజులను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం విచారించారు. ఈ ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో ఆదివారం పోర్టికో కూలిన ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. ఇదే ఘటనకు సంబంధించి ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కే.ఎస్.రామారావుతో పాటు కార్యదర్శికి విచారణకు హాజరుకావాలని బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరిపై కూడా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుచేసి విషయం విదితమే. ఎఫ్ఎన్సీసీ కార్యవర్గంపై సెక్షన్ 304(పార్ట్2)..? ఈ ఘటనలో అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కార్యవర్గంపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న సెక్షన్లతో పాటు అదనంగా 304(పార్ట్2) సెక్షన్‌ను నమోదు చేయాలని, దర్యాప్తును ముమ్మరం చేయాలని తలపెట్టారు. ఇందులో భాగంగానే పోర్టికో నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతి ఉందా? రాత్రి పూట శ్లాబ్ వేయాల్సిన అవసరం ఏంటి? అన్నదానిపై ఆరా తీస్తున్నారు. నిర్లక్ష్యంగా శ్లాబ్ నిర్మాణం చేపట్టి ఇద్దరి మరణానికి కారకులయ్యారంటూ ఇప్పటికే ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడిపై కేసు నమోదుకాగా దీని తీవ్రతను పెంచాలని యోచిస్తున్నారు. -
జలదీక్షకు మద్దతుగా రిలే దీక్షాశిబిరాలు
► వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు కొయ్యలగూడెం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న జలదీక్షకు మద్దతుగా నియోజవకర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షాశిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు తెలిపారు. సీమాంధ్రని ఎడారిగా మార్చే విధంగా ఎగువ రాష్ట్రాలు చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల్ని అడ్డుకోలేక చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇప్పించుకోలేకపోయారని, ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై కూడా చేతకాని విధంగా ఉండిపోయారన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ చేపట్టే జలదీక్షకి అన్నివర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని బాలరాజు చెప్పారు. -
'అక్రమకేసులు ఉపసంహరించుకోవాలి'
జంగారెడ్డిగూడెం: ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై అక్రమకేసులు బనాయించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన ధర్నాతో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే బాలరాజుపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నేతలు గంటా మురళీ, తానేటి వనిత, సలారి వెంకట్రావు ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అక్రమకేసులను బనాయిస్తూ కక్ష పూరిత ధోరణికి పాల్పడుతోందని వారు ఆరోపించారు. -
పశ్చిమలో అధికారుల ఓవరాక్షన్
పోలవరం: పోలవరం నిర్వాసితులకు బాసటగా నిలిచినందుకు పోలీసులు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అధికారుల నిర్వాకంతో జిల్లా వాసులు విస్తుపోతున్నారు. వివరాల్లోకి వెళితే... పోలవరం నిర్వాసిత గ్రామమైన చేగొండిపల్లి నుంచి గ్రామస్తులు వెళ్లిపోవాలని ఇది వరకే హెచ్చరించిన అధికారులు శనివారం రాత్రి నుంచి గ్రామానికి తాగునీరు, కరెంట్ సరఫరాలను నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాలరాజు చేగొండిపల్లి గ్రామస్తులతో మాట్లాడి ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాలరాజుపై పోలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
'ఆ ఇద్దరి ఎమ్మెల్యేల వివాదం వ్యక్తిగతం'
హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం వ్యక్తిగతమైందని పరిశ్రమలు, చక్కెర, చేనేత, జౌళి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ తన సోదరుడు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిని రక్షించుకునేందుకు యత్నిస్తోందని జూపల్లి విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టకుండా రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ వివాదంలో ఇద్దరు నేతలదీ తప్పు ఉందని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి తెలిపారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుల మధ్య వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే. -
నాన్న బర్త్‌డేకి ఫస్ట్‌లుక్.. తాత బర్త్‌డేకి ఆడియో...
-
నాన్న బర్త్‌డేకి ఫస్ట్‌లుక్... తాత బర్త్‌డేకి ఆడియో...
అక్కినేని వంశాంకురం అఖిల్ హీరోగా తెరపై కనిపించడానికి సర్వం సిద్ధమవుతోంది. అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ, మరో హీరో నితిన్ నిర్మిస్తున్న భారీ చిత్రం నిర్మాణంలో ఉండగానే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వి.వి. వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో వస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ మంగళవారం నుంచి జరుగుతోంది. 13 రోజుల భారీ క్లైమాక్స్ షురూ! హైదరాబాద్‌లోని సంఘీ ఫారెస్ట్‌లో చాలా ఖర్చుతో వేసిన భారీ సెట్లో ఈ పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫైట్‌మాస్టర్ రవివర్మ నేతృత్వంలో మొత్తం 13 రోజుల పాటు ఈ క్లైమాక్స్ షూటింగ్ జరగనుంది. ‘‘దీంతో 3 పాటలు మినహా మిగతా సినిమా మొత్తం పూర్తయినట్లే. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 12 దాకా రెండు పాటలు యూరప్‌లో చిత్రీకరిస్తాం. సెప్టెంబర్ ద్వితీయార్ధంలో హైదరాబాద్‌లో భారీ సెట్స్‌లో చివరి పాట తీయనున్నాం. దాంతో, షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది’’ అని నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో నితిన్ వివరించారు. విజయదశమికి... జనం ముందుకు ‘మిస్సైల్’, ‘తాండవం’, ‘బాలరాజు’ లాంటి రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఏదీ ఖరారు కాలేదు. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజైన సెప్టెంబర్ 20న భారీయెత్తున పాటలు విడుదల చేయనున్నారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి, విజయదశమి కానుకగా అక్టోబర్ 21న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్. సైరాబాను బంధువే హీరోయిన్ అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తున్న ఈ సినిమాతో బొంబాయి అమ్మాయైన 17 ఏళ్ళ సయేషా కథానాయికగా తెలుగు తెర మీదకొస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్, సైరాబానులకు సమీప బంధువు ఈ కొత్త నటి. గమ్మత్తేమిటంటే, సినీ కుటుంబం నుంచి వచ్చిందన్న మాటే కానీ, తొలిసారిగా సెట్స్ మీదకు అడుగుపెట్టింది ఈ సొంత సినిమాతోనే! ప్రాథమిక విద్యాభ్యాసమంతా లండన్‌లో చేసిన ఈ అమ్మాయి సినిమా వాతావరణానికి దూరంగా పెరిగారు. ‘‘కాకపోతే, సినిమాల్లో నటిస్తానని చెప్పగానే మా ఇంట్లో అందరూ ఎంతో ప్రోత్సహించారు’’ అని సయేషా చెప్పారు. అజయ్‌దేవ్‌గణ్ నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోనూ ఆమె అడుగుపెట్టనున్నారు. ‘‘తెలుగు ఇప్పుడిప్పుడే బాగా అర్థం చేసుకుంటున్నా. డెరైక్టర్ వినాయక్ సర్ నాకు తెలుగులోనే సూచనలిస్తుంటే, అర్థం చేసుకోగలుగుతున్నా. ఆయనతో పని చేయడం చాలా బాగుంది. రేపు నేను ఏ స్థాయికి చేరినా, నా తొలి దర్శకుడు, నన్ను తీర్చిదిద్దిన గురువు ఆయనే అని చెబుతాను’’ అని బుధవారం నాడు పుట్టినరోజు జరుపుకొంటున్న సయేషా అన్నారు. లాటిన్ అమెరికన్ డ్యాన్స్‌లు సల్సా, రుంబా, చాచాతో పాటు కూచిపూడి, ఒడిస్సీ కూడా ఈ యువ నటి నేర్చుకోవడం విశేషం. విదేశీ విలన్స్ అటు అఖిల్‌కూ, ఇటు సయేషాకూ తొలి సినిమా అయినా, పేరున్న అనుభవజ్ఞులైన తారలు ఈ భారీ తెలుగు చిత్రం నిండా ఉన్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిశోర్, మహేశ్ మంజ్రేకర్, సప్తగిరి, హేమ అందులో కొందరు. లండన్‌కు చెందిన కొందరు, రష్యాకు చెందిన మరొకరు ఈ చిత్రంలో ప్రధాన విలన్స్‌గా నటించడం విశేషం. వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్లు రచనా విభాగంలో, అనూప్, థమన్లు సంగీత విభాగంలో, అమోల్ రాథోడ్ కెమేరా విభాగంలో - ఇలా ఒకరికి ఇద్దరు సీనియర్స్ టెక్నీషియన్స్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవును మరి! పెద్ద కుటుంబం నుంచి... పెద్ద హీరో వారసుడు తెరపైకి వస్తుంటే, ఆ మాత్రం హడావిడి సహజమేగా! ఆల్ ది బెస్ట్ టు అఖిల్ అండ్ సయేషా! -
తెలంగాణ అభివృద్ధి నిరోధకాలుగా టీడీపీ, కాంగ్రెస్
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాలరాజులు మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధికి నిరోధకాలుగా టీడీపీ, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీయకుండా పాదయాత్ర పేరిట టీడీపీ నేతలు డ్రామా ఆడుతోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ పార్టీ అమలు చేస్తోదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాలరాజు స్పష్టం చేశారు. -
మనసున మనసై.. బతుకున బతుకై..
ఇతడి పేరు మూడ్ బాలరాజు. పద్నాలుగేళ్ల క్రితం కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి నుంచి లారీలో వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. 8నెలల గర్భిణిగా ఉన్న భార్య, మూడేళ్ల కుమారుడు అక్కడికక్కడే మరణించగా.. ఇతడి రెండు కాళ్లూ తీసేయాల్సి వచ్చింది. తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నారు. వారిపైనే ఆధారపడాల్సి రావడం అతడిని బాధిం చింది. ఎలాగైనా కష్టపడి పనిచేయాలనుకున్నాడు. తనకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చిన మేనకోడలు సంపూర్ణమ్మను వివాహం చేసుకున్నాడు. ఆమె సాయంతో ధైర్యాన్నే ఆయుధంగా చేసుకుని జీవిత పయనంలో ముందుకు వెళుతున్నాడు. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంకు చెందిన బాలరాజు విజయగాథ అతడి మాటల్లోనే... జంగారెడ్డిగూడెం : ‘మాది చింతలేని చిన్న కుటుంబం. అమ్మానాన్న.. భార్య.. మూడేళ్ల కొడుకు. నెల రోజుల్లో మరో బిడ్డ భూమిపైకి రాబోతోంది. కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నాం. అంతా కలసి ప్లాస్టిక్ పువ్వులు, పంగల కర్రలు తయారు చేసి సంతల్లో అమ్ముకుంటూ బతికేవాళ్లం. 2000వ సంవత్సరంలో ఓ కుదుపు మా కుటుంబాన్ని చెల్లాచెదురు చేసింది. ప్లాస్టిక్ పువ్వులు, పంగల కర్రలు తయారీఇక అవసరమైన ముడిసరుకు తెచ్చుకునేందుకు 8 నెలల గర్భిణిగా ఉన్న నా భార్య శ్రీదేవి (25), మా మూడేళ్ల కుమారుడు అజయ్‌బాబుతో కలసి తిరుపతి వెళ్లాం. సరుకులు కొనుక్కుని లారీలో ఇంటికి బయలుదేరాం. గుంటూరు సమీపంలో ఆ లారీ చెట్టును ఢీకొట్టింది. నా భార్య శ్రీదేవి, కొడుకు అజయ్‌బాబు అక్కడికక్కడే చనిపోయారు. అపస్మారక స్ధితిలో ఉన్న నన్ను అక్కడి వారు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. నా రెండు కాళ్లు తొలగిస్తేనే తప్ప బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. విషయం తెలిసి మా బంధువులంతా వచ్చారు. రూ.3 లక్షలు ఖర్చు చేసి నన్ను బతికించారు. రెండు నెలలపాటు ఆసుపత్రిలో మంచానికే అతుక్కుని ఉండిపోయిన నేను ఎట్టకేలకు కోలుకున్నాను. వృద్ధులైన తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వచ్చినందుకు బాధపడ్డాను. ఏవిధంగానైనా కష్టపడి పనిచేసి వాళ్లకు ఆసరాగా నిలబడాలనుకున్నాను. మా అక్కా, బావ చనిపోవడంతో మా మేనకోడలు సంపూర్ణమ్మను మేమే పెంచాం. నా దుస్థితిని చూసిన ఆమె నన్ను పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చింది. పెళ్లయ్యాక నా తల్లిదండ్రులతోపాటు ఆమె కూడా మా కుటుంబం కోసం కష్టపడుతూ వచ్చింది. ఆ పరిస్థితుల్ని చూసి తట్టుకోలేకపోయాను. వారందరినీ నేనే పోషించాలనే దృఢ నిశ్చయానికి వచ్చాను. అశ్వారావుపేటలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో రూ.10 వేలు, తెలిసిన వారివద్ద మరికొంత సొమ్ము అప్పు చేశాను. మూడు చక్రాల మోపెడ్ కొన్నాను. దానిని నడపడం నేర్చుకున్నాను. తిరిగి వ్యాపారం మొదలుపెట్టాను. రాత్రీ పగలనక ప్లాస్టిక్ పువ్వులు, పంగల కర్రలు తయారు చూసి ఊరూరా తిరుగుతూ అమ్ముతున్నాను. ఖర్చులు పోను రోజుకు కనీసం రూ.200 సంపాదిస్తున్నాను. ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. రేషన్ కార్డు, ఉండటానికి ఇల్లు, వికలాంగ పింఛను ఇప్పిస్తే మా కుటుంబానికి ఎంతో మేలు కలుగుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో నాకు ప్రతినెలా పింఛను అందేది. మూడు నెలలుగా ఇవ్వటం లేదు. చివరగా మీకో మాట చెప్పాలి. నా కృషి, పట్టుదల, విజయం.. ఇలా ప్రతి విషయంలోనూ నా భార్య సంపూర్ణమ్మ సహకారం ఎంతో ఉంది. ఆమెకు మాటల్లో కృతజ్ఞతలు చెబితే సరిపోదు. ఆమె రుణం తీర్చుకోలేనిది.’ -
బైక్ డిక్కీలోని రూ.7.7 లక్షలు చోరీ
చైతన్యపురి: బైక్ డిక్కీలోని నగదు చోరీకి గురైన ఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం... మోహన్‌నగర్ నివాసి బాలరాజు ఇబ్రహీంపట్నం ఉప్పరిగూడలోని శ్రీశ్రీనివాస రైస్ ఇండస్ట్రీలో కలెక్షన్ గుమస్తా. కర్మన్‌ఘాట్‌లోని కార్యాలయం నుంచి అతను శుక్రవారం మధ్యాహ్నం చైతన్యపురికి బైక్‌పై వెళ్లాడు. డీసీబీ బ్యాంక్ రూ. 80 వేలు డ్రా చేశాడు. అక్కడ నుంచి దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి సమీపంలోని కెనరా బ్యాంక్‌కు వచ్చి రూ.7.77 లక్షలు డ్రా చేసి బైక్ డిక్కీలోని బ్యాగ్‌లో పెట్టాడు. అక్కడి నుంచి చైతన్యపురి రామాలయం సమీపంలోని శ్రీనవ్య కిరాణా జనరల్‌స్టోర్‌కు కలెక్షన్ కోసం వెళ్లాడు. దుకాణం ముందు బైక్ పార్కు చేసి లోపలికి వెళ్లి ఐదు నిమిషాల్లో బయటకు రాగా బైక్ డిక్కీ తెరిచి ఉంది. అందులో పెట్టిన రూ.7.77 లక్షల నగదు బ్యాగ్ కనిపించలేదు. ఈ విషయాన్ని వెంటనే రైస్ మిల్ యజమానితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చైతన్యపురి సీఐ రవీందర్‌రెడ్డి, డీఎస్సై లక్షణ్ ఘటనా స్థలానికి వెళ్లి బాలరాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలరాజు బ్యాంక్‌లో డబ్బు డ్రా చేస్తుండగా దుండగులు గమనించి, తర్వాత అతడి బైక్‌ను అనుసరించి ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాటల్లో పెట్టి... బాలరాజు బైక్ పార్కు చేసి కిరాణా దుకాణంలోకి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మంచినీటి బాటిల్ కావాలని అడిగాడు. బాటిల్ డబ్బులు షాపు యజమానికి అందించమని బాలరాజుకు ఇచ్చాడు. ఆ డబ్బు షాపు యజమానికి ఇచ్చేలోపే మరో వ్యక్తి బైక్‌లోని నగదు చోరీ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం అవుతోంది. బాలరాజు బ్యాంక్‌లో డబ్బు డ్రా చేస్తున్నప్పుడు అతడిని ఎవరైనా అనుసరించారా? అనేది తెలుసుకొనేందుకు బ్యాంక్‌లోని సీసీ కెమెరాలోని పుటేజీని తెప్పించి పరిశీలిస్తామని సీఐ రవీందర్‌రెడ్డి తెలిపారు. బాలరాజుపై అనుమానాలు... డబ్బులు డ్రా చేసుకురమ్మని బ్యాంక్‌కు పంపిస్తే బాలరాజు కలెక్షన్ కోసం వెళ్లడం పై రైస్‌మిల్ యజమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిజంగానే గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారా? లేక బాలరాజే డబ్బు మాయం చేసి చోరీ నాటకం ఆడుతున్నాడా అనే కోణంలో నూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడిపై హత్య, హత్యాయత్నం కేసులు
సామర్లకోట : సామర్లకోటలో శుక్రవారం రాత్రి తల్లీబిడ్డలను చెరువులోకి తోసేసిన ఘటనలో నిందితుడిపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్టు సీఐ కె.నాగేశ్వరరావు శనివారం తెలిపారు. స్థానిక ఓవర్ బ్రిడ్జి సెంటర్ నుంచి దిగువ భాగంలో ఉన్న సుగర్‌ఫ్యాక్టరీ చెరువులోకి శుక్రవారం ఓ వివాహితను, ఆమె ఏడాది బిడ్డను ఆమె ప్రియుడు తోసివేసిన విషయం తెలిసిందే. ఘటనలో బాలుడు మృతి చెందగా, బాధితరాలు సత్యవేణి (మణి) ప్రాణాలతో బయట పడ్డారు. సత్యవేణి ఫిర్యాదు మేరకు 302, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఐ చెప్పారు. ఆయన కథనం ప్రకారం కాట్రావులపల్లికి చెందిన సత్యవేణికి వేలంగికి చెందిన మడికి బాలరాజుతో మూడేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఏడాది క్రితం బాలరాజు సత్యవేణిని వదలి వేయడంతో బత్సల శేషుతో ఆమెకు పరిచయమైంది. దీంతో గత మూడు నెలలుగా ఆమె అతనితో కలిసి జగ్గంపేటలో నివాసం ఉంటుంది. శేషుకు కూడా పెళ్లైంది. సత్యవేణి తనను రెండో భార్యగా ఇంటికి తీసుకువెళ్లాలని శేషును ఒత్తిడి చేస్తుండడంతో శేషు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. ఆమెను ఆమె బిడ్డను ఆటోలో సామర్లకోట తీసుకొచ్చాడు. స్టేషన్ సెంటర్ నుంచి సత్యవేణిని ఆమె బిడ్డను బ్రిడ్జి మీదకు తీసుకెళ్లి అకస్మాత్తుగా వారిని చెరువులోకి తోసేశాడు. బాలుడు మృతిచెందగా, సత్యవేణి ప్రాణాలతో బయటపడ్డారు. భర్త నుంచి విడి పొయే సమయంలో సత్యవేణి మూడు నెలల గర్భిణి. శనివారం ఘటన స్థలాన్ని సీఐ నాగేశ్వరరావు, ఎస్సైలు ఎం.డి.ఎం.ఆర్.ఆలీఖాన్, నాగార్జున ఇతర సిబ్బంది పరిశీలించారు. నిందితుడు శేషును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
'కిషన్‌రెడ్డివి ఉప ఎన్నిక రాజకీయాలు'
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న విమర్శలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలరాజు, దివాకర్‌రావులు తిప్పుకోట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీపై కిషన్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరీపై మండిపడ్డారు. మెదక్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకుని ఆయన ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని... అయినా ఆయన ఏ రోజు స్పందించలేదని కిషన్ రెడ్డిపై వారు విరుచుకుపడ్డారు. తెలంగాణలో బేజేపీ ఉనికి కోల్పోతోందని తెలిపారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే అనవసరంగా కిషన్‌రెడ్డి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని తిరస్కరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాలరాజు, దివాకర్‌రావులు అన్నారు. -
బాలరాజుకు గుణపాఠం
పాడేరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో 2009 ఎన్నికల్లో పాడేరు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఐదేళ్ల పాటు పనిచేసిన పి.బాలరాజుకు ఈ ఎన్నికల్లో ఓటర్లు గుణపాఠం చెప్పారు. పాడేరు నియోజకవర్గంలో రికార్డుస్థాయిలో అభివృద్ధి చేశానని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. మాజీ మంత్రి చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించలేదు. మంచినీటి సమస్యను పరిష్కరించలేదు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేదని గిరిజనులంతా ఆరోపిస్తున్నారు. సీసీ రోడ్ల నిర్మాణం కూడా కాంగ్రెస్ కార్యకర్తల సూచనల మేరకే ఆయా గ్రా మాల్లో చేపట్టి మారుమూల గ్రామాలను మాత్రం నిర్లక్ష్యం చేశారనే అపవాదు ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కూడా పక్షపాతధోరణి అవలంబించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను కూడా వ్యాపార కేంద్రాలుగానే మార్చేసేలా కాంగ్రెస్ పాలన మారింది. వార్డెన్ పోస్టులను అనర్హులకే కేటాయించారనే విమర్శలు ఉన్నాయి. ఇందిరమ్మ గృహాల మంజూరులో గిరిజనులకు అన్యా యం చేశారని, అర్హులైన గిరిజనులు పునాదులు తవ్వుకున్నా ఇళ్లు మాత్రం మంజూరు చేయలేదు. ఎమ్మెల్యే కోటా కింద వచ్చిన 2 వేల గృహాలు కూడా గత ఏడాది కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న గ్రామాల్లోని గిరిజనులకే కేటాయించారు. దీంతో అనేక మంది గిరిజనులంతా మాజీ మంత్రి బాలరాజు తీరుపై మండిపడుతున్నారు. కొయ్యూరు నుంచి పాడేరు వరకు ఐదు మండలాల్లో బాలరాజు పాలనపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అండతో గెలిచిన బాలరాజు మహానేత మరణానంతరం అన్ని వర్గాల గిరిజనుల సంక్షేమాన్ని మరిచిపోయారు. నియోజకవర్గంలో ఏ పోలింగ్ కేంద్రంలో కూడా బాలరాజు తన ప్రభావం చూపలేకపోయారు. అవినీతి, అక్రమాల్లే వల్లే బాలరాజును ఈ ఎన్నికల్లో ఓడించామని గిరిజనులు చెబుతున్నారు. ఐదేళ్లు మంత్రిగా ఉన్న బాలరాజు ఈ ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచారు. అతికష్టం మీద డిపాజిట్ దక్కించుకున్నారు. -
బాలరాజుకు ఎదురుగాలి
చింతపల్లి, న్యూస్‌లైన్: మాజీ మంత్రి బాలరాజుకు సొంత మండలంలోనే ఎదురుగాలి వీస్తోంది. ప్రతి ఎన్నికలల్లో ఆయనకు వెన్నుదన్నుగా ఉండే చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల ప్రజలు ఈ ఎన్నికల్లో ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 2009 ఎన్నికల్లో బాలరాజు విజయంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులు ఈసారి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి దూరంగా ఉండడమే కాకుండా ఉద్యోగులను వేధించి తన నైజాన్ని బహిర్గతం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. బాలరాజు మంత్రిగా ఉన్నంత కాలం ఆయన సతీమణి పెత్తనం కూడా ఇబ్బందికరంగా ఉండేదన్న భావం చాలామందిలో ఉంది. 1989లో తొలిసారిగా చింతపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలరాజు కొద్ది రోజులకే ప్రజలు, ఉద్యోగుల వ్యతిరేకతను మూటకట్టుకున్నారు. అనుకూలంగా లేని ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువయ్యాయి. దాంతో ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. తర్వాత మూడు సార్లు జరిరగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చిత్తుగా ఓడారు. దాంతో రూట్ మార్చారు. గత ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. ‘గతంలో తప్పుగా వ్యవహరించి ఉంటే మన్నించండి.. ఇకపై మారతాను.. నన్ను నమ్మండి’ అంటూ సమావేశాల్లో ఉద్యోగులను వేడుకున్నారు. మరీ ముఖ్యంగా మహానేత వైఎస్ పథకాల అండతో ఎమ్మెల్యే పదవి దక్కించుకున్నారు. కానీ ఎమ్మెల్యే అయ్యాక వెనకటి బుద్ధి చూపించారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తూ ఉంటే ఆయన అందుకు భిన్నమైన ధోరణిని అనురించిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. చింతపల్లిలో జేఏసీ నేతల అరెస్ట్‌ల వెనుక ఆయన సూత్రధారిగా వ్యవహరించారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతా జరిగాక ఆయనకెలా మద్దతిస్తామని ప్రశ్నిస్తున్నారు. -
తపాలా: ‘దేవుడు చనిపోయాడా నాన్నా?’
నా పేరు శ్యామ్ సుందరరావు. ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయుణ్ని. భార్య పుష్ప. ఆమె కూడా విశ్రాంత ఉద్యోగిని. మాకు ఒక అబ్బాయి. పేరు బాలరాజు. మేమంతా వాణ్ని బాలు అని పిలుస్తాం. ప్రస్తుతం భాగ్యనగరంలోనే ఐసీఐసీఐ బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. బాలుకు అప్పుడు అయిదేళ్ల ప్రాయం అనుకుంటాను. నా కొలీగ్ అయిన ఒక మాస్టారుగారింటికి వెళ్లాల్సిన పని ఉంది. ఆ సాయంత్రం మాస్టారుగారింటికి బయలుదేరుతుండగా బాలు, ‘‘నేనూ వస్తా నాన్నా’’ అని అన్నాడు. సరే రమ్మన్నాను. ఇద్దరం మాస్టారుగారింటికి చేరాం. ఇంటి తలుపు మూసి ఉంటే, డోర్ బెల్ కొట్టాను. కొంచెంసేపటికి మాస్టారు భార్య తలుపు తీసింది. ‘‘నమస్తే టీచరుగారండీ’’ అన్నాను. ‘‘నమస్తే మాస్టారుగారండీ’’ - మాస్టారు భార్య ప్రతి నమస్కారం చేసింది. ‘‘ఏం బాలూ! టీచర్‌గారికి నమస్తే పెట్టవా?’’ అని అడిగితే, ‘‘గుడ్ ఈవినింగ్ మిస్’’ అన్నాడు రెండు చేతులూ జోడించి. టీచరు, ‘‘గుడ్ ఈవినింగ్ బాబూ’’ అని, ‘‘నేనింకా మిస్‌ను కాదు బాలూ’’ అని అంటే, ఇద్దరం నవ్వుకున్నాం. ‘‘రండి మాస్టారూ రండి. మా మాస్టారుగారు స్నానం చేస్తున్నారు. రండి కూర్చోండి’’ అన్నారు టీచరు. నేను, బాలు హాలులో కూర్చున్నాం. టీచరు వంటింట్లోకెళ్లారు. నేను టీపాయ్ మీద ఉన్న పేపర్ తీసి, చదవనారంభించాను. బాలు హాల్లోని గోడలకున్న ఫొటోలు చూస్తూ ఉన్నాడు. అవి మాస్టారు పూర్వీకుల ఫొటోలు. వారిప్పుడు లేరు, చనిపోయారు. ‘‘ఫొటోలకు దండలెందుకు వేశారు నాన్నా?’’ అని బాలు నన్నడిగాడు. ‘‘వాళ్లు చనిపోయారమ్మా. చనిపోతే అలా దండలేస్తారు’’ అని చెప్పాను. హాల్లో మరోవైపు గోడకు దేవుళ్లు, దేవతల ఫొటోలున్నాయి. ఆ ఫొటోలకు కూడా దండలు వేసి ఉండటం చూసి, ‘‘దేవుడు చనిపోయాడా నాన్నా?’’ అని అడిగాడు బాలు. ఒక్క క్షణం స్తంభించిపోయాను. వెంటనే... ఏం చెప్పాలో తోచలేదు. ‘‘లేదమ్మా. దేవుడు చనిపోలేదు’’ అని మాత్రం అనగలిగాను గానీ, బాలు అడిగిన ఆ ప్రశ్న దండలు వేసి ఉన్న ఫొటోలు చూసినప్పుడల్లా నా మదిలో మెదులుతూనే ఉంటుంది. - బేతంచర్ల శ్యామ్ సుందర్ వినుకొండ ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
యాడికి బోయినా ఎలచ్చన్ల లొల్లే..
బాలరాజు: నర్సింహ పెదనాయినా.. యాడికి బోతానవే.. వారం రోజులైంది. నిన్ను జూసి.. ఏదైనా ముచ్చట జెప్తవేమోనని రోజూ ఒచ్చిపోతున్న. నువ్వేమో కనబడ్తలేవ్. నర్సింహ: ఏడ బిడ్డా.. పనికిబోక వారం రోజులైతాంది. ఎలచ్చన్లు గదా.. ఒకటా రెండా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ అన్నీ ఒక్కసారిగ వచ్చే.. మళ్లీ ఐదేండ్ల దాకా ఎలచ్చన్లు ఉండయి. గప్పటిదాకా మళ్లీ ఎవ్వరు పల్కరియ్యరు. అందుకే గిప్పుడే ఎలచ్చన్ల సిత్రాలు జూద్దామని బోయిన. బాలరాజు: అవును గదనే యాడజూసినా గివే ముచ్చట్లు జెప్పుకుంటున్రు. ఇగ పార్టీలల్ల ఉన్న పోరగాండ్లు పొద్దున బోయి రాతిరికి ఎప్పుడోస్తున్రో దెలుస్తలేదు. నర్సింహ: అవును బిడ్డా. ఈ ఎలచ్చన్లలో మనోడు గెల్వక బోతే ఐదేండ్లదాక ఎవ్వడూ దేకడంటూ పోరగాండ్లు వాళ్ల లీడరు కోసం తిర్గుతున్నరు. పార్టీలు గూడా అంతే. ఈ సారి ఎలచ్చన్ల గెల్వకపోతే పార్టీలకు ఠిఖానా ఉండది. బాలరాజు: అవునుగని జిల్లాల, మన నియోజకవర్గంల, మనమండల్ల యెట్లుందో జెప్పకపోతివి జర. నర్సింహ: ఏముందిరా.. అన్ని పార్టీలల్ల ఆగమాగం. జిల్లాల జూస్కుంటుంటే నిన్న మొన్నటిదాకా ఒక పార్టీలో ఉన్నోళ్లు వే రొగపార్టీకి - గా పార్టీల ఉన్నోళ్లు ఇంకో పార్టీలోకి దుంకుతున్నరు. టిక్కెట్లు ఇయ్యరేమోనని కొందరు.. గాలి ఎటు మళ్లిందో సూస్కుంట పార్టీలోకి ఉర్కేటోళ్లు కొందరు... మన జెడ్పీ పదవి జనరల్ ఆడోళ్లకు అయ్యింది గదా.. కొన్ని ఊర్లు జీహెచ్ఎంసీల గల్వకుంట కోర్డు అడ్డుబడింది. ఇగ జూస్కో... సూస్కుందాం అంటే సూస్కుందాం అనేటట్టు ఎలచ్చన ్లల్ల కొట్లాడ్తున్నరు. బాలరాజు: అదిసరేగని మన నియోజకవర్గం కథేందే.. నర్సింహ: మనది మేడ్చల్ కిందికి వస్తది గదా. నాలుగు మండలాల్ల జెడ్పీటీసీ ఎలచ్చన్లు జోరుమీద ఉన్నయి. ఇగ అన్ని పార్టీలోళ్లు డ్వాక్రా గ్రూపులనీ, ఆడబడుచుల లాంచనాలనీ, ఏదో తీర్గ వారిని మచ్చిక జేసుకునే పనిలో ఉన్నరు. ఇగ మొగొళ్లకేమో అది జేస్తం. ఇది జేస్తం అంటూ చెప్తున్నరు. జెడ్పీటీసీ, ఎంపీపీ సీట్లు గెల్చుకుంటే ఇక అటెన్క ఎమ్మెల్యే ఎలచ్చన్లలో ఎట్లజెయ్యాలనేది తెలుస్తదని అన్ని పార్టీలోళ్లు అనుకొంటుండ్రు. బాలరాజు: గమ్మతుగుంది గదనే.. మరి మన మండల్ల.. నర్సింహ: మన మండల్ల కాంగ్రెస్, టీడీపీలు కుస్తీ పట్లు పడ్తున్నయి. మోకా జూస్కొని టీఆర్ఎస్ గూడా కోషీష్జేస్తోంది. మండలంల గిట్ల పాగా వేస్తేనే వచ్చే ఎమ్మెల్యే ఎలచ్చన్లల్ల ఓట్లు రాలుతయని అందరూ సోచాయిస్తుండ్రు. ఇంగ.. ముందుగల్ల జెడ్పీటీసీ టిక్కటు ఎవరికిస్తరో ఆ తర్వాతనే మేము గూడా జెప్తమంటున్రు కాంగ్రెస్ -టీడీపోల్లు -సొంచాయించగా.. సొంచాయించగా.. టీడీపోళ్లు బండారు రమాదేవి అనే ఆమెకో.. లేదా చీర్యాల దుర్గమ్మకో టిక్కటు ఇయ్యాలని అనుకుంటుండ్రట. కాంగ్రెస్ పార్టోళ్లు నాగారం గ్రామానికి చెందిన మాధవికి, లేదా కీసరకు చెందిన పంతులమ్మ పద్మమ్మకు టిక్కటు ఇద్దామని అనుకుంటుండ్రట. ఐతారం కల్ల ఎవ్వరెవ్వరు నిలబడుతరో పురాగ తెలుస్తది. యాడ జూసినా ఎలచ్చన్ల కథే నడుస్తున్నది. బతిమాలుడు- బుజ్జగించుడు.. అయ్యా అప్పా అని దండాలు పెట్టుడు- ఒగటేమిటీ సినిమాలల్ల గూడా ఇంత ఖుషీ దొరకదు మనకు. ఇయన్నీ జూద్దామనే రోజూ బోతున్న బిడ్డా. బాలరాజు: పెదనాయనా.. నువ్వు చెప్తుంటే చిత్రంగుందే. సూస్తే ఇంకెట్లుం టదో.. నేను గూడా నీతో వస్తా.. పా.. - బి.అంజిరెడ్డి/కీసర -
కాంగ్రెస్‌పై పవన్‌కు అంత ఉక్రోశం ఎందుకో?
హైదరాబాద్ : పవన్ కల్యాణ్‌కు కాంగ్రెస్‌పై అంత ఉక్రోశం ఎందుకో చెప్పాలని మాజీ మంత్రులు కొండ్రు మురళి, బాలరాజు సూటిగా ప్రశ్నించారు. సమాజాన్ని పవన్ చదవలేకపోయాడని, అతనికి సమాజంపై పూర్తి అవగాహన లేదని వారు శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. పవన్ అంబేదర్క్, జ్యోతిరావు పూలేలను పొడగలేదని ఈ సందర్భంగా కొండ్రు, బాలరాజు గుర్తు చేశారు. ఎస్సీ, బీసీలకు కాంగ్రెస్ పార్టీలో తప్ప మరేపార్టీలోను గౌరవం ఉండదని వారు అన్నారు. ఈ వాస్తవాలను గ్రహించి పవన్ మాట్లాడి ఉంటే బాగుండేదని మాజీమంత్రులు సూచించారు. ఒకరిద్దరి అండ చూసుకుని పవన్ రెచ్చిపోయాడని కొండ్రు విమర్శించారు. -
మావోయిస్టుల టార్గెట్‌లో బాలరాజు, మరో 18 మంది
-
మావోయిస్టుల టార్గెట్‌లో బాలరాజు, మరో 18 మంది
నిన్న కాక మొన్న ఛత్తీస్‌గఢ్‌లో ఏకంగా 16 మంది భద్రతాదళాలను హతమార్చిన మావోయిస్టులు.. ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో కూడా రెచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఏవోబీ ప్రాంతంలో ఎప్పటినుంచో బలంగా ఉన్న మావోయిస్టులు.. ఈసారి ఏకంగా తొమ్మిది యాక్షన్ టీమ్స్ ఏర్పాటుచేసుకున్నాయి. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ముందుగానే గుర్తించారు. మావోయస్టుల టార్గెట్‌లో మాజీ మంత్రి బాలరాజు కుటుంబ సభ్యులు సహా మొత్తం 18 మంది ఉన్నారని విశాఖ ఏఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందువల్ల విశాఖ ఏజెన్సీ మొత్తాన్ని తాము అప్రమత్తం చేశామని ఆయన చెప్పారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో మావోయిస్టులు ఈ ప్రాంతంలో కొంతవరకు అలజడి సృష్టించినందున.. ఈసారి పోలీసులు ముందునుంచే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. -
కాంగ్రెస్ నేతల ఇళ్లకు టిడిపి నేతలు
హైదరాబాద్: బీజేపీతో దోస్తీ కట్టేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి ఆరాటపడుతున్నారని మంత్రులు సి.రామచంద్రయ్య, బాలరాజు విమర్శించారు. బీజేపీ సహకరిండం వల్లే విభజన జరిగిందని వారన్నారు. చంద్రబాబు సీట్ల అయోమయంలో ఉన్నారన్నారు. పదవులిస్తాం పార్టీలో చేరాలంటూ చంద్రబాబు తన పార్టీ నేతలను కాంగ్రెస్ నేతల ఇళ్లకు పంపుతున్నారని చెప్పారు. టిడిపిలో చేరాలంటూ చంద్రబాబు తన వద్దకు కూడా రాయబారం పంపారని రామచంద్రయ్య చెప్పారు. -
పొయ్యిలు సరే.. సిలెండర్లేవి?
మంత్రి పర్యటనలో భాగంగా ‘దీపం’ మంజూరు వెంటనే కనెక్షన్లు స్వాధీనం గిరిజనుల ఆందోళనతో స్టౌలు పంపిణీ ఇప్పటికీ అందని గ్యాస్ సిలిండర్లు చింతపల్లి, న్యూస్‌లైన్ : దీపం పథకంలో భాగంగా గ్యాస్ పొయ్యిలు పంపిణీ చేసిన అధికారులు సిలిండర్లు ఇవ్వడం మరిచిపోయారు. దీనిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 11న మంత్రి బాలరాజు చింతపల్లి, జీకే వీధి మండలాల్లో పర్యటనలో భాగంగా గిరిజన సహకార సంస్థ అధికారులు సబ్సిడీతో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జీకే వీధి, చింతపల్లి మండలాల్లో సుమారు 200 మంది తెల్ల రేషన్ కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయనున్నామని ప్రకటించారు. మంత్రి బాలరాజు చేతుల మీదుగా చాలా మంది గిరిజనులకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. మంత్రి పర్యటన ముగిసిన మరుక్షణమే లబ్ధిదారుల నుంచి అధికారులు గ్యాస్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇదేమని అడిగితే తెల్ల రేషన్‌కార్డుతో పాటు ఆధార్ కార్డు, దరఖాస్తు ఫారాలు, రూ.2,700 చెల్లిస్తే వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తామని, కనెక్షన్ మంజూరైన తర్వాత ఈ పథకం కింద గ్యాస్ పంపిణీ చేస్తామని అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఈ నెల 14న పలువురు మహిళలు చింతపల్లి జీసీసీ బ్రాంచి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇదంతా ‘మంత్రి మెప్పు కోసమేనా’ శీర్షికతో ఈ నెల 15న సాక్షి దినపత్రికలో కథనం కూడా ప్రచురితమైంది. ఈ మేరకు దిగివచ్చిన అధికారులు గ్యాస్ పొయ్యిలను హుటాహుటిన అందజేసి చేతులు దులుపేసుకున్నారు. గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయకపోవడంతో గిరిజనులు మరోసారి ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. సిలిండర్లు లేకుండా పొయ్యిలు పంపిణీ చేయడం వల్ల ప్రయోజనమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పథకాన్ని పూర్తి స్థాయిలో వర్తింపజేయాలని కోరుతున్నారు. -
'మోసానికి మారుపేరు చంద్రబాబు నాయుడు'
ప.గో: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసానికి మారుపేరని ఎమ్మెల్యే బాలరాజు విమర్శించారు. జిల్లాలోని జీలుగుమిల్లిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ఈ సమావేశానికి బాలరాజుతో పాటు, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ తోట చంద్రశేఖర్ హాజరైయ్యారు. విశ్వసనీయతకు మారుపేరు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే మోసానికి మారుపేరు చంద్రబాబు అని బాలరాజు పేర్కొన్నారు.. రాష్ట్రానికి సమైక్యంగా ఉంచే సత్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని బాలరాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కుక్కలు చించిన విస్తరిలాగా తయారైందన్నారు. -
బాలరాజుపై మండిపాటు
పాడేరులో వైఎస్సార్సీపీ నేతల నిరసన మంత్రి ఇంటి ఎదుట దిష్టిబొమ్మ దహనం వైఎస్సార్సీపీ నేతలను రెచ్చగొట్టిన కాంగ్రెస్ నాయకులు తోపులాటతో ఉద్రిక్తత పాడేరు, న్యూస్‌లైన్ : శాసనసభలో తెలంగాణకు అనుకూలంగా మంత్రి బాలరాజు వ్యాఖ్యానించి సమైక్యాంధ్ర ద్రోహిగా మారారని వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. బాలరాజు వైఖరిని నిరసిస్తూ గురువారం పాడేరులో నిరసన కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్సీపీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో నాయకులంతా పట్టణ వీధుల్లో బాలరాజు దిష్టిబొమ్మను ఊరేగించారు. రాష్ట్ర విభజన యత్నాన్ని నిరసించాల్సిన మంత్రి తెలంగాణవాదిగా మారడం దారుణమని నినాదాలు చేశారు. సీమాంధ్ర ద్రోహిగా ఆయన మారారని, సమైక్య రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమాలు చేస్తే మంత్రి వారి అభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడారని దుయ్యబట్టారు. అనంతరం మంత్రి ఇంటి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి ఆయన వైఖరిని ఎండగట్టారు. మంత్రి దిష్టిబొమ్మను వైఎస్సార్సీపీ నేతలు దహనం చేశారు. రెచ్చగొట్టిన కాంగ్రెస్ నేతలు మంత్రి వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్న సమయంలో మంత్రి బాలరాజు ఇంటిలోపల ఉన్న కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోయారు. వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు వి.గంగులయ్య, ఎం.కన్నాపాత్రుడు తదితరులు బయటకు వచ్చి వైఎస్సార్సీపీ అధినేతను దుర్భాషలాడారు. దీనిని వైఎస్సార్సీపీ నేతలు గిడ్డి ఈశ్వరి, మాజీ ఎంపీపీలు ఎస్.వి.వి.రమణమూర్తి, వి.మత్స్యకొం డంనాయుడు, కూడా సింహాచలం, మత్స్యరాస వెంకటగంగరాజు అడ్డుకున్నారు. దాంతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేతలు పోలీసులతో కలసి వైఎస్సార్సీపీ నేతలను తోసివేశారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ నాయకులు, పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మంత్రి ఇంటిముందే బైఠాయించి నినాదాలు చేశారు. పాడేరు ఎస్ఐ ధనుంజయ్, సిబ్బంది మంత్రి ఇంటి వద్దకు చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనను కొనసాగించారు. -
బాలరాజు సమైక్యాంధ్ర ద్రోహి
అరకులోయ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడిన గిరిజన సంక్షేమ మంత్రి బాలరాజు వైఖరిని పలు సంఘాలు నిరసించాయి. ఈ మేరకు అరకులోయలో బుధవారం వైఎస్సార్సీపీ అరకు నియోజకవర్గ సమన్వయకర్త కిడారి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ జంక్షన్‌వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కిడారి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు ఎంత నష్టం వాటిల్లుతుందో బాలరాజుకు తెలియదా? అని ప్రశ్నించారు.ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గిరిజన ప్రాంతాలు విభజన వల్ల మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోతాయన్నారు. బాలరాజు గిరిజన, సమైక్యాంధ్ర ద్రోహి అన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టి అప్పాలు, సమర్డి రఘునాథ్, చట్టు అప్పలరాజు, గెమ్మెలి బాబురావు, మండ్యగురు శ్రీరాములు,స్వామిరాజు, బి.బి నాగేశ్వరరావు పాండు రంగస్వామి పాల్గొన్నారు. ఏపీఎన్జీవోలు,టీడీపీ ఆధ్వర్యంలో మంత్రి బాలరాజు సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడడాన్ని నిరసిస్తూ ఎన్జీవోలు,టీడీపీ నేతల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మంత్రి బాలరాజు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవోల సంఘం నాయకులు ఆర్ మత్స్యలింగం,సత్యనారాయణ,కన్నబాబు, మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు, అబ్రహం, పట్నాల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. గుణపాఠం తప్పదు డుంబ్రిగుడ : గిరిజన సంక్షేమ మంత్రి బాలరాజు బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ డుంబ్రిగుడలో నిరసన తెలిపింది.ఈమేరకు కొవ్వొత్తుల ర్యాలీనిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు కె సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తుంటే ఒక సీమాంధ్ర మంత్రి విభజనకు అనుకులంగా మాట్లాడం అన్యాయమన్నారు. ఇటువంటి ద్రోహులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మంత్రి కేవలం తన పదవిని కాపాడుకునేందుకే రాష్ట్ర విభజనకు అనుకులంగా మాట్లాడుతున్నారన్నారు. ఇదే తరుణంలో బాలరాజు వైఖరికి నిరసనగా నేడు డుంబ్రిగుడలో బంద్ నిర్వహిస్తునట్లు సుబ్బారావు తెలిపారు. ప్రజలు,వ్యాపారులు బంద్‌కు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బి మూర్తి,సింహద్రి,భాస్కర్‌రావు, కొండబాబు,అర్జున్,నందారావు,చిరంజీవి పాల్గొన్నారు. -
ఇద్దరు మిత్రుల హత్య
కొట్టి చంపిన దుండగులు పాతకక్షలే కారణమా? అత్తాపూర్, న్యూస్‌లైన్: అనుమానాస్పదస్థితిలో ఇద్దరు యువకులు హత్యకు గురైన ఘటన రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం...రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీకి చెందిన ఎల్. నర్సింహ్మ కుమారుడు నందు (28) ప్రైవేట్ పని చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన ఎం.మల్లేష్‌యాదవ్(27) పాలవ్యాపారి. ఇద్దరూ మంచి స్నేహితులు. కాగా అదే ప్రాంతానికి చెందిన నందు బంధువు బాలరాజు శనివారం వీరిద్దరినీ తన వెంట తీసుకెళ్లాడు. రాత్రి పొద్దుపోయినా నందు, మల్లేష్లు ఇంటికి రాకపోవడంతో కు టుంబసభ్యులు వారికి ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేసినా ఇద్దరి నుంచీ స్పంద న లేదు. బాలరాజుకు కాల్ చేసినా ఫోన్ ఎత్తలేదు. ఉదయానికి కూడా ఇద్దరూ ఇంటికి చేరుకోకపోవడంతో కు టుంబసభ్యులు వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నందు, మ ల్లేష్లు రాజేంద్రనగర్ నుంచి హిమాయత్‌సాగర్‌కు వెళ్లే రహదారి పక్కన ఉన్న మానసహిల్స్ ప్రాంతంలో విగతజీవులై కనిపించారు. మృతదేహాలను చూడగా కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ ధారాలు సేకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరినీ తీవ్రంగా కొట్టి చంపినట్టు గుర్తించారు. డాగ్‌స్క్వాడ్‌ను ర ప్పించి పరిశీలించగా.. జాగిలం సంఘటనా స్థలం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోని మాణిక్యమ్మ కాలనీకి వెళ్లి ఓ ఇంటిముందు ఆగిపోయింది. అ నంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా, బంధువైన బాలరాజు కుటుంబ సభ్యులతో నందుకు గతంలో గొడవ లు జరిగాయని, ఆ నేపథ్యంలో వారు అతనిపై దాడి చేశారని పోలీసులు తె లిపారు. ఆ సమయంలో మల్లేష్ కూడా అక్కడే ఉన్నాడని, ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోందని, ఈ క్రమంలోనే ఈ హత్యలు జరిగి ఉండవచ్చని పో లీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. బాలరాజుతో పాటు అతని కుటుం బసభ్యులు శ్రీహరి, హరికృష్ణలపై నందు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిజనులకు మూడు క్రీడా అకాడమీలు
పాడేరు, న్యూస్‌లైన్ : గిరిజనుల క్రీడాభివృద్ధికి రాష్ట్రం లోని ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో మూడు క్రీడా ఆకాడమీలను ఏర్పాటు చేస్తున్నామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి.బాలరాజు తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర కూడా వేశారన్నారు. కమ్యూనిటీ పోలి సింగ్‌లో భాగంగా జిల్లా పోలీసుశాఖ నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల ఫైనల్ మ్యాచ్‌ను ఆదివారం మంత్రి బాలరాజు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మం త్రి మాట్లాడుతూ ఏజెన్సీలో క్రీడారంగాన్ని పోలీసు శాఖ ప్రోత్సహించడం సంతోషదాయకమన్నారు. ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి రూ.2.50 కోట్లతో స్టేడియంల నిర్మిస్తోందని, వీటిలో పాడేరుకు రెండు, అరకులోయకు ఒక స్టేడియం మంజూ రైందన్నారు. 100 గ్రామాల గిరిజన క్రీడాకారులకు ఈ నెల 14న వాలీబాల్, క్రికెట్ కిట్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి పోలీసుశాఖ వినూత్న సేవా కార్యక్రమాలను చేపడుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాలీబాల్ పోటీలకు విశేష స్పందన లభించిందన్నారు. రానున్న రోజుల్లో క్రికెట్, కబడ్డీ, అర్చరీ పోటీలను కూడా నిర్వహిస్తామన్నారు. ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్ మాట్లాడుతూ ఐటీడీఏ ద్వారా క్రీడా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామని, అన్ని పాఠశాలల్లోను క్రీడలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అనంతరం టోర్నమెంట్లో విజేత అరకులోయ వాలీబాల్ జట్టు, రన్నర్ కేడీపేట జట్టు క్రీడాకారులను మంత్రి అభినందించి ప్రోత్సహక నగదు, షీల్డ్‌లను అందజేశారు. కార్యక్రమంలో ఎఎస్పీలు విశాల్‌గున్ని, పకీరప్ప, నర్సీపట్నం ఓఎస్డీ ఎ.ఆర్.దామోధర్, పలువురు ఉన్నతాధికారులు, గిరిజన సంక్షేమ డీడీ బి.మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
గూడు కరువు
=22 మండలాల్లో వ్యవసాయశాఖకు పక్కాభవనాల్లేవు =అసిస్టెంట్ డెరైక్టర్లదీ అదే పరిస్థితి =అద్దె కొంపల్లో అవస్థలు పట్టించుకోని ప్రభుత్వం సాక్షి, విశాఖపట్నం : వ్యవసాయశాఖకు జిల్లాలోని పలు మండలాల్లో సొంత గూడు కరువైంది. రైతులకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన వ్యవసాయాధికారులకు వసతి లేక అక్కడో ఇక్కడో అన్నట్టు కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఏ సమయంలో ఎక్కడుంటారో తెలియని దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. రైతులపై నిర్లక్ష్యం చూపినట్టే వ్యవసాయాధికారులపైనా శీతకన్ను వేసింది. జిల్లాలోని 22 మండలాల్లో వ్యవసాయశాఖకు సొంత కార్యాలయాల్లేవు. మండలపరిషత్, ఇతరత్రా కార్యాలయాల్లో ఆయా అధికారుల దయాదాక్షిణ్యాలపై ఏవోలు నెట్టుకొస్తున్నారు. మరికొందరు అద్దె భవనాల్లో కొనసాగుతున్నారు. జిల్లాలో 10 మంది అసిస్టెంట్ డెరైక్టర్లు(ఏడీఏ)దీ ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయకపోవడంతో సకాలంలో అద్దె చెల్లించలేక కొందరు అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి గ్రామీణ జిల్లాలో 75 శాతం మంది వ్యవసాయం ఆధారంగా బతుకుతున్నారు. ఈమేరకు ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అధికారులు అందుబాటులో ఉండాలి. కానీ సరైన వసతి లేక ఎప్పుడెక్కడ ఉంటారో తెలియడం లేదు. మండల వ్యవసాయాధికారులు, అసిస్టెంట్ డెరైక్టర్లకు సొంత భవనాలను సమకూర్చడానికి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి గతంలో ప్రతిపాదనలు పంపారు. కానీ సర్కార్ స్పందించలేదు. ఇటీవల గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజుతో జరిగిన సమీక్ష సమావేశంలో వ్యవసాయాధికారులు ఈ సమస్యను ప్రస్తావించారు. దీంతో మరోసారి ప్రతిపాదనలు పంపాలని మంత్రి కోరారు. ఈసారైనా ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి. -
మౌలిక సదుపాయాలకు రూ.1100 కోట్లు
మంత్రి బాలరాజు పాడేరు, న్యూస్‌లైన్: ఏజెన్సీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1100 కోట్లు మంజూరు చేసినట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వంతాడపల్లి నుంచి అడ్డుమండ వరకు రూ.కోటి 79 లక్షలతో నిర్మించే తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. తుంపాడ, గుత్తులపుట్టు గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలు, రూ.13.50 లక్షలతో నిర్మించిన గుత్తులపుట్టు జీసీసీ గిడ్డంగిని ప్రారంభించారు. పాడేరులోని పంచాయతీ కార్యాలయం వెనుక సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుంపాడలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఒక్క పాడేరు మండలం అభివృద్ధికే రూ.100 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. గిరిజనులకు విద్య, వైద్య కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. తాగునీటి సౌకర్యాల కల్పనకు భారీగా నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గిరిజన యువత ఉపాధికి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్, ఆర్డీవో ఎం.గణపతిరావు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ఈఈలు సుబ్బారావు, మురళీకృష్ణ, ఎం.ఆర్.జి.నాయుడు, జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డి, పలు శాఖల అధికారులు, డీసీసీ కార్యదర్శి సతీష్‌వర్మ, పలు పంచాయతీల సర్పంచ్‌లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి పాడేరు: కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులంతా గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని మంత్రి బాలరాజు కోరారు. స్పెషల్ డీఎస్సీ 2013 ద్వారా ఎంపికైన 56 మంది ఉపాధ్యాయులకు శనివారం రాత్రి ఐటీడీఏ కార్యాలయంలో ఆయన నియామకపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గిరిజన విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వసతి, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది చలి కాలానికి ముందే గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లోని విద్యార్థులందరికీ రగ్గులు పంపిణీ చేశామని చెప్పారు. ఉపాధ్యాయులంతా సాటి గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేసి మంచి గిరిజన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వినయ్‌చంద్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జునరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి బాలరాజుకు గిరిజనుల షాక్!
-
గిరుల సిరులు
=ఆదివాసీ సంస్కృతిని చాటిన ఉత్సవ్ =పరిరక్షణకు మంత్రి బాలరాజు పిలుపు =పర్యాటక సర్క్యూట్‌గా అరకులోయ ప్రాంతం =అలరించిన సాంసృ్కతిక కార్యక్రమాలు అరకులోయ/అరకురూరల్: మన్యంలోని ఎత్తయిన కొండలు, లోయలు, జలపాతాలు, ఇతర ప్రకృతి సంపదను కాపాడుకుంటూనే సంప్రదాయలను పరిరక్షించుకోవాలని రాష్ర్ట గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి. బాలరాజు పేర్కొన్నారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గురువారం నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవ్‌ను జ్యోతి వెలిగించి మంత్రి ప్రారంభించారు. రంగురంగుల బెలూన్లను ఎగురవేశారు. కార్యక్రమంలో బాల రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏల పరిధిలోని విభిన్న గిరిజన జాతులను ఒకే విదికపైకి తెచ్చి పరిచయం చేస్తున్నామన్నారు. పర్యాటకులను ఉత్సవ్ అలరిస్తుందన్నారు. థింసా నృత్యం గిరిజనులకు వరమన్నారు. తక్కువ ఖర్చుతో ఏటా ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అన్ని సదుపాయలతో పాటు,భద్రత వాతావరణం కల్పిస్తేనే ఈ ప్రాంతానికి మంచిపేరు వస్తుందన్నారు. సీలేరు,చింతపల్లి,దారకొండ,పాడేరు,అరకు,అనంతగిరి,లంబసింగి ప్రాంతాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్‌గా ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అరకులోయకు ప్రత్యేకంగా అద్దాల రైలు ఏర్పాటు చేయాలని కేంద్ర ైరె ల్వేశాఖ మంత్రిని కలిసి విన్నవించినట్లు మంత్రి చెప్పారు. వచ్చే ఏడాది ఉత్సవాలనాటికి ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. పాడేరు ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ మాట్లాడుతూ అన్ని గిరిజన జాతుల సంస్కృతులకు ఈ ఉత్సవ్ అద్దం పడుతుందన్నారు. గిరిజన కళలు, సంప్రదాయాలు, ఆహారధాన్యాలు దృశ్య మాలికగా ఉంటాయని అభిప్రాయ పడ్డారు. ఉత్సవ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏల పరిధిలోని కళాబృందాలను ఇక్కడకు తీసుకువచ్చారు. అరకులోయ ప్రధాన రహదారితోపాటు ఉత్సవ్ ప్రాంగణం కళాబృందాల ప్రదర్శనలతో నిండిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అరకులోయ సీఐ మురళీరావు ఆధ్వర్యంలో ఎస్ఐలు కె. కుమారస్వామి, రామకృష్ణలు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారితోపాటు అన్ని కూడళ్లను నిఘా బృందాలు నిశితంగా పరిశీలించాయి. ప్రాంగణంలో పోలీస్ జాగిలాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. స్థానికుల భాగస్వామ్యం ఏదీ : ఎమ్మెల్యేసోమ అరకు గిరిజన ఉత్సవ్‌లో స్థానిక గిరిజన ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం లేకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే సోమ విచారం వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్‌ను ఆహ్వానించి ఈ సభకు అధ్యక్షునిగా చేసి ఉంటే బాగుండేదన్నారు. వేదికపై అధికారులు మినహా స్థానిక ప్రజా ప్రతినిధులు లేక పోవడం బాధాకరమన్నారు. వ్యాపారులు, గిరిజన సంఘాలను ఆహ్వానించి ఉంటే మరింత విజయవంతంగా జరిగేదన్నారు. మంత్రికి ఘనస్వాగతం ఉత్సవ్ ప్రారంభోత్సవానికి అరకులోయ వచ్చిన మంత్రి బాలరాజుకు పర్యాటకశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అరకులోయ ముఖద్వారం నుంచి వివిధ కళాబృందాలతో పాటు థింసా నృత్యాలతో స్వాగతం పలికి వేదిక వద్దకు తోడ్కొని వెళ్లారు. సుమారు కిలోమీటరు దూరం కాలి నడకన కళాకారులతో కలిసి వేదిక వరకు మంత్రి నడుచుకుని వచ్చారు. ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను, సీడ్ ఫెస్టివల్‌ను తిలకించారు. కార్యక్రమంలో పాడేరు ఆర్డీవో గణపతిరావు, డీడీ మల్లికార్జునరెడ్డి, పర్యాటక శాఖ జీఎం భీమశంకర్, పర్యాటకశాఖ అధికారిణి అనిత, కో-ఆర్డినేటర్ మురళీ పాల్గొన్నారు. -
పాపం బాధరాజు!
=అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదు =డయల్ యువర్ కలెక్టర్‌కు ఫోన్ =రచ్చబండకు అధికారులను పంపిన కలెక్టర్ విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి తనను పట్టించుకోలేదంటూ బహిరంగంగా బాధ పడుతున్న మంత్రి బాలరాజుకు మరో కష్టం వచ్చింది. ఇప్పుడు తనను అధికారులూ పట్టించుకోవడం లేదంటూ సాక్షాత్తూ కలెక్టరుకే మొరపెట్టుకోవలసిన దుస్థితి దాపురించింది. ప్రజలు తమ సమస్యలు మంత్రులకు చెప్పుకోవడం సాధారణమే.. రాష్ట్ర మంత్రే తన దుస్థితిని కలెక్టర్‌కు ఫోన్లో చెప్పుకుంటే? ఇప్పుడు బాలరాజు అలాగే చె ప్పుకోవలసి వచ్చింది. మంత్రి హోదాలో తాను నిర్వహిస్తున్న రచ్చబండకు జిల్లా అధికారులు రావడం లేదని సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఒక పౌరుడిలా ల్యాండ్ ఫోన్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయడం తన పరిస్థితికి దర్పణం పడుతోంది. అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. జిల్లాలోని కాంగ్రెస్ వర్గ రాజకీయాల నేపథ్యంలో మంత్రి బాలరాజుకు కొంతకాలంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో విబేధాలేర్పడ్డాయి. ఈ వ్యవహారం బహిరంగ రహస్యం కావడంతో జిల్లా అధికారులు సైతం మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇచ్చినంత ప్రాధాన్యత బాలరాజుకు ఇవ్వడం లేదు. దీనిపై బాలరాజు అనేక సార్లు అధికారులపై బహిరంగంగానే తన అసంతృప్తి వె ళ్లగక్కారు. ఇటీవల చోడవరంలో నిర్వహించిన రచ్చబండ సభలో తన శాఖ అంశాలున్నా సీఎం కార్యాలయం నుంచి తనకు ఆహ్వానం అందలేదని బాలరాజు బహిరంగ విమర్శలు చేశారు. సీఎం డెరైక్షన్ మేరకే జిల్లా అధికారులు సైతం తనను పెద్దగా లెక్కచేయలేదని ఆయన లోలోన మధన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బాలరాజు తన నియోజకవర్గం పాడేరులో నిర్వహిస్తున్న రచ్చబండ సభలకు జిల్లాస్థాయి అధికారులెవరూ హాజరు కావడం లేదనే ప్రచారం జరుగుతోంది. సోమవారం కొయ్యూరు మండలం రేవళ్ల పంచాయతీలో రచ్చబండ సభ నిర్వహించనున్నట్లు మంత్రి సంబంధిత జిల్లా అధికారులందరికీ సమాచారం పంపించారు. ఉదయం ఆయన రచ్చబండ సభకు వెళ్లేటప్పటికి తాను పిలిచిన అధికారులు లేకపోవడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ మొబైల్‌కు ఫోన్ చేశారు. అప్పటికే ఆయన ప్రజాసమస్యలు వినేందుకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఉండటంతో మొబైల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో మంత్రి బాలరాజు ల్యాండ్ ఫోన్ నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఫోన్ చేశారు. కలెక్టర్ హలో అనగానే అవతలి నుంచి ‘ కలెక్టర్ గారూ నేను మంత్రి బాలరాజును మాట్లాడుతున్నాను’ అనే మాట వినగానే కలెక్టర్ ఆశ్చర్య పోయారు. తాను నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరు కాలేదని, తాను ముందుగా సమాచారం అందించినా రాక పోతే ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలని బాలరాజు ఆవేదన చెందారు. అధికారులు తనను కావాలని అవమానిస్తున్నట్లుందని మంత్రి నిష్టూరపోవడంతో కలెక్టర్ కలుగచేసుకుని అలాంటిదేమీ లేదని వెంటనే జిల్లా అధికారులను పంపుతానని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి కోరిన జిల్లా అధికారులను రచ్చబండ సభకు పంపారు. స్వయానా మంత్రే కలెక్టర్‌కు ఫోన్ చేసి అధికారులు తన మాట వినడం లేదని చెప్పుకోవడం అధికార వర్గాల్లోను, రాజకీయ పార్టీల్లోను చర్చనీయాంశమైంది. కొందరైతే పాపం బాలరాజు అని జోకులేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నందువల్లే ముఖ్యమైన జిల్లా అధికారులు ఉండిపోయారనీ, మంత్రి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే వారిని రచ్చబండకు పంపానని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ‘సాక్షి ప్రతినిధికి’ చెప్పారు. -
మంత్రి బాలరాజుకు పరాభవం
విశాఖపట్నం: మంత్రి బాలరాజుకు తన సొంత జిల్లాలోనే పరాభవం జరిగింది. కొయ్యూరు మండలం రేవల్ల రచ్చబండకు మంత్రి బాలరాజు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి అధికారులు పెద్దగా హాజరుకాలేదు. దాంతో మంత్రిగారికి కోపం వచ్చింది. తాను హజరైన కార్యక్రమానికి అధికారులు హాజరుకాకపోవడం పట్ల ఆయన మండిపడ్డారు. వెంటనే మంత్రి జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి అధికారుల తీరును వివరించారు. రచ్చబండని అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఎత్తిచూపారు. మంత్రి బాలరాజే స్వయంగా ఫోన్ చేసి విషయం చెప్పడంతో విస్తుపోవడం కలెక్టర్ వంతైంది. -
బాలరాజుకు సీఎం కిరణ్ ఫోన్
సాక్షి, హైదరాబాద్: సొంత నియోజకవర్గంలో జరిగే రచ్చబండ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి బాలరాజుతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఫోన్లో మాట్లాడారు. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో తాను పాల్గొన్న రచ్చబండ కార్యక్రమ నేపథ్యంలో జరిగిన కొన్ని పరిణామాలపట్ల ముఖ్యమంత్రి విచారం వ్యక్తంచేశారు. సీఎం కార్యక్రమంపై సమాచారం,.. ఆ జిల్లా మంత్రి అయిన బాలరాజుకు తెలియకపోవడం, దీనితో మంత్రి మనస్తాపం చెందడం, తనను అవమానాలకు గురిచేశారంటూ ముఖ్యమంత్రి తీరును ఆయన తప్పుబట్టడం తెలిసిందే. తాజాగా, కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం స్వయంగా బాలరాజుకు ఫోన్‌చేశారు. జరిగిన ఘటనలపై మంత్రికి సర్దిచెప్పారు. తన కార్యక్రమంపై అధికారులు సమాచారమిచ్చారనే తాను భావించానన్నారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని బాలరాజును సీఎం ప్రశ్నించగా, తన నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమంలో ఉన్నానని బాలరాజు జవాబు చెప్పారు. తాను కూడా చిత్తూరు జిల్లాలో రచ్చబండలో ఉన్నానని, శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చి తనను కలుసుకోవాలని బాలరాజుకు సీఎం సూచించారు. -
హద్దు మీరొద్దు
=గంటాపై ధ్వజమెత్తిన బాలరాజు =పరిధి దాటి మాటాడొద్దని స్పష్టీకరణ =ఎవరి పని వారే చేయాలని హితవు =లేదంటే తీవ్రపరిణామాలని హెచ్చరిక సాక్షి, విశాఖపట్నం: సీఎంపై ధ్వజమెత్తిన మంత్రి బాలరాజు ఇప్పుడు విమర్శల ను జిల్లాకు చెందిన మరో మంత్రి గం టా శ్రీనివాసరావు వైపు మరల్చారు. గంటా పరిధి దాటి, అన్నీ తానై అనుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తనకు సం బంధం లేని వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని విమర్శించారు. ‘ఆయన వైఖరి చూస్తుంటే నాకు ఓ కథ గుర్తుకొస్తుంది. ఎవరు చేసే పని వారు చేయాలి. ఇంకొకరి పనిచేస్తే ఫలితమేంటో అందరికీ తెలిసిందే’ అని అన్యాపదేశంగా గంటాకు చురకలు అందించారు. అవే పరిణామాలు గంటాకు ఎదురవుతాయని హెచ్చరించారు. ఇటీవల జరిగిన సీఎం పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని బాలరాజుకు అందించారని, అందులో అధికారులు, సీఎం కార్యాలయ వర్గాల తప్పేం లేదని, మంత్రి బాలరాజు అలా చెప్పడం సరికాదని మంగళవారం జిల్లాకు చెందిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై బాలరాజు ఘాటుగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన బుధవారం కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. సర్క్యూట్ హౌస్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గంటాపై ఘాటుగా స్పందించారు. సీఎం పర్యటన వ్యవహారం తనకు, సీఎం పేషీకి సంబంధించిన వ్యవహారమని,మధ్యలో జోక్యం చేసుకోవడానికి గంటా ఎవరని ప్రశ్నించారు. అసలేం జరిగిందో చెప్పాల్సిన ఉద్యోగం నీది కాదని స్పష్టం చేశారు. అలా మాట్లాడమని ముఖ్యమంత్రి చెప్పారా? లేదంటే నీకు నువ్వే చెప్పావా? దీనిని తేల్చాలి’ అని డిమాండ్ చేశారు. ‘అప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారో ఆధారాలున్నాయి. తప్పు ఒప్పులు నిర్ణయించడానికి ,సమాచారం నాకు అందిందని చెప్పడానికి గంటా ఎవరు’ అని బాలరాజు ప్రశ్నించారు. ఎవరినో భుజాన వేసుకుని అన్నీ తానై వ్యవహరించాలనుకోవడం తగదన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకోకుండా గంటా మాట్లాడటం తగదన్నారు. గంటాతో కూడా తనకు విభేదాలు లేవని ముక్తాయింపు ఇచ్చారు. తన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. -
నా విషయంలో తలదూర్చడానికి గంటా ఎవరు?
-
నా విషయంలో తలదూర్చడానికి గంటా ఎవరు?
విశాఖ : గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న గిరిజన మంత్రి బాలరాజు తన కోపాన్ని ఈసారి సహచర మంత్రి గంటా శ్రీనివాసరావుపై చూపారు. తన విషయంలో తలదూర్చడానికి గంటా ఎవరు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రచ్చబండ విషయంలో తనకు సమాచారం లేదని బాలరాజు తెలిపారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చాకే తన నిర్ణయం చెబుతానని ఆయన అన్నారు. రాజకీయ నేతలు రాజకీయం చేయకపోతే వ్యాపారాలు చేస్తారా అని అన్నారు. వ్యక్తులకు విధేయత చూపటం తన పద్ధతి కాదని బాలరాజు వ్యాఖ్యానించారు. కాగా ముఖ్యమంత్రికి, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, అన్నీ తొందర్లోనే సర్దుకుంటాయని మంత్రి బాలరాజు పేర్కొనటం విశేషం. కిరణ్‌కుమార్‌రెడ్డి చోడవరం సభకు వచ్చినప్పుడు గిరిజన శాఖ పథకాన్ని తాను లేకుండా ప్రారంభించడం సమంజసం కాదన్నారు. మరోవైపు బాలరాజు ఈరోజు సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. -
సీఎంతో విభేదాల్లేవు: మంత్రి బాలరాజు
నర్సీపట్నం(విశాఖ జిల్లా), న్యూస్‌లైన్: ముఖ్యమంత్రికి, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, అన్నీ తొందర్లోనే సర్దుకుంటాయని మంత్రి బాలరాజు పేర్కొన్నారు. ఆయన మంగళవారమిక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చోడవరం సభకు వచ్చినప్పుడు గిరిజన శాఖ పథకాన్ని తాను లేకుండా ప్రారంభించడం సమంజసం కాదన్నారు. దీనిపై అవసరమైతే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే విశాఖను కోస్తాంధ్రకు రాజధానిగా చేయాలని కేంద్ర కేబినెట్ బృందానికి ప్రతిపాదించామని తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా మార్చాలని, అలాగే వాటిని కలిపే పలు రోడ్లను జాతీయ, రాష్ట్ర రహదారులుగా మార్చాలని ప్రతిపాదించినట్టు ఆయన వివరించారు. విశాఖ కేంద్రంగా ఆంధ్రా సెంట్రల్ యూనివర్సిటీని నెలకొల్పాలని, చింతపల్లిలో గిరిజన యూనివర్సిటీ అవసరమని సూచించామన్నారు. -
'మంత్రులను కించపరిచే స్థాయిలో ప్రభుత్వం లేదు'
విశాఖ:మంత్రులను కించపరిచే స్థాయిలో ప్రభుత్వం లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంత్రులను ప్రభుత్వం తక్కువగా చూస్తూ అవమానానికి గురి చేస్తుందన్న మంత్రి బాలరాజు వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన గంటా..బాలరాజును ఎవరు కించపరిచారో చెప్పాలన్నారు.మంత్రులను కించపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరించలేదని తెలిపారు. కాగా, విభజన జరిగిందంటూ పురందేశ్వరి వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాను వివక్షను ఎదుర్కొంటున్న ట్టు గిరిజన శాఖ మంత్రి బాలరాజు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శాఖాపరంగానూ, సంక్షేమ కార్యక్రమాల పరంగానూ కొం త వివక్షకు గురవుతున్నానన్న భావన బాధ కలిగిస్తున్నదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని క్లబ్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన శాఖకు సంబంధించిన నిర్ణయాలన్నీ తన ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయన్నారు. 7 (ఏ) క్లాజ్ ద్వారా ముఖ్యమంత్రికి ఉండే విస్తృత స్థాయి అధికారాలను ఉపయోగించుకొని నిర్ణయాలు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయన్నారు. -
నాపై సర్కారు వివక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాను వివక్షను ఎదుర్కొంటున్న ట్టు గిరిజన శాఖ మంత్రి బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శాఖాపరంగానూ, సంక్షేమ కార్యక్రమాల పరంగానూ కొం త వివక్షకు గురవుతున్నానన్న భావన బాధ కలిగిస్తున్నదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని క్లబ్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన శాఖకు సంబంధించిన నిర్ణయాలన్నీ తన ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయన్నారు. 7 (ఏ) క్లాజ్ ద్వారా ముఖ్యమంత్రికి ఉండే విస్తృత స్థాయి అధికారాలను ఉపయోగించుకొని నిర్ణయాలు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయన్నారు. ప్రభుత్వంలో తాను ఒక్కడినే గిరిజన మంత్రిని అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రచారంలోనూ వివక్షకు గురైనట్టు చెప్పారు. వివక్ష ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతున్నదా, తెలియక జరుగుతున్నదా అన్నది తనకు తెలియదన్నారు. సీఎంకు అన్నీ తెలిసీ అధికారుల ద్వా రా ఇలాంటివి చేయిస్తుంటే ఈ ప్రభుత్వానికే చెడ్డపేరు రావడమేగాక, పార్టీకీ నష్టమని చెప్పారు. విశాఖపట్నంలో లా యూనివర్సిటీకి శంకుస్థాపన సందర్భం గా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిన వివరాలను సీఎం కు చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇటీవల రచ్చబండలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు సమాచా రం లేదనే కారణంతో బాలరాజు అందు లో పాల్గొనలేదు. ఈనెల 15వ తేదీన జరిగే ముఖ్యమంత్రి పర్యటన వివరాలు తన కు 14 సాయంత్రమే తెలిసిందన్నారు. అప్పటికి మూడు రోజుల ముందు నుంచే ముఖ్యమంత్రి జిల్లా పర్యటన వివరాలు,సభలకు ఎవరు అధ్యక్షత వహిస్తారనే అంశాలపై జిల్లా పత్రికలన్నింటిలో కథనాలు ప్రచురితమయ్యాయన్నారు. సభకు అధ్యక్షత వహించే విషయంలో కొత్త సంప్రదాయాలకు తెరతీశారని బాలరాజు ఆరోపించారు.తనపై వివక్ష గురించి ముఖ్యమంత్రితోనూ మాట్లాడానని, అయినా న్యాయం జరగలేదని చెప్పారు. సీఎం విశాఖ జిల్లా పర్యటన వివరాలు తనకు ముందే తెలిపినట్టు సీఎం ఓ ఒక ప్రకటన విడుదల చేసిందని. ఒక్కరోజు ముందుమాత్రమే అని తాను చెబుతున్నానని, వాస్తవం ఏమిటో సీఎంఓ వెల్లడించాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, ఎవరూ సొంత ఆస్తిగా భావించాల్సిన అవసరం లేదన్నారు. తన నియోజకవర్గానికి సంబంధించి రూ. 63 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన పనులు సీఎం పర్యటనలో ఉన్నాయని పేర్కొన్నారు. -
రసకందాయంలో ‘బాలరాజ’కీయం
=అధిష్టానంపై విధేయత యత్నం =తాడో పేడోకి సిద్ధం =రసకందాయంలో ‘బాలరాజ’కీయం విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి: చాలాకాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావు లక్ష్యంగా అసమ్మతి రాజకీయం నడిపే ప్రయత్నం చేసిన మంత్రి బాలరాజు ఒక్కసారిగా తన టార్గెట్ మార్చారు. అనూహ్యంగా ఆయన సోమవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై బహిరంగ యుద్ధం ప్రకటించారు. పార్టీ విధేయులను సీఎం అణగదొక్కుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ చర్యతో బాల రాజు సీఎంతో నేరుగా సమరానికి సిద్ధమయ్యారు. కిర ణ్‌కుమార్‌రెడ్డి సీ ఎం అయినప్పట్నుంచి బాలరాజు ఆ యనకు జిల్లాలో ముఖ్యుడిగా మెలిగారు. తద్వారా తన నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల అభివద్ధి పనులు మంజూరు చేయించుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో కలసిపోవడం, ఆ పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు మంత్రి కావడంతో జిల్లాలో బాలరాజుకు కష్టాలు మొదలయ్యాయి. గంటా దూకుడుకు బాలరాజు తట్టుకోలేక పోయారు. పార్టీకి విధేయుడిగా ఉన్న తనను గంటా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనీ, పార్టీలో, జిల్లా అధికార యంత్రాంగంలో ఆయన ఆధిపత్యం తీవ్రమైందని బాలరాజు పలుమార్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ మధ్యలో గంటాకు ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి. దీంతో జిల్లా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం గంటాకు పెద్ద పీట వేస్తూ వచ్చారు. జిల్లా వ్యవహారాల్లో సైతం గంటా చెప్పిందే జరుగుతూ వచ్చింది. ఇవన్నీ బాలరాజు, గంటా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తెచ్చాయి. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో సైతం ఒకరు అవునంటే మరొకరు కాదనే తీరుకు వచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైన సమయంలో గంటా పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించే వైఖరి అందుకున్నారు. దీంతో బాలరాజు షరామామూలుగానే పార్టీ విధేయత వాదన మొదలెట్టారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా డ్రామాలు ఆడేవాడిని కాదనీ, అధిష్టానం అభీష్టం మేరకే నడుచుకుంటానని ప్రకటించారు. తన వ్యతిరేకిని ప్రోత్సహిస్తున్నారని సీఎం మీద ఎప్పట్నుంచో కారాలు, మిరియాలు నూరుతున్న ఆయన సమైక్యాంధ్ర వ్యవహారంలో సీఎం తీరును కూడా ఎండగడుతూ వచ్చారు. పార్టీ వ్యతిరేకులతో తాను చేతులు కలిపేది లేదనే నినాదంతో జిల్లాలో సీఎం ఎన్ని సార్లు పర్యటించినా డుమ్మా కొడుతూ వచ్చారు. ఇటీవల చోడవరంలో జరిగిన రచ్చబండ బహిరంగ సభకు కూడా ముఖం చాటేశారు. రచ్చబండలో తన శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ గిరిజనుడు అయినందువల్లే సీఎం కార్యాలయం తనకు కనీస సమాచారం ఇవ్వలేదని బహిరంగ విమర్శలకు దిగారు. రచ్చబండ సభలో టీడీపీ ఎమ్మెల్యే రాజు పాల్గొని సీఎంను, గంటాను వీరులు, శూరులు, విక్రమార్కులని కీర్తించడం బాలరాజుకు మండేలా చేసింది. పార్టీ వ్యతిరేకులంతా ఒక చోట చేరి ప్రభుత్వ కార్యక్రమంలో ఒకరినొకరు కీర్తించుకునేందుకే పరిమితమయ్యారని బాలరాజు విమర్శలకు దిగారు. నెలాఖరులో తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించవచ్చనే ఊహాగానాలు బయల్దేరాయి. ఇదే మంచి తరుణమనుకున్న బాలరాజు రాబోయే రోజుల్లో జిల్లా కాంగ్రెస్‌లో చక్రం తిప్పేందుకు సీఎంనే టార్గెట్ చేశారు. నాలుగైదు రోజులుగా జిల్లాలోని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన చర్చలు జరిపారు. ఆ తర్వాతే బాలరాజు మంత్రి గంటాను కాకుండా సీఎం కిరణ్‌నే లక్ష్యంగా చేసుకుని రాజకీయ యుద్ధానికి దిగడం ప్రయోజనం కలిగిస్తుందనే అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ కోణంలోనే ఆయన సోమవారం సీఎంపై నేరుగా రాజకీయ పోరాటానికి దిగినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ పరిణామాలు మరింత రసవత్తర అంకానికి తెరలేపబోతున్నాయని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. -
పేరుకే రచ్చబండ
=అసలు దారికి బహు దూరం =నామమాత్రంగా నిర్వహణ =ప్రజలతో జరగని ముఖాముఖి మంత్రి బాలరాజు దూరం ప్రశ్నించని టీడీపీ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర అంశానికే ప్రాధాన్యం ప్రజల వద్దకు పాలకులు వెళ్లి.. వారి సమస్యలు విని పరిష్కారానికి చర్యలు నిర్దేశించడం రచ్చబండ లక్ష్యం.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహానేత వైఎస్ ఆశయమూ అదే. అయితే నానాటికీ సంకల్పం సడలిపోతోంది. పథకం గురి తప్పుతోంది. రచ్చబండ పేరు మాత్రమే మిగిలింది. ప్రజల సమస్యలు విని, వాటిని పరిష్కరించే చొరవ కొరవడుతోంది. సాక్షాత్తూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చోడవరంలో పాల్గొన్న రచ్చబండ ఇదే ‘రాంగ్‌రూట్’ లో నడిచింది. ప్రజలతో మాటామంతీ లేకుండా, వారి సమస్యలు విని, చర్చించే కార్యక్రమమే లేకుండా తూతూమంత్రంగా సాగింది. ప్రతిపక్ష టీడీపీ ప్రజాప్రతినిధుల ప్రశంసల వర్షంతో ఆపాటి ధిక్కార స్వరం కూడా వినిపించలేదు. సాక్షి, విశాఖపట్నం/న్యూస్‌లైన్, చోడవరం : రచ్చబండ గాడి తప్పింది. ఆశయానికి భిన్నంగా అడ్డదారిలో సాగింది. ప్రజా సమస్యలు తెలుసుకోకుండానే సీఎం కార్యక్రమం ముగిసింది. అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు తీరుపై ఆరాతీయకుండానే ముగించేయడంతో అసలు సభ ఎందుకు జరిగిందో కూడా తెలియకుండా పోయింది. ప్రశ్నించాల్సిన టీడీపీ ఎమ్మెల్యేలు తందానతాన అనడంతో ప్రశ్నించే స్వరం వినిపించకుండాపోయింది. స్థానిక ప్రజాప్రతినిధులు అనేక సమస్యలు చెప్పుకున్నా సీఎం స్పందన అంతంతమాత్రంగానే ఉంది. జిల్లాకు రెండు, చోడవరం నియోజకవర్గానికి మూడు వరాలిచ్చి ఊరుకోవడంతో ఆశలు అడియాసలైనట్టయింది. హామీల కన్నా..సమైక్యాంధ్ర ప్రసంగమే మార్మోగింది. ఉసూరన్న జనం ‘ఇళ్లు ఇప్పిస్తాం, పింఛన్లు మంజూరు చేయిస్తాం, రేషన్ కార్డు ఇప్పించేస్తాం, నేరుగా సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తాం... పిటిషన్లు పట్టుకునే వస్తే చాలు’ అని అధికారులు నమ్మబలకడంతో జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. దాంతో సభ విజయవంతమైంది. కానీ సభ లక్ష్యం నెరవేరలేదు. ప్రజల సమస్యల్ని సీఎం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడలేదు. పథకాల అమలు తీరుపై కనీసం ఆరా తీయలేదు. రచ్చబండపై రాజకీయ ప్రసంగాలే వినిపిం చాయి. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు వంతపాడారు. చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు అటు మంత్రి గంటాను, ఇటు సీఎంను పొగడ్తలతో ముంచెత్తారు. తానే కొన్ని సమస్యలు వివరించారు. మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి ఇదే బాటలో వెళ్లి నియోజకవర్గ సమస్యలు చెప్పుకున్నారు. రచ్చబండకు స్థానిక సర్పంచ్ అధ్యక్షత వహించాల్సి ఉండగా, సర్పంచ్‌కు కనీసం మాట్లాడే అవకాశమైనా ఇవ్వలేదు. ప్రజల నుంచి సభ మధ్యలోనే కొందరు పిటిషన్లు తీసేసుకున్నారు. ఇవీ వరాలు : మంత్రి గంటా శ్రీనివాసరావు, చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు చాలా సమస్యలను సీఎం వద్ద వెళ్లబోసుకున్నారు. కానీ సీఎం మాత్రం జిల్లాకు రెండు, నియోజకవర్గానికి మూడే మూడు వరాలిచ్చి చేతులు దులుపుకున్నారు. చెరకు మద్దతు ధర గురించి ఆయన కనీసం స్పందించలేదు. దీంతో రైతులు నిరాశ పడ్డారు. డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని స్పెషల్ డిఎస్సీ అభ్యర్థులు, 610 జీవోను రద్దు చేయాలని ఉపాధ్యాయులు వినతిపత్రాలు, ప్లకార్డులు పట్టుకుని సభలో నిరసన తెలియజేశారు. అంతకుముందు సమస్యలు చెప్పడానికి వస్తున్న సీపీఎం కార్యకర్తలతో కలిసి వస్తున్న ప్రజల్ని బాని కోనేరు, రెల్లివీధి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. సమైక్య నినాదం : గంటన్నర ఆలస్యంగా సభాస్థలికి చేరుకున్న సీఎం వెంటనే మంత్రి గంటా, ఎమ్మెల్యేలు కేఎస్ఎన్ఎస్ రాజు, గవిరెడ్డి రామానాయుడు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కరణం ధర్మశ్రీలకు మాట్లాడే అవకాశమిచ్చారు. తర్వాత ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో సమైక్యాంధ్ర అంశాన్ని లేవనెత్తారు. ఆద్యంతం అదే అంశాన్ని ప్రస్తావించారు. సమైక్యాంధ్ర కావాలని చేతులెత్తాలంటూ ప్రజల్ని ఉత్తేజపరిచేలా మాట్లాడారు. సమావేశానికి మంత్రి బాలరాజు, సిటీ ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్ గైర్హాజరయ్యారు. తనకు అహ్వానం లేదన్న కారణంతో గైర్హాజరైనట్టు బాలరాజు చెప్పగా అది సరి కాదని అధికారులు స్పష్టం చేశారు. సీఎం పేషీ కూడా ప్రకటన విడుదల చేస్తూ, బాలరాజుకే ముందు సమాచారం ఇచ్చామని స్పష్టం చేయడం విశేషం. -
నేటి నుంచి రచ్చబండ-3 నిర్వహణ
=నేటి నుంచి రచ్చబండ-3 నిర్వహణ = మండల కేంద్రాలకే పరిమితం = లబ్ధిదారులకు పథకాల పంపిణీతో సరి విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రహస్య రచ్చబండకు సర్వం సిద్ధమైంది. రెండో విడతలో రచ్చగా మారిన ఈ కార్యక్రమం ఇప్పుడు మండల కేంద్రాలకే పరిమితమవుతోంది. అప్పట్లో సమావేశం జరిగిన ప్రతీ చోటా ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు నిలదీశారు. ముఖ్యంగా మంత్రి బాలరాజును ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో తీవ్ర సమస్యలు నెలకొన్నాయి. దీంతో రచ్చబండ-2 మాదిరిగా ఈసారి ఎటువంటి ఆందోళనలు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పథకాలకు కనీసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా లేకుండా మూడో విడతను నిర్వహిస్తోంది. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకొని వారిని ఆదుకోవాలన్న సంకల్పంతో 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం దీనికి బ్రేక్ పడింది. 2011 ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి విడత రచ్చబండను గ్రామస్థాయిలో నిర్వహించింది. వైఎస్ పథకాలు సక్రమంగా అమలు కాకపోవడంతో అప్పట్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అదే ఏడాది నవంబర్‌లో నిర్వహించిన రచ్చబండ-2ను మండల కేంద్రాలకే పరిమితం చేసింది. మునుపటిలా ఇప్పుడూ వ్యతిరేకత ఉంటుందన్న భయంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేవలం లబ్ధిదారులను మినహా మిగిలిన వారిని సమావేశాలకు రానీయకుండా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు భీమిలిలో జరిగే సమావేశానికి రాష్ట్ర ఓడరేవులు, పెట్టుబడులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అలాగే రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు ఉదయం పాడేరులోను, మధ్యాహ్నం హుకుంపేటలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. పథకాలు పంపిణీ 2010లో జరిగిన రచ్చబండలో రేషన్‌కార్డులు, పించన్లు, ఇళ్ల కోసం వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాటితో పాటు ప్రజావాణి, ఇతరత్రా కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలతో లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేశారు. వారందరికీ ముందుగా స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. కేవలం వారినే సమావేశాలకు తీసుకొచ్చే బాధ్యతను అధికారులు భుజాన్నెత్తుకున్నారు. దీని ప్రకారం జిల్లాలో 1,37,201 మందికి రేషన్‌కార్డులు, 31,841 మందికి పెన్షన్లు, 37,228 మందికి ఇళ్లు రానున్నాయి. వీటన్నింటినీ ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు జరిగే రచ్చబండ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో అందజేయనున్నారు. బంగారుతల్లి పథకంలో ఎంపిక చేసిన 1067 మందికి రూ.26.77 లక్షలను బాండ్ల రూపంలో పంపిణీ చేయనున్నారు. హాస్టళ్లకు శంకుస్థాపన ఇవన్నీ కాకుండా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ కింద ఎస్సీ, ఎస్టీల కోసం కమ్యూనిటీ హాళ్లు, హాస్టళ్లు నిర్మిస్తున్నారు. వాటికి రచ్చబండ కార్యక్రమంలోనే శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో 8 హాస్టళ్లకు రూ.1.48 కోట్లు, 10 కమ్యూనిటీ హాళ్లకు రూ.75 లక్షలతో నిర్మాణాలను ప్రారంభించనున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.37.82 కోట్లతో 925 రోడ్ల నిర్మాణాలకూ రచ్చబండలోనే శ్రీకారం చుట్టనున్నారు. -
క్రికెట్ మ్యాచ్‌కు మంత్రుల ఆధిపత్య పోరు షాక్
=క్రికెట్ మ్యాచ్‌ను అడ్డుకుంటామన్న గంటా =జరిపి తీరుతామన్న బాలరాజు =వన్డే క్రికెట్‌పై నీలినీడలు =రచ్చబండ కూ మంత్రుల రచ్చ =పది నిమిషాల వ్యవధిలోనే రెండు సమీక్షలు విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : జిల్లాకు చెందిన ఇద్దరు అమాత్యుల ఆధిపత్య పోరు చివరకు క్రికెట్ మ్యాచ్‌నూ తాకింది. మ్యాచ్ జరపొద్దంటూ బీసీసీఐ (భార త క్రికెట్ నియంత్రణ మండలి)కి లేఖ రాయాలని మంత్రి గంటా కలెక్టరుపై ఒత్తిడి తెస్తున్నారు. సమైక్యవాదులంతా మ్యాచ్‌ను అడ్డుకుంటారంటూ సాక్ష్యాత్తూ మంత్రివర్యులే బీసీసీఐ ప్రతినిధులకు హెచ్చరికలు పంపడంతో పాటు బహిరంగంగానూ వెల్లడించారు. తన రాజకీయ ప్రత్యర్థి మ్యాచ్ జరగదని చెబితే తాను మౌనంగా ఉంటే ఎలా అనే రీతిలో మం త్రి బాలరాజు ఆరు నూరైనా మ్యాచ్ జరిగి తీరుతుందని ప్రకటించారు. మ్యాచ్ రద్దు చే యాలని బీసీసీఐకి లేఖ రాయాల్సిన అవసరం లేదని ఆయన కలెక్టరు మీద ఒత్తిడి తెచ్చారు. మ్యాచ్‌ను అడ్డుకుంటే విశాఖ ఖ్యాతిని దిగజార్చిన వారవుతారని పరోక్షంగా గంటాపై మీద విమర్శల బాణాలు సంధించారు. ఒకరు అవునంటే మరొకరు కాదని పట్టుబడుతుండంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకున్నారు. ప్రపంచం మొత్తం చూసే క్రికెట్ మ్యాచ్‌ను కూడా ఇద్దరు మంత్రులు ఓట్ల ప్రాతి పదిక యుద్ధంలా తయారు చేయడం పట్ల క్రికెట్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. మ్యా చ్ నిర్వహణపై అడుగు ముందుకేయాలా? వెనక్కు వేయాలా? అనే విషయాన్ని జిల్లా యంత్రాంగం తేల్చుకోలేక సతమతమవుతోంది. ‘రచ్చ’బండ : రాష్ట్ర విభజన సెగ నుంచి బయటపడటం కోసం ప్రభుత్వం ఈ నెల 11 నుంచి 26 వరకు రచ్చబండ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని ఎత్తుగడ వేసింది. పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇతర దరఖాస్తుల బూజు దులపాలని, కొత్త దరఖాస్తులను కూడా జోడించాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. రచ్చ బండను రచ్చ లేకుండా ఎలా నిర్వహించాలంటూ కలెక్టరు సాల్మన్ ఆరోఖ్యరాజ్ వారం రోజులుగా కుస్తీ పడుతున్నారు. అధికారుల బాధలు అధికారులు పడుతుంటే మంత్రులిద్దరూ ఇక్కడ కూడా మేమున్నామంటూ ముందుకొచ్చారు. గురువారం ఉదయం 10 గంటలకు మంత్రి గంటా తన మద్దతు ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, యు.వి.రమణమూర్తిరాజుతో కలసి సర్క్యూట్ హౌస్‌లో కలెక్టరు ఆరోఖ్యరాజ్, జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ, ఎస్పీ విక్రం జిత్ దుగ్గల్, ఇతర అధికారులతో రచ్చబండ నిర్వహణపై సమీక్ష జరిపారు. భీమిలిలో 11న రచ్చబండ-3 ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తన వర్గ ఎమ్మెల్యేలు సూచించిన పనులన్నీ రచ్చబండలో పూర్తి చేసేలా సూచనలు ఇచ్చారు. ఇదే సమయంలో సర్క్యూట్‌హౌస్‌కు చేరుకున్న మంత్రి బాలరాజు మరో గదిలో వేచి ఉండి గంటా, ఆయన వర్గ ఎమ్మెల్యేలు వెళ్లిన పది నిముషాలకు అధికారులతో అక్కడే మరో సమీక్ష జరిపారు. రచ్చబండ నిర్వహణపై ఆయన కూడా కొన్ని సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. తొలి సమీక్షలో చెప్పిన ఏర్పాట్ల వివరాలనే అధికారులు మంత్రి బాలరాజుకు మరోసారి వివరించారు. -
విశాఖ వన్డేకు ‘గంటా’ గండం
-
మళ్లీ డుమ్మా కొట్టిన బాలరాజు
విశాఖ : వరద ప్రాంతాల పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనకు మంత్రి బాలరాజు మళ్లీ డుమ్మా కొట్టారు. ముఖ్యమంత్రి గురువారం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నా.... కిరణ్ తనను పట్టించుకోవటం లేదనే ఆగ్రహంతో ఉన్న ఆయన రెండు రోజు కూడా పర్యటనకు దూరంగా ఉన్నారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో అధిష్టానం వద్ద విధేయుడిగా ముద్ర పడేందుకే బాలరాజు ప్రాధాన్యత ఇచ్చినట్లు అయ్యింది. జిల్లా పాలనా, రాజకీయ వ్యవహారాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు విలువ లేకుండా చేస్తున్నారని ...బాలరాజు చాలాకాలంగా కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతేకాకుండా ఇద్దరు మంత్రులకు సమాన విలువ, ప్రాధాన్యత ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి కూడా గంటాకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారని పలుమార్లు బాలరాజు తన మనసులోని మాటను బయటపెట్టారు కూడా. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమం రావటం సీఎంతో పాటు మంత్రి గంటా కూడా పార్టీ హైకమాండ్ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తుండటాన్ని తాను అవకాశంగా మార్చుకోవడానికి ఆయన వ్యూహ రచన చేశారు. ఎవరు ఎటుపోయినా తాను మాత్రం పార్టీ హైకమాండ్ వద్ద విధేయుడిగా మార్కులు వేయించుకోని జిల్లా పార్టీలో చక్రం తిప్పేందుకు బాలరాజు పావులు కదుపుతున్నారు. సీఎంతో పాటు మంత్రి గంటాతో అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే ఈనెల 20న జరిగిన ముఖ్యమంత్రి పర్యటనకు బాలరాజు డుమ్మా కొట్టారు. అయితే సీఎం పర్యటనకు సంబంధించిన సమాచారం కూడా లేనందువల్లే హాజరు కాలేదని చెప్పుకోవటం విశేషం. -
బాలరాజుకు కన్నీటి వీడ్కోలు
అబిడ్స్/జియాగూడ, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో ఆదివారం మృతిచెందిన ‘సాక్షి’ విలేకరి దర్పల్లి బాలరాజుకు సోమవారం పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. జియాగూడలోని ఆయన నివాసంలో ఉంచిన భౌతిక కాయానికి పాత్రికేయులు, సన్నిహితులు నివాళులు అర్పించి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకు ముందు ఉదయం ఉస్మానియా ఆసుపత్రిలో బాల రాజు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు బి.జనార్దన్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాజేంద్రనగర్ మండలం అధ్యక్షడు అన్నపురెడ్డి భీమార్జునరెడ్డి, నార్సింగ్ గ్రామాధ్యక్షుడు స్వామి, సురేష్, రవీందర్, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, ఎం.జైపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు మిత్రకృష్ణ, బీజేపీ గ్రేటర్ నాయకులు దేవర కరుణాకర్, నాయకులు కాచిప్రకాష్, ముల్లె భిక్షపతి, రాష్ట్ర వీహెచ్‌పీ ప్రముఖ్ యమన్‌సింగ్ తదితరులు బాలరాజు భార్య, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాత్రికేయుల నివాళి.. ‘సాక్షి’ పాత్రికేయులతో పాటు పలు దినపత్రికలు, ఎల క్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, ఏపీడబ్ల్యుజేఎఫ్ నాయకులు బాల్‌రాజ్ మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘సాక్షి’ సీనియర్ న్యూస్ ఎడిటర్ ఎస్.గుర్నాథ్, సిటీబ్యూరో ఇన్‌ఛార్జి సిరిగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, ‘సాక్షి’ అడ్వర్టైజ్మెంట్ విభాగం ఏజీఎం సంతోష్, డిప్యూటీ మేనేజర్ చలపతిరావు, ఏపీడబ్ల్యుజేఎఫ్ జాతీయ నాయకులు ఆకుల అమరయ్య, హెచ్‌యూజే ఉపాధ్యక్షుడు పిల్లి రామచందర్, విజయానందరావు, ఏపీయూడబ్ల్యుజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్, ఉపాధ్యక్షుడు రంగు వెంకట్, కార్యదర్శి కంచు శ్రీనివాస్ తదితరులు నివాళులర్పిం చారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పురానాపూల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఈనెల 31న ఉదయం 11 గంటలకు నార్సింగ్‌లో సంతాపసభ నిర్వహించనున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాలరాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యదర్శి మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. అధ్వానంగా మారిన రోడ్ల వల్ల జారిపడి తీవ్ర గాయాలపాలై చనిపోయాడు. సోమవారం ఆయన బాలరాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
విలేకరి మృతికి సంతాపం
అంబర్‌పేట,న్యూస్‌లైన్: ‘సాక్షి’ నార్సింగి విలేకరి బాలరాజు మృతి పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతిచెందిన విషయం తెలిసి ‘సాక్షి’ సిటీబ్యూరో ఇంచార్జ్ విజయ్‌కుమార్‌రెడ్డి, ఫొటోవిభాగం ఎడిటర్ ఇంచార్జ్ రవికాంత్‌రెడ్డి, రంగారెడ్డిజిల్లా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం జర్నలిస్టు సంఘం అధృక్షుడు వెంకటేష్ తదితరులు బాలరాజు భౌతికకాయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. వివిధ చానళ్లు, పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఆస్పత్రికి తరలివచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ సంతాపం: రోడ్డు ప్రమాదంలో బాలరాజు మృతిచెందడంపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బసవపున్నయ్య, ప్రధానకార్యదర్శి జి.ఆంజనేయులు, కార్యదర్శి మామిడి సోమయ్య, నేషనల్ కోఆర్డినేటర్ అమరయ్యలు ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు. అతిచిన్న వయస్సులోనే బాలరాజును మృత్యువు కంబళించడంపై తీవ్రదిగ్భ్రాంతికి లోనయ్యారు. మాజీ హోంమంత్రి సంతాపం :రోడ్డు ప్రమాదంలో బాలరాజు దుర్మరణం పాలవడంపై మాజీ హోంమంత్రి సబితారెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. వార్తల సేకరణలో బాలరాజు చురుకుగా ఉండేవారని గుర్తుచేశారు. -
ఇట్లు.. మీ విధేయులు
=సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని గౌరవించాలంటున్న బాలరాజు =సీమాంధ్ర అభివృద్ధికి పోరాడాలంటున్న చిన్నమ్మ =తాజాగా ఇద్దరి నోటా విభజన ఆలాపన విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : ‘కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి బాల రాజుకు ప్రజాభీష్టం కంటే పార్టీ నిర్ణయమే శిరోధార్యమైంది. తాజాగా వీరిద్దరూ కొత్త పల్లవి అందుకున్నారు. విభజన జరిగిపోయిందంటూ ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారు. కాంగ్రె స్ వర్కింగ్ కమిటీ విభజన నిర్ణయం తీసుకోవడానికి ముందు బాలరాజు సమైక్య రాష్ట్రం కోసం త్యాగాలకు సిద్ధమని ప్రకటించారు. తీరా ప్రజలు పట్టుబట్టితే రాజీనామా చేసేదే లేదని మాట మార్చారు. గిట్టని వారు తనను విభజన వాదిగా దుష్ర్పచారం చేస్తున్నారంటూ తెగ బాధపడ్డారు. తన రాజీనామాతో విభజన ఆగదని, తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడించడానికి పదవిలో వుండక తప్పదని మరోసారి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. బుధవారం ఆయన తన వాణి మరోసారి మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా వున్న వారు సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని గౌరవించాలనీ, రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర అభివృద్ధికి అవసరమైన అంశాలపై పోరాడాలని సెలవిచ్చారు. ఏజెన్సీలో ఇప్పటికీ గిరిజనులు సమైక్యాంధ్ర కోసం గట్టిగా పోరాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మంత్రి విభజన అనుకూల ప్రకటన చేయడం ద్వారా తనకు ప్రజల కంటే పార్టీయే ముఖ్యమనే విధంగా వ్యవహరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు సమైక్య వాదుల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్‌కు చెందిన పలువురు శాసనసభ్యులు, నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు పార్టీ ఫిరాయిస్తారనే సంకేతాలు వున్నాయి. భవిష్యత్తులో పార్టీని చేతుల్లోకి తెచ్చుకునే వ్యూహంతోనే బాలరాజు అధిష్టాన విధేయుడిగా ముద్ర వేసుకునే పనిలో పడ్డారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చిన్నమ్మదీ అదే దారి విభజన జరక్కూడదని కోరుకుంటున్నానని ప్రకటించిన కేంద్ర మంత్రి పురందేశ్వరి సైతం బుధవారం విజయవాడలో విభజన అనంతర అంశాల గురించి మాట్లాడారు. రాష్ట్ర విభజనకు నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేశానని ఇటీవల ఆమె ప్రకటించారు. అయితే ఈ రాజీనామాలన్నీ డ్రామాలే అనే విషయం తేలిపోయిన పరంపరలో ‘‘ సీమాంధ్ర ప్రయోజనాల కోసం పోరాడాలి’’ అని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఆమె మనసులోని మాటను చెప్పకనే చెప్పాయి. 2014లో విశాఖ పార్లమెంటు స్థానం నుంచే పోటీకి దిగుతానని మూడు రోజుల కిందట ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పురందేశ్వరి ప్రకటించారు. ఈ స్థానం నుంచి టికెట్ కోసం రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి పోటీ పడుతున్న తరుణంలో రాష్ట్ర విభజన అంశంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుండేట్లుగానే ఆమె వ్యవహరించారు. రాజకీయ ప్రయోజనం ఆశించే ఆమె పార్టీ పట్ల విధేయత చాటుకుంటున్నారనే అభిప్రాయాలు జనంలో వ్యక్తం అవుతున్నాయి. విశాఖ పార్లమెంటు స్థానం పరిధిలోనూ సమైక్య ఉద్యమం రగులుతూనే వున్న సమయంలో ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సొంత పార్టీ వర్గాల్లోనే కలవరం పుట్టించింది. చిన్నమ్మ కూడా విభజనకు జనాన్ని మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదు:మంత్రి బాలరాజు
ఢిల్లీ:తెలంగాణపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోదని మంత్రి బాలరాజు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారన్నారని విమర్శించారు. సీమాంధ్ర ఉద్యమ నేపధ్యంలో మరోమారు మీడియా ముందుకొచ్చిన బాలరాజు కాంగ్రెస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదన్నారు. ఓ వైపు సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నా..తెలంగాణ ఇచ్చిన సమయం మాత్రమే సరైంది కాదంటున్నారన్నారు. కాగా, చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా ఉన్న విషయాన్నిబాలరాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీమాంధ్ర జిల్లాల్లో అవిశ్రాంతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం వరుసగా 55వరోజూ ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఆ ప్రాంత నేతలు ఆందోళనకు గురౌతున్నారు. ఆదివారం సీమాంధ్ర ఉద్యమకారులు ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, వినూత్న నిరసన ప్రదర్శనలతో సమైక్యవాదులు హోరెత్తించారు. విశాఖలో సిక్కులు ై మానవహారం ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో దేవాంగులు విజయనగరం-పాలకొండ రహదారిలో ర్యాలీ చేపట్టి నడిరోడ్డుపైనే వస్త్రాలు నేశారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరక బస్సుయాత్ర చేపట్టారు. నరసన్నపేటలో మెయిన్ రోడ్డును దిగ్బంధించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో సుమారు రెండువేల మంది కొబ్బరి వర్తకులు, ఒలుపు, ఎగుమతి, దిగుమతి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ట గోదావరి వలందరరేవులో మహిళలు జలదీక్ష చేశారు. -
బాలరాజు ఇంటిని ముట్టడించిన ఉద్యోగుల భార్యలు
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్రకు మద్దతుగా తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పాడేరులోని గిరిజన సంక్షేమ మంత్రి బాలరాజు ఇంటిని ఉద్యోగుల భార్యలు ముట్టడించారు. తమ భర్తలు జీతభత్యాలు మానుకుని సమైక్య ఉద్యమంలో పాల్గొంటుంటే సీమాంధ్ర మంత్రులు పదవులు పట్టుకొని వేలాడటం దారుణమని నినాదాలు చేశారు. సుమారు గంట పాటు మంత్రి ఇంటి ముందు బైఠాయించి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. బాలరాజు రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసునాయుడును ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. ఆమదాలవలసలో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతిని ఇంతవరకు ఎందుకు రాజీనామా ఎందుకు చేయలేదని ఉపాధ్యాయులు నిలదీశారు. కర్నూలులో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్‌ను వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు అడ్డుకున్నారు. ఉద్యమం పేరుతో పబ్లిసిటీ జిమ్మిక్కులా? మంత్రి గంటా ఫ్లెక్సీ చించి తొలగించిన ఉద్యమకారులు విశాఖ నగరంలో 55 ఉద్యోగ, ప్రజా సంఘాలు రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమైక్యగర్జనసభకు సమీపంలో మంత్రి గంటాశ్రీనివాసరావు ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటుచేయడంపై ఉద్యోగ,ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఫ్లెక్సీని తక్షణం తొలగించాలని పట్టుబట్టాయి. దీంతో ‘సమైక్య సఖ్యత కోసం కదలివస్తోన్న ప్రజానీకానికి స్వాగతం’ అంటూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ వద్దకు కొందరు యువకులు వెళ్లి వెళ్లి దాన్ని చింపేశారు. వెంటనే అక్కడున్న ఉద్యమకారులు చప్పట్లతో స్వాగతించారు.