అబిడ్స్/జియాగూడ, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో ఆదివారం మృతిచెందిన ‘సాక్షి’ విలేకరి దర్పల్లి బాలరాజుకు సోమవారం పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. జియాగూడలోని ఆయన నివాసంలో ఉంచిన భౌతిక కాయానికి పాత్రికేయులు, సన్నిహితులు నివాళులు అర్పించి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకు ముందు ఉదయం ఉస్మానియా ఆసుపత్రిలో బాల రాజు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు బి.జనార్దన్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాజేంద్రనగర్ మండలం అధ్యక్షడు అన్నపురెడ్డి భీమార్జునరెడ్డి, నార్సింగ్ గ్రామాధ్యక్షుడు స్వామి, సురేష్, రవీందర్, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, ఎం.జైపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు మిత్రకృష్ణ, బీజేపీ గ్రేటర్ నాయకులు దేవర కరుణాకర్, నాయకులు కాచిప్రకాష్, ముల్లె భిక్షపతి, రాష్ట్ర వీహెచ్‌పీ ప్రముఖ్ యమన్‌సింగ్ తదితరులు బాలరాజు భార్య, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పాత్రికేయుల నివాళి..
‘సాక్షి’ పాత్రికేయులతో పాటు పలు దినపత్రికలు, ఎల క్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, ఏపీడబ్ల్యుజేఎఫ్ నాయకులు బాల్‌రాజ్ మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘సాక్షి’ సీనియర్ న్యూస్ ఎడిటర్ ఎస్.గుర్నాథ్, సిటీబ్యూరో ఇన్‌ఛార్జి సిరిగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, ‘సాక్షి’ అడ్వర్‌టైజ్‌మెంట్ విభాగం ఏజీఎం సంతోష్, డిప్యూటీ మేనేజర్ చలపతిరావు, ఏపీడబ్ల్యుజేఎఫ్ జాతీయ నాయకులు ఆకుల అమరయ్య, హెచ్‌యూజే ఉపాధ్యక్షుడు పిల్లి రామచందర్, విజయానందరావు, ఏపీయూడబ్ల్యుజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్, ఉపాధ్యక్షుడు రంగు వెంకట్, కార్యదర్శి కంచు శ్రీనివాస్ తదితరులు నివాళులర్పిం చారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పురానాపూల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా, ఈనెల 31న ఉదయం 11 గంటలకు నార్సింగ్‌లో సంతాపసభ నిర్వహించనున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాలరాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యదర్శి మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. అధ్వానంగా మారిన రోడ్ల వల్ల జారిపడి తీవ్ర గాయాలపాలై చనిపోయాడు. సోమవారం ఆయన బాలరాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
బాలరాజుకు కన్నీటి వీడ్కోలు
Published Tue, Oct 29 2013 5:10 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement