
ఆత్మకూరు(ఎం) (ఆలేరు): యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పెద్ది బాలరాజ్‌గౌడ్(27) బుధవారం ఉదయం ఢిల్లీలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలరాజ్‌గౌడ్ మూడేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నాడు. సంఘటన స్థలం వద్ద బాలరాజ్‌గౌడ్ రాసిన సూసైడ్ నోట్ లభించినట్లు గ్రామస్తులు తెలిపారు. తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడేంత సమస్యలు ఏమీ లేవని తల్లిదండ్రులు బాలనర్సయ్య, యాదమ్మ తెలిపారు