sucied
-
రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామిపై కేసు
ముంబై: ఇద్దరిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్ణబ్ గోస్వామి సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ ఎండీ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి శనివారం ముంబై సమీపంలోని వారి ఫాం హౌస్‌లో ఆత్మహత్య చేసకుని చనిపోయారు. అన్వయ్ సూసైడ్ నోట్ రాస్తూ అర్ణబ్ గోస్వామితోపాటు ఫెరోజ్ షేక్, నితీశ్ సర్దా అనే వ్యక్తులు తనకు రూ. 5.4 కోట్లు చెల్లించాలనీ, కానీ వాళ్లు ఆ డబ్బు ఇవ్వకుండా వేధిస్తూ తమ ఆత్మహత్యలకు కారణమయ్యారని పేర్కొన్నారు. అన్వయ్ ఆరోపణలు అవాస్తవాలంటూ ఆదివారం రిపబ్లిక్ టీవీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఢిల్లీలో యాదాద్రి జిల్లా ఆర్మీ జవాన్ ఆత్మహత్య
ఆత్మకూరు(ఎం) (ఆలేరు): యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పెద్ది బాలరాజ్‌గౌడ్(27) బుధవారం ఉదయం ఢిల్లీలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలరాజ్‌గౌడ్ మూడేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నాడు. సంఘటన స్థలం వద్ద బాలరాజ్‌గౌడ్ రాసిన సూసైడ్ నోట్ లభించినట్లు గ్రామస్తులు తెలిపారు. తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడేంత సమస్యలు ఏమీ లేవని తల్లిదండ్రులు బాలనర్సయ్య, యాదమ్మ తెలిపారు -
రక్తమోడిన రైలు పట్టాలు
వేర్వేరు చోట్ల రైలు కిందపడి ముగ్గురి మృతి కేసముద్రం : జిల్లాలో వేర్వేరుచోట్ల రైలు పట్టాలు రక్తమోడాయి. రైలు కింద పడి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడగా, మరొకరు ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మృతిచెందారు. కేసముద్రం మండలంలోని ధన్నసరి శివారు బిచ్చానాయక్ తండాకు చెందిన బాదావత్ బాలు(43) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మనోవేదనకు గురైన బాలు శుక్రవారం సాయంత్రం ధన్నసరి శివారు కొత్తూరు వద్దనున్న రైల్వేట్రాక్‌పైకి వెళ్లి అప్‌లైన్‌లో(424కిలోమీటర్వద్ద) అటుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య అస్లి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటన స్థలంలో ముక్కలైన మృతదేహన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసముద్రంస్ల్స్టేషన్ సమీపంలోని రైలు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం మృతిచెందినట్లు జీఆర్పీ సీఐ స్వామి తెలిపారు. 40 సంవత్సరాల వయసు గల ఓ వ్యక్తి 420/25మైలు రాయి వద్ద అటుగా వచ్చే రైలు కింద పడి మృతిచెందాడు. మృతదేహం పరీశీలిస్తే మృతుడి నడు ము భాగం నుంచి తల భాగంవరకు కనిపించకుండా పోయింది. కొంతదూరంలో ఓ వ్యక్తి ఫొటో ఉండటం, మృతదేహం పైభాగం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జీఆర్పీ పోలీసులు మాత్రం ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. ప్రమాదవశాత్తు రైలుకింద పడి వ్యక్తి మృతి స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ఓ వ్యక్తి ఘన్పూర్ రైల్వేస్టేషన్లో దిగేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుతప్పి కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు బ్లాక్ ప్యాంట్, బ్లాక్ అండ్ వైట్ షర్ట్ ధరించి ఉన్నాడు. కాజీపేట జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
ఆరెగూడెం(చిట్యాల) మండలంలోని పెద్దకాపర్తి గ్రామ పంచాయతీ పరిధి ఆరేగూడెం గ్రామంలో సోమవారం ఉదయం ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన బల్వరీ సోమనర్సయ్య(50) తొమ్మిదేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం మండలంలోని ఆరేగూడెం గ్రామానికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం కొంత అప్పు చేసి గ్రామంలోనే ఇంటిని నిర్మించుకుని, మూడెకరాల వ్వవసాయ భూమిని కొనుగోలు చేసి వ్వవసాయం చేసుకుంటున్నాడు. ఇటీవల పొలంలో బోరు వేయగా నీరు పడలేదు. దీనికి తోడు గతంలో చేసిన సుమారు ఐదు లక్షల అప్పులతో ఇబ్బందులు పడుతూ మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం తన వ్వవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. గుర్తించిన స్థానికులు సోమనర్సయ్యను అస్పత్రికి తరలించే లోపు మృతిచెందాడు. మృతుడికి భార్య, వివాహం అయిన కూతురు, కుమారుడు ఉన్నారు.