- వేర్వేరు చోట్ల రైలు కిందపడి ముగ్గురి మృతి
రక్తమోడిన రైలు పట్టాలు
Published Sat, Sep 10 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
కేసముద్రం : జిల్లాలో వేర్వేరుచోట్ల రైలు పట్టాలు రక్తమోడాయి. రైలు కింద పడి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడగా, మరొకరు ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మృతిచెందారు. కేసముద్రం మండలంలోని ధన్నసరి శివారు బిచ్చానాయక్ తండాకు చెందిన బాదావత్ బాలు(43) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మనోవేదనకు గురైన బాలు శుక్రవారం సాయంత్రం ధన్నసరి శివారు కొత్తూరు వద్దనున్న రైల్వేట్రాక్‌పైకి వెళ్లి అప్‌లైన్‌లో(424కిలోమీటర్‌వద్ద) అటుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య అస్లి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటన స్థలంలో ముక్కలైన మృతదేహన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కేసముద్రంస్ల్స్టేషన్ సమీపంలోని రైలు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం మృతిచెందినట్లు జీఆర్‌పీ సీఐ స్వామి తెలిపారు. 40 సంవత్సరాల వయసు గల ఓ వ్యక్తి 420/25మైలు రాయి వద్ద అటుగా వచ్చే రైలు కింద పడి మృతిచెందాడు. మృతదేహం పరీశీలిస్తే మృతుడి నడు ము భాగం నుంచి తల భాగంవరకు కనిపించకుండా పోయింది. కొంతదూరంలో ఓ వ్యక్తి ఫొటో ఉండటం, మృతదేహం పైభాగం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జీఆర్పీ పోలీసులు మాత్రం ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు.
ప్రమాదవశాత్తు రైలుకింద పడి వ్యక్తి మృతి
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ఓ వ్యక్తి ఘన్‌పూర్ రైల్వేస్టేషన్‌లో దిగేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుతప్పి కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు బ్లాక్ ప్యాంట్, బ్లాక్ అండ్ వైట్ షర్ట్ ధరించి ఉన్నాడు. కాజీపేట జీఆర్‌పీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement