Rail tracks
-
తెలివైన కుక్క.. ప్రమాదంలో యాజమాని.. ప్లీజ్ ఫాలో మీ అంటూ..
కుక్కలు విశ్వాసం గలివి అని అందరికి తెలుసు. అవి మనుషుల కంటే కూడా గొప్ప నమ్మకాన్నిస్తాయి అనడంలో సందేహం లేదు. అందువల్లే కాబోలు చాలామంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇక్కడొక కుక్క తన యజమాని కారుకి యాక్సిడెంట్ అయితే అది ఎంత తెలివిగా వ్యవహరించి తన యజమానిని కాపాడుకుందో చూడండి. (చదవండి: ఆర్డర్ ఆలస్యమైందని మరీ ఇంత దారుణంగా కొట్టాలా!) అసలు విషయంలోకెళ్లితే....న్యూ హాంప్‌షైర్‌లోని షెపర్డ్ జాతికి చెందిన టిన్స్లీ అనే కుక్క న్యూహాప్షైర్, వెర్మోంట్ సరిహద్దు ప్రాంతంలో తన యజమాని కారుకి ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. దీంతో ఆ కుక్క ఒక్కసారిగా హైవే పై పరుగెడుతుంది. ఈ మేరకు అది వాహనదారులన, హైవే పై ఉండే ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తుంది. దీంతో పోలీసులు ఆ కుక్కున పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎటో చూపిస్తు పరిగెడుతుంది. అంతే పోలీసులు కాస్త అనుమానం కలిగి అది చూపి స్తున్నా వైపుగా పరిగెడతారు. అయితే అది వెర్మోంట్ ప్రాంతంలోకి తీసుకువెళ్లింది. అక్కడ రైల్వే పట్టాలపై బోల్తా పడి ఉన్న కారు కనిపించింది. అంతేకాదు అప్పటికే అక్కడ ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఆ వ్యక్తులలో ఒకరు కుక్క యజమాని కామ్ లాండ్రీ. దీంతో పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ క్కుక్క మాత్రం పోలీసులు వచ్చి రెస్క్యూ చర్యలు ప్రారంభించడంతో తన యజమాని లాండ్రీ పక్కన ప్రశాంతంగా కుర్చుంది. పోలీసు అధికారి బాల్దాస్రే మాట్లాడుతూ...ఆ కుక్క హైవేపై ఏదో చూపిస్తున్నట్లుగా పరిగెడుతుంటే అనుమానం వచ్చి అనుసరిస్తూ వెళ్లాం. ఇది నిజంగా చాలా తెలివిగా మమ్మల్నీ తన యజమాని వద్దకు తీసుకువెళ్లటమే కాక ఆయన ప్రాణాలను కాపాడుకుందంటూ ప్రశంసించారు. (చదవండి: భయంకరమైన భారీ పీత!.. గోల్ఫ్ స్టిక్‌ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!) -
పట్టాలెక్కనున్న ఫైవ్ స్టార్ హోటల్.. దేశంలో తొలిసారి ఇలా
గాంధీనగర్: దేశంలో తొలిసారిగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ రైలు పట్టాలెక్కబోతుంది. ఫైవ్ స్టార్ హోటల్ రైలు పట్టాలెక్కడమేంటి అని ఆలోచిస్తున్నారు. అయితే ఇది చదవండి. గుజరాత్‌లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్‌ను భారత రైల్వేశాఖ కొత్త హంగులతో సుందరీకరిస్తుంది. ఇందులో భాగంగా ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ను పట్టాలపై నిర్మించాలని ఓ వినూత్న ఆలోచన చేసింది. దేశంలో తొట్టతొలిసారి నిర్మించ తలపెట్టిన ఇలాంటి ప్రాజెక్ట్‌ను భారతీయ రైల్వేస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మిస్తుంది. ఈ ఫైవ్ స్టార్ హోటల్‌ను లీలా గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాల సమాచారం. మూడు టవర్లుగా నిర్మించే ఈ హోటల్లో మొత్తం 300 గదులు ఉండనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. ఈ ఐదు నక్షత్రాల హోటల్ కింద రైళ్లు తిరుగుతున్నా ఎలాంటి ప్రకంపనలు కానీ శబ్దాలు కానీ హోటల్లో ఉన్న వారికి వినిపించకుండా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. నిజానికి అంతర్జాతీయంగా ఇలాంటి ప్రాజెక్టులు సాధారణమే అయినా.. భారత్‌లో మాత్రం రైలు పట్టాలపై ఇదే తొలి ఫైవ్ స్టార్ హోటల్ అని వెల్లడించారు. దీని నిర్మాణానికి రెండేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు. -
అదృష్టంతో బతికిపోయింది..!
హాంగ్‌కాంగ్ : ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఇది. క్షణకాలం పాటు శరీరం భయంతో కంపించిపోయే సంఘటన. పొరపాటున అటుగా రైలు వచ్చుంటే.. అన్న మాట తలపుకు వస్తేనే కాళ్ల కింద భూకంపం వచ్చే భయానక సన్నివేశం హాంగ్‌కాంగ్‌లో జరిగింది. హాంగ్‌కాంగ్‌లోని యెన్లాంగ్ మెట్రో స్టేషన్లో రైలు కోసం ఒక యువతి ఎదురు చూస్తోంది. రైలు రావడానికి ఇంకా సమయం ఉండడంతో ఆమె అటుఇటు తిరుగుతూ.. అటువైపున ఉన్న మిత్రులకు హాయ్ చెబుతోంది. ఇంతలో ఒక వ్యక్తి.. ఆమెను వెనక నుంచి హఠాత్తుగా రైల్వే ట్రాక్‌మీదకు తోసేసి.. తనకు ఏమీ తెలియనట్లు వెళ్లిపోయాడు. ట్రాక్ మీద పడ్డ యువతి.. తనకు ఏం జరిగింది? ఎందుకిలా పడ్డాను? అని అనుకుంటూ.. అటుగా వెళ్తున్న వ్యక్తిని గట్టిగా తిడుతోంది. ఆమె అదృష్టం బాగుండి.. అప్పటికే అటు రావాల్సిన రైలు ఆలస్యం కావడంతో ప్రాణాలతో బతికిపోయింది. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ కావడంతో.. నిందితుడిని కొద్ది సేపటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం నేరం కింద అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకూ 3 లక్షల మందిదాకా చూశారు. -
అదృష్టంతో బతికిపోయింది..!
-
రక్తమోడిన రైలు పట్టాలు
వేర్వేరు చోట్ల రైలు కిందపడి ముగ్గురి మృతి కేసముద్రం : జిల్లాలో వేర్వేరుచోట్ల రైలు పట్టాలు రక్తమోడాయి. రైలు కింద పడి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడగా, మరొకరు ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మృతిచెందారు. కేసముద్రం మండలంలోని ధన్నసరి శివారు బిచ్చానాయక్ తండాకు చెందిన బాదావత్ బాలు(43) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మనోవేదనకు గురైన బాలు శుక్రవారం సాయంత్రం ధన్నసరి శివారు కొత్తూరు వద్దనున్న రైల్వేట్రాక్‌పైకి వెళ్లి అప్‌లైన్‌లో(424కిలోమీటర్వద్ద) అటుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య అస్లి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటన స్థలంలో ముక్కలైన మృతదేహన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసముద్రంస్ల్స్టేషన్ సమీపంలోని రైలు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం మృతిచెందినట్లు జీఆర్పీ సీఐ స్వామి తెలిపారు. 40 సంవత్సరాల వయసు గల ఓ వ్యక్తి 420/25మైలు రాయి వద్ద అటుగా వచ్చే రైలు కింద పడి మృతిచెందాడు. మృతదేహం పరీశీలిస్తే మృతుడి నడు ము భాగం నుంచి తల భాగంవరకు కనిపించకుండా పోయింది. కొంతదూరంలో ఓ వ్యక్తి ఫొటో ఉండటం, మృతదేహం పైభాగం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జీఆర్పీ పోలీసులు మాత్రం ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. ప్రమాదవశాత్తు రైలుకింద పడి వ్యక్తి మృతి స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ఓ వ్యక్తి ఘన్పూర్ రైల్వేస్టేషన్లో దిగేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుతప్పి కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు బ్లాక్ ప్యాంట్, బ్లాక్ అండ్ వైట్ షర్ట్ ధరించి ఉన్నాడు. కాజీపేట జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు పట్టాలు దాటుతుండగా ఇద్దరి మృతి
డోర్నకల్ : ఈ నెల 2న మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాడుతుండగా రైలు ఢీకొని గాయాలపాలైన గుర్తు తెలియని వృద్ధుడు(60) చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. డోర్నకల్ జీఆర్పీ ఎస్ఐ పెండ్యాల దేవేందర్ శనివారం ఈవిషయాన్ని తెలిపారు. తీవ్ర గాయాలతో ఉండగా అతన్ని ఎంజీఎంకు తరలించగా, అక్కడ చికిత్సపొందు తూ మృతిచెందాడన్నారు. మృతదేహాన్ని ఎంజీ ఎం మార్చురీలో భద్రపరిచామన్నారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలిస్తే డోర్నకల్ జీఆర్పీలో సంప్రదించాలన్నారు. బుగ్గవాగు సమీపంలో.. డోర్నకల్ : మండలంలోని బుగ్గవాగు సమీపంలో శనివారం పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని మరో వృద్ధుడు(65) మృతిచెందినట్లు డోర్నకల్ జీఆర్పీ ఎస్ఐ పెం డ్యాల దేవేందర్ తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ సురేష్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించా రు. సంబంధీకులు ఎవరైనా ఉంటే సంప్ర దించాలన్నారు. -
రైలుపట్టాలపై కూలిన ప్రహరీ
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై రక్షణ గోడ కూలి పడింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద ఉన్న రక్షణ గోడ బాగా నానడంతో సోమవారం అర్థరాత్రి ఆ గోడ దాదాపు 400 మీటర్ల మేర కూలి పట్టాలపై పడింది. దీంతో అధికారులు ఆ ప్లాట్‌ఫాంపైకి రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. గూడ్స్ రైళ్లు మాత్రమే ఆ ప్లాట్‌ఫాంపైకి వస్తాయి. -
ఎండవేడికి కరిగిన రైలు పట్టాలు!
కేసముద్రం: ఎండ తీవ్రతకు రైలు పట్టాలు మెత్తబడి ఆరుచోట్ల గుంతలు పడిన ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపం లో గురువారం చోటుచేసుకుంది. కేసముద్రం స్టేషన్ నుంచి డౌన్‌లైన్‌లో ఎండతీవ్రతకు ట్రాక్‌పై రెండు పట్టాలకు 1.90 సెంటీమీటర్ల దూరం చొప్పున ఆరుచోట్ల మెత్తబడి పట్టాకు ఉన్న ఇనుపపట్టీలు కరిగి లేచిపోయూరుు. మరికొన్ని చోట్ల మెత్తబడి గుంతలా మారి పట్టా వెడల్పు అరుుంది. 25 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గూడ్సు రైలు చక్రాలు ఆ పట్టాపై ఏర్పడిన లోతుభాగంలో(గుంతలుగా) ఇరుక్కుపోయి అక్కడే తిరుగుతూ ఉండిపోయాయి. డ్రైవర్ గమనించి స్థానిక రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత వచ్చిన రైళ్లను సిబ్బంది నెమ్మదిగా పట్టాలను దాటించారు. -
ఎక్కడి రైళ్లు అక్కడే
నెల్లూరు (నవాబుపేట), న్యూస్‌లైన్ : మనుబోలు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రెండో రోజూ శుక్రవారం కూడా వివిధ రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడిస్తే.. మరి కొన్ని రైళ్లను శుక్రవారం రద్దు చేశారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులు రైళ్లల్లో నిరీక్షించి నానా అగచాట్లు పడితే.. వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి రైల్వేస్టేషన్లకు చేరుకున్న స్థానిక ప్రయాణికులు అవస్థ పడ్డారు. చత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడుకు వెళుతున్న ఓ గూడ్స్ రైలు మనుబోలు వద్ద (అప్‌లైన్‌లో) పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. క్రాసింగ్ పాయింట్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ప్రమాద తీవ్రతకు 11 వ్యాగన్లు చెల్లాచెదురుగా పడటంతో డౌన్‌లైన్ మార్గం కూడా దెబ్బతినింది. సంఘటన స్థలం లో విద్యుత్ మాస్ట్‌లు కూడా దెబ్బతినడంతో రెండు మార్గాల్లో రైళ్ల రాకపోకల కు అంతరాయం ఏర్పడింది. అప్‌లైన్ ను వెంటనే పునరుద్ధరించే అవకాశం లేకపోవడంతో డౌన్‌లైన్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టి రెండు వైపుల నడిచే రైళ్లను ఆ లైన్లో నడుపుతున్నా రు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యం గా నడుస్తున్నాయి. గురువారం సా యంత్రం ఈ ప్రమాదం జరగడంతో అ ప్పటికే చెన్నై నుంచి బయలుదేరిన చా ర్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను తడ వద్ద, షాలి మార్ ఎక్స్‌ప్రెస్‌ను సూళ్లూరుపేట వద్ద, హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను నాయుడుపే ట వద్ద, తిరుపతి వైపు నుంచి వస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌ను శ్రీకాళహస్తి వద్ద, విజయవాడ నుంచి బయలుదేరిన జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను కావలి వద్ద, కృష్ణా ఎక్ప్‌ప్రెస్‌ను తెట్టు వద్ద నిలిపివేశారు. పలు రైళ్ల రద్దు, పలు రైళ్లు ఆలస్యం శుక్రవారం గూడూరు-విజయవాడ, తి రుపతి-గుంటూరు, బిట్రగుంట- విజ యవాడ, నెల్లూరు-తిరుపతి, నెల్లూరు- చెన్నై (మెమూ) అన్ని ప్యాసింజర్ రైళ్లతో పాటు జనశతాబ్ది, పినాకిని ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. గురువారం రా త్రి 9.30 గంటలకు గూడూరు నుంచి బయలుదేరాల్సిన సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను 1.30 గంటలకు స్పెషల్ ట్రైన్ గా నడిపారు. హైదరాబాద్ నుంచి బ యలుదేరిన రైళ్లలో నెల్లూరుకు శుక్రవా రం తెల్లవారు జామున 2.58 గంటలకు రావాల్సిన నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.30 గంటలకు, తెల్లవారుజామున 4.24 గంటలకు రావాల్సిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11 గం టలకు, తెల్లవారుజామున 5.30 గంట లకు రావాల్సిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 8.15 గంటలకు, త్రివేండ్రం నుంచి ఉదయం 6.25 గంటలకు రా వాల్సిన కేకే ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5.30 గంటలకు, తిరుపతి నుంచి మధ్యాహ్నం 1.32 నిమిషాలకు రావాల్సిన పూరి ఎక్స్‌ప్రెస్ రాత్రి 8.30 గం టలకు, ఉదయం 8.11 గంటలకు రావాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ రాత్రి 8.30 గంటలకు వచ్చాయి. రైళ్లు గంటల కొద్ది రైళ్లు ఆలస్యంగా నడవటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం రాత్రి కల్లా ట్రాక్ మరమ్మతులు పూర్తయే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే రైళ్ల సమాచారం వివరించేందుకు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ మేనేజర్ ఎస్కే షాజహాన్ ప్రయాణికులకు, మీడియాకు అందుబాటులో లేకుండా పోయారు. మీడియా వారు ఫోన్ చేసినప్పటికీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. రైలు ప్రమాదం జరిగిప్పటి నుంచి ఇదే పరిస్థితి. స్టేషన్‌పై దాడికి ప్రయాణికుల యత్నం నాయుడుపేటటౌన్: మనుబోలు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో నాయుడుపేట రైల్వేస్టేషన్లో శుక్రవారం పలు రైళ్లు గంటల కొద్దీ నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారుల నుంచి సరైన స్పందన కరువడంతో ప్రయాణికులు ఆగ్రహంతో స్టేషన్‌లోని పర్నీచర్ ధ్వంసం చేసేందుకు యత్నించారు. చెన్నై నుంచి విజయవాడ వెళుతున్న జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో నిలిపివేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రైలు నడుస్తుందని చెప్పడంతో ప్రయాణికులు పడిగాపులు కాశారు. అయితే సాయంత్రం 5 గంటలు దాటినా రైలు కదల్లేదు. రైల్వే అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం లేదు. దీంతో ప్రయాణికులు తాగునీటికి, భోజన వసతికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు రైలులో ఏసీలు పని చేయకపోవడంతో బోగీల్లోని ప్రయాణికులు స్టేషన్ ఆరుబయటకు చేరుకున్నారు. చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు ఎండ వేడిమితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు రైలు ఎప్పుడు కదలుతుందంటూ ఎస్ఎస్ వెంకటరమణారెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఎస్ఎస్తో పాటు పలువురు స్టేషన్ మాస్టర్లు మండల్, రంజిత్, టీసీ ఖాజారంతుల్లాలు కలుగజేసుకుని సర్దిచెప్పారు. అప్పటికీ ప్రయాణికులు శాం తించకపోవడంతో స్థానిక ఎస్సై అంజనేయరెడ్డి స్టేషన్‌కు చేరుకుని ప్రయాణికులతో మాట్లాడారు. గంటల తరబడి రైలు నిలిపివేయడమే కాకుం డా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ డంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బాసర ట్రిపుల్ ఐటిలో విషాదం