కుక్కలు విశ్వాసం గలివి అని అందరికి తెలుసు. అవి మనుషుల కంటే కూడా గొప్ప నమ్మకాన్నిస్తాయి అనడంలో సందేహం లేదు. అందువల్లే కాబోలు చాలామంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇక్కడొక కుక్క తన యజమాని కారుకి యాక్సిడెంట్ అయితే అది ఎంత తెలివిగా వ్యవహరించి తన యజమానిని కాపాడుకుందో చూడండి.
(చదవండి: ఆర్డర్ ఆలస్యమైందని మరీ ఇంత దారుణంగా కొట్టాలా!)
అసలు విషయంలోకెళ్లితే....న్యూ హాంప్‌షైర్‌లోని షెపర్డ్ జాతికి చెందిన టిన్‌స్లీ అనే కుక్క న్యూహాప్‌షైర్, వెర్మోంట్ సరిహద్దు ప్రాంతంలో తన యజమాని కారుకి ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. దీంతో ఆ కుక్క ఒక్కసారిగా హైవే పై పరుగెడుతుంది. ఈ మేరకు అది వాహనదారులన, హైవే పై ఉండే ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తుంది. దీంతో పోలీసులు ఆ కుక్కున పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎటో చూపిస్తు పరిగెడుతుంది. అంతే పోలీసులు కాస్త అనుమానం కలిగి అది చూపి స్తున్నా వైపుగా పరిగెడతారు. అయితే అది వెర్మోంట్ ప్రాంతంలోకి తీసుకువెళ్లింది.
అక్కడ రైల్వే పట్టాలపై బోల్తా పడి ఉన్న కారు కనిపించింది. అంతేకాదు అప్పటికే అక్కడ ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఆ వ్యక్తులలో ఒకరు కుక్క యజమాని కామ్ లాండ్రీ. దీంతో పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ క్కుక్క మాత్రం పోలీసులు వచ్చి రెస్క్యూ చర్యలు ప్రారంభించడంతో తన యజమాని లాండ్రీ పక్కన ప్రశాంతంగా కుర్చుంది. పోలీసు అధికారి బాల్దాస్రే మాట్లాడుతూ...ఆ కుక్క హైవేపై ఏదో చూపిస్తున్నట్లుగా పరిగెడుతుంటే అనుమానం వచ్చి అనుసరిస్తూ వెళ్లాం. ఇది నిజంగా చాలా తెలివిగా మమ్మల్నీ తన యజమాని వద్దకు తీసుకువెళ్లటమే కాక ఆయన ప్రాణాలను కాపాడుకుందంటూ ప్రశంసించారు.
(చదవండి: భయంకరమైన భారీ పీత!.. గోల్ఫ్ స్టిక్‌ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!)
Comments
Please login to add a commentAdd a comment