నెల్లూరు (నవాబుపేట), న్యూస్‌లైన్ : మనుబోలు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రెండో రోజూ శుక్రవారం కూడా వివిధ రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడిస్తే.. మరి కొన్ని రైళ్లను శుక్రవారం రద్దు చేశారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులు రైళ్లల్లో నిరీక్షించి నానా అగచాట్లు పడితే.. వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి రైల్వేస్టేషన్లకు చేరుకున్న స్థానిక ప్రయాణికులు అవస్థ పడ్డారు.
చత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడుకు వెళుతున్న ఓ గూడ్స్ రైలు మనుబోలు వద్ద (అప్‌లైన్‌లో) పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. క్రాసింగ్ పాయింట్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ప్రమాద తీవ్రతకు 11 వ్యాగన్లు చెల్లాచెదురుగా పడటంతో డౌన్‌లైన్ మార్గం కూడా దెబ్బతినింది. సంఘటన స్థలం లో విద్యుత్ మాస్ట్‌లు కూడా దెబ్బతినడంతో రెండు మార్గాల్లో రైళ్ల రాకపోకల కు అంతరాయం ఏర్పడింది.
అప్‌లైన్ ను వెంటనే పునరుద్ధరించే అవకాశం లేకపోవడంతో డౌన్‌లైన్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టి రెండు వైపుల నడిచే రైళ్లను ఆ లైన్‌లో నడుపుతున్నా రు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యం గా నడుస్తున్నాయి. గురువారం సా యంత్రం ఈ ప్రమాదం జరగడంతో అ ప్పటికే చెన్నై నుంచి బయలుదేరిన చా ర్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను తడ వద్ద, షాలి మార్ ఎక్స్‌ప్రెస్‌ను సూళ్లూరుపేట వద్ద, హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను నాయుడుపే ట వద్ద, తిరుపతి వైపు నుంచి వస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌ను శ్రీకాళహస్తి వద్ద, విజయవాడ నుంచి బయలుదేరిన జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను కావలి వద్ద, కృష్ణా ఎక్ప్‌ప్రెస్‌ను తెట్టు వద్ద నిలిపివేశారు.
పలు రైళ్ల రద్దు, పలు రైళ్లు ఆలస్యం
శుక్రవారం గూడూరు-విజయవాడ, తి రుపతి-గుంటూరు, బిట్రగుంట- విజ యవాడ, నెల్లూరు-తిరుపతి, నెల్లూరు- చెన్నై (మెమూ) అన్ని ప్యాసింజర్ రైళ్లతో పాటు జనశతాబ్ది, పినాకిని ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. గురువారం రా త్రి 9.30 గంటలకు గూడూరు నుంచి బయలుదేరాల్సిన సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను 1.30 గంటలకు స్పెషల్ ట్రైన్ గా నడిపారు. హైదరాబాద్ నుంచి బ యలుదేరిన రైళ్లలో నెల్లూరుకు శుక్రవా రం తెల్లవారు జామున 2.58 గంటలకు రావాల్సిన నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.30 గంటలకు, తెల్లవారుజామున 4.24 గంటలకు రావాల్సిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11 గం టలకు, తెల్లవారుజామున 5.30 గంట లకు రావాల్సిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 8.15 గంటలకు, త్రివేండ్రం నుంచి ఉదయం 6.25 గంటలకు రా వాల్సిన కేకే ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5.30 గంటలకు, తిరుపతి నుంచి మధ్యాహ్నం 1.32 నిమిషాలకు రావాల్సిన పూరి ఎక్స్‌ప్రెస్ రాత్రి 8.30 గం టలకు, ఉదయం 8.11 గంటలకు రావాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ రాత్రి 8.30 గంటలకు వచ్చాయి.
రైళ్లు గంటల కొద్ది రైళ్లు ఆలస్యంగా నడవటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం రాత్రి కల్లా ట్రాక్ మరమ్మతులు పూర్తయే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే రైళ్ల సమాచారం వివరించేందుకు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ మేనేజర్ ఎస్‌కే షాజహాన్ ప్రయాణికులకు, మీడియాకు అందుబాటులో లేకుండా పోయారు. మీడియా వారు ఫోన్ చేసినప్పటికీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. రైలు ప్రమాదం జరిగిప్పటి నుంచి ఇదే పరిస్థితి.
స్టేషన్‌పై దాడికి
ప్రయాణికుల యత్నం
నాయుడుపేటటౌన్: మనుబోలు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో నాయుడుపేట రైల్వేస్టేషన్‌లో శుక్రవారం పలు రైళ్లు గంటల కొద్దీ నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారుల నుంచి సరైన స్పందన కరువడంతో ప్రయాణికులు ఆగ్రహంతో స్టేషన్‌లోని పర్నీచర్ ధ్వంసం చేసేందుకు యత్నించారు.
చెన్నై నుంచి విజయవాడ వెళుతున్న జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో నిలిపివేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రైలు నడుస్తుందని చెప్పడంతో ప్రయాణికులు పడిగాపులు కాశారు. అయితే సాయంత్రం 5 గంటలు దాటినా రైలు కదల్లేదు. రైల్వే అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం లేదు. దీంతో ప్రయాణికులు తాగునీటికి, భోజన వసతికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు రైలులో ఏసీలు పని చేయకపోవడంతో బోగీల్లోని ప్రయాణికులు స్టేషన్ ఆరుబయటకు చేరుకున్నారు.
చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు ఎండ వేడిమితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు రైలు ఎప్పుడు కదలుతుందంటూ ఎస్‌ఎస్ వెంకటరమణారెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఎస్‌ఎస్‌తో పాటు పలువురు స్టేషన్ మాస్టర్లు మండల్, రంజిత్, టీసీ ఖాజారంతుల్లాలు కలుగజేసుకుని సర్దిచెప్పారు. అప్పటికీ ప్రయాణికులు శాం తించకపోవడంతో స్థానిక ఎస్సై అంజనేయరెడ్డి స్టేషన్‌కు చేరుకుని ప్రయాణికులతో మాట్లాడారు. గంటల తరబడి రైలు నిలిపివేయడమే కాకుం డా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ డంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కడి రైళ్లు అక్కడే
Published Sat, Apr 26 2014 2:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement