నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌లైన్: రైల్వేస్టేషన్‌లో రక్షణ, పారిశుధ్యం, ప్రయాణికుల సేవలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఇలా ఉంటే ఎలా? స్టేషన్ నిర్వహణ రైల్వేశాఖ గర్వపడేలా ఉండాలి..’అని దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రదీప్‌కుమార్ శ్రీవాత్సవ ఆయా విభాగాల అధికారులను సుతిమెత్తంగా మందలించారు. గురువా రం ఆయన ప్రధాన రైల్వేస్టేషన్‌లో గంటకు పై గా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
రైల్వేస్టేషన్ నిర్వహణపై ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక రైలులో నెల్లూరు చేరుకున్న ఆయన మొదట కృష్ణపట్నం పోర్టుకు వెళ్లి పనులను పరిశీలించిన అనంతరం ప్రధాన రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. రైల్వేస్టేషన్‌ను అణువణువునా పరిశీలించారు. స్టేషన్ వెలుపల ముఖద్వారాలు, పార్కింగ్ దగ్గరి నుంచి మొదలైన ఈ తనిఖీల్లో ఆయా విభాగాలకు చెందిన అధికారులకు క్లాసు పీకారు. బుకింగ్ కౌంటర్ల వద్ద ఉన్న బూజును చూసి అసహనం వ్యక్తం చేశారు. టికెట్ ఇష్యూ డిస్‌ప్లే మిషన్ల పనితీరు, వాటిపై వచ్చే అడ్వర్ట్‌టైజ్‌మెంట్‌పై ఆరా తీశా రు. తినుబండారాలు విక్రయించే స్టాల్స్ వద్ద ధరల పట్టికలను పరిశీలించారు. స్టేషన్‌లో గోడలపై ఎక్కడ పడితే అక్కడ అంటించిన పోస్టర్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టర్ల సంబంధీకులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఫ్లాట్‌ఫాంపై ఉన్న టీసీ రూముల ను పరిశీలించారు. టీసీలకు ప్రత్యేకంగా రూము లు అవసరం లేదని రైల్వే శాఖ జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం పర్వాలేదం టూ ముందుకు సాగారు. పక్కనే ఉన్న పబ్లిక్ అ డ్రసింగ్ రూమ్ (అనౌన్స్‌మెంట్‌రూమ్)ను పరి శీలించారు. అడ్డదిడ్డంగా ఉన్న వైర్లు, స్విచ్ బోర్డులను వెంటనే సరి చేసుకోవాలని తెలియదాని మండిపడ్డారు. ప్రయాణికుల వసతి గదుల్లో మ రుగుదొడ్ల నిర్వహణపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గంధం వెదజల్లుతున్న టా యిలెట్లను రోజూ శుభ్రం చేయరా అని ప్ర శ్నించారు. ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను పరిశీలించారు. అనివార్య కా రణాలతో కూలర్‌ను ఆపివేస్తున్నామన్న నోట్‌ను చూసి అధికారులను ప్రశ్నించారు. కనీసం భో జన వేళల్లో అన్నా చల్లటి నీటిని అందించేందుకు ప్రయత్నించాలన్నారు. రైల్వే క్యాంటీన్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పూరీలు, చిన్న పొ ట్లంలో కర్రీ ఉండడాన్ని ఆయన తప్పు పట్టారు. వేర్వేరు ప్యాకెట్లలో అందజేయాలని సూచిం చారు. క్యాంటీన్‌లోని ఫిర్యాదుల పుస్తకాన్ని పరిశీలించారు. క్యాంటీన్ వద్ద ఉన్న బోర్డుపై వి జయవాడ కార్యాలయం నంబర్లు కూడా వేయాలని సూచించారు. జీఎం అణువణువునా పరిశీ లించి స్థానిక రైల్వే అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. అనంతరం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ కృష్ణపట్నం ట్రాక్ వారంలో వి ద్యుద్దీకరణ ప్రారంభమవుతుందన్నారు. అనంతరం డబ్లింగ్ పనులు చేపడతామన్నారు. ఆ యన వెంట డీఆర్‌ఎం ప్రదీప్‌కుమార్, స్టేషన్ సూపరింటెండెంట్ ఎస్‌కే షాజహాన్ ఉన్నారు.
రక్షణ, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
Published Fri, Dec 13 2013 3:48 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement