
యూపీలో జరుగుతున్న కుంభమేళా నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నప్పటికీ, కొన్ని విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తొలుత ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట, తాజాగా న్యూఢిల్లీలో తొక్కిసలాట.. ఈ రెండూ ఉదంతాలకు అధికారుల వైఫల్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. వీటిపై సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా కుంభమేళాకు వెళుతున్న రైలుకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.
Pakda gya 🐒 (Police Caught a guy who was trying to break the Door of train) pic.twitter.com/NPGHMUXxc6
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 16, 2025
ఆ వీడియోలో కొందరు ప్రయాణికులు స్టేషన్‌కు వచ్చిన రైలు డోర్ లాక్ అయి ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఒక యువకుడు అసహనంతో రగిలిపోతూ, గట్టిగా కొడుతూ, రైలు కోచ్ అద్దాలను పగులగొట్టే ప్రయత్నం చేస్తాడు. దీనిని గమనించిన ఒక రైల్వే పోలీసు ఆ యువకుని షర్టు కాలర్ పట్టుకుని, కొడుతూ లాక్కెళుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను చూసిన కొందరు యూజర్స్ పోలీసుల చర్యను మెచ్చుకుంటున్నారు. అద్దాలు పగులగొట్టేవారిని అలా ఈడ్చుకెళ్లాల్సిందేనంటూ సలహా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: Railway Station Stampede: ప్లాట్‌ఫారం టిక్కెట్ల విక్రయాలు నిలిపివేత
Comments
Please login to add a commentAdd a comment