beating
-
ఢిల్లీ ఎస్సై అత్యుత్సాహం
న్యూఢిల్లీ: శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల వేళ ఉత్తర ఢిల్లీలోని కిక్కిరిసిన రహదారిపై నమాజ్ చేస్తున్న ముస్లింలపై ఒక పోలీస్ అధికారి తన ప్రతాపం చూపించాడు. రోడ్డు దిగ్బంధం చేయొద్దని తిడుతూ వీరావేశంతో కొట్టడం మొదలెట్టాడు. తన్నుతూ అక్కడి వారిని పక్కకు నెట్టడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మసీదు జనంతో నిండిపోవడంతో రోడ్డుపై నమాజ్ చేయాల్సి వచి్చందని కొందరు ఆ సబ్ఇన్స్పెక్టర్ మనోజ్‌కుమార్ తోమర్‌తో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీలోని ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నమాజ్ చేయొద్దని ఒక పోలీసు నెమ్మదిగా వారిస్తుండగా, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో సబ్ఇన్స్పెక్టర్ కొట్టడాన్ని ముస్లింలు తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్సైను సస్పెండ్చేయాలటూ స్థానిక ముస్లింలు రాస్తారోకో చేపట్టారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఆ ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ నార్త్ డెప్యూటీ కమిషనర్ ఎంకే మీనా ఆదేశాలిచ్చారు. -
Air Canada: కుటుంబీకున్ని కొట్టిన బాలుడు... దారి మళ్లిన విమానం
విన్నీపెగ్: ఎయిర్ కెనడా విమానంలో ఓ 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబసభ్యుడిని కొట్టడం ఆ విమానాన్ని దారి మళ్లించేందుకు దారితీసింది. విమానం టొరంటో నుంచి కాల్గరీకి బయలుదేరాక గ్రాండ్ ప్రయరీస్కు చెందిన 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబానికే చెందిన ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. వారి గొడవను విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. గాయపడిన వ్యక్తికి సిబ్బంది చికిత్స అందించారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. అనంతరం విమానాన్ని విన్నీపెగ్కు అధికారులు దారి మళ్లించి, ఆ బాలుడిని అధికారులకు అప్పగించారు. ఇదంతా పూర్తయ్యేవరకు దాదాపు మూడు గంటలపాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచి్చంది. అనంతరం ఆ విమానం గమ్య స్థానం వైపు బయలుదేరిందని ఎయిర్ కెనడా తెలిపింది. -
అమ్మ దెబ్బలు తప్పించుకోవడానికి.. ఐదో ఫ్లోర్ నుంచి దూకి..
చైనాలో దారుణం జరిగింది. అమ్మ దెబ్బలను తప్పించుకోవడానికి ఓ బాలుడు(6) ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ నుంచి దూకేశాడు. బయటకు వెళ్లకూడదని కర్ర పట్టుకుని చివాట్లు పెడుతూ వస్తున్న తల్లిని చూసి పిల్లాడు ఆందోళన చెంది భవనంపై నుంచి దూకాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో తల్లి తన కుమారునితో జీవిస్తోంది. ఆమె భర్త ఉద్యోగ రీత్యా వేరే నగరంలో ఉంటున్నారు. అయితే.. పిల్లాడు అల్లరితో విసుగు తెప్పిస్తున్న క్రమంలో తల్లి తరచుగా చివాట్లు పెడుతుండేది. జూన్ 25న బాలుడు భవనంపై భాగానికి చేరాడు. ఇంటి నుంచి నిరంతరం బయటకు వస్తున్న క్రమంలో తల్లి బాలున్ని మందలించి లోపలికి తీసుకువెళ్లాలని భావించింది. ఓ కర్ర పట్టుకుని చివాట్లు పెడుతూ బాలుని వైపు వచ్చింది. అమ్మ తిడుతుందనే భయంతో బాలుడు ఐదు ఫ్లోర్ల భవనంపై భాగం నుంచి దూకేశాడు. అక్కడే ఉన్నవారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అయితే.. ఈ ఘటనలో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ కాళ్లు, చేతులు విరిగిపోయాయని చైనా మీడియా వెల్లడించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కొందరు నెటిజన్లు ఫైరయ్యారు. పిల్లల రక్షణకు మరిన్ని చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏమైందో తెలియదు.. యువకుని చెంప చెల్లుమనిపించింది.. వీడియో వైరల్ -
కుక్క కంటే మనిషి కరిస్తేనే..ఇంత దారుణంగా ఉంటుందా?
కుక్క కరిస్తే ఎంత ప్రమాదమో అని అందరికీ తెలుసు. అందుకే అది కరిచిన వెంటనే ర్యాబిస్ వ్యాధి రాకుండా ఇంజెక్షన్లు తీసుకుంటాం. కొద్ది రోజులు ఆహార నియమాలు పాటిస్తాం. అయితే కుక్క కాటు కంటే మనిషి కరిస్తేనే అత్యంత ప్రమాదకరమట. ఆ వ్యక్తి కోలుకోవడానికే ఆరు నెలల పడుతుందట. ఔను! ఈ విచిత్ర ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. అసలేం జరిగందంటే..డోని ఆడమ్స్ ఫిబ్రవరిలో టంపా బేలో ఒక కుటుంబ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ చిన్న గొడవ జరిగింది. దీంతో ఇద్దరు బంధువులు కలబడ్డారు. వారిని విడదీసేందకు మధ్యలో కలగజేసుకున్న ఆడమ్స్‌ని ఒక వ్యక్తి కోపంతో మోకాలిపై కరిచాడు. దీంతో అతను నైక్రోటైజింగ్ షాసిటిస్ వ్యాధి బారినపడ్డాడు. దీనిని సాధారణంగా మాంసం తినే భ్యాక్టీరియా అని పిలుస్తారు. దీని కారణంగా శరీరీం కుళ్లిపోతూ ఇన్ఫెక్షన్కు గురై చనిపోతాడు. ఈ వ్యాధి నెమ్మదిగా చర్శంలోకి ప్రవేశించి కండరాల తొడుకు ఉండే ఆరోగ్యకరమైన కణజాలాన్ని నాశనం చేస్తుంది. పాపం ఆ ఘటన కారణంగా ఆడమ్స్ ఆస్పత్రికి సందర్శించాల్సి వచ్చింది. అక్కడ వైద్యలు ఈ విషయాన్నే ఆడమ్స్ తెలిపారు. వెంటనే శస్త్ర చికిత్స చేయలని లేదంటే ప్రాణాంతకమని చెప్పారు. కుక్క కాటు కంటే మనిషి కాటు ఎంత ప్రమాదమో వైద్యులు అతనికి వివరించి చెప్పారు. శస్త్ర చికిత్సలో ఆడమ్స్కి 70 శాతం కణజాలాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ శస్త్ర చికిత్స త్వరిత గతిన చేయకపోతే గనుక ఆడమ్స్ కాలుని కోల్పోవలసి ఉండేది. అతను కోలుకోవడానికి మూడు వారాలు పడితే..పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది. దీంతో ఆడమ్స్ ఈ భయానక ఘటన నుంచి కోలుకునేలా చేసిన వైద్యులకు రుణపడి ఉంటానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆడమ్స్. కుక్క కాటు కన్న మనిషిక కాటు ఇంతా భయానకంగా ఉంటుందని తాను అస్సలు అనుకోలేదని వాపోయాడు. అందుక సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఛీ!.. ఇలానా కొబ్బరి బోండాలు విక్రయించేది..వీడియో వైరల్) -
ఇదేందిరా అయ్యా.. పెళ్లి వేడుకలో వధువుకు చేదు అనుభవం
వివాహం అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ అందమైన అనుభూతి. ప్రతీ ఒక్కరికి తమ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంటారు. ఈ రోజుల్లో పెళ్లి వేడుకను డిఫరెంట్‌గా చేసుకోవాలని జంటలు భావిస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నం చేసిన ఓ జంట.. పెళ్లి వేడుకల్లో హైలైట్ అయ్యింది. కానీ, ఆవేశంతో వరుడు చేసిన పనికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వీడియో ప్రకారం.. తమ పెళ్లి తర్వాత రిసెప్షన్లో వధూవరుల మధ్య ఓ సరదా గేమ్ నిర్వహించారు. అయితే, గేమ్ ఆడేందుకు వదువరులిద్దరూ ఎంతో సంతోషంతో ముందుకు వచ్చారు. నవ్వుతూ గేమ్ ఆడారు. కాగా, ఈ గేమ్‌లో పెళ్లికూతురు తన ఆటను వరుడి కంటే ఫాస్ట్‌గా ముగించింది. భర్త మాత్రం చాలా ఆలస్యంగా గేమ్ కంప్లీట్ చేశాడు. దీంతో ఆవేశానికి గురైన వరుడు.. అందరూ చూస్తుండగానే స్టేజ్‌పైనే భార్య తలపై ఒక్కటిచ్చాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా వధువు షాకైంది. అయితే, అందరి ముందే వరుడు ఆమెపై చేయిచేసుకున్నా అక్కడున్న వారు ఒక్కమాట కూడా అనలేదు. దీంతో, ఆవేదనకు లోనైన వధువు.. కన్నీరు పెట్టుకుంది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. In Uzbekistan, groom hit the bride right at the wedding in front if guests, relatives, families from both sides. Noone stopped him, noone to defend her. Footage shows the couple participated in game, after which he hit her. We need an @WomanTreaty urgently pic.twitter.com/rgjtc4qM2W — Leila Nazgul Seiitbek💙💛🇰🇬🌻 (@l_seiitbek) June 12, 2022 -
నేలమీద పడేసి చేతులు విరగ్గొట్టి
టెన్నెసీ: అమెరికాలో పోలీసుల క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ నగర పోలీసులు 29 ఏళ్ల నల్లజాతీయుడ్ని దారుణంగా హింసించడంతో ఆ దెబ్బలకు తాళలేక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల మొదట్లో జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. 2020 మేలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి గొంతుపై బూటు కాలుతో తొక్కి చంపిన ఘటనని తలపించేలా ఈ దౌర్జన్య కాండ కూడా సాగింది. కాకపోతే తాజా ఘటనకు పాల్పడ్డ పోలీసులు కూడా నల్లజాతీయులే! ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫెడెక్స్‌లో పనిచేసే 29 ఏళ్ల టైర్ నికోల్స్‌ను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై మెంఫిస్ పోలీసులు జనవరి 7న ఆపారు. వాహనంలోంచి లాగి నేలమీద పడేసి దారుణంగా కొట్టారు. తాను ఏ తప్పు చేయలేదంటూ వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆరుగురు పోలీసులు అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి, ఎలక్ట్రిక్ పరికరాలతో షాకిచ్చి కిండపడేశారు. ముఖంపై ఇష్టారాజ్యంగా కొట్టారు. వికృతానందంతో నవ్వుతూ భుజం విరిగేలా కొట్టారు. ‘మామ్ , మామ్’ అంటూ నికోల్స్ దీనంగా రోదిస్తున్నా రెండు నిమిషాల పాటు ఆపకుండా చితక్కొట్టారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 10న మరణించాడు. పోలీసులు కొడుతున్న వీడియో చూసి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దౌర్జన్యాలు ఇంకా ఎన్నాళ్లంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. పోలీసులపై హత్యానేరం కింద అభియోగాలు నమోదు చేశారు. నికోల్స్‌కు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. నికోల్స్ తన భుజంపై తల్లి వెల్స్ పేరును టాటూగా వేసుకున్నాడు. తన కొడుకు దారుణ హింసకు గురై మరణించాడంటూ విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. బైడెన్ దిగ్భ్రాంతి టైర్ నికోల్స్పై పోలీసుల హింసాకాండపై బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దారుణమైన ఆ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే మనసు కలచివేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. నల్లజాతీయులకు దేశంలో ఎదురవుతున్న ఎదురుదెబ్బలకి ఇది మరొక ఉదాహరణన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు. నికోల్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. -
దారుణం: టిక్కెట్ కలెక్టర్ ప్రయాణికుడిని చితకబాది, బూట్లతో తన్నుతూ..
ప్రయాణికుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు టిక్కెట్ కలెక్టర్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటన బిహార్‌లోని మజఫర్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ముంబై నుంచి ఢిల్లీలోని జైనగర్‌కి వెళ్తున్న ట్రైయిన్‌లోని ఒక ప్రయాణికుడికి, టిక్కెట్ కలెక్టర్‌కి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో సదరు టిక్కెట్ కలెక్టర్ ఆ ప్రయాణికుడుని పైబెర్త్ నుంచి కిందకు లాగేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతనికి తన సహ టిక్కెట్ కలెక్టర్ కూడా సహకరించడంతో.. సదరు ప్రయాణికుడి కిందకు లాగి పడేశారు. ఆ తర్వాత అతన్ని దారుణంగా కొట్టి, బూట్లతో తన్నుతూ.. అత్యంత దారుణంగా ప్రవర్తించారు. అందుకు సంబంధించిన వీడియోని ఒక ప్రయాణికుడు రికార్డు చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఐతే అదే సమయంలో మరో ప్రయాణికుడు ముందుకు వచ్చి అతన్ని కొట్టవద్దంటూ టిక్కెట్ కలెక్టర్‌ని వారించి, గొడవ సద్దుమణిగేలా చేశాడు. ఈ ఘటన జనవరి 2న ఢిల్లీలోని ధోలి రైల్వేస్టేషన్‌కి సమీపంలో చోటు చేసుకుంది. సదరు ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా ప్రయాణించడంతోనే వారి మధ్య వాగ్వాదం తలెత్తినట్లు సమాచారం. దీంతో రైల్వే శాఖ సదరు టిక్కెట్ కలెక్టర్లను సస్పెండ్ చేసినట్లు రైల్వే ప్రతినిధి తెలిపారు. ఈ ఘటన విషయమై అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారని పేర్కొన్నారు. (చదవండి: ముంబైలో బాలీవుడ్ సెలబ్రెటీలతో యోగి భేటీ) -
అమ్మో కుక్క...పీకేస్తుంది పిక్క
ఈ బాలుడు రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. గత నెల 28న స్కూల్‌కు వెళుతుండగా వీధి కుక్క కరిచింది. అదే సమయంలో పక్కనే మరో విద్యార్థుని సైతం గాయపరిచింది. మధ్యాహ్నం మరొకరిని, సాయంత్రం ట్యూషన్‌కు వెళుతున్న మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. ఒక్క రోజే ఐదుగురు విద్యార్థులు కుక్కకాటుకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ పరిస్థితి ఒక్క రాయదుర్గంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా నిత్యం చోటు చేసుకుంటున్నాయి. వెలుగు చూస్తున్నవి కొని...వెలుగులోకి రానివి మరెన్నో.... రాయదుర్గం: పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధుల్లో సంచరిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. కాలినడకన వెళుతున్న వారే కాదు.. పశువులు, మేకలు, గొర్రెలు, ద్విచక్ర వాహన చోదకులు సైతం కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడుతున్నారు. మూడు నెలల్లో 2,978 కేసులు కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన మూడు నెలల్లో 2,978 మంది కుక్కకాటుకు గురయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారం క్రితం రాయదుర్గంలోని దాసప్ప రోడ్డు, చికెన్ మార్కెట్ ప్రాంతాల్లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. రెండు రోజుల వ్యవధిలో ఎనిమిది మంది పిక్కలు పీకేశాయి. ఇక ద్విచక్ర వాహనాల వెంట పడుతూ బెంబేలెత్తిస్తుండడంతో పలువురు ప్రమాదాలకు గురైన ఘటనలూ కోకొల్లలుగా ఉన్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, రాప్తాడుతో పాటు అనంతపురం నగర పాలక సంస్థలోనూ కుక్కకాటు బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రాంతాల్లో దాదాపు 2 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి నియంత్రణ, సంరక్షణ కోసం రూ. లక్షలు ఖర్చు చేస్తున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. వ్యర్థాలతో అనర్థాలు పట్టణ, గ్రామీణ, నగర ప్రాంతాల్లోని పలు చికెన్ సెంటర్ నిర్వాహకులు వ్యర్థాలను రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. వీటి కోసం పదుల సంఖ్యలో కుక్కలు గుమికూడి పోట్లాడుకుంటూ రోడ్డున వెళుతున్న వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కోడిమాంసాన్ని అధికంగా తినడంవల్ల తరచూ దుష్ప్రభావాలకు గురికావాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రాయిలర్ కోళ్లలో క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా, ఎస్చెరిచియా కోలి వంటి బ్యాక్టీరియాలను కలిగి ఉంటాయని, సరిగా ఉడికించకపోతే ఈ బ్యాక్టీరియా మనిషిలో అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుందని వివరిస్తున్నారు. పచ్చి మాంసం, వ్యర్థాలను తినడం వల్ల కుక్కల్లో పలు రకాల వ్యాధులు వ్యాపిస్తాయని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో కుక్కలు విచిత్రంగా ప్రవర్తిస్తూ కనిపించిన వారిపై దాడికి తెగబడుతాయని అంటున్నారు. చర్యలు తీసుకుంటాం గతంలో రీజియన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఏబీసీ కేంద్రానికి వీధికుక్కలు తరలించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేవాళ్లం. కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో ఇటీవల కుక్కల బెడద ఎక్కువైంది. వీటి నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. – దివాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, రాయదుర్గం అందుబాటులో టీకా జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రిలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో కుక్క కాటుకు టీకా అందుబాటులో ఉంది. కుక్క కాటు బాధితులు అందుబాటులో ఉన్న ఆస్పత్రిలో టీకా వేయించుకోవచ్చు. శీతాకాలంలో కుక్కకాటుకు గురికాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కరిచే కుక్కలు ఉంటే ముందస్తుగా వాటికి రేబిస్ టీకా వేయించాలి. – డాక్టర్ విశ్వనాథయ్య, డీఎంహెచ్ఓ, అనంతపురం (చదవండి: బరితెగించిన టీడీపీ నేతలు.. 20కోట్ల ల్యాండ్ కోసం కలెక్టర్ పేరుతో..) -
ఫొటోలు లీక్..ప్రియురాలు రౌద్రరూపం.. ప్రియుడు ఖతం
బొమ్మనహళ్లి: ప్రియుడు తన ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశాడనే ఆగ్రహంతో ప్రియురాలు రౌద్రరూపం దాల్చింది. ముగ్గురు మగ స్నేహితులతో కలిసి ప్రియున్ని ఇష్టానుసారం కొట్టడంతో కోమాలోకి వెళ్లి మృతి చెందాడు. ఈ సంఘటన బెంగళూరులో బేగూరు పరిధిలో చోటుచేసుకుంది. నిందితురాలు ప్రతిభ (26), ఆమె స్నేహితులు సుశీల్, గౌతమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్‌లో చదివి వచ్చి వివరాలు... చెన్నై నగరానికి చెందిన వికాస్ (27), ప్రతిభ ప్రేయసీ ప్రియులు. ఉక్రెయిన్‌లో వైద్య కోర్సు చదివి వచ్చిన వికాస్ చెన్నైలో డాక్టర్‌గా పని చేసేవాడు. ఆరు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు వచ్చి మైకో లేఔట్ వద్ద నివాసం ఉంటున్నాడు. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఒక ఆర్కిటెక్ట్ కంపెనీలో పని చేస్తున్న ప్రతిభతో వికాస్‌కు రెండేళ్ల కిందట సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. వికాస్ బెంగళూరుకు వచ్చాక అది ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు కూడా ఒప్పుకొన్నారు. నవంబర్ నెలలో పెళ్లి చేసుకుందామని జంట అనుకుంది. ఇన్ స్టాలో ఫొటోల పోస్టింగ్‌తో గొడవ ప్రతిభ నగ్న చిత్రాలను వికాస్ ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అది ఆమె కంటపడింది. దాంతో ప్రతిభ కుటుంబీకులు వికాస్‌తో గొడవ పడ్డారు. ప్రేమించినవాడు మోసం చేశాడని, కుటుంబం ముందు పరువు తీశాడని ప్రతిభ కుమిలిపోయింది. ఆఫీసులో స్నేహితులైన సుశీల్, గౌతమ్, సూర్యతో గోడు చెప్పుకుంది. అతనికి బుద్ధి చెప్పాలని అందరు కలిసి వారం రోజుల క్రితం వికాస్ గదికి వెళ్లి తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత వారే ఆస్పత్రికి తీసుకెళ్లి ఎవరో కొట్టి పారిపోయారని చెప్పారు. అక్కడ చేర్చుకోకపోవడంతో సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బాధితుడు ఆదివారం రాత్రి చనిపోయాడు. బేగూరు పొలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నాడు. (చదవండి: మహిళను వాటేసుకుని ముద్దుపెట్టబోయిన కాంగ్రెస్ నాయకుడు.. చితకబాదిన బాధితురాలి ప్రియుడు) -
మనవడిని కొట్టి చంపిన తాతకు వందేళ్ల జైలు
మొంటానా: మనవడిని కొట్టి చంపిన కేసులో మొంటానాలోని ఎల్లోస్టోన్కు చెందిన ఓ వ్యక్తికి కోర్టు 100 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జేమ్స్ సస్సెర్ జూనియర్ కొడుకు టేట్ చనిపోవడంతో అతడి కొడుకు అలెక్స్ హరీ(12)తాత వద్దకు వచ్చి ఉంటున్నాడు. అదే సమయంలో భార్య పాట్రిసియాకు విడాకులు ఇచ్చేందుకు జేమ్స్ సస్సెర్ సిద్ధమయ్యాడు. అయితే, విడాకుల తర్వాత మనవళ్లను చూసే అవకాశం ఇవ్వనంటూ ఆమె బెదిరించడంతో వెనక్కి తగ్గాడు. మనవడు అలెక్స్ కుటుంబసభ్యుల మాట వినడం లేదని పాట్రిసియా చెప్పడంతో అతడిపై జేమ్స్ సస్సెర్ జూనియర్ ద్వేషం పెంచుకున్నాడు. అప్పటి నుంచి అలెక్స్‌పై అమ్మమ్మ, తాతతోపాటు వారి కొడుకు సస్సెర్(14)కూడా వేధింపులు ప్రారంభించారు. అలెక్స్ అక్కడ గడిపిన రెండేళ్లు మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధించారు. ఆహారం కూడా సరిగ్గా ఇవ్వలేదు. 2020 ఫిబ్రవరిలో అలెక్స్ హర్లీ(12)చనిపోయాడు. అంతకు ముందు 36 గంటలపాటు అతడిని తీవ్రంగా కొట్టారు. తల భాగం సహా అతడి శరీరం నిండా గాయాలే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. రక్షణ ఇవ్వాల్సిన కుటుంబసభ్యులే అభంశుభం తెలియని బాలుడిని క్రూరంగా హింసించి చంపడంపై విచారణ సందర్భంగా జడ్జి బ్రౌన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జేమ్స్ సస్సెర్కు 100 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. అతడి 14 ఏళ్ల కొడుకుకు 18 ఏళ్లు వచ్చే వరకు జువనైల్ డిటెన్షన్ సెంటర్లో, 25 ఏళ్లు వచ్చే వరకు ప్రొబేషన్‌లో గడపాలని తీర్పునిచ్చారు. ఈ కేసులో పాట్రిసియాపై మేలో విచారణ జరగనుంది. -
రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో
ప్రభుత్వ ఆపీస్లో పై అధికారి తలబిరుసుతనంతో తన కింద పనిచేసిన వాళ్లపై చేయిచేసుకోవడం వంటి పలు ఘటనలు గురించి విన్నాం. ఇటీవలే ఒక నర్సు ఆలస్యంగా వచ్చినందుకు ఒక ఆరోగ్యాధికారి దాడి చేసేందుకు ప్రయత్నించిన వీడియోలను చూశాం. లక్షల్లోనూ లేదా కోట్ల ఆస్తి గురించి దెబ్బలాడుకున్నా ఓ అర్థం ఉంటుంది. కానీ కేవలం రూ 500 కోసం కొట్టుకోవడం గురించి విన్నారా. పైగా ఆపేందుకు ప్రయత్నించిన కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఘోరంగా కొట్టుకున్నారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే....బీహార్‌లో జాముయ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్‌లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ఒకరినోకరు జుట్టుపట్టుకుని లాక్కుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఒక వ్యక్తి జోక్యం చేసుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ ఇద్దరూ చేతులతోనూ, చెప్పులతోను ఘోరంగా కొట్టుకున్నారు. అయితే ఆశా వర్కర్ రింటూ కుమారి బీసీజీ వ్యాక్సిన్ షాట్ కోసం ఆక్సిలరీ నర్సు మిడ్వైఫ్(ఏఎన్ఎం) రంజన కుమారి వద్దకు నవజాత శిశువును తీసుకెళ్లినప్పుడే ఈ వివాదం తలెత్తింది. అయితే వ్యాక్సిన్ వేసేందుకు ఆ ఆక్సిలరీ నర్సు రూ 500 డిమాండ్ చేయడంతో ఈ గోడవ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్లైన్ వైరల్‌గా మారింది. దీంతో ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఆ కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. ये दृश्य @NitishKumar के स्वास्थ्य विभाग की असलियत की कहानी बयान कर रहा हैं जहां एक टीका के बदले 500 घूस की माँग पर एएनएम और आशा सेविका ऐसे उलझ गयी @ndtvindia @Anurag_Dwary @mangalpandeybjp @PratyayaIAS pic.twitter.com/98JrknbpMk — manish (@manishndtv) January 24, 2022 (చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!) -
మహిళా అధికారినిపై దాష్టీకం: డ్యూటీలో ఉంది.. అందులోనూ గర్భిణి!
కొంతమంది ఇటీవల కాలంలో అత్యంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఆడ, మగ అనే తారతమ్యం లేకుండా అత్యంత దారుణంగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలాంటి అమానుష ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పైగా సాటి మహిళ, గర్భిణి అని చూడకుండా అత్యంత పాశవికంగా ఆమె పై దాడి చేశారు. అసలు విషయంలోకెళ్తే....మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అటవీ శాఖలో పనిచేస్తున్న గర్భిణి అధికారి పై పల్సవాడే మాజీ సర్పంచ్ అతని భార్య అత్యంత అమానుషంగా దాడిచేశారు. మహిళా అటవీ శాఖాధికారులు తనకు సమాచారం ఇవ్వకుండా కూలీలను వేరే స్థలంలో పనిలో పెట్టుకున్నారని స్థానిక అటవీ కమిటీలో మాజీ సర్పంచ్ రామచంద్ర గంగారాం వాపోయారు. అంతేకాదు మాజీ సర్పంచ్ సోమవారం మహిళా అధికారిణిని ఫోన్లో బెదిరించాడు కూడా. ఈ మేరకు మాజీ సర్పంచ్ రామచంద్ర గంగారాం జంకర్, అతని భార్య ప్రగతి జంకర్.. మహిళా అటవీ అధికారి, ఆమె భర్త పై దాడి చేశారు. పైగా మాజీ సర్పంచ్ భార్య ప్రగతి జంకర్... సాటి మహిళ, గర్భిణి అనే కనికరం లేకుండా అటవీ అధికారి జుట్లు పట్టుకుని లాగి కిందపడేసి, చెప్పుతో కొట్టి అవమానించారు. ఈ మేరకు ఈ ఘటనను ఆ మహిళా ఆఫీసర్ భర్త, అటవీ సిబ్బంది రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మాజీ సర్పంచ్‌ని అతని భార్యను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. (చదవండి: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..) -
జుట్టుపట్టుకుని లాగి కొడుతూ... ‘మై గరీబ్ ఆద్మీ హూ’ అన్న విడిచి పెట్టలేదు..
జైపూర్: రాజస్థాన్‌లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పోలీసులు.. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. బిల్వారా జిల్లాలోని.. ఒక దేవాలయం ముందు చెప్పులు అమ్మే వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. వివరాలు.. బిల్వారాలోని స్థానిక దేవాలయం ముందు ఒక దివ్యాంగుడు చెప్పుల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్లు అక్కడికి చేరుకుని చెప్పుల షాపును తీసేయాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా.. అతడిని నోటికొచ్చినట్లు దుర్భాషాలాడారు. అతడిని బయటకు లాగి జుట్టుపట్టుకుని విచక్షణ రహితంగా కొట్టసాగారు. రోడ్డుపై లాక్కెళుతూ క్రూరంగా ప్రవర్తించారు. ఆ దివ్యాంగుడు ‘మై గరీబ్ ఆద్మీ హూ’ నన్ను విడిచిపెట్టాలని ప్రాధేయపడినప్పటికి పోలీసులు విడిచిపెట్టలేదు. అయితే, స్థానికులు పోలీసులను ఎవరు కూడా వారిని ఆపే సాహసం చేయడం లేదు. అక్కడే ఉన్న వారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై బిల్వారా పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ సంఘటపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. కాగా, గతంలో లక్నో సమీపంలోని ఉన్నావ్‌లో 18 ఏళ్ల కూరగాయలు అమ్మే వ్యక్తిపై పోలీసులు ఇలానే క్రూరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆ వ్యక్తి కొన్నినెలల తర్వాత మృతిచెందాడు. దీంతో బంధువులు అతని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ఉన్నతాధికారులు దిగివచ్చి న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో బంధువులు తమ నిరసనను మానుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటనే జరగటంతో పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అల్లుడిని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు!
సాక్షి, పాలకుర్తి(ములుగు): భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ చివరకు భర్తకు దేహశుద్ధి చేయించే వరకు వెళ్లింది. ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన నీరజను వావిలాల గ్రామానికి చెందిన దొంగరి మురళికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండగా.. భర్త చెడు వ్యసనాలకు అలవాటుపడి తనను పట్టించుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని నీరజ కేసు పెట్టింది. దీంతో మురళి జైలుకు వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి ఇరువురు విడిగా ఉంటున్నారు. ఇటీవల మురళి తల్లి మృతి చెందడంతో నీరజ వచ్చి వావిలాలలో అతడితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తనతో పాటు పిల్లల్ని కొట్టాడని నీరజ తిరిగి మల్లంపల్లికి వెళ్లి దాడి విషయం కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నీరజ కుటుంబ సభ్యులు వావిలాలకు వెళ్లి మురళిని మల్లంపల్లికి తీసుకువచ్చి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ విషయమై పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం ఎస్సై సతీష్ ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతం కావొద్దని హెచ్చరించి పంపించారు. -
చందానగర్‌లో దారుణం..
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లోకి రానివ్వనందుకు ఓ యువతి వాచ్మన్ని చితకొట్టింది. ఈ సంఘటన చందానగర్‌లోని సిరి అపార్ట్మెంట్లో మంగళవారం చోటు చేసుకుంది. కారులో వచ్చిన ఓ యువతి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించింది. అయితే అనుమతి లేకుండా అపార్ట్మెంట్లోకి వెళ్లకూడదంటూ వాచ్‌మ్యాన్ ఆమెను అడ్డుకున్నాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువతి కారు దిగి వచ్చి వాచ్‌మన్ మీద విచక్షణారహితంగా దాడి చేసింది. పిడి గుద్దులు కురిపించడమే కాక కాలితో తన్నింది. అక్కడితో ఆగకుండా చెప్పుతో ఇష్టమొచ్చినట్టు కొట్టింది. ఈ దృశ్యాలన్ని అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బాధితుడు చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. (చదవండి: మద్యం మత్తులో యువతుల హల్చల్) -
అధికారిని బ్యాట్‌తో కొట్టిన ఎమ్మెల్యే
ఇండోర్: ఓ ఇంటిని కూల్చడానికి వచ్చిన ప్రభుత్వోద్యోగిపై బీజేపీ సీనియర్ నాయకుడు కైలాశ్వర్గియా కుమారుడు, ఎమ్మెల్యే విజయ్‌వర్గియా క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు. ఓ ఇంటిని కూల్చడానికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులను వెనక్కు వెళ్లిపోవాలంటూ స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగస్తుడైన విజయ్ బ్యాట్‌తో ప్రభుత్వోద్యోగిపై దాడి చేశాడు. బీజేపీ తమకు మొదట అభ్యర్థించాలని, తర్వాత దాడి చేయాలన్న సిద్ధాంతాన్ని నేర్పిందని విజయ్ తన చర్యను సమర్థించుకున్నారు. ఈ స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడినందునే ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నీలభ్ శుక్లా మాట్లాడుతూ చట్టాలు చేయాల్సిన వ్యక్తే చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని అన్నారు. ఈ సంఘటన బీజేపీ నిజ స్వరూపాన్ని చూపిస్తుందని అన్నారు. కాగా, అధికారిపై దాడిచేయడంతో పోలీసులు విజయ్ను బుధవారం అరెస్ట్‌చేశారు. ఆ తర్వాత తనకు బెయిల్ కావాలంటూ విజయ్ పెట్టుకున్న దరఖాస్తును స్థానిక కోర్టు బుధవారం తిరస్కరించింది. దీంతో సాయంత్రం సమయంలో అతన్ని జైలుకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. -
పెంపుడు కుక్కను కొట్టాడని..
బంజారాహిల్స్: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన పెంపుడు కుక్కను కొట్టాడన్న కోపంతో ఓ కొబ్బరిబోండాల వ్యాపారి ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షేక్‌పేట సమీపంలోని మారుతీనగర్‌కు చెందిన శ్రీనివాస్ ఫిలింనగర్ రోడ్ నెంబర్–16లో కొబ్బరి బోండాలు విక్రయించేవాడు. అతడికి సంతానం లేకపోవడంతో ఓ వీధి కుక్కను చేరదీసి ‘సాయి’ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ప్రతిరోజూ తనతో పాటు దుకాణానికి తీసుకొచ్చేవాడు. ఆదివారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన చల్లా బాలసుబ్రహ్మణ్యం అనే యువకుడు శ్రీనివాస్ కొబ్బరి బోండాల బండి పక్క నుంచి వెళుతుండగా కుక్క అతడి వెంటపడటంతో రాయితో కొట్టాడు. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్ చేతిలో ఉన్న కత్తితో అతడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితుడి సోదరుడు చల్లా రాజ్‌కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తన పెంపుడు కుక్కపై అకారణంగా రాయితో దాడి చేసినందుకే తాను తిరిగి దాడి చేసినట్లు నిందితుడు పేర్కొన్నాడు. -
కాళ్లు చేతులు కట్టేసి.. బైక్‌తో ఈడ్చుకు వెళ్లి..
సాక్షి, హైదరాబాద్ : తండ్రి పిల్లల ఆలనా పాలన చూసుకోనే వ్యక్తి. తనకు ఎంత కష్టం వచ్చిన పిల్లలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా సంతోషంగా చూసుకొనేవాడు. పిల్లల సంతోషమే తన సంతోషంగా భావించే మహోన్నతమైన వ్యక్తి. కానీ చైనాలో ఓ వ్యక్తి మాత్రం నాన్న పదానికి మచ్చ తెచ్చేలా ప్రయత్నించాడు. కన్నకూతురు అని చూడకుండా దారుణంగా హింసించాడు. ప్రతిఫలంగా కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని ఘ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన వియ్ తన 10ఏళ్ల కూతురుని దారుణంగా హింసించాడు. తన బైక్ వెనుక పడుతోందని కాళ్లు చేతులు కట్టేసి కర్రతో చితక బాదాడు. ఆదెబ్బలకు ఆ చిన్నారి రోదిస్తున్న పక్కన ఉన్న వారి మనసు కరగలేదు. ఆ తండ్రిని అడ్డుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. కొంచెం కూడ మనసులేని వియ్ అంతటితో ఆగకుండా కూతురుని తాడుతో బైక్‌కు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. అయితే ఈ దారుణాన్ని గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 20 నిమషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలల వేధింపుల చట్టం కింద వియ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెడు ప్రవర్తనకు కారణం ‘కొట్టడమే’!
న్యూయార్క్: అల్లరి పనులు చేస్తే పిల్లలను ఓ దెబ్బ వేసి మందలిస్తాం. అయితే దెబ్బ తగలకూడదనే అభిప్రాయంతో చాలామంది పిల్లలకు పిరుదులపైన కొడుతుంటారు. చెంపపై కొడితే పొరపాటున కంటికి తగిలే అవకాశం ఉండడంతో స్కూల్లో మాస్టార్లు కూడా బెత్తంతో కొట్టేది అక్కడే. అయితే ఇది పిల్లల ప్రవర్తన చెడుగా మారడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకుడు టీ జెర్షాఫ్ ఈ విషయమై మాట్లాడుతూ... ‘పిరుదులపైన కొట్టడడం వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పు రావడాన్ని చాలామందిలో పరిశీలించాం. అవమానకరంగా కొట్టడం పిల్లల ప్రవర్తనలో మార్పు రావడానికి ఓ కారణమని తేలింద’న్నారు. ప్రవర్తనామార్పుపై యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేసిన వివరాలను సైకలాజికల్ జర్నల్‌లో ప్రచురించారు. అయితే పిల్లల్లో ప్రవర్తన మార్పునకు మాత్రం కొట్టడమేనని, అందులో అవమానకరంగా కొట్టడం వల్ల పిల్లల్లో ప్రవర్తన మరింత చెడుగా మారుతుందని గుర్తించారు. ‘పిల్లల్ని కొట్టడడమనే సంప్రదాయం పాఠశాల నుంచే వచ్చిందనే విషయం మా పరిశోధనలో తేలింది. మాస్టార్లు కొడతారనే భయంతో పిల్లలు అల్లరి చేయకుండా ఉండడాన్ని గమనించిన పేరెంట్స్.. తాము కూడా అలాగే కొడితే పిల్లలు అదుపాజ్ఞలలో ఉంటారని భావించారు. అందుకే మాస్టారు కొట్టిన చోటే తల్లిదండ్రులు కూడా కొట్టడం మొదలైంది. ఇది పిల్లల ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తోంద’ని పరిశోధకుల్లో ఒకరైన ఎలిజబెత్ అన్నారు. -
ముస్తాబాద హైస్కూల్లో ఆందోళన
ముస్తాబాద (గన్నవరం రూరల్) : ముస్తాబాద జెడ్పీ హైస్కూల్లో గురువారం తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. హెచ్ఎం ఎ.వెంకటేశ్వరరావు తమ మనుమరాలు యాదల తనూజను కొట్టాడని పేర్కొంటూ సూరంపల్లి గ్రామం నుంచి బాలిక తాత వెంకటేశ్వరరావు, తల్లి జోస్పిన్ తదితరులు పాఠశాలకు రావటంతో గందరగోళం ఏర్పడింది. మాజీ ఎంపీటీసీ దాసే బాబూరావు, స్థానిక యువకులు పాఠశాలలో తరచూ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితిలో మార్పు రావటం లేదంటూ హెచ్ఎం పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనూజను బడికి రాలేదని బుధవారం హెచ్ఎం కొట్టాడు. దీంతో విద్యార్థి స్పృహ కోల్పోవటంతో పీఈటీ సురేష్ బాబు ముస్తాబాద పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. బుధవారం సాయంత్రం విద్యార్థి తనూజ సూరంపల్లిలోని ఇంటి వద్ద వాంతులు చేసుకుని పడిపోవటంతో కుటుంబ సభ్యులు ఆరాతీశారు. పాఠశాలలో హెచ్ఎం కొట్టాడని చెప్పటంతో, ఆ విషయం తెలుసుకునేందుకు తాత, బంధువులు గురువారం పాఠశాలకు వచ్చారు. తనూజ పాఠశాలలో మళ్లీ పడిపోవటంతో ముస్తాబాద పీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్ ఆనంద్‌బాబు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లాలని సూచించటంతో హైస్కూల్‌కు చేరుకుని, అక్కడి నుంచి 108 వాహనంలో చిన్నఆవుటపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై గ్రామస్తులు, తనూజ తాత డీఈవో సుబ్బారెడ్డికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయటంతో ఆయన విచారణకు ఆదేశించారు. నూజివీడు డీవైఈవో రవిసాగర్ మధ్యాహ్నం పాఠశాలకు వచ్చి తనూజ సహచర విద్యార్థులను జరిగిన సంఘటపై విచారణ చేశారు. డీవైఈవో ‘సాక్షి’తో మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి నివేదిక రూపొందించి డీఈవోకు పంపుతామని చెప్పారు. తనూజ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాలిక బంధువులు తెలిపారు. -
టీచర్ మందలించిందని విద్యార్ధిని ఆత్మహత్య
-
తమ్ముళ్ల డిష్యుం డిష్యుం
శింగనమల : మధ్యాహ్న భోజన ఏజెన్సీ కోసం తెలుగు తమ్ముళ్లు కొట్టుకున్నారు. మండల పరిధిలోని నాగులగుడ్డం తాండాకు సంబంధించి మధ్యాహ్న భోజన ఏజెన్సీపై కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. గ్రామస్థాయి టీడీపీ నాయకులు తమకు కావాలంటే తమకు కావాలని పోటీ పడ్డారు. ఇందులో భాగంగానే సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని భావించి అనంతపురంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు దగ్గరకు వెళ్లారు. అయితే ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఓ టీడీపీ నాయకుని వద్ద సమస్యను చర్చించారు. మాటా మాటా పెరగడంతో ఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న నాయకులు, కార్యకర్తలు వారిని విడిపించి అక్కడి నుంచి పంపించివేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకునేలోపే తమ్ముళ్లు వెళ్లిపోయారు. -
టీడీపీ నేత ఓవరాక్షన్
► పంచాయితీ పేరుతో వ్యక్తిపై దాడి బుక్కరాయసముద్రం : పంచాయితీ పేరుతో ఓ టీడీపీ నేత సామాన్యుడిని చితకొట్టాడు. బాధితులు తెలిపిన వివరాలు మేరకు మండల పరిధిలోని పొడరాళ్ల గ్రామానికి చెందిన ఎరికల వెంకటనారాయణ కూలి పనులు చూసుకుంటూ జీవనం గడుపుతున్నారు. గత నెల రోజుల క్రితం అనంతపురం సిండికేట్‌నగర్‌కు చెందిన వన్నూరమ్మతో కొంత మొత్తం తీసుకున్నాడు. అప్పు ఇవ్వాలని వన్నూరమ్మ అడగ్గా కొంత సమయం ఇస్తే ఇచ్చేస్తానని చెప్పానన్నాడు. ఈ విషయంలో వడియంపేట మాజీ సర్పంచ్, టీడీపీ నేత పరిశే శ్రీనివాసులు కలుగజేసుకుని తన ఇంటి వద్దకు రావాలని వెంకటనారాయణకు పలుమార్లు ఫోన్ చేసి పిలిచాడు. వాళ్ల ఇంటి దగ్గరకు వెళ్లగానే శ్రీనివాసులు అతని అనుచరులు గోపాల్, నరసింహులు, క్రిష్ణమూర్తిలు వెంకటనారాయణపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ప్రస్తుతం వెంకటనారాయణ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నా భర్తను టీడీపీ నేత శ్రీనివాసులు అన్యాయంగా కొట్టాడని వెంకటనారాయణ భార్య అంజనమ్మ వాపోయింది. గత ఎన్నికలో 8 వార్డు మెంబర్‌గా గెలిచాననీ... వాళ్ల పార్టీకి పిలిస్తే రాలేదన్న కక్షతోనే ఈ దాడికి పాల్పడ్డారన్నారు. జిల్లా అధికారులే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
విద్యార్థిని చితకబాదిన టీచర్
హైదరాబాద్: సరిగా చదవట్లేదని విద్యార్థిని టీచర్ చితకబాదిన సంఘటన మీర్‌పేటలో చోటు చేసుకుంది. స్థానిక నాగార్జున మాంటిస్సోరి ఐఐటీ కాన్సెప్ట్ స్కూల్లో సాత్విక్(12) ఏడో తరగతి చదువుతున్నాడు. అతను సరిగా చదవటం లేదని తెలుగు టీచర్ శ్రీనివాస్ వీపుపై, భుజాలపై బెత్తంతో కొట్టాడు. దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
యూట్యూబ్ ను ఏలుతున్న 'ఎడ్వర్డా' బీట్స్...
లయబద్ధమైన బీట్.. ముఖంలో తొణకని విశ్వాసం.. ఆ చిన్నారి డ్రమ్స్ వాయించిందంటే సంగీత ప్రియులే కాదు...చూసినవారంతా అడుగులు కదపాల్సిదే... అప్పుడప్పుడే పాఠశాల మెట్లు ఎక్కాల్సిన ఐదేళ్ళ వయసులోనే ... ఆమె చేయి తిరిగిన ప్రజ్ఞను ప్రదర్శించింది. ఎటువంటి లోపాలు లేకుండా డ్రమ్స్ వాయిస్తూ, స్టేజ్ షోలు, టీవీ షోలతో దూసుకుపోతోంది. ఆణిముత్యంలా ఆకట్టుకుంటున్న ఆ బాల కళాకారిణి ఎడ్వర్డా హెన్ క్లెయిన్ బటెరిస్టా ప్లే చేసిన వీడియోలు... ఇప్పుడు యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. బ్రెజిల్.. జాయిన్విల్లే నగరంలో నివసించే ఆరేళ్ళ ఎడ్వర్డా తన బీట్స్ తో సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తోంది. ఇంతకు ముందే ఎన్నో లోకల్ టీవీ ప్రోగ్రామ్స్ లో ప్రతిభను చాటిన బాలిక.. తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఓ సంవత్సరం క్రితం ఐదేళ్ళ అతి చిన్న వయసులో వాయిద్యాన్నిమొదలుపెట్టిన చిన్నారి... చేయి తిరిగిన విద్వాంసురాలిలా డ్రమ్స్ వాయించడం చూపరులను విస్మయ పరుస్తోంది. అతి సుతారంగా కర్రలు తిప్పుతూ చాకచక్యంగా బీట్స్ వేసే ఆమె... వాద్య పరికరాల వెనుక నవ్వుతూ నిలబడినట్లే కనిపిస్తుంది. ట్రాక్ తో పాటు గొంతెత్తి పాడుతూ శక్తివంతంగా తన పరాక్రమాన్ని చాటుతోంది. ప్రదర్శన ముగించే మూడు నిమిషాలకు ముందు ఈలలు, చప్పట్లతో ఆమెకు వచ్చే రెస్సాన్స్ ఓ ప్రముఖ విద్యాంసుడికి కూడా రాదేమో అనిపిస్తుంది. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఆ బాల మేధావి వీడియోను ఇప్పటివరకూ ఐదు లక్షల మందికి పైగా చూడటమే కాదు, ఎందరో ఆమెను అభినందిస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. ''నిజానికి ఓ ఐదేళ్ళ చిన్నారి ఇంత అద్భుతంగా డ్రమ్స్ వాయించడం ఆశ్చర్యపరుస్తోంది.", "డ్రమ్స్ వాయిస్తూ పాటను కూడ పాటడం నిజంగా ఆశ్చర్యం" అంటూ వచ్చిన కామెంట్లు ఇప్పుడు ఆమె ప్రతిభకు పట్టం కడుతున్నాయి.