మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. ఒక అత్యాచార నిందితుణ్ణి పోలీసులు కోర్టుకు తీసుకువస్తుండగా, విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన బాధితురాలు కోర్టు ప్రాంగణంలో హల్‌చల్ చేసింది.
వివరాల్లోకి వెళితే కొద్ది రోజుల క్రితం ఇండోర్‌లోని సిమ్రోల్‌లో ఒక యువతి (బీజేపీ మహిళా నేత)పై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో స్థానిక సర్పంచ్ భర్త లేఖరాజ్ దాబీపై కేసు నమోదైంది. శనివారం సిమ్రోల్ పోలీసులు నిందితుడు లేఖరాజ్ దాబీని ఇండోర్ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ విషయం బాధితురాలికి తెలియడంతో ఆమె ఇండోర్ జిల్లా కోర్టుకు చేరుకుంది. కోర్టు ఆవరణలో పోలీసుల ముందే బాధితురాలు నిందితుడిని కొట్టింది. ‘నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు?" అని నిలదీస్తూ తన కోపాన్ని వ్యక్తం చేసింది. ఈ సంఘటన అక్కడున్న అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికితోడు పోలీసులు నిందితుడిని ప్రత్యేక కారులో తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.
నిందితునికి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అండదండలున్నాయని బాధితురాలు పోలీసుల ముందు ఆరోపించింది. అత్యాచారం కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత నిందితుడిని బీజేపీ ప్రాథమిక సభ్యత్వం నుండి ఆరు సంవత్సరాల పాటు పార్టీ బహిష్కరించింది. అత్యాచారం తర్వాత తనకు గర్భస్రావం చేయించాడని బాధితురాలు ఆరోపించింది. అతనికి మరికొందరు మహిళలతోనూ సంబంధాలున్నాయని ఆమె పేర్కొంది.
ఇది కూడా చదవండి: Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు
Comments
Please login to add a commentAdd a comment