ముంబై: అత్యాచార కేసులో 26 ఏళ్ల నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు. కానీ ఓ షరతు విధించింది. నిందితుడు బాధితురాలిని ఏడాదిలోగా వివాహం చేసుకోవాలని కండీషన్ పెట్టింది. లేకపోతే ఏడాది తర్వాత బెయిల్ రద్దు అవుతుందని స్పష్టం చేసింది. అయితే బాధితురులు(22) గతకొంతకాలంగా అజ్ఞాతంలో ఉంది. ఆమె ఎక్కడుందో ఎవరికీ తెలియకపోడవం గమనార్హం.
ఈ కేసులో నిందితుడు, బాధితురాలు 2018 నుంచి రిలేషన్‌లో ఉన్నారు. ఈ విషయం ఇద్దరి ఇళ్లలో కూడా తెలుసు. అయితే 2019లో యువతి గర్బందాల్చింది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పగా అతడు మొహం చాటేశాడు. అప్పటినుంచి ఆమెను వదిలేశాడు.
2020 జనవరి 27న బాధితురాలు సిటీ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ప్రియుడు తనను మోసం చేశాడని, అత్యాచారం కేసు పెట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేశారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని, పుట్టిన బిడ్డకు తండ్రిని తానే అని అతడు అంగీకరించాడు. దీంతో న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఏడాది గడువిచ్చింది. అక్టోబర్ 12న ఈమేరకు తీర్పునిచ్చింది.
బాధితురాలు అదృశ్యం..
అయితే బాధితురాలు తనకు పుట్టిన బిడ్డను జనవరి 30నే ఓ భవనం వద్ద వదలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో ఆమెపై కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆ బిడ్డను కూడా వేరేవాళ్లు ఇప్పటికే దత్తత తీసుకున్నట్లు తెలిపారు. కానీ తల్లి ఎక్కడుందో అచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు.
చదవండి: ఏం తప్పు చేశాడని గంగూలీని తప్పించారు?
Comments
Please login to add a commentAdd a comment