బాలీవుడ్ సీరియల్ నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెను సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించినందుకు ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రధాన నిందితుడు రాహుల్ నవ్లానీతో పాటు అతని భార్య దిశపై నోటీసులు జారీ అయినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. నిందితుల సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరిపై రూ.5 వేల రివార్డును సైతం ప్రకటించారు.
(చదవండి: సుశాంత్ సూసైడ్‌ను తట్టుకోలేకపోయింది, కానీ ఇప్పుడు..)
ఇండోర్‌లో నివసించే వైశాలి టక్కర్(29) పొరుగున ఉండే రాహుల్ నవ్లానీ వేధింపులకు గురి చేయడంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని నటి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో ఐదు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైశాలి పెళ్లి చేసుకోబోతోందని తెలిసినప్పటి నుంచి ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నటికి కాబోయే భర్తను కూడా సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
లుక్ అవుట్ నోటీసులు అంటే: తీవ్రమైన నేరాల్లో నిందితులు దేశం విడిచి పారిపోకుండా జారీ చేసే వాటిని లుక్ అవుట్ నోటీసులు అంటారు.
Comments
Please login to add a commentAdd a comment