Look Out Notices
-
చెప్పకుండా శైలజ దేశం దాటారు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ది భారీ కుంభకోణమని, ఈ కేసులో వేలాది చందాదారుల ప్రయోజనాలు కాపాడటం తమ బాధ్యత అని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఇంత పెద్ద స్కాంలో నిందితులుగా ఉన్న రామోజీరావు(ఏ–1), శైలజ (ఏ–2) దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడంలేదని తెలిపింది. మూడుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని చెప్పింది. దర్యాప్తు అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, రికార్డులు చూపించడంలేదని తెలిపింది. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శైలజ దేశం దాటి వెళ్లారని, అందుకే ఆమెపై లుక్ అవుట్ నోటీసులు (ఎల్వోసీ) జారీ చేయాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించింది. దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికే అమెరికా పర్యటనను సాకుగా ఎంచుకున్నారని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ ఎండీ సీహెచ్ శైలజ వేర్వేరుగా దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్ కె.సురేందర్ విచారణ చేపట్టారు. ఈ పిటిషన్లలో ఏపీ సీఐడీ కౌంటర్లు దాఖలు చేసింది. అనంతరం వాదనలకు పిటిషనర్ల తరపు న్యాయవాది రెండు వారాల సమయం కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. కౌంటర్లో ఏపీ సీఐడీ వెల్లడించిన కీలక వివరాలు.. సొంత ప్రయోజనాల కోసం వేల కోట్లు మళ్లించారు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లోని 37 బ్రాంచ్‌ల్లో ఆ సంస్థ రూ.25 వేల నుంచి రూ.కోటి వరకు చిట్లు నడుపుతోంది. వీటిలో చందాదారులు పెద్దఎత్తున పెట్టుబడి పెట్టారు. మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ, బ్రాంచ్ మేనేజర్లు వసూలు చేసిన వేల కోట్ల రూపాయల్ని అక్రమ మార్గాల్లో సొంత సంస్థల్లోకి, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లోకి మళ్లిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. చందాదారులకు చెల్లింపుల్లో విఫలమయ్యారు. ఇవన్నీ నేరపూరిత కుట్ర, విశ్వాస ఉల్లంఘన, మోసం కిందికే వస్తాయి. మార్గదర్శి ఎండీ శైలజపై సీఐడీ ఏడు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ కేసులో మరిన్ని వివరాలు, కీలక ఆధారాలు తెలుసుకోవడానికి శైలజ విచారణ ప్రధానం. దర్యాప్తు సంస్థ ముందు హాజరై ఆమె వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఏప్రిల్ 6న విచారణలో ఆమె సహకరించలేదు. అంతేకాదు అధికారులు అడిగిన ఆర్థిక లావాదేవీల రికార్డులు, డాక్యుమెంట్లు తీసుకురాలేదు. ఆమెకు రాజకీయంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో ఉన్న పరిచయాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసు్తన్నారు. దేశం విడిచి పారిపోయే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే చందాదారులకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. వేలాది చందాదారుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు శైలజను అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు అప్పగించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను కోరాల్సివచ్చింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలని ఏప్రిల్ 22న నోటీసులు జారీ చేశాం. కుటుంబ వ్యవహారాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఏప్రిల్ 27 నుంచి మూడు నాలుగు వారాలు హాజరుకాలేనని ఏప్రిల్ 23న సమాధానం ఇచ్చారు. అనంతరం మే 12న, మే 22న రెండు సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె నిరాకరించారు. ఆమె ఇంట్లోనే విచారణ చేపడతామని చెప్పినా అంగీకరించలేదు. అధికారులకు ఇచ్చిన సమాధానంలో ఎక్కడా అమెరికా వెళ్తున్న విషయం చెప్పలేదు. ఆ సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా దాచి ఉంచారు. విచారణలో సహకరించకపోవడం, నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడం, సమాచారం లేకుండా దేశం దాటి వెళ్లడం.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎల్ఓసీ జారీ చేయాల్సి వచ్చింది. శైలజ చర్యలు రిజర్వు బ్యాంకు చట్టాలకు విరుద్ధం. బ్రాంచిలలో సోదాల సందర్భంగా అధికారులు పలు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై శైలజ నుంచి వివరణ తీసుకోవడం అత్యంత కీలకం. ఇంత పెద్ద ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు సాగుతుంటే.. విదేశాలకు వెళ్లడానికి ఆమె చెప్పిన కారణం ఓ సాకు మాత్రమే. ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించలేదు అని సీఐడీ కౌంటర్లో తెలిపింది. -
కేరళ వైద్యుడు జగ్గుస్వామికి లుకౌట్ నోటీసులు
-
నటి ఆత్మహత్య కేసు.. దంపతులను పట్టిస్తే రివార్డు
బాలీవుడ్ సీరియల్ నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెను సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించినందుకు ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రధాన నిందితుడు రాహుల్ నవ్లానీతో పాటు అతని భార్య దిశపై నోటీసులు జారీ అయినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. నిందితుల సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరిపై రూ.5 వేల రివార్డును సైతం ప్రకటించారు. (చదవండి: సుశాంత్ సూసైడ్‌ను తట్టుకోలేకపోయింది, కానీ ఇప్పుడు..) ఇండోర్‌లో నివసించే వైశాలి టక్కర్(29) పొరుగున ఉండే రాహుల్ నవ్లానీ వేధింపులకు గురి చేయడంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని నటి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో ఐదు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైశాలి పెళ్లి చేసుకోబోతోందని తెలిసినప్పటి నుంచి ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నటికి కాబోయే భర్తను కూడా సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. లుక్ అవుట్ నోటీసులు అంటే: తీవ్రమైన నేరాల్లో నిందితులు దేశం విడిచి పారిపోకుండా జారీ చేసే వాటిని లుక్ అవుట్ నోటీసులు అంటారు. -
చందా కొచర్‌పై సీబీఐ లుక్ అవుట్ నోటీసు
సాక్షి, ముంబై: అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ మాజీ సీంఎడీ చందా కొచర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఐసీఐసీఐ- వీడియోకాన్ రుణ వివాదంలో చందా కొచర్‌పై సీబీఐ లుక్ అవుట్ నోటీసు(ఎల్వోసీ) జారీ చేసింది. ఎకానమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం చందా కొచర్‌తోపాటు ఆమె భర్తదీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా సీబీఊ అధికారులు ఎల్వోసీ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి పారిపోనున్నా రనేఅంచనాల నేపథ్యంలో సీబీఐ ఈ చర్య చేపట్టింది. ఈ మేరకు సీబీఐ ఇమిగ్రేషన్ అధికారులను అప్రమత్తం చేసింది. అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా వీరు విమానాశ్రయాలను దాటిపోరాదని స్పష్టం చేసింది. కాగా 2012లో వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన రూ. 3,250 కోట్ల రుణాల వివాదంపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ కమిటీ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. బ్యాంకు నిబంధనలను ఆమె ఉల్లంఘించారని స్పష్టం చేసింది. దీన్ని అప్పటివరకూ ఆమెను సమర్ధిస్తూ వచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు కూడా పూర్తిగా ఆమోదించింది. అంతేకాదు చందా కొచర్ ఇప్పటికే రాజీనామా చేసినప్పటికీ, నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణిస్తామని పేర్కొంది. అలాగే ఇంక్రిమెంట్లు, బోనస్‌లు, వైద్య చికిత్స పరమైన ప్రయోజనాలు, స్టాక్ ఆప్షన్స్ మొదలైనవి రద్దవుతాయని ప్రకటించింది. మరోవైపు ఈ కుంభకోణంలో సీబీఐ ఇప్పటికే చందా కొచర్, దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ఎండీ వేణుగోపాల్ ధూత్ తదితరులపై క్రిమినల్ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ఐఎన్ఎక్స్ కేసు: కార్తీకి మరో దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు మరో షాక్ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ కార్తీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరం పాత్రపై ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫారినర్ రిజీయనల్ రిజిస్ట్రేషన్ శాఖ ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే మద్రాస్ హైకోర్టు మాత్రం వాటిపై స్టే విధిస్తూ ఆదేశాలివ్వగా, సీబీఐ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కార్తీని ఇండియాను వదిలి వెళ్లకూడదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తూ సెప్టెంబర్ 11వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. లుక్ అవుట్ తేదీని కూడా సెప్టెంబర్ 11 వరకు పొడిగించింది. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాకు కేటాయింపుల విషయంలో అవకతవకలు వెలుగులోకి రాగా, పెద్ద స్కాం బయటపడింది. విచారణలో భాగంగా పదేళ్ల తర్వాత కార్తీ పాత్ర వెలుగు చూడటంతో ఉందంటూ ఈ యేడాది మే 16న కార్తీ నివాసంతోపాటు ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, ఛండీగఢ్ లలో మొత్తం 13 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. కార్తీతోపాటు ఐఎన్ఎక్స్ మీడియా అధిపతులైన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
హనీప్రీత్ కోసం లుక్ అవుట్ నోటీసులు
సాక్షి, ఛండీగఢ్: డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కోసం వేట మొదలైంది. గుర్మీత్‌ను తప్పించేందుకు వ్యూహరచన చేసిన ఆరోపణలపై ఆమెను పట్టుకునేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది. గుర్మీత్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం రోహ్తక్ జైలుకు తరలించే క్రమంలో డేరా అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి గుర్మీత్‌ను తప్పించేందుకు యత్నించారు. అయితే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(నేర విభాగం) సుమిత్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది. ఇక ఫ్లాన్ వెనుక హనీప్రీత్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం కావటంతో ఆమె కోసం గాలిస్తున్నారు. హనీప్రీత్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ అయినట్లు పంచకుల డీసీపీ మన్బీర్ సింగ్ ధృవీకరించారు. అదే సమయంలో ఎర్ర బ్యాగ్ ద్వారా హింసకు పాల్పడాలంటూ అనుచరులకు హనీప్రీత్ సంకేతాలిచ్చారనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున్న నగదుతో ఉడాయించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గుర్మీత్ హనీప్రీత్ సంబంధం ఏంటి?