హనీప్రీత్ కోసం లుక్ అవుట్ నోటీసులు
హనీప్రీత్ ఎక్కడ దాక్కుంది?
Published Fri, Sep 1 2017 9:28 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM
సాక్షి, ఛండీగఢ్: డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కోసం వేట మొదలైంది. గుర్మీత్‌ను తప్పించేందుకు వ్యూహరచన చేసిన ఆరోపణలపై ఆమెను పట్టుకునేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది.
గుర్మీత్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం రోహ్‌తక్ జైలుకు తరలించే క్రమంలో డేరా అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి గుర్మీత్‌ను తప్పించేందుకు యత్నించారు. అయితే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(నేర విభాగం) సుమిత్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది. ఇక ఫ్లాన్ వెనుక హనీప్రీత్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం కావటంతో ఆమె కోసం గాలిస్తున్నారు.
హనీప్రీత్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ అయినట్లు పంచకుల డీసీపీ మన్బీర్ సింగ్ ధృవీకరించారు. అదే సమయంలో ఎర్ర బ్యాగ్ ద్వారా హింసకు పాల్పడాలంటూ అనుచరులకు హనీప్రీత్ సంకేతాలిచ్చారనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున్న నగదుతో ఉడాయించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Advertisement
Advertisement