Gurmeet Ram Rahim Singh
-
డేరా బాబా నిర్దోషి.. 2002 నాటి కేసులో సంచలన తీర్పు
చంఢీగఢ్: గుర్మీత్ రాం రహీం సింగ్(డేరా బాబా)ను భారీ ఊరట లభించింది. 2002లో జరిగిన డేరా సచ్చా సౌదా మాజీ అధికారి రంజిత్ సింగ్ హత్య కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు డేరా బాబాను మంగళవారం నిర్దోషిగా ప్రకంటించింది. ఈ హత్యకేసులో డేరా బాబాతో పాటు.. జస్బీర్ సింగ్, సబ్దిల్ సింగ్, క్రిషన్ లాల్, అవతార్ సింగ్‌లకు సీబీఐ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం విధించిన శిక్షను డేరా బాబా హైకోర్టులో సవాల్ చేశారు. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా 21 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత నిర్దోషిగా తేలారు.హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమం మాజీ అధికారి రంజిత్ సింగ్. ఆయన జూలై 10, 2002న హత్యకు గురయ్యారు. ఈ హత్యపై కురుక్షేత్రలోని తానేసర్ పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2003లో ఈ హత్యకేసును విచారణ దర్యాప్తు చేయాలని చంఢీగఢ్ హైకోర్టు సీబీఐ ఆదేశించింది. ఈ కేసులు డేరా బాబాతో పాటు మరో నలుగురిపై చార్జ్‌షీట్ దాఖలు చేసి విచారణ చేపట్టింది. అనంతరం డేరా బాబాతో మరో నలుగురికి సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
డేరా బాబాకు ఎదురు దెబ్బ
ఇద్దరు మహిళల అత్యాచార కేసులో దోషి అయిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రామ్ రహీమ్‌కు తరచుగా పెరోల్ ఇవ్వటంపై హర్యానా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇక నుంచి హైకోర్టు నుంచి కచ్చితమైన అనుమతి లేకుండా రామ్ రహీమ్‌కు ఎటువంటి పేరొల్ మంజూరు చేయకూడదని హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 19న ఆయన పెరోల్ మంజూరు అయింది. ఇప్పటివరకు గడిచిన పది నెలల్లో ఇది ఏడోసారి కాగా, మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో తొమ్మిదోసారి ఆయన పెరోల్ పొందారు. తాజాగా ఆయన మరోసారి తనకు పెరోల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన పంజాబ్, హర్యానా హైకోర్టు.. హర్యానా ప్రభుత్వం తీవ్ర అసహం వ్యక్తం చేసింది. గతంలో రమ్ రహీం వలే.. ఎంతమంది దోషులకు పెరోల్ ఇచ్చారో? ఎన్ని రోజులు ఇచ్చారో? ఎంత మందికి పెరోల్స్ ఆమోదం పొందాయో అనే పూర్తి వివరాలు తమకు సమర్పించాలని హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే రామ్ రహీం మూడు ముఖ్యమైన సందర్భాల్లో 91 రోజులు పెరోల్‌పై జైలు బయట వచ్చారు. 21 రోజులు నవంబర్‌లో, 30 రోజులో జూలైలో, 40 రోజులు గత జనవరిలో తన పుట్టిన రోజు సందర్భంగా పెరోల్ పొందారు. ఇక..తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీంను 2017లో హర్యానాలోని పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. అయినకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తనకు తరచు పెరోల్ జారీ చేయటంలో రాజకీయ కోణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో నిర్వమించు పలు ఎన్నికలు. ఎందుకుంటే రామ్ రహీం అభిమానులు, భక్తులు ఎక్కువగా మాల్వా సామాజిక వర్గానికి ఉన్నారు. అయితే ఆ సామాజిక వర్గం ఓట్లు హర్యానాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ సమాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొత్తం 117 అసెంబ్లీ సీట్లలో 69 సీట్లలో ప్రాబల్యం కలిగిఉంటారు. ఈ నేపథ్యంలో రామ్ రహీంకు పెరోల్ వచ్చేలా చేసి.. తన అనుచరులు, భక్తులైన మాల్వా సామాజిక వర్గం ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 2022, ఫిబ్రవరిలో పంజాబ్ ఎన్నికల సయయంలో 21 రోజుల పెరోల్ పొందారు. అదే ఏడాది హర్యానా మున్సిపల్ ఎన్నికల వేళ జూన్‌లో కూడా 30 రోజుల పెరోల్ పొందారు. గత ఏడాది అక్టోబర్‌లో సైతం హర్యానాలోని అదమ్‌పూర్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగినప్పుడు ఆయనకు 40 రోజులు పెరోల్ లభించింది. -
డేరా బాబా.. హార్డ్‌కోర్ క్రిమినల్ కాదంట!
డేరా సచ్ఛ సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జడ్ ఫ్లస్ లెవల్ సెక్యూరిటీ అందించడం తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఖలిస్థాన్ ప్రేరేపిత సంస్థల నుంచి డేరా బాబాకు ప్రాణహాని ఉందన్న కారణం చెబుతూ.. జెడ్‌ఫ్లస్ లెవల్ ప్రొటెక్షన్ కల్పించింది హర్యానా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. అభ్యంతరాలపై హర్యానా సర్కార్ వివరణ ఇచ్చుకుంది. ఫర్లాగ్(తాత్కాలిక సెలవు) మీద ప్రస్తుతం బయట ఉన్న డేరాబాబాకు జెడ్‌ఫ్లస్ సెక్యూరిటీ అందించడం తప్పేం కాదని సమర్థించుకుంది. ఈ మేరకు హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ‘డేరా సచ్ఛ సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ హార్డ్ కోర్ క్రిమినల్ ఏంకాదు. శిక్షలు అనుభవిస్తున్న కేసుల్లోనూ స్వయంగా ఆయనే హత్యలు చేయలేదు. నేరపూరిత కుట్ర, సహ నిందితుడిగా మాత్రమే ఉన్నారు. హర్యానా ప్రిజనర్స్ యాక్ట్ కూడా ఆయన్ని హార్డ్ కోర్ క్రిమినల్‌గా పరిగణించకూడదని చెబుతోంది’ అని జైళ్ల శాఖ రూపొందించిన ఆ నివేదికను హైకోర్టుకు సమర్పించింది ప్రభుత్వం. 2017లో పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. అత్యాచార కేసులో ఇరవై ఏళ్ల శిక్ష, మేనేజర్‌తో పాటు ఓ జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్ఛ సౌధా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైలులో ప్రస్తుతం డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో హర్యానా జైళ్ల శాఖ 21 రోజుల ఫర్లాగ్ జారీచేయగా.. ఫిబ్రవరి 7వ తేదీన బయటకు వచ్చిన గుర్మీత్ తన గురుగ్రామ్ ఆశ్రమంలో ఉంటున్నాడు. అయితే పంజాబ్ ఎన్నికలను ప్రభావం చేసేందుకే డేరా బాబా బయటకు వచ్చాడని, పైగా ఒక క్రిమినల్‌కు జెడ్ ఫ్లస్ సెక్యూరిటీ అందించడం ఏంటని? అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వాన్ని వివరణ కోరింది హైకోర్టు. వివరణ.. సునారియా జైళ్ల సూపరిడెంట్ సునీల్ సంగ్వాన్ ఈ మేరకు హర్యానా ప్రభుత్వం తరపున హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. హర్యానా అడ్వొకేట్ జనరల్ నుంచి న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్నాకే గుర్మీత్‌కు ఫర్లాంగ్ జారీ చేసినట్లు వెల్లడించారు. డేరా చీఫ్‌ను హర్యానా గుడ్ కండక్ట్ ప్రిజనర్స్(టెంపరరీ రిలీజ్)యాక్ట్ కింద హార్డ్‌కోర్ క్రిమినల్‌గా పరిగణించరాదని ఏజీ జనవరి 25నే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారతదేశంలో భద్రతా కేటగిరీ X, Y, Y-Plus, Z మరియు Z-Plus. చివరిది జెడ్ ఫ్లస్ వర్గం ప్రముఖులకు మాత్రమే కేటాయించబడుతుంది. ఈ కేటగిరీలు కాకుండా.. SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కవర్ కేవలం ప్రధాని, వాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రమే కల్పిస్తారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంకలకు కూడా ఎస్పిజి భద్రత కల్పించారు. కానీ ఇది తరువాత Z-ప్లస్ కేటగిరీకి మార్చేశారు. Z-ప్లస్ కేటగిరీలోని వ్యక్తులు మొబైల్ సెక్యూరిటీకిగానూ 10 మంది భద్రతా సిబ్బందిని, నివాస భద్రత కోసం ఇద్దరిని (ప్లస్ ఎనిమిది మంది) అందిస్తారు. Z-Plus స్థాయి భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు అందిస్తారు. -
డేరా బాబాకు జీవిత ఖైదు
చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో అదే సంస్థ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తోపాటు మరో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. రామ్ రహీమ్ సింగ్, కృషాన్ లాల్, జస్బీర్ సింగ్, అవతార్ సింగ్, సబ్‌దిల్‌కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసినట్లు సీబీఐ ప్రత్యేక ప్రాసిక్యూటర్ హెచ్.పి.ఎస్.వర్మ తెలిపారు. రామ్ రహీమ్ సింగ్‌కు రూ.31 లక్షలు, సబ్‌దిల్‌కు రూ.1.50 లక్షలు, జస్బీర్ సింగ్‌కు రూ.1.25 లక్షలు, కృషాన్లాల్కు రూ.1.25 లక్షలు, అవతార్ సింగ్‌కు రూ.75 వేల జరిమానా న్యాయస్థానం విధించింది. దోషుల నుంచి జరిమానా సొమ్ము వసూలు చేసి, బాధిత కుటుంబానికి అందజేయాలని అధికారులను ఆదేశించింది. రామ్ రహీమ్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్న డేరా సచ్ఛా సౌదా అనుచరుడైన రంజిత్ సింగ్ అదే సంస్థలో మేనేజర్‌గా పనిచేశాడు. హరియాణా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లాలోని ఖాన్పూర్ కొలియాన్ గ్రామంలో 2002 జూలై 10న రంజిత్ సింగ్‌కు కాల్చి చంపారు. డేరా సచ్ఛా సౌదా ప్రధాన ఆశ్రమంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి వివరిస్తూ ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖ వెనుక రంజిత్ సింగ్ హస్తం ఉందన్న అనుమానంతో అతడిని హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ స్వీకరించింది. రంజిత్ సింగ్‌ను అంతం చేసేందుకు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కుట్ర పన్నినట్లు సీబీఐ తన చార్జిషీట్లో వెల్లడించింది. డేరా బాబా ప్రస్తుతం సునారియా జైలులో ఉన్నాడు. -
మాజీ మేనేజర్ హత్య కేసులో దోషి డేరా బాబా
చండీగఢ్: డేరా సచ్చా సౌదా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా అధిపతి గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్‌ను దోషిగా సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చింది. తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడినందుకు 2017లో 20 ఏళ్ల జైలు శిక్ష పడటంతో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరాబాబా ప్రస్తుతం రొహ్‌తక్‌లోని సునరియా జైలులో ఉన్నాడు. పంచ్‌కులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రంజిత్ సింగ్ కేసుపై శుక్రవారం విచారణ జరిపింది. ఈ కేసులో క్రిషన్ లాల్, జస్బీర్ సింగ్, అవ్తార్ సింగ్, సబ్దిల్లను కూడా దోషులుగా తేల్చినట్లు సీబీఐ స్పెషల్ ప్రాసిక్యూటర్ హెచ్‌పీఎస్ శర్మ తెలిపారు. ఈ కేసు తీర్పు ఈ నెల 12వ తేదీన వెలువడనుందని వివరించారు. డేరా ప్రధాన కార్యాలయంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న తీరుపై బయటకు వచ్చిన ఒక ఆకాశరామన్న ఉత్తరం వెనుక రంజిత్ సింగ్ హస్తం ఉన్నట్లు డేరా చీఫ్ అనుమానించాడని, ఆ నేపథ్యంలోనే 2002లో అతడు హత్యకు గురయ్యాడని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. రామ్‌చందర్ ఛత్రపతి అనే జర్నలిస్ట్ హత్య కేసులోనూ రెండేళ్ల క్రితం డేరాబాబాకు కోర్టు జీవిత ఖైదు విధించింది. చదవండి: (సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన చైనా) -
జర్నలిస్ట్ హత్య కేసు: డేరా బాబాకు యావజ్జీవ శిక్ష
-
‘రామ్‌రహీమ్‌ను దోషిగా తేల్చడాన్ని స్వాగతిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రాంచందర్ చత్తర్‌పతి హత్య కేసులో డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మిత్ రామ్‌రహీమ్‌ను దోషిగా తేల్చడాన్ని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ప్రధాన కార్యదర్శి సబీనా ఇందర్జిత్ స్వాగతించారు. బాధిత జర్నలిస్టు కుటుంబంతో పాటు, యావత్ జర్నలిస్ట్ సమాజానికి న్యాయం దక్కిందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2002 మేలో డేరా సచ్చాసౌదాలో సాధ్వీలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని ఓ సాధ్వి ఇచ్చిన ఫిర్యాదును తాను నిర్వహించే ‘పూచ్ సచ్’అనే పత్రికలో చత్తర్‌పతి ప్రచురించారని తెలిపారు. 2002 అక్టోబర్ 24న చత్తర్‌పతి ఆయన నివాసంలోనే హత్యకు గురైన కేసును 2003లో రిజిష్టర్ చేయగా 2006లో సీబీఐకు అప్పగించారన్నారు. పన్నెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత సీబీఐ కోర్టు రామ్‌రహీమ్‌తో పాటు, మరో ముగ్గురిని దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు. ఈ కేసులో రామ్‌రహీమ్‌కు కఠినశిక్ష విధించాలన్న చత్తర్‌పతి కుమారుడు అన్షూ్షల్ డిమాండ్‌కు ఐజేయూ మద్దతు తెలుపుతోందని ప్రకటించారు. -
డేరా బాబాకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరో కేసులో జైలు శిక్షపడనుంది. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసుపై పంచకుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. డేరాబాబాతో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషిగా తేల్చింది. నలుగురు దోషులకు జనవరి 17న శిక్షలు ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్తక్ సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సిర్సాలోని డేరా సచ్చా సౌద హెడ్ క్వార్టర్స్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి వెలుగులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో 2002 అక్టోబరులో జర్నలిస్ట్ రామచంద్రను డేరాబాబా అనుచరులు దారుణంగా హత్యచేశారు. (జేజేల నుంచి.. జైలు దాకా...!) ఇక ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్షపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీర్పు వెలువరించాక జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో 36 మంది చనిపోయారు. ఈ క్రమంలో మళ్లీ అలాంటి ఘటనలు జరగకుడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. డేరాబాబా దోషిగా తేలిన నేపథ్యంలో పంచకుల ప్రత్యేక కోర్టు ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘాపెట్టారు. (రూ. 20 సంపాదిస్తున్న డేరా బాబా) -
రూ. 20 సంపాదిస్తున్న డేరా బాబా
రోహ్తక్, హర్యానా : డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు రోహ్తక్ జైల్లో 0.2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో డేరా బాబా కూరగాయలు పండిస్తూ రోజుకు 20 రూపాయల వరకూ సంపాదిస్తున్నారు. జైల్లోకి వెళ్లిన నాటి నుంచి ఇప్పటివరకూ గుర్మీత్ ఒకటిన్నర క్వింటాళ్ల బంగాళదుంపలు పండించారు. అంతేకాకుండా తనకు కేటాయించిన స్థలంలో డేరా బాబా అలోవేరా, టమోటాలు, సొర కాయలు, బీర కాయలు కూడా పండిస్తున్నట్లు పేరు తెలుపడానికి ఇష్టపడని జైలు అధికారి ఒకరు వెల్లడించారు. రోజుకు రెండు గంటల పాటు వ్యవసాయ క్షేత్రంలో డేరా బాబా శ్రమిస్తున్నారని వివరించారు. డేరా బాబా పండించిన కూరగాయలను జైలులో వంటకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. కూరగాయల ద్వారా సంపాదించిన సొమ్ము గుర్మీత్ చేతికి అందడం లేదని చెప్పారు. జైలులో ఉన్న వారి శ్రమకు వచ్చే ధనాన్ని ఆన్లైన్ ద్వారా అకౌంట్లలో వేస్తారని తెలిపారు. హర్యానా హైకోర్టు గుర్మీత్ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని ఆదేశించడంతో సంపాదించిన సొమ్ము సైతం డేరా బాబాకు అందడం లేదని చెప్పారు. జైలులోని వారికి అధ్యాత్మిక బోధనలు చేసేందుకు అనుమతించాలని కూడా డేరా బాబా ప్రభుత్వానికి వినతి పెట్టుకున్నారని వెల్లడించారు. అయితే, ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. కాగా, 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాను రోహ్తక్ జైల్లోని ప్రత్యేక బారాక్‌లో ఉంచుతున్న విషయం తెలిసిందే. జైలుకి వెళ్లిన నాటి నుంచి డేరా బాబా ఆరు కిలోల బరువు తగ్గారు. వ్యవసాయ క్షేత్రంలో చెమటోడ్చుతుండటంతో ఆయన ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడినట్లు తెలుస్తోంది. -
సెక్స్ రాకెట్లో.. డేరా బాబా శిష్యుడు
న్యూఢిల్లీ : అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ శిష్యుడొకరు పశ్చిమ బెంగాల్లో సెక్స్ రాకెట్ నడుపుతూ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. పశ్చిమ బెంగాల్ లో ప్రమోద్ సింఘానియా తనకు చెందిన ఓ బిల్డింగ్‌లో వేశ్య గృహాలను నడుపుతున్నాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేశారు. పోలీసులు రావడం గమనించిన ఇంటియజమాని, నిందితుడు ప్రమోద్ సింఘానియా ప్రత్యేకంగా నిర్మించిన సొరంగమార్గం గుండా తప్పించుకున్నాడు. సొరంగం కనిపించకుండా నిర్మించిన చెక్క డోర్ పై దుస్తులు కప్పి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. చెక్కలతో నిర్మించిన 25 క్యాబిన్లను బిల్డింగ్‌లోని ఓ అంతస్తులో పోలీసులు కనుగొన్నారు. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. దాడులకు కొద్దిసేపటి ముందు అక్కడే ఉన్న మైనర్ బాలికలు, సింఘానియా తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. మరికొందరు మైనర్ బాలురు, బాలికలను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మురం చేశామన్నారు. -
సావంత్‌కు ‘సవతి’ షాక్!
రోహ్తక్ : డేరా బాబా గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్ దత్తపుత్రిక, పంచకుల అల్లర్ల కేసులో ప్రధాన నిందితురాలు అయిన హనీప్రీత్ ఇన్సాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. డేరా బాబా-హనీప్రీత్‌ల అనుబంధంపై ‘సవతి’ వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి రాఖీ సావంత్‌పై పరువునష్టం దావా దాఖలైంది. హనీప్రీత్ తల్లి ఆశా తనేజా ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదయినట్లు రోహ్తక్ పోలీసులు తెలిపారు. రాఖీ ప్రధాన పాత్రలో గుర్మీత్-హనీలపై రూపుదిద్దుకున్న సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో తాజా వివాదం చర్చనీయాంశమైంది. రూ.5కోట్లు డిమాండ్ : ‘‘నటి రాఖీ సావంత్ అడ్డగోలుగా మాట్లాడి నా కూతురి(హనీప్రీత్) పరువుతీసింది. తప్పును ఒప్పుకుని 30 రోజుల్లోగా క్షమాపణలు చెప్పిందా సరేసరి. లేదంటూ రూ.5 కోట్లు చెల్లించాలి’’ అని ఆశా తనేజా డిమాండ్ చేశారు. అసలు రాఖీ ఏమంది? : గత ఆగస్టులో గుర్మీత్, హనీప్రీత్‌లు అరెస్టయిన సందర్భంలో రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతూ వారి అనుబంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక దశలో నేను(రాఖీ) డేరా బాబాకు చాలా దగ్గరయ్యాను. మా ఇద్దరిదీ పవిత్రబంధం. ఎందుకోగానీ హనీప్రీత్‌కు ఇది నచ్చేదికాదు. బాబాకు నాకు మధ్య సాన్నిహిత్యాన్ని ఆమె(హనీ) జీర్ణించుకోలేకపోయేది. ఆయనను పెళ్లి చేసుకుంటే ఎక్కడ సవతిని అవుతానోనని హనీ భయపడేది’’ అంటూ రాఖీ బాంబు పేల్చారు. తద్వారా గుర్మీత్-హనీప్రీత్లది తండ్రీకూతుళ్ల బంధం కాదని బయటపెట్టేయత్నం చేశారు. జైలులోని గుర్మీత్, హనీప్రీత్ : లైంగికదాడి కేసులో 20 ఏళ్ల శిక్ష పడటంతో డేరా బాబా గుర్మీత్ జైలుకు వెళ్లారు. ఆయనకు శిక్ష ఖరారు సమయంలో పంచకుల, రోహ్తక్ సహా హరియాణాలోని పలు పట్టణాలు, పంజాబ్‌లోని ఒకన్ని చోట్ల డేరా అనుచరులు హింసకు పాల్పడ్డారు. నాటి అల్లర్లలో 20మందికిపైగా చనిపోయారు. ఆయా కేసులకు సంబంధించి ప్రధాన నిందితురాలిగా ఉన్న హనీప్రీత్.. అనంతరకాలంలో అరెస్టయ్యారు. గుర్మీత్ నేరాలలోనూ ఆమెకు సంబంధాలున్నట్లు పోలీసు ద్యాప్తులో వెల్లడైంది. -
2017 : సంచలన తీర్పులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలకు భారత న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచిన ఏడాది ఇది. ట్రిపుల్ తలాక్, ఆరుషి హత్య కేసు, వ్యక్తిగత సమాచారం గోప్యత హక్కు ఇలా పలు అంశాల్లో కోర్టులు చరిత్రలో నిలిచిపోయేలా తీర్పులను వెలవరించాయి. ట్రిపుల్ తలాక్ ట్రిపుల్ తలాక్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ.. సుప్రీంకోర్టు ఈ ఏడాది చారిత్రాత్మక తీర్పును వెలవరించింది. ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం మహిళల హక్కులను కాలరాసేలా ఉందని సుప్రీం స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించింది. వ్యక్తిగత సమాచారం గోప్యత హక్కు గోప్యత హక్కు అనేది ప్రజల ప్రాథమిక హక్కుగా సుప్రీం సంచలన తీర్పును వెలవరించింది. తొమ్మిదిమంది న్యాయమూర్తుల బెంచ్.. దీనిని ఏకగ్రీవంగా ప్రాథమిక హక్కుగా పరిగణించాలని ప్రకటించింది. 2జీ కుంభకోణం యూపీఏ హయాంలో సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రం స్కామ్‌పై పాటియాలా కోర్ట్ సంచలన తీర్పును ప్రకటించింది. 2జీ స్కామ్‌లో దోషులుగా ముద్రపడిన మాజీ టెలికాం మంత్రి ఏ రాజీ, డీఎంకే మాజీ ఎంపీ కనిమొళిలు నిర్దోషులుగా పాటియాలా కోర్టు ప్రకటించింది. మైనర్ భార్యతో..! మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్న అది రేప్ కిందకే వస్తుందని సుప్రీంకోర్టు అనూహ్యమైన తీర్పును ప్రకటించింది. బాల్య వివాహాలను నిరోధించడానికి ఈ తీర్పు దోహదం చేస్తుందని నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. డేరాబాబా డేరా బాబాగా గుర్తింపు పొందిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌పై పంచకుల సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలవరించింది. తీర్పు తరువాత పంచకుల కోర్టు బయట డేరా అనుచరులు విధ్వంసం సృష్టించారు. ఇద్దరు మహిళలపై అత్యాచారాలు చేశాడన్న అభియోగంపై డేరా బాబాను దోషిగా నిర్ణయిస్తూ కోర్టు తీర్పును ప్రకటించింది. ఆరుషి హత్య కేసు సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్యకేసులో తల్లిదండ్రులు నూపర్, రాజేష్ తల్వార్లను అలహాబాద్ హైకోర్టును నిర్దోషులుగా ప్రకటించింది. 2013 నుంచి దాస్నా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దంపతులు కోర్టు తీర్పుతో ఈ ఏడాది బయట ప్రపంచంలోకి అడుగుపెట్టారు. శశికళను వెంటాడిన ఆస్తుల కేసులు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళను ఆస్తుల కేసులు వెంటాడాయి. 2016లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అంతేకాక ఆస్తుల కేసులో శశికళతో పాటు మరో ముగ్గురిని సుప్రీంకోర్టు దోషులుగా ప్రకటించింది. దీంతో సీఎం ఆఫీస్‌కు వెళ్లాలని కలలుగన్న శశికళ.. బెంగళూరులోని పరప్పణ జైలుకు వెళ్లాల్సివచ్చింది. -
‘నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు’
సాక్షి, అంబాలా : గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రిక, పంచకుల అల్లర్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న హనీప్రీత్ ఇన్సాన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పంచకుల అల్లర్ల కేసును వాదిస్తున్న ముగ్గురి లాయర్లకు ఫీజు ఇచ్చేందుకు తన దగ్గర ఒక్కరూపాయి కూడా లేదని హనీప్రీత్ ఇన్సాన్ జైలు అధికారులకు లేఖ రాశారు. పంచకుల అల్లర్ల తరువాత సీజ్ చేసిన తన బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకునే సదుపాయాన్నికల్పించాలని ఆమె జైలు అధికారులకు కోరారు. డేరా సచ్చాసౌధా మాజీ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు రేప్ కేసులో 20 పంచకుల కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో జరిగిన అల్లర్లకు హనీప్రీత్ సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ అల్లర్ల కోసం హనీ ప్రీత్ రూ. 2 కోట్లు ఖర్చు చేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ కేసును సిట్ అధికారలు ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన లాయర్లకు ఫీజు చెల్లించేందుకుతన వద్ద ఒక్క రూపాయి కూడా లేదని.. సీజ్ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బును డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించాలంటూ ఆమె జైలు అధికారులను కోరారు. పంచకుల అల్లర్ల తరువాత 38 రోజులు పాటు హనీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే డేరాకు సంబందించిన బ్యాంక్‌కు ఖాతాలతో పాటు హనీప్రీత్ బ్యాంక్ ఖాతాలను అధికారులు సీజ్ చేశారు. -
గుర్మీత్‌కు వ్యతిరేకంగా నాతో వాంగ్మూలం ఇప్పించాడు
సాక్షి, న్యూఢిల్లీ : డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌పై దాఖలైన హత్య కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుర్మీత్‌కు వ్యతిరేకంగా వాంగ్ములం ఇచ్చిన మహిళ సంచలన ప్రకటన చేసింది. డేరాను అభాసుపాలు చేసేందుకే డేరా బాబా మాజీ డ్రైవర్ ప్రయత్నిస్తున్నాడని పేర్కొంది. సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి, డేరా మాజీ మేనేజర్ రంజిత్ హత్యకేసులకు సంబంధించి గుర్మీత్ మాజీ డ్రైవర్ ఖట్టా సింగ్ ఫిర్యాదు మేరకు కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలు సమర్థించేలా కౌర్ అనే మహిళతో అతను అతను వాంగ్మూలం కూడా ఇప్పించాడు. అయితే ఆ మహిళ మాత్రం ఇప్పుడు తాను ఇష్టపూర్వకంగా ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదని అంటోంది. డేరాను, గుర్మీత్ బాబాను అభాసుపాలు చేసేందుకే ఖట్టా సింగ్ ఈ ఆరోపణలు చేస్తున్నాడని ఆమె చెబుతోంది. బాబాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకపోతే ఖట్టాసింగ్ తనను చంపేస్తానని బెదిరించాడని.. చివరకు తనను కిడ్నాప్ చేసేందుకు కూడా యత్నించారని ఆమె తెలిపింది. ప్రస్తుతం జంట హత్యల కేసు విచారణ చివరిదశలో ఉన్న తరుణంలో కౌర్ వ్యాఖ్యలు కీలకంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇద్దరు సాధ్వీలను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై గుర్మీత్‌కు పంచకుల ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా.. ప్రస్తుతం రోహ్తక్ సునరియా జైలులో గుర్మీత్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. -
జైలులో డేరా బాబాకు రాజభోగాలు
చంఢీగఢ్ : ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా గుర్మీత్ రాం రహీమ్ సింగ్ రోహ్తక్ సునారియా జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఇటీవల జైలునుంచి విడుదలైన ఓ నిందితుడు రాహుల్ జైన్ పలు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు. తోటమాలిగా పనిచేస్తున్నందుకు డేరా బాబాకు రోజుకు రూ. 20 చొప్పున ఇస్తున్నామని పోలీసులు చెప్పినదాంట్లో వాస్తవం లేదన్నాడు. 'ముందుగా గుర్మీత్‌కు జైలులో ప్రత్యేక గది ఇచ్చారు. ఆ గది చుట్టుపక్కలకు కూడా ఇతర ఖైదీల్ని అనుమతించేవారు కాదు. ఆపై కావాలసినప్పుడల్లా పాలు, మినరల్ వాటర్, జ్యూస్‌లు అందిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సాధారణ ఖైదీల బంధువులు, సన్నిహితులు జైలుకు వస్తే కేవలం 20 నిమిషాలు మాత్రమే ఖైదీల్ని కలిసేందుకు పర్మిషన్ ఇస్తారు. కానీ డేరా బాబా మాత్రం గంటల తరబడి తనను కలిసేందుకు వచ్చేవారితో ముచ్చటిస్తాడు. అతడు ఏ పని చేయడం లేదని, కానీ తోటమాలిగా చేస్తున్నందుకు రోజుకు 20రూపాయలు గుర్మీత్‌కు ఇస్తున్నట్లు అందర్ని నమ్మిస్తున్నారని' జైలులో ఉన్పప్పుడు గుర్మీత్ తోటి ఖైదీ అయిన రాహుల్ వివరించాడు. నిన్న (సోమవారం) గుర్మీత్‌ను కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వారు ఎందుకు కలిశారు, గుర్మీత్‌తో ఏం మాట్లాడారన్న దానిపై పోలీసులు, జైలు అధికారులు నోరు మెదపడం లేదని సమాచారం. -
కోట్లల్లో విరాళాలు...స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్ ఆమెదే..
-
స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్ ఆమే...
సాక్షి,న్యూఢిల్లీ: అత్యాచారం కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడనేది వెల్లడైంది. ఆర్టీఐ సమాచారం కింద వెలుగులోకి వచ్చిన ఈ అంశాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. డేరా బాబా వ్యాపార కార్యకలాపాల విస్తరణకు అనుచరులు, డేరా మద్దతుదారులు అందించిన విరాళాలను వాడుకున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గుర్మీత్ వ్యాపార వ్యూహాలు, సినీ, ఈవెంట్ రంగాల్లో ప్రవేశానికి హనీప్రీత్ సూచనలే కారణమని తెలిసింది. మత విశ్వాసాలు, ఆథ్యాత్మిక కార్యక్రమాల పేరిట డేరా బాబా ఏటా కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దేశవిదేశాల నుంచి వసూలు చేసేవారు. ఈ నిధులను వ్యాపార కార్యక్రమాల విస్తరణకు వినియోగించడంతో డేరా సచ్చా సౌథా కాస్తా అనతికాలంలోనే కార్పొరేట్ సామ్రాజ్యంగా విస్తరించింది. మరోవైపు సామాజిక, ఆథ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ కావడంతో డేరా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందింది. సంస్థ ఆర్థిక లావాదేవీల వివరాలను ఇచ్చేందుకు ఆదాయ పన్ను శాఖ నిరాకరించినా ఆర్టీఐ కింద సమాచారం కోరడంతో బాబా విన్యాసాలు వెలుగుచూశాయి. 2010-11లో డేరా రూ 50 కోట్ల పైగా నికర లాభం ఆర్జించింది. అంటే సంస్థ టర్నోవర్ ఏ రేంజ్లో ఉందో సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఇందులో డేరా నికర లాభం 30 కోట్లు కాగా, అనుబంధ సంస్థ షా సత్నం జీ రీసెర్చి ఫౌండేషన్ 16.5 కోట్లు నికర లాభం సాధించింది.హనీప్రీత్ సింగ్ తన నెట్వర్కింగ్ నైపుణ్యాలతో సంస్థకు నిధులు, విరాళాలు సమకూర్చేదని చెబుతున్నారు. హనీప్రీత్ పాత్ర ఏంటి.. హనీప్రీత్ సలహా మేరకే గుర్మీత్ మ్యూజికల్ నైట్స్ ప్రారంభించారని డేరా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మ్యూజికల్ నైట్స్ డేరా అనుచరుల్లో క్రేజ్‌ను సంతరించుకున్నాయి. ఇవి ఎంతలా ఆదరణ పొందాయంటే ఒక్కో రాత్రికి కోట్ల రూపాయలు డేరాకు వచ్చిపడేవని తెలుస్తోంది. ఈ షోల్లో గుర్మీత్ సింగ్ తన గానకళకు పదునుపెట్టి తన పాపులర్ సాంగ్స్ లవ్ చార్జర్‌ను ఆలపిస్తూ భారీ మొత్తాలను షోలకు రాబట్టేవాడు. డేరా సినిమాలు కూడా హనీప్రీత్ ఆలోచనల్లోంచే పుట్టాయి. వీటిలో కొన్ని సినిమాలు 100 కోట్ల క్లబ్‌లోకి చేరాయి. ఆ డబ్బు ఎక్కడ..? డేరా ఆదాయంలో విరాళాలతో పాటు మ్యూజిక్ షోలు, సినిమాలు ప్రధాన వనరులుగా చెబుతారు. నగదు విరాళాల ద్వారా ప్రధాన ఆదాయం డేరాకు సమకూరుతోంది. అయితే డేరా ప్రాంగణంలో పోలీసుల సోదాల్లో కొద్దిపాటి నగదు మాత్రమే లభ్యం కావడం పలు సందేహాలకు తావిస్తోంది. అక్రమంగా దాచిన నగదు నిల్వలను గుర్మీత్ అనుచరులు డేరా నుంచి బయటకు పంపారని భావిస్తున్నారు. హర్యానాలోని సిర్సాలో డేరా ప్రధాన కార్యాలయం నుంచి ఆగస్టు 28 రాత్రి హనీప్రీత్ రెండు పెద్ద సైజ్ ట్రావెల్ బ్యాగ్‌లతో అదృశ్యమయ్యారనే ప్రచారం సాగింది. హనీప్రీత్ ఈ సొమ్మును ఎక్కడికి తరలించారనే దానిపై పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు.డేరాలో సాగుతున్న దర్యాప్తులో మనీల్యాండరింగ్ ఆరోపణలనూ విచారిస్తున్నారు. -
కీలక విషయాలు బయటపెట్టిన హనీప్రీత్
-
గుర్మీత్ పీఏను చూసి సీబీఐ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రాం రహీమ్ సింగ్ పై నమోదయిన మరికొన్ని కేసుల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో 400 మందిని నంపుసకులుగా మార్చారన్న కేసు ఒకటి. డేరాబాబా మాజీ అనుచరుడు హంసరాజ్ చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అది ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ప్రత్యేక కోర్టు అనుమతితో బుధవారం రోహ్తక్ జైల్లో ఉన్న గుర్మీత్ నుంచి సీబీఐ స్టేట్మెంట్ను నిన్న రికార్డు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు త్వరలో పూర్తి నివేదికను పంజాబ్ హర్యానా హైకోర్టుకు అందిస్తామని సీబీఐ తెలిపింది. అందులోని సమాచారం ప్రకారం... భగవంతుడిని చేరాలంటే మగతానాన్ని పరిత్యజించి తనను పూజించాలని గుర్మీత్ చెప్పేవాడని.. 2000 సంవత్సరంలో తనతోపాటు మరో 400 మంది వృషణాలను తొలగించి నపుంసకులుగా మార్చాడని హంసరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు తనకు నష్టపరిహారం ఇప్పించాలని 2012లో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు కూడా. దీంతో సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశించగా.. 2015లో కేసు కూడా నమోదు అయ్యింది. డేరాలోని డాక్టర్లే ఈ శస్త్రచికిత్సలు చేశారని దర్యాప్తులో సీబీఐ అధికారులు గుర్తించారు. స్త్రీలను శృంగారానికి వాడుకున్న డేరా బాబా, అనుచరులను మాత్రం నపుంసకులుగా మార్చిన సంగతి తెలిసిందే. చివరకు డేరాబాబా తన వ్యక్తిగత సలహాదారు రాకేష్‌ను కూడా వదల్లేదు. తాను వద్దని వేడుకుంటున్నా తనకు కూడా ఆపరేషన్ చేయించాడని రాకేష్ తెలిపాడు. రాకేష్‌తోపాటు, న్యాయసలహాదారు దాస్‌లకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిద్దరికీ కూడా వృషణాలు లేవని తేలింది. దీంతో షాక్ తిన్న అధికారులు మరికొందరు ప్రధాన అనుచరుల్ని పరీక్షించి చివరకు డేరా బాబా స్టేట్మెంట్ నమోదు చేశారు. గుర్మీత్ దగ్గర పైసల్లేవ్... అత్యాచార కేసులో బాధిత మహిళలకు 30 లక్షలు చెల్లించాలన్న పంచకుల కోర్టు ఆదేశాలపై గుర్మీత్ అభ్యంతరం పిటిషన్ దాఖలు చేశాడు. డేరా ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసినందున బాధితులకు చెల్లించేందుకు తన దగ్గర డబ్బు లేదని పిటిషన్లో గుర్మీత్ పేర్కొన్నాడు. దీంతో కోర్టు గుర్మీత్‌కు రెండు నెలల గడువు విధించింది. అల్లర్ల అనంతరం జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు డేరా సచ్ఛా సౌధా ఆస్తులను జప్తు చేయాలని హర్యానా ప్రభుత్వాన్ని పంచకుల ప్రత్యేక కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. -
అసలు నిజం ఒప్పుకున్న హనీప్రీత్..
ఛండీగఢ్ : వివాదాస్పద దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ఎట్టకేలకు అసలు నిజం ఒప్పుకున్నారు. 38 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పంచకుల అల్లర్లకు పథకం అమలు చేసింది తానేనని నేరాన్ని అంగీకరించారు. ఈమేరకు ఆమె నోరువిప్పి, నిజాలు వెళ్లగక్కారని హరియాణా సిట్ అధికారులు బుధవారం వెల్లడించారు. రేప్ కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దోషిగా తేలి, అరెస్టయిన అనంతరం హరియాణ, పంజాబ్ లలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సీబీఐ కోర్టు ఉన్న పంచకుల పట్టణంలోనైతే హింస తీవ్రరూపం దాల్చడం, అల్లర్లలో 38 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విదితమే. ఈ ఘటనలకు సంబంధించి సూత్రధారిగా భావిస్తోన్న హనీప్రీత్ ను ఇటీవలే అరెస్టు చేశారు. పక్కాగా అమలు చేసిన హనీప్రీత్ : ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో పంచకుల కోర్టు ఆగస్టు 25న గుర్మీత్ ను దోషిగా నిర్ధారించింది. అదే రోజు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు తీర్పు రావడానికి వారం రోజుల ముందే, అంటే ఆగస్టు 17న డేరా ఆశ్రమంలో కీలక సమావేశం ఒకటి జరిగింది. గుర్మీత్, హనీప్రీత్, డేరా ముఖ్యులు కొందరు పాల్గొన్న ఈ భేటీలో వ్యతిరేక తీర్పు వస్తే ఏం చెయ్యాలనేదానిపై ఒక స్కెచ్ గీశారు. ఆ పథకం ప్రకారమే బాబా అరెస్టైన వెంటనే పలు ప్రాంతాల్లో అల్లర్లు రేపారు. సాధారణ ప్రజలే టార్గెట్ గా హింసకు పాల్పడ్డారు. ఇందుకు అవసరమైన సరంజామా, డబ్బులను డేరా ముఖ్యులు సరఫరా చేశారు. ల్యాప్ టాప్ లో కీలక సమాచారం : ఏయే ప్రాంతాల్లో అల్లర్లు రేపాలో ముందే పథకాన్ని రచించడంతోపాటు అందుకు అయ్యే ఖర్చును ఒక్కో డేరా ముఖ్యుడికి అప్పజెప్పారు. ఎవరెవరు ఏయే ప్రాంతాల్లో అల్లర్లు చేయించారు, ఎంతెత డబ్బులు ఇచ్చారు అన్న సమాచారం మొత్తాన్ని హనీప్రీత్ తన ల్యాప్ టాప్ లో స్టోర్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కనిపించకుండా పోయిన ఆ ల్యాప్ టాప్ దొరికితే గనుక అందులోని సమాచారం కేసుకు మరింత ఉపయుక్తం కానుందని సిట్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
మాస్టర్ మైండ్ ‘హనీప్రీత్’
సాక్షి, పంచకుల : డేరా సచ్చాసౌధా మాజీ అధిపతి, రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌బాబా తీర్పు తరువాత జరిగిన అల్లర్లకు ఆయన దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌నే మాస్టర్ మైండ్ అని తెలుస్తోంది. పంచకుల సీబీఐ కోర్టు తీర్పు తీరువాత.. అల్లర్లు, హింసాత్మక ఘటనల కోసం హనీప్రీత్ ఇన్సాన్ కోటి 25 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. గుర్మీత్ వ్యవహారంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిట్ అధికారులు.. తాజాగా గుర్మీత్ వ్యక్తిగత సహాయకుడు రాకేష్ కుమార్‌ని విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలోనే పలు విషయాలు వెలుగు చూశాయని సీట్ అధికారి ఏసీపీ ముఖేష్ తెలిపారు. గుర్మీత్‌పై తీర్పు సమయంలో ఆయనతో పాటు దత్తపుత్రిక హనీప్రీత్, వ్యక్తిగత సహాయకుడు రాకేష్ కుమార్ వెంట ఉన్నారు. తీర్పు వెలువడిన వెంటనే అల్లర్లకు వారు పథకం రచించారని అందుకోసం కోటి 25 లక్షల రూపాయలను వినియోగించారని సిట్ అధికారులు ప్రకటించారు. ఇదే విషయాన్ని పంచకుల కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏఎస్ చావ్లా సైతం ధృవీకరించారు. గుర్మీత్ అరెస్ట్ తరువాత జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు రాకేష్ కుమార్, హనీప్రీత్‌లను విచారణ చేస్తున్నారు. ఈ అల్లర్లకు సంబంధించిన కీలక వ్యక్తులు ఆదిత్య ఇన్సాన్, పవన్ ఇన్సాన్ల కోసం గాలిస్తున్నట్లు అధికారలు తెలిపారు. ఇదిలా ఉండగా హనీప్రీత్, ఆమె భర్త ఇక్బాల్ సింగ్, సుఖ్‌దీప్‌లు డేరా కోర్ కమిటీ సభ్యులుగా సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందులో సుఖ్దీప్ డేరా అనుచరులకు ఆయుధాలను ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. డేరా ప్రధానకార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను ఐటీ విభాగం విశ్లేషణ చేస్తున్నారని చెప్పారు. హార్డ్ డిస్క్‌ల్లోని విషయం బయటకు వస్తే.. మరింత సమాచారం తెలుస్తుందని సిట్ అధికారులు చెబుతున్నారు. -
ముప్పుతిప్పలు పెడుతున్న హనీప్రీత్
సాక్షి, చండీగఢ్ : హరియాణా పోలీసుల నుంచి 38 రోజులపాటు తప్పించుకు తిరుగుతూ ముప్పు తిప్పలు పెట్టిన డేరా బాబా గుర్మీత్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పోలీసుల ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. పంచకుల అల్లర్ల కేసులో పోలీసు అధికారులు ఆమెను మొత్తం 40 ప్రశ్నలు అడగ్గా కేవలం రెండు ప్రశ్నలకు మాత్రమే సూటిగా సమాధానం ఇచ్చారు. 13 ప్రశ్నలకు అసలు సమాధానం ఇవ్వడానికే హనీప్రీత్ నిరాకరించారు. మిగతా 25 ప్రశ్నలకు కాదని, లేదా గందరగోళమైన సమాధానాలు ఇచ్చారు. కోర్టు మొత్తం ఆరు రోజుల కస్టడీ ఇచ్చినందున మరో రెండు పర్యాయాలు ఆమెను విచారిస్తామని, అప్పటికీ హనీప్రీత్ సరైనా సమాధానాలు ఇవ్వక పోయినట్లయితే నార్కో పరీక్షలకు అనుమతి కోరుతామని పంచకుల పోలీసు కమిషనర్ ఏస్ చావ్లా తెలిపారు. డేరా వాహనాల్లో ఎందుకు అక్రమ ఆయుధాలు తీసుకెళ్లారు, సిర్సా వద్ద డేరా వాహనాలన్ని ఎందుకు తగలబెట్టారు, అల్లర్లు సృష్టించేందుకు డేరా అనుచరులకు ఐదు కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారు, అంతర్జాతీయ సిమ్ కార్డుతోపాటు పలు భారత సిమ్ కార్డులను మార్చి మార్చి మాట్లాడడం గురించి అడిగిన ప్రశ్నలకు హనీప్రీత్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. డేరా నుంచి పారిపోయిన డాక్టర్ ఆదిత్యతో వాట్సాప్‌లో చేసిన చాటింగ్‌కు సంబంధించిన రెండు ప్రశ్నలకు మాత్రమే ఆమె సరైన సమాధానాలు ఇచ్చారని పోలీసు కమిషనర్ చావ్లా చెప్పారు. ఆజ్‌తక్, ఇండియా టుడీ టీవీలకు గురువారం ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత హానీప్రీత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. పంచకులలో జరిగిన అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకురాలినని ఆమె టీవీ ఛానళ్లతో చెప్పారు. పంచకుల అల్లర్లలో 30 మంది మరణించడం, 350 మందికిపైగా గాయపడడం తెల్సిందే. ఈ కేసులో హనీప్రీత్‌ను అరెస్ట్ చేయగానే హరియాణా పోలీసులు ఆమెను 43 మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో చేర్చారు. కోర్టు ఆమెను ఆరు రోజుల కస్టడీకి అప్పగించాక ఇన్ని రోజులు పాటు పంజాబ్, హరియాణాలోని ఏయే ప్రాంతాల్లో తలదాచుకున్నారో అక్కడకి హనీప్రీత్‌ను తీసుకొని పోలీసు వెళ్లారు. ఆమెతో కొన్ని రోజులు గడిపిన డేరా బాబా గుర్మీత్ డ్రైవర్ ఇక్బాల్ సింగ్ భార్య సుఖ్దీప్ సింగ్‌ను కూడా తీసుకొని బటిండాకు పోలీసులు వెళ్లారు. అక్కడ హానీప్రీత్ నాలుగు రోజులపాటు తన మామతో కూడా ఉన్నారు. ఆమె వెళ్లిన సంగ్రూర్, తాపమండి, రాంపుర ప్రాంతాలకు కూడా పోలీసులు వెళ్లి ప్రాథమిక విచారణ జరిపారు. -
కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న హనీప్రీత్
హరియాణా : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ పెంపుడు కుమార్తె హనీప్రీత్‌ను హరియాణా పోలీసులు బుధవారం పంచకుల కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం.. ఆమెను ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. గుర్మిత్తో సంబంధాలు, అరెస్ట్ సమయంలో హింస, ఆశ్రమంలో అరాచకాలపై హనీప్రీత్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. కాగా కోర్టులో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, విధ్వంసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. గుర్మిత్ తనకు తండ్రిలాంటివారని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని హనీప్రీత్ అన్నారు. గుర్మీత్ జైలు పాలయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిన హనీప్రీత్‌ను మంగళవారం పంజాబ్‌లోని జిరాక్పూర్–పాటియాలా మార్గంలో అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ (బుధవారం) తెల్లవారుజాము మూడు గంటల వరకూ ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో తనకు ఛాతీనొప్పి వస్తున్నట్లు తెలపటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. హనీప్రీత్ పరీక్షలు నిర్వహించి వైద్యులు...ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం హింసాకాండ చెలరేగిన విషయం విదితమే. నిరసనకారులు మీడియా ఓబీ వ్యాన్లను దగ్ధం చేస్తూ, రాళ్లు విసురుతూ.. వాహనాలను ధ్వంసం చేశారు. ఈ అల్లర్ల కేసుకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ జాబితాలో హనీప్రీత్ ఇన్సాన్ది మొదటి పేరు కావడం గమనార్హం. -
హనీప్రీత్‌కు ఆశ్రయం ఇచ్చిందెవరు?
పంచకుల : ఇన్నాళ్లు పోలీసులకు కనిపించుకుండాపోయిన హనీప్రీత్ సింగ్‌కు ఎవరు ఆశ్రయం ఇచ్చారనే విషయాన్ని పంజాబ్ పోలీసులు శోధిస్తున్నారు. ఆ వివరాలు తెలిస్తే వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించనున్నారు. డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ అరెస్టు అయిన తర్వాత పంచకులలో డేరాలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ప్రాణనష్టం కలిగించడంతోపాటు ఆస్తి నష్టం కూడా కలిగించారు. ఈ అల్లర్లకు కారణం గుర్మీత్ కూతురుగా చెప్పుకునే హనీప్రీత్ అని పోలీసులు భావించారు. ఈ మేరకు ఆమెపై ఆరోపణలు నమోదుచేసి అరెస్టు చేసే లోపే ఆమె తప్పించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ పోలీసులకు కనిపించకుండా దాదాపు 39 రోజులుగా ఉన్నారు. అయితే, ఆమె అనూహ్యంగా మంగళవారం మీడియా ముందుకు వచ్చి జిరాక్పురా-పాటియాలా హైవే వద్ద పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఆమెను సీబీఐ ప్రత్యేక కోర్టుకు తరలించిన పోలీసులు జైలుకు పంపించారు. బుధవారం నుంచి ఆమెను ప్రశ్నించనున్నారు. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు తప్పించుకొని ఉంటున్న ఆమెకు ఎవరు ఆశ్రయం ఇచ్చారనేది కీలకంగా మారింది. 'మంగళవారం 2గంటల ప్రాంతంలో ఆమెను అరెస్టు చేశాం. ఆమెను ఇంకా విచారించాల్సి ఉంది. అలాగే, ఆమెకు ఇన్నాళ్లు ఎవరు ఆశ్రయం కల్పించారనే విషయం కూడా మేం కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది' అని ఈ కేసును విచారిస్తున్న కమినర్ ఏఎస్ చావ్లా తెలిపారు. -
హనీప్రీత్‌పై గుర్మీత్ అత్యాచారం.. రహస్య వారసుడు?
సాక్షి, న్యూఢిల్లీ: రేప్ కేసులో శిక్ష పడిన గుర్మీత్ రాంరహీం సింగ్, హనీప్రీత్ సింగ్ గురించి రోజుకొక రహస్యం వెలుగులోకి వస్తోంది. గుర్మీత్, హనీప్రీత్ రహస్యంగా సంతానం కలిగి ఉండాలని కోరుకున్నారట. తమకు కొడుకు పుడితే.. డేరా స్వచ్ఛసౌదాకు అతన్ని వారసుడిగా కొనసాగించవచ్చునని భావించారట. కానీ, వారి రహస్య వారసుడి ప్లాన్ వర్కౌట్ కాలేదని డేరా ఫాలోవర్లు చెప్తున్నారు. గుర్మీత్, హనీప్రీత్ మధ్య రహస్య అనుబంధం గురించి వారు పలు విస్మయకర వాస్తవాలను తెలిపారు. డేరాలో హనీప్రీత్‌పై గుర్మీత్ అత్యాచారం.. గుర్మీత్ చాటుగా హనీప్రీత్ రాసలీలలు నడిపేవాడని, వారి మధ్య శారీరక సంబంధం ఉందని ఇప్పటికే పలు కథనాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా డేరా శిష్యులు వీరి అనుబంధం గురించి పలు విషయాలు వెల్లడించారు. హనీప్రీత్ గుర్మీత్ సన్నిహిత సహచరిగా మారకముందు.. గుహాలో ఆమెపై గుర్మీత్ అత్యాచారం జరిపాడని తెలిపారు. తన ప్రైవేటు చాంబర్ అయిన గుహాలో ఇద్దరు సాధ్వీలపై గుర్మీత్ అత్యాచారం జరిపిన కేసులో శిక్ష ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సాధ్వీల తరహాలోనే హనీప్రీత్‌పై కూడా గుర్మీత్ లైంగిక దాడి జరిపారని, కానీ గుర్మీత్ బెదిరింపులకు తలొగ్గి.. ఆ తర్వాత ఆయన నుంచి పలు ప్రయోజనాలు పొంది.. ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచి ఉంటుందని డేరా శిష్యులు చెప్తున్నారు. ఓ రోజు హనీప్రీత్ గుహలోకి వెళుతుండటం తాము చూశామని, ఏడుస్తూ ఆమె గుహ నుంచి బయటకు వచ్చిందని వస్తూ ఆమె గుర్మీత్ మాజీ డ్రైవర్లు అయిన ఖట్టా సింగ్, అతని కొడుకు గురుదాస్ సింగ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన రోజున తాను, తన కజిన్ గుహకు రక్షణగా ఉన్నామని గురుదాస్ చెప్పారు. 'హనీప్రీత్ చాలా ఆందోళనగా కనిపించింది. ఆమె నేరుగా డేరాలో క్యాషియర్‌గా పనిచేస్తున్న తన తాత దగ్గరికి పరిగెత్తుకెళ్లింది. ఆమె తాత గొడవ చేయకుండా గుర్మీత్ గూండాలు చూశారు' అని ఆయన చెప్పారు. వారసుడి కోసం ప్రయత్నించారు.. కానీ! గుర్మీత్ రాంరహీం సింగ్, హనీప్రీత్ సింగ్ రహస్యంగా వారసుడి కోసం ప్రయత్నాలు చేశారు. తమకు కొడుకు పుట్టాలని, అతన్ని డేరా సామ్రాజ్యానికి వారసుడిని చేయాలని వారు భావించారు. గుర్మీత్ సొంత కొడుకు జస్మీత్ సింగ్‌ను డేరా వారసుడిగా ప్రకటించాలన్న వాదనను హనీప్రీత్ ఒప్పుకునేది కాదని, తమ కొడుకుకే వారసత్వ పట్టాం కట్టాలని ఆమె ఒత్తిడి తెచ్చేదని గుర్మీత్ మాజీ శిష్యుడు గురుదాస్ సింగ్ తోర్ తెలిపారు. 2007లో జస్మీత్ను డేరా వారసుడిగా గుర్మీత్ ప్రకటించినప్పటికీ.. హనీప్రీత్ ఒత్తిడితో తన నిర్ణయాన్ని గుర్మీత్ మార్చుకున్నాడని, అయితే, అనుకోని పరిస్థితులు.. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి వారసుడి ప్రయత్నాలకు బ్రేక్ పడిందని తెలిపారు. 2002లో డేరాలో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో గుర్మీత్‌కు 20 శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ సాక్షిగా ఉన్న తోర్.. గుర్మీత్-హనీప్రీత్ అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ ఇద్దరూ డేరాలో భార్యాభర్తల్లాగే గడిపేవారని చెప్పాడు. ఇదే విషయాన్ని హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే. డేరాలోని ప్రైవేటు చాంబర్లో గుర్మీత్-హనీప్రీత్ శృంగారానికి పాల్పడే వారని, ఆ సమయంలో డేరా బయట తాను వేచి ఉండే వాడినని గుప్తా గతంలో మీడియాకు చెప్పారు. -
డేరాలో దొంగలు
సాక్షి, రోహతక్ : హర్యానాలోని డేరా సచ్ఛా సౌధలో శనివారం దొంగలు పడ్డారు. దొరికిన విలువైన వస్తులును చేజిక్కించుకుని పారిపోయారు. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని దొబాడలో ఉన్న డేరాలో దొంగలు శనివారం చొరబడ్డారు. గుర్మీత్ విలువైన దుస్తులు, బూట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు డేరా అధికారులు చెబుతున్నారు. దొంగలు ఎత్తుకెళ్లిన వాటిలో ప్రధానంగా సీసీటీవీలు, కంప్యూటర్, పరుపులు, పలు హార్డ్ డిస్క్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అరెస్ట్ తరువాత.. డేరా కార్యాలయాల దగ్గర ప్రభుత్వం అత్యంట పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. అంతేకాక డేరాకు కూడా సొంత సెక్యూరిటీ వ్యవస్థ ఉంది. ఇటువంటి భద్రత మధ్య దొంగలు డేరాలోకి ప్రవేశించడపై పోలీసులు, అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం గురించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు రోహ్తక్ రేంజి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నవదీప్ విర్క్ తెలిపారు. -
హనీప్రీత్.. చిక్కదు.. దొరకదు..!
సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజులు దాటినా డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ జాడ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. ఇందుకు కారణం పోలీసుల తనిఖీల సమాచారం హనీప్రీత్‌కు అందడేనని నిఘావర్గాలు భావిస్తున్నాయి. గత ఆగస్టు 25వ తేదీన అత్యాచారాల కేసులో గుర్మీత్‌ను దోషిగా తేల్చాక హరియానాలో అల్లర్లు జరిగాయి. ఆపై డేరాలలో జరుగుతున్న అకృత్యాలు, మరిన్ని ఆరోపణలపై తనను అరెస్ట్ చేస్తారని భయాందోళనకు గురై హనీప్రీత్ పరారైంది. ఇతర దేశాలకు పారిపోయి తలదాచుకోవాలని చూస్తున్న తరుణంలో సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసినట్లు తెలుస్తోంది. గత 33 రోజుల నుంచి ఆమె కోసం పోలీసులు పంజాబ్, హరియానా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నా ఆమె జాడ తెలియడం లేదు. కొందరు అనుచరులు ఆమెకు పోలీసు తనిఖీల సమాచారం లీకులిస్తున్న కారణంగానే ఆమెను అరెస్ట్ చేయలేకపోతున్నాట్లు భావిస్తున్నారు. వాస్తవానికి గుర్మీత్‌కు శిక్షపడ్డ ఆగస్టు 25న, ఆ మరుసటిరోజు హనీప్రీత్ జెడ్ ప్లస్ సెక్యూరిటీతో ఉన్నారు. ఆ తర్వాత ఆమె మద్ధతుదారులు, గుర్మీత్ అనుచరుల సాయంతో ఆమె పరారైన విషయం తెలిసిందే. కొందరు అనుచరుల సాయంతో హనీప్రీత్ ఎప్పటికప్పుడూ తన మకాం మారుస్తోందని, అవసరమైతే దేశం దాటి వెళ్లిపోయేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పరారవుతూ తనగోతిని తానే తవ్వుకుంటుందని హనీప్రీత్‌ను ఉద్దేశించి అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) మహమ్మద్ అకిల్ వ్యాఖ్యానించారు. అయితే త్వరలో ఆమెను అదుపులోకి తీసుకోవడం ఖాయమని చెప్పారు. ఆమెకు సాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, హనీప్రీత్ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు గత మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. -
హనీప్రీత్ కుట్ర: నన్ను చంపేస్తారు!
-
హనీప్రీత్ కుట్ర: నన్ను చంపేస్తారు!
సాక్షి, కర్నాల్: డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనీప్రీత్, గుర్మీత్‌లకు శారీరక సంబంధం ఉందంటూ ఇటీవల పేర్కొన్న విశ్వాస్.. తాజాగా తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. ఈ మేరకు తన ప్రాణాలు రక్షించాలని కోరుతూ గురువారం కర్నాల్ పోలీసులను ఆశ్రయించారు. గుప్తా ఫిర్యాదు చేసినట్లు స్టేషన్ ఎస్హెచ్ఓ రాజ్బీర్ సింగ్ తెలిపారు. ఓవైపు గుర్మీత్‌కు జైలుశిక్ష నేపథ్యంలో పరారైన హనీప్రీత్ కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతుండగా మరోవైపు విశ్వాస్ గుప్తా తన మాజీ భార్య హనీప్రీత్ వ్యవహారాలను వెలుగులోకి తెస్తున్నారు. హనీప్రీత్, డేరా సచ్ఛా సౌదాల విషయాలు మరిన్ని వెల్లడిస్తానని భావించి కొందరు తనకు ఫోన్‌చేసి చంపేస్తామని హెచ్చరిస్తున్నట్లు విశ్వాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వివాహం అనంతరం హనీప్రీత్‌ను గుర్మీత్ తన వద్దకు పంపలేదని, వారిద్దరే ఏకాంతంగా గడిపేవారని చెప్పడం కూడా తనపై హత్యకుట్రకు ఓ కారణమై ఉంటుందన్నారు. చంఢీగఢ్‌లో డేరా చీఫ్ గుర్మీత్, హనీప్రీత్‌లకు వ్యతిరేకంగా ఎన్నో విషయాలు వెల్లడించినప్పటినుంచీ గుర్తుతెలియని వ్యక్తులు తనను వెంబడిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హనీప్రీత్ ఆదేశాలతోనే తనను హత్య చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ప్రాణాలు రక్షించుకునేందుకు పోలీసులను ఆశ్రయించినట్లు ఆయన వివరించారు. కాగా, గత ఆగస్టు 25న అత్యాచారాల కేసులో గుర్మీత్‌కు పంచకుల సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన తర్వాత హనీప్రీత్ పరారీలో ఉన్నారు. ఆమె కోసం పోలీసులు పంజాబ్, హరియానా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హనీప్రీత్ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు గత మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. -
వామ్మో : డేరా సచ్చ సౌదా ఆస్తులు అన్ని కోట్లా?
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్‌కు చెందిన డేరా సచ్చ సౌదా గురించి సంచలన విషయాన్ని హర్యానా ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. ఆయన కేవలం డేరా బాబా మాత్రమే కాదని, కోట్ల ఆస్తులను గుర్మీత్ కలిగిఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. నేడు పంజాబ్, హర్యానా హైకోర్టుకు కట్టర్ ప్రభుత్వం సమర్పించిన నివేదికలో, డేరా సచ్చ సౌదా ఆస్తుల విలువ రూ.1,453 కోట్లుగా తెలిపింది. ఇవి కేవలం డేరా ప్రధాన కార్యాలయం సిర్సాలోనివేనని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్మీత్ రామ్ రహీమ్ ఆర్గనైజేషన్‌కు సుమారు రూ.1600 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్టు కూడా వెల్లడించింది. హర్యానా వెలుపల డేరా కలిగి ఉన్న ఆస్తుల వివరాలను ప్రభుత్వం లెక్కకట్టలేదు. ప్రభుత్వం అంచనావేసిన దానికంటే అధికంగానే గుర్మీత్ డేరాకు ఆస్తులున్నట్టు కూడా వెల్లడవుతోంది. సాధ్వీలపై అత్యాచార కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు విధించిన సమయంలో ఆయన అనుచరులు భారీ ఎత్తున్న అల్లర్లు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లతో వచ్చిన నష్ట్రాన్ని పూరించడానికి డేడేరా సచ్చ సౌదా ఆస్తుల వివరాలను లెక్క కట్టాలని పంజాబ్, హర్యానా హైకోర్టులు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించాయి. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం వెల్లడించిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. -
గుర్మీత్‌ను నేను పెళ్లి చేసుకుంటానేమోనని..!
సాక్షి, ముంబై: వివాదాస్పద బాబా, రేప్ కేసులో శిక్ష పడిన గుర్మీత్ రాంరహీం సింగ్ జీవితకథ ఆధారంగా 'అబ్ హోగా ఇన్సాఫ్' పేరిట సినిమా తెరకెక్కించేందుకు హాట్ భామ రాఖీ సావంత్ సిద్ధమవుతోంది. ఈ సినిమాలో గుర్మీత్ దత్తపుత్రిక, సన్నిహితురాలు హనీప్రీత్ ఇన్సాఫ్గా రాఖీ సావంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాఖీ.. ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గుర్మీత్ జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్య అంశాలను ఈ సినిమాలో చూపిస్తానని, గుర్మీత్, హనీప్రీత్ గురించి తనకు చాలాకాలంగా తెలుసునని చెప్పుకొచ్చింది. 'మూడున్నరేళ్లుగా గుర్మీత్, హనీప్రీత్ గురించి నాకు తెలుసు. పలు సందర్భాల్లో వారిని నేను కలిశాను. డేరా పరిసరాల్లో నిర్మించిన గుహాలోకి సైతం నేను వెళ్లాను. గుర్మీత్ పుట్టినరోజు సందర్భంగా నన్ను పిలిచారు' అని రాఖీ తెలిపింది. గుర్మీత్ సినిమాల కోసం హనీప్రీత్ ఆడిషన్స్ నిర్వహించేదని తెలిపింది. 'ఓసారి గుర్మీత్, హనీప్రీత్ నన్ను ఓ హోటల్‌కు పలిచారు. గుర్మీత్ సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తానంటూ అమ్మాయిలను హనీప్రీత్ పిలిచేది. హోటల్లో ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారు. అక్కడ బాత్రూమ్లో కొన్ని మూలికలు చూశాను. పాపపు ఉద్దేశంతో వాటిని అక్కడ ఉంచినట్టు నేను భావించాను. అతని నిజమైన ఉద్దేశాలు గ్రహించి నేను బెంబేలెత్తిపోయాను. నన్ను చంపేస్తాడేమోనని భయపడ్డాను' అని రాఖీ చెప్పింది. గుర్మీత్‌కు తాను సన్నిహితంగా ఉండటం చూసి హనీప్రీత్ ఆందోళన చెందేదని రాఖీ పేర్కొంది. 'తన ప్రియుడిని నేను పెళ్లి చేసుకుంటానేమోనని హనీప్రీత్ భయపడేది. గుర్మీత్ తన మహిళా శిషురాళ్లను లైంగికంగా దోచుకుంటున్న విషయం నాకు అప్పటికీ తెలియదు' అని చెప్పుకొచ్చింది. -
డేరా బాబా మామూలోడు కాదు
న్యూఢిల్లీ: అత్యాచార కేసులో జైలుశిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్ గురించి బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'ఎ డైలాగ్ విత్ జేసీ' అనే టీవీ షోలో ఆమె మాట్లాడుతూ.. తాను చాలాసార్లు గుర్మీత్‌ను కలిసినట్టు తెలిపింది. తనను రాజకీయాల్లోకి చేరమని చెప్పిన వారిలో బాబా ఉన్నాడని చెప్పింది. గుర్మీత్ ఆడవారి జీవితాలతో ఆడుకుంటాడని, మగవారిని నపుంసకుల్ని చేస్తాడని ఊహించలేదని పేర్కొంది. గుర్మీత్‌ను కలవడానికి హనీప్రీత్ ఒప్పుకునేది కాదని చెప్పింది. ఎక్కడ బాబాను పెళ్లి చేసుకుంటానోనని తనను దూరంగా పెట్టేదని వెల్లడించింది. ‘గుర్మీత్‌ను నేను కలవడం హనీప్రీత్‌కు నచ్చేది కాదు. ఆమెకు సవతిని అవుతానేమోనని భయపడేది. హనీప్రీత్ చాలా అందంగా ఉండేది. నేను తనకంటే అందంగా ఉంటానని ఆమె అనుకునేది. గుర్మీత్ తనను తాను కృష్ణుడి అవతారంగా, ఆయన చుట్టూ యువతులను గోపికలుగా భావించేవాడు. ఒకసారి ఆయనను కలిసేందుకు హోటల్‌కు వెళ్లాను. బాబా చుట్టూ ఉన్న యువతులు పొట్టి దుస్తులు వేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. గుర్మీత్ ఆశ్రమంలో పురుషుల కంటే యువతులు, మహిళలు ఎక్కువగా ఉన్నార’ని రాఖీ సావంత్ తెలిపింది. గుర్మీత్, హనీప్రీత్ జీవితాలు ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా డిసెంబర్ లేదా జనవరి నాటికి పూర్తవుతుందని చెప్పింది. బాబా జైలు జీవితం గడుపుతుండగా, హనీప్రీత్ మరణించినట్టు తమ సినిమాలో చూపించబోతున్నట్టు వెల్లడించింది. ఈ చిత్రంలో రాఖీ సావంత్ హనీప్రీత్ పాత్రలో నటిస్తోంది. -
డేరా బాబా మామూలోడు కాదు
-
బాంబు పేల్చిన హనీప్రీత్ మాజీ భర్త
సిర్సా: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌పై హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డేరా బాబాకు హనీప్రీత్ దత్తపుత్రిక కాదని, చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదని వెల్లడించారు. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. 'తన డేరాలో గుర్మీత్ బిస్బాస్లా వ్యవహరించేవారు. ఆరు జంటలు(కుటుంబ సభ్యులు) 28 రోజుల పాటు డేరాలో ఉన్నాం. రాత్రిళ్లు హనీప్రీత్... గుర్మీత్ గదిలోనే ఉండేది. నన్ను మాత్రం గది బయట పడుకోమనేవార'ని గుప్తా తెలిపారు. గుర్మీత్‌తో ఏకాంతంగా గడుపుతుండగా హానీప్రీత్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని చెప్పారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని తనను బెదిరించారని వెల్లడించారు. తన భార్యతో గుర్మీత్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని 2011లో గుప్తా కోర్టుకు వెళ్లారు. ఆయుధాలతో కూడిన పెద్ద పెట్టెను గుర్మీత్ ఎల్లప్పుడు తన వెంట ఉంచుకునేవారని, అనుచరులు ఈ పెట్టెను అతడు ప్రయాణించే కారులో పెట్టేవారని గుప్తా వివరించారు. కాగా, గుర్మీత్, హనీప్రీత్ ఎప్పుడూ కలిసే ఉండేవారని.. డేరాలో ఉన్నప్పుడే కాదు, బయటకు వెళ్లినప్పుడు కూడా ఒకే రూములో ఏకాంతంగా గడిపేవారని ఇంతకుముందు ఓ సాధ్వి చెప్పారు. మరోవైపు హనీప్రీత్ కోసం హరియాణా పోలీసులు గాలిస్తున్నారు. ఆమె నేపాల్‌లో ఉన్నట్టు వచ్చిన వార్తలను అధికారులు తోసిపుచ్చారు. హనీప్రీత్ తమ దేశంలో లేదని నేపాల్ సీబీఐ కూడా స్పష్టం చేసింది. -
హనీప్రీత్ ఎక్కడుందో నాకు తెలుసు: నటి
డేరా స్వచ్ఛసౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్‌సింగ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది పోలీసులకు అంతుచిక్కని మిస్టరీగా మారింది. డేరా బాబా గుర్మీత్ కు శిక్ష పడిన అనంతరం చెలరేగిన అలర్ల వెనుక హనీప్రీత్ హస్తముందని పోలీసులు భావిస్తున్నారు. గుర్మీత్‌పై నమోదైన పలు కేసులలోనూ ఆమె ప్రమేయమున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గుర్మీత్‌కు శిక్ష పడి.. జైలుకు వెళ్లిననాటి నుంచి ఆమె కనిపించడం లేదు. ఆమె నేపాల్‌లో ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఆమె పేరుకే గుర్మీత్ దత్తపుత్రిక అని, కానీ, చాటుగా గుర్మీత్ రాసలీలలు సాగించేదని, వారు ఏకాంతంగా గడిపేవారని పలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో హనీప్రీత్ సింగ్‌పై బాలీవుడ్ హాట్ భామ రాఖీ సావంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనీప్రీత్ గురించి తనకు ఏడెనిమిదేళ్లుగా తెలుసునని రాఖీ తెలిపింది. డేరా బాబా గుర్మీత్‌పై తాను ఒక బయోపిక్ చిత్రాన్ని తీయబోతున్నామని, ఈ సినిమాలో డేరా బాబా ప్రియురాలు హనీప్రీత్ సింగ్‌గా తాను నటిస్తానని ఆమె పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతం పరారీలో ఉన్న హనీప్రీత్ సింగ్ ఎక్కడో ఉందో తనకు తెలుసునని, ఆమె నేపాల్‌లో లేదని, లండన్‌లో ప్రస్తుతం ఉందని రాఖీ తెలిపింది. తన సోదరుడు రాకేశ్ సావంత్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నానని, 'అబ్ హోగా ఇన్సాఫ్' పేరిట తెరకెక్కనున్న ఈ సినిమాలో డేరా బాబాగా రజా మురద్ నటిస్తారని పేర్కొంది. -
అమ్మో డేరా బాబా.. 600 అస్థిపంజరాలు
సిర్సా : డేరా సచ్చా సౌదా గురించి మరిన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. మనుషులను చంపి కూడా అందులో పాతిపెట్టారనే విషయాలు ఇప్పటికే వెలుగు చూడగా అలా పాతిపెట్టినవారి సంఖ్య ఒకటో రెండో లేక ఏ పదుల సంఖ్యలో కాదు.. ఏకంగా వందల సంఖ్యలో ఉన్నాయి. దాదాపు 600కు పైగా అస్థిపంజరాలు డేరా సచ్చా సౌదాలో వెలుగుచూశాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం ఆశ్రమం అంతటా చేసిన తనిఖీల్లో కళ్లు చెదిరే సంఖ్యలో ఈ అస్థిపంజరాలు వెలుగుచూసినట్లు కీలక వర్గాల సమాచారం. ప్రతి అస్థిపంజరంపైనా అందమైన పూల మొక్కలు నాటినట్లు వెల్లడైంది. అయితే, అవన్నీ డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ చంపేసినవారి అస్థిపంజరాలు కాదని, మోక్షం కోసం చనిపోయిన వారి మృతదేహాలను ఆశ్రమంలో పాతిపెట్టేందుకు బాబా అనుమతించారని డేరా బాబా అనుచరులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే, హర్యానాకు చెందిన ప్రముఖ జర్నలిస్టు రామానంద్ తాతియా మీడియాతో మాట్లాడుతూ డేరా క్యాంపస్‌లో మరిన్ని తవ్వకాలు జరపాలని, కనిపించకుండా పోయిన దాదాపు 500 మంది జాడలు ఆ తవ్వకాల్లో బయటపడతాయని ఓ మీడియాకు చెబుతూ అన్నారు. చాలా దారుణంగా గుర్మీత్ హత్యలు చేసేవారని, రహస్యంగా వారిని ఆశ్రమంలోనే పాతిపెట్టించేవాడని ఆరోపించారు. జాతీయ మీడియా సమక్షంలో ఆశ్రమంలో తవ్వకాలు జరపాలని కోరారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. -
గుర్మీత్ రోజు కూలీ రూ.20
-
గుర్మీత్ రోజు కూలీ రూ.20
జైలులో కూరగాయలు పండిస్తున్న డేరా బాబా చండీగఢ్: ఇన్నాళ్లూ డేరా సచ్చా సౌదాలో సకల భోగాలు అనుభవిస్తూ అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన గుర్మీత్ రామ్ రహీం సింగ్ ప్రస్తుతం రోజు కూలీగా మారాడు. జైలులో ఎనిమిది గంటలు పనిచేస్తే అతనికి రోజుకు లభించే కూలీ రూ.20. శిష్యురాళ్లపై అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన గుర్మీత్ తన జైలు శిక్ష కాలంలో కూరగాయలు పెంచుతున్నాడు. చెట్ల కొమ్మలను కత్తిరించాల్సి ఉంటుంది. జైలులో గుర్మీత్ గది పక్కనే కొంత ఖాళీ స్థలం ఉందనీ, అందులో కూరగాయలు పండిస్తున్నాడని హరియాణా జైళ్ల శాఖ డీజీపీ మంగళవారం చెప్పారు. గుర్మీత్ తండ్రి వ్యవసాయదారుడే. చిన్నప్పుడు రాజస్తాన్‌లో పెరిగిన గుర్మీత్ తన తండ్రికి పొలం పనుల్లో సాయం చేసేవాడు. గుర్మీత్ జైలులో ఎంతో క్రమశిక్షణతో మెలుగుతున్నాడనీ, ఆయనకు జైలులో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదనీ, ఇందుకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని డీజీపీ వివరణ ఇచ్చారు. ‘అది (గుర్మీత్‌కు జైలులో ప్రత్యేక సౌకర్యాలున్నాయనడం) ఆధారం లేని, ఊహాజనిత వార్త. గుర్మీత్ సహా జైలులో ఏ ఖైదీకి ప్రత్యేక సౌకర్యాలు లేవు. మిగతా అందరు ఖైదీల్లాగానే అతను కూడా సాధారణంగానే జీవిస్తున్నాడు. అందరికీ పెట్టే తిండే అతనికి ఇస్తున్నాం’ అని డీజీపీ చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా గుర్మీత్‌కు ఇతర ఖైదీలతో సంబంధం లేకుండా ఆయన గదిని కొంతదూరంగా ఏర్పాటు చేశామన్నారు. హనీప్రీత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు రేప్ కేసులో గుర్మీత్ దోషిగా తేలాక హరియాణాలో హింసను రగిలించారనే ఆరోపణలమీద గుర్మీత్ దత్తపుత్రిక హనీప్రీత్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
గుర్మీత్, ఆమె ఏకాంతంగా గడిపేవారు!
-
గుర్మీత్, ఆమె ఏకాంతంగా గడిపేవారు!
సాక్షి, చండీగఢ్: అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్‌ను దోషిగా కోర్టు నిర్ధారించిన నేపథ్యంలో డేరా చీఫ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్, డేరా ప్రతినిధి ఆదిత్య ఇన్సాన్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అయితే హనీప్రీత్, గుర్మీత్‌ల సంబంధం గురించి షాకింగ్ విషయం తాజాగా వెలుగుచూసింది. గుర్మీత్, హనీప్రీత్ ఎప్పుడూ కలిసే ఉండేవారని డేరాలోని ఓ సాధ్వి చెప్పారు. డేరాలో ఉన్నప్పుడే కాదు, బయటకు వెళ్లినప్పుడు కూడా ఒకే రూములో ఏకాంతంగా గడిపేవారని ఆమె తెలిపారు. గుర్మీత్ తర్వాత డేరా చీఫ్‌గా బాధ్యతలు చేపడుతుందని అందరూ భావిస్తున్న హనీప్రీత్ తన అందం గురించి దిగులు చెందేదట. ఈ విషయాన్ని ఆమె వ్యక్తిగత జిమ్ ట్రైనర్ మీడియాకు తెలిపారు. ఆమెకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు పిచ్చి అభిమాని అని.. అందుకు కత్రినాలా అందంగా తయారవ్వాలన్న ఆశే కారణమని వెల్లడించారు. 'నటి కత్రినాలా తను కూడా చాలా అందంగా తయారవ్వాలనుకున్న హనీప్రీత్ ఎంతో శ్రమించి వర్కవుట్లు చేసేవారు. గ్లామర్ డాల్‌గా మారిపోవాలన్నది ఆమె చిరకాల కోరిక. అందుకే వర్కవుట్లు చేస్తూ ఆలసట చెందినట్లు అనిపిస్తే చాలు.. దూమ్ 3 మూవీలోని కత్రినా పాటకు హుషారుగా స్టెప్పులేస్తూ ఆలసటను, శ్రమను మర్చిపోయేది. గుర్మీత్ కూడా తన వద్దే అదే జిమ్‌లో కసరత్తులు చేసేవాడు. కత్రినాలా తాను నాజుకూగా మారేందుకు ప్రతిరోజు మూడు గంటల పాటు జిమ్‌లో వర్కవుట్లు చేయడంతో కఠిన ఆహారపు అలవాట్లను హనీప్రీత్ ఫాలో అయ్యేదంటూ' ఆమె వ్యక్తిగత జిమ్ ట్రైనర్ వివరించారు. గత ఆగస్ట్ 25న అత్యాచారాల కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష విధించగా, అప్పటినుంచి ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ పరారీలో ఉంది. మరోవైపు సీబీఐ అధికారులు ఇదివరకే డేరాలో పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టి పలు కీలక సాక్ష్యాలు సేకరించారు. గుర్మీత్ చేసిన హత్యల కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. -
డేరా హత్య కేసులు.. తుది వాదనలు
సాక్షి, సిర్సా: జంట హత్యల కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ భవితవ్యంపై నిర్ణయాన్ని పంచకుల సీబీఐ న్యాయస్థానం వాయిదా వేసింది. కీలక సాక్షిగా భావిస్తున్న గుర్మీత్ మాజీ డ్రైవర్ కట్టా సింగ్ స్టేట్మెంట్ను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అన్న పిటిషన్‌పై సెప్టెంబర్ 22 తేదీన తేలుస్తామని న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ వెల్లడించారు. ఇదే విషయాన్ని కట్టా సింగ్ తరపు న్యాయవాది ధృవీకరించారు కూడా. తన చీకటి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చారనే జర్నలిస్ట్ రామ్ చంద్ర ఛత్రపది, డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్‌లను హత్య చేయించారన్న ఆరోపణలు గుర్మీత్‌పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదుకాగా, నేడు ప్రత్యేక కోర్టులో తుది వాదనలు జరిగాయి. ఇక కేసులో ఆరుగురు నిందితులు కోర్టుకు నేరుగా హాజరుకాగా, అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తూ జైలులో ఉన్న గుర్మీత్ సింగ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. అనువాదకుడిని నియమించాలా? అని జడ్జి కోరగా... అందుకు గుర్మీత్ అక్కర్లేదని చెప్పినట్లు తెలుస్తోంది. రామ్ రహీమ్ నుంచి హని ఉందనే భయంతో గతంలో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చానని, అనుమతి ఇస్తే ఇప్పుడు అసలు విషయాలను చెబుతానంటూ మాజీ డ్రైవర్ కట్టా సింగ్ చెబుతున్నాడు. స్వయంగా కోర్టుకు హాజరయ్యేందుకు కూడా తాను సిద్ధమని చెప్పాడు. అంతేకాదు డేరా బాబా దత్త పుత్రికగా చెబుతున్న హనీప్రీత్ సింగ్ పుణే, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ లో దాక్కుని ఉండొచ్చన్న అనుమానాలు అతను వ్యక్తం చేస్తున్నాడు. ఒకవేళ సిర్సాలోనే ఆమె తలదాచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కట్టా సింగ్ అంటున్నాడు. ఇక గుర్మీత్ విచారణ నేపథ్యంలో గతంలో మాదిరి అల్లర్లు చోటు చేసుకోకుండా పంచకులలో 5 బెటాలియన్లతో భద్రతా ఏర్పాట్లను చేశారు. 2002 లో డేరా సభ్యుడు రజింత్ సింగ్‌ను, సిర్సా జర్నలిస్ట్‌లను అనుచరులతో చంపించాడన్న ఆరోపణలు గుర్మీత్‌పై ఉన్నాయి. ఈ కేసులో ప్రత్యేక న్యాయ స్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
పోలీసుల నెక్ట్స్ టార్గెట్ విపాసన
సాక్షి,చండీగర్: అత్యాచార కేసులో గుర్మీత్ సింగ్ దోషిగా ఖరారైన అనంతరం చెలరేగిన హింసాకాండకు సంబంధించి డేరా సచా సౌధా చైర్పర్సన్ విపాసన ఇన్సాన్‌ను హర్యానా పోలీసులు త్వరలో విచారించనున్నారు. డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తదుపరి వారసురాలిగా విపాసన ఇన్సాన్‌ను ప్రకటిస్తారని భావిస్తున్నారు. విపాసనను విచారణలో పాలుపంచుకోవాలని సిర్సా పోలీసులు త్వరలో కోరనున్నారని హర్యానా డీజీపీ బీఎస్ సంధూ చెప్పారు. డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. డేరా వ్యవహారాల్లో కీలక వ్యక్తి ఆదిత్య ఇన్సాన్ సైతం ప్రస్తుతం దేశంలోనే ఉన్నారని భావిస్తున్నట్టు చెప్పారు. వీరిని పట్టుకునేందుకు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లకు పోలీస్ బృందాలను పంపామన్నారు. వారు దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకునేందుకు వారిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశామన్నారు. -
నకిలీ బాబాల్లో నిత్యానంద ఎందుకు లేడు?
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జైలు శిక్ష పడిన నేపథ్యంలో దేశంలో 14 మంది నకిలీ బాబాలు ఉన్నారంటూ అఖిల భారత అఖార పరిషద్ ఆదివారం ఓ జాబితాను విడుదల చేసింది. అయితే అందులో స్వామి నిత్యానంద పేరు లేకపోవడం వివాదాస్పదమైంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాబాల్లో ఒకడైన నిత్యానందపై 2009లో కర్ణాటకలో రేప్ కేసు దాఖలైంది. ఆయన స్థాపించిన ఫౌండేషన్‌పై ఏడు అవినీతి కేసులు ఉన్నాయి. అమెరికా నుంచి కూడా ఆయనకు అక్రమంగా నిధులందాయన్న ఆరోపణలూ ఉన్నాయి. నకిలీ బాబాల జాబితాలో నిత్యానంద పేరును కూడా చేర్చాలని జునా అఖారాకు చెందిన హరిగిరి ప్రతిపాదించినప్పటికీ మహానిర్వాణి అఖారాలు తీవ్రంగా అభ్యంతరం పెట్టడంతో ఆయన పేరు జాబితాలో చేరలేదని నిర్వాణి అఖారాకు చెందిన చీఫ్ ధరమ్ దాస్ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 13 అఖారాలు ఆదివారం నాడు అలహాబాద్‌లో సమావేశమై నకిలీ బాబాల జాబితాను తయారు చేశారు. నకిలీ బాబాల కారణంగా అసలైన బాబాల ప్రతిష్ట కూడా దిగజారిపోతోందని, అందుకనే నకిలీ బాబాల జాబితాను విడుదలచేసి వారికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునివ్వాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది. ఈ 13 అఖారాల్లో ఏడు శైవ తెగకు చెందిన అఖారాలుకాగా మూడు వైష్ణవ తెగకు, మూడు సిక్కు తెగకు చెందిన అఖారాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏర్పాటయినదే అఖిల భారత అఖార పరిషద్. 2013, అలహాబాద్ కుంభమేళాలో నిత్యానంద్‌కు మహామండలేశ్వర్, మహానిర్వాణి అఖారాకు చెందిన ప్రధాన పూజారి పట్టాభిషేకం చేసినందున ఆయన పేరును నకిలీ బాబాల జాబితాలో చేర్చేందుకు మహానిర్వాణి అఖారాలు నిరాకరించారు. నకిలీ బాబాల జాబితాలో గుర్మీత్ సింగ్ సహా ఆరెస్సెస్ సభ్యుడు అసీమానంద్ లేదా ఆశారామ్, ఆయన కుమారుడు నారాయణ్ సాయి, రాధేమా, సచ్దానంద్ గిరి, నిర్మల్ బాబాల పేర్లు చోటుచేసుకున్నాయి. సమాజం నుంచి నకిలీ బాబాలను నిర్మూలించడం పట్ల మహానిర్వాణి అఖారాలకు చిత్తశుద్ధి లేదని, దిగంబర అఖారాకు చెందిన బాబా హఠ్ యోగి విమర్శించారు. అఖారాల్లో చాలా మంది పేరుకే సాధువులని, వారు డబ్బులు తీసుకొని కావాల్సిన బిరుదులు ఇస్తుంటారని నిర్వాణి అఖారాకు చెందిన సత్యేంద్ర దాస్ ఆరోపించారు. నకిలీ బాబాల జాబితా నుంచి నిత్యానందను తప్పించడంలో ప్రధాన పాత్ర పోషించిన అఖిల భారత ఆఖార పరిషద్ అధ్యక్షుడు నరేంద్ర గిరిపైనే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. రియల్టర్ వ్యాపారం చేసే ఆయనకు ఓ బారు కూడా ఉందన్నది అందులో ఓ ఆరోపణ. -
అతనో కామ పిశాచి: డాక్టర్
-
అతనో కామ పిశాచి: డాక్టర్
సాక్షి, రోహ్తక్ : జైలు గోడల మధ్య డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ నలిగిపోతున్నాడు. మానసిక సంఘర్షణతో కుంగిపోతున్నాడు. తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలీక ఒక్కోక్షణం ఊపిరి ఆగినట్లు ఫీల్ అవుతున్నాడు. నరకప్రాయంగా ఉన్న జీవితంగా గురించి నిరంతరం చింతిస్తున్నాడు. ఇవి గుర్మీత్‌ను పరీక్షించడానికి శనివారం రోహ్తక్ జైలుకు వెళ్లిన డాక్టర్ల బృందంలో ఒకరు చెప్పిన విషయాలు. తన పేరును సీక్రెట్‌గా ఉంచమని కోరిన ఆ డాక్టర్.. సంచలన విషయాలను వెల్లడించారు. గుర్మీత్ ఓ కామ పిశాచని, జైలులో ఉంటున్న నాటి నుంచి సెక్స్‌కు దూరంగా ఉంటున్న ఆయన మనోవేదనకు గురౌతున్నట్లు చెప్పారు. ఆ వేదన వల్ల సాధారణ జైలు శిక్ష.. అతనికి మరణ దండనగా కనిపిస్తోందని తెలిపారు. సరిగా నిద్ర పట్టకపోవడం, ఎప్పుడూ పరధ్యానంగా ఉండటం, జైలు గోడలను చూస్తూ ఉండిపోవడం లాంటి లక్షణాలు దీన్నే సూచిస్తున్నాయని అన్నారు. గుర్మీత్ ప్రస్తుత పరిస్థితిని చికిత్స ద్వారా నయం చేయొచ్చని చెప్పారు. ఆలస్యం అయితే అసలుకే మోసం వస్తుందని అభిప్రాయపడ్డారు. గుర్మీత్ డ్రగ్స్ తీసుకునే విషయంపై స్పష్టత లేదని తెలిపారు. 1988 తర్వాత నుంచి ఆయన మద్యం సేవించడం మానేశారని తెలిసింది. అయితే, ఆస్ట్రేలియా, తదితర దేశాల నుంచి తెప్పించుకునే సెక్స్ టానిక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను అధికంగా వినియోగించినట్లు డాక్టర్ వివరించారు. -
గుర్మీత్ ఆశ్రమంలో అబార్షన్ సెంటర్లు
-
గుర్మీత్‌ను గుడ్డిగా నమ్మి.. బావిలో శవమై..
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కారణంగా కొందరు పరోక్షంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండగా మరికొందరు ప్రత్యక్షంగా నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇంకొందరు ఆయనను నమ్మి మోసపోయి నిండు ప్రాణాలు బలితీసుకోవడం మొదలుపెట్టారు. గుర్మీత్‌ను నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డేరాలో పెద్ద మొత్తంలో నిర్మిస్తున్న హోటల్స్, రిసార్ట్స్ బిజినెస్‌లో భాగంగా దాదాపు రూ.3.10కోట్లు పెట్టుబడి పెట్టిన సోమ్‌వీర్ అనే వ్యక్తి తన నిండు ప్రాణం బలితీసుకున్నాడు. లైంగికదాడి, మోసంవంటి కేసుల్లో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక తాను పెట్టిన సొమ్మంతా బూడిదపాలయినట్లేనని భావించిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి 12 ఎకరాల భూమిని కూడా డేరాకు గుడ్డి నమ్మకంతో ఇచ్చాడు. బుధవారం సాయంత్రం కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి శుక్రవారం ఓ బావిలో శవమై తేలాడు. పెట్టుబడి కోసం 25 ఎకరాల భూమిని అమ్ముకోవడమే కాకుండా 12 ఎకరాలను డేరాకు అప్పజెప్పి దెబ్బతిన్న నేపథ్యంలోనే తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
విధ్వంసంలో రూ.200 కోట్ల నష్టం
సాక్షి, చంఢీఘడ్ : అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం హరియాణాలో జరిగిన విధ్వంసకాండపైన దృష్టిని కేంద్రీకరించిన మీడియా, అధికారులు పంజాబ్‌లో జరిగిన నష్టం గురించి అంతగా పట్టించుకోలేదు. పంజాబ్‌లో జరిగిన నష్టం గురించి ఇప్పుడిప్పుడే అందిన అంచనా అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. దాదాపు 200 కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనాకు వచ్చారు. అల్లర్లలో 32 మంది మరణించడం తెల్సిందే. అయితే వారిలో కూడా పది మంది పంజాబీలు ఉన్నారని తేలింది. డేరా అల్లరి మూకలు పంజాబ్‌లోని సదన్‌వాస్ గ్రామంలో విద్యుత్ కేంద్రాన్ని, గులవాన గ్రామంలో రైల్వే స్టేషన్‌ను దగ్ధం చేశాయి. బటిండాలో ఓ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, బనవాలి, ముసాలోని రెండు పెట్రోలు బంకులను దగ్ధం చేశాయి. మానస ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ వద్ద రెండు కార్లను తగులబెట్టాయి. మానక్‌పూర్ ప్రాంతంలోని ఓ పాఠశాల ఫర్నీచర్‌ను, మలాట్‌లోని ఓ రైల్వే స్టేషన్, నంగల్ జిల్లాలో కో-ఆపరేటివ్ సొసైటీ, ఖోఖర్ కలాన్ గ్రామంలో ఓ ప్రభుత్వ గిడ్డంగిని, సంగ్రూర్‌లో పవర్ హౌజ్‌ను అల్లరి మూకలు దగ్ధం చేశాయి. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ఆదేశం మేరకు అధికారులు అల్లర్ల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా ఈ నష్టం 200 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని భావిస్తున్నట్లు వారు మీడియాకు తెలిపారు. -
డేరాలో ఆయుధాల ఫ్యాక్టరీ
సాక్షి, సిర్సా: అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నిర్వహిస్తున్న డేరాలో ఆశ్రమానికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. శుక్రవారం నుంచి హర్యానాలోని సిర్సా ఆశ్రమంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాజా శనివారం జరిపిన సోదాల్లో ఆయుధాల తయారీ కర్మాగారం బయటపడింది. దీనిని చూసి ఆర్మీ, సోదాలు చేస్తున్న అధికారులు నెవ్వెరపోయారు. ఆయుధ తయారీ ఫ్యాక్టరీపై హర్యానా ఉన్నతాధికారి సతీష్ మెహ్రా స్పందిస్తూ.. ఆ ఫ్యాక్టరీని తక్షణం అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అంతేకాక పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో డేరా ఆవాస్ నుంచి మహిళా సన్యాసినులు నివాసముండే ప్రాంతానికవెళ్లే రహస్య రహదారిని గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే శుక్రవారం జరిపిన సోదాల్లో అస్తిపంజరాలు వెలుచూసిన విషయం తెలిసిందే. అంతేకాక నంబర్ ప్లేట్ లేని కోటిరూపాయల ఖరీదైన ఓ లగ్జరీ కారు, ఓబీ వ్యాను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
డేరాబాబా దత్తపుత్రిక ప్రాణానికి ముప్పు..
సాక్షి, పంచకుల: డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. డేరాబాబా అసాంఘిక కార్యకలాపాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆమెను మట్టుబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇంటలిజెన్స్ బ్యూరోకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో హరియాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హనీప్రీత్ కోసం గాలిస్తున్నామని హరియాణ పోలీస్ అధికారి బీఎస్ సంధూ మీడియాకు తెలిపారు. ఆమెను అరెస్టు చేసి రహస్య విచారణ జరుపుతున్నట్లు వచ్చిన వార్తను ఆయన ఖండించారు. గత నెల 25న ఆమె గుర్మీత్‌ను రోహ్తక్ జైలులో కలిసే ప్రయత్నం చేసింది. జైలు వర్గాలు ఆమెను అనుమతించకపోవడంతో డేరా అనచురుల వాహనంలో వెళ్లిన ఆమె మళ్లీ కనిపించలేదు. గుర్మీత్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం రోహ్తక్ జైలుకు తరలించే క్రమంలో హనీప్రీత్ సూచనల మేరకే డేరా అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి గుర్మీత్‌ను తప్పించేందుకు యత్నించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆమెపై లుక్అవుట్ జారీ చేశారు. -
గుర్మీత్ డేరాలు: షాకింగ్ నిజాలు!
-
గుర్మీత్ డేరాలు: షాకింగ్ నిజాలు!
సాక్షి, సిర్సా: అత్యాచారాల కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నిర్వహిస్తున్న డేరా ఆశ్రమాలకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. సిర్సాలోని డేరాలో అస్తి పంజరాలు వెలుగుచూడటం వివాదాస్పదం కాగా, దానిపై డేరా అధికార ప్రతినిధి విపాసన ఇన్సాన్ స్పందించారు. తాము గుర్మీత్ ఏర్పాటు చేసిన నియమాలను ఎప్పుడూ ఉల్లంఘించలేదని, అందులో భాగంగానే కొందరు నేరుగా ఇక్కడికి వచ్చి తమ మరణానంతరం ఇక్కడే పూడ్చిపెట్టాలని స్వచ్ఛందంగా కోరినట్లు డేరా మీడియా సచ్ కహూన్ కూడా బహిర్గతం చేసింది. డేరా ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలను ప్రశ్నిస్తే గుర్మీత్ అనుచరులైనా సరే వారిని హ్యతచేసయినా, లేక సజీవంగానైనా 600 ఎకరాలు, 100 ఎకరాలకు పైగా ఉన్న ఏదైనా ఓ డేరాలో పాతిపెట్టేవారని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. గుర్మీత్ అనుచరులకు ఎదురుచెబితే ఎవరికైనా ఇక్కడ ఇలాంటి గతే పడుతుందన్న భయంతో నోరు మెదిపేవాళ్లం కాదని చెబుతున్నారు. ఛండీగఢ్ హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని సోదాలకు ఆదేశించిన నేపథ్యంలో విపాసన మాట్లాడుతూ.. చట్టాలను డేరా ఎప్పుడూ అతిక్రమించలేదని, గుర్మీత్ అనుచరులు, మద్ధతుదారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని సూచించారు. కొందరు వ్యక్తులు తమ కుటుంబసభ్యుల అస్థికలు తమకివ్వగా డేరాలో పూడ్చిపెట్టి, నదులు, పర్యావరణం కలుషితం కాకుండా చూసేవాళ్లమని చెప్పారు. డేరా సోదాలకు తమకు ఎలాంటి అభ్యంతర లేదని అధికార ప్రతినిధి విపాసన చెప్పగా.. మరోవైపు గురువారం రాత్రి సిర్సాకు చేరుకున్న పారా మిలిటరీ, ఆర్మీ బృందం, నాలుగు జిల్లాల పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి గుర్మీత్ నిర్వహిస్తున్న డేరాలను అణువణువు గాలిస్తున్నారు. ఈ తనిఖీల నేపథ్యంలో సిర్సాలో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు. అత్యాచారాల కేసులో దోషిగా తేలిన గుర్మీత్ కు కోర్టు 20 ఏళ్ల (ఒక్కో కేసులో పదేళ్లు) జైలు విధించిన విషయం తెలిసిందే. -
డేరా బాబా శిక్ష ఖరీదు రూ. 200 కోట్లు
న్యూఢిల్లీ: గుర్మీత్ రామ్ రహీమ్ బాబా అలియాస్ డేరా బాబాగా గుర్తింపు పొందిన ఆయన.. జైల్లో ఊచలు లెక్కపెట్టేందుకు అయిన ఖర్చు.. అక్షరాలా రూ. 200 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా వేలల్లో శిష్యులు కలిగిన ఆయనపై 2002లో అత్యాచారం కేసు నమోదైంది. నిజానికి గుర్మీత్ బాబాపై కేసు నమోదై.. జైలుకు వెళ్లడానికి మధ్య ఆస్తి, ప్రాణ నష్టాలు చాలా కలిగాయి. గుర్మీత్‌పై కేసు 15 ఏళ్ల పాటు నడిచింది. ఆయన నేరం చేశాడని నిరూపణ జరిగి.. శిక్ష పడ్డాక హర్యాన, పంజాబ్‌లలో హింస చెలరేగింది. 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారవడంతో చెలరేగిన హింసలో మొత్తం 32 మంది చనిపోయారు. కనీసం 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. కోట్ల రూపాయల ఆస్థి నష్టం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళన కారులు ధ్వంసం చేశారు ఒక ప్రభుత్వ పాఠశాల, పవర్ సబ్ స్టేషన్, గోడౌన్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. గుర్మీత్‌పై శిక్ష ఖరారయ్యాక జరిగిన మొత్తం విధ్వంసంలో సుమారు 200 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తాజాగా హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు అంచనాకు వచ్చాయి. -
హనీకి షెల్టర్ ఇచ్చి అరెస్టు.. నో ఆన్సర్స్
పంచకుల: డేరా సచ్చా సౌదాకు సంబంధించిన కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఓ మందులషాపు యజమానిని అరెస్టు చేసింది. గత నెల 25న జరిగిన హింసాత్మక ఘటన సమయంలో అతడు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్కు ఆశ్రయాన్ని ఇవ్వడమే కాకుండా ఆమెకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటుచేశాడని, ఆమె అవసరానికి తగిన వస్తువులు చేరవేశాడనే ఆరోపణల కింద అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. పంచకులలోని సెక్టార్ 20లో మందుల దుకాణం నడుపుతున్న సత్పాల్ సింగ్ అనే వ్యక్తిని తాము అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, ఆగస్టు 25కు ముందు ఆ తర్వాత అతడి కదలికలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకోవడమే కాకుండా, తమకు అంతకుముందే అతడి గురించి అందిన సమాచారంతో ఆ వివరాలను పోల్చి చూస్తున్నట్లు తెలిపారు. అయితే, వీలయినంత మేరకు పోలీసులకు సహకరించకూడదనే దోరిణితో అతడు వ్యవహరిస్తున్నాడని, సమాచారం చెప్పేందుకు నిరాకరిస్తున్నాడని ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పంచకుల కమిషనర్ తెలిపారు. -
గోడలతో మాట్లాడుతున్న బాబా!
రోహతక్: మందీమార్బలం, భారీ భద్రత, విలాసవంతమైన సౌకర్యాలతో భోగాలు వెళ్లబోసిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రాం రహీమ్ సింగ్ ఇప్పుడు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ఇద్దరు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో గుర్మీత్‌ను ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చి, 20 ఏళ్ల శిక్ష విధించడంతో ఆయనను రోహతక్‌లోని సునైరా జైల్లో పెట్టారు. సిర్సాలో 700 ఎకరాల సువిశాల ప్రాంగణంలో విస్తరించిన డేరా ప్రధాన కార్యలయంలో విలాసవంతమైన జీవితం గడిపిన బాబా ఇప్పుడు ఇరుకైన జైలు గదిలో సాధారణ ఖైదీగా మారారు. తన చుట్టూ మందీ మార్బలంతో హడావుడిగా కనిపించే గుర్మీత్ కారాగారంలో ఒంటరిగా ఉంటున్నారు. జైలు గోడలతో మాట్లాడుతున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. పూలపాన్పుపై పవళించిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ ఇప్పుడు జైలులో కఠిన నేలపై నిద్రిస్తున్నారు. జైలు క్యాంటీన్ నుంచి మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగుతున్నారు. తినడానికి ఆయనకు జైలు ఆహారంతో పాటు ఒక పండు ఇస్తున్నారు. ఆయనకు తోటమాలి పని అప్పగించనున్నారు. జైలు నిబంధనలకు ప్రకారం తోటమాలికి రోజుకు రూ.40 కూలి ఇస్తారు. కాగా, జైలు అధికారులకు గుర్మీత్ ఇచ్చిన రెగ్యులర్ సందర్శకుల జాబితాలో ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పేరు కూడా ఉండడం గమనార్హం. -
గుర్మీత్‌కు మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : డేరా సచ్ఛా సౌదా ఛీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌కు విమానాశ్రయాల్లోని వీఐపీ లాంజ్ల్లోకి ప్రవేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతోపాటు ఇండియన్ ఫిల్మ్, టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టీడీఏ) కూడా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి మరో షాకిచ్చింది. అత్యాచారం కేసులో న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే. దీంతోపాటు ఆయనపై పలు ఇతర ఆరోపణలు రావటంతో జెడ్ కేటగిరీ భద్రతను ఇటీవల రద్దు చేయటంతోపాటు గుర్మీత్‌కు విమానాశ్రయాల్లోని వీఐపీ లాంజ్ల్లోకి ఉన్న ప్రవేశానుమతిని కేంద్రం రద్దు చేయడం గమనార్హం. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీనిపై అన్ని విమానాశ్రయాల అధికారులకు సమాచారం అందజేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా శుక్రవారం ముంబైలో సమావేశమైన ఐఎఫ్‌టీడీఏ మండలి గుర్మీత్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గుర్మీత్తోపాటు ఆయన వారసురాలిగా పేరున్న హనీప్రీత్ కౌర్ సభ్యత్వం కూడా రద్దు చేసింది. అంతేకాదు, గుర్మీత్‌కు ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీఏఏ)లో ఉన్న సభ్యత్వాన్ని కూడా వచ్చే సోమవారం నుంచి నిలుపుదల చేస్తున్నట్లు సంఘం నేత అశోక్ పండిట్ తెలిపారు. గుర్మీత్ రాంరహీం సింగ్ 2015లో ఎంఎస్‌జీ: దిమెస్సెంజర్ ఆఫ్ గాడ్ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించారు. వీరిద్దరితో ఇకపై ఎలాంటి సినిమాలు తీయరాదని ఐఎంపీఏఏ, ఐఎఫ్‌టీడీఏ నిర్ణయం తీసుకున్నాయి. -
గుర్మీత్ సినిమా లైసెన్స్ రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచార కేసులో ఊచలు లెక్కిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరో ఝలక్ తగిలింది. చలన చిత్ర పరిశ్రమ గుర్మీత్‌పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ‘అత్యాచార కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సినిమా లైసెన్స్ రద్దు చేస్తున్నాం. ఇక సినిమాలు తీయటానికి వీల్లేదు’ అని ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోషియేషన్స్(IFTDA) ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు సినీ మరియు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఆయన వర్క్ పర్మిట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మెసెంజర్ ఆఫ్ గాడ్ పేరిట బాలీవుడ్లో అన్నీ తానై రెండు సినిమాలు తీసిన డేరా బాబాకు సొంతంగా ప్రోడక్షన్ సంస్థ, స్టూడియో ఉన్న విషయం తెలిసిందే. ఇదే ఏడాది బెంగాలీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ బయోపిక్‌ను గుర్మీత్ తెరకెక్కించాలనే ఫ్లాన్ కూడా చేశాడు. ఈ ప్రాజెక్టు కోసం ఓ క్రేజీ హీరోయిన్‌కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడంట. అంతేకాదు మెసెంజర్ ఆఫ్ గాడ్ మూడో పార్ట్ పనులను కూడా ప్రారంభించేశాడని గుర్మీత్ అనుచరులు చెబుతున్నారు. -
జైలులో గుర్మీత్: ఆసక్తికర విషయాలు
రోహతక్: లైంగిక వేధింపుల కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా గురువు గుర్మీత్ రాం రహీమ్ సింగ్ జైల్లో చాలా మధనపడుతున్నారు. సునైరా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఎలా ఉన్నారనే దాని గురించి దళిత నాయకుడు స్వదేశ్ కిరాద్ వెల్లడించారు. బెయిల్‌పై ఈరోజు ఆయన సునైరా జైలు నుంచి విడుదలయ్యారు. జైల్లో గుర్మీత్ ఎలా ఉన్నారనే విషయాల గురించి మీడియాతో చెప్పారు. రేప్ కేసులో దోషిగా తేలి, శిక్ష పడినప్పటి నుంచి గుర్మీత్ తనలో తాను మాట్లాడుకుంటున్నారని కిరాద్ తెలిపారు. దేవుడా నేనేం తప్పు చేశాను? నేను చేసిన నేరం ఏమిటి? అంటూ తనలో తాను గుర్మీత్ మాట్లాడుకుంటున్నారని చెప్పారు. దోషిగా తేలడంతో ఆగస్టు 25 రాత్రి జైలులో గుర్మీత్ ఆహారం తీసుకోలేదని, నేలపై కూర్చుని రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారని వెల్లడించారు. శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పిన వెంటనే మోకాళ్లపై కూలబడి.. 'నన్ను ఉరి తీయండి, నాకు బతకాలని లేద'ని రోదించినట్టు అన్నారు. ఆయనకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదని, సాధారణ ఖైదీలాగే పరిగణిస్తున్నారని తెలిపారు. గుర్మీత్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత ఆయన పేరుతో హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో నిరసనకారులు హింసకు దిగడం పట్ల ఖైదీలు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. జైలులో గుర్మీత్‌పై దాడి జరిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో గుర్మీత్‌కు ఆగస్టు 28న కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
మురికి కాల్వలో గుర్మీత్ ఫోటోలు..!
సాక్షి, రాజస్తాన్: అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష అనుభిస్తున్న డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు అభిమానలు నుంచి ఊహించని షాక్ ఎదురైంది. సొంత జిల్లా శ్రీగంగానగర్‌లో గుర్మీత్‌కు మింగుడు పడని సంఘటన జరిగింది. గుర్మీత్‌ను దైవంగా భావించే అభిమానులు ఆయనపై పీకలదాక కోపంతో ఉన్నారు. నమ్మిన వ్యక్తి మోసం చేశారనే కోపంతో ఆయన చిత్రపటాలను మురికి కాల్వలో పడేశారు. వివరాల్లోకి వెళ్తే రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాకు చెందిన ,చీఫ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ దేవేంద్ర రాథోడ్ సాధారణ తనిఖీలకు వెళ్లారు. రోజు వారి తనిఖీల్లో భాగంగా మీరా చౌక్, సుఖాడియా సర్కిల్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో గుర్మీత్ రామ్ రహీం సింగ్ వందలాది ఫోటోలు మురికి కాల్వల్లో విసిరేసినట్లు కనిపించాయి. దీనిపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
హనీప్రీత్ కోసం లుక్ అవుట్ నోటీసులు
సాక్షి, ఛండీగఢ్: డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కోసం వేట మొదలైంది. గుర్మీత్‌ను తప్పించేందుకు వ్యూహరచన చేసిన ఆరోపణలపై ఆమెను పట్టుకునేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది. గుర్మీత్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం రోహ్తక్ జైలుకు తరలించే క్రమంలో డేరా అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి గుర్మీత్‌ను తప్పించేందుకు యత్నించారు. అయితే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(నేర విభాగం) సుమిత్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది. ఇక ఫ్లాన్ వెనుక హనీప్రీత్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం కావటంతో ఆమె కోసం గాలిస్తున్నారు. హనీప్రీత్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ అయినట్లు పంచకుల డీసీపీ మన్బీర్ సింగ్ ధృవీకరించారు. అదే సమయంలో ఎర్ర బ్యాగ్ ద్వారా హింసకు పాల్పడాలంటూ అనుచరులకు హనీప్రీత్ సంకేతాలిచ్చారనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున్న నగదుతో ఉడాయించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గుర్మీత్ హనీప్రీత్ సంబంధం ఏంటి? -
నేను నపుంసకుడిని: గుర్మీత్
-
ఆ ఇద్దరు సబలలకు సలాం
విశ్లేషణ ఇతడిని జైలుకు పంపిన న్యాయాధికారి జగ్దీప్సింగ్ ఒక బ్రహ్మోస్ అయితే ఓట్ల కోసం నేరాన్ని సహించొద్దని చెప్పి, మీరు పార్టీకి చెందిన పాలకులా దేశ పాలకులా అని నిలదీసిన హైకోర్టు న్యాయమూర్తులు ఫిరంగులు. కళ్లలో నీళ్లు తిరుగుతూ ఉంటే సుదీర్ఘ పోరాటాన్ని తలచుకుంటూ రాంరహీం బాబా అత్యాచార బాధితులు అన్నమాట ఇది: ‘‘డబ్బున్న అత్యంత శక్తిమంతులపైన యుద్ధం ఎంతో కష్టం, న్యాయం దాదాపు అసాధ్యం, అయినా ‘‘ఉమీద్ కీ కిరణ్ హై’’ (ఆశాకిరణం ఉంది). నేరగాడికి శిక్ష తప్పదని నమ్మాం’’. దారుణమైనదంటూ పాత ప్రభుత్వాన్ని ఓడిస్తే, కొత్త ముఖ్యమంత్రి సహా మంత్రిమండలి రేప్ కేసులలో ప్రథమ నిందితుడికి మోకరిల్లింది. సార్వభౌమత్వాన్ని అతని పాదాక్రాంతం చేసిన దశలో, అధికార, ప్రతిపక్ష తేడా లేకుండా ఈ ముఠా నాయకుడికి దాసోహం అంటున్న దుర్దశలో ఏటికి ఎదురీదుతూ, పోలీసులకు, న్యాయస్థానానికి నిజాన్ని నివేదిస్తూ, సాక్ష్యాలు చూపుతూ, చాలా సులువుగా వచ్చి పడుతున్న అపారమైన మురికి డబ్బు లక్షలకు లక్షలు తీసుకుని నేరగాడిని రక్షించడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న న్యాయవాదుల అవమానకరమైన క్రాస్ ఎగ్జామినేషన్‌తో పాటు అనేక దుర్మార్గాలను సహిస్తూ బోనులో కూలిపోకుండా నిలబడి న్యాయ పోరాటం చేసిన ఆ ఇద్దరు సాధ్వీల సాహసాన్ని ఏ విధంగా ప్రశంసించాలి? సరిహద్దులో నిలబడి, భయానకమైన చలిలో చలించకుండా, ఆకాశం నుంచి పిడుగులు కురిపిస్తున్నా, ఎదురుగా శత్రువు ఫిరంగులు పేలుతున్నా పోరాడుతున్న సైనికుని ధైర్యం కన్న గొప్ప ధైర్యం వారిది. అధికార పార్టీ ఏజెంట్ అన్న నిందను భరించే సీబీఐ ఈ కేసు పరిశోధనలో చూపిన నిజాయితీ వల్లనే న్యాయం బతికింది. పేరు దాచి రాసిన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోరు. కాని సాధ్వి నాటి ప్రధానికి, పంజాబ్ హరియాణా చీఫ్‌జస్టిస్‌కు రాసిన ఉత్తరం పనిచేసింది. సిర్సా జిల్లా సెషన్స్ న్యాయమూర్తి నుంచి నివేదిక తెప్పించుకుని హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం కీలకమైన మలుపు. 150 మంది బాధితులున్నారని తేల్చి, వారిలో 130 మందిని కనిపెట్టినా ఇద్దరు సాధ్వీలు మాత్రమే నిజం చెప్పే సాహసం చేశారు. 2008లో సీబీఐ కోర్టు రేప్ ఆరోపణలు నిర్ధారించింది. ఉత్తరం అజ్ఞాతంగా రాయడమే సాహసం. కాని బహిరంగంగా సాక్ష్యం చెప్పడం మరింత సాహసం. తరువాత వారి జీవితం దుర్భరమైంది. బతకడమే సాహసమైంది. డేరా బాబా అనుమతి లేకుండా ఏదీ జరగని రాష్ట్రం, ఏదీ చేయని రాజ్యం. మరోవైపు నేర డేరాను ఒక్క మాటన్నా చంపి పారేసే లక్షల నేరభక్తులు. ఒక నేరగాణ్ణి దేవుడనీ, వాడు చెప్పేది దైవ సందేశమనీ నమ్మే పిచ్చి జనం. కూతుళ్లు చెప్పే నిజాలు నమ్మక డేరాబాబాను మాత్రమే నమ్మి, బాబా దుర్మార్గాలను వివరిస్తే తప్పు చేస్తున్నావని మందలించే తల్లిదండ్రులు. పారిపోవాలనుకున్నా వెళ్లనీయని టెర్రర్. డేరా నడిపే పాఠశాలలో ఆమె ఉపాధ్యాయురాలు. 1999లో అమాయక బాలికలపై బాబా అత్యాచారాలు ఆమెకు అర్థమయ్యాయి. బాబాకు ఒక గుఫా (గుహ) ఉంటుంది. గుఫా ప్రవేశ ద్వారానికి కాపలాగా ఈ ఆడవారిని నియమిస్తారు. ఈ టీచర్ బాధితురాలు కూడా ఒక కాపలాదారు. లోపలికి వెళ్లి కొంతసేపటికి ఏడుస్తూ వచ్చిన అమ్మాయిలను ఈ టీచర్ గమనించారు. ఆమెపై కూడా అత్యాచారాలు జరిపారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను సొంత గ్రామానికి పంపించారు. చివరకు మొత్తం కుటుంబం 2001లో వెళ్లి పోయింది. అప్పటి నుంచి బెదిరింపుల మధ్య భయం భయంగా బతుకుతున్నారు. 2002లో డేరా గూండాలు ఆమె తమ్ముడిని కాల్చి చంపారు. దుర్మార్గాన్ని వెల్లడించిన జర్నలిస్టు రాంచందర్ ఛత్రపతిని డేరా మనుషులే చంపేశారు. ఇది నేరగాళ్లు–రాజ్యం కలిసి పన్నిన పద్మవ్యూ హం, అభిమన్యుడివలె అందులోనే చావకుండా పోరాడి బతికి బయటపడి, ఎలుగెత్తి అన్యాయాన్ని చాటిన ఆ ఇద్దరిలో ఒకరు ధైర్యలక్ష్మి, మరొకరు సాహసలక్ష్మి (అసలు పేర్లతో పనిలేదు). ఈ కీచకబాబా వందలాది మహిళలపై అత్యాచారం చేశాడు. కుటుంబంలో కుల సమాజంలో పరువుపోతుందని భయపడి నోరువిప్పని వారే అందరూ. ‘‘2002 నుంచి రాజకీయ ప్రభుత్వాలన్నీ నేరవిచారణను, ప్రాసిక్యూషన్‌ను నీరు గార్చడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కనుక ఈ డేరాబాబా దేన్నయినా మాయచేయగలడనుకున్నాం, అయినా న్యాయం గెలిచింది’’ అని సాధ్వి అన్నారు. 28 మంది సాక్షులు, 14 పత్రాల వల్ల నేరం రుజువైంది. అవతార్ సింగ్, ఇందర్ సింగ్, కిషన్ లాల్ అనే బాబా ఆంతరంగికులైన సహ నిందితులు లై డిటెక్టర్ పరీక్షలో అసంబద్ధంగా మాట్లాడడం, పాలిగ్రాఫీ పరీక్షలో బాబా ప్రేలాపన నేరగాడిని పట్టించింది. ఇతడిని జైలుకు పంపిన న్యాయాధికారి జగ్దీప్సింగ్ ఒక బ్రహ్మోస్ అయితే ఓట్లకోసం నేరాన్ని సహించొద్దని చెప్పి, మీరు పార్టీకి చెందిన పాలకులా దేశపాలకులా అని నిలదీసిన హైకోర్టు న్యాయమూర్తులు ఫిరంగులు. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
వ్యవస్థల వైఫల్యానికి పరాకాష్ట
సందర్భం గుర్మీత్ వ్యవహారం మన రాజకీయ వ్యవస్థ వైఫల్యం లోతుగా విస్తరించినదని తేల్చింది. ఇది, బీజేపీకి, డేరా సచ్చా సౌదాకు మధ్య కుమ్మక్కు మాత్రమే కాదు. కాంగ్రెస్, అకాలీలు, ఐఎన్ఎల్డీ సహా హరియాణా, పంజాబ్‌లోని అన్ని ప్రధాన పార్టీలూ ఎప్పుడో ఒకప్పుడు డేరాతో అంటకాగినవే. ఆ పార్టీల నేతలలో ఏ ఒక్కరూ ఈ తీర్పును స్వాగతించ సాహసించ లేదు. అంటే మన రాజకీయ వ్యవస్థ అవకాశవాదపూరితమైనది, విలువలపరంగా రాజీపడి నది. ఏ చిన్న ఓటు బ్యాంకుపైనైనా ఆధారపడటానికి సిద్ధంగా ఉండేంత బలహీనమైనది. ‘రామ్ రహీమ్’గుర్మీత్ సింగ్‌కు శిక్ష విధించడం మనందరికీ ఎంతో కొంత సంతోషాన్ని కలిగించింది. ఒక దొంగ బాబా గుట్టు బట్టబయలైంది. అతగాడి సామ్రాజ్యాన్ని కుప్ప కూల్చనున్నారు. రాజకీయ వేత్తలు–బాబాల కుమ్మక్కు బంధంలో కనీసం ఒక్క పోగయినా తెగిపోయింది. చట్టబద్ధ పాలనను ఉల్లంఘించినవారిపై ప్రభుత్వం గట్టి చర్యలను తీసుకోవాల్సిన పరిస్థితి కలిగింది. చివరిగా, ఆలస్యంగానే అయినా చట్టం సుదీర్ఘ బాహువులకు మహా ఘరానా నేరగాడు పట్టుబడ్డాడు. చూడబోతే ఇది సరైన దిశగా వేసిన ముందడుగని అనిపిస్తోంది. ఇది కేవలం చాలా చిన్న ముందడుగే కాదు, తాత్కాలికమైనది, సంతృప్తితో అలసత్వం వహించడానికి ఏ మాత్రం వీల్లేనిది కూడా. అందువల్లనే నేను ఈ ఆశావాదాన్ని మీకు పంచబోవడం లేదు. గుర్మీత్ సింగ్‌ను శిక్షించినది కేవలం మొదటి ట్రయల్ కోర్టు మాత్రమే. సుదీర్ఘకాలం పాటూ సాగే అప్పీళ్ల తర్వాత చివరకు తుది తీర్పు వెలువడుతుంది. అతగాడు త్వరలోనే బయటకు వచ్చి, అంత వరకు బయటే గడిపినా గడపవచ్చు. ఇప్పటికైతే అతగాడు జైల్లోనే ఉన్నాడు. కానీ, జైళ్లలో సైతం వీఐపీల కోసం ప్రత్యేక మార్గం ఉంటుందని శశికళ, సంజయ్‌దత్‌ల అనుభవం మనకు గుర్తుచేస్తుంది. వారికి ప్రత్యేక సదుపాయాలు, ఆసుపత్రులలో సుదీర్ఘంగా గడిపే అవకాశం, అసాధారణమైన పెరోల్స్, ఇంకా ఏమి ఉండవని చెప్పగలం. గుర్మీత్, తన వారసురాలిని ఎంపిక చేసినా గానీ, భారీ ఎత్తున అతనికి ఉన్న అనుచర గణం, భౌతిక ఆస్తులు క్షీణిస్తున్నట్టు మనకు ఇంకా కనబడటం లేదు. ఏదిఏమైనా, ఇదంతా నిజం, గుర్తుంచుకోదగినది. అయితే, నాలోని అశాంతికి ప్రధాన కారణం ఇది కాదు. వ్యవస్థాగత వైఫల్యానికి సంకేతం నాకు సంబంధించి ‘రామ్ రహీమ్’వ్యవహారం, మన వ్యవస్థాగత వైఫల్యానికి సంకేతంగా నిలుస్తుంది. గత వారం రోజుల ఘటనలు ఈ వైఫల్యానికి ఉన్న నాలుగు పార్శా్వలను వెల్లడి చేశాయి. అవి: క్రిమినల్ న్యాయ వ్యవస్థ వైఫల్యం, ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం, రాజకీయ అధికార వ్యవస్థ వైఫల్యం, ఆధ్యాత్మిక సంరక్షణ వ్యవస్థ వైఫల్యం. ఎవరో ఒక వ్యక్తి సాధించిన అసాధారణమైన సాఫల్యత గురించి మనం ఎంత ఎక్కువగా మాట్లాడుతుంటే, అది అంతగా వంటబట్టిపోయిన మన వైఫల్యాలను నొక్కి చెబుతుంది. న్యాయవ్యవస్థ ఒక్కటే తన స్వతంత్రతను నిలుపుకున్న ఈ వారంలోనే మనం... మన నేర న్యాయ వ్యవస్థ వైఫల్యం గురించి మాట్లాడుకోవాల్సి రావడం విచిత్రమే. సీబీఐ కోర్టు న్యాయమూర్తి జగదీప్ సింగ్ ధైర్యాన్ని, నైతిక రుజువర్తనను సమంజసంగానే ప్రస్తుతించారని అందరమూ అంగీకరిస్తాం. పంజాబ్, హరియాణా హైకోర్టు, చట్టబద్ధ పాలనను ఎత్తిపట్టడం అనేది రాజ్యాంగపరమైన క్రమబద్ధత పట్ల చాలా మంది పౌరులలో విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పగలిగి ఉంటుంది. అది పంచకుల వాసులకే పరిమితం కాదు. ఇది, సుప్రీం కోర్టు మూడు తలాక్‌ల పద్ధతి చెల్లదని తీర్పు చెప్పి, సంచలనం రేకెత్తించిన వారం మాత్రమే కాదు. వ్యక్తిగత గోప్యత హక్కు కింద పౌరులకు ఉండే వ్యక్తిగత స్వేచ్ఛల విషయంలో అతి విస్తృత పర్యవసానాలను కలిగించే నిశితమైన తీర్పును కూడా ఇదే వారంలో సుప్రీం కోర్టు వెలువరించింది. అయినాగానీ, ఒక న్యాయమూర్తి తాను నిర్వర్తించవలసిన సాధారణ విధిని నిర్వహించినందుకు దేశం మొత్తం కీర్తించాల్సి వస్తే, అది కొంత విచిత్రమైనదే. దోషిగా ఆరోపణకు గురైనది గుర్మీత్ సింగ్ అంతటి శక్తివంతుడు ఎవరైనా అయితే, అలవాటుగా క్రమానుసారంగా ఇలా ఎప్పుడూ న్యాయాన్ని అందించడం చాలా అరుదు అనే వాస్తవానికి ఇది గుర్తింపు పత్రం అవుతుంది. మొదట ఫిర్యాదు చేశాక పదిహేనేళ్లు, కేసును న్యాయ విచారణకు చేపట్టినాక దాదాపు పదేళ్లు న్యాయం జరగడానికి పట్టాయనే అంశాన్ని మనం విస్మరించలేం. మన నేర న్యాయ వ్యవస్థలో ఉన్న లోటు పాట్లు ఇవి : బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం పట్ల విముఖత చూపడం, తొలుత చేసిన ఫిర్యాదును అసలు పరిశీలించడానికే తిరస్కరించడం, మరణశయ్యపై ఉన్న ధైర్యవంతుడైన ఒక పాత్రికేయుని మరణ వాంగ్మూలం నమోదుకు మూడురోజుల పాటూ నిస్సిగ్గుగా తిరస్కరించడం, శక్తివంతులు చట్టాన్ని వంచడానికి వాడే సుదీర్ఘమైన జాప్యాలు, అప్పీళ్లు తదితర పద్ధతులు. నిర్భయంగా ముందుకు వచ్చి నిలిచిన బాధితురాలు, అత్యంత సునిశితమైన పరిశీలన, నిజాయితీ గల దర్యాప్తు అధికారి, రుజువర్తనుడైన న్యాయమూర్తి ఒక్క చోట కలవడం యాదృచ్ఛికంగా సంభవించింది. కాబట్టే గుర్మీత్ సింగ్‌కు శిక్షపడింది. ఈ కేసు, మన నేర న్యాయ వ్యవస్థకు ఉన్న అడ్డగోలు నడత స్వభావాన్ని బట్ట బయలు చేస్తుంది. ఏ మంచి న్యాయవాది అయినా చెప్పేట్టు అది ఒక లాటరీ. అత్యున్నత నాయకత్వం కళ్లు మూసుకుంటే... పాలనా వ్యవస్థల వైఫల్యం మరీ కొట్టవచ్చినట్టుగా కనిపిస్తూ విస్మరించలేనిదిగా ఉంది. ముఖ్యమంత్రి మోహన్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హరియాణా ప్రభుత్వం, నిలకడగా పరిపాలనా స్థాయిని, శాంతిభద్రతలకు విఘాతాన్ని సహించగలిగే స్థాయిని నిరంతరాయంగా దిగజారుస్తూ వస్తోంది. బాబా రామ్‌పాల్‌ను ఎదుర్కొనాల్సి వచ్చినప్పుడు మొదట అది చచ్చుబడి పోయింది. దాన్ని పరిపాలనాపరమైన అనుభవరాహిత్యంగా లేదా అసమంజసత్వంగా తీసిపారేయవచ్చు. ఇక రెండవసారి పరిపాలన చచ్చుబడిపోవడం, జాట్ల రిజర్వేషన్ల ఆందోళన సందర్భంగా సంభవించింది. తమలో తాము కలహిస్తున్న మంత్రివర్గపు అలసత్వం వల్లనే అది జరిగిందనేది సుస్పష్టమే. ప్రభుత్వం, పౌరులకు కనీస స్థాయి శాంతిభద్రతలకు సైతం హామీని కల్పించలేనంతటి ఘోర వైఫల్యానికి గురైన వైనాన్ని ప్రకాశ్ సింగ్ కమిషన్ నివేదిక వివరంగా వెల్లడించింది. ఆ నివేదిక వెలువడ్డాక కూడా ఖట్టర్ ప్రభుత్వం కొనసాగడం ఏ మాత్రం సమంజసం కాదు. ఖట్టర్ ప్రభుత్వ పాలనాపరమైన వైఫల్యం పంచకులలో మరింత లోలోతులకు పతనమైంది. 25 నాటి హింసాకాండకు సంబంధించి ప్రతిదీ ముందుగా తెలిసినదే. తేదీ, సమయం, స్థలం, పాత్రధారులు అందరికీ తెలుసు. కాబట్టి, రాజకీయాభీష్టం కొరవడటం, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి పాటించాల్సిన అత్యంత ప్రాథమికమైన పద్ధతులను చేపట్టడానికి నిరాకరించడం మాత్రమే ఈ ఘటనలన్నిటికీ బాధ్యత వహించాలి అని చెప్పాల్సి వస్తుంది. ఉదాహరణగా చెప్పాలంటే అవి పంజాబ్‌లో కనిపించాయి. అత్యున్నత స్థాయి నాయకత్వం కళ్లు మూసుకుంటే, ఇక ఆ దిగువన ఉన్న వారంతా కునికిపాట్లు పడుతుండటమనే మరో వ్యవస్థాగతమైన సమస్య పెరుగుతుండటాన్ని ఈ వ్యవహారం పట్టి చూపింది. హరియాణా ప్రభుత్వం నిర్వా్యపకత్వం ప్రభుత్వ వైఫల్యంలోని ఒక అంశం మాత్రమే. చెలరేగిన అల్లరి మూకలను అదుపు చేయడానికి పోలీసులు పాటించాల్సిన అన్ని పద్ధతులూ పాటించాకే కాల్పులు జరి పారా? 38 మంది మృతి చెందడం అంటే మాటలా? నిర్వా్యపకత్వం తర్వాత అనవసర బలప్రయోగం జరిగిందా? డేరా ప్రతిష్ట దిగజారి ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ప్రశ్నలు ఎవరూ అడగడం లేదు. కానీ అవి శేష ప్రశ్నలై నిలుస్తాయి. మొత్తంగా చూస్తే, హరియాణా ప్రభుత్వ నేరపూరితమైన క్రియాశూన్యత, క్రియాత్మకతా ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి తాత్కాలికంగానైనా క్షీణిస్తున్నట్టు చూపుతుంది. కేంద్ర ప్రభుత్వానికి సిబ్బంది, యంత్రాం గం, లక్ష్యమూ ఉన్నా, క్రమబద్ధమైన పాలనకు తగిన వ్యవస్థలు లేవు. అంతా డేరా అంటకాగిన వారే రాజకీయ వ్యవస్థ వైఫల్యం మనం అనుకుంటున్న దానికంటే బాగా లోతుగా విస్తరించి ఉంది. ఇది, ముఖ్యమంత్రి ఖట్టర్తోపాటూ, ఆయన్ను గద్దె దించాలని నిరంతరం ఆశపడుతోన్న ఆయన సహచరుల హాస్యభరితమైన, విషాదకర వైఫల్యం మాత్రమే కాదు. ఇది కేవలం అధికార బీజేపీకి, డేరా సచ్చా సౌదాకు మధ్య ఉన్న కుమ్మక్కు మాత్రమే కాదు. కాంగ్రెస్, అకాలీలు, భారత జాతీయ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ)సహా హరియాణా, పంజాబ్‌లోని అన్ని ప్రధాన పార్టీలూ, ఇటీవలి చరిత్రలో ఎప్పుడో ఒకప్పుడు ఆ డేరా అంటకాగిన వేనని విస్మరించరాదు. 2014లో గుర్మీత్ డేరా తమకు ఇచ్చిన మద్దతుకు బీజేపీ ఇప్పుడు బదులు తీర్చుకుంటోందనేది స్పష్టమే. 2009లో కాంగ్రెస్ చేసినది, అంతకు ముందు ఐఎన్ఎల్డీ చేసినది కూడా అదే. ఈ ప్రాంతంలో ఎన్నికలపరంగా పరిగణనలోకి తీసుకోదగిన పార్టీల జాతీయ నేతలలో ఏ ఒక్కరూ ఈ తీర్పును స్వాగతించ సాహసించలేదు. ఏ ఒక్కరూ డేరాతో భావి ఒప్పందాలను పూర్తిగా నిరాకరించేవారు కారనేది స్పష్టమే. మన రాజకీయ వ్యవస్థ అవకాశవాద పూరితమైనది మాత్రమే కాదు, విలువల పరంగా రాజీపడినది, పైగా అది చేతికి అందివచ్చే ఏ చిన్న ఓటు బ్యాంకుపైన అయినా ఆధారపడటానికి సదా సిద్ధంగా ఉండేంత బలహీనమైన వ్యవస్థ. చివరగా, ఈ వ్యవహారం మన ఆధ్యాత్మిక పరిరక్షకుల డొల్లతనాన్ని బట్టబయలు చేస్తుంది. ఒకరి తర్వాత ఒకరుగా ఒక్కో బాబా బండారం బయటపడుతుంటే అసలు ఆధ్యాత్మిక సంరక్షణ అనే భావనే నవ్వి పారేసేదిగా మారుతుంది. అంతేకాదు, ఆధ్యాత్మిక గురువులను సాంప్రదాయక మార్మికవాదపు అవశేషాలుగా చూడటం కూడా సులువు అవుతుంది. అయితే, అలాంటి దృష్టి కార్పొరేట్ బాబాలు పెరుగుతుండటమనే అంశం నేది అత్యంత ఆధునికమైన పరిణామం అనే దాన్ని విస్మరించేలా చేస్తుంది. అది మన ఆధునికత హృదయంలోని రంధ్రాన్ని ప్రతిబింబిస్తుంది. ఆధునిక అభివృద్ధి మనకు భౌతికమైన సుఖసౌఖ్యాలను ఇవ్వవచ్చు కానీ, అది, మన ఆధ్యాత్మికమైన ఆకలిని తీర్చడంలో విఫలమైంది. అందువల్లనే మన బాహిర, అంతర జీవితాలతో అనుబంధాన్ని ఏర్పరచుకోగల ఆధ్యాత్మిక గురువులు సమాజానికి అవసరం అవుతున్నారు. మన ఆధునికత రామ్ లేదా రహీమ్‌లతో అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో విఫలమైనప్పుడు... గుర్మీత్ సింగ్ ఆ శూన్యంలోకి ప్రవేశించి తానే ‘రామ్ రహీమ్’ కాగలుగుతాడు. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు యోగేంద్ర యాదవ్ ‘ మొబైల్: 98688 88986 -
నేను నపుంసకుడిని: గుర్మీత్
సాక్షి, న్యూఢిల్లీ/చండీగఢ్ : అత్యాచారాల కేసులో 20 ఏళ్ల జైలుశిక్షకు గురైన ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ సింగ్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. కీలకాంశం ఏంటంటే.. శిక్ష నుంచి బయటపడేందుకు తానో నపుంసకుడినని ఈ రాక్‌స్టార్ బాబా చెప్పుకున్నారు. అయితే తాను 1990 నుంచి నపుంసకుడిగా మారానని, అలాంటిది 1999 ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో తాను ఇద్దరు మహిళలను అత్యాచారం చేశానన్నది అసత్య ప్రచారమేనని పేర్కొన్నారు. అసలు ఆ ఆరోపణల్లో ఇసుమంతైనా నిజంలేదని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణలో భాగంగా జస్టిస్ జగ్దీప్ కుమార్‌కు ఆయన చెప్పుకొచ్చారు. తాను అమాయకుడినని, ఎలాంటి తప్పులు చేయలేదని న్యాయమూర్తికి విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయింది. గుర్మీత్ చెప్పేవన్నీ అసత్యాలేనని సీబీఐ న్యాయస్థానం గుర్తించింది. మీకు ఇద్దరు కూతుళ్లున్నారు కదా.. దీనిపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించగా గుర్మీత్ మౌనం వహించినట్లు సమాచారం. ఆపై ఈ కేసులో బాధితురాలు గుర్మీత్ గురించి మరిన్ని విషయాలు తెలిపారు. అశ్రమంలో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి ఇంట్లో వాళ్లకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్మీత్ బెదిరించేవారని చెప్పారు. కుటుంబ సభ్యులను హత్య చేయిస్తానని పలుమార్లు హెచ్చరించినట్లు కోర్టుకు బాధితురాలు వెల్లడించారు. నిందితుడు బాబాకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నట్లు చెప్పడంతో పాటు బాధితురాలి ఫిర్యాదు వివరాలను పరిశీలించిన తర్వాతే సీబీఐ కోర్టు గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలుశిక్షతో పాటుగా ఒక్కో కేసులో రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధించిన విషయం తెలిసిందే. -
గుర్మీత్‌కు పద్మ అవార్డు ఇవ్వాలి!
2017లో 89 మందికి పద్మ పురస్కారాలు గుర్మీత్ పేరిట అత్యధికంగా 4,208 నామినేషన్లు అత్యాచార కేసుల్లో 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన సీబీఐ కోర్టు న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగుచూసింది. 2017 పద్మ అవార్డులకుగానూ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఓవరాల్‌గా 18, 768 దరఖాస్తులు రాగా, అత్యధికంగా 4,208 మంది గుర్మీత్ పేరును పద్మ అవార్డులకు ప్రతిపాదించడం గమనార్హం. దీంతోపాటుగా ఇప్పటివరకూ గుర్మీత్ సింగ్ తన పేరును ఐదు పర్యాయాలు పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. మూడు పద్మ అవార్డులలో ఏదైనా ఒకటి ఇచ్చి గౌరవించాలని గుర్మీత్ పేరు ప్రతిపాదించిన వారిలో హరియానాలోని హిస్సార్ కు చెందిన సెయింట్ జార్జ్ సోనెట్, ఇండియా సెయింట్ జార్జ్ ఉన్నారు. సిర్సాలోని గుర్మీత్ డేరా ఆశ్రమం నుంచే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. రాక్‌స్టార్ బాబాగా, ఆధ్యాత్మిక గురువుగా, నటుడిగా పేరొందిన గుర్మీత్‌కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. సిర్సాకు చెందిన అమిత్ అనే వ్యక్తి 31 సార్లు నామినేట్ చేయగా, సునీల్ అనే వ్యక్తి 27 పర్యాయాలు పద్మ అవార్డు కోసం గుర్మీత్ పేరున దరఖాస్తు చేశారు. ఇంకా అభా, ఆదిత్య, అక్బర్, అల్ఫెజ్, బల్జిందర్, మిల్కీ, గజల్, కోమల్, జానీ, జెస్సీ, ఐశ్వార్ అనే పేర్లతో చాలామంది ఈ అవార్డు కోరినట్లు సమాచారం. మురళీ మనోహర్ జోషీ, శరద్ పవార్, లోకసభ మాజీ స్పీకర్ దివంగత నేత పీఏ సంగ్మా, క్రికెటర్ విరాట్ కోహ్లీ, నేపథ్యగాయకుడు కేజే ఏసుదాసు సహా 89 మందికి కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్‌లో పద్మ అవార్డులను అందజేసింది. మరోవైపు రెండు అత్యాచార కేసుల్లో డేరా చీఫ్ గుర్మీత్(50)కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల (ఒక్కో కేసులో పదేళ్లు) కఠిన కారాగార శిక్ష విధించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ తీర్పు వెల్లడించారు. దీంతోపాటు ఒక్కో కేసుకు రూ. 15 లక్షల చొప్పున జరిమానాను కూడా విధించగా, బాధితురాళ్లకు రూ.14 లక్షల చొప్పున అందజేయనున్నారు. -
గుర్మీత్‌ను తప్పించడానికి డేరా ప్లాన్..!!
-
అల్లర్లకు డేరా బాబా సిగ్నల్ ఎలా ఇచ్చాడంటే...
సాక్షి, ఛండీగఢ్: అత్యాచార కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను దోషిగా పంచకుల సీబీఐ స్పెషల్ కోర్టు ప్రకటించిన కాసేపటికే అల్లర్లు ఉవ్వెత్తున్న చెలరేగాయి. ఆయనను జైలుకు తీసుకెళ్తున్న సమయంలోనే ఏదో సంకేతాలు అందినట్లు క్షణాల్లోనే డేరా అనుచరులు ఒక్కసారిగా చెలరేగిపోయారు. దీనిపై హర్యానా పోలీస్ శాఖ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గుర్మీత్ బట్టలు ఉన్నాయని చెబుతూ ఆయన దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ చేతిలో ఓ ఎర్ర రంగు బ్యాగ్ తో రోహ్తక్ జైలు దాకా వెళ్లిన విషయం తెలిసిందే. ఆ బ్యాగ్ కలర్ ద్వారానే అల్లర్లకు సిగ్నల్ ఇచ్చి ఉంటారని ఐజీ కేకే రావు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆయన(గుర్మీత్)ను ప్రత్యేక వాహనంలో జైలుకు తరలించేందుకు సిద్ధం అయ్యాం. హనీప్రీత్ చేతిలో ఓ బ్యాగుతో వాహనం ఎక్కారు. సరిగ్గా అదే సమయంలో రెండు మూడు కిలోమీటర్ల అవతల టియర్ గ్యాస్ షెల్స్ పేలినట్లు శబ్ధం వినిపించింది. బహుశా తాను దోషిగా నిర్ధారణ అయ్యాక జైలు శిక్ష తప్పదని భావించిన గుర్మీత్ అనుచరులకు రెచ్చిపోవాలంటూ అలా సంకేతాలు ఇచ్చి ఉండొచ్చు’ అని రావు మీడియాకు వెల్లడించారు. తీర్పు సమయంలో పంచకుల కోర్టు ఆవరణలోనే హనీప్రీత్ ఉన్నారు. 2-3 కిలోమీటర్ల దాకా ఎవరినీ అనుమతించలేం. తీర్పు వెలువడ్డాక జైలుకు తరలించేందుకు కొంచెం సమయం పట్టింది. ఆ మధ్యలోనే అనుచరులకు సంకేతాలు అంది ఉంటాయని భావిస్తున్నట్లు రావు తెలిపారు. అందుకే అలా తరలించాం.. గుర్మీత్‌ను దోషిగా నిర్థారించాక రోహ్తక్ జైలుకు తరలించే క్రమంలో ముందు ప్రత్యేక చాపర్ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాలి. అయితే 70 వాహనాల భారీ కాన్వాయ్ తో వచ్చిన కోర్టుకు వచ్చిన ఆయనను.. అనుచరులు దాడి చేస్తారన్న అనుమానంతో తిరిగి అదే దారిలో తీసుకెళ్లే సాహసం చేసుకోదల్చుకోలేదు. అందుకే మరో మార్గం అయిన కంటోన్మెంట్ ఏరియా(పికెట్) గుండా తీసుకెళ్లేందుకు ఆర్మీ అధికారి అనుమతి కోరాం. నిబంధనల దృష్ట్యా అనుమతి లేకపోయినా.. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారి అందుకు అంగీకరించారు. చివరకు ఆ దారి గుండా వెళ్తున్న సమయంలో కూడా కొందరు అనుచరులు దాడికి యత్నించారు. ఆయుధాలతో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ముందుకు సాగాం. ఆ ఆరగంటలో గుర్మీత్‌ను ఎటు వైపు తీసుకెళ్లామో తెలీక కోర్టు బయట ఉన్న అనుచరులు అయోమయంలో పడిపోయారు. చివరకు చాపర్ ఉన్న ప్రాంతానికి వెళ్లేంత వరకు అధికారులందరి ముఖంలో టెన్షన్ నెలకొందని ఐజీ రావు చెప్పుకొచ్చారు. -
డేరా ఆశ్రమంపై సీపీఎం జెండాలు
నల్లగొండ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేరాబాబా(గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్)కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఉన్న డేరాబాబా ఆశ్రమ స్థలంలో బుధవారం సీపీఎం నాయకులు జెండాలు పాతారు. డేరాబాబాకు ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆయన ఆస్తులను ప్రజలకు పంచి పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
గుర్మీత్‌ను తప్పించడానికి డేరా ప్లాన్..!!
సాక్షి, పంచకుల: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంను తప్పించేందుకు డేరా అనుచరులు ప్లాన్ వేశారు. అవును. శుక్రవారం పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్‌ను అత్యాచారాల కేసులో దోషిగా తేల్చిన అనంతరం ఆయన్ను తప్పించడానికి డేరా అనుచరులు ప్రయత్నించినట్లు హరియాణా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే, అధికారులు ఆ ప్లాన్‌ను సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. అసలు ప్లానేంటి.. దోషిగా తేలిన తర్వాత కోర్టు బయటకు గుర్మీత్‌తో పాటు వచ్చే పోలీసులపై దాడి చేసి, బాబాను అక్కడి నుంచి తప్పించి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాలని భావించారు. వాస్తవంగా ఏం జరిగింది.. గుర్మీత్‌ను కోర్టు దోషిగా తేల్చింది. హరియాణా పోలీసులు బాబాను వెంటబెట్టుకుని బయటకు వచ్చారు. స్కార్పియో కారులో ఆయన్ను ఎక్కించారు. బాబాకు అటు వైపు, ఇటు వైపు భద్రతగా గార్డులు కూడా కారులో కూర్చున్నారు. కారు కోర్టు కాంప్లెక్స్‌ను దాటడానికి ఓ పోలీసు బారియర్ నుంచి వెళ్లాలి. అక్కడే కాపు కాశారు డేరా అనుచరులు. అనుకున్న ప్రకారం.. స్కార్పియో కారు బారియర్‌ను చేరుకునే లోపే తమ కారుతో అడ్డగించారు. బాబాను తమకు అప్పగించాలని పెద్దగా కేకలు వేశారు. దీంతో పోలీసు వాహనం నుంచి ఆరుగురు ఆఫీసర్లు కిందకు దిగారు. వారిని చూసిన డేరా అనుచరులు షాక్ తిన్నారు. సాధారణ గార్డులు దోషికి భద్రతా ఉంటారు. కానీ ఆరుగురు ఆరి తేరిన అధికారులు తుపాకులతో కిందకు దిగడం వారికి మింగుడు పడనివ్వలేదు. బాబాను తప్పించాలా? లేదా వెనక్కు వెళ్లిపోవాలా? అనే ఆప్షన్లు వారి ముందు మిగిలాయి. ఇందులో వారు మొదటి దాన్ని ఎంచుకుని కారును ఆఫీసర్ల మీదుగా పొనివ్వాలని డ్రైవర్‌కు చెప్పారు. ఇంతలో ఈ విషయాన్ని గుర్తించిన మరి కొంతమంది పోలీసులు బారియర్ ఉన్న ప్రాంతానికి చేరుకుని డేరా అనుచరులను అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్లో నిజాలు.. బాబాను తప్పించేందుకు వేసిన ప్లాన్‌ను గురించిన వివరాలన్నింటిని ఎఫ్ఐఆర్లో హరియాణా పోలీసులు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డేరా అనుచరుల కారు నుంచి ఆటోమేటిక్ మెషీన్ గన్, పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
'బాబా'పై వ్యాఖ్యలు; బీజేపీ ఎంపీ యూటర్న్
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మాట మార్చారు. గుర్మీత్‌కు అనుకూలంగా తాను మాట్లాడలేదని అన్నారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పారు. 'రాం రహీమ్‌కు మద్దతుగా నేను కామెంట్ చేయలేదు. నా మాటలను మీడియా తప్పుగా ప్రసారం చేసింది. రాం రహీమ్‌కు వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాను. విశ్వాసం పేరుతో మోసం చేసినవారిపై సాధించిన విజయం ఇది. రాంపాల్, రాం రహీమ్, ఆశారామ్ బాబాలు కాదు. ఇటువంటి వారిని అనుసరించే ముందు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల'ని సాక్షి మహరాజ్ అన్నారు. రాం రహీమ్ చాలా నిరాబండర వ్యక్తి అని, ఆయనను వేధింపులకు గురి చేస్తున్నారని అంతకుముందు ఆయన వ్యాఖ్యానించారు. 'న్యాయవ్యవస్థ పట్ల నాకు గౌరవముంది. కోట్లాది మంది రాం రహీమ్‌ను సమర్థిస్తున్నారు. కేవలం ఒక్కరు మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఒక్కరే కరెక్టా? కోట్లాది మంది కరెక్టా?. జామా మసీదుకు చెందిన షాహి ఇమామ్ మీద అనేక కేసులు ఉన్నాయి. రాం రహీమ్‌ను విచారించినట్టుగానే షాహి ఇమామ్‌ను సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విచారించగలవా.. ఆయనేమైనా వాటికి చుట్టమా? రాం రహీమ్ నిరాడంబరుడు. అందుకే ఆయనను వేధిస్తున్నార'ని సాక్షి మహరాజ్ ఇంతకుముందు వ్యాఖ్యానించారు. 15 ఏళ్ల క్రితం ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు రోహతక్ కోర్టు సోమవారం రాం రహీమ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
బాబా వారసులు హానీప్రీత్ ఎవరు?
-
'గుర్మీత్‌తో నా భార్యకు శారీరక సంబంధం'
సాక్షి, రోహ్తక్: డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్ ఇశాన్‌ల సంబంధంపై ఆమె భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య హనీప్రీత్, బాబా గుర్మీత్‌ల మధ్య శారీరక సంబంధం ఉందని విశ్వాస్ గుప్తా అన్నారు. హనీప్రీత్ అసలు పేరు ప్రియాంక తనేజా. 1999లో విశ్వాస్ గుప్తా, హనీప్రీత్‌లకు వివాహం జరిగింది. 2011లో హనీప్రీత్ నుంచి విడాకులు కోరుతూ గుప్తా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుర్మీత్, హనీప్రీత్‌లు శృంగారంలో పాల్గొంటూ తనకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారని విడాకుల పిటిషన్లో పేర్కొన్నారు. ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో గుప్తా విస్తుగొలిపే విషయాలను వెల్లడించారు. బాబా నివాసమైన గుఫాలో తాను ఉండేవాడినని చెప్పారు. బాబా, హనీలు శృంగారంలో పాల్గొంటుండగా తాను చూశానని తెలిపారు. ఇది గమనించిన బాబా విషయం బయటకు చెబితే తనను చంపేస్తానని బెదిరించారని వెల్లడించారు. ఎక్కడికి వెళ్లినా హనీని బాబా తన వెంట తీసుకెళ్లేవారని, తమ జంటను(గుప్తా-హనీప్రీత్) ఏకాంతంగా ఏ రోజు వదల్లేదని చెప్పారు. గుప్తా వ్యాఖ్యలపై దుమారం రేగడంతో స్పందించిన డేరా సచ్చా సౌదా అనుచరులు అవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టి పారేశారు. బాబా ఒత్తిడి కారణంగా కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని విశ్వాస్ తెలిపారు. గుప్తాకు డేరా సచ్చా సౌదా అనుచరుల నుంచి అపాయం ఉండటంతో ప్రస్తుతం రహస్య ప్రాంతంలో ఉంటున్నారు. -
ఇంతకీ గుర్మీత్ భార్య, పిల్లలు ఏమయ్యారు?
సాక్షి, న్యూఢిల్లీ : గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలు పాలు కావటంతో డేరా సచ్ఛా సౌదా కొత్త చీఫ్‌గా ఎవరన్న ప్రశ్న మొదలయ్యింది. ఈ రేసులో రాక్ స్టార్ కుటుంబ సభ్యుల పేర్లు కాకుండా అనూహ్యంగా దత్త పుత్రిక హనీప్రీత్ తో పాటుగా డేరా చైర్పర్సన్ విపాసన పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో గుర్మిత్ భార్య, పిల్లలు ఎక్కడనున్నారు? ఇంత జరుగుతున్నా వాళ్లు ఎందుకు స్పందించటం లేదు? అన్న ఆరాలు మొదలయ్యాయి. గుర్మీత్ భార్య ఎవరు? గుర్మీత్ తన పదో తగరగతి పూర్తి చేసుకోగానే హర్జీత్ కౌర్ అనే ఆమెను వివాహం చేసుకున్నారు. వీరికి అమర్‌ప్రీత్, చరణ్‌ప్రీత్ ఇద్దరు కూతుళ్లు, కుమారుడు జస్మిత్ సింగ్ ఉన్నారు. ఈ ముగ్గురి పిల్లలు కాకుండా ప్రియాంక తనేజా(హనీ ప్రీత్)ను గుర్మీత్ దత్తత తీసుకున్నారు. సొంత పిల్లల కన్నా హనీప్రీత్తోనే ఆయన ఎక్కువ సానిహిత్యంగా ఉండేవారంట. ఇక ఆయన పిల్లల సంగతి ఏమోగానీ భార్య మాత్రం తరచూ డేరాలో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేదని పలువురు చెబుతుండగా, మరికొందరు మాత్రం అలాంటిదేం లేదని అంటున్నారు. డేరాలో గుర్మీత్‌కు చాలా దగ్గరగా ఉండి సపర్యలు చేసినవాళ్లు కూడా గత ఐదేళ్లలో ఆమెను చూసింది లేదనే అంటున్నారు. డేరా కాంప్లెక్స్ లోనే ఎక్కువ సమయం గడిపే హర్జీత్ సాదాసీదా దుస్తులు ధరించి, మిగతా భక్తులతో కలిసిపోయి కూర్చుని ధ్యానంలో పాల్గొనేదంట. అయితే డేరా కార్యకలాపాల్లో ఆమె ఎలాంటి భూమిక పోషించిందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందుకే హర్జీత్ కౌర్.. డేరా బాబా భార్య అని ఎవరూ గుర్తించేవారు కాదని కూడా చెప్పుకుంటున్నారు. మరోవైపు గుర్మిత్పై ఆరోపణలు వచ్చిన సమయంలోనూ హర్జీత్ స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు కేసులో దోషిగా తేలటం, ఆపై శిక్ష ఖరారుల నేపథ్యంలో కూడా హర్జీత్, ఆమె పిల్లలు కనిపించలేదు. చివరకు జైలుకు తరలించే సమయంలోనూ హనీప్రీత్ గుర్మీత్‌కు వెంట ఉంది. ఈ తరుణంలో వాళ్ల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారింది. సెలబ్రిటీ హోదాకు దూరంగా ఉండాలనే అలా చేస్తున్నారా? గుర్మీత్ వ్యవహారాలు తెలిసే ఆయనను..కుటుంబీకులు దూరం పెట్టారా? హనీప్రీత్‌కు అంత ప్రాధాన్యం ఇవ్వటం నచ్చకే ఇలా చేస్తున్నారా? ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు చర్చించుకుంటున్నారు. -
గుర్మీత్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు
-
బాబా వారసులు హానీప్రీత్ ఎవరు?
-
గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు
రెండు అత్యాచార కేసులకు రూ. 30 లక్షల జరిమానా కూడా ► గుర్మీత్‌కు శిక్ష ఖరారు చేసిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి ► కోర్టు హాల్లో బోరున విలపించిన డేరా చీఫ్! ► శిక్షపై పైకోర్టులో అప్పీల్ చేస్తామన్న డిఫెన్స్ లాయర్లు ► హరియాణా, పంజాబ్‌ల్లో పటిష్ట భద్రత రోహ్తక్/చండీగఢ్: 2002 నాటి రెండు అత్యాచార కేసుల్లో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ (50)కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఒక్కో కేసులో పదేళ్ల చొప్పున రెండు కేసుల్లో మొత్తంగా 20 ఏళ్ల శిక్ష వేస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ స్పష్టం చేశారు. దీంతోపాటు ఒక్కో కేసుకు రూ. 15 లక్షల చొప్పున జరిమానాను కూడా విధించారు. ఇందులో రూ.14 లక్షల చొప్పున బాధితురాళ్లకు అందజేయనున్నారు. రోహ్తక్ జిల్లా సునరియా జైల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు. కాగా, గుర్మీత్‌కు విధించిన శిక్షపై పైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు గుర్మీత్ తరపు న్యాయవాది తెలిపారు. శిక్ష ప్రకటించగానే డేరా చీఫ్ కోర్టు హాల్లోనే బోరున విలపించినట్లు తెలిసింది. కాగా, తీర్పు తర్వాత తలెత్తే ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు హరియాణా, పంజాబ్ రాష్ట్రాలు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశాయి. ఇరు రాష్ట్రాల్లోనూ ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. క్షమించండి.. ప్లీజ్! గుర్మీత్‌ను పంచకులలోని కోర్టుకు తీసుకురావటం వల్ల పరిస్థితులు ఆందోళనకరంగా మారే అవకాశం ఉన్నందున సునరియా జైల్లోని లైబ్రరీ హాల్లో తాత్కాలిక కోర్టు ఏర్పాటు చేశారు. సోమవారం పంచకుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జగ్దీప్ సింగ్ జైలుకు చేరుకున్నారు. గుర్మీత్ కూడా తెలుపురంగు కుర్తా, పైజామా మ్యాచింగ్ తెల్లని బూట్లు ధరించి కోర్టు హాల్లోకి వచ్చారు. మధ్యాహ్నం 2.30కు విచారణ ప్రారంభమైనప్పటి నుంచీ ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. గుర్మీత్‌కు విధించాల్సిన శిక్షపై డిఫెన్స్, ప్రాసిక్యూషన్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. డేరా చీఫ్ ఆరోగ్యం, అతను చేసిన సామాజిక సేవ నేపథ్యంలో శిక్ష తగ్గించాలని గుర్మీత్ తరపు న్యాయవాదులు కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఒక్కో అత్యాచారం కేసుకు పదేళ్ల చొప్పున 20 ఏళ్లపాటు కఠినకారాగార శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గుర్మీత్ బోరున విలపించారని.. చేతులు జోడించి తనను క్షమించమని వేడుకున్నారని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. గుర్మీత్‌కు రోహ్తక్ జైలులో ఖైదీ నంబరు 1997ను కేటాయించారు. వైద్య పరీక్షల అనంతరం డేరా చీఫ్ ఖైదీ దుస్తులను ధరించాల్సి ఉంటుంది. కేసు ఏంటి? జూలై 2007లో డేరా చీఫ్‌పై అంబాలా కోర్టులో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. 1999, 2001లో ఇద్దరు సాధ్వి (మహిళా భక్తులు)లపై గుర్మీత్ అత్యాచారానికి పాల్పడ్డాడని అందులో పేర్కొంది. ఈ చార్జిషీటుపై విచారణ సందర్భంగా 2008లో డేరా చీఫ్‌పై నేర శిక్షాస్మృతి సెక్షన్లు 376 (అత్యాచారం), 506 (సాక్షులను భయపెట్టడం) కింద అభియోగాలు మోపింది. 2009, 2010లో ఇద్దరు ఫిర్యాదుదారులు కోర్టు ముందు తమ వాంగ్మూలం ఇచ్చారు. ఆగస్టు 17, 2017న ఈ కేసుల వాదనలు పూర్తి చేసిన సీబీఐ కోర్టు.. ఆగస్టు 25న గుర్మీత్‌ను దోషిగా ప్రకటించింది. కనిపిస్తే కాల్చివేత హెచ్చరికలు.. గుర్మీత్‌కు 20 ఏళ్లపాటు శిక్ష విధించటంతో అతని అభిమానులు మరోసారి విధ్వంసకాండకు పాల్పడతారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో హరియాణా, పంజాబ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఆందోళనకారులు కనబడితే కాల్చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. గుర్మీత్‌కు శిక్ష ఖరారు చేసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని సమీక్షించేం దుకు హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలు వదంతులు నమ్మొద్దని, డేరా అభిమానులు శాంతంగా ఉండాలని సీఎం కోరారు. అటు పంజాబ్‌లో పరిస్థితిని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సమీక్షించారు. డేరా అనుచరులు కోర్టు తీర్పును ఆమోదించాలని, హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని కోరారు. పరిస్థితులు చల్లారినట్లేనని భావించేంతవరకు సున్నిత ప్రాంతాల్లో కర్ఫ్యూ కొన సాగుతుందన్నారు. ఈ తీర్పును స్వాగతించే, వ్యతిరేకించే పరిస్థితుల్లేవని అమరీందర్ పేర్కొన్నారు. దేవుడి కాళ్లదగ్గర పడేశారు! డేరా చీఫ్‌కు శిక్ష ఖరారు సందర్భంగా న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనాదికాలంగా దేశంలో ఉన్న మతసంస్థలు, కొనసాగుతున్న పవిత్రమైన ఆధ్యాత్మిక సామాజిక సంస్కృతికి ఇలాంటి బాబాల ద్వారా మచ్చపడుతోందన్నారు. ‘విశ్వసించిన తమపైనే అత్యాచారానికి పాల్పడిన గుర్మీత్‌ను బాధితులే దేవుని కాళ్ల దగ్గర పడేశారు’ అని జగ్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. తనను నమ్మి వచ్చిన మహిళలపై గుర్మీత్ సింగ్ లైంగిక దోపిడీకి పాల్పడ్డారు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. అలాంటి వ్యక్తిపై కోర్టు ఎలాంటి సానుభూతి చూపించాల్సిన పనిలేదు. డేరా సచ్చా సౌదా వంటి మతసంస్థకు నాయకుడిగా చెప్పుకునే వ్యక్తి ఇలాం టి క్రూరత్వానికి ఒడిగట్టడం దారుణం.. తరతరాల భారత పవిత్రమైన ఆధ్యాత్మిక సామాజిక సంస్కృతికి మచ్చగా మిగిలిపోతుంది. పురాతనమైన దేశ సంస్కృతికి తీవ్రమైన నష్టం కలగజేస్తుంది’ అని న్యాయమూర్తి 9పేజీల తీర్పులో పేర్కొన్నారు. జైల్లో బాబాలు ఆశారాం బాపు జననం: 17 ఏప్రిల్ 1941 2013: జోధ్‌పూర్‌లో తనను ఆశారాం లైంగికంగా వేధించారని 16 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేయడంతో ఈయనను అరెస్టు చేశారు. సంత్ రాంపాల్ హరియాణాలోని ‘సత్లోక్’ ఆశ్రమం వ్యవస్థాపకులు నవంబర్ 2014: దేశద్రోహం, హత్య, హత్యకు కుట్ర పన్నడం, అక్రమంగా ఆయుధాలు కల్గిఉండటం తదితర కేసులపై అరెస్టు చేశారు. స్వామీ నిత్యానంద జననం: 1 జనవరి 1977 ఏప్రిల్ 2010: అత్యాచారం, నమ్మకద్రోహం, బెదిరింపులకు సంబంధించిన కేసుల్లో అరెస్టు చేశారు. -
ఈ ఉన్మాదం ఇంకెన్నాళ్లు?
విశ్వాసాలతో ముడిపడిన హింసకు సంబంధించి నెలరోజుల వ్యవధిలో మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడవలసి వచ్చింది. ప్రత్యేకించి హరియాణా, పంజాబ్, ఢిల్లీల్లో భయానక హింస జరగడానికి కారణమైన బాబా గుర్మీత్ సింగ్ ఉదంతంలో ఆయన మూడు రోజుల వ్యవధిలోనే రెండో దఫా మాట్లాడక తప్ప లేదు. విశ్వాసాల కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఏ ఒక్కరికీ లేదని ‘మన్ కీ బాత్’లో జాతినుద్దేశించి మాట్లాడుతూ హెచ్చరించారు. ఏ దేశంలోనైనా పౌరు లందరికీ సమానంగా వర్తించే చట్టాలే ఉంటాయి. ఆ చట్టాలను ఎంత ఉన్నతస్థాయి లోని వారైనా, సామాన్యులైనా గౌరవించాల్సిందే. అవి తమకు వర్తించబోవని చెప్పినా, ఆ చట్టాలున్న సంగతే తమకు తెలియదని చెప్పినా అది చెల్లదు. ఒక వ్యక్తి లేదా గుంపు చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉన్నదని సమాచారం అందినప్పుడు దాన్ని నిరోధించడం... అయినా చోటు చేసుకుంటే తగిన విధంగా స్పందించి చర్య లకు ఉపక్రమించడం శాంతిభద్రతల యంత్రాంగం చేయాల్సిన పని. ఇదంతా సవ్యంగా అమలవుతున్న చోట ఎవరూ వికృత పోకడలకు పోయే ప్రయత్నం చేయరు. సాధారణ పౌరుల్లో సైతం ప్రభుత్వాలపట్ల నమ్మకమూ... చట్టాలంటే గౌరవమూ ఏర్పడతాయి. కానీ డేరా సచ్చా సౌదా అధిపతి బాబా గుర్మీత్‌సింగ్ రెండు అత్యాచారం కేసుల్లో, ఒక హత్య కేసులో శిక్షార్హుడని చెప్పిన వెంటనే మూడు రాష్ట్రాలు భగ్గున మండాయి. 38మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా వందలాదిమంది గాయపడ్డారు. భారీయెత్తున ఆస్తులు విధ్వంస మయ్యాయి. హింసోన్మాదం ఏ స్థాయిలో ఉన్నదంటే నేరస్తుడికి ఎంత శిక్ష పడిందో ప్రకటించడానికి సోమవారం న్యాయస్థానమే జైలుకు తరలవలసి వచ్చింది. పంజాబ్, హరియాణాల్లో ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునివ్వడానికి మూడు రోజుల ముందునుంచే హరియాణా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంభాషించడం ప్రారంభించారు. ముందు జాగ్రత్త చర్యలను సూచించారు. కానీ జరి గిందేమిటి? వందలాదిమంది వీధుల్లోకొచ్చి వీరంగం వేస్తుంటే ప్రభుత్వాలు నిస్సహాయమయ్యాయి. పంజాబ్ ఎంతో కొంత నయం. హరియాణా అయితే పూర్తిగా చేష్టలు డిగిపోయింది. ఇలాంటి దుస్థితి అంతర్జాతీయంగా మన పరువును బజారుకీడుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్రమోదీ అంతగా స్పందిం చారు. హింసాకాండ చెలరేగిన శుక్రవారం రాత్రే ఆయన మూడు ట్వీట్లు చేశారు. హింసను తీవ్రంగా ఖండించడంతోపాటు పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తున్నదని ప్రజలకు హామీ ఇచ్చారు. రెండోసారి ఆదివారం ‘మన్ కీ బాత్’లో ఆయన పరోక్షంగా డేరా విధ్వంసాన్ని ప్రస్తావించారు. తప్పు చేసినవారిని వదిలేది లేదని హెచ్చరించారు. గత నెలలో ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో సైతం ఆవు పేరిట వివిధ ప్రాంతాల్లో సాగుతున్న దాడుల గురించి ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీ పుట్టిన గడ్డపై జన్మిం చామన్న స్పృహను కూడా ఈ హింసకు పాల్పడేవారు కోల్పోతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలు పకడ్బందీగా ఉన్నచోట, చట్టపాలన సవ్యంగా సాగుతున్నచోట ప్రైవేటు వ్యక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే సాహసం చేయరు. అది లేకపోబట్టే కొందరు చెలరేగుతున్నారు. సాక్షాత్తూ డిప్యూటీ అడ్వొకేట్ జనరల్ స్థాయిలో ఉన్న వ్యక్తి శిక్షపడిన గుర్మీత్‌తో కలిసి న్యాయస్థానానికి రావడం మాత్రమే కాదు... ఆయనగారి సూట్‌కేసును కూడా మోశారంటే కారణమెవరు? గుర్మీత్‌ను అదుపులోకి తీసుకోవడానికెళ్లిన పోలీసులను ఆయనకు భద్రత కల్పిస్తున్న కమాండోలు ప్రతిఘటించడం దేన్ని సూచిస్తోంది? స్వయంగా కేంద్ర హోంమంత్రి చాలా ముందుగా సీఎంలతో మాట్లాడినా ఫలితం లేకపోవడం ఎందువల్ల? అన్నిటికీ ఒకటే జవాబు... పాలకులు సక్రమంగా లేకపోవడం వల్ల! పదిహేనేళ్ల క్రితం అప్పటి ప్రధాని వాజపేయికి ఇద్దరు మహిళలు రాసిన లేఖ రాస్తే, దానిపై విచారణ జరిపించాలని ఆయన సీబీఐకి ఆదేశాలిస్తే నేరగాడికి శిక్ష పడటానికి ఇన్నేళ్లుపట్టింది. ఈలోగా ఆ ఇద్దరు మహిళలకూ సాయపడ్డాడన్న అనుమానంతో డేరా సంస్థల వ్యవహారాలు చూసే మేనేజర్ ఒకరిని ‘గుర్తు తెలియని వ్యక్తులు’ హతమార్చారు. ఆ ఉదంతంపై పరిశోధన సాగించే పాత్రికేయుడు సైతం అదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు. వీటితోపాటు అనేక ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో గుర్మీత్ నిందితుడు. కానీ పాలకులుగా ఉన్నవారు మాత్రం ఈ పదిహేనేళ్లనుంచీ ఆయన ఆశ్రమం ముందు సాగిలపడ్డారు. నోరారా కీర్తించారు. ఆయనతో వేదికలు పంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నరరూప రాక్షసుడు నయీముద్దీన్‌తో అధికారంలో ఉన్నవారు అంటకాగినట్టే ఇదంతా సాగింది. స్వయంగా వాజపేయి స్థాయి నాయకుడే తనకొచ్చిన ఫిర్యాదులు చూసి ఆందో ళనపడి విచారణకు ఆదేశించినా ఆ పార్టీకి చెందిన నేతలకు జ్ఞానోదయం కాలేదు. అప్పట్లో విపక్షంగానూ, ఆ తర్వాత అధికార పక్షంగానూ ఉన్న కాంగ్రెస్ నేతలు సైతం అలాగే ప్రవర్తించారు. కనీసం శిక్షపడ్డాకైనా గుర్మీత్ ప్రవర్తనను తప్పు బట్టలేకపోయారు సరిగదా...బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఆయన ‘గొప్ప ఆత్మ’ అంటూ పొగిడారు. గోరక్షణ పేరుతో ఏర్పడి, హింసకు పాల్పడే బృందాలకు సైతం ఇలాంటి ప్రశంసలే లభిస్తున్నాయి. అందువల్లే ప్రధాని పదేపదే చెప్పినా ఫలితం ఉండటం లేదు. హింసకు పాల్పడేవారిని వెనువెంటనే అరెస్టు చేయలేక పోవడం, చేసినా కఠినమైన సెక్షన్లకింద కేసులు పెట్టలేకపోవడం చాలాచోట్ల కనబడుతోంది. కనుక ప్రకటనలతో సరిపెట్టకుండా సీఎంల, హోంమంత్రుల సమావేశం ఏర్పాటుచేసి చట్టబద్ధ పాలనపై శ్రద్ధవహించాలన్న సంగతి ప్రధాని గుర్తుచేయాలి. పార్టీలకతీతంగా వ్యవహరించమని హితవుచెప్పాలి. సంతృప్తిక రంగా లేనివారి లోపాలు ఎత్తి చూపాలి. లేనట్టయితే ఇలాంటి ఉదంతాలకు అంతూ పొంతూ ఉండదు. -
నేరము - శిక్ష
-
గుర్మీత్‌కు జైలు: అనూహ్య మలుపు
-
గుర్మీత్‌కు జైలు: అనూహ్య మలుపు
రోహతక్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ కేసు తీర్పులో మరో ట్విస్ట్. లైంగిక వేధింపుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధించినట్టు మీడియా ప్రచారం చేసింది. అయితే ఆయనకు 20 ఏళ్లు జైలు శిక్ష విధించినట్టు తేలింది. రెండు కేసుల్లో దోషిగా తేలిన ఆయనకు ఒక్కో కేసులో కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిందని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాళ్ వెల్లడించారు. ఈ రెండు శిక్షలు దాని తర్వాత ఒకటి అమలు చేస్తారని వెల్లడించారు. ఈ విషయాన్ని గుర్మీత్ సింగ్ తరపు న్యాయవాదులు కూడా ధ్రువీకరించారు. అయితే రెండు శిక్షలు ఒకేసారి అమలవుతాయని గుర్మీత్ సింగ్ తరపు లాయర్ ఎస్కే నార్వానా అన్నారు. శిక్షతో పాటు రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ. 30 లక్షల న్యాయస్థానం జరిమానా విధించిందని తెలిపారు. రూ. 14 లక్షల చొప్పున మొత్తాన్ని ఇద్దరు బాధితురాళ్లకు ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్టు చెప్పారు. తీర్పు పాఠం పూర్తిగా చదివిన తర్వాత ఉన్నత న్యాయస్థానాల్లో కచ్చితంగా అప్పీలు చేస్తామని ప్రకటించారు. 15 ఏళ్ల క్రితం తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ దోషిగా ఇదివరకే నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఆ మేరకు సోమవారం మధ్యాహ్నం కఠిన శిక్షను ఖరారు చేసింది. తీర్పు సందర్భంగా గుర్మీత్ చేతులు కట్టుకుని తనను క్షమించి వదిలేయాలని న్యాయమూర్తిని వేడుకున్నారు. ప్రాథమిక కథనాలు: అత్యాచారం కేసులో గుర్మీత్‌కు కఠిన శిక్ష గుర్మీత్ సింగ్ కేసు: జడ్జి ఏమన్నారంటే? తీర్పుపై బాబా రాందేవ్ స్పందన ఇలా... 'ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు' -
'ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు'
చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ సమాజానికి శత్రువని అన్షుల్ ఛత్రపతి వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపులు కేసులో గుర్మీత్‌కు ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించడాన్ని ఆయన స్వాగతించారు. గుర్మీత్ చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి తాము వెల్లడిస్తే ప్రజలు విశ్వసించలేదని వాపోయారు. కోర్టు తీర్పు తమకు సంతోషం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఎంతోమంది జీవితాలను గుర్మీత్ నాశనం చేశాడని, అతడికి ప్రభుత్వాలు సహకరించాయని ఆరోపించారు. తప్పు చేసినవారెవరూ తప్పించుకోలేరన్న సందేశాన్ని కోర్టు తీర్పు ఇచ్చిందని, సామాన్యుడికి న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగేలా తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. గుర్మీత్ సింగ్ రేప్ కేసును వెలుగులోకి తెచ్చిన సిర్సా జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి తనయుడే అన్షుల్. గుర్మీత్ చేసిన దారుణాలను వెలుగులోకి తెచ్చినందుకు 2002, అక్టోబర్ 24న రామ్ చందర్‌ను ఆయన ఇంటివద్ద అతి సమీపం నుంచి కాల్చిచంపారు. లైంగిక్ వేధింపుల కేసులో గుర్మీత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని చేపట్టాలని హైకోర్టు 2003, నవంబర్ 10న సీబీఐని ఆదేశించింది. కాగా, తన తండ్రి హత్యపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని 2005, జనవరిలో అన్షుల్ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ వేశారు. గుర్మీత్‌కు శిక్ష విధించిన న్యాయమూర్తి జస్టిస్ జగదీప్ సింగ్.. తన తండ్రి హత్య కేసులో సెప్టెంబర్ 16న వాదనలు విననున్నారని అన్షుల్ తెలిపారు. -
బాబా వారసులు హానీప్రీత్ ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో డేరా సచ్చా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఆయన డేరాకు ఎవరు నాయకత్వం వహిస్తారన్న ప్రశ్న మరోసారి తెర ముందుకు వచ్చింది. బాబాను కోర్టు దోషిగా నిర్ధారించిన రోజున ఆయన వెంట ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన పెంపుడు కూతురు హానీ ప్రీత్ ఇన్సాన్ ప్రయాణించడంతో ఆమెనే ఆయనకు వారసురాలనే ప్రచారం జరిగింది. గుర్మీత్ సింగ్ సొంత కూతుళ్లు అమన్‌ప్రీత్, చరణ్‌ప్రీత్, కుమారుడు జస్మీత్ ఇన్సాన్ కన్నా హానీ ప్రీత్‌కే డేరాలో ఎక్కువ పలుకుబడి ఉండడంతో ఆమెనే డేరా నాయకులవుతారని ఇప్పటికీ డేరా అనుచరులు భావిస్తున్నారు. ట్విట్టర్లో పది లక్షల మంది, ఫేస్బుక్లో ఐదు లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 1,88,000 మంది ఫాలోవర్లను కలిగిన హానీ ప్రీత్ సొంతంగా ఓ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. పెంపుడు తండ్రి సింగ్‌ను దైవంగాను, రాజులకు రాజుగాను అస్తమానం అభివర్ణించే హానీ ప్రీత్ తన వెబ్సైట్లో ఎక్కువగా తండ్రి బోధనల గురించే ప్రచారం చేస్తారు. ఆయన ట్వీట్లను ఎక్కువగా ట్విట్టర్లో రీట్వీట్ చేస్తుంటారు. 'ఎంఎస్‌జీ ది వారియర్:లైన్ హార్ట్' సిరీస్ సినిమాలతోపాటు సింగ్ తీసిన అన్ని సినిమాల్లో నటించిన హానీ ప్రీత్ తాను గొప్ప దర్శకులరాలినని, నటినని, ఫిల్మ్ ఎడిటర్‌నని, రచయితనని, అన్నింటికన్నా సింగ్‌కు గొప్ప కూతురునని చెప్పుకుంటారు. ఆమె ఎంఎస్‌జీ సిరీస్ సినిమాల్లో తన తండ్రి పేరుతోపాటు 30 అంశాల్లో తన పేరును క్రెడిట్ లైన్‌గా వేసుకున్నారు. గుర్నీత్ సింగ్‌కు హానీ ప్రీత్ ఎలా పరిచయం? హానీ ప్రీత్ అసలు పేరు ప్రియాంక తనేజా. 1999లో సచ్చా డేరా ఫాలోవర్ విశ్వాస్ గుప్తా అనే యువకుడిని పెళ్లి చేసుకున్నాక తన పేరును హానీ ప్రీత్‌గా మార్చుకున్నారు. అదనపు కట్నం కోసం అత్తింటి వారు తనను వేధిస్తున్నారని ఆమె గుర్నీత్ను కలుసుకొని ఫిర్యాదు చేయడంతో ఆయన ఆమెను తన పెంపుడు కూతురుగా దత్తత తీసుకున్నారు. ఆమె భర్త విశ్వాస్ గుప్తాకు ఆశ్రమంలో మంచి స్థానం కల్పించినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే హానీ ప్రీత్ భర్తతోని కాపురానికి వెళ్లకుండా తండ్రితోనే ఉండిపోవడంతో తన భార్యను తనకు అప్పగించాల్సిందిగా కోరుతూ 2011లో విశ్వాస్ గుప్తా కోర్టుకు ఎక్కారు. అప్పుడు హానీ ప్రీత్ విడాకులు తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. నిజా నిజాలు ఎవరికీ పెద్దగా తెలియవు. ఇక ముందు బయ టకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
ఇద్దరు సీఎంల అత్యవసర భేటీ
చండీగఢ్: లైంగిక వేధింపుల కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించడంతో హరియణా, పంజాబ్ ముఖ్యమంత్రులు అప్రమత్తమయ్యారు. తీర్పు వెలువడిన వెంటనే చండీగఢ్‌లోని తన నివాసంలో హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఉన్నతాధికారులు, బీజేపీ నాయకులు, మంత్రులతో చర్చించారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆందోళనలకు అవకాశం ఇవ్వరాదని ఖట్టర్ ఆదేశించారు. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని, అవాంఛనీయ సంఘటనలను అదుపు చేసేందుకు భద్రతాదళాలు సిద్ధంగా ఉన్నాయని అమరీందర్ సింగ్ తెలిపారు. గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు కోర్టు విధించిన శిక్షను ప్రజలు ఆమోదించాలని, శాంతిని కాపాడాలని ఆయన కోరారు. మరోవైపు రోహతక్‌లోని సునారియా జైలు పరిసరాల్లో భద్రతను కట్టు దిట్టం చేశారు. కాగా, హరియాణాలోని సిర్సాలో డేరా సచ్ఛా సౌదా మద్దతుదారులు రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులు మరిన్ని విధ్వంసాలకు పాల్పడకుండా చూసేందుకు సైనిక దళాలు సిర్సాలో కవాతు నిర్వహించాయి. -
గుర్మీత్ సింగ్ కేసు: జడ్జి ఏమన్నారంటే?
-
శిక్షను సవాల్ చేయనున్న గుర్మీత్ సింగ్
రోహ్తక్: అత్యాచారం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన 20 సంవత్సరాల జైలు శిక్ష తీర్పును హైకోర్టులో సవాలు చేయనున్నట్లు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తరఫు న్యాయవాదులు సూచన ప్రాయంగా తెలిపారు. కోర్టు తీర్పు పూర్తి కాపీ చదివిన తరువాత తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని రోహ్తక్ జైలు వెలుపల మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆశ్రమంలో సాధ్వీలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిపిన గుర్మీత్‌ను కఠినంగా శిక్షించాలన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన జడ్జి జగ్దీప్ సింగ్.. దోషికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2002నాటి అత్యాచారం కేసును సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేయలేదని, సరైన సాక్ష్యాధారాలు కూడా సమర్పించలేకపోయిందని గుర్మీత్ తరఫు న్యాయవాదులు ఆరోపించారు. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని పేర్కొన్నారు. గుర్మీత్ గొప్ప సంఘ సవకుడు: సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేయడానికి ముందు వాదనలు వినిపించిన గుర్మీత్ సింగ్ న్యాయవాదులు.. బాబాను గొప్ప సంఘ సేవకుడిగా పేర్కొన్నారు. పేదల కోసం ఆయన ఎన్నో సేవలు చేశారని, వాటిని దృష్టిలో ఉంచుకుని కఠినశిక్షలేవీ వేయవద్దని న్యాయమూర్తిని కోరారు. సీబీఐ మాత్రం గుర్మీత్‌ను కఠినంగా శిక్షించాలని కోరింది. అన్నీ విన్న జడ్జి చివరికి గుర్మీత్‌కు 10 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించారు. (చదవండి: అత్యాచారం కేసులో గుర్మీత్‌కు కఠిన శిక్ష) -
గుర్మీత్ సింగ్ కేసు: జడ్జి ఏమన్నారంటే?
రోహతక్: లైంగిక వేధింపుల కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష జైలు శిక్ష విధించింది. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జగదీప్ సింగ్ పలు అంశాలు ప్రస్తావించారు. ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు. తనను నమ్మి వచ్చిన అమాయకులపై అత్యాచారానికి పాల్పడడం దారుణమని వ్యాఖ్యానించారు. గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు జీవితఖైదు విధించాలని బాధితురాలు కోరినట్టు వెల్లడించారు. తనను క్షమించాలన్న గుర్మీత్ విజ్ఞప్తిని జడ్జి తోసిపుచ్చారు. గుర్మీత్‌ను సాధారణ ఖైదీలాగే చూడాలని ఆదేశించారు. అతడిని వీఐపీలాగా చూడటంతో పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపిస్ట్‌కు అదనపు సౌకర్యాలు కల్పిస్తారా అని చివాట్లు పెట్టారు. కాగా, కోర్టు తీర్పుపై బాధితురాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గుర్మీత్‌కు పదేళ్ల జైలు శిక్ష సరిపోదని అన్నారు. గుర్మీత్ సింగ్ చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని నిరపరాధిగా విడిచిపెట్టాలని లేదా శిక్షను తగ్గించాలని ఆయన తరపు న్యాయవాది చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించగానే గుర్మీత్ సింగ్ కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. కోర్టు హాలు నుంచి బయటకు రావడానికి నిరాకరించడంతో ఆయనను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి జైలుకు తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఖైదీ దుస్తులు ఇవ్వనున్నారు. తర్వాత జైల్లో సెల్ కేటాయిస్తారు. -
అత్యాచారం కేసులో గుర్మీత్‌కు కఠిన శిక్ష
-
అత్యాచారం కేసులో గుర్మీత్‌కు కఠిన శిక్ష
- 20 ఏళ్ల కారాగారశిక్ష విధించిన సీబీఐ కోర్టు రోహ్తక్: అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. రోహ్తక్ జైలులో చేపట్టిన ప్రత్యేక విచారణలో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జగ్దీప్ సింగ్.. తుది తీర్పును వెలువరించారు. ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ దోషిగా ఇదివరకే నిర్ధారించిన కోర్టు.. ఆ మేరకు సోమవారం కఠిన శిక్షను ఖరారు చేసింది. బోరున విలపించిన గుర్మీత్: తనకు 20 ఏళ్ల శిక్ష పడగానే డేరా చీఫ్ గుర్మీత్ సింగ్ ఒక్కసారిగా బోరున విలపించారు. తాను ఏ తప్పూ చేయలేదని, నిరపరాదినని ఏడుస్తూ జడ్జికి మొరపెట్టుకున్నారు. రంగురంగుల దుస్తులు మాయం: శిక్ష ఖరారైన తర్వాత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఆయనకు సెల్‌ను కేటాయించి, శిక్షఖైదీలకు ఇచ్చే తెల్లటి దుస్తులను అందించారు. ఇన్నాళ్లూ కళ్లుమిరుమిట్లు గొలిపేలా రంగురంగుల దుస్తులేసుకున్న బాబా మరో 10 ఏళ్లపాటు వాటికి దూరంగా ఉండాల్సిందే. శిక్షకు ముందు 10 నిమిషాలు: గతవారం సీబీఐ కోర్టు గుర్మీత్‌ను దోషిగా నిర్ధారించిన అనంతరం హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో శిక్ష ఖరారుకు సంబంధించిన విచారణ రోహ్తక్ జైలులోనే జరిగింది. జడ్జి జగ్దీప్ సింగ్ ఆదేశాల మేరకు అధికారులు జైలులోనే ఏర్పాట్లుచేశారు. చివరిసారిగా ఇరుపక్షాలూ చెరో 10 నిమిషాలు వాదించేందుకు జడ్జి అవకాశం కల్పించారు. దేశానికి గుర్మీత్ ఎంతో సేవచేశారు: డేరా బాబా గొప్ప సామాజిక సేవకుడని, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించైనా నిరపరాధిగా విడిచిపెట్టాలని లేదా శిక్షను తగ్గించాలని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. సీబీఐ వాదన: అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌కు 10 ఏళ్లు తక్కువ కాకుండా శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది జడ్జికి విన్నవించారు. -
గుర్మీత్ తీర్పు.. అల్లర్లు... అంతా దైవలీల!
-
గుర్మీత్ తీర్పు.. అల్లర్లు... అంతా దైవలీల!
ముంబై: డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఎపిసోడ్‌పై మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమా స్పందించారు. గుర్మీత్ దోషిగా తేలటం, హరియాణాలో హింస చెలరేగటం అంతా దైవ నిర్ణయమే అని ఆమె పేర్కొన్నారు. వరుసగా బాబాలు, స్వామీజీలు జైలుకు వెళ్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ జాతీయ మీడియా సంస్థ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన(గుర్మీత్) వ్యవహారం గురించి నాకేం తెలీదు. నేనే ఈశ్వర్య ధ్యానంలో మునిగిపోయి ఉన్నా. జరిగే పరిణామాలన్నీ ఆ భగవంతుడి లీలలే. అమాయకులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. అది వారి కర్మ’ అంటూ వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న విమర్శల గురించి రాధే మా స్పందిస్తూ గాజుతో ఇళ్లు కట్టుకున్న వాళ్లు ఎదుటి వాళ్ల మీద రాళ్లు వేయాలని ప్రయత్నించకూడదని వ్యాఖ్యానించారు. ‘నేనొక రొమాంటిక్ దేవిని. నా ఇంటిని.. నా బిడ్డలను(భక్తులను) కాపాడుకోవటమే నా ముందున్న విధి.. విమర్శలను పట్టించుకోనూ’ అంటూ మరో వ్యాఖ్య కూడా రాధే మా చేశారు. ఇక దేశ ప్రధాని మోదీ ఓ సాధువని, ఆయన నిర్ణయాలన్నీ దేశానికి మేలునే చేస్తాయని ఆమె చెప్పారు. మరోవైపు తనపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు రిషికపూర్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా మంచి వారని, ఎలాంటి పాపం చేయలేదని, భగవంతుడే ఆయనకు సమాధానం చెప్తాడని రాధే మా అన్నారు. తనకు తాను దైవంగా చెప్పుకునే రాధే మా 2015 లో ఓ మహిళను కట్నం కోసం వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. నటి డాలీ బింద్రా కూడా ఈ మాతాజీ పై బెదిరింపులు, లైంగిక వేధింపుల కేసు పెట్టారు. చిట్టి పొట్టి బట్టలు వేసుకుని భక్తి ముసుగులో అశ్లీలతను ప్రదర్శిస్తోందంటూ ఫాల్గుని బ్రహ్మభట్ట్ అనే న్యాయవాది ఆమెపై ఫిర్యాదు కూడా చేశారు. -
డేరాను డేర్‌తో నడిపించేది ఈమే..!
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు ఓ కూతురు ఉంది. ఆమె పేరు హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ (30). ‘తండ్రి ముద్దుల కూతురు, పరోపకారి, దర్శకురాలు, సంపాదకురాలు, నటి’ ఇవి సోషల్ మీడియాపై హనీ ప్రీత్ సింగ్ పరిచయ వాక్యాలు. డేరా చీఫ్ గుర్మీత్‌కు ఈమె దత్త పుత్రిక. ఈమె ట్విటర్ అకౌంట్‌కు 10 లక్షల మంది, ఫేస్‌బుక్‌కు ఐదు లక్షల మంది ఫాలోవర్లున్నారు. తండ్రితో ‘ఎంఎస్‌జీ 2 – ద మెసెంజర్’, ఎంఎస్‌జీ – ద వారియర్ లయన్ హార్ట్’ చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించారు. అంతేకాదు గుర్మీత్ నటించిన చిత్రాలకు ఈమే దర్శకురాలు, ఎడిటర్ కావటం విశేషం. ఈమెకు సొంతంగా "www. HoneypreetInsan.me' అనే వెబ్సైట్ కూడా ఉంది. ‘అద్భుతమైన తండ్రికి గొప్ప కూతురు’ అని ఈ సైట్లో పెద్దగా రాసి ఉంటుంది. ‘50 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘గురుపా’కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి చీకటి క్షణాన్ని తేజోవంతం చేసినందుకు ధన్యవాదాలు’ అని ఆగస్టు 15న గుర్మీత్ పుట్టినరోజు సందర్భంగా హనీప్రీత్ ట్వీట్ చేశారు. ఇప్పుడు తండ్రి గైర్హాజరీలో డేరా సచ్చా సౌదా మొత్తాన్ని నడిపించాల్సిన బాధ్యత హనీప్రీత్‌దే. గుర్మీత్ సీబీఐ కోర్టుకు వచ్చినపుడు తండ్రితోపాటుగా ఈమె కూడా వచ్చింది. గుర్మీత్ సింగ్ భార్య హర్జీత్ కౌర్. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. -
కనిపిస్తే కాల్చివేత.. రూమర్లు నమ్మొద్దు
రోహ్టక్:రేప్ కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు నేడు శిక్షలు ఖరారు కానున్న నేపథ్యంలో పంచకుల, సిస్రా తరహా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హర్యానా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు రోహ్టక్ జిల్లా కలెక్టర్ అతుల్ కుమార్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఉన్నత స్థాయి భేటీ అనంతరం ఈ నిర్ణయం వెల్లడించారు. ‘రోహ్టక్లో ఎవరైనా సరే శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే ముందు హెచ్చరిక జారీ చేస్తాం. అయినా కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఎవరికైనా హని తలపెట్టినా, ఆత్మహత్యాయత్నం లాంటివి చేసినా కాల్చివేయటం జరుగుతుంది. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాం’ అని అతుల్ తెలిపారు. హైకోర్టు సూచనల మేరకే తాము నడుచుకుంటామని ఆయన అన్నారు. ఇక గుర్మీత్ ఉన్న సునారియ జైలు చుట్టుపక్కల మొత్తం 23 పారామిలటరీ భద్రత దళాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అతుల్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు కూడా బయటికి రావొద్దని, మీడియాకు కూడా పలు సూచనలు చేశామని ఆయన చెప్పారు. హెలికాఫ్టర్ ద్వారా న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ జైలుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నాం 2 గంటల 30 నిమిషాల సమయంలో తీర్పు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఆ వార్త నిజం కాదు: ఢిల్లీ పోలీసు శాఖ న్యూఢిల్లీ: రామ్ రహీమ్ సింగ్ శిక్ష ఖరారు నేపథ్యంలో ఢిల్లీలో అలర్ట్ ప్రకటించిన విషయాన్ని ఢిల్లీ పోలీస్ శాఖ ఖండించింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారని, ట్రాఫిక్‌ను దారి మళ్లీంచారని వాట్సాప్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ పీఆర్వో మధుర్ వర్మ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలంతా ఉత్తవేనని మధుర్ తేల్చేశారు. అయితే అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం మాత్రం చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక మీడియాపై దాడుల నేపథ్యంలో వారికి పోలీసులతో రక్షణ కల్పించినట్లు మధుర్ తెలిపారు. -
కోతుల్లాగ ప్రవర్తిస్తే ఇలాగే అవుతుంది: నటి
ముంబై: డేరా సచ్ఛా సౌదా చీఫ్, బాబా గుర్మీత్ రాంరహీం సింగ్ దోషీగా తేలడంపై బాలీవుడ్ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా భిన్న శైలిని అనుకరిస్తున్నారు. అసలు మనం కోతుల్లాగా మెదడు వాడితే ఇలాగే ఉంటుందని, బాబాలు ఇలాగే మోసాలకు పాల్పడతారని నటి అభిప్రాయపడ్డారు. ఎంతో తెలివైన వాళ్లు సైతం తమను రక్షిస్తాడంటూ నమ్మి గుర్మిత్ వద్దకు వెళ్లి ఉంటారని, ఇలాంటి పనులు తనను కొన్నిసార్లు ఆందోళనకు గురిచేస్తుంటాయని ఆమె చెప్పారు. పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్ ను ఇటీవల దోషీగా ప్రకటించిన అనంతరం డేరాలు చెలరేగి చేసిన దాడులలో 36 మంది ప్రాణాలు కోల్పోవడం తనను కలచి వేసిందన్నారు ట్వింకిల్. జనాలు నమ్ముతున్న కొద్దీ ఇలాంటి బాబాలు మంచి కంటే చెడును వ్యాప్తి చేస్తారన్నారు. ఇంకా చెప్పాలంటే.. సూర్యుడి వైపు పొద్దుతిరుగుడు పువ్వు ఎలాగైతే మళ్లి ఉంటుందో, అదే తీరుగా జనాలు దొంగ ప్రజల చుట్టూ తిరుగుతుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా మనలో మార్పు వస్తే చెడు పనులు చేసే వారిని, దొంగ స్వామీజీలను కొంతకాలానికే గుర్తుపట్టే అవకాశం ఉందని పిలుపునిచ్చారు. -
దేవుడా... దెయ్యమా?!
త్రికాలమ్ గోప్యతను ప్రాథమిక హక్కుగానూ, రాజ్యాంగంలోని 21వ అధికరణలో అంతర్భాగంగానూ నిర్ధారిస్తూ తొమ్మిదిమంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా అద్భుతమైన తీర్పు ఇచ్చే క్రమంలో వర్త మాన రాజకీయ, సామాజిక వ్యవస్థకు వర్తించే ఒకానొక ముఖ్యమైన అంశం మెరుపులా మెరిసింది. న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ అమెరికా చరిత్ర నుంచి ఒక ఉదంతం ఉటంకించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యవస్థాపకులలో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్‌ను ఒక మహిళ వీధిలో పట్టుకొని ‘మాకు ఎటువంటి ప్రభుత్వం ఇచ్చావయ్యా?’ అని ప్రశ్నిం చిందట. దానికి ఆయన ‘ఒక గణతంత్ర ప్రభుత్వాన్ని ఇచ్చాం. మీరు నిలబెట్టు కుంటే అది ఉంటుంది (A Republic, if you can keep it),’ అని సమాధానం చెప్పారట. అమెరికా పౌరులు అనేక త్యాగాలు చేసి వారి రిపబ్లిక్‌ను కాపాడు కున్నారు. అరవై అయిదు సంవత్సరాల క్రితం రాజ్యాంగ నిర్మాతలు ఇండియాకు రిపబ్లిక్ వ్యవస్థను ప్రసాదించారు. రిపబ్లిక్‌ను మనం రక్షించుకోగలమా? అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన చారిత్రక తీర్పును ఆలకించినప్పుడు భారత రిపబ్లిక్కు «ఢోకా లేదనిపిస్తుంది. మర్నాడు పంచకూలాలో సీబీఐ కోర్టు న్యాయ మూర్తి జగదీప్‌సింగ్ సాహసోపేతంగా తీర్పు ఇచ్చిన తర్వాత హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలలో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తినష్టం గమనించినప్పుడు గణతంత్ర భారతం మనుగడపైన భయ సందేహాలు కలుగుతాయి. అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో, వివేకంతో రూపొందించి ప్రసాదించిన రాజ్యాంగ విలు వలను పరిరక్షించుకోవడం జాతి ప్రాథమిక కర్తవ్యం. అందరికీ సమన్యాయం జరగాలంటే, అర్భకులకూ, అధికారం లేనివారికీ అందరితోపాటు సమాన హక్కులు ఉండాలంటే రిపబ్లిక్ వ్యవస్థను పరిరక్షించుకోవడం అత్యవసరం. అరాచకం, అల్లకల్లోలం ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలోనూ, అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనూ పరిమితమైన ప్రభుత్వం, అపరిమితమైన పరిపాలన ( limited government, unlimited governance) సమకూర్చుతా మని హామీ ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపైన ఇంతవరకూ అవినీతి ఆరోపణలు రాకపోవడాన్ని అభినందించవచ్చు. ప్రభుత్వ యంత్రాంగం పని తీరు మెరుగైందని కానీ రాష్ట్రాలలో పరిపాలన సజావుగా సాగుతున్నదని కానీ సాధికారికంగా చెప్పడం కష్టం. ముఖ్యంగా హరియాణాలో బీజేపీ ప్రభుత్వ నిర్వాకం చూసిన తర్వాత అక్కడ పరిపాలన ఎంత లోపభూయిష్టంగా ఉన్నదో లోకానికి తెలిసిన అనంతరం రాష్ట్రాలలో పరిపాలన మెరుగైనదని బీజేపీ నేతలు సైతం ధైర్యంగా చెప్పజాలరు. డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రాంరహీమ్ సింగ్ మహిళపైన అత్యాచారం చేసినట్టు సీబీఐ కోర్టు ధ్రువీకరించిన అనంతరం జరిగిన హింసాకాండలో ఒక్క సిర్సాలోని పంచకూలాలోనే 28 మంది (ఎక్కువ మంది డేరా విధేయులే) మరణించడం హరియాణా ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనం. మొత్తం మీద 32 మంది మరణించారు. 250 మందికిపైగా గాయపడి నారు. 1984లో ఇందిరాగాంధి హత్యానంతరం ఉత్తర భారతంలో కనబడిన భయానక వాతావరణమే శుక్రవారం సాయంత్రం అగుపించింది. న్యాయ వ్యవస్థ, మీడియా, ఇంటెలిజెన్స్ వర్గాలు చేసిన స్పష్టమైన హెచ్చరికలను హరి యాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పెడచెవిన పెట్టారు. ఖట్టర్ అసమర్థత డేరా ఆశ్రమంలో 1.5 లక్షల మంది చేరడాన్ని అనుమతించారు. 144వ సెక్షన్ కింద అయిదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదంటూ నిషేధాజ్ఞలు పంచకూలాలో కూడా విధించినప్పటికీ ఆశ్రమానికి ఈ ఉత్తర్వులు వర్తించ వంటూ రాష్ట్ర విద్యామంత్రి రాంవిలాస్‌శర్మ ప్రకటించారు. శర్మ రాంరహీమ్ భక్తుడు. ఖట్టర్, ఆయన సహచరులు కూడా అంతే. ఎన్నికలు పూర్తయిన తర్వాత మొత్తం 47 మంది బీజేపీ శాసనసభ్యులలో 19 మంది డేరా బాబా దగ్గరకు వెళ్ళి కృతజ్ఞత ప్రకటించుకొని వచ్చారు. 2002 సెప్టెంబర్ 25న నాటి ప్రధాని వాజ పేయికి ఒక అజ్ఞాత మహిళ రాసిన ఉత్తరంలో గుర్మీత్ రాజకీయ నేతలకు ఎంత సన్నిహితంగా ఉన్నాడో, అతనికి అధికారమదం ఎంతగా తలకెక్కిందో వివరించింది. తనపైన అత్యాచారం చేశాడనీ, ఆ విషయం బయటికి పొక్కితే చంపి వేయగలననీ, తాను ఏమి చేసినా చట్టానికి చిక్కబోననీ, ముఖ్యమంత్రులూ, మంత్రులూ తనకు పరమ విధేయులనీ గుర్మీత్ చెప్పుకున్నట్టు ఆ మహిళ వివరించింది. తన అనుచరులలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్టు సీబీఐ కోర్టు తేల్చింది. హరియాణా కోర్టు సూమోటోగా ఈ కేసును స్వీకరించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 2007లో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. సిర్సా ఆశ్రమంలో 15 మంది సాధ్వీలను విచారిస్తే ఇద్దరు తమపైన బాబా అత్యా చారం చేశాడని ఆరోపించారు. అత్యాచారం వివరాలను బయటపెట్టిన జర్న లిస్టును హత్య చే యించాడనే అభియోగం కూడా బాబాపైన ఉన్నది. ఆరు ఉత్త రాది రాష్ట్రాలలో విస్తృతంగానూ, ఇతర రాష్ట్రాలలో పలచగానూ బాబా భక్తు లున్నారు. ప్రపంచం మొత్తం మీద ఆరుకోట్ల మంది భక్తులు కానీ అభిమానులు కానీ బాబాకు ఉన్నట్టు అంచనా. అందుకే మొదట కాంగ్రెస్, తర్వాత బీజేపీ, అకాలీదళ్ బాబా అనుగ్రహం కోసం అంగలార్చాయి. గాలి ఉన్న ఎన్నికలలో బాబా ఫలితాలను ప్రభావితం చేయలేడు. ఆయన మద్దతు ఇచ్చే పార్టీకి అను కూలంగా గాలి ఉంటే దాని జోరు పెంచగలడు. ఉదాహరణకు పంజాబ్‌లో 2007లోనూ, 2012లోనూ డేరాబాబా కాంగ్రెస్‌కి మద్దతు ప్రకటించారు. 2007లో కాంగ్రెస్ గెలిచింది కానీ 2012లో ఓడిపోయింది. 2014లో దేశమం తటా బీజేపీకి అండగా నిలిచాడు. కానీ పంజాబ్‌లో కాంగ్రెస్ విజయం సాధిం చింది. హరియాణాలో బీజేపీ గెలుపొందింది. బాబాను ప్రసన్నం చేసుకుంటే ఖాయంగా గెలుస్తామన్న నమ్మకం లేకపోయినా పది ఓట్లకోసం కక్కుర్తిపడి విలు వలతో రాజీపడే రాజకీయ నాయకులు బాబా సేవ చేస్తూనే ఉన్నారు. ఇటీవల బాబాపై నిర్మించిన చిత్రం (ఎంఎస్‌జీ–2)కు హరియాణా ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించింది. వందల కోట్ల విలువ చేసే ఆస్తులున్న డేరా సచ్చా సౌదాను ఒక ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)గా రిజిస్టర్ చేశారు. 2016లో జాట్ల ఆందోళన సమయంలో ఘోరంగా విఫలమైన తర్వాత అయినా ఖట్టర్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసింది. హైకోర్టు అభిశంసన కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించినా పంజాబ్–హరియాణా హైకోర్టు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా మొట్టికాయలు వేసింది. ‘బాబాకు రాజకీయంగా లొంగి పోయింది’ అంటూ అభిశంసించింది. కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ‘ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం’ అంటే ‘హరియాణా భారతదేశంలో లేదా? ప్రధాని కేవలం బీజేపీ ప్రధాని కాదు. దేశానికి ప్రధాని’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. సిక్కు మతం ఆవిర్భవించింది ఐదువందల సంవత్సరాల క్రితమే. ఇది ఇంకా పరిణామ క్రమంలో ఉన్నది. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. తెల్ల తలపాగా ధరించే నిరంకారీలు కొంతకాలం రాజకీయాలనూ, సమాజాన్నీ ప్రభావితం చేశారు. నిరంకారీలు జరిపిన కాల్పులలో 16 మంది అనుచరులు మరణించడంతో భింద్రన్‌వాలేకు పలుకుబడి పెరిగింది. నిరంకారీ అధినేత గురుబచన్సింగ్ను భింద్రన్‌వాలే అనుచరులు హత్య చేశారు. జైల్‌సింగ్ సృష్టించిన భస్మాసురుడు భింద్రన్‌వాలే ఊహకు మించిన సంక్షోభం సృష్టించాడు. అకల్తఖ్త్పైకి సైన్యాన్ని పంపించి అతన్నీ, అతని అనుచరులనూ చంపే వరకూ పరిస్థితులు విషమించాయి. ఇందుకు ఇందిరాగాంధీ తన ప్రాణాలతో మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. భనియారా బాబా, ఫ్రీజర్ (అశుతోశ్) బాబా, అసీ రాం బాబా వగైరాలు పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో పుట్టుకు రావడానికి సామాజిక, మతపరమైన కారణాలు ఉన్నాయి. తమ బాబా మరణించడనే విశ్వాసంతో 2014లో మరణించిన అశుతోశ్‌ను ఫ్రిజరేటర్లో పెట్టి అంత్య క్రియలు జరిపించకుండా ఆయన శిష్యులు శవాన్ని ఉంచారు. బాబా భక్తుల నేపథ్యం ఏమిటి? సంక్షేమ కార్యక్రమాల అమలులో, ఆర్థిక, సాంఘిక అసమానతలను తగ్గించ డంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమౌతున్నాయి. బాధితులు తమ బాధలూ, కష్టాలూ విస్మరించేందుకు నవలోకాన్ని కలగంటున్నారు. ఏదో ఒక అద్భుతం తమ బాబా అలౌకిక శక్తుల ద్వారా జరుగుతుందనీ, తాము కోరుకుంటున్న సంపద అంతా తమ ఒడిలో పడుతుందనీ భ్రమిస్తారు. కొత్త క్రీస్తు పుట్టు కొస్తాడనీ, పునరుత్థాన సమయంలో ఆకాశం విచ్చుకొని ఫ్రిజిరేటర్లూ, ఎలక్ట్రానిక్ సామాగ్రి అన్నీ భూమిపైన పడతాయనీ మతం, మూఢభక్తి కలబోసిన ఉన్మ త్తతకు లోనైన భక్తులు భావిస్తారన్నది పీటర్ మారిస్ వార్స్లీ అనే ప్రఖ్యాత బ్రిటిష్ సామాజిక శాస్త్రవేత్త ప్రవచించిన సిద్ధాంతం. గుర్మీత్ రాంరహీమ్‌సింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని భక్తులను ఆకట్టుకు న్నాడు. బాబా చేసే సాహస కృత్యాలూ, అద్భుతాలూ అన్నీ ఆయన నిర్మించే సినిమాలలో పంచరంగులలో కనిపిస్తాయి. సైంటిఫిక్ ఫిక్షన్‌ను మించిన అభూ తకల్పనలు (ఫాంటసీ) వారి చిత్రాలలో ఉంటాయి. భారీస్థాయిలో రక్తదాన శిబిరాలను నిర్వహించి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. సెక్స్వర్కర్లకి సామూహిక వివాహాలు చేసి వారికి సమాజంలో గౌరవ స్థానం ప్రసాదించాడు. ఒక్కొక్క జంటకు రూ 1.5 లక్షలు సహాయంగా అందిస్తాడు. వితంతువుల వివాహం జరిపిస్తాడు. హిజ్రాలకు న్యాయపరమైన హోదా కల్పించాలని కోరుతూ డేరా సచ్చా సౌదా 2014లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సంస్థ సంస్కరణలు తెస్తోంది. సత్యసాయి సేవా ట్రస్టు మాదిరే ఆస్పత్రులు నిర్వ హిస్తోంది. డేరా సచ్చా సౌదా ఆశ్రమాలలో ఒకరకమైన సమాంతర ప్రభుత్వం నడుస్తున్నది. విరాళాలు వసూలు చేసి పేదవారి కోసం ఖర్చు చేస్తున్నారు. బాబా భక్తులలో అత్యధికులు ఓబీసీలూ, సిక్కు దళితులూ. సత్యసాయిబాబా, సద్గు రులూ, స్వామినారాయణ వంటి పీఠాధిపతులూ, మఠాధిపతులూ సంపన్ను లనూ, మధ్యతరగతి ప్రజలనూ ఆకర్షించారు. ఈ తరహా భక్తులకు ప్రభుత్వంలో పలుకుబడి ఉంటుంది. పరిపాలనలో భాగస్వామ్యం ఉంటుంది. డేరాబాబా భక్తులు అందరూ నిమ్నకులాలకీ, దిగువవర్గాలకీ చెందినవారు. వీరికి తమ బాబాపైన ఎటువంటి భక్తివిశ్వాసాలు ఉంటాయంటే వారు పోలీసులనీ, చట్టాలనీ లెక్కచేయరు. బాబా ఆదేశిస్తే ఏదైనా చేస్తారు. వారికి ఆశ్రమమే సర్వస్వం. బాబానే కొత్త దేవుడు. ఈ దేవుడికి మానవులకు ఉండే బలహీనతలు ఉంటాయంటే వారు నమ్మరు. అందుకే అత్యాచారం కేసులో సీబీఐ కోర్టు తీర్పును ఆమోదించరు. ఈ ఉదంతంలో హరియాణా ప్రభుత్వ వైఫల్యాన్ని గుర్తించి తగిన చర్య తీసుకోవడంతో పాటు రాష్ట్రంలో పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో ప్రధాని గుర్తించాలి. మొన్న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సుపరిపాలన గురించి చేసిన ప్రస్తావనను మనసుకు పట్టించుకొని పేద, బడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా గట్టి చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగ నిర్మాతలు ఆశిం చిన శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజాబాహుళ్యంలో వ్యాప్తి చేయడానికి ప్రభుత్వం అహరహం శ్రమించాలి. మూఢ నమ్మకాలనూ, మూఢాచారాలనూ ప్రజల జీవితాల నుంచి పారదోలడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. -కె. రామచంద్రమూర్తి -
గుర్మీత్ తీర్పు: జైలుకే జడ్జి!
ఛండీగఢ్: జంట అత్యాచార కేసులో ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సోమవారం శిక్షలు ఖరారు చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పంచకులలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ను జైలు నుంచి కోర్టుకు తరలించే అవకాశాలు కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జగ్దీప్ సింగ్నే రోహతక్ జైలుకు తీసుకెళ్తామని హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీఎస్ సంధు వెల్లడించారు. ఛండీగఢ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఒకవేళ అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనకు శిక్షలు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక అల్లర్లలో పంచకులలో 30 మంది, సిస్రాలో ఆరుగురు చనిపోగా, 269 మంది గాయపడినట్లు డీజీపీ సంధు వెల్లడించారు. జడ్జికి భద్రత కల్పించండి: కేంద్ర హోంశాఖ రాష్ట్రాన్ని వణికిస్తున్న డేరా అనుచరుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూనే శాంతి భద్రతలు పరిరక్షించాలంటూ కేంద్రం హర్యానా ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా గుర్మీత్‌ను దోషిగా తేల్చిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్‌కు హైలెవల్ సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర హోంశాఖ నుంచి హర్యానా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. తీర్పు అనంతరం నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో జడ్జికి భద్రత పెంచాలనే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. హోంశాఖ వర్గాలతో చర్చించి అవసరమైతే జగ్దీప్ సింగ్‌కు సీఆర్పీఎఫ్ లేక సీఐఎస్ఎఫ్ వంటి కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తామని హర్యానా పోలీస్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గుర్మీత్‌ను దోషిగా ప్రకటించిన వెంటనే హర్యానాతోపాటు పొరుగు రాష్ట్రాల్లో ఆయన అనుచరులు సృష్టించిన భీభత్సం, హింసలో 31 మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. ప్రస్తుతం పంజాబ్ లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉండటంతో కర్ఫ్యూను ఎత్తివేసినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సంయమనం పాటించినందుకు పంజాబ్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. -
డేరా హింస: పలు రైళ్లు రద్దు
న్యూఢిల్లీ: డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ అనుచరుల హింసాత్మక చర్యల నేపథ్యంలో వందలాది సంఖ్యలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. శాంతి భద్రతలకు దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ నుంచి హర్యానా, పంజాబ్ వైపు వెళ్లే 309 రైళ్లను, అలాగే, హర్యానా వైపు వెళ్లే 294 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశామని ఉత్తర రైల్వే తెలిపింది. దీంతో పాటు 58 రైళ్లను దారి మళ్లించినట్లు వివరించింది. -
చీకటి నిజాలు: 'పితాజీ మాఫీ' అంటే రేప్
-
గుర్మీత్‌ను వదిలేయాలంటూ రాజకీయ ఒత్తిళ్లు?
న్యూఢిల్లీ: అత్యాచార కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను దోషిగా ప్రకటించిన అనంతరం జరుగుతున్న హింసాత్మక పరిణామాలు తెలిసిందే. రాజకీయ నేతలను, సెలబ్రిటీలను దైవం పేరుతో తన గుప్పిట్లో పెట్టుకున్న డేరా చీఫ్ విషయంలో సీబీఐ పారదర్శక దర్యాప్తుతోనే బాధితులకు న్యాయం జరిగిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేసు విచారణలో ఉండగా దర్యాప్తు సంస్థపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు కూడా వచ్చాయని చెబుతున్నారు ఈ కేసు విచారణ చేపట్టిన ఓ అధికారి. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ములిన్జా నారాయణన్ ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు. డిసెంబర్ 12, 2002 లో పంచకుల ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు అత్యాచార ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. సబ్ ఇన్స్పెక్టర్ హోదా నుంచి నేరుగా సీబీఐ జాయింట్ డైరక్టర్ పగ్గాలతోపాటు గుర్మీత్ కేసును కూడా ములిన్జాకు ప్రభుత్వం అప్పగించింది. ‘ఆ సమయంలో సీబీఐలోని ఓ ఉన్నతాధికారి నా గదిలోకి ప్రవేశించారు. ఎలాంటి చర్యలు చేపట్టవద్దని, తక్షణమే కేసు మూసేయాలని సూచించారు’ అని ఆయన తెలిపారు. అయితే కేసులో చాలా విషయం ఉందని గుర్తించిన ములిన్జా మరింత లోతుగా విచారణ చేపట్టారంట. మరోవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే చాలా మంది బడా నేతలు, వ్యాపార వేత్తలు దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యలయానికి వచ్చి కేసు మూసేయాలంటూ ఒత్తిళ్లు చేశారంటూ ఆరోపించారు. అయినప్పటికీ తాను వెనక్కి తగ్గలేదని, ఎట్టకేలకు న్యాయమే గెలిచిందని 67 ఏళ్ల ములిన్జా వ్యాఖ్యానించారు. ఇక కేసులో బాధిత మహిళలో ఒకరిని కనిపెట్టడం చాలా కష్టతరంగా మారిందని ఆయన చెప్పారు. 1999 లో ఆమె గుర్మీత్ చేతిలో లైంగిక దాడికి గురయ్యాక డేరా(ఆశ్రమం) వదిలి వెళ్లిపోయారని, ఆమె వివాహం చేసుకోవటంతో విచారణకు సహకరిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తం అయినప్పటికీ ఆమె భర్త, కుటుంబ సభ్యులు బాగా సహకరించారని తెలిపారు. విచారణ సమయంలో గుర్మీత్ కూడా తాను బాబానంటూ పరోక్షంగా బెదిరించేందుకు యత్నించారంటూ ములిన్జా గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఆటలో ఒక్కోసారి మేం గెలవచ్చు.. ఒక్కోసారి ఓడిపోవచ్చు.. కానీ, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ములిన్జా పేర్కొన్నారు. -
నల్లగొండ జిల్లాలో డేరా పాగా
సాక్షి, హైదరాబాద్: అత్యాచార కేసులో దోషిగా తేలి, ప్రస్తుతం రోహతక్ సునారియా జైల్లో ఉన్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా తెలంగాణలోని నల్లగొండ జిల్లాలోనూ పాగా వేశాడు. చిట్యాల మండలం వెలిమినేదులో 56 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో డేరా సచ్చ సౌదా పేరుతో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమ భూముల్లో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాక ఆ ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు జరగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. 10 సంవత్సరాల క్రితం డేరా సచ్చ సౌదా పేరుతో 56 ఎకరాల భూమిని అతి తక్కువ ధరతో రైతుల వద్ద కొనుగోలు చేసినట్టు సదరు గ్రామస్తులు తెలిపారు. కొనుగోలు చేసిన భూమితో పాటు అసైన్ఢ్ భూములు ఆక్రమించుకున్నారని వెల్లడించారు. ఈ ఆశ్రమంలో శ్యామ్‌లాల్ అనే వ్యక్తి నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. బాబా దోషిగా తేలడంతో ఈ భూములను పేదలకు పంపిణీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
గుర్మీత్ కళ్లలో కన్నీటి సుడులు
సాక్షి, హరియాణా: డేరా సచ్చా సౌధా గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మాట వేదం.. ఆయన అడుగేస్తే ఓ సంచలనం.. ఎప్పుడు, ఎక్కడ ఆయన్ను చూసినా చుట్టూ భారీ భద్రతా వలయం.. ఒక్కసారి ఆయన చూపు తాకడం కోసం లక్షలాది మంది అభిమాన గణం ఎదురుచూపులు.. ఓ వీవీఐపీను పోలి ఉంటుంది ఆయన జీవితం. ఉత్తర భారతంలో ఎంతో మంది అభిమానులను, మద్దతుదారులను కూడగట్టుకున్న ఆయన పేరు.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పుతో దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇద్దరు మహిళా స్వాధీలపై అత్యాచారం కేసులో ఆయన్ను శుక్రవారం సీబీఐ న్యాయస్థానం దోషిగా తేల్చింది. అత్యాచారం కేసులో ఆయనకు ఈ నెల 28న శిక్ష ఖరారు చేయనుంది. న్యాయస్థానం తీర్పుతో డేరా చీఫ్ షాక్‌కు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం జైలుకు బయల్దేరి వెళ్లే ముందు ఆయన కళ్లలో కన్నీటి సుడులు తిరగాయి. సాధారణ బాబాలు, సాధువులతో పోల్చితే గుర్మీత్ అనుభవించిన జీవితం విభిన్నం. బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. రాక్‌స్టార్‌గా మ్యూజిక్ వీడియోలు చేసినా.. అదో క్రేజ్..!. గుర్మీత్ జీవితంలోని పలు ఆసక్తికర విశేషాలను ఓ సారి చూద్దాం. ♦ గుర్మీత్ అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని పట్ణణాలు, గ్రామాల్లో ఆయనకు భారీ సంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు. ఆయన కోసం ప్రాణమిచ్చేందుకు సిద్ధమని కూడా కొందరు అభిమానులు అంటూ ఉంటారు. ♦ రాజకీయంగానూ గుర్మీత్ బలాఢ్యులే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హరియాణాలో ఆయన భాజపాకు మద్దతు ప్రకటించారు. డేరా సచ్చా సౌధా నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రముఖ నేతలతో పాటూ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ కూడా పాల్గొన్నారు. ఇక పంజాబ్‌లో అప్పట్లో భాజపా-అకాళీదళ్ ప్రభుత్వానికి ఆయన మద్దతు ప్రకటించారు. ♦ 2008లో గుర్మీత్ లక్ష్యంగా దాడి జరిగింది. అప్పటి నుంచి ఆయన జడ్ ప్లస్ కేటగిరీ కింద సెక్యూరిటీ పొందుతున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లలో చక్కర్లు కొడుతున్నారు. ♦ తొలి రోజు జైల్లో గుర్మీత్ యోగాతో తన రోజును ప్రారంభించారు. దీన్ని బట్టి ఆయనకు రోజూ యోగా చేసే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. యోగా అనంతరం టీ, రెండు ముక్కల బ్రెడ్‌ను గుర్మీత్ ఆహారంగా తీసుకుంటారని తెలిసింది. ♦ గుర్మీత్‌కు నటనంటే విపరీతమైన ఆసక్తి. తన పలుకుబడిని ఉపయోగించి రెండు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’(ఎంఎస్‌జీ), ‘మెసెంజర్ ఆఫ్ గాడ్2’ సినిమాల్లో వెండి తెరపై మెరిశారు. ఈ సినిమాలకు సహ రచయితగా కూడా వ్యవహరించారు. లెదర్ దుస్తులు, వజ్రాలు అంటే గుర్మీత్‌కు ప్రేమ. ప్రేమ అనే పదం సరిపోదనుకుంటే పిచ్చి అని కూడా చెప్పుకోవచ్చు. లెదర్, డైమండ్లతో తయారుచేయించిన దుస్తుల్లో కనిపిస్తూ సినిమాల్లో సందేశాలు ఇచ్చారు. ♦ 'లవ్ చార్జర్' అనే మ్యూజిక్ వీడియోతో గుర్మీత్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. పలు అంతర్జాతీయ వేదికలపై ఈ వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియో మెగా హిట్ అయిందని.. దాదాపు 20 లక్షల కాపీలు అమ్ముడుపోయాయని డేరా సచ్చా సౌధా అప్పట్లో చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ♦ సంక్షేమ, ఆధ్యాత్మిక సంస్థగా పేర్కొనే డేరా సచ్చా సౌధా 1948లో స్థాపితమైంది. 1990లో దీని బాధ్యతలను గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా డేరాకు ఐదు కోట్ల మంది మద్దతుదారులు ఉన్నట్లు సంస్థ పేర్కొంటోంది. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ, సబ్సిడీపై ఆహార వస్తువులు, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ఈ సంస్థ ముఖ్యంగా దళితులు, నిమ్న కులాలకు చెందినవారిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. ♦ తుది తీర్పు సందర్భంగా పంచకులలోని సీబీఐ కోర్టుకు వెళ్లే ముందు కూడా గుర్మీత్ తన దర్పాన్ని ప్రదర్శించుకున్నారు. దాదాపు 200 కార్ల కాన్వాయ్‌తో కోర్టుకు చేరుకున్నారు. 2002లో ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో గుర్మీత్‌ను పంచకుల సీబీఐ న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. ఈ నెల 28న ఆయనకు జైలు శిక్ష ఖరారు చేయనుంది. ♦ గుర్మీత్ అరెస్టు తర్వాత పంజాబ్, హరియాణాల్లో డేరాకు గల 32 ఆశ్రమాలను అధికారులు సీజ్ చేశారు. హరియాణాలోని సిర్సాలో గల డేరా హెడ్ క్వార్టర్స్ నుంచి గుర్మీత్ అనుచరులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. -
నల్లగొండ జిల్లాలోనూ పాగా వేసిన డేరా బాబా
-
మా గురూజీ ఏ తప్పూ చేయలేదు
-
స్పెషల్ సెల్, మినరల్ వాటర్, అసిస్టెంట్
సాక్షి, రోహతక్: అత్యాచార కేసులో దోషిగా తేలి, ప్రస్తుతం రోహతక్ సునారియా జైల్లో ఉన్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు తాగేందుకు మినరల్ వాటర్‌తో పాటు, ఓ సహాయకుడు సేవలు అందించేందుకు అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే జైల్లో గుర్మీత్‌కు సకల మర్యాదలు అందనున్నట్లు వార్తలొచ్చాయి. అధికారులు ఆయనను ఓ ప్రత్యేక సెల్లో ఉంచిన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మిత్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. శాంతి భద్రతల నేపథ్యంలో ఆయనను తీర్పు అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో రోహతక్ తరలించారు. అనంతరం గుర్మిత్‌ను ఓ గెస్ట్‌హౌస్‌లో ఉంచి, శుక్రవారం సాయంత్రం జైలుకు తరలించారు. కాగా కోర్టు ప్రాంగణంలో గుర్మీత్‌తో పాటు పలు బ్యాగులు, లగేజీ ఉన్నట్లు కొన్ని వీడియోల్లో కనిపించాయి. ఆ వార్తల్లో నిజం లేదు: జైళ్ల డీజీ అయితే జైలులో గుర్మిత్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు వస్తున్న వార్తలను హరియాణా జైళ్ల డీజీ కేపీ సింగ్ తోసిపుచ్చారు. ఆయనకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు కొన్ని టీవీ చానల్స్, పేపర్లు పేర్కొన్నాయని, అదంతా అవాస్తవమన్నారు. కేసు తీర్పు అనంతరం గుర్మిత్‌ను సునారియా జైలుకు తరలించామే కానీ, గెస్ట్‌హౌస్‌కు కాదన్నారు. అలాగే ఆయనకు జైల్లో సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నట్లు చెప్పారు. గుర్మిత్‌కు సహాయకుడి కానీ, జైలు సెల్లో ఏసీ సదుపాయం కూడా లేదని జైళ్ల డీజీ స్పష్టం చేశారు. సిర్సాలో భయానక పరిస్థితులు కాగా హరియాణాలోని సిర్సాలో భయానక పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. తీర్పు అనంతరం చెలరేగిన హింస ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. రోడ్లపై ఎటు చూసినా తగలబడిన వాహనాలు, ధ్వంసమైన షాపులు ఇళ్లు, కత్తులు, రాడ్లు, కర్రలు కన్పిస్తున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళన అందరిలోనూ నెలకొంది. గుర్మీత్ ఆందోళనకారుల దాడులు నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. మరోవైపు గుర్మిత్ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తుల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. -
స్పెషల్ సెల్, మినరల్ వాటర్, అసిస్టెంట్
-
చీకటి నిజాలు: 'పితాజీ మాఫీ' అంటే రేప్
సాక్షి, న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ ఆగడాలకు సంబంధించిన సంచలన నిజాలను ఇద్దరు సాధ్వీ(రేప్‌కు గురైన మహిళలు)లు కోర్టులో బయటపెట్టారు. తన ప్రత్యేక మందిరంలో గుర్మీత్ మహిళలపై ఎలా అత్యాచారాలకు పాల్పడే వాడన్న విషయాలను కళ్లకు కట్టినట్లు పంచకుల సీబీఐ కోర్టులో జడ్జిలకు వివరించారు. గుర్మీత్‌కు 'గుఫా'(ప్రత్యేక నివాసం) ఉండేదని, అక్కడకు తనకు నచ్చిన మహిళలను తీసుకెళ్లి పలుమార్లు రేప్ చేసేవాడని చెప్పారు. గుఫాకు కాపలాగా మహిళా గార్డులు మాత్రమే ఉంటారని తెలిపారు. 'పితాజీ మాఫీ' అనే పదాన్ని 'రేప్'కు ప్రత్యామ్నాయంగా వినియోగించేవారని పేర్కొన్నారు. సాక్షుల్లో ఒకరైన హర్యానాకు చెందిన మహిళ తాను 1999 జులై నుంచి డేరాలో ఆశ్రయం పొందుతున్నట్లు చెప్పారు. తనకు న్యాయం చేయాలంటూ ఆర్థించిన తన అన్నను చంపేశారని సీబీఐ జడ్జి ఏకే వర్మకు ఆమె తెలిపారు. 1999 ఆగష్టులో గుర్మీత్ తనపై అత్యాచారానికి పాల్పడే వరకూ 'పితాజీ మాఫీ' అంటే తనకు తెలియదని చెప్పారు. రేప్‌కు గురికాక ముందు డేరాలోని మహిళలంతా తనను 'పితాజీ మాఫీ' జరిగిందా? అని ప్రశ్నించేవారని వెల్లడించారు. 1999 సెప్టెంబర్‌లో గుర్మీత్ తనపై అత్యాచారానికి పాల్పడట్లు మరో మహిళ తెలిపారు. ఈ విషయం బయటకు చెబితే ప్రాణాలు పోతాయని గుర్మీత్ వార్నింగ్ కూడా ఇచ్చారని వెల్లడించారు. -
గుర్మీత్ అనుచరులు చంపేస్తారేమో!
ఛండీగఢ్: పదిహేనేళ్ల రేప్ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు డేరా అనుచరుల్లో ఆగ్రహ జ్వాలలు రగల్చింది. ఓవైపు మృతుల సంఖ్య పెరిగిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వ్యాపిస్తుండటంతో ఉత్తర భారతావనిలో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో అత్యాచార బాధితురాళ్ల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డారంటు చెబుతున్న ఇద్దరు సాధ్వీలు ప్రస్తుతం ఉన్నారన్నది ఎవరికీ తెలీదు. ఈ విషయంపై నోరు మెదిపేందుకు వాళ్ల తరపు న్యాయవాది కూడా సుముఖంగా లేదు. తాజా పరిస్థితుల్లో వారి ప్రాణాలకు ముప్పు ఉండటంతో ఎలాంటి సమాచారం బయటకు పొక్కనీయటం లేదు. ‘గత కొద్దిరోజులుగా వాళ్లలో భయాందోళనలు కనిపిస్తున్నాయి. ప్రాణ భయంలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఒకవేళ కేసులో ఆయన్ను(గుర్మిత్) నిర్దోషిగా ప్రకటిస్తే తాము వేరే రాష్ట్రానికి వెళ్లిపోతామని వాళ్లు తనతో మొరపెట్టుకున్నట్లు‘ న్యాయవాది తెలిపారు. మరోవైపు ఈ కేసులో పారదర్శకత కోసం హర్యానాలో కాకుండా వేరే రాష్ట్రంలో వాదనలు వినిపించాలని ఆయన వాదనల సందర్భంగా కోరినట్లు తెలుస్తోంది. ఇక తీర్పు వెలువడే ముందే బాధితురాల్లో ఒకరు ఓ జాతీయ మీడియాతో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. తాను పెను పెద్ద ప్రమాదంలో ఉన్నానని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తాను స్వేచ్ఛగా తిరగలేకపోతున్నానని, నిజాయితీ పరులైన అధికారుల వల్లే తమకు న్యాయం చేకూరుతుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపిందంట. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల మధ్య వాళ్లు సురక్షితంగా ఉంటారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 2002లో ఓ లేఖ ద్వారా ఈ వ్యవహారం మొదలైంది. మూడు పేజీల ఆ లేఖ అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్, కేంద్ర హోం మత్రి మరియు హైకోర్టు, ఇతరుల పేర్లను ప్రస్తావిస్తూ తనపై గుర్మీత్ అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. తనని గుఫాగా అభివర్ణిస్తూ గుర్మిత్ తన డెన్‌లో పక్కనే గన్ పెట్టుకుని బెదిరిస్తూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు లేఖలో ఉంది. ఆ లేఖ ఆధారంగా సీబీఐ దర్యాప్తునకు ఛండీగఢ్ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ విచారణలో మరో సాధ్వీపై కూడా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక ఈ లెటర్ వెలుగులోకి రావటానికి కారణమైన వ్యక్తి హత్యకు గురయ్యాడు కూడా. 2008లో సీబీఐ కోర్టు రామ్ రహీమ్ మీద అత్యాచార ఆరోపణలను నమోదు చేసింది. 15 ఏళ్ల తర్వాత చివరకు గుర్మీత్ ను దోషిగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది. -
'డేరా' దమనకాండ.. ఉత్తరాది విలవిల
-
కోహ్లీ-గుర్మిత్.. ఓ స్పెషల్ బంధం
సాక్షి, న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌదా నేత గుర్మిత్ రామ్ రహీం సింగ్ అనుచరులు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అలజడిని సృష్టిస్తున్నారు. అత్యాచార కేసులో ఆయన్ని దోషిగా సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన మరుక్షణం నుంచే హింసను రాజేస్తున్నారు. హింసాత్మక ఘటనలతో పంజాబ్, హర్యానాలు అట్టుడికిపోతున్నాయి. ఇంకోవైపు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. అయితే గుర్మిత్ పరమ భక్తుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఒకరనే విషయం చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. కోహ్లీ సక్సెస్ సీక్రెట్ తానేనని గతంలో చాలాసార్లు గుర్మిత్ స్వయంగా చెప్పుకున్నారు. నిరంతర సాధన చేయాలని సూచించటంతోనే కోహ్లీ ఈస్థాయిలో ఉన్నాడంటూ గతేడాది ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. అంతేకాదు స్టార్ బాక్సర్ విజయేందర్ సింగ్ ప్రపంచ స్థాయి బాక్సర్ అయ్యేందుకు కూడా తానే కారణమంటూ ప్రకటించుకున్నారు కూడా. ఇక ఇప్పుడు గుర్మిత్ లైంగికదాడి కేసులో అరెస్టయ్యాక ఆ పాత వీడియోను దులిపి వైరల్ చేస్తున్నారు. కోహ్లీ, అశిష్ నెహ్రా మరియు విజయ్ దహియాలు అందులో తనకు తాను దైవంగా చెప్పుకునే గుర్మిత్ ను కొలుస్తున్నట్లు అందులో ఉంది. ప్రత్యేకంగా మోకాళ్ల మీద వినయంగా కూర్చుని ఆశీర్వాదం తీసుకున్నాడు కోహ్లీ. వీడియో పాతదే అయినా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీడియోతో ట్రోల్ చేసేస్తున్నారు. @RoflGandhi_ Mazak udate the na aap Gurmeet Ram Rahim ka. Ye dekho, Virat Kohli Ko cricket unhone hi sikhayi hai. -
రేప్ కేసులో దోషిగా తేలిన బాబా గుర్మీత్ సింగ్
-
'దేవుడిపై నమ్మకముంది.. కోర్టుకు వస్తా'
సిర్సా: అత్యాచార ఆరోపణలు ఎదుర్కుంటున్న వివాదస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఎట్టకేలకు గళం విప్పారు. శాంతి, సంయమనం పాటించాలని తన భక్తులకు సూచించారు. రేపు కోర్టుకు హాజరవుతానని ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'చట్టం పట్ల నాకు అమితమైన గౌరవముంది. చట్టాలను ఎల్లప్పుడు గౌరవిస్తాను. నడుంనొప్పితో బాధపడుతున్నప్పటికీ రేపు న్యాయస్థానం ఎదుట హాజరవుతాను. దేవుడిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరంతా శాంతియుతంగా ఉండాల'ని హిందీలో రహీమ్ సింగ్ ట్వీట్ చేశారు. తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 15 ఏళ్ల నాటి రేప్ కేసులో పంచకుల సీబీఐ కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలు కాపాడేందుకు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేపట్టారో తెలుపుతూ సవివరమైన నివేదిక సమర్పించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు.. హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాట్ల ఆందోళన సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. మరోవైపు ముందుజాగ్రత్తగా పంజాబ్, హర్యానా, కేంద్ర పాలిత చండీగఢ్‌లో 72 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్, డేటా సేవలను నిలిపివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
రేప్ కేసు ఆరోపణలు.. రహీమ్ వెంట మేమున్నాం
సిర్సా: అత్యాచార ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛ సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మద్ధతు క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఆయనపై నమోదయిన రేప్ కేసులో పంచుకుల సీబీఐ కోర్టు ఆగష్టు 25న తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో గుజర్ల సంఘం ఆయన వెంట నిలుస్తున్నట్లు ప్రకటించింది. గుజ్జర్ గౌరవ్ సమ్మన్ పేరటి ఆయన డేరా(ఆశ్రమం)లో సమావేశం నిర్వహించింది. కులదీప్ సింగ్ భాటి నేతృత్వంలో ఉత్తర ప్రదేశ్ గుజ్జర్ల సంఘ నేతలు, హర్యానాకు చెందిన 84 ఖాప్ నేతల అధ్యక్షుడు హర్యానా ధర్మేంద్ర భగత్ కూడా హాజరయ్యారు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నిస్వార్థంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయనకు ఏదైనా అన్యాయం జరిగితే, ఐదు కోట్ల గుజ్జర్ తెగ మొత్తం ఆయన వెంట ఉందని నేతలు ప్రకటించారు. కొన్ని జాతి వ్యతిరేక శక్తులు కుట్ర పన్ని ఆయన్ని ఈ కేసులో ఇరికించాయి అని వాళ్లు తెలిపారు. ఇక గుజ్జర్ల నేతల సానుభూతి ప్రకటనను రామ్ రహీమ్ స్వాగతించారు. సుమారు లక్ష మంది ఆయన మద్ధతుదారులు ఇప్పటికే సంఘీభావం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పారా మిలటరీ దళాలను హర్యానా ప్రభుత్వం రంగంలోకి దిగింది. కోర్టు తీర్పును గౌరవించాలని, సంయమనం పాటించాలని ఆయన మద్ధతుదారులు పోలీస్ శాఖ కోరింది. -
రామ్ రహీమ్ సింగ్ మరో సంచలనం
ముంబై: ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో భారత సైన్యం ఇటీవల జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్న వారికి ఈ సినిమా సమాధానంగా నిలుస్తుందన్నారు. ‘ఎం.ఎస్.జి.- ద వారియర్ లయన్ హార్ట్’ విజయోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ' ‘ఎం.ఎస్.జి.- ద లయన్ హార్ట్- హింద్ కా నాపాక్ కో జవాబ్’ పేరుతో సినిమా మొదలు పెట్టబోతున్నాను. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇందులో ప్రధానంగా చూపించబోతున్నాం. సైన్యం జరిపిన సర్జికల్ దాడులకు ఆధారాలు చూపించాలని అడుగుతున్నవారికి ఇందులో సమాధానం దొరుకుతుంది. 25 రోజుల్లోనే ఈ సినిమా పూర్తిచేయాలని భావిస్తున్నామ'ని తెలిపారు. సెప్టెంబర్ 18న కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారు. దీనికి స్పందనగా భారత ఆర్మీ పీవోకేలోని తీవ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేసింది. 'తరచుగా మనం సైనికులను కోల్పోతున్నాం. ఎంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు? హఠాత్తుగా కొంతమంది తెరపైకి వచ్చి సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలని అడుగుతున్నారు. ఇది నన్ను చాలా బాధించింది. ఇలాంటి వారికి నా సినిమా ద్వారా చెప్పాలనుకున్నా'నని గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అన్నారు. -
మెసెంజర్ ఆఫ్ గాడ్
-
తుపాకుల నీడలో 'ఎంఎస్‌జి'
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) బోర్డు చీఫ్ లీలా శామ్సన్ సహా మొత్తం బోర్డు సభ్యుల రాజీనామాకు దారితీయడంతో పాటు రాజకీయ దుమారాన్ని కూడా రేపిన వివాదాస్పద చిత్రం ‘ఎంఎస్‌జి’ శుక్రవారం దేశంలోని మూడు వేల థియేటర్లలో విడుదలైంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో ఒకేరోజు విడదలైన ఈ చిత్రం ప్రోమోలు, పాటలు గత కొంతకాలంగా సామాజిక వెబ్సైట్లలో హల్చల్ చేస్తున్నాయి. డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఈ చిత్రానికి దర్శక, నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా హీరోగా నటించి స్వయంగా పాటలు కూడా పాడారు. హర్యానాతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఈ చిత్రం విడుదలైన థియేటర్ల వద్ద ముందస్తు చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా గొడవలు జరిగితే తక్షణమే స్పందించి వాటిని అదుపు చేసేందుకు ప్రత్యేక భద్రతా బందాలను రంగంలోకి దించారు. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో హర్యానా రాష్ట్రమంతా అలెర్ట్ ప్రకటించారు. చండీగఢ్‌లోకి ప్రవేశించే అన్ని రోడ్లవద్ద చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులను చూపిస్తే తప్ప లోపలికి రానీయడం లేదు. ఓ చిత్రం విడుదల సందర్భంగా ఎన్నడూ ఇంతటి భద్రతను ఏర్పాటు చేయలేదని, ఇదే మొదటిసారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తుపాకుల నీడలో చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా కేంద్ర సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిందంటూ కొన్ని సిక్కు సంస్థలు గతంలో ధర్నాలు, ఆందోళనలు జరపడమే ఇందుకు కారణం. వివాదానికి కారణాలివీ.. 1. హత్యా, అత్యాచార కేసులను ఎదుర్కొంటున్న డేరా సచ్చా సౌదా చీఫ్ ఈ చిత్రాన్ని నిర్మించి నటించడం. 2. చిత్రం టైటిల్లో ‘దేవదూత’ అనే పేరు ఉండడం (సెన్సార్ బోర్డు సూచన మేరకు ఈ ట్యాగ్‌ను తొలగించారు) 3. చిత్రంలోని సిక్కు హీరో రాక్ స్టార్ లాంటి దుస్తులే కాకుండా విచిత్ర వేషధారణలో చిత్ర విచిత్ర దుస్తులు ధరించడం. 4. మహిమలు, మంత్రాలు ప్రదర్శించడం, లాజిక్కులేని జిమ్మిక్కులు చేయడం. ఇలాంటి మరికొన్ని కారణాల వల్ల ఢీల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ తదితర ప్రాంతాల్లో చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ చిత్రం విడుదలను ఎలా అనుమతించారంటూ సెన్సార్ బోర్డుపై రాజకీయ ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడికి వ్యతిరేకంగా సెన్సార్ బోర్డు చీఫ్ లీలా శామ్సన్ తొలుత రాజీనామా చేశారు. ఆమెకు సంఘీభావంగా మిగతా సభ్యులంతా రాజీనామా చేశారు. గతంలో సామాజిక స్పృహ కలిగిన పలు చిత్రాలకు అభ్యంతరాలు పెట్టిన సెన్సార్ బోర్డు భావప్రకటనా స్వేచ్ఛకు పెద్దపీట వేస్తూ ‘ఓ మై గాడ్, పీకే’ లాంటి చిత్రాలకు క్లియరెన్స్ ఇవ్వడం హర్షించాల్సిందేగదా! ఇంతకు ఎంఎస్జీలో ఏముందంటే ఏమీ ఉండదు. 1980వ దశకంలో వచ్చిన మాల్ మసాలా లాంటి చిత్రమే. కానీ, ‘కొందరంటారు నన్ను సాధువని...సన్యాసని, మరికొందరు గురువంటారు. ఇంకొందరు సాక్షాత్తు భగవంతుడే అంటారు. ఎవరేమన్నా మామూలు మనిషిని నేను’లాంటి కొన్ని డైలాగులుంటాయి. -
‘మెసెంజర్ ఆఫ్ గాడ్’పై చిచ్చు
* ఈ చిత్రానికి కేంద్రం అనుమతిపై * సెన్సార్ బోర్డులో రాజీనామాల పర్వం * ఒకే రోజు 9 మంది బోర్డు సభ్యుల రాజీనామా * రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డ కేంద్ర మంత్రి జైట్లీ * సినిమా ప్రదర్శనపై పంజాబ్ ప్రభుత్వం నిషేధం న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌సింగ్ నటించిన వివాదాస్పద చిత్రం ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ విడుదల వ్యవహారంపై తలెత్తిన వివాదం రాజకీయరంగు పులుముకుంది. వివాదాస్పద అంశాలున్నాయన్న కారణంతో ఈ చిత్రం విడుదలకు తాము అనుమతి నిరాకరించినా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఫిలిం సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎఫ్‌సీఏటీ) అనుమతించడంపై సెన్సార్ బోర్డు సభ్యులు రాజీనామాలపర్వానికి తెర లేపారు. కేంద్రం జోక్యంతో కలత చెంది బోర్డు చైర్పర్సన్ లీలా శాంసన్ గురువారం తన పదవికి రాజీనామా చేయగా ఆమెకు మద్దతుగా 9 మంది సభ్యులు శనివారం మూకుమ్మడి రాజీనామాలు చేశారు. సెన్సార్ బోర్డుపట్ల కేంద్ర వైఖరి నచ్చక బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అరుంధతి నాగ్, ఐరా భాస్కర్, లోరా ప్రభు, పంకజ్ శర్మ, రాజీవ్ మసంద్, శేఖర్‌బాబు కంచెర్ల, షాజీ కరుణ్, శుభ్రా గుప్తా, టి.జి. త్యాగరాజన్‌లు కేంద్ర సమాచార, ప్రసారశాఖకు పంపిన ఉమ్మడి రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీంతో చైర్పర్సన్ సహా మొత్తం 24 మందిగల సెన్సార్ బోర్డు సభ్యుల సంఖ్య 14కు పడిపోయింది. మరికొందరు సభ్యులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు బోర్డు సభ్యుల తీరును కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం తీవ్రంగా తప్పుబట్టారు. యూపీఏ హయాంలో నియమితులైన సభ్యులంతా మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి ఎఫ్‌సీఏటీ ఇచ్చిన అనుమతి వ్యవహారంతోపాటు రాజీనామాలపె రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఫేస్బుక్లో ‘రెబెల్స్ వితౌట్ ఎ కాజ్’ పేరిట ఆర్టికల్ పోస్ట్ చేశారు. సెన్సార్ బోర్డు నిర్ణయం నచ్చకుంటే ఎఫ్‌సీఏటీని ఆశ్రమించే హక్కు చట్టప్రకారం బాధిత నిర్మాతకు ఉంటుందని ఆయన గుర్తు చేశారు. సెన్సార్ బోర్డు నిర్ణయంతో ట్రిబ్యునల్ విభేదిస్తే అది బోర్డు స్వయంప్రతిపత్తిపై దాడి ఎలా అవుతుందని జైట్లీ ప్రశ్నించారు. ఇప్పటివరకూ తనతోపాటు సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ సెన్సార్ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. బోర్డులో అవినీతిపై లీలా శాంసన్ చేసిన ఆరోపణలపై జైట్లీ స్పందిస్తూ దీనిపై శాంసన్ ఒక్కసారి కూడా తనకు ఫిర్యాదు చేయలేదని...అయినా సెన్సార్ బోర్డులో అవినీతి ఉంటే అందుకు బోర్డు సభ్యులు తమను తామే నిందించుకోవాలన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే గత 9 నెలల్లో బోర్డు ఒక్కసారి కూడా సమావేశం కాలేకపోయిందన్న శాంసన్ ఆరోపణలను కూడా జైట్లీ తోసిపుచ్చారు. తమ శాఖ నిధులు విడుదల చేసినా సెన్సార్ బోర్డు ఆ నిధులను ఖర్చు చేయకుండా వెనక్కి పంపిందని జైట్లీ పేర్కొన్నారు. బోర్డు సమావేశాలను నిర్వహించకుండా పనిచేయనందుకు శాంసన్ తనను తాను నిందించుకోవాలని విమర్శించారు. ప్రముఖ నటుడు అనుపమ్‌ఖేర్ నేతృత్వంలోని గత సెన్సార్ బోర్డును 2004లో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం రాజకీయ కారణాలతో రద్దు చేసినా తమ ప్రభుత్వం మాత్రం అటువంటి పని చేయలేదని జైట్లీ తెలిపారు. ప్రదర్శనకు పంజాబ్ సర్కార్ నో... రాష్ట్రంలో శాంతిభద్రతలు, ప్రజల మత విశ్వాసాలు దెబ్బతినరాదనే కారణాల దృష్ట్యా ఆదివారం విడుదల కావాల్సిన ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ ప్రదర్శనను ఆపేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. సినిమా హాళ్లు సహా బహిరంగ, ప్రైవేటు ప్రదర్శనలకూ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. చిత్రం ప్రదర్శనకు అనుమతిస్తే శాంతిభద్రతలకు భంగం వాటిల్లవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఈ చర్య చేపట్టినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి సలహాదారు హర్చరణ్ బైన్స్ తెలిపారు. ఈ చిత్రం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ పలు సిక్కుల సంఘాలతోపాటు శిరోమణి అకాలీదళ్, ఐఎన్ఎల్డీ వంటి రాజకీయ పార్టీలు శనివారం పంజాబ్, హరియాణా, ఢిల్లీలలో నిరసనలకు దిగడం తెలిసిందే. ‘యూపీఏ వర్సెస్ ఎన్డీఏగా..’ సెన్సార్ బోర్డుతో నెలకొన్న సమస్యలను మోదీ సర్కారు... ఎన్డీఏ, యూపీఏ మధ్య రాజకీయ అంశంగా మారుస్తోందని కాంగ్రెస్ నేత, కేంద్ర సమాచార, ప్రసారశాఖ మాజీ మంత్రి మనీశ్ తివారీ విమర్శించారు. ఈ పరిణామాన్ని కేంద్రం రాజకీయం చేయాలనుకోవడం దురదృష్టకర, విచారకరమన్నారు. రాజకీయ కారణాలతోనే ప్రస్తుత సెన్సార్ బోర్డులో నియామకాలు జరిగాయని ప్రభుత్వం ఒకవేళ భావిస్తే గత ఎనిమిది నెలల్లోనే బోర్డు సభ్యులపై ఎందుకు వేటు వేయలేదని ప్రశ్నించారు. సినిమాలో ఏముంది..? ‘ద మెసెంజర్ ఆఫ్ గాడ్(దేవ దూత)’. కథ విషయానికి వస్తే.. పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక నేత గురూజీ ఈ సినిమాలో హీరో. డ్రగ్స్, లింగ వివక్ష, మద్యపానం, వ్యభిచారం వంటి సామాజిక రుగ్మతలు రూపుమాపి, యువతను ఉద్ధరిస్తానంటూ గురూజీ సవాల్‌ను స్వీకరిస్తాడు. అయితే, సమాజానికి మంచి చేయడం సహించలేని కొందరు గురూజీని చంపేందుకు కుట్రలు పన్నడం, వాటిని గురూజీ ఎదుర్కోవడం. స్థూలంగా ఇదీ కథ. అయితే, ఈ సినిమా ద్వారా గుర్మీత్ సింగ్ తనను తాను దేవుడిగా చిత్రీకరించుకున్నట్లుగా ఉందని సెన్సార్ బోర్డు సభ్యులు భావించినట్లు సమాచారం. చిత్రంలో తర్కవిరుద్ధమైన గురూజీ లీలలపైనా అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. డేరా వర్గానికి, సిక్కు సంస్థలు దళ్ ఖల్సా, శిరోమణి అకాలీదళ్‌లకు ఎప్పుడూ పొసగని కారణంగా కూడా ఈ సినిమాపై వ్యతిరేకత, నిరసనలు పెరగడానికి దారితీసింది. -
పంజాబ్‌లో 'ఎంఎస్‌జి' సినిమాపై నిషేధం
డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ప్రధాన పాత్రధారిగా వచ్చిన వివాదాస్పద చిత్రం 'ఎంఎస్‌జీ - ద మెసెంజెర్ ఆఫ్ గాడ్' సినిమాను పంజాబ్ ప్రభుత్వం నిషేధించింది. ఈ సినిమాను రాష్ట్రంలో ఎక్కడా ప్రదర్శించకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సినిమా ప్రదర్శిస్తే రాష్ట్రంలో ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
హీరోగా గురుమిత్ రామ్‌రహీమ్ సింగ్ !