గుర్మీత్ డేరాలు: షాకింగ్ నిజాలు! | Skeletons buried inside Sirsa Dera but we follow law, Vipassana Insan | Sakshi
Sakshi News home page

గుర్మీత్ డేరాలు: షాకింగ్ నిజాలు!

Published Fri, Sep 8 2017 8:58 AM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

గుర్మీత్ డేరాలు: షాకింగ్ నిజాలు!

గుర్మీత్ డేరాలు: షాకింగ్ నిజాలు!

సాక్షి, సిర్సా: అత్యాచారాల కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ నిర్వహిస్తున్న డేరా ఆశ్రమాలకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. సిర్సాలోని డేరాలో అస్తి పంజరాలు వెలుగుచూడటం వివాదాస్పదం కాగా, దానిపై డేరా అధికార ప్రతినిధి విపాసన ఇన్సాన్ స్పందించారు. తాము గుర్మీత్ ఏర్పాటు చేసిన నియమాలను ఎప్పుడూ ఉల్లంఘించలేదని, అందులో భాగంగానే కొందరు నేరుగా ఇక్కడికి వచ్చి తమ మరణానంతరం ఇక్కడే పూడ్చిపెట్టాలని స్వచ్ఛందంగా కోరినట్లు డేరా మీడియా సచ్ కహూన్ కూడా బహిర్గతం చేసింది.

డేరా ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలను ప్రశ్నిస్తే గుర్మీత్ అనుచరులైనా సరే వారిని హ్యతచేసయినా, లేక సజీవంగానైనా 600 ఎకరాలు, 100 ఎకరాలకు పైగా ఉన్న ఏదైనా ఓ డేరాలో పాతిపెట్టేవారని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. గుర్మీత్ అనుచరులకు ఎదురుచెబితే ఎవరికైనా ఇక్కడ ఇలాంటి గతే పడుతుందన్న భయంతో నోరు మెదిపేవాళ్లం కాదని చెబుతున్నారు. ఛండీగఢ్‌ హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని సోదాలకు ఆదేశించిన నేపథ్యంలో విపాసన మాట్లాడుతూ.. చట్టాలను డేరా ఎప్పుడూ అతిక్రమించలేదని, గుర్మీత్ అనుచరులు, మద్ధతుదారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని సూచించారు. కొందరు వ్యక్తులు తమ కుటుంబసభ్యుల అస్థికలు తమకివ్వగా డేరాలో పూడ్చిపెట్టి, నదులు, పర్యావరణం కలుషితం కాకుండా చూసేవాళ్లమని చెప్పారు.

డేరా సోదాలకు తమకు ఎలాంటి అభ్యంతర లేదని అధికార ప్రతినిధి విపాసన చెప్పగా.. మరోవైపు గురువారం రాత్రి సిర్సాకు చేరుకున్న పారా మిలిటరీ, ఆర్మీ బృందం, నాలుగు జిల్లాల పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి గుర్మీత్ నిర్వహిస్తున్న డేరాలను అణువణువు గాలిస్తున్నారు. ఈ తనిఖీల నేపథ్యంలో సిర్సాలో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు. అత్యాచారాల కేసులో దోషిగా తేలిన గుర్మీత్ కు కోర్టు 20 ఏళ్ల (ఒక్కో కేసులో పదేళ్లు) జైలు విధించిన విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement