dera sacha saudha
-
గుర్మీత్ డేరాలో హోమో సెక్సువల్స్
సాక్షి, సిర్సా : డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెద్ద కామపిశాచి అన్న విషయాన్ని మాజీ అనుచరులు స్వయంగా చెబుతుండటం చూస్తున్నాం. అయితే ఆశ్రమంలోని మహిళలను మాత్రమే చేరదీసే గుర్మీత్.. అనుచరుల విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించేవాడంట. వారి వారి భార్యలను సోదరీమణులుగా భావించాలని తరచూ అనుచరులకు ప్రభోదించేవాడంట. దీంతో వారిలో చాలా మట్టుకు స్వలింగ సంపర్కులుగా మారిపోయేవారని చెబుతున్నారు. సిర్సా ప్రధానాశ్రమంలో ఆరేళ్లు గడిపిన గుర్దాస్ సింగ్ తూర్ అక్కడి దారుణాలను వివరిస్తున్నాడు. ‘ఆశ్రమంలో మగవాళ్లకు కఠిన నియమాలు ఉండేవి. గుర్మీత్ మహిళా భక్తుల(సాధ్వీలు)తో ఎవరూ మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే శిక్షలు కఠినంగా ఉండేవి. గాడిదల మీద ఉరేగించటం.. ప్రజల సమక్షంలోనే బాబా ప్రధాన అనుచరులు దాడి చేసి దండించటం లాంటివి చేసేవారు అని గుర్దాస్ తెలిపారు. ఆ శిక్షలకు భయపడే చాలా మంది మహిళల వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడేవారని ఆయన చెబుతున్నాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది స్వలింగ సంపర్కులుగా మారిపోయేవారంట. ఓ రోజు ప్రార్థన మందిరంలోనే ఇద్దరు వ్యక్తులు అసహజ శృంగారం చేస్తూ తన కంటపడ్డారని, ఇదే విషయాన్ని వ్యక్తిగతంగా తెలియజేస్తే గుర్మీత్ నవ్వి ఊరుకున్నాడని గుర్దాస్ చెప్పాడు. ఆ తర్వాత అలాంటి దృశ్యాలు పదుల సంఖ్యలో తాను చూడాల్సి వచ్చిందన్నాడు. ముఖ్యంగా కొత్తగా వచ్చేవారిపై ఇలాంటి దాడులు ఎక్కువగా జరిగేవని, ఎవరైనా ఎదురిస్తే వారిపై దాడి చేసి ఆశ్రమం నుంచి వెల్లగొట్టేవారని అన్నాడు. అదృష్టం బాగుండి తనపై అలాంటి దాడులు ఏనాడూ చోటు చేసుకోలేదని గుర్దాస్ తెలిపాడు. -
డేరా సోదాలు.. అప్ డేట్స్
సాక్షి, సిర్సా: భారీ భద్రత నడుమ సిర్సా సత్నాం చౌక్‌లోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆశ్రమంలో సోదాలు ముగిసేదాకా కర్ఫ్యూ కొనసాగుతుందని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. విశ్రాంత న్యాయమూర్తి ఏకేఎస్ పన్వార్ నేతృత్వంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వచ్చే వాదన నాటికి ఓ సీల్డ్ కవర్లో పూర్తి నివేదిక సమర్పించాలని పన్వార్‌ను ఛండీగఢ్ హైకోర్టు ఆదేశించింది. ఉదయం 10.45 నుంచి కీలక ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించిన భద్రతా దళాలు అనుమానిత వస్తువులన్నింటిని సీజ్ చేశారు. ఉదయం 11 గంటలకు... గుర్మీత్ నివాస స్థానంగా(గుఫా) చెప్పుకునే గుహాలోని సోదా టీమ్‌లు పెద్ద ఎత్తున్న ప్రవేశించాయి. రహస్య స్థలంగా పలువురు చెబుతున్న ఇందులోనే గుర్మీత్ అరాచకాలకు పాల్పడినట్లు పలువురు చెబుతున్నారు. డేరా బాబాతోపాటు అతనికి బాగా సానిహిత్యంగా ఉండేవాళ్లకు మాత్రమే ఇందులో ప్రవేశం ఉంటుందంట. 18 ఏళ్ల క్రితం ఇద్దరి మహిళలను ఇందులోనే అత్యాచారం చేశాడన్న ఆరోపణలు వినిపించాయి. అయితే డేరా ప్రతినిధులు మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ సోదాలు నిర్వహించుకోవాలంటూ ఆహ్వానించింది. ఉదయం 11.20... డిప్యూటీ డైరెక్టర సతీశ్ మెహ్రా డేరా పరిసర ప్రాంతాల్లో కొన్ని కంప్యూటర్లను, హర్డ్ డిస్క్‌లను , కొంత నగదును స్వాధీనపరుచుకున్నట్లు పకటించారు. అయితే వాటిలో ఎలాంటి సమాచారం ఉందన్న విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. కొన్ని గదులను సీజ్ చేసినట్లు తెలిపిన ఆయన రూకీ నుంచి ఫోరెన్సిక్ టీంలను పిలిపించినట్లు తెలిపారు. ఉదయం 11.30... ఓవైపు సోదాలు కొనసాగుతుండగానే అరెస్ట్‌ల పై పోలీస్ అధికారి ఒకరు ప్రకటన చేశారు. గుర్మీత్ అరెస్ట్ తర్వాత చెలరేగిన అల్లర్లలో బథిండా, పటియాలా జిల్లాల వ్యాప్తంగా 180 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆయా కేసులకు సంబంధించి 50 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. ఉదయం 11:40... నామ్చర్చ ఘర్లోకి అధికారులు ప్రవేశించి తనీఖీలు నిర్వహించారు. గతంలో వీటిల్లోనే కొన్ని అనుమానిత వస్తువులను అధికారులు స్వాధీనపరుచుకున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ప్రకటించారు. ఉదయం 12... డేరాలోకి అనేక ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. అందులోకి అన్ని వైపులా భద్రతా దళాలు లోపలికి ప్రవేశించాయి. ప్రతీ 100 మీటర్లకు ఓ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. అవసరమైతే తప్ప ప్రజలను లోపలికి అనుమతించటం లేదు. ముఖ్యంగా వాహానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి పంపుతున్నారు. వీటిలోపాటు డేరాకు చెందిన పరిశ్రమల వద్ద భారీగా సెక్యూరిటీ మోహరించారు. మధ్యాహ్నాం 12.30... హోంసెక్సువల్స్ను వ్యాధిగా పేర్కుంటూ చికిత్స పేరుతో వారిని ఉంచే స్థలంలో సోదాలు చేస్తున్నారు. అయితే తన భక్తులుగా చేరే వారిని వ్యంధ్యత్వం ప్రసాదించే డేరా బాబా ఇలా హోమోసెక్సువల్స్‌ను అక్కున్న చేర్చుకోవటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నాం 1 గంట... మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్‌లను సెప్టెంబర్ 10 అర్థరాత్రి 12 గంటల దాకా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క వాయల్స్ కాల్స్‌ను మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నాం 1.30 నిమిషాలకు.. డేరాలో బయటపడ్డ గుర్మీత్ ప్లాస్టిక్ కరెన్సీ(కాయిన్లను) మీడియాకు అధికారులు చూపించారు. ప్రస్తుతం తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 2.05 నిమిషాలకు... లేబుల్ లేని మందులు, ఓబీ వ్యాన్, నంబర్ ప్లేట్ లేని ఓ లెక్సస్ కారును బయటపడినట్లు డిప్యూటీ డైరెక్టర్ సతీశ్ మెహ్రా తెలిపారు. -
గుర్మీత్ డేరాలు: షాకింగ్ నిజాలు!
-
డేరా సచ్ఛా సౌదాలో సెర్చ్ ఆపరేషన్
-
గుర్మీత్ డేరాలు: షాకింగ్ నిజాలు!
సాక్షి, సిర్సా: అత్యాచారాల కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నిర్వహిస్తున్న డేరా ఆశ్రమాలకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. సిర్సాలోని డేరాలో అస్తి పంజరాలు వెలుగుచూడటం వివాదాస్పదం కాగా, దానిపై డేరా అధికార ప్రతినిధి విపాసన ఇన్సాన్ స్పందించారు. తాము గుర్మీత్ ఏర్పాటు చేసిన నియమాలను ఎప్పుడూ ఉల్లంఘించలేదని, అందులో భాగంగానే కొందరు నేరుగా ఇక్కడికి వచ్చి తమ మరణానంతరం ఇక్కడే పూడ్చిపెట్టాలని స్వచ్ఛందంగా కోరినట్లు డేరా మీడియా సచ్ కహూన్ కూడా బహిర్గతం చేసింది. డేరా ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలను ప్రశ్నిస్తే గుర్మీత్ అనుచరులైనా సరే వారిని హ్యతచేసయినా, లేక సజీవంగానైనా 600 ఎకరాలు, 100 ఎకరాలకు పైగా ఉన్న ఏదైనా ఓ డేరాలో పాతిపెట్టేవారని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. గుర్మీత్ అనుచరులకు ఎదురుచెబితే ఎవరికైనా ఇక్కడ ఇలాంటి గతే పడుతుందన్న భయంతో నోరు మెదిపేవాళ్లం కాదని చెబుతున్నారు. ఛండీగఢ్ హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని సోదాలకు ఆదేశించిన నేపథ్యంలో విపాసన మాట్లాడుతూ.. చట్టాలను డేరా ఎప్పుడూ అతిక్రమించలేదని, గుర్మీత్ అనుచరులు, మద్ధతుదారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని సూచించారు. కొందరు వ్యక్తులు తమ కుటుంబసభ్యుల అస్థికలు తమకివ్వగా డేరాలో పూడ్చిపెట్టి, నదులు, పర్యావరణం కలుషితం కాకుండా చూసేవాళ్లమని చెప్పారు. డేరా సోదాలకు తమకు ఎలాంటి అభ్యంతర లేదని అధికార ప్రతినిధి విపాసన చెప్పగా.. మరోవైపు గురువారం రాత్రి సిర్సాకు చేరుకున్న పారా మిలిటరీ, ఆర్మీ బృందం, నాలుగు జిల్లాల పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి గుర్మీత్ నిర్వహిస్తున్న డేరాలను అణువణువు గాలిస్తున్నారు. ఈ తనిఖీల నేపథ్యంలో సిర్సాలో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు. అత్యాచారాల కేసులో దోషిగా తేలిన గుర్మీత్ కు కోర్టు 20 ఏళ్ల (ఒక్కో కేసులో పదేళ్లు) జైలు విధించిన విషయం తెలిసిందే. -
డేరా సచ్ఛా సౌదాలో సెర్చ్ ఆపరేషన్
సాక్షి, సిర్సా: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తుండగా, అతని అక్రమాలకు సంబంధించి రోజుకు కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిందంటూ ఓ పిటిషన్ దాఖలు కావటంతో ఛండీగఢ్ హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని సోదాలకు ఆదేశించింది. దీంతో శుక్రవారం సిర్సాలోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో భద్రతా దళాలు సోదాలు చేపడుతున్నాయి. ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలుకాగా సుమారు 41 పారామిలిటరీ కంపెనీలు, నాలుగు ఆర్మీ దళాలు, నాలుగు జిల్లాల పోలీసులు, ఒక స్వాట్ టీం, ఒక డాగ స్క్వాడ్ పాల్గొంటున్నాయి. ఉన్నతాధికారులు నేతృత్వంలో ఓవైపు డేరాను మొత్తం జల్లెడ పడుతున్నారు. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కర్ఫ్యూ కొనసాగుతుండగా.. నేటి సోదాలతో చుట్టుపక్కల జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డేరా అనుచరులు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అస్తి పంజరాలు బయటపడ్డాయన్న విషయాన్ని డేరా వర్గాలు కూడా ధృవీకరించటంతో ఎలాంటి విషయాలు బయటపడతాయోనని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఇంతకీ గుర్మీత్ భార్య, పిల్లలు ఏమయ్యారు?
సాక్షి, న్యూఢిల్లీ : గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలు పాలు కావటంతో డేరా సచ్ఛా సౌదా కొత్త చీఫ్‌గా ఎవరన్న ప్రశ్న మొదలయ్యింది. ఈ రేసులో రాక్ స్టార్ కుటుంబ సభ్యుల పేర్లు కాకుండా అనూహ్యంగా దత్త పుత్రిక హనీప్రీత్ తో పాటుగా డేరా చైర్పర్సన్ విపాసన పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో గుర్మిత్ భార్య, పిల్లలు ఎక్కడనున్నారు? ఇంత జరుగుతున్నా వాళ్లు ఎందుకు స్పందించటం లేదు? అన్న ఆరాలు మొదలయ్యాయి. గుర్మీత్ భార్య ఎవరు? గుర్మీత్ తన పదో తగరగతి పూర్తి చేసుకోగానే హర్జీత్ కౌర్ అనే ఆమెను వివాహం చేసుకున్నారు. వీరికి అమర్‌ప్రీత్, చరణ్‌ప్రీత్ ఇద్దరు కూతుళ్లు, కుమారుడు జస్మిత్ సింగ్ ఉన్నారు. ఈ ముగ్గురి పిల్లలు కాకుండా ప్రియాంక తనేజా(హనీ ప్రీత్)ను గుర్మీత్ దత్తత తీసుకున్నారు. సొంత పిల్లల కన్నా హనీప్రీత్తోనే ఆయన ఎక్కువ సానిహిత్యంగా ఉండేవారంట. ఇక ఆయన పిల్లల సంగతి ఏమోగానీ భార్య మాత్రం తరచూ డేరాలో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేదని పలువురు చెబుతుండగా, మరికొందరు మాత్రం అలాంటిదేం లేదని అంటున్నారు. డేరాలో గుర్మీత్‌కు చాలా దగ్గరగా ఉండి సపర్యలు చేసినవాళ్లు కూడా గత ఐదేళ్లలో ఆమెను చూసింది లేదనే అంటున్నారు. డేరా కాంప్లెక్స్ లోనే ఎక్కువ సమయం గడిపే హర్జీత్ సాదాసీదా దుస్తులు ధరించి, మిగతా భక్తులతో కలిసిపోయి కూర్చుని ధ్యానంలో పాల్గొనేదంట. అయితే డేరా కార్యకలాపాల్లో ఆమె ఎలాంటి భూమిక పోషించిందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందుకే హర్జీత్ కౌర్.. డేరా బాబా భార్య అని ఎవరూ గుర్తించేవారు కాదని కూడా చెప్పుకుంటున్నారు. మరోవైపు గుర్మిత్పై ఆరోపణలు వచ్చిన సమయంలోనూ హర్జీత్ స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు కేసులో దోషిగా తేలటం, ఆపై శిక్ష ఖరారుల నేపథ్యంలో కూడా హర్జీత్, ఆమె పిల్లలు కనిపించలేదు. చివరకు జైలుకు తరలించే సమయంలోనూ హనీప్రీత్ గుర్మీత్‌కు వెంట ఉంది. ఈ తరుణంలో వాళ్ల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారింది. సెలబ్రిటీ హోదాకు దూరంగా ఉండాలనే అలా చేస్తున్నారా? గుర్మీత్ వ్యవహారాలు తెలిసే ఆయనను..కుటుంబీకులు దూరం పెట్టారా? హనీప్రీత్‌కు అంత ప్రాధాన్యం ఇవ్వటం నచ్చకే ఇలా చేస్తున్నారా? ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు చర్చించుకుంటున్నారు. -
పంజాబ్‌లో 'ఎంఎస్‌జి' సినిమాపై నిషేధం
డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ప్రధాన పాత్రధారిగా వచ్చిన వివాదాస్పద చిత్రం 'ఎంఎస్‌జీ - ద మెసెంజెర్ ఆఫ్ గాడ్' సినిమాను పంజాబ్ ప్రభుత్వం నిషేధించింది. ఈ సినిమాను రాష్ట్రంలో ఎక్కడా ప్రదర్శించకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సినిమా ప్రదర్శిస్తే రాష్ట్రంలో ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.