డేరా సోదాలు.. అప్ డేట్స్
డేరా సోదాలు.. అప్ డేట్స్
Published Fri, Sep 8 2017 2:11 PM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM
సాక్షి, సిర్సా: భారీ భద్రత నడుమ సిర్సా సత్నాం చౌక్‌లోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆశ్రమంలో సోదాలు ముగిసేదాకా కర్ఫ్యూ కొనసాగుతుందని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. విశ్రాంత న్యాయమూర్తి ఏకేఎస్ పన్వార్ నేతృత్వంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
వచ్చే వాదన నాటికి ఓ సీల్డ్ కవర్‌లో పూర్తి నివేదిక సమర్పించాలని పన్వార్‌ను ఛండీగఢ్ హైకోర్టు ఆదేశించింది. ఉదయం 10.45 నుంచి కీలక ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించిన భద్రతా దళాలు అనుమానిత వస్తువులన్నింటిని సీజ్ చేశారు.
ఉదయం 11 గంటలకు... గుర్మీత్ నివాస స్థానంగా(గుఫా) చెప్పుకునే గుహాలోని సోదా టీమ్‌లు పెద్ద ఎత్తున్న ప్రవేశించాయి. రహస్య స్థలంగా పలువురు చెబుతున్న ఇందులోనే గుర్మీత్ అరాచకాలకు పాల్పడినట్లు పలువురు చెబుతున్నారు. డేరా బాబాతోపాటు అతనికి బాగా సానిహిత్యంగా ఉండేవాళ్లకు మాత్రమే ఇందులో ప్రవేశం ఉంటుందంట. 18 ఏళ్ల క్రితం ఇద్దరి మహిళలను ఇందులోనే అత్యాచారం చేశాడన్న ఆరోపణలు వినిపించాయి. అయితే డేరా ప్రతినిధులు మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ సోదాలు నిర్వహించుకోవాలంటూ ఆహ్వానించింది.
ఉదయం 11.20... డిప్యూటీ డైరెక్టర సతీశ్ మెహ్రా డేరా పరిసర ప్రాంతాల్లో కొన్ని కంప్యూటర్లను, హర్డ్ డిస్క్‌లను , కొంత నగదును స్వాధీనపరుచుకున్నట్లు పకటించారు. అయితే వాటిలో ఎలాంటి సమాచారం ఉందన్న విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. కొన్ని గదులను సీజ్ చేసినట్లు తెలిపిన ఆయన రూకీ నుంచి ఫోరెన్సిక్ టీంలను పిలిపించినట్లు తెలిపారు.
ఉదయం 11.30... ఓవైపు సోదాలు కొనసాగుతుండగానే అరెస్ట్‌ల పై పోలీస్ అధికారి ఒకరు ప్రకటన చేశారు. గుర్మీత్ అరెస్ట్ తర్వాత చెలరేగిన అల్లర్లలో బథిండా, పటియాలా జిల్లాల వ్యాప్తంగా 180 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆయా కేసులకు సంబంధించి 50 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం.
ఉదయం 11:40... నామ్‌చర్చ ఘర్‌లోకి అధికారులు ప్రవేశించి తనీఖీలు నిర్వహించారు. గతంలో వీటిల్లోనే కొన్ని అనుమానిత వస్తువులను అధికారులు స్వాధీనపరుచుకున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ప్రకటించారు.
ఉదయం 12... డేరాలోకి అనేక ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. అందులోకి అన్ని వైపులా భద్రతా దళాలు లోపలికి ప్రవేశించాయి. ప్రతీ 100 మీటర్లకు ఓ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. అవసరమైతే తప్ప ప్రజలను లోపలికి అనుమతించటం లేదు. ముఖ్యంగా వాహానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి పంపుతున్నారు. వీటిలోపాటు డేరాకు చెందిన పరిశ్రమల వద్ద భారీగా సెక్యూరిటీ మోహరించారు.
మధ్యాహ్నాం 12.30... హోంసెక్సువల్స్‌ను వ్యాధిగా పేర్కుంటూ చికిత్స పేరుతో వారిని ఉంచే స్థలంలో సోదాలు చేస్తున్నారు. అయితే తన భక్తులుగా చేరే వారిని వ్యంధ్యత్వం ప్రసాదించే డేరా బాబా ఇలా హోమోసెక్సువల్స్‌ను అక్కున్న చేర్చుకోవటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మధ్యాహ్నాం 1 గంట... మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్‌లను సెప్టెంబర్ 10 అర్థరాత్రి 12 గంటల దాకా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క వాయల్స్ కాల్స్‌ను మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.
మధ్యాహ్నాం 1.30 నిమిషాలకు.. డేరాలో బయటపడ్డ గుర్మీత్ ప్లాస్టిక్ కరెన్సీ(కాయిన్లను) మీడియాకు అధికారులు చూపించారు. ప్రస్తుతం తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
2.05 నిమిషాలకు... లేబుల్ లేని మందులు, ఓబీ వ్యాన్, నంబర్ ప్లేట్ లేని ఓ లెక్సస్ కారును బయటపడినట్లు డిప్యూటీ డైరెక్టర్ సతీశ్ మెహ్రా తెలిపారు.
Advertisement