
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస చైన్ స్నాచింగ్‌లపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన భవేరియా గ్యాంగ్ ఈ దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
మరోవైపు, భవేరియా గ్యాంగ్ బెంగళూరులో చోరి చేసి వారు హైదరాబాద్‌కు వచ్చి దొంగతనాలకు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక, వీరిని పట్టుకునేందుకు 30 టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు రాచకొండ, హైదరాబాద్ పోలీసులు తెలిపారు. కాగా, భవేరియా గ్యాంగ్ సభ్యులు బృందాలుగా ఏర్పడి చోరీలు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, హైదరాబాద్‌లో చోరిల అనంతరం.. భవేరియా గ్యాంగ్ రైలు మార్గంలో ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment