Internet Close
-
చక్కా జామ్ ప్రశాంతం
న్యూఢిల్లీ/చండీగఢ్/ఘజియాబాద్: కొత్త వ్యవసా య చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో రైతు సంఘాలు చేపట్టిన చక్కాజామ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. రైతుల నిరసనలకు మొదట్నుంచీ ముందు నిలుస్తున్న పంజాబ్, హరియాణా, రాజస్తాన్ రాష్ట్రాల్లో మూడు గంటలపాటు రోడ్ల దిగ్బంధనం పూర్తిస్థాయిలో జరిగింది. చాలా రాష్ట్రాల్లో అక్కడక్కడా రైతు సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఢిల్లీని చక్కాజామ్ నుంచి రైతు సంఘాలు మినహాయింపు ఇచ్చినప్పటికీ భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద ఇంటర్నెట్ సేవలను హోంశాఖ బంద్ చేసింది. ఢిల్లీలో మెట్రో రైలు స్టేషన్లను పాక్షికంగా మూసివేశారు. అక్టోబర్ 2వ తేదీ వరకు నిరసనలు కొనసాగిస్తామని, సాగు చట్టాల రద్దు డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. చట్టాల రద్దు కోరుతూ రైతు సంఘాల ఉమ్మడి వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు చక్కా జామ్ చేపట్టాలని పిలుపునిచ్చింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మినహా మిగతా రాష్ట్రాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బాంధించాలని కోరింది. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద శనివారం యథావిథిగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. చక్కాజామ్‌కు మద్దతు తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపై ఢిల్లీలోని షహీదీ పార్కు వద్ద 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరియాణాలోని కుండ్లి– మనేసర్–పల్వాల్(కేఎంపీ) ఎక్స్‌ప్రెస్ హైవేపైకి వేలాదిగా రైతులు చేరుకున్నారు. రహదారిపై వాహనాలను అడ్డుగా ఉంచారు. పంజాబ్, రాజస్తాన్, హరియాణాల్లో రైతులు తమ ట్రాక్టర్–ట్రైలర్లను జాతీయరహదారులపై అడ్డుగా ఉంచారు. జాతీయ జెండాలను తమ ట్రాక్టర్లపై ఎగురవేశారు. చక్కాజామ్‌కు మద్దతుగా ఇతర రాష్ట్రాల్లో కూడా వివిధ సంఘాలు, పార్టీలు రాస్తారోకోలు చేపట్టాయి. రహదారులపై బైఠాయించిన రైతులను పెద్ద సంఖ్యలో పోలీసులు కొద్దిసేపు నిర్బంధించారు. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో రైతు సంఘాలు రోడ్లపై బైఠాయించాయి. మహారాష్ట్రలోని కరాడ్, కొల్హాపూర్ నగరాల్లో రాస్తారోకోలు జరిగాయి. కరాడ్‌లో రోడ్డుపైకి చేరుకున్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ సతీమణి సత్యశీల ఉన్నారు. కొల్హాపూర్‌లో స్వాభిమాన్ షేత్కారీ సంఘటన్ నేత రాజు శెట్టిని కొద్దిసేపు పోలీసులు నిర్బంధించారు. కర్ణాటకలో కొన్ని కన్నడ సంఘాలు, వివిధ రైతు సంఘాలు చాలా ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాయి. తమిళనాడులో చెన్నైతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఇంటర్నెట్ సేవలు బంద్ చక్కా జామ్ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నిరసన కేంద్రాలైన సింఘు, సిక్రీ, ఘాజీపూర్‌ల వద్ద ఇంటర్నెట్ సేవలను కేంద్ర హోం శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ మూడింటితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నెట్ సేవలు శనివారం అర్ధరాత్రి వరకు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఇక్కడ జనవరి 29వ తేదీ నుంచే ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం బంద్ చేయించిన విషయం తెలిసిందే. జనవరి 26వ తేదీన ట్రాక్టర్ ర్యాలీ సమయంలో అల్లర్లు జరగడంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఢిల్లీలో భారీ భద్రత చక్కాజామ్ నిరసన నుంచి మినహాయించినప్పటికీ గణతంత్ర దినోత్సవం నాటి అనుభవాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ, రిజర్వు బలగాలను కలిపి దాదాపు 50 వేల మందిని మోహరించారు. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలపై నిఘా కోసం డ్రోన్ కెమెరాలను వినియోగించారు. మండీ హౌస్, ఎస్టీవో, ఢిల్లీ గేట్ సహా ఢిల్లీలోని 10 మెట్రో రైల్వే స్టేషన్లను మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు పాక్షికంగా మూసివేశారు. ఎర్రకోట, ఐటీవో వంటి ముఖ్య కూడళ్ల వద్ద భద్రతాబ లగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. పోలీసు యంత్రాంగం, అధికారులకు వ్యతిరేకంగా వ్యాపించే పుకార్లను అడ్డుకునేం దుకు సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచారు. సరిహద్దులతోపాటు అదనంగా ఏర్పాటు చేసిన పికెట్ల వద్ద పోలీసులు వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేశారు. గాంధీ జయంతి వరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు గాంధీ జయంతి(అక్టోబర్ 2) వరకు కొనసాగుతాయని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. చట్టాల రద్దు విషయంలో రాజీ పడేది లేదన్నారు. పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర లభించేలా చట్టం అమల్లోకి వచ్చాకే రైతులు ఇళ్లకు వెళతారని పేర్కొన్నారు. ‘ఈ విషయంలో భ్రమలు వద్దు. వేదికలు మారవు, నిరసనలు ఆగవు. వాళ్లు(ప్రభుత్వం) ఇనుప మేకులు నాటుతారు. మనం పంటలను విత్తుదాం’ అని తెలిపారు. ‘రైతులం మేమే, సైనికులమూ మేమే’ తమ ఉద్యమ నినాదమన్నారు. ‘రైతులు తమ పొలాల నుంచి పిడికెడు మట్టిని తీసుకువచ్చి, నిరసన కేంద్రాల వద్ద ఉన్న పోరాట మట్టిని వెంట తీసుకెళ్లాలి. ఈ మట్టితో మీ భూమిలో పోరాటాన్ని వ్యాపింపజేయండి. వ్యాపారులెవరూ మీ భూములను కబ్జా చేయాలని చూడరు’ అని పేర్కొన్నారు. ‘ఈ చట్టాలను ఇప్పుడు కాకుంటే. మరెప్పుడూ రద్దు చేయరు. దేశంలోని రైతులు తమ ఉత్పత్తులకు సగం ధరే పొందుతున్నారు. ఎంఎస్పీని పంజాబ్, హరియాణాల్లో మాత్రమే ఇస్తున్నారు. ఒక్క రాష్ట్రానికే ఈ పోరాటం పరిమితం అయిందంటూ వాళ్లు(ప్రభుత్వం) మనల్ని విభజించటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, మనది దేశవ్యాప్త పోరాటం’ అని తెలిపారు. ఉపాధి చూపే భూములను రైతులు కాంట్రాక్టు ఫార్మింగ్‌కు ఇవ్వవద్దని కోరారు. దేశంలోని రైతులంతా తమకు మద్దతుగా నిలిచారన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న రైతులకు నోటీసులిచ్చిన పోలీస్స్టేషన్ల ఎదుట కూడా రైతులు ఆందోళనలు చేపడతారని తికాయత్ అన్నారు. ‘ఒకప్పుడు అయోధ్యలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వేలాదిగామందికి నోటీసులు ఇవ్వలేదు. అక్కడి గుంపును ఎందుకు ఆపలేకపోయారు? అని ప్రశ్నించారు. రైతుల నుంచి భూములను ఎవరూ లాక్కోలేరని చెప్పారు. అందుకుగాను, రైతులు, సైనికులు ముందుకు రావాలన్నారు. ఘాజీపూర్ వద్ద బారికేడ్ల అవతల ఉన్న భద్రతా సిబ్బందికి చేతులో జోడిస్తూ ఆయన..‘మీ అందరికీనా వందనాలు. రైతుల పంట పొలాలను కాపాడాల్సింది మీరే’ అని తికాయత్ కోరారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద జవాన్లకు నమస్కరిస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్ -
‘పౌరసత్వం’పై మంటలు
గువాహటి/కోల్‌కతా: సవరించిన పౌరసత్వ చట్టంపై అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం బెంగాల్లో ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌కు, బస్సులకు నిప్పుపెట్టారు. అస్సాంలోని సోనిపట్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఆయిల్ ట్యాంకర్‌కు నిప్పుపెట్టడంతో అందులోని డ్రైవర్ మృతి చెందాడు. పౌరసత్వ చట్ట సవరణను రద్దు చేయాలంటూ ఈనెల 18వ తేదీన విధులు బహిష్కరించనున్నట్లు అస్సాం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. పౌరసత్వ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమంటూ దీనికి నిరసనగా ఈ నెల 21వ తేదీన బిహార్ బంద్ పాటించాలని ఆర్జేడీ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆందోళనల నేపథ్యంలో జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ఈనెల 16 నుంచి జనవరి 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. పలు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇలా ఉండగా, అస్సాంలోని డిబ్రూగఢ్, గువాహటిలతోపాటు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో అధికారులు శనివారం కర్ఫ్యూను సడలించారు. వదంతులు వ్యాపించకుండా అస్సాంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించారు. మంటల్లో రైల్వే స్టేషన్, బస్సులు బెంగాల్లో రెండో రోజూ ఉద్రిక్తతలు కొనసాగాయి. ముర్షీదాబాద్, ఉత్తర 24 పరగణాల జిల్లాలు, హౌరా గ్రామీణ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌కు, బస్సులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. హౌరా– ముంబై, ఢిల్లీ–కోల్‌కతా హైవేపై రెచ్చిపోయిన ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన 15 బస్సులకు నిప్పుపెట్టడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బగ్నాన్లో 20 దుకాణాలు లూటీకి గురయ్యాయి. వందలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు శనివారం మధ్యాహ్నం సంక్రాయిల్ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌కు నిప్పుపెట్టారు. పట్టాలపై బైఠాయించడంతో సెల్డా–హస్నాబాద్, షొండాలియా–కాక్రా మిర్జాపూర్, హౌరా–ఖరగ్‌పూర్ సెక్షన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. అస్సాంలో మరొకరు మృతి అస్సాంలో శనివారం వివిధ సంఘాలు, సంస్థల ఆందోళనల కారణంగా రైళ్ల రాకపోకలు, రవాణా వ్యవస్థ స్తంభించాయి. విద్యాసంస్థలు, కార్యాలయాలు పనిచేయలేదు. సోనిపట్ జిల్లా ధెకియాజులి వద్ద శుక్రవారం రాత్రి ఖాళీ ఆయిల్ ట్యాంకర్‌కు ప్రజలు నిప్పుపెట్టడంతో అందులోని ట్యాంకర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం ఉదయం అతడు ఆస్పత్రిలో కన్నుమూశాడని పోలీసులు తెలిపారు. గురువారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో రాష్ట్రంలో ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. కామాఖ్య రైల్వే స్టేషన్‌కు దిగ్బంధించడంతో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి గువాహటి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజులపాటు సత్యాగ్రహం పాటించాలని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఆందోళనలకు మద్దతుగా ఈనెల 18వ తేదీన విధులు బహిష్కరించనున్నట్లు అస్సాం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఎస్ఏకేపీ) అధ్యక్షుడు వాసవ్ కలిటా వెల్లడించారు. 16వ తేదీ నుంచి జరిగే సత్యాగ్రహ నిరసనలకు కూడా ఆయన మద్దతు ప్రకటించారు. తమ పౌరులకు అమెరికా, బ్రిటన్ హెచ్చరిక వాషింగ్టన్/లండన్: ఇంటర్నెట్ సేవలపై నిషేధం.. రవాణా వ్యవస్థకు అంతరాయం.. కొనసాగుతున్న ఆందోళనలు.. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అమెరికా, బ్రిటన్‌తోపాటు కెనడా, సింగపూర్, ఇజ్రాయెల్ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఆందోళనలకు కేంద్ర బిందువుగా ఉన్న అస్సాంలో అధికార పర్యటనలను అమెరికా తాత్కాలికంగా రద్దు చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న తమ పౌరులకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పలు సూచనలు చేసింది. ఆందోళనలు, అస్థిర పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు వెళ్లవద్దని, సాధ్యమైనంత వరకు జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో సంచరించవద్దని, చుట్టుపక్కల జరిగే పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లరాదని బ్రిటన్, కెనడా, ఇజ్రాయెల్ తమ దేశస్తులను హెచ్చరించాయి. -
డేరా సోదాలు.. అప్ డేట్స్
సాక్షి, సిర్సా: భారీ భద్రత నడుమ సిర్సా సత్నాం చౌక్‌లోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆశ్రమంలో సోదాలు ముగిసేదాకా కర్ఫ్యూ కొనసాగుతుందని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. విశ్రాంత న్యాయమూర్తి ఏకేఎస్ పన్వార్ నేతృత్వంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వచ్చే వాదన నాటికి ఓ సీల్డ్ కవర్లో పూర్తి నివేదిక సమర్పించాలని పన్వార్‌ను ఛండీగఢ్ హైకోర్టు ఆదేశించింది. ఉదయం 10.45 నుంచి కీలక ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించిన భద్రతా దళాలు అనుమానిత వస్తువులన్నింటిని సీజ్ చేశారు. ఉదయం 11 గంటలకు... గుర్మీత్ నివాస స్థానంగా(గుఫా) చెప్పుకునే గుహాలోని సోదా టీమ్‌లు పెద్ద ఎత్తున్న ప్రవేశించాయి. రహస్య స్థలంగా పలువురు చెబుతున్న ఇందులోనే గుర్మీత్ అరాచకాలకు పాల్పడినట్లు పలువురు చెబుతున్నారు. డేరా బాబాతోపాటు అతనికి బాగా సానిహిత్యంగా ఉండేవాళ్లకు మాత్రమే ఇందులో ప్రవేశం ఉంటుందంట. 18 ఏళ్ల క్రితం ఇద్దరి మహిళలను ఇందులోనే అత్యాచారం చేశాడన్న ఆరోపణలు వినిపించాయి. అయితే డేరా ప్రతినిధులు మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ సోదాలు నిర్వహించుకోవాలంటూ ఆహ్వానించింది. ఉదయం 11.20... డిప్యూటీ డైరెక్టర సతీశ్ మెహ్రా డేరా పరిసర ప్రాంతాల్లో కొన్ని కంప్యూటర్లను, హర్డ్ డిస్క్‌లను , కొంత నగదును స్వాధీనపరుచుకున్నట్లు పకటించారు. అయితే వాటిలో ఎలాంటి సమాచారం ఉందన్న విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. కొన్ని గదులను సీజ్ చేసినట్లు తెలిపిన ఆయన రూకీ నుంచి ఫోరెన్సిక్ టీంలను పిలిపించినట్లు తెలిపారు. ఉదయం 11.30... ఓవైపు సోదాలు కొనసాగుతుండగానే అరెస్ట్‌ల పై పోలీస్ అధికారి ఒకరు ప్రకటన చేశారు. గుర్మీత్ అరెస్ట్ తర్వాత చెలరేగిన అల్లర్లలో బథిండా, పటియాలా జిల్లాల వ్యాప్తంగా 180 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆయా కేసులకు సంబంధించి 50 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. ఉదయం 11:40... నామ్చర్చ ఘర్లోకి అధికారులు ప్రవేశించి తనీఖీలు నిర్వహించారు. గతంలో వీటిల్లోనే కొన్ని అనుమానిత వస్తువులను అధికారులు స్వాధీనపరుచుకున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ప్రకటించారు. ఉదయం 12... డేరాలోకి అనేక ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. అందులోకి అన్ని వైపులా భద్రతా దళాలు లోపలికి ప్రవేశించాయి. ప్రతీ 100 మీటర్లకు ఓ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. అవసరమైతే తప్ప ప్రజలను లోపలికి అనుమతించటం లేదు. ముఖ్యంగా వాహానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి పంపుతున్నారు. వీటిలోపాటు డేరాకు చెందిన పరిశ్రమల వద్ద భారీగా సెక్యూరిటీ మోహరించారు. మధ్యాహ్నాం 12.30... హోంసెక్సువల్స్ను వ్యాధిగా పేర్కుంటూ చికిత్స పేరుతో వారిని ఉంచే స్థలంలో సోదాలు చేస్తున్నారు. అయితే తన భక్తులుగా చేరే వారిని వ్యంధ్యత్వం ప్రసాదించే డేరా బాబా ఇలా హోమోసెక్సువల్స్‌ను అక్కున్న చేర్చుకోవటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నాం 1 గంట... మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్‌లను సెప్టెంబర్ 10 అర్థరాత్రి 12 గంటల దాకా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క వాయల్స్ కాల్స్‌ను మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నాం 1.30 నిమిషాలకు.. డేరాలో బయటపడ్డ గుర్మీత్ ప్లాస్టిక్ కరెన్సీ(కాయిన్లను) మీడియాకు అధికారులు చూపించారు. ప్రస్తుతం తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 2.05 నిమిషాలకు... లేబుల్ లేని మందులు, ఓబీ వ్యాన్, నంబర్ ప్లేట్ లేని ఓ లెక్సస్ కారును బయటపడినట్లు డిప్యూటీ డైరెక్టర్ సతీశ్ మెహ్రా తెలిపారు.