గుర్మీత్ డేరాలో హోమో సెక్సువల్స్
గుర్మీత్ డేరాలో హోమో సెక్సువల్స్
Published Fri, Sep 22 2017 9:44 AM | Last Updated on Fri, Sep 22 2017 12:44 PM
సాక్షి, సిర్సా : డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెద్ద కామపిశాచి అన్న విషయాన్ని మాజీ అనుచరులు స్వయంగా చెబుతుండటం చూస్తున్నాం. అయితే ఆశ్రమంలోని మహిళలను మాత్రమే చేరదీసే గుర్మీత్.. అనుచరుల విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించేవాడంట. వారి వారి భార్యలను సోదరీమణులుగా భావించాలని తరచూ అనుచరులకు ప్రభోదించేవాడంట. దీంతో వారిలో చాలా మట్టుకు స్వలింగ సంపర్కులుగా మారిపోయేవారని చెబుతున్నారు.
సిర్సా ప్రధానాశ్రమంలో ఆరేళ్లు గడిపిన గుర్‌దాస్ సింగ్ తూర్ అక్కడి దారుణాలను వివరిస్తున్నాడు. ‘ఆశ్రమంలో మగవాళ్లకు కఠిన నియమాలు ఉండేవి. గుర్మీత్ మహిళా భక్తుల(సాధ్వీలు)తో ఎవరూ మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే శిక్షలు కఠినంగా ఉండేవి. గాడిదల మీద ఉరేగించటం.. ప్రజల సమక్షంలోనే బాబా ప్రధాన అనుచరులు దాడి చేసి దండించటం లాంటివి చేసేవారు అని గుర్‌దాస్ తెలిపారు. ఆ శిక్షలకు భయపడే చాలా మంది మహిళల వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడేవారని ఆయన చెబుతున్నాడు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది స్వలింగ సంపర్కులుగా మారిపోయేవారంట. ఓ రోజు ప్రార్థన మందిరంలోనే ఇద్దరు వ్యక్తులు అసహజ శృంగారం చేస్తూ తన కంటపడ్డారని, ఇదే విషయాన్ని వ్యక్తిగతంగా తెలియజేస్తే గుర్మీత్ నవ్వి ఊరుకున్నాడని గుర్‌దాస్ చెప్పాడు. ఆ తర్వాత అలాంటి దృశ్యాలు పదుల సంఖ్యలో తాను చూడాల్సి వచ్చిందన్నాడు. ముఖ్యంగా కొత్తగా వచ్చేవారిపై ఇలాంటి దాడులు ఎక్కువగా జరిగేవని, ఎవరైనా ఎదురిస్తే వారిపై దాడి చేసి ఆశ్రమం నుంచి వెల్లగొట్టేవారని అన్నాడు. అదృష్టం బాగుండి తనపై అలాంటి దాడులు ఏనాడూ చోటు చేసుకోలేదని గుర్‌దాస్ తెలిపాడు.
Advertisement
Advertisement