Homosexual
-
స్వలింగ సంపర్కుడి ఇంట్లో మనిషి ఎముకలు!
తమిళనాడు: తంజావూరు సమీపంలో అరెస్టయిన స్వలింగ సంపర్కుడి ఇంటి ఆవరణలో తవ్వగా ఎముకలు బయటపడ్డాయి. వివరాలు.. తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని చోళపురానికి చెందిన నకిలీ సిద్ధ వైద్యుడు కేశవ మూర్తి(47). గతేడాది 3వ తేదీన మందు కోసం వచ్చిన అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్ అశోక్‌రాజ్(27)కు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి, అతడిని హత్య చేసి మృతదేహాన్ని ఇంటి వెనుక పూడ్చిపెట్టాడు. దీంతో పోలీసులు కేశవమూర్తిని అరెస్టు చేసి, జరిపిన విచారణలో అశోక్‌రాజ్‌ను హత్య చేసి ముక్కలుగా నరికి ఇంట్లోనే మసాలా వేసి కాలేయాన్ని వండి తిన్నట్టు తెలిపాడు. అలాగే నవంబర్ 27, 2021, 30వ తేదీన అదే ప్రాంతానికి చెందిన తప్పిపోయిన ఆటో డ్రైవర్ మహ్మద్ అనస్ (26)ని కూడా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా చేసి ఇంటి పెరట్లో పూడ్చిపెట్టాడు. కొన్ని భాగాలను వండుకుని తిన్నట్టు తెలిపాడు. ఈ ఘటనలో మహ్మద్ అనాస్ మృతదేహాన్ని పోలీసులు ఇంకా వెలికితీయకపోగా.. ఇతడిని కూడా కేశవ మూర్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు సందేహించారు. ఈ కేసులో చోళపురంలో ఉన్న సిద్ధ వైద్యుడు కేశవమూర్తి ఇంటిలో, వేలిముద్రల నిపుణులు ఏడీఎస్పీ హేమ, సహాయ సహాయకుడు రామచంద్రన్ (27) సమక్షంలో తిరువిడైందూరు డీఎస్పీ జబర్ సిద్ధిక్ నేతృత్వంలో కేశవ మూర్తి ఇంట్లో విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి పోలీసు జాగిలాలు సోదాలు చేశాయి. ప్రొక్లైన్ సాయంతో ఇంటిపక్కన చెట్లు, ఇంటిముందు పచ్చిమిర్చి మొక్క. అరటి చెట్లను నరికి తొలగించారు. వరుసగా 2 చోట్ల 3 అడుగుల లోతు తవ్వగా 30కి పైగా ఎముకలు బయటపడ్డాయి. వాటిని తంజావూరు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. -
స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు
ఢిల్లీ: కొంతకాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ వివాహాల చట్టబద్దతపై రెడ్ సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలున్నాయన్న సీజేఐ చంద్రచూడ్.. స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేమని తెలిపారు. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేశారు. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపిన సీజేఐ.. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 'స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేం. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించం. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదు. కలిసి జీవించడం గుర్తిస్తున్నాం.. కానీ దాన్ని వివాహంగా పరిగణించలేం. స్వలింగ సంపర్కులను దంపతులుగా గుర్తించలేము. స్వలింగ జంటల అభ్యర్ధనల పట్ల సానుభూతి ఉంది కాని అభ్యర్ధనలకు చట్టబద్ధత లేదు. ప్రత్యేక వివాహ చట్టం లో మార్పు చేయాలా వద్దా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుంది. శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోలేం. ప్రత్యేక వివాహ చట్టాన్ని రద్దు చేయలేం. వివాహ వ్యవస్థకు సంబందించిన నిర్ణయాలు పార్లమెంట్ మాత్రమే చేయగలదు.' అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. 'ప్రేమ అనేది మానవత్వ లక్షణం. వివాహ హక్కుల నిర్ధారణకూ ప్రభుత్వం కమిటీ వేయాలి. ప్రతి ఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఉంటుంది. అసహజ వ్యక్తుల హక్కులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్రపాలిత ప్రాంతాలు వివక్ష చూపకూడదు. అసహజ వ్యక్తుల హక్కులు, అర్హతలను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ ప్రకటనను రికార్డు చేస్తున్నాం. రేషన్ కార్డ్‌లలో అసహజ జంటలను కుటుంబంగా చేర్చడం, అసహజ జంటలు ఉమ్మడి బ్యాంకు ఖాతా కోసం నామినేట్ చేయడానికి వీలు కల్పించడం, పెన్షన్, గ్రాట్యుటీ మొదలైన వాటి నుంచి వచ్చే హక్కులను కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించాలి.' అని సుప్రీంకోర్టు స్పష్టం తీర్పును వెల్లడించింది. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్‌లోని సెక్షన్ 4 రాజ్యాంగ విరుద్ధం అనొచ్చని సీజేఐ చంద్రచుడ్ అన్నారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై సుప్రీంకోరు తీర్పును మే 11న రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేసిన 5 నెలల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 20 పిటిషన్లపై విచారణ పూర్తైన అనంతరం ధర్మాసనం మేలో తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కాగా, 2018 సెప్టెంబర్‌లోనే భారత సర్వోన్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కం శిక్షార్హం కాదని తేల్చింది. పాతకాలపు చట్టాన్ని పక్కనపెట్టి ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై అప్పట్లోనే గగ్గోలు పుట్టింది. సాంస్కృతిక విలువలకు తిలోదకాలిచ్చి, పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకుంటున్నామంటూ విమర్శలు రేగాయి. తీరా స్వలింగ సంపర్కం తప్పు కాదని కోర్టు చెప్పినా తమకు సామాజిక అంగీకారం లభించడం లేదనీ, తమపై దుర్విచక్షణ సాగుతూనే ఉందనీ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ల (ఎల్జీబీటీక్యూ) వర్గం ఫిర్యాదు చేస్తోంది. స్వలింగ సంపర్కం నేరం కాదనే దశ నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరడం దాకా ఇప్పుడు వచ్చింది. హోమో సెక్సువల్ పెళ్ళిళ్ళను చట్టబద్ధమైనవని గుర్తించాలని కోరుతూ, 2020లోనే ఢిల్లీ, కేరళ హైకోర్టుల్లో కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తర్వాత సుప్రీమ్‌కు పిటిషన్లు చేరాయి. కోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. మార్చి 13న సుప్రీంకోర్టులో కేంద్రం తన అఫిడవిట్ దాఖలు చేస్తూ, స్వలింగ వివాహాల చట్టబద్ధతకు ససేమిరా అంది. సహజ ప్రకృతికి విరుద్ధంగా జరిపే లైంగిక చర్యలు శిక్షార్హమని భారత శిక్షాస్మృతిలోని 377వ సెక్షన్ మాట. ఆ సెక్షన్ కింద స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని అయిదేళ్ళ క్రితం తీర్పునిచ్చినంత మాత్రాన ఏకంగా స్వలింగ వివాహాన్ని వివిధ చట్టాల కింద తమ ప్రాథమిక హక్కని పిటిషనర్లు అనుకోరాదని ప్రభుత్వం వెల్లడించింది. స్వలింగ వివాహాలు సమాజంలో కొత్త సమస్యను సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ వివాహాలకు గుర్తింపు కల్పించకపోవడం వివక్ష కాదని ప్రభుత్వం వాదించింది. ఇదీ చదవండి: ఢిల్లీ మద్యం కేసు.. నిందితుల జాబితాలో ఆప్! స్వలింగ సంపర్కుల విషయంలో వివిధ దేశాల్లో ఉన్న శిక్షలు/హక్కులు... వాటి వివరాలు.. 1. మరణ శిక్ష 2. జీవితకాల ఖైదు 3. జైలు శిక్ష 4. హక్కులు లేవు 5. చట్టప్రకారం శిక్షలు 6. యూనియన్లకు కలిగి ఉండే హక్కు 7. చట్టప్రకారం వివాహం చేసుకోవచ్చు 8. ఉమ్మడిగా దత్తత తీసుకునే హక్కు -
పెళ్లికుదిరినా అందుకు ఒప్పుకోలేదు.. వ్యాపారవేత్తను హత్య చేసిన 'గే'..
సాక్షి, బెంగళూరు: కొద్దిరోజులక్రితం కర్ణాటక బెంగళూరులో 44 ఏళ్ల వ్యాపారవేత్త దారుణహత్యకు గురయ్యాడు. అతని సన్నిహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే ఆర్థిక తగాదాలే ఈ హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు తొలుత అనుమానించారు. కానీ విచారణలో వెలుగుచూసిన అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. హత్యకు గురైన వ్యాపారవేత్త పేరు లియాకాత్ అలీ ఖాన్. ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. నిందితుడి పేరు ఇల్యాజ్ ఖాన్(26). ఇతని దగ్గరే చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అయితే ఇద్దరు స్వలింగసంపర్కులు. కరోనా లాక్డౌన్లో వీరి మధ్య రిలేషన్ ఏర్పడింది. అప్పటి నుంచి రెండేళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 28న కూడా మైసూరు రోడ్డులోని నయందహల్లిలో పాత భవనంలో రాత్రి ఇద్దరూ కలిశారు. అనంతరం తనకు అమ్మాయితో పెళ్లి కుదిరిందని, ఇకపై రిలేషన్ కొనసాగించలేనని ఇల్యాజ్ చెప్పాడు. దీనికి లియాకాత్ ఒప్పుకోలేదు. రిలేషన్ కొనసాగించాల్సిందేనని పట్టుబట్టాడు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో లియాకాత్‌ను ఇల్యాజ్ తలపై సుత్తితో బాదాడు. ఆపై కత్తెర్లతో అతడ్ని పొడిచాడు. తీవ్రగాయాలపాలైన లియాకాత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లియాకాత్ కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొదట ఈ హత్యలో ముగ్గురి ప్రమేయం ఉండవచ్చని అనుమానించారు. కానీ ఇల్యాజ్‌ను విచారించగా అసలు విషయం తెలిసింది. అతనొక్కడే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. కాగా.. లియాకాత్ అలీకి ఓ మహిళతో పెళ్లైంది. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ రిపోర్టులో మరోసారి కవిత పేరు -
నా భాగస్వామి తల్లి కాబోతుంది: స్టార్ మహిళా క్రికెటర్
స్టార్ మహిళా క్రికెటర్, ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ సారా టేలర్.. సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది. 2019లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సారా.. తాను తల్లిని కాబోతున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 22) ప్రకటించింది. స్వలింగ సంపర్కురాలైన సారా.. చాలా కాలంగా డయానా అనే మహిళతో సహజీవనం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా కన్ఫర్మ్ చేసిన సారా తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Sarah Taylor (@sjtaylor30) తమ జీవన ప్రయాణం సాఫీగా సాగలేదు. తల్లి కావాలన్నది తన భాగస్వామి కల. ఈ విషయంలో డయానా ఎక్కడా రాజీ పడలేదు. నాకు తెలుసు డయానా మంచి తల్లి అవుతుంది. ఇందులో భాగమవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా 19 వారాలు గడవాలి. జీవితం చాలా కొత్తగా ఉండబోతుంది. డయానా పట్ల చాలా గర్వంగా ఉన్నానంటూ రాసుకొచ్చింది. డయానా ఈ విషయాన్ని బహిర్గతం చేసాక సహచరులు, మిత్రులు, ప్రస్తుత, మాజీ క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. Being a mother has always been my partner's dream. The journey hasn't been an easy one but Diana has never given up. I know she will be the best mum and I'm so happy to be a part of it x19 weeks to go and life will be very different ! 🤍🌈 pic.twitter.com/9bvwK1Yf1e— Sarah Taylor (@Sarah_Taylor30) February 21, 2023 ఇదిలా ఉంటే, ఒత్తిడి సంబంధిత సమస్యల కారణంగా సారా 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. కెరీర్లో 10 టెస్ట్‌లు, 126 వన్డేలు, 90 టీ20లు ఆడిన సారా.. 300 టెస్ట్ పరుగులు, 4056 వన్డే పరుగులు, 2177 టీ20 పరుగులు సాధించింది. వన్డేల్లో 7 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు చేసిన ఆమె.. టీ20ల్లో 16 అర్ధశతకాలు బాదింది. వికెట్‌కీపర్‌గా టెస్ట్‌ల్లో 18 క్యాచ్‌లు, 2 స్టంపౌట్లు.. వన్డేల్లో 87 క్యాచ్‌లు, 51 స్టంపౌట్లు.. టీ20ల్లో 23 క్యాచ్‌లు, 51 స్టంపౌట్లు చేసిన 33 ఏళ్ల సారా.. 2017లో ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది. 2021లో టీమ్ అబుదాబీ (టీ10 లీగ్) అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైన సారా.. ఫ్రాంచైజీ క్రికెట్‌కు ఎంపికైన తొలి మహిళా కోచ్‌గా చరిత్ర సృష్టించింది. -
ప్రపంచానికి తెలియని ఆసీస్ క్రికెటర్ల ప్రేమకథ
ఆస్ట్రేలియా క్రికెటర్లు మార్కస్ స్టోయినిస్, స్పిన్నర్ ఆడమ్ జంపాల పేరు చెప్పగానే ఒక విషయం గుర్తుకురాక మానదు. ఈ ఇద్దరు క్రికెటర్ల మధ్య 2019 బీబీఎల్(బిగ్‌బాష్ లీగ్)లో జరిగిన బ్రొమాన్స్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత వీరిద్దరు గే(హోమోసెక్సువల్స్) రిలేషిన్‌షిప్‌లో ఉన్నట్లు కథనాలు కూడా వచ్చాయి. ఈ కథనాలపై అటు స్టోయినిస్ కానీ.. ఇటు జంపా కానీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీనిని బట్లే స్టోయినిస్, జంపాలు హోమోసెక్సువల్ రిలేషన్షిప్లో ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. వీరిద్దరు లివింగ్ఇన్ రిలేషిన్‌షిప్‌లో ఉన్నారంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే అటు ఆస్ట్రేలియా క్రికెట్లో.. ఇటు బిగ్‌బాష్ లీగ్‌లో చాలా సందర్భాల్లో డ్రెస్సింగ్ రూమ్‌లో వీరిద్దరు బ్రొమాన్స్ చేసుకోవడం కెమెరాల కంట పడింది. తాజాగా ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు దినోత్సవం పురస్కరించుకొని బీబీఎల్ ఫ్రాంచైజీ మెల్బోర్న్ స్టార్స్ ఒక ఫోటో షేర్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఆ ఫోటోలో స్టోయినిస్ చెంపపై ఆడమ్ జంపా ముద్దుపెట్టడం కనిపిస్తుంది. ఈ ఫోటోను ట్వీట్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ ''హ్యాపీ వాలెంటైన్స్ డే'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఏది ఏమైనా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచానికి తెలియని ఆసీస్ క్రికెటర్ల ప్రేమకథను పరిచయం చేసినందుకు బీబీఎల్‌కు కృతజ్ఞతలు అంటూ కొందరు అభిమానుల ట్వీట్ చేశారు. ఇక బీబీఎల్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ఆడమ్ జంపా.. ఈ సీజన్లో జట్టును విజేతగా నిలపడంలో విఫలమైనప్పటికి.. ఆటగాడిగా మాత్రం అదరగొట్టాడు. టోర్నీలో 14 మ్యాచ్‌లాడిన జంపా 16 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. మొదటిస్థానంలో లూక్‌వుడ్(14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు) ఉన్నాడు. ఇక స్టోయినిస్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్‌ల్లో రెండు అర్థసెంచరీలో సాయంతో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మెల్బోర్న్ స్టార్స్ బీబీఎల్ 2022-23లో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఆస్ట్రేలియా తరపున మార్కస్ స్టోయినిస్ 57 వన్డేల్లో 1296 పరుగులు, 51 టి20ల్లో 803 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే స్టోయినిస్ మెరుపు ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. ఎన్నోసార్లు తన ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లతో చాలాసార్లు విజయాలందించాడు. ఇక స్పిన్నర్ ఆడమ్ జంపా 76 వన్డేల్లో 127 వికెట్లు, 72 టి20ల్లో 82 వికెట్లు పడగొట్టాడు. happy valentine's day 🥰 pic.twitter.com/tv5dkKlxi3 — KFC Big Bash League (@BBL) February 13, 2023 Ohk, happy Valentines Day 🌝👍🏻 pic.twitter.com/XgGrTDNYvS — 𝐀𝐬𝐡𝐦𝐢𝐭𝐚 (@samaira__kohli) February 14, 2023 చదవండి: క్రికెటర్ మనసు దోచుకున్న మల్లికా సాగర్ -
స్టార్ ఫుట్‌బాలర్ సంచలన నిర్ణయం
చెక్ రిపబ్లిక్ స్టార్ ఫుట్‌బాలర్.. మిడ్పీల్డర్ జకుబ్ జాంట్కో తనను తాను 'గే'(Gay-స్వలింగ సంపర్కుడు)గా ప్రకటించుకున్నాడు. సోమవారం ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ''నేను హోమోసెక్సువల్.. ఈ విషయాన్ని ఇంకా దాచుకోవాలనుకోవడం లేదు. అందరిలాగే నేను కూడా నా జీవితాన్ని స్వేచ్ఛగా, భయం, పక్షపాతం లేకుండా ప్రేమతో జీవించాలనుకుంటున్నా. ఒక ఫుట్‌బాలర్‌గా నా కెరీర్లో ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ప్రొఫెషనలిసమ్, అభిరుచితో వర్క్ చేయడానికి ఇష్టపడుతా.. ఎవరిపై ఆధారపడాల్సి అవసరం నాకు లేదు. ఒక స్వలింగ సంపర్కుడిగా నాకు నేను స్వేచ్ఛను ప్రకటించుకున్నా'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఫుట్‌బాల్‌లో కెరీర్లో కొనసాగుతూ తాము స్వలింగ సంపర్కులమని కొంతమంది ఆటగాళ్లు మాత్రమే ధైర్యంగా బయటకు చెప్పగలిగారు. 1990లో జస్టిన్ ఫషాను, 2021లో ఆస్ట్రేలియాకు చెందిన జోష్ కావల్లో, 2022లో ఇంగ్లీష్ ఫుట్‌బాలర్ జేక్ డేనియల్స్.. తాజాగా జకుబ్ జాంట్కో తనను తాను గేగా ప్రకటించుకున్నాడు. ఇక జాంట్కో చెక్‌రిపబ్లిక్ తరపున 45 మ్యాచ్‌లాడి నాలుగు గోల్స్ కొట్టాడు. సీరీ-ఎ క్లబ్లో ఉడినీస్, సంప్డోరియా క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. pic.twitter.com/PZNSAteOch — Jakub Jankto (@jakubjanktojr) February 13, 2023 చదవండి: Viral: భారత క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం -
ఉప్పల్‌లో దారుణం: నా భర్త కామపిశాచి.. కన్నకొడుకుపై కర్కషంగా..
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల బాలుడిపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితుడి తల్లి వీణారెడ్డి శుక్రవారం మీడియా ముందుకు వచ్చింది. గోనె భరత్‌రెడ్డి హోమో సెక్సువల్ కావడం వల్ల వేధింపులతోనే దూరంగా ఉంటున్నానని తెలిపింది. కామంతో కళ్లు మూసుకుపోయిన తన భర్త సొంత కుమారుడినే చెరపట్టాడని మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యింది. భార్యాభర్తలుగా మేము విడిపోయి ఉంటున్న క్రమంలో భరత్‌రెడ్డి తనను మభ్యపెట్టి కుమారుడిని అతని వద్దే ఉండేలా చేసుకున్నాడని వీణారెడ్డి ఆరోపించింది. తన కొడుకుపై కర్కషంగా వ్యవహరించిన గోనె భరత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీణారెడ్డి డిమాండ్ చేసింది. చదవండి: (Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) -
భాగస్వామిని కడతేర్చాడు..
ముంబై : నగరంలోని దొంబివ్లి సమీపంలోని రైల్వే పట్టాల వద్ద సూట్‌కేసులో లభ్యమైన 57 ఏళ్ల వ్యక్తి మృతదేహానికి సంబంధించిన మిస్టరీ వీడింది. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన బాధితుడిని అతని హోమోసెక్సువల్ భాగస్వామే హత్య చేసినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. సూట్‌కేసులో లభ్యమైన మృతదేహం ఆనవాళ్లను బట్టి మృతుడిని ఉమేష్ పాటిల్‌గా పోలీసులు గుర్తించారు. కేవలం 9 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. పాటిల్‌ను 27 ఏళ్ల ప్రఫుల్ పవార్ హత్య చేసినట్టుగా కనుగొన్నారు. వీరిద్దరూ గత కొంత కాలంగా స్వలింగ సంపర్కానికి పాల్పడుతున్నారని తెలిపారు. నవీముంబైలో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న పాటిల్ రెండు రోజులుగా కోప్రి ప్రాంతంలోని తన ఇంటి నుంచి అదృశ్యమైనట్టు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అవివాహితుడైన పవార్‌కు పాటిల్‌తో ఆరు నెలల కిందట లోకల్ ట్రైన్లో కలిగిన పరిచయం ఆ తర్వాత ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కానికి దారితీసింది. కాగా ఇటీవల పవార్‌కు వివాహం కావడంతో పాటిల్‌ను నిర్లక్ష్యం చేస్తుండటంతో ఇరువురి మధ్య దూరం పెరిగింది. రెండు రోజుల కిందట పవార్ ఇంటికి వెళ్లిన పాటిల్ ఇదే విషయంపై నిలదీయడంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన పవార్ పాటిల్‌ను హతమార్చి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి రైల్వే ట్రాక్‌ల వద్ద పడేసి పారిపోయాడు. చదవండి : అంతమొందించి.. అంతులేకుండా వెళ్లాడు.. -
‘377’ కేసులు యూపీలోనే అత్యధికం
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ సంపర్కులకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 377 కింద అత్యధిక కేసులు ఉత్తరప్రదేశ్‌లో నమోదయిన్నట్లు తేలింది. జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2016లో యూపీలో 999 కేసులు నమోదుకాగా, కేరళ (207), ఢిల్లీ(183), మహారాష్ట్ర(170)లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇద్దరు వయోజనులైన పురుషులు లేదా స్త్రీల మధ్య పరస్పర సమ్మతితో ప్రైవేటుగా సాగే శృంగారం నేరం కాదంటూ ఐపీసీ సెక్షన్ 377లోని కొన్ని నిబంధనలను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అవతలి వ్యక్తి సమ్మతి లేకుండా లేదా మైనర్లతో లేదా జంతువులతో చేసే శృంగారాన్ని నేరంగానే పరిగణించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2016లో దేశవ్యాప్తంగా పురుష స్వలింగ సంపర్కులపై 2,195 కేసులు నమోదుకాగా, 2015లో 1,347, 2014లో 1,148 కేసులను పోలీసులు నమోదుచేశారు. తాజాగా సుప్రీం తీర్పు నేపథ్యంలో వీరిలో చాలామంది నిందితులకు ఊరట లభించే అవకాశముందని భావిస్తున్నారు. -
ప్రాణం తీసిన స్వలింగ సంపర్కం
అన్నానగర్: కరూర్‌లో బుధవారం బెదిరించి స్వలింగ సంపర్కానికి పాల్పడ్డ విషయం కన్నవారికి చెపుతానని చెప్పిన పాఠశాల విద్యార్థిని మినీబస్సు కండక్టర్ హత్య చేశాడు. ఈ ఘటన కరూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. కరూర్ జిల్లా క.పరమత్తి సమీపంలో ఉన్న విసువనాథపురికి చెందిన విశ్వనాథన్ కుమారుడు చిరంజీవి (13). ఇతను అదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన చిరంజీవి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కన్నవారు కుమారుడి కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికారు. అయినా చిరంజీవి ఆచూకీ తెలియలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఎంజీఆర్‌నగర్ కాలువ సమీపంలో ఉన్న సీలైకోడులో ఓ బాలుడి మృతదేహం ఉన్నట్లు స్థానికులు క.పరమత్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతి చెందిన విద్యార్థి చిరంజీవి అని తెలిసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో చిరంజీవిని విశ్వనాథపురి సలైవైక్కల్ వీధికి చెందిన ప్రైవేట్ మినీ బస్సు కండక్టర్ ప్రదీప్ (19) మంగళవారం సాయంత్రం తీసుకుని వెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు. అనంతరం ప్రదీప్‌ను పట్టుకుని పోలీసులు విచారణ చేయగా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వచ్చాయి. పాఠశాల ముగిసి ఇంటికి వెళుతున్న చిరంజీవిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అతన్ని బెదిరించి స్వలింగ సంపర్కానికి పాల్పడ్డాడు. భయపడిన చిరంజీవి విషయాన్ని తల్లిదండ్రులకు చెపుతానని తెలిపాడు. దీంతో ఆగ్రహం చెందిన ప్రదీప్ చొక్కాతో నోరు, ముక్కు గట్టిగా నులిమి పట్టుకున్నాడు. ఊపిరి ఆడక చిరంజీవి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. పోలీసులు ప్రదీప్‌ను అరెస్టు చేశారు. -
గుర్మీత్ డేరాలో హోమో సెక్సువల్స్
సాక్షి, సిర్సా : డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెద్ద కామపిశాచి అన్న విషయాన్ని మాజీ అనుచరులు స్వయంగా చెబుతుండటం చూస్తున్నాం. అయితే ఆశ్రమంలోని మహిళలను మాత్రమే చేరదీసే గుర్మీత్.. అనుచరుల విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించేవాడంట. వారి వారి భార్యలను సోదరీమణులుగా భావించాలని తరచూ అనుచరులకు ప్రభోదించేవాడంట. దీంతో వారిలో చాలా మట్టుకు స్వలింగ సంపర్కులుగా మారిపోయేవారని చెబుతున్నారు. సిర్సా ప్రధానాశ్రమంలో ఆరేళ్లు గడిపిన గుర్దాస్ సింగ్ తూర్ అక్కడి దారుణాలను వివరిస్తున్నాడు. ‘ఆశ్రమంలో మగవాళ్లకు కఠిన నియమాలు ఉండేవి. గుర్మీత్ మహిళా భక్తుల(సాధ్వీలు)తో ఎవరూ మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే శిక్షలు కఠినంగా ఉండేవి. గాడిదల మీద ఉరేగించటం.. ప్రజల సమక్షంలోనే బాబా ప్రధాన అనుచరులు దాడి చేసి దండించటం లాంటివి చేసేవారు అని గుర్దాస్ తెలిపారు. ఆ శిక్షలకు భయపడే చాలా మంది మహిళల వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడేవారని ఆయన చెబుతున్నాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది స్వలింగ సంపర్కులుగా మారిపోయేవారంట. ఓ రోజు ప్రార్థన మందిరంలోనే ఇద్దరు వ్యక్తులు అసహజ శృంగారం చేస్తూ తన కంటపడ్డారని, ఇదే విషయాన్ని వ్యక్తిగతంగా తెలియజేస్తే గుర్మీత్ నవ్వి ఊరుకున్నాడని గుర్దాస్ చెప్పాడు. ఆ తర్వాత అలాంటి దృశ్యాలు పదుల సంఖ్యలో తాను చూడాల్సి వచ్చిందన్నాడు. ముఖ్యంగా కొత్తగా వచ్చేవారిపై ఇలాంటి దాడులు ఎక్కువగా జరిగేవని, ఎవరైనా ఎదురిస్తే వారిపై దాడి చేసి ఆశ్రమం నుంచి వెల్లగొట్టేవారని అన్నాడు. అదృష్టం బాగుండి తనపై అలాంటి దాడులు ఏనాడూ చోటు చేసుకోలేదని గుర్దాస్ తెలిపాడు.