
చెక్ రిపబ్లిక్ స్టార్ ఫుట్‌బాలర్.. మిడ్‌పీల్డర్ జకుబ్ జాంట్కో తనను తాను 'గే'(Gay-స్వలింగ సంపర్కుడు)గా ప్రకటించుకున్నాడు. సోమవారం ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ''నేను హోమోసెక్సువల్.. ఈ విషయాన్ని ఇంకా దాచుకోవాలనుకోవడం లేదు. అందరిలాగే నేను కూడా నా జీవితాన్ని స్వేచ్ఛగా, భయం, పక్షపాతం లేకుండా ప్రేమతో జీవించాలనుకుంటున్నా. ఒక ఫుట్‌బాలర్‌గా నా కెరీర్‌లో ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ప్రొఫెషనలిసమ్, అభిరుచితో వర్క్ చేయడానికి ఇష్టపడుతా.. ఎవరిపై ఆధారపడాల్సి అవసరం నాకు లేదు. ఒక స్వలింగ సంపర్కుడిగా నాకు నేను స్వేచ్ఛను ప్రకటించుకున్నా'' అంటూ పేర్కొన్నాడు.
ఇక ఫుట్‌బాల్‌లో కెరీర్‌లో కొనసాగుతూ తాము స్వలింగ సంపర్కులమని కొంతమంది ఆటగాళ్లు మాత్రమే ధైర్యంగా బయటకు చెప్పగలిగారు. 1990లో జస్టిన్ ఫషాను, 2021లో ఆస్ట్రేలియాకు చెందిన జోష్ కావల్లో, 2022లో ఇంగ్లీష్ ఫుట్‌బాలర్ జేక్ డేనియల్స్.. తాజాగా జకుబ్ జాంట్కో తనను తాను గేగా ప్రకటించుకున్నాడు. ఇక జాంట్కో చెక్‌రిపబ్లిక్ తరపున 45 మ్యాచ్‌లాడి నాలుగు గోల్స్ కొట్టాడు. సీరీ-ఎ క్లబ్‌లో ఉడినీస్, సంప్డోరియా క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.
— Jakub Jankto (@jakubjanktojr) February 13, 2023