gay
-
Hyderabad: ‘గే’ యాప్‌లో పరిచయం.. ఇంటికి పిలిచి..
ఫిలింనగర్: ‘గే’ యాప్‌లో పరిచయం చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు ఫోన్ పే ద్వారా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. డబీర్‌పురాలో నివసించే పర్హాన్బేగ్ (25) జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం జెండర్ యాప్‌లో ’గే’లను పరిచయం చేసుకుంటూ వారిని తనవద్దకు రప్పించి వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. షేక్‌పేట జైహింద్నగర్కు చెందిన ఓ యువకుడి (22)ని గత నెల జెండర్ యాప్‌లో పరిచయం చేసుకుని తన వద్దకు రప్పించుకున్నాడు. ఇంటికి వెళ్లిన సదరు యువకుడితో సన్నిహితంగా మెలుగుతూ వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి రూ.15 వేలు డిమాండ్ చేశాడు. అయితే బాధితుడు రూ.10 వేలను ఫోన్ పే ద్వారా నిందితుడికి బదిలీ చేశాడు. తాను మోసపోయానని తెలుసుకుని ఈ నెల 1న ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడి ఫోన్ పే ఆధారంగా కాల్ డేటా సేకరించి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పర్హానబేగ్ ‘గే’ కాదని, కేవలం ‘గే’లను పరిచయం చేసుకుని బ్లాక్ మెయిల్ చేసేందుకు జెండర్ యాప్‌లో ఉన్నాడని, గతంలో కూడా ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘చీర కడితే.. బొట్టు పెడితే హేళన చేస్తారా?’
విలన్స్ ఆర్ నాట్ బార్న్.. దే ఆర్ మేడ్ బై సొసైటీ.. వ్యవస్థే విలన్లను తయారు చేస్తుందని అర్థం. అవసరాలకు తగ్గట్లు బతికే మనిషి.. అవతలివాళ్లను అవహేళన చేయడం అంతే పరిపాటిగా మార్చేసుకున్నాడు. అయితే మానసిక రుగ్మతలో కూరుకుపోయిన మనిషి ముందు అది ప్రదర్శిస్తే.. అది ప్రాణాల మీదకే రావొచ్చు. అలాంటి వాస్తవ ఘటనే ఇది. ‘‘తస్మాత్ జాగ్రత్త! ఇలాంటి నేరగాళ్లు మన మధ్యే ఉంటారు’’ అని పాఠకులకు తెలియజేయడమే మా ఉద్దేశం.33 ఏళ్ల రామ్ స్వరూప్. చూడడానికే కాదు.. మీడియా ముందు అతని మాటలు అంతే అమాయకంగా ఉన్నాయి. కానీ, ఓ హత్య కేసు ఇంటరాగేషన్‌లో నోరు విప్పి అతను చెప్పిన విషయాలు ఖాకీలనే విస్తుపోయేలా చేశాయి. ఏడాదిన్నర కాలంలో 11 మందిని అతికిరాకతంగా హతమార్చిన సీరియల్ కిల్లర్ ఇతనేనంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు!.పంజాబ్(Punjab)లో ఈ సీరియల్ కిల్లర్ ఉదంతం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మగవాళ్లకు మాత్రమే లిఫ్ట్ ఇచ్చి.. ఆపై వాళ్లను దారుణంగా హతమార్చాడతను. ఈ క్రమంలో అతను నేరాలకు పాల్పడ్డ తీరు.. అందుకు అతను చెప్తున్న కారణాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ‘‘వాళ్లు నన్ను కొజ్జావాడంటూ హేళన చేశారు. నా వేషధారణను అవహేళన చేశారు. పైగా నాతో శారీరక అవసరాలు తీర్చుకుని ఇస్తానన్న డబ్బూ ఇవ్వలేదు. ఈ విషయాలు నన్ను ఎంతో బాధించాయి. అందుకే చేతికి ఏది దొరికితే దాంతో.. అక్కడికక్కడే వాళ్లను చంపాల్సి వచ్చింది’’ ఇది నేరాంగీకారంలో రామ్ స్వరూప్ అలియాస్ సోధీ చెప్పిన అసలు విషయం.👉రామ్ స్వరూప్ స్వస్థలం.. హోషియార్పుర జిల్లా చౌరా గ్రామం. అతని తల్లిదండ్రులు విద్యావంతులు. ఆర్థికంగా ఉన్న కుటుంబమే. కానీ, రామ్ స్వరూప్లోపల ఇంకొకరు ఉన్నారు. అతనికి చిన్నప్పటి నుంచి ఆడవాళ్లలా అలంకరించుకోవడం ఇష్టం. చెబితే.. ఇంట్లోవాళ్లు కోప్పడతారనే భయం. అందుకే తల్లిదండ్రులు లేనప్పుడు రహస్యంగా మేకప్ వేసుకుని మురిసిపోయేవాడు. ఆ రహస్య జీవితం చాలా ఏళ్లపాటు అలాగే కొనసాగింది. అయితే 2005లో దుబాయ్ జీవితం అతనిలో మరో కోణాన్ని బయటకు తీసింది. 👉అక్కడ స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడతను. ఆపై తిరిగి స్వదేశానికి వచ్చాడు. కోడుకులోని ఆ కోణం తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. చివరకు.. రామ్ స్వరూప్‌కు వివాహం చేశారు. ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే అతనిలోని ఆ కోణం.. భార్యకు ఆలస్యంగా తెలిసింది. రెండేళ్ల కిందట పిల్లలను తీసుకుని పుట్టింటి వెళ్లిపోయింది. ఇటు తల్లిదండ్రులు అతన్ని దూరం పెట్టారు.ఒంటరి అయిన రామ్ స్వరూప్‌కు ‘తేడాగాడు’ అనే ముద్ర వేసి ఎవరూ పని ఇవ్వలేదు. దీంతో తనదైన అవసరాల కోసం రోడ్డెక్కాడతను. అందుకోసం చీర కట్టి.. బొట్టు పెట్టి.. ముస్తాబయ్యేవాడు. చూసేవాళ్లంతా తనను తేడా అనుకున్నా ఫర్వాలేదనే ధీమా అతనికి కలిగింది అప్పుడు. అయితే.. ఎప్పుడైతే తాను అనుకున్నది నెరవేరలేదో.. అతనిలో మృగం బయటికి వచ్చింది.👉 మోద్రా టోల్‌ప్లాజా వద్ద టీ, వాటర్ బాటిళ్లు అమ్ముకునే మహిందర్ సింగ్ అనే వ్యక్తి ఆగష్టు 18వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలంలో క్లూస్ టీంకు ఓ చిన్న గుడ్డముక్క దొరికింది. అయితే అప్పటిదాకా దొరక్కుండా జాగ్రత్త పడిన రామ్ స్వరూప్.. ఎప్పుడూ తన మెడలో ఉంచుకునే మఫ్లర్‌తో అడ్డంగా దొరికిపోయాడు. నాలుగు నెలలపాటు జరిగిన దర్యాప్తు.. గాలింపు అనంతరం డిసెంబర్ 25వ తేదీన రామ్ స్వరూప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 👉తనతో శారీరక అవసరం తీర్చుకునే సమయంలో మహిందర్ తన కట్టూబొట్టును అవమానించాడని.. అది తట్టుకోలేకే అతన్ని హతమార్చినట్లు రామ్ స్వరూప్ నేరం ఒప్పుకున్నాడు. అంతేకాదు.. దీనికంటే ముందు 10 హత్యలు చేసినట్లు ఈ సీరియల్ కిల్లర్(Serial Killer) పోలీసుల దిమ్మతిరిగిపోయేలా విషయం ఒకటి చెప్పాడు.👉రామ్ స్వరూప్ చేసిన తొలి హత్య.. హర్‌ప్రీత్ అనే మాజీ ఆర్మీ అధికారిది. 18 నెలల కిందట జరిగిందా ఘోరం. ఆయనతో లైంగికంగా కలిశాక.. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో హర్‌ప్రీత్‌ను హతమార్చి.. ఆయన వీపులో ధోకేబాజ్(మోసగాడు) అని రెడ్ ఇంక్‌తో రాత రాశాడు. ఈ కేసు పంజాబ్‌లో ఆ మధ్య చర్చనీయాంశం అయ్యింది కూడా. అయితే విచారణలో పోలీసులు ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారు.👉ఈ ఘటన తర్వాత.. రామ్ స్వరూప్ అప్రమత్తం అయ్యాడు. రోజూవారీ పని చేసుకునే కూలీలు, మెకానిక్‌లు, సెక్యూరిటీ గార్డును రామ్ స్వరూప్ టార్గెట్ చేసుకునేవాడు. మరికొందరికి లిఫ్ట్ ఆఫర్ చేసేవాడు. వాళ్లతో మాటలు కలిపి తన కోరిక బయటపెట్టేవాడు. అందుకు ఒప్పుకున్నవాళ్లతో నిర్మాణుష్య ప్రాంతాలకు వెళ్లేవాడు. అయితే ఏకాంతంగా ఉన్న టైంలో.. వాళ్లు తనతో ప్రవర్తించిన తీరే.. తనను నేరానికి ఉసిగొల్పిందని చెబుతున్నాడను. వాళ్ల మాటలు, చేతలు అతన్ని మానసికంగా కుంగదీశాయట. ఆ ఆవేశంలో చేతికి దొరికిన వస్తువుతో వాళ్లను దారుణంగా హతమార్చి.. తన సిగ్నేచర్ వీపులో మోసగాడు అని రాసి.. వాళ్ల జేబుల్లో ఉన్నదంతా దోచుకుని వెళ్లిపోయేవాడట. అలా రూపానగర్, సర్హింద్, ఫతేఘడ్ సాహిబ్.. ఇలా చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పటిదాకా 11 మందిని హతమార్చాడు. వీటిలో ఆరు కేసుల్లో ఈ సైకో గే కిల్లర్ పాత్రను పోలీసులు ధృవీకరించుకున్నారు. మరో ఐదు కేసుల్లో.. రామ్ స్వరూప్ పాత్రపై నిర్ధారణకు రావాల్సి ఉంది. రాబోయే.. రోజుల్లో రామ్ స్వరూప్ నేరచరితను ఏ సినిమాగానో, వెబ్ సిరీస్(Web Series)గానో తెర మీద చూడాల్సిన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో కదా!. -
టెక్ సంస్థలకు సారథులు.. ఈ ‘గే’లు! (ఫొటోలు)
-
మాజీ భర్తపై గే కామెంట్స్.. క్షమాపణలు కోరిన ప్రముఖ సింగర్!
ప్రముఖ తమిళ సింగర్ సుచిత్ర ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంంది. గతంలో చాలామంది స్టార్ సెలబ్రిటీలపై సుచీలీక్స్ పేరుతో సంచలన ఆరోపణలు చేసింది. సినీతారలతో పాటు తన మాజీ భర్త నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్‌పై సైతం అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూలో తన మాజీ భర్త కార్తీక్ కుమార్‌తో పాటు హీరో ధనుష్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సైతం గే అంటూ సంచలన కామెంట్స్ చేసింది. దీంతో ఆమెపై మాజీ భర్త కార్తీక్ కుమార్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. అయితే తాజాగా సింగర్ సుచిత్ర తన మాజీ భర్తకు క్షమాపణలు చెప్పింది. దీనిపై ఆమె ఓ వీడియోను రిలీజ్ చేసింది. అతన్ని గే అని పిలిచినందుకు బాధపడుతున్నా.. ఆయన కెరీర్‌ను నాశనం చేసే ఉద్దేశం నాకు లేదు.. అందుకే క్షమాపణలు కోరుతున్నా అని తెలిపింది. అయితే కార్తీక్ ఫిర్యాదు వల్లే పోలీసుల తనకు తరచుగా కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. అందుకే తన వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించింది. కార్తీక్ మంచి వ్యక్తి అని.. దీంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలనుకుంటున్నట్లు వీడియోలో వివరించింది. అయితే మళ్లీ ఆ వీడియోను కొద్దిసేపటికే డిలీట్ చేసింది. అంతేకాకుండా తన క్షమాపణలను ఈ మెయిల్ ద్వారా కార్తీక్‌కు పంపుతానని చెప్పింది. ఇకపై అతని కెరీర్‌కు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని తెలిపింది. ఇకపై అన్ని వదిలేసి మానసికంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సింగర్ సుచిత్రం వెల్లడించింది. కాగా.. గతంలో పలువురు కోలీవుడ్ అగ్రతారలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. -
స్వలింగ వివాహం చేసుకున్న విదేశాంగ మంత్రి!
విదేశాంగ మంత్రి అయిన ఆమె దేశంలోనే తొలి మహిళా గే పార్లమెంటేరియన్‌గా ఆశ్చర్యపరిచింది. ఇలా తాను స్వలింగ సంపర్కురాలిని అని బహిరంగ పర్చడమే గాకుండా తన చిరకాల భాగస్వామిని పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఎవరంటే ఆమె.. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ దేశంలోనే తొలి స్వలింగ మహిళా పార్లమెంటేరియన్. ఆమె తన భాగస్వామి సోఫీ అల్లౌచెతో దాదాపు రెండు దశాబ్దాలుగా కలిసే ఉంటోంది. ఇక తమ బంధాన్ని పెళ్లితో మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుక్నునట్లు పేర్కొంది వాంగ్. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో విదేశాంగ మంత్రి వాంగ్ స్వలింగ వివాహం చేసుకున్నారు. ఇలా తమ వివాహం తమ కుటుంబ సభ్యుల సమక్షంలో జరగడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని తెలిపింది వాంగ్. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ జంట దక్షిణ ఆస్ట్రేలియా రాజధాని అడిలైడ్‌లోని వైనరీలో గత రెండు దశాబ్దాలుగా కలిసి ఉన్నారని, శనివారమే పెళ్లితో ఒక్కటయ్యారని స్థానిక మీడియో పేర్కొంది. ఇక వాంగ్ సెనేట్‌లో దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2002 నుంచి లేబర్ సెనేటర్‌గా ఆస్ట్రేలియా క్యాబినేట్ పదవిని పొంది తొలి ఆసియా వ్యక్తిగా వాంగ్ నిలిచింది. అయితే 2017లో ఆస్ట్రేలియాలో స్వలింగ వివాహం చట్టబద్ధం అయింది. ఈ నేపథ్యంలో తమ వివాహాన్ని బహిరంగంగా వెల్లడించింది వాంగ్. ఆస్ట్రేలియాలో దాదాపు 1997 వరకు అన్ని రాష్ట్రాల్లో స్వలింగ సంపర్కంని నేరంగా భావించేది. View this post on Instagram A post shared by Penny Wong (@senatorpennywong) (చదవండి: పద్నాలుగేళ్ల వయసులోనే దేశాధ్యక్షుడు) -
France PM Gabriel Attal: ఒక ‘గే’ ఫ్రాన్స్‌కు ప్రధానిగా ఎలా ఎదిగారు?
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియేల్ అటల్ నియమితులయ్యారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తమ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి గాబ్రియేల్ అటల్(35)ను తన కొత్త ప్రధానిగా నియమించారు. యుద్ధానంతర ఫ్రాన్స్‌కు గాబ్రియేల్ అటల్ అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు. గాబ్రియేల్ అటల్‌కు ముందు లారెంట్ ఫాబియస్ తన 37 ఏళ్ల వయస్సులో అతి పిన్నవయసు ప్రధాని అయ్యారు. 1984లో ఫ్రాంకోయిస్ మిత్రాండ్ ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు. తాజాగా ఎలిజబెత్ బోర్న్ స్థానంలో గాబ్రియెల్ నియమితులయ్యారు. గాబ్రియేల్ అటల్ బహిరంగంగా తాను స్వలింగ సంపర్కుడినని (గే) ప్రకటించుకున్నారు. గాబ్రియేల్ అటల్ 2018లో మాక్రాన్ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా ఉన్నప్పుడు చర్చల్లో నిలిచారు. ఆ సమయంలో అటల్.. మాక్రాన్ మాజీ రాజకీయ సలహాదారు స్టెఫాన్ సెజోర్న్తో సంబంధం ఏర్పరుచుకున్నారు. గాబ్రియేల్ అటల్ మాజీ క్లాస్మేట్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి సమయంలో గాబ్రియేల్ అటల్ ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పనిచేశారు. అప్పటి నుండి ఫ్రెంచ్ రాజకీయాల్లో కీలకనేతగా మారారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు అటల్ ఆయనకు సలహాదారునిగా ఉన్నారు. అలాగే ఐదేళ్లపాటు ఆరోగ్య మంత్రికి సలహాదారుగానూ పనిచేశారు. దశాబ్ద కాలంలోనే ఫ్రాన్స్ ప్రధానమంత్రి పదవిని అందిపుచ్చుకున్నారు. అటల్ 2027 జూన్ 18న ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు అటల్ 1989 మార్చి 16న పారిస్ సమీపంలోని క్లామార్ట్లో జన్మించారు. అటల్ ట్యునీషియా యూదు న్యాయవాది, చిత్రనిర్మాత వైవ్స్ అటల్ కుమారుడు. అటల్ తండ్రి 2015లో కన్నుమూశారు. అటల్ తన ముగ్గురు చెల్లెళ్లతోపాటు పారిస్‌లో పెరిగారు. అతని తల్లి మేరీ డి కోర్రిస్ ఒక చిత్ర నిర్మాణ సంస్థలో పనిచేశారు. అటల్ పారిస్‌లోని ఎకోల్ అల్సాసిన్ పాఠశాలలో చదువుకున్నారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాక, ప్రతిష్టాత్మక సైన్సెస్ పో విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అనంతరం పబ్లిక్ అఫైర్స్‌లో పీజీ పట్టా పొందారు. అటల్ రాజకీయ జీవితం 2006లో సోషలిస్టు పార్టీలో చేరడంతో ప్రారంభమయ్యింది. -
‘గే లవ్ ఫాంటసీలో ఒబామా’.. మాజీ ప్రియురాలి లేఖలో మరిన్ని వివరాలు..
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 1982లో తన మాజీ ప్రేమికురాలికి ఒక లేఖ రాశారు. దానిలో ఏమి రాశారన్నది తాజాగా బయటపడి సంచలనంగా మారింది. బరాక్ ఒబామాకు గే సెక్స్ అంటే ఇష్టమని ఈ లెటర్ ద్వారా వెల్లడయ్యింది. తనకు రోజూ పురుషులను దగ్గరికి తీసుకోవడమంటే ఇష్టమని, అయితే అది తన కల్పన మాత్రమేనని దానిలో ఒబామా పేర్కొన్నారు. బరాక్ ఒబామా తన మాజీ ప్రియురాలికి రాసిన లేఖను న్యూయార్క్ పోస్టు బయటపెట్టింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఒబామాకు గే సెక్స్ ఫాంటసీ అంటే ఇష్టమనే విషయాన్ని ఈ ఉత్తరం వెల్లడించింది. దానిలో ఆయన తాను పురుషులతో రోజూ లైంగిక కార్యకలాలపాల్లో పాల్గొంటున్నట్లు కలలుకంటానని తెలిపారు. ఈ ఉత్తరం రాసే సమయానికి ఒబామా వయసు 21 ఏళ్లు. 1982 నవంబరులో ఆయన తన మాజీ ప్రేమికురాలు అలెక్స్ మెక్నియర్కు ఈ ఉత్తరం రాశారు. ఒబామా, అలెక్స్ ఆరోజుల్లో లాస్ఏంజిల్స్లోని ఆక్సిడెంటల్ కాలేజీ విద్యార్థులు. అప్పుడు వారు రిలేషన్లో ఉండేవారు. ఆ ఉత్తరంలో ఒబామా.. హోమో సెక్సువాలిటీ గురించి ప్రస్తావించారు. 40 ఏళ్ల క్రితం నాటి ఈ లెటర్‌ను ఒబామా తాను రాసినదేనని అంగీకరించారు. తాను ఒక పురుషుని రూపంలోనే మరో పురుషునితో ఉండేందుకు ఇష్టపడ్డానని ఒబామా పేర్కొన్నారు. ఒబామాతో రిలేషన్ ముగిసిన అనంతరం అతని మాజీ ప్రేమికురాలు అలెక్స్ ఆ లేఖలోని కొన్ని వివరాలను వెల్లడించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ ఉత్తరం ఎమోరీ యూనివర్శిటీలో ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 1992లో మిషెల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఇది కూడా చదవండి: 6 వేల కి.మీ. ప్రయాణించి బీచ్‌లో బిడ్డకు జననం.. పరాయి ప్రాంతంలో బందీగా మారిన జంట! -
గే యాప్‌లో పరిచయం.. నగ్నచిత్రాలు తీసి బెదిరింపులు
సాక్షి, బంజారాహిల్స్: గే యాప్‌లో పరిచయం చేసుకొని వారిని తన గదికి రప్పించి నగ్నదృశ్యాలు చిత్రించి బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఓ రౌడీషీటర్‌ను, ఆయన అనుచరుడిని బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే...బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని భోలానగర్‌లో నివసించే అఫ్రిది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్‌గా నమోదై ఉన్నాడు. ఇతను ఆవారాగా తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతూ బతుకువెల్లదీస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈజీమనీకి అలవాటు పడి గే యాప్‌లో యువకులను పరిచయం చేసుకోసాగాడు. వారిని తన గదికి రప్పించి దుస్తులు విప్పించి వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నాడు. మూడు రోజుల క్రితం ఇద్దరు యువకులను ఇదే తరహాలో బెదిరించి నగదు, నగలు దోచుకున్నాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అఫ్రిదీతో పాటు సహకరించిన హరూన్ (22) అనే యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: నర్సు వేషంలో ఆస్పత్రిలో చేరి.. ఫ్రెండ్ భార్యను.. -
అతనో రాజవంశస్తుడు..కానీ 'గే' కావడంతో..ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి..
తల్లిదండ్రులు సమాజంలో ఎంతటి గొప్ప స్థితిలో ఉన్న వారికి పుట్టే పిల్లలు బాగుండాలని రూల్ లేదు. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. సామరస్య పూర్వకంగా వాస్తవాన్ని అంగీకరిస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ అంగీకరించేందుకు సిద్ధపడకపోవడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. ఇది వాళ్లకు తెలియకుండానే వారి వాళ్లేనే శత్రువులా చేసి..వారిలోని దుర్మార్గం అనే కోణాన్ని పరిచయం చేస్తుంది. వివరాల్లోకెళ్తే..గుజరాత్‌కి చెందిన ప్రిన్స్ మన్వేంద్ర సింగ్ గోహిల్ రాజ్‌పిప్లా మహారాజుల వారసుడు. అతను స్వలింగ సంపర్కుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే దీన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. కొడుకుకి బ్రెయిన్ శస్త్ర చికిత్స చేయించి.. మాములు వ్యక్తి మాదిరిగా మార్చాలనుకున్నారు. అందుకోసం వైద్యులను సంప్రదించి ఎలక్ట్రిక్ షాక్ థెరపీని ఇప్పించే యత్నం చేశారు. ఇది మన్వేంద్ర సింగ్ మనసుని మెలితిప్పినట్లు అనిపించింది. అయితే అతన తల్లిదండ్రలు తన పట్ల ప్రవర్తించే తీరుని తప్పుపట్ట లేదు. వైద్యులు కూడా ఇది మాసికి రుగ్మత కాదని ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పడంతో వారి ప్రయత్నాలను విరమించుకున్నారు. బహుశా ఇదే అతనికి స్వలింగ సంపర్కుల కోసం కృషి చేయాలనేందుకు నాంది పలికిందేమో!. ప్రస్తుతం మన్వేంద్ర సింగ్ ఈ విషయమై సుప్రీం కోర్టులో ఫైట్ చేస్తున్నాడు. తనలా చాలామంది స్వలింగ సంపర్కులు బాధపడుతున్నారని, సమాజానికి భయపడి వారికి ఆపరేషన్లు చేయిస్తున్నారంటూ న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఇది అమానుషం, చట్టం విరుద్ధం అని మన్వేంద్ర సింగ్ వాదన. అలాగే ఈ విషయమై తమ పిల్లలను హింసించే హక్కు తల్లిదండ్రలకు లేదంటూ స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడుతున్నాడు. భారత న్యాయవ్యవస్థ చాలా ఉదాసీనతగా ఉందని, కాబట్టి తనకు తప్పక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ విషయంలో నా తల్లిదండ్రులనే కాదు ఇతర వ్యక్తులను కూడా ద్వేషించను. ఎందుకంటే ప్రజకు దీనిపై అవగాహన లేకపోవడమే అందుకు ప్రదాన కారణమని చెబుతున్నాడు. వారికి వాస్తవాలను వివరించి, అవగాహన కల్పించడమే తన ధ్యేయం అని అంటున్నాడు. 2006లో ఈ యువరాజు మన్వేంద్ర సింగ్ కథ గుజరాత్ న్యూస్ ఛానల్స్ హాట్ టాపిక్‌గా నిలిచింది. అంతేగాదు అతను 2007లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఓప్రా విన్ఫ్రే షోకి గెస్ట్‌గా రావడం విశేషం. అతను గుజరాత్లో స్వలింగసంపర్కుల ఛారిటీ 'లకీషా'వ్యవస్థాపకుడు కూడా. రాజవంశస్తుడైన తన స్థితిని చూసి భయపడక స్థైర్యంగా బహిరంగంగా చెప్పడమే గాక తనలాంటి వాళ్ల కోసం పాటుపడటం గ్రేట్. 'రాజు' అంటే ఏంటో చూపించాడు మన్వేంద్ర సింగ్ గోపాల్. (చదవండి: చీర అందమే అందం! ఇటలీ వాసులనే ఫిదా చేసింది!) -
మీరు 'గే' కదా?.. ప్రముఖ డైరెక్టర్‌కు షాకిచ్చిన నెటిజన్!
బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ దాదాపుగా అందరికీ సుపరిచితమే. గతేడాది బ్రహ్మస్త్ర సినిమాను నిర్మించారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, నాగార్జున ఈ చిత్రంలో కీలకపాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా కనిపించనున్నారు. అయితే కరణ్ జోహార్‌కు సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనూ అప్డేట్స్ ఇస్తుంటారు. (ఇది చదవండి: 25 ఏళ్ల నుంచి అవకాశాలే రాలే, అందుకే ఇలా తయారైంది: ఉర్ఫీ) అయితే తాజాగా ట్విటర్‌కు పోటీగా థ్రెడ్స్ యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ అందులోకి ఎంట్రీ ఇచ్చారు. థ్రెడ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కరణ్.. అభిమానులు తనను ఏదైనా అడగాలంటూ ఛాన్స్ ఇచ్చారు. పది నిమిషాల పాటు మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపాడు. అయితే ఓ నెటిజన్ మాత్రం చాలా ఆశ్చర్యకర ప్రశ్నవేశాడు. మీరు గే కదా? అని మెసేజ్ చేశాడు. అతనికి కూడా అదేరీతిలో దిమ్మదిరిగేలా కౌంటరిచ్చాడు కరణ్. నీకు ఆసక్తిగా ఉందా? అంటూ రిప్లై ఇచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొత్త యాప్‌లో ఎంట్రీ ఇవ్వగానే కరణ్‌కు ఇలాంటి షాకిచ్చాడేంట్రా నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. కాగా.. కరణ్ జోహార్ నిర్మిస్తున్న రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ జూలై 28న థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: నా చీర పిన్ తీసేయమని డైరెక్టర్ అడిగారు: సీనియర్ హీరోయిన్) -
పెళ్లికుదిరినా అందుకు ఒప్పుకోలేదు.. వ్యాపారవేత్తను హత్య చేసిన 'గే'..
సాక్షి, బెంగళూరు: కొద్దిరోజులక్రితం కర్ణాటక బెంగళూరులో 44 ఏళ్ల వ్యాపారవేత్త దారుణహత్యకు గురయ్యాడు. అతని సన్నిహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే ఆర్థిక తగాదాలే ఈ హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు తొలుత అనుమానించారు. కానీ విచారణలో వెలుగుచూసిన అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. హత్యకు గురైన వ్యాపారవేత్త పేరు లియాకాత్ అలీ ఖాన్. ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. నిందితుడి పేరు ఇల్యాజ్ ఖాన్(26). ఇతని దగ్గరే చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అయితే ఇద్దరు స్వలింగసంపర్కులు. కరోనా లాక్డౌన్లో వీరి మధ్య రిలేషన్ ఏర్పడింది. అప్పటి నుంచి రెండేళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 28న కూడా మైసూరు రోడ్డులోని నయందహల్లిలో పాత భవనంలో రాత్రి ఇద్దరూ కలిశారు. అనంతరం తనకు అమ్మాయితో పెళ్లి కుదిరిందని, ఇకపై రిలేషన్ కొనసాగించలేనని ఇల్యాజ్ చెప్పాడు. దీనికి లియాకాత్ ఒప్పుకోలేదు. రిలేషన్ కొనసాగించాల్సిందేనని పట్టుబట్టాడు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో లియాకాత్‌ను ఇల్యాజ్ తలపై సుత్తితో బాదాడు. ఆపై కత్తెర్లతో అతడ్ని పొడిచాడు. తీవ్రగాయాలపాలైన లియాకాత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లియాకాత్ కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొదట ఈ హత్యలో ముగ్గురి ప్రమేయం ఉండవచ్చని అనుమానించారు. కానీ ఇల్యాజ్‌ను విచారించగా అసలు విషయం తెలిసింది. అతనొక్కడే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. కాగా.. లియాకాత్ అలీకి ఓ మహిళతో పెళ్లైంది. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ రిపోర్టులో మరోసారి కవిత పేరు -
స్టార్ ఫుట్‌బాలర్ సంచలన నిర్ణయం
చెక్ రిపబ్లిక్ స్టార్ ఫుట్‌బాలర్.. మిడ్పీల్డర్ జకుబ్ జాంట్కో తనను తాను 'గే'(Gay-స్వలింగ సంపర్కుడు)గా ప్రకటించుకున్నాడు. సోమవారం ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ''నేను హోమోసెక్సువల్.. ఈ విషయాన్ని ఇంకా దాచుకోవాలనుకోవడం లేదు. అందరిలాగే నేను కూడా నా జీవితాన్ని స్వేచ్ఛగా, భయం, పక్షపాతం లేకుండా ప్రేమతో జీవించాలనుకుంటున్నా. ఒక ఫుట్‌బాలర్‌గా నా కెరీర్లో ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ప్రొఫెషనలిసమ్, అభిరుచితో వర్క్ చేయడానికి ఇష్టపడుతా.. ఎవరిపై ఆధారపడాల్సి అవసరం నాకు లేదు. ఒక స్వలింగ సంపర్కుడిగా నాకు నేను స్వేచ్ఛను ప్రకటించుకున్నా'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఫుట్‌బాల్‌లో కెరీర్లో కొనసాగుతూ తాము స్వలింగ సంపర్కులమని కొంతమంది ఆటగాళ్లు మాత్రమే ధైర్యంగా బయటకు చెప్పగలిగారు. 1990లో జస్టిన్ ఫషాను, 2021లో ఆస్ట్రేలియాకు చెందిన జోష్ కావల్లో, 2022లో ఇంగ్లీష్ ఫుట్‌బాలర్ జేక్ డేనియల్స్.. తాజాగా జకుబ్ జాంట్కో తనను తాను గేగా ప్రకటించుకున్నాడు. ఇక జాంట్కో చెక్‌రిపబ్లిక్ తరపున 45 మ్యాచ్‌లాడి నాలుగు గోల్స్ కొట్టాడు. సీరీ-ఎ క్లబ్లో ఉడినీస్, సంప్డోరియా క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. pic.twitter.com/PZNSAteOch — Jakub Jankto (@jakubjanktojr) February 13, 2023 చదవండి: Viral: భారత క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం -
రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ 'గే'నే: నటుడు
నటుడు నోవా షన్నాప్.. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన స్ట్రేంజర్ థింగ్స్‌లో విల్ బయర్స్ అనే గే పాత్రలో నటించాడు. తీరా ఇప్పుడు తాను నిజంగానే స్వలింగ సంపర్కుడినని ప్రకటించాడు. 'పద్దెనిమిదేళ్లపాటు భయపడుతూ బతికిన నేను ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకున్నాను. నేను గే అని నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కు చెప్పేశాను. కానీ వాళ్లెంతో సులువుగా ఆ విషయం మాకు తెలుసని అనేశారు' అంటూ ఓ టిక్‌టాక్ వీడియో చేశాడు. అక్కడితో ఆగకుండా 'నేను రియల్‌లైఫ్‌లో కూడా విల్ బయర్స్నే' అంటూ తాను స్వలింగ సంపర్కుడినని నొక్కి చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆ సిరీస్ చేసినప్పుడే మేము గెస్ చేయాల్సింది అని కామెంట్లు చేస్తున్నారు. I'm so proud of Noah Schnapp for coming out!!! his caption almost made me choke laughing pic.twitter.com/36F55vCFcb — Mirian 🐍 (@MirianMeriQuei) January 5, 2023 చదవండి: తల్లితో కలిసి వంట చేస్తున్న అల్లు అయాన్ నరేశ్ పెళ్లి జరగనివ్వను: రమ్య -
'నా భర్త గే.. ఎంత ట్రై చేసినా దగ్గరకు రానివ్వట్లేదు..' కోర్టు కీలక తీర్పు
ముంబై: ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త స్వలింగ సంపర్కుడని, ఈ విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. పెళ్లయిన తర్వాత ఆయనకు దగ్గరయ్యేందుకు ఎంత ట్రై చేసినా ఫలితం లేకపోయిందని, ఆయనకు పురుషులతో శారీరక సంబంధాలు ఉన్నాయని చెప్పింది. అంతేగాక తనను శారీరకంగా వేధిస్తున్నాడని, దుర్భాషలాడుతూ తన ఆర్థిక పరిస్థితి, కుటుంబాన్ని కించ పరిచేలా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించింది. అయితే వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. గే అని దాచినందుకు ఆమెకు రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని, అలాగే ప్రతి నెల రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్ కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేశాడు భర్త. ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. ఆమెకు రూ.లక్ష, ప్రతి నెల రూ.15 చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ దంపతులకు 2016లో వివాహం జరిగింది. పెళ్లై రోజులు గడుసున్నా ఆమెను అతడు దగ్గరకు రానివ్వలేదు. హింసించడం మొదలుపెట్టాడు. అనుమానంతో అతడ్ని గమనించిన భార్య.. చివరకు గే అని కనిపెట్టింది. ఇతర పురుషులతో అతడు నగ్నంగా దిగిన ఫొటోలోను అతని ఫోన్లో చూసింది. వాటినే కోర్టుకు సాక్ష్యంగా సమర్పించింది. చదవండి: డబ్బు విషయంలో భర్తతో గొడవ.. 8 ఏళ్ల కుమారుడ్ని కాలువలోకి విసిరి.. -
గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న ద్యుతీచంద్!
భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ద్యుతీచంద్ తన గర్ల్‌ఫ్రెండ్ మోనాలీసాను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రావడం ఆసక్తి కలిగించింది. గతంలోనే ద్యుతీచంద్ తనను తాను గే(GAY)గా ప్రకటించుకుంది. భారత్ నుంచి స్వలింగ సంపర్కాలిగా ప్రకటించుకున్న తొలి భారత అథ్లెట్‌గా ద్యుతీచంద్ నిలిచింది. గర్ల్‌ఫ్రెండ్ మోనాలీసాతో లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు 2019లో తెలిపింది. తాజాగా డిసెంబర్ 4న(శుక్రవారం) తన గర్ల్‌ఫ్రెండ్ మోనాలిసాతో కలిసి దిగిన ఫోటోలను ద్యుతిచంద్ తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ‘నిన్ను ప్రేమించా. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా. ఈ ప్రేమ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది’ అని ట్యాగ్ లైన్ ఇచ్చింది. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారన్న వార్తల్లో నిజం లేదు. ద్యుతీచంద్ తన సోదరి పెళ్లి వేడుకలో గర్ల్‌ఫ్రెండ్ మోనాలీసాతో ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది. తాను ‘గే’ అని 2019లో వెల్లడించిన ద్యుతీచంద్ స్వలింగ సంపర్కులకు మద్దతుగా ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో ఎల్జీబీటీక్యూ జెండాతో నడుస్తూ కనిపించింది. తాను స్వలింగ సంపర్కురాలిని అని వెల్లడించినప్పుడు తన కుటుంబం ఒప్పుకోలేదని ద్యుతీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ ప్రకటన తర్వాత కుటుంబం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించింది. ‘ఎల్జీబీటీక్యూ అథ్లెట్లు సురక్షితంగా, సుఖంగా ఉండాలి. హింస లేదా మరణం భయం లేకుండా వాళ్లు సాధారణ వ్యక్తులుగా ఉండాలి’ పేర్కొంది. “Loved you yesterday, love you still, always have, always will.” pic.twitter.com/1q3HRlEAmG — Dutee Chand (@DuteeChand) December 2, 2022 చదవండి: ఎలిమినేటర్ మ్యాచ్.. గల్లీ క్రికెట్‌లా ఈ ఆటలేంటి! -
నైట్ క్లబ్లో కాల్పుల మోత.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు..
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కొలరడో స్ప్రింగ్స్‌లోని ఓ గే నైట్ క్లబ్లో సాయుధుడు తుపాకీతో రెచ్చిపోయాడు. కన్పించిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. 18 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు కూడా వెళ్లాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి పాల్పడటానికి కారణమేంటనే విషయాలను వెల్లడించలేదు. అమెరికా మీడియా మాత్రం సాయుధుడు ఇంకా క్లబ్‌లోనే ఉన్నాడని, స్నైపర్‌తో కాల్పులు జరుపుతున్నాడని పేర్కొంది. ఈ క్లబ్లో ప్రతిఏటా నవంబర్ 20న గే సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగానే పదుల సంఖ్యలో స్వలింగ సంపర్కులు నైట్ క్లబ్‌కు వచ్చారు. అయితే సాయుధుడు ఒక్కసారిగా వీరిపై కాల్పులకు తెగబడ్డాడు. చదవండి: 140 ఏళ్ల తర్వాత కన్పించిన అరుదైన పక్షి.. ఫొటో వైరల్.. -
'నేను 'గే' అయినందు వల్లే జడ్జిగా ప్రమోషన్ ఇవ్వట్లేదు'
సీనియర్ న్యాయవాది సౌర్‌భ్ కిర్పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను స్వలింగ సంపర్కుడు(గే) అయినందు వల్లే జడ్జిగా పదోన్నతి కల్పించడం లేదని పేర్కొన్నారు. న్యాయమూర్తల నియామక ప్రక్రియపై కేంద్రం దృష్టిసారించిన నేపథ్యంలో సీనియర్ అడ్వకేట్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి సౌరభ్ కిర్పాల్ 2017లోనే జడ్జి కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలు ఆమోదానికి నోచుకోలేదు. కేంద్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే జడ్జిగా పదోన్నతి లభించకపోవడానికి తన లైంగిక ధోరణే ప్రధాన కారణమని భావిస్తున్నట్లు సౌరభ్ కిర్పాల్ పేర్కొన్నారు. ఒక గేను న్యాయమూర్తిగా నియమించేందుకు కేంద్రం సుముఖంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: శ్రద్ధ హత్యకేసు.. అఫ్తాబ్‌కు ఐదు రోజుల కస్టడీ.. ఉరితీయాలని డిమాండ్ -
అతను 'గే' అని తెలిసిందో.. ఆ పని చేస్తాను: రకుల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అతితక్కువ కాలంలోనే పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలె ఆమె హిందీలో నటించిన డాక్టర్ జీ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఇక నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇదిలా ఉండగా తాజాగా రకుల్ ప్రీత్‌కి సంబంధించన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 2011లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్న రకుల్‌కు.. ఒకవేళ మీ కొడుకు గే అని తెలిస్తే ఏం చేస్తారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రకుల్ స్పందిస్తూ.. ఈ విషయం తెలియగానే నేను షాక్ అవుతాను. వెంటనే అతన్ని చెంపదెబ్బ కొడతాను. కానీ తర్వాత ఆలోచిస్తాను. అతని అతని నిర్ణయం అని గౌరవిస్తాను. అదే దారిలో తను వెళ్లాలనుకుంటే నాకు ఎలాంటి సమస్య లేదు. నాకు సంబంధించినంత వరకు నేను చాలా ముక్కుసూటిగా ఉండేందుకు ఇష్టపడతాను అంటూ ఆమె బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. -
'గే' మ్యారేజెస్‌కు ఆ దేశంలో చట్టబద్దత
హవానా: స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాల జాబితాలో మరో దేశం చేరింది. గే మ్యారేజెస్‌కు క్యూబా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే మహిళల హక్కులకు పెద్దపీట వేస్తున్న ఈ కమ్యూనిస్టు దేశం 'సేమ్ జెండర్' మ్యారేజెస్‌ను అధికారికం చేసింది. ఈ చట్టం కోసం ఆదివారం పెద్దఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ప్రభుత్వం. 84లక్ష మంది పాల్గొన్న ఈ ఓటింగ్‌లో దాదాపు 40 లక్షల మంది(66.9శాతం) దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 1.95లక్షల మంది(33శాతం) మాత్రం వ్యతిరేకించారు. దీంతో ప్రజల నుంచి భారీ మద్దతు వచ్చినందున గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు క్యూబా ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఈ విషయంపై క్యూబా అధ్యక్షుడు డయాజ్ క్యానెల్ స్పందిస్తూ.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని ట్వీట్ చేశారు. కొన్ని తరాల రుణం తీర్చుకున్నట్లయిందని పేర్కొన్నారు. ఎన్నో క్యూబా కుటుంబాలు ఈ చట్టం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో క్యూబాలో స్వలింగ సంపర్కుల పెళ్లికి చట్టబద్దత లభిస్తుంది. వీరు పిల్లల్ని కూడా దత్తత తీసుకోవచ్చు. పురుషులు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయి. చదవండి: యువకుడి అసాధారణ బిజినెస్.. సినిమాలో హీరోలా.. -
అవును.. నేను ‘గే’: సంచలన ప్రకటన చేసిన కివీస్ మాజీ క్రికెటర్
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ హీత్ డెవిస్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక ప్రకటన చేశాడు. తాను స్వలింగ సంపర్కుడినని వెల్లడించాడు. ఈ విషయం ఆక్లాండ్ దేశవాళీ క్రికెట్ జట్టులోని ప్రతి ఒక్కరికి తెలుసనని, అయినప్పటికీ తన పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించలేదని చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లు ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచానని.. అయితే దీని కారణంగా కాస్త మానసిక ఒత్తిడికి గురైనట్లు డెవిస్ తెలిపాడు. తాను ‘గే’ను అని ఇక దాచిపెట్టడం ఇష్టలేకనే ఈ విషయం బయటపెడుతున్నట్లు పేర్కొన్నాడు. వాళ్లు నన్నేమీ అనలేదు! ఈ మేరకు 50 ఏళ్ల హీత్ డెవిస్ ఆన్లైన్ మ్యాగజీన్ ది స్పిన్ఆఫ్తో మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలోని ఈ విషయం గురించి దాచిపెడుతున్నాననే భావన ఉండేది. నిజానికి ఇది నా వ్యక్తిగతం.. అయినా ఎందుకో దాచిపెట్టాలనిపించలేదు. బయటి ప్రపంచానికి చెప్పాలనుకున్నా. ఆక్లాండ్‌లో జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి నేను గే అని తెలుసు. అయినా వాళ్లు దీనిని పెద్ద సమస్యగా భావించలేదు. నన్ను నాలా స్వేచ్ఛగా ఉండనిచ్చారు’’ అని చెప్పుకొచ్చాడు. రెండో ఇంటర్నేషనల్ క్రికెటర్.. మొదటి కివీస్ ఆటగాడు.. కాగా మహిళా క్రికెటర్లలో చాలా మంది ఇప్పటికే తమ సహచర ప్లేయర్లను ప్రేమించి స్వలింగ సంపర్క వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పురుష క్రికెటర్లలో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లలో.. ఇంగ్లండ్ క్రికెటర్ స్టీవెన్ డేవీస్ మాత్రమే తాను గే అని 2011లో బహిరంగంగా ప్రకటించాడు. అతడి తర్వాత ఇలాంటి సంచలన ప్రకటన చేసిన రెండో పురుష క్రికెటర్‌గా హీత్ డెవిస్ నిలిచాడు. ఇక న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెటర్లలో గే అని చెప్పుకొన్న మొదటి ఆటగాడు ఇతడే కావడం విశేషం. కాగా న్యూజిలాండ్‌లో స్వలింగ సంపర్కం నేరం కాదన్న విషయం తెలిసిందే. అదే విధంగా స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్దత ఉంది. ఇదిలా ఉంటే.. కివీస్ తరఫున 1994, ఏప్రిల్‌లో శ్రీలంకతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో పేసర్ హీత్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత అదే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అయితే పెద్దగా విజయవంతం కాని హీత్ డెవిస్ 1997లో తన చివరి వన్డే, టెస్టు మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో మొత్తంగా 17, వన్డేల్లో 11 వికెట్లు తీశాడు. అనంతరం 2003లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు వెళ్లి అక్కడ కోచ్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో 2008లో ఆక్సిడెంట్ కారణంగా అతడి ఎడమకాలి పాదం కోల్పోయాడు. చదవండి: Rohit Sharma: అందుకే ఆవేశ్ చేతికి బంతి! ఇదొక గుణపాఠం... మా ఓటమికి ప్రధాన కారణం అదే! SuryaKumar Yadav: అయ్యో.. సూర్యకుమార్‌కు ఎంత కష్టం! -
లైంగికంగా వేధించారు.. అందుకే 'గే' అయ్యావా అన్నారు..
Lock Upp: Saisha Shinde Reveal Secret Says This Is Why You Are Gay: బాలీవుడ్ వివాస్పద బ్యూటీ కంగనా రనౌత్ ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు హోస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన రియాలిటీ షో 'లాకప్'కు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ఇటీవలి జడ్జిమెంట్ స్పెషల్ ఎపిసోడ్లో మునావర్ ఫరూఖీ తన లైఫ్ సీక్రెట్‌ను చెప్పాడు. తన ఆరేళ్ల వయసులో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత కంగనాకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని చెప్పి షాక్‌కు గురి చేసింది. అయితే వీరి తర్వాత ఎవిక్షన్ నుంచి సేవ్ అయిన సైషా షిండే తను ఎలాంటి వేధింపులను ఎదుర్కుందో లాకప్ వేదికగా తెలియజేసింది. 'ఇది నా మొదటి సీక్రెట్. మీకు (మునావర్ ఫరూఖీ, కంగనా రనౌత్) జరిగిన లైంగిక వేధింపులను మీరు పంచుకోవడం చూశాక, అది విని ప్రజలు ఎలా రియాక్టయ్యారో చూశాక నాకు జరిగింది గుర్తుకు వచ్చింది. నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను. ఈ విషయం చెప్పినప్పుడు కొంతమంది వ్యక్తులు 'ఇందుకేనా నువ్ స్వలింగ సంపర్కురాలివి అయ్యావా (గే)' అని అన్నారు. అలా అన్నాక ఇక ఎవ్వరికీ ఈ విషయం గురించి చెప్పే సాహసం చేయలేదు.' చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్ View this post on Instagram A post shared by S A I S H A S H I N D E (@officialsaishashinde) సైషా తాను స్వప్నిల్ షిండేగా ఉన్న సమయం గురించి పలుసార్లు తెలిపింది. ఆ సమయంలో తనను తాను స్వలింగ సంపర్కాలు (గే) అని నమ్మిందట. సైషాగా మారాలని నిర్ణయించుకునేంత వరకు మానసికంగా ఎలా పోరాడిందో తరచుగా చెప్పేది. దీపికా పదుకొణె, కరీనా కపూర్ ఖాన్, కత్రీనా కైఫ్, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్, సన్నీ లియోన్, తాప్సీ పన్ను, భూమి పడ్నేకర్, హీనా ఖాన్‌లతో సహా టాప్ ఎ-లిస్ట్ బాలీవుడ్ నటులతో ప్రముఖ డిజైనర్ స్వప్నిల్ షిండేగా పనిచేసింది. చదవండి: పెళ్లయ్యాక పరాయి వ్యక్తిని ముద్దు పెట్టుకున్నా.. భర్తకు చెప్పిన నటి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_921254769.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ స్టార్ హీరో గే అంటూ ట్రోలింగ్.. అలాగే ఉంటాడన్న భార్య
Hugh Jackman Wife Deborra Reacts To Rumours About His Sexuality: హాలీవుడ్లో 'ఎక్స్ మెన్' చిత్రాలతో సూపర్ పాపులర్ అయిన స్టార్ హీరో హ్యూ జాక్మన్. ఇటీవల ఈ హీరో స్వలింగ సంపర్కుడని ట్రోలింగ్‌కు గురయ్యాడు. హ్యూ జాక్మన్ ఒక గే అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ విషయంపై అతని భార్య, నటి, డైరెక్టర్, చిల్డ్రన్ లాయర్ డెబోరా లీ ఫర్నెస్ క్లారిటీ ఇచ్చింది. 'ఇది చాలా వెర్రి (సిల్లీ), విసుగు తెప్పించే విషయం. ప్రజలు ఇలా ఎలా మాట్లాడతారు ? పత్రికలు కూడా ఇలాంటివి పబ్లిష్ చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. వారు అమ్ముతున్నది ఒక చెత్త. ప్రజలు ఎప్పుడూ ఇలాంటి వార్తలు చదువుతారనే అలా రాసుకొస్తారు. ఇలాంటి వార్తలతో మీ పత్రికలు ఎక్కువ అమ్ముడుపోయి, మీకు మంచి అనుభూతి కలుగుతుంది కదా. కానీ మీరు ఒకరి దుఃఖాన్ని విక్రయిస్తున్నారు.' అని హ్యు జాక్మన్ గురించి తప్పుగా ప్రచురించిన మ్యాగజైన్స్‌పై విరుచుకుపడింది. చదవండి: అమ్మాయిపై దాడి.. రెండోసారి అరెస్టయిన హీరో.. హ్యూ జాక్మన్, డెబోరా 1996లో వివాహం చేసుకున్నారు. వారికి ఆస్కార్ మాక్సిమిలియన్ జాక్మన్, అవా ఎలియట్ జాక్మన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హ్యుూ జాక్మన్ స్వలింగ సంపర్కుడనే పుకార్లపై హ్యూ జాక్మన్ చమత్కారంగా స్పందించాడని డెబోరా తెలిపింది. ఒకవేళ అతను గే అయితే హీరో బ్రాడ్‌పిట్‌తో డేటింగ్ చేసేవాడినని చెప్పాడని డెబోరా పేర్కొంది. 'అతను స్వలింగ సంపర్కుడైతే అలాగే ఉంటాడు. ఈ విషయాన్ని అతనికి దాచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా లేదు. అతను బ్రాడ్‌పిట్‌తో లేదా ఇంకేవరితో అయినా డేటింగ్ చేస్తాడు.' అని డెబోరా పేర్కొంది. వీరిద్దరూ 1995లో ఆస్ట్రేలియన్ టీవీ సిరీస్ కొరెల్లి సెట్లో కలుసుకున్నారు. నాలుగు నెలల డేటింగ్ తర్వాత డెబోరా ఫర్నెస్‌కు హ్యూ జాక్మన్ మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. చదవండి: ఇప్పటికే 9 మంది భార్యలు, మరో ఇద్దరు కావాలట.. ఆ కోరిక తీర్చుకోవాలట పుట్టినరోజుకు 2 రోజుల ముందు చనిపోయిన పాపులర్ నటి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_771247577.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'గే' నుంచి రిక్వెస్ట్..బిగ్ హగ్ అంటూ హీరో రిప్లై
Harshvardhan Rane Reply To His Gay Fan: హ్యాండ్సమ్ హీరో హర్షవర్దన్ రాణె ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో నటించినా ప్రస్తుతం బాలీవుడ్ మీదే ఫోకస్ పెడుతున్నాడు. ఇటీవలె 'బిజోయ్ నంబియార్' అనే చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు కమర్షియల్‌గా అంతగా హిట్ అవ్వకపోయినా రాణె లుక్స్‌కి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. అందుకే ఈ ఆరడుగుల అందగాడికి చాలామంది గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారు. చదవండి: అనుష్క పెళ్లిపై జ్యోతిష్కుడు ఆసక్తికర వ్యాఖ్యలు అయితే తాజాగా ఓ గే నుంచి రాణెకు రిక్వెస్ట్ వచ్చింది. 'నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్‌ని. నేను స్వలింగ సంపర్కుడిని. దయచేసి మీరు తమిళ సినిమాల్లో నటించండి. నా ట్వీట్‌కి రిప్లై ఇవ్వండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటాను' అంటూ తమిళనాడుకు చెందిన నవీన్‌కుమార్ అనే వ్యక్తి పోస్ట్ చేశారు. దీనికి హీరో రాణె స్పందిస్తూ.. గే అయినా, కాకపోయినా నా తరపున బిగ్ హగ్ అని, తనకు ధనుష్ సినిమాల్లోని పాటలంటే ఎంతో ఇష్టమంటూ రాణె రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చదవండి:డిన్నర్ పార్టీలో ఎమోషనల్ అయిన నాగార్జున Gay or not gay, big hug bro! I love tamil songs from Dhanush sirs films! https://t.co/2L7AOvmk4Z — Harshvardhan Rane (@harsha_actor) September 24, 2021 -
నేను ‘గే’ని.. విడాకులు తీసుకుంటున్నాం: నటుడు
హాలీవుడ్ నటులు, దంపతులు ఎమ్మా పోర్ట్నర్, ఇలియట్ పేజ్ విడాకులు తీసుకోబోతున్నారు. మూడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నట్లు ఈ జంట వెల్లడించారు. మ్యాన్‌హట్టన్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశామన్నారు. ఈ సందర్భంగా పేజ్ మాట్లాడుతూ.. ‘‘ఎంతో సుదీర్ఘ ఆలోచనలు.. చర్చ తర్వాత మేం ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. మేం విడాకులు తీసుకుని విడివిడిగా బతకాలని నిర్ణయించుకున్నాం. కానీ మా మధ్య స్నేహం, ఒకరి పట్ల ఒకరికి గౌరవం అలానే కొనసాగుతాయి. మేం బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటాం’’ అంటూ ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఏడాది పాటు డేటింగ్ అనంతరం 2018లో ఈ జంట వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు గోప్యంగా ఉంచిన ఈ విషయాన్ని తర్వాత వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక మూడేళ్ల వివాహ బంధానికి విడాకులతో ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించారు. (విడాకులు తీసుకోబోతున్న స్టార్ కపుల్) ఇక పేజ్ 2014లోనే తాను గేనని ప్రకటించారు. తాజాగా పేజ్ తనను తాను ట్రాన్స్‌మ్యాన్‌గా అంగీకరించారు. గతేడాది డిసెంబర్లో తనను తాను ట్రాన్స్ మ్యాన్‌గా గుర్తించానని.. తనకు మద్దతుగా ఉన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు పేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన నమ్మశక్యం కాని వ్యక్తులందరికి కృతజ్ఞతలు. నేను ఎవరనేది గుర్తించాను. నన్ను నేను గొప్పగా ప్రేమిస్తున్నాను. నా పట్ల నాకున్న ఈ ప్రేమ ఎంత గొప్పదో వ్యక్తపర్చడానికి మాటలు చాలవు’’ అంటూ పేజ్ పోస్ట్ చేశారు. ఈ సమయంలో ఎమ్మా పోర్టనర్ పేజ్‌కి మద్దతు తెలిపారు. ‘‘పేజ్ లాంటి వ్యక్తులు దేవుడిచ్చిన బహుమతి.. వారిని గౌరవించాలి.. వారి ప్రైవసీకి భంగం కలిగించకూడదు’’ అంటూ సపోర్ట్ చేశారు. ఇలా ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే వారు విడాకులు తీసుకోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Emma Portner (@emmaportner) -
యూఎస్ ఎలక్షన్స్: చరిత్ర సృష్టించిన నల్లజాతి గే
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రిచీ టోరెస్(32) సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూఎస్ కాంగ్రెస్(పార్లమెంట్)కు ఎన్నికైన తొలి నల్ల జాతి స్వలింగ సంపర్కుడిగా(గే) టోరెస్ రికార్డుకెక్కాడు. ప్రస్తుతం న్యూయార్క్ సిటీ కౌన్సిల్ సభ్యుడిగా పని చేస్తున్న ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని 15వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. తన సమీప ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పాట్రిక్ డెలిసెస్‌ను ఓడించాడు. నేటి నుంచి కొత్త శకం మొదలవుతుందని టోరెస్ వ్యాఖ్యానించాడు. తన గెలుపు పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. తాను ఆఫ్రో–లాటినో అని టోరెస్ తరచూ చెబుతుంటాడు. ( భారత సంతతి విజేతలు ) 2013 నుంచి సిటీ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అలా మాండెయిర్ జోన్స్(33) అనే మరో నల్లజాతి గే కూడా వెస్ట్చెస్టర్ కౌంటీ నుంచి పోటీ చేశాడు. ఫలితాన్ని ఇంకా వెల్లడించకపోవడంతో అతడు గెలిచాడా లేదా అనే తెలియరాలేదు. ఒకవేళ గెలిస్తే అమెరికా కాంగ్రెస్‌లో ఇద్దరు నల్లజాతి స్వలింగ సంపర్కులు ఉన్నట్లు అవుతుంది. సామాజిక వివక్షను తట్టుకొని, ప్రజల మద్దతు పొంది, నల్లజాతి స్వలింగ సంపర్కులు పార్లమెంట్లో అడుగుపెడుతుండడం శుభపరిణామమని ప్రజాస్వామ్య ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గే పెళ్లి: కులాన్ని భ్రష్టు పట్టించావ్ కదరా!
బెంగళూరు: అమెరికాలో ఓ గే జంట పెళ్లిపై కర్ణాటకలోని కొడగు జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కొడవ సామాజిక వర్గానికి చెందిన శరత్ పొన్నప్ప, కాలిఫోర్నియాలో డాక్టర్‌గా పనిచేస్తున్న సందీప్ దోసాంజిని సెప్టెంబర్ 26న వివాహం చేసుకున్నారు. కొందరు మిత్రుల సమక్షంలో కొడవ సంప్రదాయంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. కొడవ వేషధారణలో ఉన్న పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయం తెలియడంతో శరత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు ఆ కులస్తులు. అనాదిగా వస్తున్న ఆచారాలను భ్రష్టు పట్టించావని శరత్‌పై మండిపడ్డారు. (చదవండి: వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్) ఈ పెళ్లిని ఖండిస్తున్నామని మడికెరి కొడవ సమాజ ప్రెసిడెంట్ కేఎస్ దేవయ్య స్పష్టం చేశారు. తమ కులానికి శరత్ మచ్చ తెచ్చాడని ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. ఇలాంటివి సహించబోమని దేవయ్య హెచ్చరించారు. శరత్‌ను కులం నుంచి వెలివేస్తున్నామని అన్నారు. గతంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదని తెలిపారు. వారి పెళ్లితో తమకు సంబంధం లేదని.. కొడవ వేషాధరణలో వివాహం చేసుకోడం కలచివేస్తోందని చెప్పారు. తమ సంప్రదాయాలను అవమాన పరచవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, కుల పెద్దల ఆగ్రహావేశాలపై స్పందించేందుకు శరత్ ఇంతవరకు స్పందించలేదు. అనుకరించి అవమానిస్తే సహించరు ఇక దుబాయ్‌లో నివాసం ఉంటున్న అతని తల్లిదండ్రులు ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల జనాభా ఉన్న కొడవ కులస్తుల స్వస్థలం కొడగు జిల్లా. వారు ప్రధానంగా కాఫీ తోటలు పండిస్తారు. అడవులు, పర్వతాలు, నదులు, నీటి కాలువల దగ్గర నివాసం ఉంటారు. ప్రత్యేక వేషధారణతో వేడుకలు చేసుకుంటారు. ఇతరులు వాటిని అనుకరించి అవమానిస్తే సహించరు. గతేడాది కొడగు జిల్లాలోని ఓ ఫైవ్‌స్టార్ రిసార్ట్ కొడవ వేషధారణలో సేవలు అందించినందుకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో రిసార్ట్ యాజమాన్యం క్షమాపణలు చెప్పి తప్పు సరిదిద్దుకుంది. కొడగులో పుట్టిన కావేరీ నదిని వారు దేవతగా కొలుస్తారు. (చదవండి: శ్రుతిమించిన ‘గే’ ఆగడాలు) -
‘ఆయన పురుషులతో సన్నిహితంగా ఉంటారు’
అహ్మదాబాద్ : తాను గే అనే విషయం దాచి వివాహం చేసుకున్నాడని భర్తపై 32 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసిన ఉదంతం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో వెలుగుచూసింది. నిందితుడిపై విశ్వాసాన్ని ఉల్లంఘించాడని కేసు దాఖలు చేశారు. తన స్వలింగ సంపర్కాన్ని బయటకు వెల్లడిస్తే తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్‌లోని ఓ సంస్థలో బాధితురాలు లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నారు. 2011లో తాను ప్రేమించి పెళ్లిచేసుకున్నానని, పెళ్లయిన ఏడాది పాటు తన భర్త బాగానే ఉన్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. చదవండి : ‘నేను గేని.. అమెరికాలో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు’ ఆ తర్వాత పురుషులతో సన్నిహితంగా మెలిగేవాడని, వాట్సాప్ చాట్స్‌ను పరిశీలించి నిలదీయగా తనకు పురుషుల పట్లే లైంగికాసక్తి అధికమని, సమాజం కోసం, సంపాదన కోసమే తనను వివాహం చేసుకున్నట్టు చెప్పాడని బాధితురాలు తెలిపారు. అహ్మదాబాద్‌లో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న తన భర్త అక్కడ పనిచేసే పురుషులతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఆయన తన స్నేహితులను ఇంటికి పిలిపించుకుని లైంగిక వాంఛలు తీర్చుకునేవారని వాపోయారు. భర్త పరిస్థితి గురించి అత్తింటి వారికి చెప్పినా వారి నుంచి ఎలాంటి సహకారం లభించలేదని బాధిత మహిళ పేర్కొన్నారు. -
‘నేను గేని.. అమెరికాలో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు’
సాక్షి, గుంటూరు: అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం.. మంచి సంబంధం అని చెప్పడంతో.. కోటి కలలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆ నూతన వధువుకు మూడు రోజులకే భర్త గే అని తెలిసింది. దాంతో ఒక్కసారిగా ఆమె కలల సౌధం కూలిపోయింది. దీన్ని నుంచి ఇంకా తేరుకోని ఆ యువతికి అధిక కట్నం కావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. వివాహం అయ్యి నెల రోజులు కూడా గడవక ముందే భార్య అంటే ఇష్టం లేదంటూ సదరు వ్యక్తి అమెరికా వెళ్లిపోయాడు. దాంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. (ప్రేమించాడు.. పెళ్లంటే వద్దన్నాడు!) వివరాలు.. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోన్న భాస్కర్ రెడ్డికి ఏటి అగ్రహారానికి చెందిన యువతితో వివాహం అయ్యింది. పెళ్లి సమయంలో యువతి తల్లిదండ్రులు యాభై సవర్ల బంగారం, యాభై లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చారు. పెళ్లైన మూడు రోజులకే తాను గేనని భాస్కర్ రెడ్డి, భార్యకు చెప్పాడు. అంతేకాక అమెరికాలో బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడన్నాడు. అంతటితో ఊరుకోక అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధింపులకు గురి చేశాడు. ఆ తర్వాత నెల రోజులు గడవకముందే.. భార్య అంటే ఇష్టం లేదని తేల్చి చెప్పి అమెరికా వెళ్లాడు భాస్కర్ రెడ్డి. వేధింపులు తట్టుకోలేక సదరు యువతి అర్బన్ ఎస్పీని ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటుంది. -
'గే'ల కోసం మాట్లాడితే రూ.10 లక్షల ఫైన్
పాప్ గాయని మడోన్నాకు రష్యా ప్రభుత్వం 10 లక్షల రూపాయల జరిమానా వేసిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ఎనిమిదేళ్ల క్రితం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎల్జీబీటీక్యూలకు మద్దతు తెలుపుతూ మాట్లాడినందుకు ప్రభుత్వం 1 మిలియన్ డాలర్ల జరిమానా విధించిందని చెప్పుకొచ్చారు. నిజానికి ఆమె 2012లో రష్యా టూర్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఎల్జీబీటీక్యూల హక్కుల కోసం మాట్లాడారు. వారికి అందరితోపాటు సమాన గౌరవం, సమాన హక్కులు కల్పించాలని గొంతెత్తి నినదించారు. ఆమె ఉపన్యాసానికి అభిమానుల చప్పట్లతో, ఈలలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. అయితే రష్యా ప్రభుత్వానికి మాత్రం ఇది మింగుడుపడనట్లుంది. ఫలితంగా ఆమెకు పది లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ రుసుమును కాస్త తగ్గించిందని మడోన్నా తెలిపారు. కానీ తాను మాత్రం ఇప్పటివరకు పైసా కూడా చెల్లించలేదని పేర్కొన్నారు. తాజాగా ఆనాటి చేదు సంఘటనను అభిమానులతో పంచుకోవడంతోపాటు, "గే"లకోసం మాట్లాడిన వీడియోను సైతం గాయని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (కరోనాకి అంత సీన్ లేదు!) View this post on Instagram 8 years ago. I was fined 1 million dollars by The government for supporting the Gay community. I never paid.................... #freedomofspeech #powertothepeople #mdna A post shared by Madonna (@madonna) on Jul 19, 2020 at 7:42pm PDT -
అసెంబ్లీలో ‘గే’ వీడియో; ఎమ్మెల్యే కన్నీళ్లు
సాక్షి, బెంగళూరు: కుమారస్వామి సర్కారు బలపరీక్షపై చర్చ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీలో సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నకిలీ స్వలింగసంపర్కుల సెక్స్ వీడియోతో తన పరువు తీశారంటూ బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అరవింద లింబావళి కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ... సోషల్ మీడియాతో ఇద్దరు వ్యక్తులు ముద్దులు పెట్టుకునే వీడియో పెట్టడం ద్వారా అందులో తాను ఉన్నానని, దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, ఇలాంటి వీడియోలు మార్ఫింగ్ చేసి తమను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. కుట్రలో అధికార పార్టీతో పాటు సొంత పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు వివరణ ఇస్తానన్నారు. కుట్రలు వీడి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొవాలని ఆయన సూచించారు. మార్ఫింగ్ వీడియో వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని స్పీకర్‌ను కోరారు. లింబావళి అవమానకరంగా ప్రవర్తించారని జేడీఎస్ ఎమ్మెల్యే శివలింగ గౌడ ఆరోపించారు. దీనిపై లింబావళి స్పందిస్తూ.. ‘నకిలీ వీడియో కారణంగా నేను ఎంతో క్షోభ అనుభవించాను. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే మా కుటుంబం పడే బాధ అప్పుడు తెలుస్తుంది. ఈ వీడియో కారణంగా మా పిల్లలు ఎంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారో నాకు మాత్రమే తెలుసు’ అంటు ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనను స్పీకర్ రమేశ్‌కుమార్ సముదాయించారు. కాగా, ఈ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ లింబావళి మద్దతుదారులు వేర్వేరుగా రెండు ఫిర్యాదులు చేశారు. దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. (చదవండి: ఒక్కరోజు ఆగితే తిరుగులేదు) -
నేను గే కాదు; క్లారిటీ ఇచ్చిన ఫాల్క్‌నర్
‘నిన్న రాత్రి నేను చేసిన పోస్టు అపార్థాలకు దారి తీసింది. నేను స్వలింగ సంపర్కుడిని(గే) కాదు. ఏదేమైనప్పటికీ ఎల్బీజీటీ కమ్యూనిటీ నుంచి నాకు అద్భుతమైన మద్దతు లభించింది. ఈ విషయాన్ని నేనెన్నటికీ మరచిపోలేను. ఎవరిదైనా ప్రేమే. ఇక రోబుస్టా నాకు మంచి స్నేహితుడు. ఇంకో విషయం.. రాత్రి చెప్పినట్లు ఐదేళ్లుగా కలిసి ఉండటం అంటే ఒకే ఇంట్లో ఉంటున్నామని ఉద్దేశం. అయినా ప్రతీ ఒక్కరూ ఈ విషయంలో మద్దతుగా నిలవడం చాలా బాగుంది’ అంటూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ తాను గేను కానని స్పష్టం చేశాడు. కాగా సోమవారం తన 29వ పుట్టినరోజు సందర్భంగా స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను ఫాల్క్‌నర్ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ‘నా బాయ్‌ఫ్రెండ్ రొబుస్టాతో పాటు మా అమ్మతో కలిసి పుట్టిన రోజు డిన్నర్’ అంటూ టుగెదర్ఫర్5ఇయర్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఫాల్క్‌నర్ గే అని, స్వలింగ సంపర్కుడినంటూ ప్రకటన చేసిన తొలి ఆసీస్ క్రికెటర్ అని పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఫాల్క్‌నర్‌తో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కూడా ఈ కథనాలపై క్లారిటీ ఇచ్చింది. ఈ విషయం గురించి సీఏ అధికార ప్రతినిధి కరీనా కేస్లెర్ మాట్లాడుతూ.. ‘ వ్యాపార భాగస్వామి, హౌజ్‌మేట్ అయిన స్నేహితుడితో తనకు ఉన్న అనుబంధం గురించి ఫాల్క్‌నర్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. అతడు చేసిన ఈ జోక్ కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నాం. పత్రికలు కూడా ఈ విషయం గురించి ప్రచురించే ముందు అతడిని సంప్రదించలేదు. దీంతో గందరగోళం నెలకొంది. ఎల్జీబీటీ కమ్యూనిటీకి జేమ్స్, సీఏ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 69 వన్డేలు, 24 టి20లు ఆడిన ఫాల్క్‌నర్... ఏడాదిన్నరగా జట్టులోకి ఎంపిక కాలేదు. కాగా, తాను ‘గే’నంటూ చెప్పుకొన్న తొలి అంతర్జాతీయ క్రికెటర్ ఇంగ్లండ్‌కు చెందిన స్టీవెన్ డేవిస్. 2011లో అతడీ మేరకు ప్రకటన చేశాడు. View this post on Instagram There seems to be a misunderstanding about my post from last night, I am not gay, however it has been fantastic to see the support from and for the LBGT community. Let’s never forget love is love, however @robjubbsta is just a great friend. Last night marked five years of being house mates! Good on everyone for being so supportive. A post shared by James Faulkner (@jfaulkner44) on Apr 29, 2019 at 5:07pm PDT -
నేను ‘గే’ : ఫాల్క్‌నర్
తాను స్వలింగ సంపర్కుడినంటూ... ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ తన 29వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం సంచలన ప్రకటన చేశాడు. ‘నా బాయ్‌ఫ్రెండ్ రొబుస్టాతో పాటు మా అమ్మతో కలిసి పుట్టిన రోజు డిన్నర్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో సహా పోస్ట్ చేశాడు. ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 69 వన్డేలు, 24 టి20లు ఆడిన ఫాల్క్‌నర్... ఏడాదిన్నరగా జట్టులోకి ఎంపిక కావడం లేదు. కాగా, తాను ‘గే’నంటూ చెప్పుకొన్న తొలి అంతర్జాతీయ క్రికెటర్ ఇంగ్లండ్‌కు చెందిన స్టీవెన్ డేవిస్. 2011లో అతడీ మేరకు ప్రకటన చేశాడు. -
నేను గే కావడం దేవుడిచ్చిన వరం : యాపిల్ సీఈవో
న్యూయార్క్ : స్వలింగ సంపర్కడి(గే)గా ఉండటం తనకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని ఐటీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ అభిప్రాయపడ్డారు. సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను గే అయినందుకు గర్వపడుతున్నాను. నేను గే అని ప్రపంచానికి తెలిసాక చాలా మంది నాకు ఉత్తరాలు రాసి వారి బాధలు చెప్పుకున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వారి ఆవేదనను పంచుకున్నారు. నేను గే అని తెలిసాక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి చాలా మంది బయటపడ్డారు. అలాంటి వారిలో ధైర్యం నింపెందుకు నేను ప్రయత్నిస్తున్నాను. స్వలింగ సంపర్కులైనా జీవితంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయవచ్చు.’ అని తెలిపారు. కాగా 2014లో టిమ్‌కుక్ తాను స్వలింగ సంపర్కుడినంటూ బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇంటర్వ్యూలో పన్నులకు సంబంధించి అమెరికా ప్రధాని డోనాల్డ్ ట్రంప్ పాలసీలను సైతం ప్రస్తావించారు. కార్పోరేట్ పన్ను కోతలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కుక్ ప్రశంసించారు. ఇది అమెరికాలో మరిన్ని పెట్టుబడులకు సహాయపడుతుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. -
పెళ్లి, వారసత్వ హక్కుల కోసం....
సెక్షన్ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఉత్సాహం పొందిన ఎల్‌జీబీటీక్యూలు ఇప్పుడు ఇతర హక్కుల సాధనపై దృష్టి సారిస్తున్నారు. ఇతరుల్లా తమకు కూడా వివాహం, వారసత్వం, సరోగసి,దత్తత వంటి విషయాల్లో హక్కులు కల్పించాలని వారు ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు.అయితే, ధర్మాసం స్వలింగ సంపరాన్ని నేరం కాదన్న అంశం వరకే పరిమితం కావాలని ఇతర హక్కుల జోలికి వెళ్లరాదని అదనపు సొలిసిటర్ జనరల్ సెక్షన్ 377 కేసు విచారణలో సుప్రీం కోర్టుకు స్పష్టం చేశారు. దీన్ని బట్టి గేలకు ఇతర హక్కులు కల్పించడానికి ప్రభుత్వం సుముఖంగా లేదని అర్థమవుతోందని న్యాయ నిపుణులు అంటున్నారు.వివాహం, సరోగసి, దత్తత, వారసత్వం వంటి హక్కుల కోసం గేలు పోరాడాల్సి వస్తే తప్పకుండా పోరాడుతామని గే హక్కుల ఉద్యమకారుడు, సుప్రీం కోర్టు న్యాయవాది అదిత్య బందోపాధ్యాయ స్పష్టం చేశారు. 377 సెక్షన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గేల ఇతర హక్కులపై చర్చకు అవకాశం కల్పిస్తుందని సీనియర్ జర్నలిస్టు, ఎల్జీబీటీ హక్కుల కార్యకర్త ప్రసాద్ రామమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదన్న సుప్రీం కోర్టు తీర్పుతో గేలకు ప్రాథమిక హక్కు లభించింది కాబట్టి వివాహం, వారసత్వం, బీమా వంటి హక్కులు కూడా దీనిలో భాగమవుతాయని,ఈ హక్కుల్ని నిరాకరించడం రాజ్యాంగవిరుద్ధమని 377 కేసు పిటీషనర్లలో ఒకరైన సునీల్ మెహ్రా అన్నారు. 377 సెక్షన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మా విజయంలో మొదటి అడుగు. వివాహం ఇతర హక్కుల సాధన రెండో అడుగు వేస్తాం అని మరో పిటిషనర్ గౌతమ్ యాదవ్ వ్యాఖ్యానించారు. న్యాయపరమైన అంశాలపై అంతగా అవగాహన లేనప్పటికీ గోద్రేజ్ వంటి కార్పొరేట్ సంస్థలు చాలా ఏళ్ల క్రితమే గేలకు ఇతరులతో పాటు సమాన హక్కులు కల్పించాయి.‘ ఎల్జీబీటీ ఉద్యోగుల పట్ల వివక్ష చూపకపోవడం, ఇతర ఉద్యోగుల్లాగే ఆరోగ్య బీమా వంటి అన్ని సదుపాయాలు అందించడం ద్వారా వారిని మాలో కలుపుకోవడమే మా విధానం’అన్నారు గోద్రేజ్ ఇండియా కల్చరల్ ల్యాబ్ అధిపతి పరమేశ్ సహాని. గేల వివాహాన్ని ఆమోదించదు స్వలింగ సంపర్కం నేరం కాదన్నంత వరకు బాగానే ఉందని, అయితే వారి వివాహాన్ని కూడా చట్టబద్దం చేయాలన్న డిమాండును మాత్రం ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.‘ఇద్దరు మహిళలు లేదా ఇద్దరు పురుషులు పెళ్లాడటమన్నది ప్రకృతి విరుద్ధం.దీన్ని మేమెంత మాత్రం సమర్థించం.ఇలాంటి సంబంధాలను గుర్తించే సంప్రదాయం భారతీయ సమాజంలో లేనేలేదు’అని స్పష్టం చేశారు ఆరెస్సెస్ ప్రతినిధి ఆరుణ్ కుమార్. సెక్షన్ 377 రద్దును స్వాగతించిన కాంగ్రెస్ గేలకు ఇతర హక్కుల కల్పన విషయంలో తన వైఖరి స్పష్టం చేయలేదు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవలసింది ప్రభుత్వమేనని తర్వాతే దానిపై స్పందిస్తామన్నారు కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా. ఇతర హక్కుల జోలికెళ్లని ధర్మాసనం స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు వారి ఇతర హక్కుల జోలికి వెళ్లలేదు. సామాజిక నిబంధనలు గేల రాజ్యాంగ హక్కులను ఎలా నియంత్రించజాలవో తన తీర్పులో వివరించిన ధర్మాసనం వివాహం, వారసత్వం వంటి ఇతర హక్కుల గురించి ఏమీ ప్రస్తావించలేదు. అలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి మన దేశంలో స్వలింగ వివాహాలు(సేమ్ సెక్స్ మ్యారేజ్) చట్టబద్ధం కానప్పటికీ గత పదేళ్లుగాజరుగుతూనే ఉన్నాయి. చట్టానికి భయపడే కొందరు అలాంటి వివాహాల్ని ఆమోదించే ఇతర దేశాలకు వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు.377 కేసు పిటిషనర్ ఒకరు ఇలాగే విదేశానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. -
‘నువ్వు గే.. చచ్చిపో అన్నారని’
లాస్ఏంజిల్స్: ‘నువ్వు గే అంటూ తోటి స్నేహితులు ఏడిపించడమే కాకుండా, ‘గే’లకు సమాజంలో జీవించే హక్కు లేదు.. చనిపో అంటూ బెదిరింపులకు దిగడంతో తొమ్మిదేళ్ల జేమెల్ మైల్స్ ఆత్మహత్య చేసుకున్నాడు’. ఈ ఘటన అమెరికాలోని లాస్ఏంజిల్స్లో చోటు చేసుకుంది. ప్రసుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బిజీ లైఫ్‌కు అలవాటుపడిన తల్లిదండ్రులు పిల్లల మనస్థత్వాలను గమనించాలని, మంచిచెడులు వివరించాలని నెటిజన్లు పేర్కొంటున్నారు. అసలేం జరిగిందంటే.. అందరి పిల్లల్లా స్కూల్లో చదువుకోవాలి, ఆడుకోవాలని తొమ్మిదేళ్ల జేమెల్ మైల్స్ పదిరోజుల క్రితం స్కూల్లో చేరాడు. కానీ తను ఒక గే అని స్కూళ్లో నిర్భయంగా స్నేహితులకు చెప్పాడు. అప్పటినుంచి మైల్స్‌ను గేలి చేస్తూ హింసించేవారు. వేదింపులు హద్దులు దాటి ‘గే’లు సమాజంలో జీవించే హక్కు లేదు చనిపో అంటూ బెదిరించారు. దీంతో గత కొద్ది రోజులుగా డిప్రెషన్లోకి వెళ్లిన మైల్స్ ఆత్మహత్య చేసుకున్నాడు. అండగా ఉంటారనుకున్నాడు తాను ఒక గే అయినా స్నేహితులు అండగ ఉంటారని మైల్స్ భావించాడని అతని తల్లి లియా పేర్కొన్నారు. స్నేహితులు వేధించే విషయం తమకు చెబితే బాధ పడతామనే ఉద్దేశంతో చెప్పెవాడు కాదని, కానీ తన అక్కతో చెప్పుకొని బాధపడేవాడని వివరించారు. మైల్స్ ఆత్మహత్యతోనైనా లింగ భేదం లేకుండా అందరూ సమానమనమే భావన వస్తే తన కొడుకు ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. -
ఆ నటుడు గే.. నాపై అఘాయిత్యం చేయబోయాడు!
టీనేజ్ బాలుడిని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్రముఖ హాలీవుడ్ నటుడు కేవిన్ స్పెసీ క్షమాపణలు చెప్పారు. ఈ ఆరోపణలు తనను తీవ్ర భయోతాత్పానికి గురిచేశాయని చెప్పారు. ‘స్టార్ ట్రెక్: డిస్కవరీ’ నటుడు ఆంటోనీ ర్యాప్ ఇటీవల ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ కేవిన్ తనపై అఘాయిత్యాన్ని చేయబోయాడని వెల్లడించాడు. 1986లో కేవిన్ తనపై లైంగిక అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడని తెలిపాడు. ఆ సమయంలో ఇద్దరం బ్రాడ్వే షోలలో కలిసి పనిచేసేవాళ్లమని, తన ఇంటికి పార్టీకోసం కేవిన్ తనను పలిచాడని, అప్పుడు తన వయస్సు 14 ఏళ్లుకాగా, కేవిన్ వయస్సు 26 ఏళ్లు అని చెప్పాడు. పార్టీ ముగిసిన తర్వాత మద్యం మత్తులో ఉన్న కేవిన్ తనను బ్రెడ్రూమ్కు ఎత్తుకెళ్లి.. తనపై కూర్చున్నాడని, అతను ఏం చేస్తున్నాడో కూడా తనకు అప్పుడు అర్థం కాలేదని ర్యాప్ వివరించాడు. అతను ప్రవర్తన తనకు అర్థం కాకపోయినా.. అతను లైంగికంగా తనపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడని అతని తీరును బట్టి అర్థమైందని చెప్పాడు. ర్యాప్ ఆరోపణలపై కేవిన్ స్పందించాడు. మద్యం మత్తులో ఆ రోజు జరిగిందో తెలియదని, కానీ, ఆ రోజు జరిగిందానికి క్షమాపణ చెప్తున్నానని కేవిన్ తన ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు. తాను ప్రస్తుతం స్వలింగ సంపర్కుడి (గే)గా కొనసాగుతున్నట్టు చెప్పాడు. ప్రముఖ నిర్మాత వెయిన్‌స్టీన్ పలువురు మహిళలు, నటీమణులపై సాగించిన లైంగిక దాడులు హాలీవుడ్లో దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. హాలీవుడ్ నటుడు కేవిన్ స్పెసీ -
ఐర్లండ్ ప్రధానిగా భారత్ సంతతి నేత
-
ఐర్లండ్ ప్రధానిగా భారత్ సంతతి నేత
► అధికార పార్టీ ఎన్నికల్లో లియో వారడ్కర్ గెలుపు ► తొలి ‘గే’, పిన్నవయస్కుడైన ప్రధానిగా రికార్డు డబ్లిన్: ఐర్లండ్ తదుపరి ప్రధానిగా భారత సంతతికి చెందిన లియో వారడ్కర్ (38) ఎంపికయ్యారు. ప్రస్తుత ప్రధాని ఎండా కెన్నీ రాజీనామాతో జరిగిన అధికార ఫైన్ గేల్ పార్టీ అంతర్గత ఎన్నికలో 60 శాతం ఓట్లతో వారడ్కర్ గెలిచారు. ఐర్లండ్‌కు అత్యంత పిన్న వయస్కుడైన, తొలి మైనార్టీ ప్రధానిగా నిలిచారు. తొలి స్వలింగ సంపర్క (గే) ప్రధానిగానూ రికార్డులకెక్కారు. ప్రధాని పదవికి పార్టీ సీనియర్ నేత సిమన్ కోవెనీ, వారడ్కర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానిగా ఎంపికవటంపై వారడ్కర్ హర్షం వ్యక్తం చేశారు. ‘నేను సగం భారతీయుడిని, డాక్టర్‌ను, గే పాలిటీషియన్ని మాత్రమే కాదు. నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుంది’ అని అన్నారు. జూన్ 13న జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఆయన అధికారికంగా బాధ్యతలు అందుకోనున్నారు. ముంబైలో మూలాలు.. ముంబై నుంచి వచ్చి స్థిరపడిన హిందూ, మçహారాష్ట్రీయుడైన డాక్టర్ అశోక్ వారడ్కర్, ఐరిష్ నర్స్ మీరియమ్ మూడో సంతానమే లియో. 66 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న దేశంలో టీషక్ (ప్రధాని) పదవికి ఆసియా మూలాలున్న ‘గే’ను ఎన్నుకోవడం పదేళ్ల కిందటి వరకు ఊహకు అందని విషయం. వారడ్కర్.. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీలో మొదట లా కోర్సులో చేరినా, వెంటనే మెడిసిన్‌కు మారారు. 2003లో మెడిసిన్ పూర్తిచేశారు. అదే ఏడాది ఫింగల్ కౌంటీ కౌన్సిల్‌కు లియోను ఫైన్ గేల్ పార్టీ కోఆప్ట్ చేయడంతో రాజకీయ ప్రయాణం గాడినపడింది. 2007లో డబ్లిన్ వెస్ట్ స్థానం నుంచి ఐర్లండ్ దిగువసభకు ఎన్నికై, మంత్రిగా సని చేశారు. కుంభకోణాల ఫలితంగా ప్రధాని కెన్నీ రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. -
‘పిలిచి ఉన్నపళంగా రాజీనామా చేయమన్నారు’
న్యూఢిల్లీ: బెంగళూరులో ఆంగ్ల సబ్జెక్టును బోధించే అసోసియేట్ ప్రొఫెసర్(స్వలింగ సంపర్కుడు)ను విధుల్లో నుంచి తప్పించారు. అతడి వల్ల విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలుగుతుందనే కారణంతో ఆయనను బలవంతంగా ఉద్యోగంలో నుంచి తీసివేశారు. ఈ విషయాన్ని ఆ ప్రొఫెసరే స్వయంగా చెప్పాడు. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ అనే కాలేజీ ఉంది. అందులో ఆంగ్ల విభాగంలో ఆష్లే టెలీస్ అనే వ్యక్తి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఓ స్వలింగ సంపర్కుడు. పైగా ఎల్జీబీటీ హక్కుల ఉద్యమకారుడిగా కూడా ఉన్నాడు. కొన్ని విషయాలతో అతడికి వ్యక్తిగతంగా భిన్నమైన అభిప్రాయాలుండేవి. వాటిని అతడు విద్యార్థులపై రుద్దుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని రాజీనామా చేయాలని కాలేజీ యాజమాన్యం ఆదేశించింది. ఈ విషయాన్ని అతడే తన మాటల్లో ఎలా చెప్పారంటే.. ‘మార్చి 9, 2017న నేను బీకామ్ సెకండియర్ విద్యార్థులకు పాఠం చెబుతున్నాను. ప్రిన్సిపాల్ పిలుస్తున్నారంటూ పాఠం మధ్యలోనే పిలిచారు. అక్కడికి వెళ్లాక పది నిమిషాలు ఎదురుచూడమన్నారు. ఆ తర్వాత పిలిచి ‘నీ వ్యక్తిగత అభిప్రాయాల కారణంగా విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలుగుతోంది. వెంటనే నీ బాధ్యతలకు రాజీనామా చేసి వెళ్లిపో.. ఇది ఇప్పుడే జరగాలి’ అని చెప్పారు. వాస్తవానికి విద్యార్థులు నిజంగానే డిస్ట్రబ్ అయితే.. అలా చేయడం కూడా బోధకుల పనే. అలా చేయలేకుంటే విద్యార్థులు ఎలా ఆలోచిస్తారు? ఎప్పుడు ఈ ప్రపంచం మారుతుంది? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన తన అనుభవాలను ఫేస్బుక్లో పంచుకున్నారు. -
బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఓ గే..
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ సమీప బంధువు (కజిన్) లార్డ్ ఐవర్ మౌంట్‌బాటెన్ సంచలన విషయం చెప్పాడు. తాను గే అని ఆయన వెల్లడించాడు. ప్రఖ్యాత బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఇలా గే అని చెప్పిన తొలి వ్యక్తి మౌంట్‌బాటెనే. ఆయనకు మాజీ భార్య పెనెలొపె థామ్సన్ (పెన్నీ) ద్వారా ముగ్గురు సంతానం కలిగారు. లైంగికంగా తాను సమస్యలు ఎదుర్కొన్నానని, ప్రస్తుతం ఓ ఎయిర్‌లైన్ క్యాబిన్ సర్వీసెస్ డైరెక్టర్ జేమ్స్ కోయ్లెతో కలసి సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు నిజమైన జీవితాన్ని గడుపుతున్నాని తెలిపాడు. తనకు పెళ్లికాకముందే తాను గే అనే విషయాన్ని పెన్నీకి చెప్పానని వెల్లడించాడు. తాను ఉభయ సంపర్కుడినని (బై సెక్సువల్) పెన్నీకి చెప్పానని, ఆమె ఈ విషయాన్ని అర్థం చేసుకుందని చెప్పాడు. క్వీన్ విక్టోరియాకు మౌంట్‌బాటెన్ మునిముని మనవడు అవుతాడు. -
లింగమార్పిడి వారు మాత్రమే థర్డ్ జండర్
న్యూఢిల్లీ: థర్డ్ జెండర్‌పై గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గురువారం థర్డ్ జండర్ అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం.. కేవలం లింగమార్పిడి వ్యక్తులు మాత్రమే థర్డ్ జెండర్ పరిధిలోకి వస్తారని మరోసారి స్పష్టం చేసింది. లెస్బియన్లు, గే లు, బైసెక్సువల్ వ్యక్తులు థర్డ్ జెండర్ పరిధిలోకి రారని ఈ సందర్భంగా మరోసారి గతంలోని ఆదేశాలను నొక్కి చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్న కోర్టు.. 2014 తీర్పుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. -
నేను లెస్బియన్: మహిళా మంత్రి
లండన్: బ్రిటన్ సీనియర్ మంత్రి జస్టిన్ గ్రీనింగ్స్ సంచలన ప్రకటన చేశారు. తాను స్వలింగ సంపర్కురాలినని వెల్లడించారు. కన్జర్వేటివ్ కేబినెట్ లో బహిరంగంగా 'లెస్బియన్' ప్రకటన చేసిన తొలి మహిళగా ఆమె నిలిచారు. బ్రిటన్ ఐరోపా సమాఖ్యలోనే కొనసాగాలని ప్రచారం చేసిన ఆమె ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. లండన్ తో పాటు బ్రిటన్ వ్యాప్తంగా జరిగిన స్వలింగపర్కుల ర్యాలీలకు మద్దతు పలికారు. 'ఈరోజు ఎంతో మంచిరోజు. నేను స్వలింగ సంపర్కురాలినని చెప్పడానికి సంతోషిస్తున్నా. సంపర్కుల తరపున ప్రచారం చేస్తా. వారికి నా మద్దతు ఉంటుంద'ని పేర్కొన్నారు. జస్టిన్ గ్రీనింగ్స్ చేసిన ప్రకటనను ప్రధాని డేవిడ్ కామెరాన్ సహా పలువురు ప్రముఖులు స్వాగతించారు. హ్యారీ పోటర్ రచయిత్రి జేకే రౌలింగ్, యూకే ఛాన్సలర్ జార్జి అసబోర్నె తదితరులు అభినందనలు తెలిపారు. తాము స్వలింగ సంపర్కులమని బహిరంగంగా ప్రకటించిన హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుల్లో 47 ఏళ్ల గ్రీనింగ్స్ 33వ వారు కావడం విశేషం. ప్రప్రంచ దేశాల్లో ఏ చట్టసభల్లోనూ ఇంతమంది 'గే'ల మని ప్రకటించుకోలేదు. -
నా కొడుకు అలాంటివాడు కాదు..
వాషింగ్టన్: ఆర్లెండో షూటర్ ఒమర్ మతీన్ స్వలింగ సంపర్కుడనే విషయాన్ని నమ్మలేకపోతున్నట్లు అతడి తండ్రి సిద్దిఖీ అన్నారు. విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడి 40మంది పొట్టన పెట్టుకున్న తన కుమారుడి చర్య క్షమించరానిదన్నారు. తన కొడుకు ప్రవర్తనపై ఇప్పుడే సందేహం కలుగుతుందన్నారు. అయితే మతీన్ ప్రవర్తనతో పాటు, అతడు ఈ దుర్ఘటనకు పాల్పడతాడని తాము కలలో కూడా ఊహించలేదని సిద్దిఖీ తెలిపారు. ఎలాంటి అనుమానం వచ్చినా ఆపేందుకు ప్రయత్నించేవాళ్లమన్నారు. కాగా ఆర్లెండో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఈ సందర్భంగా మతీన్ తండ్రి సిద్దిఖీ క్షమాపణ తెలిపారు. కాగా తన కుమారుడికి స్వలింగ సంపర్కులంటే ద్వేషమని, రోడ్డుపైనే స్వలింగ సంపర్కులైన ఇద్దరు మగవాళ్లు బహిరంగంగా ముద్దు పెట్టుకున్న ఘటనతో మతీన్ కలత చెందే ఈ దారుణానికి పాల్పడినట్లు సిద్దిఖీ గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు స్వలింగ సంపర్కుల క్లబ్ పల్స్క్లబ్కు మతీన్ వచ్చేవాడని, అతడిని అక్కడ కనీసం ఓ డజన్ సార్లు అయినా చూసినట్లు ఇతర క్లబ్ సభ్యులు వెల్లడించారు. అతడు ఇటీవలే ఒక గే సభ్యునితో యాప్ ద్వారా డేటింగ్‌కు యత్నించినట్టు కూడా తెలుస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లెండోలోని నైట్ క్లబ్లో ఒమర్ మతీన్ జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించగా, మరో 50 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. -
ఎప్పటికీ 'గే' లా ఉండిపోతాను..!
బీజింగ్: తాను ఎప్పటికీ స్వలింగ సంపర్కుడిగానే ఉంటానని, ఈ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని చైనాకు కు చెందిన ఓ పండ్ల వ్యాపారి అంటున్నాడు. ఆస్పత్రి యాజమాన్యం తనను వేధించారని, చట్టప్రకారం తనకు ఎన్నో సౌలభ్యాలున్నాయంటూ కోర్టును ఆశ్రయించాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. నార్త్ చైనాకు చెందిన పండ్ల వ్యాపారి యుహు. అతడి భార్య యాంగ్. భర్త స్వలింగ సంపర్కుడు(గే) అని తెలిసి ఆమె షాక్ కు గురైంది. ఆ తర్వాత భార్య, కుటుంబసభ్యులు కలిసి అతడికి ట్రీట్ మెంట్ ఇప్పించి సరిచేయాలనుకున్నారు. డ్రగ్స్, కొన్ని రకాల ఇంజెక్షన్ల సహాయంతో హోమోసెక్సువల్ గా ఉన్న వ్యక్తిగా సాధారణ వ్యక్తులుగా చేస్తామని ఝుమాడియన్ పీపుల్స్ హాస్పిటల్ సైకియాట్రిస్ట్ వీరిని నమ్మించాడు. గతేడాది అక్టోబర్ లో 'సెక్సువాలిటీ కరెక్షన్ థెరపీ' కోసం యుహును ఆ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్సలో భాగంగా యోగా చేయించడం, ఇంజెక్షన్లు ఇవ్వడం చేసేవారు. వీటితో పాటు శారీరకంగా, మానసికంగా తనను వేధించారని, అసభ్య పదజాలంతో దూషించేవారని యుహు చెబుతున్నాడు. అందరికీ తాను ఒక్క విషయం చెప్పాలనుకున్నానని, హోమోసెక్సువల్ గా ఉండటం అనేది వ్యాధి కాదు అని యుహు తెలిపాడు. దీనికి చికిత్స ఉండదని, హాస్పిటల్స్ ను తాను ఈ విషయంపై హెచ్చరిస్తున్నట్లు ప్రకటించాడు. తన భర్తను తీవ్రంగా వేదించారని, డ్రగ్స్ తీసుకోవాలంటూ కొట్టేవారని, ఆస్పత్రిలో బెడ్ కు కట్టేశారని యాంగ్ తెలిపింది. ఎల్జీబీటీ హక్కుల కార్యకర్త హాకియాంగ్ దృష్టికి ఈ విషయం రాగానే ఆసుపత్రిపై పోరాటం చేసి యుహుకు స్వేచ్ఛను అందించాడు. 1997నుంచి హోమోసెక్సువాలిటీ అక్కడ చట్టపరంగా ఉంది. పేషెంట్ ఇంటికి వెళ్లిపోతాను, చికిత్స వద్దంటూ వేడుకున్నా యుహును గతంలో విడిచి పెట్టలేదన్నాడు. స్థానిక కోర్టులో పిల్ దాఖలుచేశారు. ఈ కేసు విచారణకు కోర్టు అంగీకరించింది. సగం విజయం సాధించామని యుహు కుటుంబం పేర్కొంది. ఈ విషయంపై హాస్పిటల్ యాజమాన్యాన్ని సంప్రదించగా తమకు కోర్టు నుంచి ఇప్పటివరకూ ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదని వెల్లడించారు. -
స్వలింగ వివాహలకు ఇటలీ ఆమోదం
రోమ్: స్వలింగ సంపర్కుల వివాహాలకు ఇటాలియన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ దేశ పార్లమెంట్లో కాన్ఫిడెన్స్ ఓటు ద్వారా బిల్లుపై బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో ఇకపై స్వలింగ సంపర్కులు ఇటలీలో స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చు. అందరిలాగే జీవితం గడపవచ్చు. చారిత్రాత్మక నిర్ణయంతో ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి. 'తమ ఆకాంక్షలు గుర్తించినందుకు ఈ రోజు చాలామంది వేడుకలు జరుపుకుంటారు' అని ఈ సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి మట్టెయో రెంజీ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. తమ భాగస్వామి లేనందున రాత్రుళ్లు నిద్రపట్టక ఒత్తిడి గురయ్యేవారికి ఇది మంచివార్త అని, వాళ్లంతా తాజా నిర్ణయంతో వేడుక చేసుకుంటారన్నారు. రెంజీ ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ కౌన్సిలర్‌గా పని చేసిన అలెస్సియా బెల్లినీ ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. తాను స్వలింగ సంపర్కురాలినని బహిరంగంగా ప్రకటించిన బెల్లినీ క్యాన్సర్‌తో 2011లో మరణించింది. -
ఐసీస్‌కు సవాల్ విసిరిన గే!
ఇస్తాంబుల్: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ కనుసన్నల్లో నడుచుకోకపోతే జరిగే పరిణామాలు తెలిసినవే. చంపడంలో కొత్త కొత్త విధానాలను పబ్లిక్‌గా అమలు చేస్తూ ఇస్లామిక్ స్టేట్ చేస్తున్న నరమేధం సోషల్ మీడియాలో నిత్య దర్శనమే. స్వలింగ సంపర్కుల(హోమో సెక్సువల్)ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎత్తైన బిల్డింగ్ నుంచి తోసేసి చంపుతున్న విషయం తెలిసిందే. ఇవన్నీ చూస్తూ కూడా ఓ సిరియన్ 'గే' ఇస్లామిక్ స్టేట్‌కు సవాల్ విసిరాడు. ఇస్తాంబుల్‌లో జరిగిన పోటీలో పాల్గొని 'మిస్టర్ గే సిరియా' టైటిల్ గెలుచుకున్న హుస్సేన్ సాబత్(24) తనకు ఇస్లామిక్ స్టేట్ అంటే భయం కంటే ఎక్కువగా అసహ్యం ఉందని వెల్లడించాడు. ఇస్లామిక్ స్టేట్ వారు ఎల్జీబీటీ సమాజంపై జరుపుతున్న అకృత్యాలను వ్యతిరేకిస్తూ ధైర్యంగా 'గే' పోటీల్లో పాల్గొని విజయం సాధించినట్లు తెలిపాడు. అలాగే సిరియన్ 'గే'లు అంటే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బిల్డింగ్‌ల పైనుంచి తోసి చంపే శరీరాలు మాత్రమే కాదని.. తమకూ కొన్ని కలలు, ఆలోచనలు ఉంటాయని తెలియజేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు సాబత్. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తన మిత్రుడు.. జకారియాను తల నరికి చంపేసి, దానికి సంబంధించిన వీడియోను అతని తల్లిదండ్రులకు పంపించారని, దాంతో అతని తల్లి పిచ్చిదైపోయింని సాబత్ వెల్లడించాడు. హెయిర్ డ్రెస్సర్‌గా జీవనం కొనసాగిస్తున్న సాబత్.. ఐసీస్ ను ధిక్కరించి మాల్టాలో నిర్వహించిన మిస్టర్ గే వరల్డ్ కాంపిటీషన్లో పాల్గొనాలని భావించినా వీసా రాలేదని ఓ మీడియా సంస్థతో తెలిపాడు. -
గే అయినందుకు చంపేశారు!
ఇస్లామిక్ ఉగ్రవాదుల ఘాతుకాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా ఓ సిరియన్ వ్యక్తిని ఐదంతస్తుల భవనం పైనుంచి కిందికి నెట్టి చంపేయడం వారి రాక్షసత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. అతడు స్వలింగ సంపర్కుడు కావడమే అందుకు కారణంగా ఐసిస్ వివరించింది. అనాగరికమైన ఆ చర్య.. అలెప్పో రాష్ట్రంలోని మన్బిజ్ లో చిన్న పిల్లలు సహా అందరూ చూస్తుండగా జరిగింది. స్వలింగ సంపర్కుడవ్వడంతో ఓ యువకుడి ప్రాణాలను ఐసిస్ బలి తీసుకుంది. ఓ ఎత్తైన భవనం పైనుంచి అతన్నిఅనాగరికంగా కిందికి విసిరేసిన ముగ్గురు ఉగ్రవాదులు, అతడిపై కిరాతకంగా వ్యవహరించి, అతడి ప్రాణాలను గాల్లో కలిపేశారు. అలెప్పో రాష్ట్రం మన్బిజ్ లో జరిగిన అమానవీయ ఘటనకు ప్రపంచం నివ్వెరపోయింది. జిహాదీలు తాజాగా విడుదల చేసిన చిత్రాలు అలెప్పోలో జరిగిన రాక్షస చర్యకు తార్కాణాలుగా నిలుస్తున్నాయి. స్వలింగ సంసర్కుడన్న ఆరోపణతో చిన్నపిల్లలు సహా డజన్లకొద్దీ జనం చూస్తుండగానే ఆ ఉగ్రమూక యువకుడికి తీవ్రమైన శిక్ష విధించింది. చంపేసేందుకు ముందు.. కళ్ళకు గంతలు కట్టి, చెప్పుల్లేకుండా నిర్మాణంలో ఉన్న భవనంపై ఇస్లామిక్ ఫైటర్స్ యువకుడ్ని నిలబెట్టినట్లు ఓ ఫొటోలోని వివరాలను బట్టి తెలుస్తుంటే... మరో చిత్రంలో అతడికి మరణశిక్షను విధిస్తూ ఐదంస్తుల భవనం పై నుంచీ కిందికి తోసేయడం స్పష్టంగా కనిపించడమే కాక... ఐసిస్ వికృత చర్యలకు సాక్ష్యంగా నిలుస్తోంది. యువకుడు భవనంపైనుంచి కింద పడేందుకు ముందుగా రూఫ్ పై అతడి వద్ద నిలబడ్డ ముగ్గురు జిహాదీలు ఐసిస్ ఆర్గనైజేషన్ల ద్వారా ఈ తాజా ఫొటోలను విడుదల చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదేరకంగా ఇంతకు ముందుకూడ ఐసిస్ ఓ యువకుడి పట్ల ప్రవర్తించినట్లు ఆధారాలు చెప్తున్నాయి. -
'గే' అని కుమారుడిని కాల్చేశాడు!
లాస్ ఎంజెల్స్: కొడుకు స్వలింగ సంపర్కుడు (గే) అన్న విషయాన్ని భరించలేని ఓ తండ్రి కోపోద్రిక్తుడయ్యాడు. ఆ కోపంలో కుమారుడిపై కాల్పులు జరిపి చంపేశాడు. ఈ ఘటన లాస్ ఎంజెల్స్ లో ఇటీవల చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. షెహాదా ఇస్సా(69), అమిర్ ఇస్సా(29) తండ్రీకొడుకులు. ఏమైందో తెలియదు కానీ కుమారుడ్ని తుపాకీతో కాల్చి చంపేశాడు. పోలీసులు షెహాదాను అరెస్ట్ చేసి విచారణ జరిపగా, తన భార్యను కుమారుడు చంపాడని ఆరోపించాడు. తనను చంపుతానని పలుమార్లు బెదించాడని చెప్పుకొచ్చాడు. భార్య రబిహా ఇస్సా(68) మృతదేహాన్ని ఇంటి ఆవరణలో గుర్తించిన తర్వాత కుమారుడిపై అనుమానం వచ్చిందని చెప్పాడు. తనను కూడా చంపేస్తాడేమోనని భావించి అమిర్ ను తానే చంపానని ఒప్పుకున్నాడు. అసలు ట్విస్ట్ విచారణలో తేలింది. పోలీసులు పదే పదే ప్రశ్నిస్తుండగా హెహాదా జవాబులు మార్చి చెబుతున్నాడు. అతడి వైఖరిలో మార్పును గమనించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు నిజాల్ని బయటపెట్టాడు. కుమారుడు గే అయినందువల్ల ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో కాల్చి చంపేశానని పోలీసులకు వివరించాడు. -
గే సెక్స్ పై ఆర్ఎస్ఎస్ యూటర్న్
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ యూటర్న్ తీసుకుంది. సజాతీయుల సంబంధాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. గే సెక్స్ ను నేరంగా పరిగణించిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మాట మార్చింది. గే సెక్స్ నేరం కాదని, అనైతికమని, దానికి శిక్ష కంటే మానసిక చికిత్స అవసరమని పేర్కొంది. 'స్వలింగ సంపర్కం నేరం కాదు. సమాజంలో అదో అనైతికమైన పని. స్వలింగ సంపర్కానికి పాల్పడినవారిని శిక్షించాల్సిన అవసరం లేదు. మానసిక సంబంధమైన సమస్యగా గుర్తించి, వారికి చికిత్స అందించడం అవసర'మని ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హెసబాలె తన అభిప్రాయాన్ని శుక్రవారం ట్వీట్ చేశారు. స్వలింగ సంపర్క దృక్పథాన్ని నేరంగా చూడకూడదని, వారిలో మార్పు తేవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తూ అమలవుతున్న ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. -
ఎస్. ఐ యామ్ గే
థర్డ్ వండర్ ఎస్. ఐ యామ్ గే. సిగ్గెందుకు.. చెప్పుకోడానికి?! నేను అబ్బాయిని. కానీ అమ్మాయిలకు ఎట్రాక్ట్ కాను. ఇందులో తప్పేముంది? / నేను అమ్మాయిని. కానీ అబ్బాయిలు నన్ను ఎట్రాక్ట్ చెయ్యలేరు. ఇందులో ఒప్పుకానిది ఏముంది? ప్రకృతి ధర్మం ఒకటి ఉంటుంది కదా అంటుంది లోకం. ప్రకృతి ఒక్కటేనా ధర్మం? ప్రకృతి విరుద్ధ ధర్మాలు ఉండవా?! అబ్బాయిల దగ్గర మాత్రమే కంఫర్ట్ ఫీలయ్యే అబ్బాయిలు, అమ్మాయిల ఆలింగనాలలో మాత్రమే ఆలంబన పొందే అమ్మాయిలు అడుగుతున్న ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా? లేదు. సానుభూతి ఉందా? లేదు. సహానుభూతి ఉందా? అదెలాగూ ఉండదు. సాఫ్ట్ కార్నర్ ఉందా? ఎప్పటికైనా ఏర్పడుతుందేమో తెలీదు. మరేముంది? అభ్యంతరం ఉంది. అసహనం ఉంది. అవహేళన ఉంది. ‘ఎట్లానో చావండి. మీ ఒంట్లో ఏం జరుగుతోందో మా కంట్లో పడనివ్వకండి’ అని దూరంగా జరిగిపోయేంత ఈసడింపు ఉంది. ‘గే’ స్ హర్ట్ అవుతున్నారు. నేచురల్. బాధ అనేది సాధారణ జెండర్లకు ఉండి, ట్రాన్స్జెండర్లకు లేకుండా పోతుందా?! ఎవరైనా మనుషులే కదా. బాధ పడతారు. అయితే వారి బాధ.. వాళ్లని మనం గుర్తించడం లేదని కాదు. వాళ్లని మనం గౌరవించడం లేదని కాదు. మరి? వాళ్లేమిటో వాళ్లని చెప్పుకోనివ్వడం లేదని! మగధీరుడిగా నిన్ను నువ్వు ఎగ్జిబిట్ చేసుకుంటావు. కోమలాంగిగా నిన్ను నువ్వు రిప్రెజెంట్ చేసుకుంటావు. మరి గే గా నన్నెందుకు బయట పడనివ్వవు అని ఎల్.జి.బి.టి. (లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్) కమ్యూనిటీ అడుగుతోంది! ‘అవును. నేను ఇదీ’ అని ప్రైడ్ వాక్ కూడా చేస్తోంది. యూఎస్ ఆర్మీలో ‘డోంట్ ఆస్క్, డోంట్ టెల్’ అనే పాలసీ ఉండేది. మిలటరీలో ఎవరైనా గే స్ ఉన్నారని అనుమానం వస్తే ఆ విషయం గురించి ఎవరూ అడక్కూడదు, ఎవరూ చెప్పకూడదు. ఆర్మీలోని గే స్ కూడా తమని తాము బయట పెట్టుకోకూడదు. అదీ పాలసీ. చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేసేవారు. సైన్యంలో ఒక్క ‘గే’ ఉన్నా సైన్యం గౌరవం, గాంభీర్యం తగ్గుతాయన్న భయంతో 1994లో క్లింటన్ ఈ పాలసీ తెచ్చారు. 2011లో ఒబామా దీనిని రద్దు చేశారు. ఆ పదిహేడేళ్ల కాలంలో గే స్ కొందరు పాలసీకి విరుద్ధంగా ‘అడిగి’, ‘చెప్పి’ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అలా పోగొట్టుకున్న వాళ్లలో మన ఇండియన్ సంతతి అమ్మాయి కూడా ఉంది. పేరు రాబిన్ చౌరాసియా. యు.ఎస్. ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తుండేది. ‘డోంట్ ఆస్క్, డోంట్ టెల్’ పాలసీని బ్రేక్ చేసి మరీ 2009లో బయటికి వచ్చేసింది. గే పాలసీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిపి ఒబామాకు సంతకాలు పంపినవాళ్లలో ఇండియా నుంచి చౌరాసియా ముఖ్య కథానాయిక. ఇప్పుడు ఆమె ముంబైలో ‘క్రాంతి’అనే సంస్థను నడుపుతోంది. సెక్స్ వర్కర్ల కూతుళ్లకు చదువు చెబుతోంది. గే స్ తమ గురించి మాత్రమే చెప్పుకోవాలనుకోవడం లేదు. తమ బతుకేదో తాము బతికేయాలనీ అనుకోవడం లేదు. ఆదివాసీ కార్యకర్త సోనీసోరీ పై జరిగిన దాడిని ఖండిస్తున్నారు. గిరిజన మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యపై నిజనిర్థారణ చేయాలని అడుగుతున్నారు. సమాజంలో ఒకరిగా అన్ని సామాజిక బాధ్యతలనూ మోస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా తమను తాము దాచుకుని చెయ్యాలనుకోవడం లేదు. ఇది ఐడెంటిటీ క్రైసిస్ కాదు. ఆత్మ గౌరవం. ‘హాయ్ ఐ యామ్ గే’ అని వాళ్లు గర్వంగా చెయ్యందిస్తున్నారు. ‘గ్లాట్ టు మీట్ యు’ అని మనం ఆ చేతిని జెంటిల్‌గా షేక్ చెయ్యగలమా... మన చెయ్యి వణక్కుండా?! మాధవ్ శింగరాజు -
ఆ సంబంధాన్ని ప్రసారం చేయడంపై ఆగ్రహం
జాతి వైరాన్నిమరచిపోవడమే కాదు... రెండు మగ జంతువుల మధ్య ఊహించని రీతిలో ఏర్పడ్డ సంబంధాన్ని రష్యన్ మాస్ మీడియా ప్రసారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఓ పక్క జంతు ప్రేమికులు మీడియా ప్రసారాలకు మద్దతు పలుకుతుంటే... మరోవైపు రష్యాలోని గే ప్రాపగాండను ఉల్లఘించడమేనంటూ నిరసన వెల్లువెత్తుతోంది. ఇటువంటి ప్రసారాలు సాంప్రదాయ విలువలకు నష్టాన్ని తెస్తాయని, జంతువుల మధ్య స్వలింగ సంపర్క సంబంధాలు పిల్లలకు హాని కలుగ జేస్తాయని న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా ప్రమోర్సి ప్రాంతానికి చెందిన న్యాయవాదులు అముర్ అనే మగపులి, మగ మేక తిముర్ మధ్య సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఫార్ ఈస్ట్ సఫారి పార్క్‌లో రెండు వేర్వేరు జాతులకు చెందిన అముర్, తిముర్ల మధ్య లైంగిక సంబంధంపై కవరేజ్‌కు వ్యతిరేకంగా విచారణ జరపాలని నోవోసిబ్రిస్క్కు చెందిన లాయర్ అలెక్సి క్రిష్టియానావ్ ప్రాసిక్యూటర్లను కోరారు. సఫారీ పార్క్ లోని రెండు మగ జంతువుల మధ్య లైంగిక సహజీవనాన్ని ఇటీవల రష్యన్ మాస్ మీడియా ప్రసారం చేయడంపై ఆయన ఫేస్ బుక్‌లో విమర్శించారు. ఇది జంతువులపై ప్రతికూల ప్రచారమే అయినప్పటికీ ఈ ప్రభావం రష్యా ప్రజలపై పడటమే కాక, రష్యా గే-ప్రాపగాండను ఉల్లంఘించినట్లవుతుందని క్రిస్టియానావ్ వాదిస్తున్నారు. అంతేకాక హోమో సెక్సువాలిటీని ప్రోత్సహించినట్లు అవుతుందంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం పిల్లలపై త్వరగా పడే అవకాశం ఉందని, వారు సంప్రదాయ విలువలకు వ్యతిరేకంగా లైంగిక సంబంధాలను పెంచుకునే ప్రమాదం ఉంటుందని క్రిస్టినావ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రాపగాండపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, పిల్లలకు రక్షణ కల్పించాలని కోరారు. తన ఫాలోయర్స్ తో కలిపి క్రిస్టినావ్ ప్రాసిక్యూటర్ జనరల్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ ఫిర్యాదుపై ప్రాసిక్యూటర్లు దర్యాప్తు జరుపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే జూ అధికారులు ఆ రెండు జంతువులు ఒకదానిపై ఒకటి ప్రేమ పెంచుకోవడం మొదలు పెట్టిన తర్వాత... విడివిడిగా ఎన్‌క్లోజర్స్ లో ఉంచుతున్నారు. -
‘స్వలింగసంపర్కం’ రాజ్యాంగ ధర్మాసనానికి
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం క్యురేటివ్ పిటిషన్‌ను ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377ను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందులో మానవ సంబంధాలకు సంబంధించిన ముఖ్య, అమూల్య అంశాలెన్నో ముడిపడివున్న దృష్ట్యా విస్తృత బెంచ్‌కు నివేదిస్తున్నట్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ జేఎస్ ఖేహార్‌ల బెంచ్ వ్యాఖ్యానించింది. త్వరలోనే బెంచ్ ఏర్పాటవుతుందని వెల్లడించింది. ప్రకృతి విరుద్ధమైన స్వలింగ సంపర్కం నేరమంటూ 1860లో బ్రిటిష్ రాజ్ వే సెక్షన్ 377ను అమల్లోకి తెచ్చింది. దీనికి విరుద్ధంగా ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పునిచ్చింది. అయితే సుప్రీం కోర్టు ఈ తీర్పును నిలుపుదల చేసింది. తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ నాజ్ ఫౌండేషన్‌తో పాటు మరికొంతమంది సుప్రీమ్ కోర్టులో రివ్యూ పిటిషన్లు వేశారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని గే ఉద్యమకారులు స్వాగతించారు. కోర్టు నిర్ణయాన్ని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్వాగతించారు. స్వలింగ సంపర్క చట్టబద్ధతపై కేంద్రం ఎలాంటి అభిప్రాయానికీ రాలేదని మంత్రి వెంకయ్య చెప్పారు. -
మగవారి ముద్దు ఫోటోతో రచ్చ రచ్చ
ఇస్లామాబాద్: పురుషులిద్దరు ముద్దు పెట్టుకుంటున్న ఫోటో.. ముద్రించకుండా ఖాళీగా వదిలేసిన స్థానిక యాజమాన్యం..దీంతో ప్రపంచ వ్యాప్తంగా భావప్రకటన స్వేచ్ఛ పై మరోసారి చర్చ. ముందు పేజిలో ఖాళీ స్థలంతో ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ ఆర్టికల్‌ను శుక్రవారం ప్రచురించడంతో వివాదానికి తెర లేపింది. ఇంటర్ నేషనల్ న్యూయార్క్ టైమ్స్‌కు అనుబంధంగా పాకిస్తాన్‌లోని స్థానిక పత్రిక ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ నడుస్తోంది. చైనాలో ట్రాన్స్ జెండర్ హక్కుల కోసం న్యూయార్క్ టైమ్స్ ఓ ఆర్టికల్‌ను ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్కు పంపింది. ఆ ఆర్టిక్టల్తో పాటూ చైనాలోని ఓ యువకుడు మరో పురుషుడికి చెంపపై ముద్దు పెట్టుకొంటున్న ఫోటోను ప్రచురించాలి. కానీ, ఆ ఆర్టికల్ మాత్రమే ప్రచురించి ఆ ఫోటో స్థానాన్ని ఖాళీగా వదిలేశారు. అది కూడా ముందు పేజీలో. దీంతో న్యూయార్క్ టైమ్స్ పాఠకులు ఉదయం లేచి చూడగానే పేపర్ ముందు పేజీలో బ్లాంక్‌గా కనిపించింది. 'పాకిస్థాన్‌లోని మా ముద్రణ భాగస్వామి ఆ ఫోటోను తొలగించారు. ఫోటోను తీసివేయడం వెనక ఎడిటోరియల్ స్టాఫ్‌కు ఎలాంటి ప్రమేయం లేదు' అని ఇంటర్నేషనల్ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఆ ఫోటో ప్రచురిస్తే స్థానికంగా ఇబ్బందులు తలెత్తేవని ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ ఎడిటర్ కమల్ సిద్దికీ తెలిపారు. పురుషులు ముద్దు పెట్టుకునే ఫోటోలను పాకిస్తాన్లో మీరు ఎక్కడా చూడరు. పురుషులే కాదు ఎవరైనా ముద్దు పెట్టుకునే ఫోటోలు ఎక్కడా కనిపించవని ఆయన పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో న్యూయార్క్ టైమ్స్ పంపిన మరో ఆర్టికల్‌ను కూడా ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ సెన్సార్ చేసింది. బంగ్లాదేశ్‌లోని కొన్ని అతివాద సంస్థలకు సంబంధించిన ఆ ఆర్టికల్‌లో దైవ దూషణ వ్యాఖ్యలు ఉండటం వల్ల దాన్ని సెన్సార్ చేసినట్టు న్యూయార్క్ ట్రైమ్స్ పబ్లిక్ ఎడిటర్ మార్గరేట్ సల్లీవన్ తెలిపారు. డిజిటల్ యుగంలో కూడా పత్రికలు బ్లాంక్ పేజీలు ప్రచరించడం భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డు అని మార్గరేట్ అభిప్రాయపడ్డారు. అయితే ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ ఎడిటర్ సిద్దికీ తన పని తీరు పై ఈ మెయిల్ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు...ఇస్లామిక్ తీవ్రవాదులు పాకిస్థాన్‌లోని జర్నలిస్ట్‌లను తరచుగా టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. పాశ్చాత్య సంస్కృతిని దేశంలో ప్రవేశపెడుతున్నారన్న ఆరోపణలతో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, 2014లో తమ సంస్థలోని ముగ్గురు జర్నలిస్ట్‌లను తీవ్రవాదులు హత్య చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. సెన్సార్ చేయడాన్ని మీకన్నా ఎక్కువగా నేనే ఖండిస్తున్నాను. కానీ, ఇక్కడి స్థానిక పరిస్థితుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇస్లాం భావజాలానికి వ్యతిరేకంగా ఆర్టికల్స్, కార్టూన్స్, ఫోటోలను ప్రచురించినందుకు 2001 నుంచి ఇప్పటి వరకు 71 మంది జర్నలిస్ట్‌లు హత్యకు గురయ్యారు. ఇస్లాంను ఆధారంగా చేసుకొని రాజ్యాంగాన్ని రూపొందించుకున్న పాకిస్థాన్, సౌదీ అరేబియా, ఇరాన్‌లాంటి దేశాల్లో స్వలింగ సంపర్కంపై అంతగా అవగాహన లేదు. 2011లో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ట్రాన్స్ జెండర్ జనభాను అధికారికంగా గుర్తించింది. వారికి ప్రస్తుతం ఓటు హక్కును కూడా కల్పించారు. -
ఉగ్రవాద పైశాచికానికిది పరాకాష్ట
-
ఉగ్రవాద పైశాచికానికిది పరాకాష్ట
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పైశాచికత్వానికి ఇదొక పరాకాష్ట. చూడగానే గుండెలు ఆగిపోయేలా చేసేంత భయంకరమైన దృశ్యం.. ఆఖరికి కిల్లర్ సినిమాల్లో కూడా కనిపించని దృశ్యాన్ని ఐఎస్ఐఎస్ విడుదల చేసింది. ఓ వ్యక్తి స్వలింగ సంపర్కుడిగా ఉన్నాడని అతడిని బంధించి, బాగా కొట్టి, చేతులను వెనక్కి కట్టి, కాళ్లను కూడా తాడుతో కట్టేసి ముఖానికి ముసుగు వేసి ఓ బిల్డింగ్ పైకి తీసుకెళ్లి కిందపడేసి చంపేశారు. ఐఎస్ 'లా' ప్రకారం ఓ వ్యక్తి స్వలింగ సంపర్కుడిగా ఉండటం, ఆ విధానానికి మద్దతు తెలపడం నేరం. ఈ కారణంతోనే ఆ వ్యక్తిని బంధించి అతడికి మరణ శిక్షను అమలుచేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎలాంటి శిక్ష అమలుచేస్తున్నారా అని గుంపులుగుంపులుగా జనం ఆ భవనం వైపు చూస్తుండగా వారి పక్కనే ఉగ్రవాదులు తుపాకులతో ఉండగా ముసుగేసి తాళ్లతో బంధించి ఉన్న ఆ వ్యక్తిని నేరుగా కిందపడేశారు. దీంతో అతడు తలపగిలి చనిపోయాడు. ఆ వ్యక్తి ఆ భవనంపై నుంచి కిందపడిపోతున్నప్పటి నుంచి నేలను తాకి చనిపోయేంతవరకు ఫొటోల్లో బంధించి వాటిని ఉగ్రవాదులు విడుదల చేశారు. -
'గే' అంటూ ఏడిపించారని.. ఆత్మాహుతి యత్నం
స్నేహితులతో సన్నిహితంగా ఉన్నందుకు తనను 'గే' అంటూ ఏడిపించారని.. ఇంటర్ విద్యార్థి డీజిల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతి యత్నం చేశాడు. మంటల బాధ తాళలేక అరుచుకుంటూ రూంలోంచి బయటకు పరుగులు తీసిన అతడిని కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగులు చూసి, అతడిమీద నీళ్లు పోశారు. దుప్పట్లు కప్పి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడికి 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటన ఆగ్రా నగరంలో జరిగింది. బాలుడి కాళ్ల మీద, ఎద భాగంలో బాగా కాలినట్లు వైద్యులు చెప్పారు. అతడు సరిగా మాట్లాడలేకపోతున్నాడని, డాక్టర్లు అంతా బాగానే ఉందని చెబుతున్నా, తన కొడుకు మళ్లీ తనతో మాట్లాడితేనే నమ్ముతానని బాధితుడి తండ్రి అంటున్నారు. పదోతరగతిలో మంచి మార్కులతో పాసైన ఆ కుర్రాడు.. ఇంజనీరింగ్ చదవాలని కలలు గంటున్నాడు. రెండురోజుల క్రితం దగ్గర్లో ఉన్న పార్కులో స్నేహితుడితో కలిసి ఉండగా.. పొరుగున ఉండే ఓ వ్యక్తి చూసి, ఈ కుర్రాడిని 'గే' అంటూ ఏడిపించాడు. ఆ విషయం చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది. ప్రతి ఒక్కరూ అతడిని ఏడిపించడం మొదలుపెట్టారని అతడి తండ్రి చెప్పారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై రెండు రోజులుగా తన రూంలోనే ఉండిపోయాడని, ఉన్నట్టుండి గదిలోంచి పరుగున బయటకు వచ్చాడని.. తీరా చూస్తే అప్పటికే మంటలు బాగా వ్యాపించాయని ఆయన తెలిపారు. ఆ కుర్రాడు కాలనీలో పార్క్ చేసి ఉన్న కారులోంచి డీజిల్ తీసి.. దాన్నే తనపై పోసుకున్నట్లు చెబుతున్నారు. -
సిడ్నీలో స్వలింగ సంపర్కులు ర్యాలీ
-
గే వివాహం చేసుకోబోతున్న మంత్రి
లండన్: బ్రిటన్ పాఠశాల విద్యా శాఖ మంత్రి నిక్ గిబ్ గే వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించారు. గిబ్.. పాపులస్ పోలింగ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైఖేల్ సిమండ్స్‌ను పెళ్లాడనున్నట్టు చెప్పారు. 29 ఏళ్లుగా వీరిద్దరూ రహస్యంగా సహజీవనం చేస్తున్నారు. తామిద్దరం అందమైన జీవితాన్ని ఆస్వాదించామని గిబ్ చెప్పారు. సిమండ్స్, తాను ప్రేమలో పడ్డామని, ఇద్దరూ కలసిమెలసి జీవించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ విషయం తెలిసి తన తల్లి తొలుత షాకయ్యారని, తర్వాత అర్థం చేసుకుని ఆశీర్వదించారని చెప్పారు. తమ పెళ్లికి 79 ఏళ్ల తల్లిని, మరికొంతమంది బందువులను ఆహ్వానించినట్టు గిబ్ తెలిపారు. -
మా అబ్బాయికి వరుడు కావలెను
‘మా అబ్బాయికి వరుడు కావాలి. జంతు ప్రేమికుడై ఉండాలి. శాఖాహారి, 25 నుంచి 40 ఏళ్ల మధ ్య ఉండాలి. కుల పట్టింపులేం లేవు. ఏ కులం అయినా ఫర్వాలేదు (అయ్యర్‌లకు ప్రాధాన్యం)’ ఇది ఓ తల్లి ఇచ్చిన వివాహ ప్రకటన. పొరపాటున ఇలా ఇచ్చిందని అనుకుంటున్నారేమో.. అలాంటిదేమీ లేదండీ బాబూ..కొడుకు స్వలింగ సంపర్కుడు(గే) కావడంతోనే ఆ తల్లి ఇలా వార్తా పత్రికలో వివాహ ప్రకటన ఇచ్చింది. అసలు విషయమేమంటే.. ముంబైలో నివసించే పద్మ కుమారుడు హరీశ్ అయ్యర్(36) ఒక స్వలింగ సంపర్కుడు. హరీశ్ ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు. కొడుకు ఓ గే అనే సంగతి తెలుసుకున్న తల్లి.. కొడుకు ఇష్టానుసారమే పెళ్లిచేయాలనుకుంది. దీంతో మంగళవారం ముంబైలోని ఓ వార్తా పత్రికలో ‘వరుడు కావలెను’ అంటూ ఇలా అడ్వటైజ్మెంట్ ఇచ్చేసింది. ఈ తరహా యాడ్ దేశంలోనే తొలిసారి కావడంతో, సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం జరిగింది. దీంతో ఆ తల్లికి వేల సంఖ్యలో ఫోన్లు వచ్చాయి. యునెటైడ్ వే ఆఫ్ ముంబై అనే ఎన్జీవో సంస్థను హరీశ్ నడుపుతున్నాడు. 2013లో వరల్డ్ ప్రైడ్ పవర్ లిస్ట్‌లో 71వ స్థానంలో ఆ సంస్థ నిలిచింది. -
'మా అబ్బాయికి తగిన వరుడు కావలెను'
ముంబై: ఇదో వివాహ ప్రకట. ఇదేంటి పొరపాటుగా ప్రకటన ఇచ్చారని అనుకుటున్నారా? కావాలనే నిజంగా ఇచ్చారు. సాధారణంగా అబ్బాయికి వధువు కావాలని ప్రకటన ఇస్తారు. కానీ ముంబైకు చెందిన ఓ మహిళ తమ అబ్బాయికి పెళ్లి చేసేందుకు వరుడు కావాలని ప్రకటన ఇచ్చారు. అతను గే కావడమే ఇందుకు కారణం. ఈ ప్రకటనకు సోషల్ మీడియాలో విశేష స్పందన వచ్చింది. చాలామంది నుంచి ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. ముంబై ఎల్జీబీటీ (స్వలింగ సంపర్కం, గే, ఉభయ సంపర్కం, లింగమార్పిడి) సమాజంలో హరీష్ అయ్యర్ పేరు సుపరిచితం. గేల హక్కుల కోసం పోరాడుతుంటారు. హరీష్ కోసం ఆయన తల్లి పై వివాహ ప్రకటన ఇచ్చారు. తాను చనిపోయేలోపు తమ అబ్బాయికి తగిన వరుడిని చూసి పెళ్లి చేయాలని హరీష్ తల్లి చెప్పారు. స్వలింగ వివాహాలు సృష్టికి విరుద్ధమని సంప్రదాయవాదులు వాదిస్తుండగా, మరి కొందరు వీటికి మద్దతు ఇస్తున్నారు. స్వలింగ వివాహాలను కొన్ని దేశాలు చట్టబద్ధం చేస్తున్నాయి. ఇటీవల లక్సెంబర్గ్ ప్రధాని జేవియర్ బిటెల్ గే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ప్రియుడి కోసం.. బిడ్డను చంపేశాడు!
సోమందేపల్లి (అనంతపురం) : అతని ఇద్దరి కూతుళ్లలో ఒకరు అనారోగ్యంతో చనిపోయారు.. మరో కూతురుని కూడా లేకుండా చేస్తే అతను తనవాడవుతాడని భావించి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అనంతపురం సోమందేపల్లి మండల పరిధిలోని కదిరేపల్లి శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయం వద్ద చిన్నారిని హత్య చేసిన సంఘటనలో నిందితుడు గొల్లపల్లి శివశంకర్‌పై శనివారం కేసు నమోదు చేసి కోర్టుకు పంపారు. మొదట గుప్త నిధుల కోసం హత్య చేసినట్లు భావించినా పోలీసుల విచారణలో అసలు విషయాలు వెల్లడయ్యాయి. పెనుకొండ డిఎస్పీ సుబ్బారావు అందించిన సమాచారం మేరకు పరిగి మండలం పైడేటికి చెందిన గొల్లపల్లి శివశంకర్ స్వలింగ సంపర్కుడు. ఇతనికి రొద్దం మండలం కలిపిమరువపల్లికి చెందిన నరసింహమూర్తి దూరపు బంధువు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. నరసింహ మూర్తి గ్రామంలో పాలు సేకరించి పైడేటి మీదుగా లేపాక్షికి తీసుకెళ్లేవాడు. అప్పుడప్పుడు శివశంకర్ కూడా అతనితో వెళ్లేవాడు. నరసింహమూర్తికి ఇద్దరు కూమార్తెలు. ఒక కుమార్తె ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా, మరో కూతురు హర్షిత (3) అంటే ప్రాణంగా చూసుకుంటున్నాడు. పలుమార్లు లేపాక్షికి వెళుతూ కూతురిని శివశంకర్‌కు అప్పగించి, తిరిగి వచ్చే సమయంలో తీసుకెళ్లేవాడు. శివశంకర్ స్వతహాగా స్వలింగ సంపర్కుడు కావడంతో.. అతడు నరసింహమూర్తిపై ఆశ పడ్డాడు. ఎలాగైనా తనవాణ్ణి చేసుకోవాలని భావించాడు. కొన్ని రోజుల క్రితం తనను పెళ్లి చేసుకొమ్మని శవశంకర్ నరసింహమూర్తిని అడిగాడు. ఆడదానిగా మారితే చేసుకొంటానని నరసింహమూర్తి చెప్పాడు. దీంతో గోవా వెళ్లి సెక్స్ మార్పిడి చేయించుకోవాలని శవశంకర్ నిర్ణయించుకొన్నాడు. ఓ గేదెను అమ్మి కొంత సొమ్ము కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ నరసింహమూర్తికి తనమీద కన్నా కూతురు హర్షితపైన ప్రేమ ఎక్కువగా ఉందని, ఎలాగైనా ఆ చిన్నారిని అంతమొందిస్తే తనపైన ప్రేమ పెరగుతుందని భావించాడు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో నరసింహమూర్తి కూతురుని శివశంకర్‌కు అప్పగించి పాలు తీసుకుని లేపాక్షి వెళ్లాడు. శివశంకర్ వెంటనే ఆపాపను తీసుకుని కదిరేపల్లి వైపు పాపని హింసిస్తూ పాప ఏడుస్తుంటే ఆనందిస్తూ వెళ్లాడు. కదిరేపల్లి వద్దకు రాగానే పాప చనిపోయింది. పాపను ఎక్కడైనా పడేసి వెళ్లాలని అనుకొన్నాడు. ఇంతలోనే గ్రామస్తులకు చిక్కడంతో విషయం బయటపడింది. పోలీసులను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో మొదట గుప్త నిధులు, దొంగ అడ్రస్సులు ఇచ్చాడని డీఎస్పీ తెలిపారు. -
‘గే’లని కిందకు తోసి చంపారు
ఐఎస్ఐఎస్ మరో అకృత్యం లండన్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. స్వలింగ సంపర్కులు(గే) అన్న కారణంతో ఇరాక్‌లోని నినేవా పట్టణంలో ఇద్దరు యువకులను భవనంపై నుంచి కిందకు తోసి చంపారు. అక్రమ సంబంధం కలిగి ఉందంటూ ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపారు. వివిధ కారణాలతో మరో 17 మందిని కూడా అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్నారు. గత రెండ్రోజుల్లో ఐఎస్ ఉగ్రవాదులు ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు లండన్‌లోని సిరియాకు చెందిన మానవ హక్కుల సంస్థ ఒకటి వెల్లడించింది. శిక్షల అమలుకు ముందు ఒక వ్యక్తి చిన్న కాగితంపై రాసుకువచ్చిన సందేశాన్ని చదివాడు. ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా వీరు ప్రవర్తించినందున శిక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత ఒక యువకుడిని అందరూ చూస్తుండగానే ఎత్తై భవనం నుంచి కిందకు తోశారు. అనంతరం మరో వ్యక్తిని అలాగే చంపేశారు. -
నో మోర్ సైలెన్స్
ఆటపాటలు, స్టేజ్ షోలు..వీటితో పాటు తొలిసారి ‘ఎల్జీబీటీ’ కళాకారులు చిత్రించిన బొమ్మలూ కొలువుదీరాయి. ప్రతి పాట..ఆట.. ప్రతి చిత్రం.. వాళ్ల జీవనశైలిని గౌరవించమని చెబుతున్నవే!. ఈ వేడుక కేవలం జెండర్ మైనారిటీల కోసమే నిర్వహించింది కాదు. వాళ్ల ఉనికిని హేళన చేస్తున్న సమాజం కోసం కూడా! వాళ్లను అర్థం చేసుకునే వేదికైంది!. అందుకే ఆ ఆవరణలో ఓ తల్లి కనిపించింది కొడుకు (గే)కి అండగా, ఓ అక్క వచ్చింది చెల్లి (ట్రాన్స్‌జెండర్)కి తోడుగా, ఓ స్నేహితురాలు హాజరైంది తోటి స్నేహితురాలి (బై సెక్సువల్)కి మద్దతుగా, తండ్రీ ఉన్నాడు కూతురు కోసం (లెస్బియన్).. ఆశ్చర్యంగా నిశ్శబ్దం బద్దలైంది.. చర్చ మొదలైంది ఓ తల్లి నుంచే!. మేమున్నాం.. ‘నేనో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు ఒక్కడే కొడుకు. వాడు డాక్టర్. తను ‘గే’ అనేది తను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు తెలిసింది. వినగానే నేనేమీ కుంగిపోలేదు. ‘ఓకే నాన్నా.. డోంట్‌వర్రీ..’ అన్నాను. కౌన్సెలింగ్‌కి ఒప్పించాను. తర్వాత ఇంటర్నెట్లో, ఇంగ్లిష్ మ్యాగజైన్స్‌లో ఎల్జీబీటీ గురించి సమాచారం తెలుసుకున్నాక తనను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అయితే నా ప్రవర్తనకు మా అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ‘అమ్మేంటి? నేను చెప్పింది విని అరుస్తుంది, ఏడుస్తుంది అనుకుంటే ఇంతలా నాకు సపోర్ట్ చేస్తుంది’ అని. కొన్నాళ్లకి మావారికీ నెమ్మదిగా విషయం చెప్పాను. అతనూ అర్థం చేసుకున్నాడు. తప్పు మా పిల్లాడిది కాదు కదా!. వాడి బర్త్ అలా ఉన్నప్పుడు మా అబ్బాయినెందుకు శిక్షించాలి? పైగా వీళ్లు సమాజంలో ఎవరినీ ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ల బతుకేదో వాళ్లు బతుకున్నారు. ఇది పూర్తిగా కుటుంబ విషయం. రేపొద్దున్న నా కొడుకు ఇంకో అబ్బాయితో సహజీవనం చేసినా మాకు సమ్మతమే. ఇలాంటి పిల్లల్ని ముందు తల్లిదండ్రులే అర్థం చేసుకోవాలి. అప్పుడే సమాజమూ వాళ్లను గౌరవిస్తుంది’ అంటూ తన గళమిప్పింది ఆ అమ్మ. ముందు మాట్లాడలేదు.. జర్నలిజం అండ్ సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న అమృతా లారెన్స్ అయితే- ‘నేను బై సెక్సువల్‌ని. ఇంటర్లో ఉన్నప్పుడు నా సెక్సువాలిటీ ఏంటో తెలియక చాలా స్ట్రగుల్ అయ్యాను. అబ్బాయిలను చూస్తే ఎలాంటి ఫీలింగ్స్ కలిగేవో, అమ్మాయిలను చూసినా అలాంటి ఫీలింగ్సే కలిగేవి. చదువుని నెగ్లెక్ట్ చేశాను. ఆ టైమ్‌లోనే లండన్‌లో ఉన్న నా ఫ్రెండ్ జెన్నిఫర్‌తో నా పరిస్థితి గురించి డిస్కస్ చేశాను. అప్పుడు నా మెదడు చేసే అలజడిని ఏమంటారో తెలిసింది. నా ఉనికేంటో అర్థమైంది. ఏదైనా బతకాలని ధైర్యం తెచ్చుకున్నాను. చదువు మీద శ్రద్ధ పెట్టాను. డిగ్రీ ఫస్టియర్ ఎండింగ్లో నాన్నకు చెప్పాను. అప్పటికే అమ్మ చనిపోయింది. నేను చెప్పింది విన్న నాన్న రెండు రోజులు నాతో మాట్లాడలేదు. తర్వాత- ‘నువ్వేంటో నీకు తెలుసు కాబట్టి.. ఎలా ఉండాలో కూడా తెలుసుకున్నావ్ కాబట్టి తండ్రిగా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఏం చేయాలనుకున్నా చెప్పి చెయ్. ఏదీ దాచొద్దు’ అని చెప్పాడు. ఆ రెండు రోజులు నాన్న నాలాంటి వాళ్ల గురించిన సమాచారం తెలుసుకున్నాడు. మాకు ఎలాంటి సపోర్ట్ కావాలో అర్థం చేసుకున్నాడు. బయట కూడా నా గురించి దాచను. నచ్చిన వాళ్లు నాతో ఉంటారు. నచ్చని వాళ్లు తప్పుకుంటారు. కొంతమంది మాటలతో పించ్ చేస్తుంటారు. ఇవేమీ పట్టించుకోను. నేనో మంచి రైటర్ని కావాలి, అంతకన్నా గొప్ప ఫొటో జర్నలిస్ట్‌ని కావాలి, నాకు నచ్చినట్టు బతకాలి.. ఇవే నా లక్ష్యాలు’ అని చెబుతుంది ఎంతో నిర్భయంగా. వాళ్లూ మనలాంటి మనుషులే.. సమాజంలో రకరకాల మనుషులున్నారు. జెండర్ మైనారిటీస్ను గౌరవంగా చూడడమనేది యూత్ నుంచే మొదలవ్వాలి. యూతే భావి నిర్ణేతలు కాబట్టి.. వాళ్ల ఆలోచనల్లో మార్పు రావాలి. వాళ్ల వల్ల ఇతరులకు ఇబ్బంది లేనప్పుడు సొసైటీ నుంచి వాళ్లనెందుకు ఐసోలేట్ చేయాలి? వాళ్ల ఆత్మగౌరవాన్నెందుకు కించపర్చాలి? వాళ్లకూ మనసుంది, మనం గౌరవించాలి. - ప్రాప్తి, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ శ్రేయస్సు కాంక్షిస్తున్నారు.. జెండర్ మైనారిటీస్కున్న స్కిల్స్, వ్యక్తిత్వాలు ఎంత అద్భుతమైనవో చాటేందుకు నిర్వహిస్తున్నదే ఈ కార్నివాల్. ఆర్ట్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్‌లో వాళ్లకున్న ప్రావీణ్యం, వాళ్లు ఎలాంటి లైఫ్‌ని లీడ్ చేస్తున్నారో ఈ ఉత్సవంలో పాల్గొంటే తెలుస్తుంది. వాళ్లు అనాథ పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు, వైద్య సేవలందిస్తున్నారు. జెండర్ మైనారిటీస్‌కి, సమాజానికి మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేయడానికే ఈ వేడుకను నిర్వహిస్తున్నాం. కిందటేడు ఎల్జీబీటీస్ కన్నా మిగిలినవాళ్లే ఎక్కువొచ్చారు. ఇప్పుడూ అదే రెస్పాన్స్. - నవదీప్, కార్నివాల్ నిర్వహణలో భాగస్వామి క్వీర్ క్యాంపస్ నేపథ్యమిదీ.. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్.. వాళ్లూ మనుషులే. వారికీ ఆత్మ గౌరవం ఉంటుంది. అది వారి ప్రాథమిక హక్కు. వారికి మిగిలిన సమాజానికి మధ్య దూరాన్ని తగ్గించేందుకు పుట్టిందే క్వీర్ క్యాంపస్. చాన్నాళ్ల కిందట ఇది జర్మనీలో మొదలైంది. ఆపై దిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాలను దాటి కిందటేడాది హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడిది ఊపిరిపోసుకోవడానికి ఆద్యులు అభి, సత్య అనే యువకులు. ‘మా గళం వినిపించడానికి ఓ వేదిక కావాలి. మనసులో మాటను ఆటపాటగా అందిస్తే అందరికీ చేరుతుంది. ఆలోచనలు రేకెత్తిస్తుంది. అలా మా ఉనికి పోరాటాన్ని గౌరవప్రదంగా మలచడానికి, దాని గురించి అందరికీ అవగాహన కల్పించడానికి అప్పటికే మనుగడలో ఉన్న ఈ క్వీర్ క్యాంపస్‌ను డయాస్‌గా మలచుకోవాలనుకుని నిరుడు క్వీర్ క్యాంపస్ హైదరాబాద్‌ను స్టార్ట్ చేశాం. త్వరలో ఇతర పట్టణాలకు, ఊళ్లకూ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాం’ అని చెబుతాడు అభి. - సరస్వతి రమ -
టిమ్ కుక్ 'గే' ఎఫెక్ట్: స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసం!
మాస్కో: ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని ధ్వంస చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రష్యాలోని సెయింట్ పీటర్ బర్గ్ లో గత శుక్రవారం చోటు చేసుకుంది. తాను స్వలింగ సంపర్కుడినని ఆపిల్ కంపెనీ ప్రస్తుత సీఈవో టిమ్ కుక్ వెల్లడించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ రూపంలో ఆరు అడుగుల స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని సెయింట్ పీటర్స్ బర్గ్ కాలేజీ ఆవరణలో 2013 సంవత్సరం జనవరిలో రష్యాకు చెందిన జెడ్ఈఎఫ్ఎస్ గ్రూప్ ప్రతిష్టించింది. స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా జెడ్ఈఎఫ్ఎస్ సంస్థ ప్రచారం నిర్వహిస్తోంది. ఈ కారణంగా తాము స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని తొలగించినట్టు ఆ సంస్థ తెలిపింది. -
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సంచలన ప్రకటన
న్యూయార్క్: తాను స్వలింగ సంపర్కుడినని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ సంచలన ప్రకటన చేశారు. ఓ బిజినెస్ మ్యాగజైన్ కు రాసిన వ్యాసంలో 'నేను స్వలింగ సంపర్కుడి' నని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అని కుక్ వెల్లడించారు. తన లింగత్వంపై వచ్చిన కథనాలను ఎప్పుడూ ఖండించలేదని, బహిరంగంగా ప్రకటన చేయలేదన్నారు. ఆపిల్ కంపెనీలో చాలా మంది సహచరులకు తాను స్వలింగ సంపర్కుడినన్న విషయం తెలుసన్నారు. స్వలింగ సంపర్కుడినని చెప్పడం అంత సులభం కాలేదని, ఇతరులకు ఉపయోగంగా ఉంటుందని ఈ విషయాన్ని బహిరంగపరిచానని వివరణ ఇచ్చారు. స్వలింగ సంపర్కుడిగా ఉండటం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తానని ఆయన తెలిపారు. ప్రజలందరికి సమాన హోదా ఉండేందుకు పోరాటం చేస్తానన్నారు. అంతేకాకుండా ఉత్తమ సీఈఓగా గుర్తింపు పొందడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని టిమ్ కుక్ అన్నారు. -
‘గే’ల మధ్య గలాటా
యువకుడి దుర్మరణం నిందితుడు రిటైర్డ్ డిప్యూటీ డెరైక్టర్ హిమాయత్‌నగర్: విచక్షణ మరిచిన ఓ రిటైర్డ్ ఉన్నతాధికారి తీరు సభ్య సమాజం తలదించుకొనేలా చేసింది. పదుగురికి స్ఫూర్తిగా నిలవాల్సిన ఆయన వికృత చేష్టలు ఓ నిండుప్రాణం గాలిలో కలసిపోయేలా చేసింది. ‘తోడు’ కోసం తెచ్చుకున్న ఓ యువకుడిని మూడో అంతస్తు పైనుంచి తోసేయడంతో దుర్మణం పాలయ్యాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన నారాయణగూడ లింగంపల్లిప్రాంతంలో సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల మేరకు...పరిశ్రమల శాఖ (చిరాక్ అలీలేన్)లో డిప్యూటీ డెరైక్టర్‌గా వి. నరసింహారావు 2011లో పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఆయన ఓ న్యాయవాది వద్ద స్టెనో కం టైపిస్టుగా పనిచేస్తున్నారు. న్యాయవాది కార్యాలయం నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లింగంపల్లికి చెందిన అన్నపూర్ణ ఏఎస్ఎన్ రెసిడెన్సీ 3వ అంతస్తులో ఉంది. పని ఎక్కువగా ఉండటంతో సోమవారం రాత్రి 10 గంటల వరకూ కార్యాలయంలోనే ఉన్నారు. తర్వాత అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్ వద్దకు వెళ్లారు. వాస్తవానికి నరసింహారావు స్వలింగసంపర్కుడు (గే). అక్కడ గుర్తు తెలియని యువకుడు పరిచయమయ్యాడు. రాత్రి నరసింహారావుతో ఉండేందుకు వారి మధ్య ఒప్పందం కుదిరింది. అక్కడ నుంచి వారు న్యాయవాది కార్యాలయానికి వచ్చారు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. తన కోరిక తీర్చలేదంటూ ఆ యుకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడో అంతస్తుపై నుంచి తోసేశాడు నరసింహారావు. ఆ యువకుడు కాంపౌండ్వాల్పై పడిపోయాడు. రాత్రి విధులు నిర్వర్తిస్తున్న నారాయణగూడ పోలీసులు అటుగా వచ్చి పైనుంచి పడిన యువకుడ్ని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే యువకుడు చనిపోయాడు. పోలీసులు నరసింహారావును అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం మంగళవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. అయితే మృతి చెందిన యువకుడు కూడా ‘గే’గానే అనుమానిస్తున్నారు. -
'గే'ల మధ్య గొడవ, యువకుడి మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ నారాయణగూడలో ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య (గే) వాగ్వివాదం చోటుచేసుకుంది. అది కాస్తా శ్రుతిమించటంతో ఓ వ్యక్తిని మరో వ్యక్తి భవనం పైనుంచి తోసేశాడు. ఈ ఘటనలో అతను మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సింహ అనే రిటైర్డ్ ఉద్యోగి ఆబిడ్స్ నుంచి ఓ యువకుడిని తీసుకుని నారాయణగూడ ప్రాంతానికి సోమవారం అర్ధరాత్రి సమయంలో వచ్చాడు. అక్కడ ఏంజరిగిందో తెలియదు గానీ, ఇద్దరి మధ్య గొడవ మొదలై, అది ముదిరింది. కాసేపటి తర్వాత నర్సింహ తనతో పాటు వచ్చిన యువకుడిని మేడపైనుంచి కిందకు తోసేశాడు. దాంతో అతడు మరణించాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘గే’లకూ ఒక ప్రతినిధి..!
స్వజాతీయం గే, లెస్బియన్, ట్రాన్స్‌జెండర్స్, హోమో సెక్సువల్స్... మానవ జాతి పరిణామక్రమంలోని ప్రతి దశలోనూ వీళ్లున్నారు. ఒక్కో నాగరకత వీరిని ఒక్కోలా ట్రీట్ చేసింది. ప్రస్తుతం మన దేశంలో అయితే తమను అసహ్యించుకొంటారేమో అనే భయం చాలా మంది ఎల్జీబీటీలను గుట్టుగా బతికేలా చేస్తోంది. అయితే కొందరు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లోనూ బయటకు వస్తున్నారు. సమాజంలో నిరాదరణ ఉంటుందని తెలిసి కూడా తమను తాము గేలుగా, లెస్బియన్లుగా ధైర్యంగా చెప్పుకొంటున్నారు. తామూ మనుషులమేనని అంటున్నారు. తమకూ హక్కులున్నాయంటున్నారు, తమకూ ప్రతిభ ఉందని నిరూపించుకొన్నారు. ఇలాంటి వారిలో ఒకరు నక్షత్రబాగ్వే. ఒక అవార్డు విన్నింగ్ ఫిలిమ్ మేకర్‌గా, దేశంలోని తొలి గే అంబాసిడర్‌గా గుర్తింపు తెచ్చుకొన్నాడితను. ‘లాగింగ్ ఔట్’అనే జీరో బడ్జెట్ సినిమాను రూపొందించి, దాని ద్వారా అవార్డులను పొంది ఉన్నఫళంగా సెలబ్రిటీగా మారాడు నక్షత్ర. కేవలం రెండే రోజులతో... అత్యంత తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది. యూట్యూబ్‌లో అప్లోడ్ చే యడంతో నక్షత్ర అనేకమంది దర్శకుల కళ్లలో పడ్డాడు. ఇక సినిమాతో వచ్చిన గుర్తింపు కొత్త సినిమా అవకాశాలను కూడా తెచ్చిపెడుతోంది. ఒక భారతీయ ఫీచర్ ఫిలిమ్‌లోనూ, ఒక అమెరికన్ఫిలిమ్ మేకర్ రూపొందిస్తున్న సినిమాలోనూ నక్షత్ర నటిస్తున్నాడు. ఇలాంటి సమయంలో తన నేపథ్యాన్ని చెప్పుకొంటూ తను గే అన్న విషయాన్ని కూడా ప్రకటించుకొన్నాడు. ఎటువంటి మొహమాటం లేకుండా వ్యవహరిస్తున్నాడు. చాలా మంది ఈ విషయంలో భయపడతారని, అయితే తను ‘గే’ అని ప్రకటించుకొన్నాక కూడా తనను ఎవరూ తక్కువ చేసి చూడలేదని, అలాగే ఆ విషయం గురించి తనను గుచ్చి ప్రశ్నించిన వారు కూడా ఎవరూ లేరని నక్షత్ర చెప్పాడు. నక్షత్ర ఇప్పుడు ఎల్జీబీటీల హక్కుల కోసం గళం విప్పాడు. వాళ్లను మనుషులుగా గుర్తించాలని అంటున్నాడు. ఇందుకోసం మూవ్జ్ అనేక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎల్జీబీటీల కోసమే ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్‌ను ప్రారంభించనున్నారట. -
బ్రిటన్‌లో నాలుగింతలు పెరిగిన లెస్బియన్లు!
బ్రిటన్‌లో ఆడ స్వలింగ సంప్కరులు(లెస్బియన్లు) సంఖ్య దశాబ్దకాలంలో నాలుగింతలు పెరిగినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పురుష స్వలింగ సంప్కరులు(గే) సంఖ్యలో మాత్రం పెద్దగా మార్పు లేదని లైంగిక ప్రవర్తన, జీవనశైలిపై జరిపిన జాతీయ సర్వేలో వెల్లడయింది. శృంగారం విషయంలో మహిళలు సాహసోపేతంగా వ్యవహరిస్తున్నారని.. ప్రయోగాలకు వెనుకాడడం లేదని.. లైంగిక విజ్ఞానం పట్ల వారికి అవగాహన అధికంగానే ఉందని తేలింది. 1990లో లెస్బియన్లు 4 శాతం ఉండగా 2010 నాటికి ఈ సంఖ్య 16 శాతానికి పెరిగింది. వీరిలో 8 శాతం మంది తమ భాగస్వాములతో లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ఇక పురుష స్వలింగ సంప్కరులు సంఖ్య దశాబ్దకాలంలో ఒక శాతం మాత్రమే పెరిగింది.1990లో ఇది 6 శాతంగా ఉంది. బ్రిటన్‌లో లెస్బియన్లు సంఖ్య పెరుగుతుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో స్రీలు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారని కొందరు అంటుంటే, వైవిధ్యం కోరుకుంటున్నారని మరికొందరు అంటున్నారు. -
గే, లెస్బియన్ వెబ్ సైట్లపై పాకిస్థాన్ నిషేధం!
గే, లెస్బియన్, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్ జీబీటీ) కమ్యూనిటీలకు చెందిన ఏకైక వెబ్ సైట్ ను పాకిస్థాన్ నిషేధించింది. ఇంటర్నెట్ వినియోగదారుల ఫిర్యాదు మేరకు పాకిస్థాన్ టెలికాం అధికారులు వెబ్ సైట్(queerpk.com) ను తొలగించారు. అత్యధికంగా ఫిర్యాదులు రావడంతో వినియోగదారులకు అందుబాటులో ఉండకుండా ఎల్ జీబీటీ వెబ్ సైట్స్ ను ఇంటర్నెట్ నుంచి తొలగించినట్టు టెలికాం అధికారులు తెలిపారు. గే కమ్యూనిటీని ఆదరించండి అంటూ ప్రారంభించిన వెబ్ సైట్ ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని సంబంధిత నిర్వాహకులు తెలిపారు. అయితే ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉన్న వెబ్ సైట్ పై కేసును వాదించడానికి పాకిస్థాన్ కు చెందిన లాయర్లు ఎవరూ కూడా ముందుకు రాలేదని నిర్వహకులు వెల్లడించారు. ఇలాంటి వెబ్ సైట్ ను నిర్వహించడం పెద్ద సవాల్ అని. అన్నారు. అయినప్పటికి.. సమాచారం పొందుపరచడంలో అనేక జాగ్రత్తలను పాటిస్తున్నామన్నారు. నెటిజన్లకు వెబ్ సైట్ ను http://humjins.com ద్వారా అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. స్వలింగ సంపర్కం పాకిస్థాన్ చట్ట విరుద్దం కావడంతో ఇలాంటి వెబ్ సైట్లను నిర్వహించే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. -
విద్యార్థి ఎన్నికల్లో ఓ అమ్మ.. ఓ స్వలింగ సంపర్కుడు.. ఓ కజకిస్థానీ!
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ) లో ఎన్నికలంటేనే దేశవ్యాప్తంగా ఓ ఆసక్తి కలగడం సహజం. అయితే ఈసారి జేఎన్ యూ లో ఎన్నికలు మరో విధంగా ఆకర్షిస్తున్నాయి. ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో పలు పార్టీలు విజయం సాధించడానికి బలమైన అభ్యర్థులను బరిలో నిలిపారు. అయితే జేఎన్ యూ ఎన్నికల్లో గే (స్వలింగ సంపర్కుడు), ఓ తల్లి, కజకిస్థాన్ కు చెందిన అభ్యర్థులు నేను సైతం అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓ పాపకు తల్లైన గుంజన్ ప్రియ జేఎన్ యూ లో ఎంఫిల్ స్టూడెంట్. గుంజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) పార్టీ తరపున కౌన్సిలర్ గా ప్రచారం చేస్తోంది. అయితే గుంజన్ కూతురు కూడా జేఎన్ యూ క్యాంపస్ లో తన తల్లికి ఓటు చేయాలని ప్రచారం చేయడం అందర్ని ఆకట్టుకుంటోంది. 'తాను వివాహితురాలిని. లింగ సమానత్వం కోసం పోరాడుతాను. వివాహిత మహిళలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి' అనే డిమాండ్ తో గుంజన్ ముందుకెళ్తోంది. ఇక ఎస్ఎఫ్ఐ బ్యానర్ లో లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్ జీబీటీ) కమ్యూనిటీ తరపున గౌరవ్ ఘోష్ రంగంలో నిలువడం ప్రత్యేకతగా నిలిచింది. ఎల్ జీ బీటి కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులకు జేఎన్ యూ లో సమాన హోదా కల్పించాలి. మా కమ్యూనిటీలోని సభ్యులపై వివక్ష కు అంతం పలికి, సమానత్వం కల్పించాలని గౌరవ్ డిమాండ్ చేస్తున్నాడు. ఇక జేఎన్ యూ ఎన్నికల్లో విదేశీ విద్యార్థి కూడా అధ్యక్ష పదవికి పోటి పడుతూ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నాడు. కజకిస్థాన్ కు చెందిన అక్మెత్ బెకోవ్ ఝాస్సులాన్ ఓ అనువాదకుడి సహాయంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. మాజీ సైనికుడైన ఝాస్సులాన్ కు యుద్దంలో పాల్గొన్నందుకు పలు పతకాలు కూడా దక్కించుకున్నట్టు సమాచారం.ఝాస్సులాన్ ప్రస్తుతం జేఎన్ యూలో ఎకనామిక్స్ లో స్నాతకోత్సవ విద్యను అభ్యసిస్తున్నాడు. ఝాస్సులాన్ జనతాదళ్ యునైటెడ్ (జేడీ-యూ) తరపున బరిలో ఉన్నారు. జేఎన్ యూలో విదేశీ విద్యార్థులకు ఇబ్బందులున్నాయని.. భాష ప్రధానంగా అనేక సమస్యలను సృష్టిస్తోందని.. ఇలాంటి పరిస్థితులను అధిగమించేలా తాను చర్యలు తీసుకుంటానని తన ఎజెండాగా ప్రచారంలో ముందుకు పోతున్నాడు. అనేక విశేషాలతో కొనసాగుతున్న ప్రచారం సెప్టెంబర్ 13 తేదిన జరిగే ఎన్నికలతో ముగియనుంది.