గే అయినందుకు చంపేశారు! | ISIS thugs hurl man to his death from tall building for being gay - as small children watch | Sakshi
Sakshi News home page

గే అయినందుకు చంపేశారు!

Published Mon, May 9 2016 11:24 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

గే అయినందుకు చంపేశారు! - Sakshi

గే అయినందుకు చంపేశారు!

ఇస్లామిక్ ఉగ్రవాదుల ఘాతుకాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా ఓ సిరియన్ వ్యక్తిని ఐదంతస్తుల భవనం పైనుంచి కిందికి నెట్టి చంపేయడం వారి రాక్షసత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది.  అతడు స్వలింగ సంపర్కుడు కావడమే అందుకు కారణంగా ఐసిస్ వివరించింది. అనాగరికమైన ఆ చర్య.. అలెప్పో రాష్ట్రంలోని మన్బిజ్ లో చిన్న పిల్లలు సహా అందరూ చూస్తుండగా జరిగింది.  

స్వలింగ సంపర్కుడవ్వడంతో ఓ యువకుడి ప్రాణాలను ఐసిస్ బలి తీసుకుంది. ఓ ఎత్తైన భవనం పైనుంచి అతన్నిఅనాగరికంగా కిందికి విసిరేసిన ముగ్గురు ఉగ్రవాదులు, అతడిపై కిరాతకంగా వ్యవహరించి, అతడి ప్రాణాలను గాల్లో కలిపేశారు. అలెప్పో రాష్ట్రం మన్బిజ్ లో జరిగిన అమానవీయ ఘటనకు ప్రపంచం నివ్వెరపోయింది.  జిహాదీలు తాజాగా విడుదల చేసిన చిత్రాలు అలెప్పోలో జరిగిన రాక్షస చర్యకు తార్కాణాలుగా నిలుస్తున్నాయి. స్వలింగ సంసర్కుడన్న ఆరోపణతో చిన్నపిల్లలు సహా డజన్లకొద్దీ జనం చూస్తుండగానే ఆ ఉగ్రమూక యువకుడికి తీవ్రమైన శిక్ష విధించింది. చంపేసేందుకు ముందు.. కళ్ళకు గంతలు కట్టి, చెప్పుల్లేకుండా నిర్మాణంలో ఉన్న భవనంపై ఇస్లామిక్ ఫైటర్స్ యువకుడ్ని నిలబెట్టినట్లు ఓ ఫొటోలోని వివరాలను బట్టి తెలుస్తుంటే... మరో చిత్రంలో అతడికి మరణశిక్షను విధిస్తూ ఐదంస్తుల భవనం పై నుంచీ కిందికి తోసేయడం స్పష్టంగా కనిపించడమే కాక... ఐసిస్ వికృత చర్యలకు సాక్ష్యంగా నిలుస్తోంది.

యువకుడు భవనంపైనుంచి కింద పడేందుకు ముందుగా రూఫ్ పై  అతడి వద్ద నిలబడ్డ ముగ్గురు జిహాదీలు ఐసిస్ ఆర్గనైజేషన్ల ద్వారా ఈ తాజా ఫొటోలను  విడుదల చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదేరకంగా ఇంతకు ముందుకూడ ఐసిస్ ఓ యువకుడి పట్ల ప్రవర్తించినట్లు ఆధారాలు చెప్తున్నాయి.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement