Tall
-
పొట్టిగా ఉండే అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకోవద్దా? ఇవిగో ట్రిక్స్ అండ్ టిప్స్
వినాయక చవితి, దసరా, బతుకమ్మ సంబరాలు ముగిసాయి. ఇక దీపావళి సందడి షురూ కానుంది. ఏ పండగఅయినా భక్తి, ముక్తితోపాటు కొత్తబట్టలు, అందంగా ముస్తాబు కావడం ఈ హడావిడి ఉండనే ఉంటుంది. ముఖ్యంగా వెలుగుల పండుగ దీపావళికి ఆరడుగల అందగాళ్లు, చందమామ లాంటి ముద్దుగుమ్మలు ట్రెండీగా, ఫ్యాషన్‌గా మెరిసిపోవాలని ఆరాటపడతారు. ఆరడుగులు అంటే గుర్తొచ్చింది.. పొట్టిగా ఉన్నామని..లావుగా ఉన్నామని తమకు ఏ డ్రెస్ సూట్ కాదు అని చాలామంది అమ్మాయిలు దిగులు పడుతూ ఉంటారు. పొట్టిగా ఉండటం మన తప్పు కాదు. కానీ మన శరీరారినిక తగ్గట్టు దుస్తులను ఎంచుకుంటే స్పెషల్ బ్యూటీగా మెరిసిపోవడం ఖాయం. అదెలాగో చూసేద్దామా! ఫ్యాషన్ ట్రిక్స్పొడవుగా మారడానికి మ్యాజిక్ సొల్యూషన్ ఏమీ లేదు, కానీ పొడుగ్గా కనిపించేలా కొన్ని ఫ్యాషన్ ట్రిక్స్ ఉన్నాయి. ఫ్యాషన్‌కి స్లైల్కి ఖచ్చితమైన నియమాలేవీ లేవు. శరీర రంగును బట్టి, బాడీకి తగ్గట్టుగా కలర్‌ను ఎంచుకుంటే చాలు. చక్కని ఫిట్టింగ్, డ్రెస్సింగ్ స్టైల్లో ఒక చిన్న మార్పు ఎలిగెంట్ లుక్‌ను ఇస్తుంది.జీన్స్, టీషర్ట్ ఎలాంటి వారికైనా ఇట్టే నప్పుతాయి. మ్యాచింగ్ కలర్స్ చాలా ముఖ్యం. మాక్సీ స్కర్ట్స్ లేదా డ్రెస్‌లు పొడవాటి అమ్మాయిలకు మాత్రమే బాగుంటాయి అనే అపోహను నమ్మవద్దు. మల్టిపుల్ లేయర్డ్ స్కర్ట్స్ కాకుండా మంచి కట్ స్కర్టులు ఎంచుకోండి. పొడవు స్కర్ అయితే టక్-ఇన్ టీ-షర్టుతో, కట్ జాకెట్‌తో ,హై హీల్డ్ షూ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.నిలువుగీతలు ఉన్న డ్రెస్‌లు పొడవుగా కనిపించేలా చేస్తాయి.కుర్తా లేదా చీర ధరించినపుడు సౌకర్యవంతమైన హైహీల్స్ వాడండి. అంతేకాదు డ్రెస్‌కు తగ్గట్టు , స్టైలింగ్ టిప్స్ పాటించాలి. ఉదాహరణకు క్లచ్‌లు, క్రాస్ బాడీ పర్సులు , చిన్న బ్యాగ్‌లు బెస్ట్ ఆప్షన్. మరీ పెద్దబ్యాగుల జోలికి అస్సలు వెళ్లవద్దుకుర్తీలకు, లేదా చీరల బ్లౌజ్లకు హైనెక్, రౌండ్ నెక్ కాకుండా, వీ నెక్, డీప్ నెక్, డీప్ రౌండ్ నెక్ లాంటివి ఎంచుకోండి. వర్టికల్ అప్పీల్‌కోసం ప్లంగింగ్ v-నెక్లైన్ టాప్‌లను ధరించండి. దీంతో పొడవుగా కనిపించడమే కాదు, సన్నగా కూడా కనిపిస్తారు.చిన్న ప్రింట్లు, సింపుల్ ఎంబ్రాయిడరీ ఔట్ ఫిట్ చూడడానికి బావుంటాయి. భారీ ఎంబ్రాయిడరీ, చీర పెద్ద పెద్ద అంచులున్న చీరలు అన్ని అకేషన్స్‌కు నప్పవు.ఎథ్నిక్ వేర్ కోసం పొడవాటి జాకెట్ స్టైల్ లెహెంగా లేదా సల్వార్ సూట్లకు దూరంగా ఉండండి. ఇదీ చదవండి : ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా బెంజ్‌కార్లు, అంతేనా?! -
వేలెడంత.. బారెడంత..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన అబ్బాయి.. అత్యంత పొట్టి అమ్మాయి.. ఇద్దరూ ఒకచోట చేరితే.. ఇదిగో ఇలా ఉంటుంది. ఇతడి పేరు సుల్తాన్ కోసెన్.. వయసు 41 ఏళ్లు.. టర్కీకి చెందిన కోసెన్ పొడవు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాలు.. మరి ఈమె పేరు జ్యోతి ఆమ్గే.. వయసు 30 ఏళ్లు..ఇండియాకు చెందిన ఈమె పొడవు కేవలం రెండు అడుగులే. ఇద్దరి మధ్య తేడానే ఆరు అడుగులకన్నా ఎక్కువ. సుమారు ఆరేళ్ల కింద ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర ఈ ఇద్దరితో నిర్వహించిన ఫొటోషూట్ అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. మళ్లీ రెండు రోజుల కింద అమెరికాలోని కాలిఫోర్నియాలో మరో ఫొటో షూట్ కోసం వారిద్దరూ కలిశారు. అక్కడ తీసిన చిత్రాలే ఇవి. అకొండ్రోప్లాసియాగా పిలిచే లోపం వల్ల జ్యోతి ఎదుగుదల లేక మరుగుజ్జులా ఉండిపోతే.. పిట్యుటరీ గ్రంథిలో ట్యూమర్‌తో గ్రోత్ హార్మోన్ విపరీతంగా ఉత్పత్తయి కోసెన్ ఇలా భారీగా ఎదిగిపోయాడు. -
ఆరడుగుల ఎత్తున్నవారికి మాత్రమే..!
తిరువనంతపురం: ఆరడగుల అందగాడు.. ఆరడుగుల బుల్లెట్. ఇలా ఆరడుగుల ఎత్తు అనేది కొంచెం ప్రత్యేకంగా నిలుస్తుందని వేరే చెప్పక్కర్లేదు. 5.5 అడుగులు.. సరాసరి ఎత్తుగా కలిగిన ఇండియాలో ఆరడుగుల ఎత్తు అంటే అందరికీ మోజే. కొందరైతే ఈ బెంచ్‌మార్క్‌ను చేరుకోవడానికి ఎత్తు పెరిగే శస్త్ర చికిత్సలకు సైతం వెనుకాడకపోవటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆరడుగులకు పైబడి ఎత్తు ఉన్నవారికి.. ఆ ఎత్తే కొన్నిసార్లు సమస్యగా మారుతుంది కూడా. మామూలు కార్లో కూర్చోవాలంటే వారు వంగటం కొంచెం కష్టమే. అంతే కాదు చెప్పుల షాపుకు వెళ్తే.. ఆ పాదాల సైజుకు సరిపడే చెప్పులు కూడా అన్ని సార్లు దొరకవు. ఇలాంటి ఆరడుగులు, ఆ పైన ఎత్తు ఉన్న వారికోసం కేరళలో ఓ అసోసియేషన్ ఏర్పాటైంది. కేరళ టాల్ మెన్ అసోసియేషన్(కేటీఎంఏ)గా పిలువబడుతున్న దీనిలో సభ్యులు కావాలంటే ఎత్తు ఆరడుగులకు పైగా ఉండాల్సిందే. ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరిలో 70 మంది మహిళలు సైతం ఉన్నారు. రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ సకారియా జోసెఫ్ కేటీఎమ్ఏను 1999లో ప్రారంభించారు. బట్టలు, చెప్పుల సైజు విషయంలో వీరికి సాధారణంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవటంతో పాటు.. దీనిలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాన్ని సైతం ఈ అసోసియేషన్ కల్పిస్తుంది. పర్సనల్ సెక్యురిటీ, భద్రతకు సంబంధించిన ఉద్యోగాల్లో వీరి ఎత్తుకు మంచి ప్రాధాన్యత లభిస్తోంది. వీరి ఎత్తుకు తగిన పెళ్లి సంబంధాలను కలుపడంలో సైతం కేటీఎంఏ కృషి చేస్తుంది. 6.3 అడుగుల ఎత్తుతో కేటీఎంఏలో సభ్యురాలిగా ఉన్న కవిత మాట్లాడుతూ.. 'బయటకు వెళ్లినప్పుడు చిన్న పిల్లలు, యువత ఆశ్చర్యంతో చూసేవారు. అది కొంత ఇబ్బందిగా ఉండటంతో పబ్లిక్ ప్లేస్‌లకు వెళ్లడం తగ్గించేదాన్ని. అయితే ఈ అసోసియేషన్‌లో చేరిన తరువాత నాలాంటి వాళ్లను చాలా మందిని కలువగలిగాను. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది' అని తెలిపింది. ఎక్కువ ఎత్తుతో ఉన్నామని డిప్రెస్ అయ్యేవారికి కేటీఎమ్ఏ సహకారం అందిస్తుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆంటోని తెలిపారు. -
గే అయినందుకు చంపేశారు!
ఇస్లామిక్ ఉగ్రవాదుల ఘాతుకాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా ఓ సిరియన్ వ్యక్తిని ఐదంతస్తుల భవనం పైనుంచి కిందికి నెట్టి చంపేయడం వారి రాక్షసత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. అతడు స్వలింగ సంపర్కుడు కావడమే అందుకు కారణంగా ఐసిస్ వివరించింది. అనాగరికమైన ఆ చర్య.. అలెప్పో రాష్ట్రంలోని మన్బిజ్ లో చిన్న పిల్లలు సహా అందరూ చూస్తుండగా జరిగింది. స్వలింగ సంపర్కుడవ్వడంతో ఓ యువకుడి ప్రాణాలను ఐసిస్ బలి తీసుకుంది. ఓ ఎత్తైన భవనం పైనుంచి అతన్నిఅనాగరికంగా కిందికి విసిరేసిన ముగ్గురు ఉగ్రవాదులు, అతడిపై కిరాతకంగా వ్యవహరించి, అతడి ప్రాణాలను గాల్లో కలిపేశారు. అలెప్పో రాష్ట్రం మన్బిజ్ లో జరిగిన అమానవీయ ఘటనకు ప్రపంచం నివ్వెరపోయింది. జిహాదీలు తాజాగా విడుదల చేసిన చిత్రాలు అలెప్పోలో జరిగిన రాక్షస చర్యకు తార్కాణాలుగా నిలుస్తున్నాయి. స్వలింగ సంసర్కుడన్న ఆరోపణతో చిన్నపిల్లలు సహా డజన్లకొద్దీ జనం చూస్తుండగానే ఆ ఉగ్రమూక యువకుడికి తీవ్రమైన శిక్ష విధించింది. చంపేసేందుకు ముందు.. కళ్ళకు గంతలు కట్టి, చెప్పుల్లేకుండా నిర్మాణంలో ఉన్న భవనంపై ఇస్లామిక్ ఫైటర్స్ యువకుడ్ని నిలబెట్టినట్లు ఓ ఫొటోలోని వివరాలను బట్టి తెలుస్తుంటే... మరో చిత్రంలో అతడికి మరణశిక్షను విధిస్తూ ఐదంస్తుల భవనం పై నుంచీ కిందికి తోసేయడం స్పష్టంగా కనిపించడమే కాక... ఐసిస్ వికృత చర్యలకు సాక్ష్యంగా నిలుస్తోంది. యువకుడు భవనంపైనుంచి కింద పడేందుకు ముందుగా రూఫ్ పై అతడి వద్ద నిలబడ్డ ముగ్గురు జిహాదీలు ఐసిస్ ఆర్గనైజేషన్ల ద్వారా ఈ తాజా ఫొటోలను విడుదల చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదేరకంగా ఇంతకు ముందుకూడ ఐసిస్ ఓ యువకుడి పట్ల ప్రవర్తించినట్లు ఆధారాలు చెప్తున్నాయి. -
సైకత శాంటాక్లాజ్ కు వరల్డ్ రికార్డ్!
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం అంత సులభం కాదు. అటువంటి రికార్డు పుటలకెక్కడం కోసం ఒక్కొక్కరూ ఒక్కో రకమైన ప్రతిభను ప్రదర్శిస్తారు. తమలోని ప్రతిభకు పదును పెట్టి మరింత నైపుణ్యంతో ప్రదర్శించి రికార్డులకెక్కుతారు. అదే నేపథ్యంలో ఇప్పటికే ప్రఖ్యాత భారతీయ సైకత కళాకారుడుగా పేరొంది... ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నసుదర్శన్ పట్నాయక్... తాజాగా అతిపెద్ద శాంటా క్లాజ్ ను అత్యంత సుందరంగా తీర్చి దిద్ది ప్రపంచ రికార్డు సాధించాడు. ప్రపంచశాంతి సందేశంతో రూపొందించిన ఆ ఎత్తైన శాంటా.. ఇండియాలోని ఒడిషా.. పూరీ బీచ్ లో సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటోంది. 2013 లో పట్నాయక్ తొలిప్రయత్నంగా 23 అడుగుల ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఇసుకతో రూపొందించి, లిమ్కా రికార్డును చేజిక్కించుకున్నాడు. తాజాగా అదే శాంతి సందేశంతో 45 అడుగుల ఎత్తు, 75 అడుగుల వెడల్పు కలిగిన శాంటాక్లాజ్ సైకత శిల్పానికి రూపకల్పన చేశాడు. ఇరవైమంది సభ్యులతో, వెయ్యి టన్నుల ఇసుకతో సుమారు ఇరవై రెండు గంటలపాటు కష్టించి ఈ రంగు రంగుల శాంటాను నిర్మించారు. 45 అడుగుల ఎత్తైన ఈ శాంటా.. ఇప్పుడు గిన్నిస్ రికార్డును దక్కించుకోవడంతోపాటు... సందర్శకుల ప్రశంసలందుకుంటోంది. దీనికి తోడు ఏసుక్రీస్తు, మేరీమాతల శిల్పాలను కూడ రూపొందించి ప్రదర్శనకు ఉంచిన పట్నాయక్... అత్యంత ప్రేక్షకాభిమానాన్ని చూరగొంటున్నాడు. సందర్శకుల్లో అవగాహన పెంచే దిశగా గతంలో పట్నాయక్ ఎన్నో సైకత శిల్పాలకు ప్రాణం పోశాడు. ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్న ప్రస్తుత శాంటా ప్రదర్శన పూరీ బీచ్ లో జనవరి ఒకటి వరకూ కొనసాగుతుంది.