పొట్టిగా ఉండే అమ్మాయిలు స్కర్ట్స్‌ వేసుకోవద్దా? ఇవిగో ట్రిక్స్‌ అండ్‌ టిప్స్‌ | Styling tips for short height women appear taller | Sakshi
Sakshi News home page

పొట్టిగా ఉండే అమ్మాయిలు స్కర్ట్స్‌ వేసుకోవద్దా? ఇవిగో ట్రిక్స్‌ అండ్‌ టిప్స్‌

Published Tue, Oct 15 2024 1:08 PM | Last Updated on Tue, Oct 15 2024 5:13 PM

Styling tips for short height women  appear taller

వినాయక చవితి, దసరా, బతుకమ్మ సంబరాలు ముగిసాయి.  ఇక దీపావళి సందడి  షురూ కానుంది.  ఏ పండగఅయినా భక్తి, ముక్తితోపాటు కొత్తబట్టలు, అందంగా ముస్తాబు కావడం ఈ హడావిడి ఉండనే ఉంటుంది.   ముఖ్యంగా  వెలుగుల పండుగ దీపావళికి ఆరడుగల అందగాళ్లు, చందమామ లాంటి ముద్దుగుమ్మలు  ట్రెండీగా, ఫ్యాషన్‌గా మెరిసిపోవాలని ఆరాటపడతారు. ఆరడుగులు అంటే గుర్తొచ్చింది.. పొట్టిగా ఉన్నామని..లావుగా ఉన్నామని  తమకు ఏ డ్రెస్‌  సూట్‌ కాదు అని చాలామంది అమ్మాయిలు దిగులు పడుతూ ఉంటారు. పొట్టిగా ఉండటం మన తప్పు కాదు. కానీ మన శరీరారినిక తగ్గట్టు దుస్తులను ఎంచుకుంటే   స్పెషల్‌ బ్యూటీగా మెరిసిపోవడం ఖాయం. అదెలాగో చూసేద్దామా!

 

ఫ్యాషన్ ట్రిక్స్

  • పొడవుగా మారడానికి మ్యాజిక్ సొల్యూషన్ ఏమీ లేదు, కానీ పొడుగ్గా  కనిపించేలా కొన్ని ఫ్యాషన్ ట్రిక్స్ ఉన్నాయి. ఫ్యాషన్‌కి స్లైల్‌కి ఖచ్చితమైన నియమాలేవీ లేవు.  శరీర రంగును బట్టి, బాడీకి తగ్గట్టుగా కలర్‌ను  ఎంచుకుంటే చాలు. 

  • చక్కని ఫిట్టింగ్‌, డ్రెస్సింగ్ స్టైల్‌లో ఒక చిన్న మార్పు ఎలిగెంట్‌ లుక్‌ను ఇస్తుంది.

  • జీన్స్, టీషర్ట్  ఎలాంటి వారికైనా ఇట్టే నప్పుతాయి.  మ్యాచింగ్‌  కలర్స్‌ చాలా ముఖ్యం. 

  • మాక్సీ స్కర్ట్స్ లేదా డ్రెస్‌లు పొడవాటి అమ్మాయిలకు మాత్రమే బాగుంటాయి అనే అపోహను నమ్మవద్దు. మల్టిపుల్ లేయర్డ్ స్కర్ట్స్  కాకుండా మంచి కట్‌ స్కర్టులు  ఎంచుకోండి. పొడవు స్కర్‌ అయితే  టక్-ఇన్ టీ-షర్టుతో,  కట్‌ జాకెట్‌తో ,హై హీల్డ్ షూ వేసుకుంటే లుక్‌ అదిరిపోతుంది.

  • నిలువుగీతలు ఉన్న డ్రెస్‌లు  పొడవుగా కనిపించేలా చేస్తాయి.

  • కుర్తా లేదా చీర ధరించినపుడు సౌకర్యవంతమైన  హైహీల్స్‌ వాడండి. అంతేకాదు డ్రెస్‌కు తగ్గట్టు , స్టైలింగ్ టిప్స్ పాటించాలి. ఉదాహరణకు క్లచ్‌లు, క్రాస్ బాడీ పర్సులు , చిన్న బ్యాగ్‌లు బెస్ట్‌ ఆప్షన్‌. మరీ పెద్దబ్యాగుల జోలికి అస్సలు వెళ్లవద్దు

  • కుర్తీలకు, లేదా చీరల బ్లౌజ్‌లకు  హైనెక్, రౌండ్ నెక్ కాకుండా, వీ నెక్‌, డీప్‌ నెక్‌, డీప్ రౌండ్ నెక్ లాంటివి ఎంచుకోండి. వర్టికల్ అప్పీల్‌కోసం  ప్లంగింగ్ v-నెక్‌లైన్ టాప్‌లను ధరించండి. దీంతో పొడవుగా కనిపించడమే కాదు, సన్నగా కూడా  కనిపిస్తారు.
    చిన్న ప్రింట్లు, సింపుల్ ఎంబ్రాయిడరీ  ఔట్‌ ఫిట్‌ చూడడానికి బావుంటాయి.  భారీ ఎంబ్రాయిడరీ,  చీర పెద్ద పెద్ద అంచులున్న చీరలు అన్ని అకేషన్స్‌కు నప్పవు.

  • ఎథ్నిక్ వేర్ కోసం పొడవాటి జాకెట్ స్టైల్ లెహెంగా లేదా సల్వార్ సూట్‌లకు దూరంగా ఉండండి. 

     

    ఇదీ చదవండి : ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా బెంజ్‌కార్లు, అంతేనా?!


 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement