skirts
-
పొట్టిగా ఉండే అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకోవద్దా? ఇవిగో ట్రిక్స్ అండ్ టిప్స్
వినాయక చవితి, దసరా, బతుకమ్మ సంబరాలు ముగిసాయి. ఇక దీపావళి సందడి షురూ కానుంది. ఏ పండగఅయినా భక్తి, ముక్తితోపాటు కొత్తబట్టలు, అందంగా ముస్తాబు కావడం ఈ హడావిడి ఉండనే ఉంటుంది. ముఖ్యంగా వెలుగుల పండుగ దీపావళికి ఆరడుగల అందగాళ్లు, చందమామ లాంటి ముద్దుగుమ్మలు ట్రెండీగా, ఫ్యాషన్‌గా మెరిసిపోవాలని ఆరాటపడతారు. ఆరడుగులు అంటే గుర్తొచ్చింది.. పొట్టిగా ఉన్నామని..లావుగా ఉన్నామని తమకు ఏ డ్రెస్ సూట్ కాదు అని చాలామంది అమ్మాయిలు దిగులు పడుతూ ఉంటారు. పొట్టిగా ఉండటం మన తప్పు కాదు. కానీ మన శరీరారినిక తగ్గట్టు దుస్తులను ఎంచుకుంటే స్పెషల్ బ్యూటీగా మెరిసిపోవడం ఖాయం. అదెలాగో చూసేద్దామా! ఫ్యాషన్ ట్రిక్స్పొడవుగా మారడానికి మ్యాజిక్ సొల్యూషన్ ఏమీ లేదు, కానీ పొడుగ్గా కనిపించేలా కొన్ని ఫ్యాషన్ ట్రిక్స్ ఉన్నాయి. ఫ్యాషన్‌కి స్లైల్కి ఖచ్చితమైన నియమాలేవీ లేవు. శరీర రంగును బట్టి, బాడీకి తగ్గట్టుగా కలర్‌ను ఎంచుకుంటే చాలు. చక్కని ఫిట్టింగ్, డ్రెస్సింగ్ స్టైల్లో ఒక చిన్న మార్పు ఎలిగెంట్ లుక్‌ను ఇస్తుంది.జీన్స్, టీషర్ట్ ఎలాంటి వారికైనా ఇట్టే నప్పుతాయి. మ్యాచింగ్ కలర్స్ చాలా ముఖ్యం. మాక్సీ స్కర్ట్స్ లేదా డ్రెస్‌లు పొడవాటి అమ్మాయిలకు మాత్రమే బాగుంటాయి అనే అపోహను నమ్మవద్దు. మల్టిపుల్ లేయర్డ్ స్కర్ట్స్ కాకుండా మంచి కట్ స్కర్టులు ఎంచుకోండి. పొడవు స్కర్ అయితే టక్-ఇన్ టీ-షర్టుతో, కట్ జాకెట్‌తో ,హై హీల్డ్ షూ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.నిలువుగీతలు ఉన్న డ్రెస్‌లు పొడవుగా కనిపించేలా చేస్తాయి.కుర్తా లేదా చీర ధరించినపుడు సౌకర్యవంతమైన హైహీల్స్ వాడండి. అంతేకాదు డ్రెస్‌కు తగ్గట్టు , స్టైలింగ్ టిప్స్ పాటించాలి. ఉదాహరణకు క్లచ్‌లు, క్రాస్ బాడీ పర్సులు , చిన్న బ్యాగ్‌లు బెస్ట్ ఆప్షన్. మరీ పెద్దబ్యాగుల జోలికి అస్సలు వెళ్లవద్దుకుర్తీలకు, లేదా చీరల బ్లౌజ్లకు హైనెక్, రౌండ్ నెక్ కాకుండా, వీ నెక్, డీప్ నెక్, డీప్ రౌండ్ నెక్ లాంటివి ఎంచుకోండి. వర్టికల్ అప్పీల్‌కోసం ప్లంగింగ్ v-నెక్లైన్ టాప్‌లను ధరించండి. దీంతో పొడవుగా కనిపించడమే కాదు, సన్నగా కూడా కనిపిస్తారు.చిన్న ప్రింట్లు, సింపుల్ ఎంబ్రాయిడరీ ఔట్ ఫిట్ చూడడానికి బావుంటాయి. భారీ ఎంబ్రాయిడరీ, చీర పెద్ద పెద్ద అంచులున్న చీరలు అన్ని అకేషన్స్‌కు నప్పవు.ఎథ్నిక్ వేర్ కోసం పొడవాటి జాకెట్ స్టైల్ లెహెంగా లేదా సల్వార్ సూట్లకు దూరంగా ఉండండి. ఇదీ చదవండి : ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా బెంజ్‌కార్లు, అంతేనా?! -
మగువల మనసు దోచే స్కర్ట్... సూపర్ స్టయిల్! (ఫోటోలు)
-
ఆ పాఠశాలకు అందరూ స్కర్టుతోనే రావాలి.. ఎందుకో తెలుసా?
లింగ సమానత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో స్కాట్లాండ్లోని ఓ పాఠశాల వినూత్న ఆలోచన చేసింది. పాఠశాలలోని బాలురు, బాలికలతోపాటు టీచర్లు కూడా స్కర్ట్స్ ధరించి క్లాస్‌లోకి రావాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 4న ఎడిన్‌బర్గ్‌లోని కాసిల్‌వ్యూ ప్రైమరీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మొదటిసారిగా ‘వేర్ ఎ స్కర్ట్ టు స్కూల్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కర్ట్ ధరించి పాఠశాలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఓ టీచర్ తన ట్విటర్లో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. చదవండి: సమాజ్‌వాదీ అత్తర్‌పై మీమ్స్.. ‘వాహ్ భాయ్ వాహ్’ అంటున్న నెటిజన్లు స్కూల్ పిల్లలందరికి సౌకర్యానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చామని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు రాసిన లేఖలో తెలిపారు. స్కర్ట్ లోపల లెగ్గిన్, ప్యాంట్ లాంటివి ధరించవచ్చని పేర్కొన్నారు. అంతేగాక ఒకవేళ స్కర్ట్ కొనలేని వారికి స్కూల్ యాజమాన్యమే పిల్లలకు వాటిని ఆఫర్ చేసిందన్నారు. బట్టలకు లింగ బేధం లేదనే సందేశాన్ని తెలియజేయడానికే తాము ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపారు. మనం ఎంచుకున్న విధంగా మన భావాలను వ్యక్తీకరించడానికి మనందరికీ స్వేచ్ఛ ఉందనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఇలా చేశామని పేర్కొన్నారు. చదవండి: తొలిసారి పిజ్జా రుచి చూసిన బామ్మ.. ఆమె చిరునవ్వుకు నెటిజన్ల ఫిదా కాగా ఇలా ధరించడం ఇష్టం లేని వారిని మేం ఏం బలవంతం చేయలేదని అంటున్నారు. ఇష్టం ఉన్న వారే ధరించాలని కోరినట్లు తెలిపారు. విద్యార్థులు తమ అభిప్రాయాన్ని స్వేచ్చగా చెప్పేందుకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే సదరు పాఠశాల తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తుంటే మరికొందరు తప్పబడుతున్నారు.లింగ సమానత్వం అంటే ఒకే విధమైన దుస్తులు ధరించడం లేదా పంచుకోవడం కాదని, అందరికి సమాన అవకాశాలు, బాధ్యతలు, హక్కులు కల్పించడమని చెబుతున్నారు. P6 have been learning about the importance of breaking down gender stereotypes. We have organised a ‘Wear a Skirt to School Day’ to raise awareness of #LaRopaNoTieneGénero campaign. This will be on Thursday 4th November and we’d love everyone to get involved! 👗 @Castleview_PS pic.twitter.com/Bby6JKzUJz — Miss White (@MissWhiteCV) October 27, 2021 -
దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!!
ఈ మధ్య స్పెయిన్‌లో ఓ ఉద్యమం ఊపందుకుంటోంది. ఓ స్కూల్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు లింగ సమానత్వం పేరుతో ఓ వినూత్న సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. అది ఓ ఉద్యమంగా అక్కడ కొనసాగుతోంది. Wear a Skirt to School campaign: యూకే మిర్రర్ నివేదిక ప్రకారం.. కొన్ని నెలల ముందు ఎడన్బర్గ్లోని కాసిల్‌వ్యూ ప్రైమరీ స్కూల్‌కి చెందిన 15 ఏళ్ల మైకెల్ గొమెజ్ అనే విద్యార్థి స్కర్టు ధరించి పాఠశాలకు వచ్చినందుకు స్కూల్ యాజమాన్యం బయటికి వెళ్లగొట్టింది. దీంతో ధరించే దుస్తులకు లింగ భేదం ఉండదనే స్లోగన్‌తో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు అందరూ స్కూలుకు స్కర్టులతో రావడం ప్రారంభించారట. ఇదంతా సదరు విద్యార్ధికి మద్ధతు తెల్పాలనే ఉద్దేశ్యంతో ‘వేర్ ఎ స్కర్ట్ టు స్కూల్’ను ఉద్యమంగా చేపట్టారు. మూస పద్ధతులను బద్ధలు కొట్టాలనే నెపంతో ఈ చర్యకు పూనుకున్నట్లు అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. బలవంతంగా స్కర్టులు ధరించమని ఎవ్వరికీ చెప్పం. అది పూర్తిగా విద్యార్ధుల ఇష్టానికే వదిలివేశామని అంటున్నారు. ఐతే ఈ వింత పోకడను కొందరు తల్లిదండ్రులు ప్రశంసిస్తుంటే, మరికొందరేమో బుగ్గలు నొక్కుకుంటున్నారు. చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. -
స్కర్ట్స్ వేసుకునేవారు.. గంగాజలాన్ని గౌరవిస్తున్నారు
న్యూఢిల్లీ : ఎన్ని విమర్శలు వచ్చినా మగానుభావులు మాత్రం మారడం లేదు. నిన్ననే కాంగ్రెస్ మిత్రపక్షం నేత ఒకరు స్మృతి ఇరానీ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసి అగ్గి రాజేశాడు. అది ఇంకా పూర్తిగా ఆరకముందే ఈ రోజు బీజేపీ నాయకులు రెడీ అయిపోయారు. ప్రియాంక గాంధీని ఉద్దేశిస్తూ స్కర్ట్స్ ధరించే వారు ఇప్పుడు చీరలు కట్టుకుని ఆలయాలకు వెళ్తున్నారు. గంగానదికి పూజలు చేస్తున్నారంటూ బీజేపీ నాయకుడు జయకరణ్ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితమే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో ర్యాలీలు, బోటు యాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ పలు ఆలయాలను సందర్శించడమే కాక గంగానదికి పూజలు చేసి హారతి కూడా ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జయకరణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జయకరణ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘అచ్చెదిన్ ఎక్కడ అని ప్రశ్నించే కాంగ్రెస్ నాయకులు దాన్ని చూడటంలేదు. గతంలో స్కర్ట్స్ వేసుకుని ఆలయాలకు వెళ్లి గంగానదిని అగౌరవపర్చిన వారు నేడు చీరలు ధరించి అదే గంగానదికి పూజలు చేసి మర్యాద ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు. అయితే జయకరణ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో జయకరణ్ తాను ప్రత్యేకంగా ఏ రాజకీయనాయకుడి పేరుని పేర్కొనలేదని.. జనరల్‌గా చెప్పానని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ప్రియాంక గాంధీ, సోనియా గాంధీని విమర్శించే వారి జాబితాలో జయకరణ్ కూడా చేరారు. -
వహ్వాళి
పండగ వేళ అమ్మాయిలునట్టింట తిరగాడుతూ ఉంటే..ఆ ఇంట లక్ష్మీ కళ తొణికిసలాడుతుంది. దీపకాంతులతో పోటీపడుతూ అమ్మాయిలు లంగా ఓణీలతో ముస్తాబు అయితే..స్వయంగా లక్ష్మీదేవియే నట్టింట్లో కోటికాంతులై కొలువుదీరుతుంది. చూపుల తోరణాలన్నీఈ దీపావళి వేళ వహ్వాళి అనకుండా ఉండలేవు. సంప్రదాయ వేడుక అంటే చాలు ఈ తరం అమ్మాయిలతో పాటు యంగ్ అమ్మలు కూడా ముచ్చటపడి ధరించే దుస్తులు లంగా ఓణీలు. వీటిని పండగ వేళ మరికాస్త కళగా ఇలా ధరించవచ్చు. సిల్క్ శాటిన్ ఈ లెహెంగాలన్నీ సిల్క్ శాటిన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసినవి. రాసిల్క్, వెల్వెట్..తో డిజైన్ చేసిన లెహంగాలు బరువుగా ఉంటాయి. అదే, సిల్క్ శాటిన్ అయితే మంచి ఫాల్ ఉండటంతో పాటు ఫ్యాబ్రిక్ బరువు ఉండదు. ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ లుక్‌ని మరింత బ్రైట్‌గా మార్చేస్తాయి. ఈ లెహెంగాల మీద జర్దోసీ, సీక్వెన్స్, థ్రెడ్, గోల్డ్ జరీతో పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడంతో గ్రాండ్‌గా మెరిసిపోతున్నాయి. నాటి కాలంలో బాగా ఆకట్టుకున్న మోటివ్ డిజైన్స్‌లో మార్పులు తీసుకొచ్చి ఎంబ్రాయిడరీ చేయడంతో వీటికి మరింత కళ వచ్చింది. నెటెడ్ దుపట్టా జర్దోసీ, గోల్డ్ జరీతో ఎంబ్రాయిడరీ చేసిన నెటెడ్ దుపట్టాలు ఇవన్నీ. లెహెంగా– బ్లౌజ్‌కు మరింత కాంతిమంతమైన లుక్ రావాలంటే దుపట్టా కలర్‌కాంబినేషన్ ఎంపికలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పండగ లేదా వేడుక సందర్భాన్ని బట్టి ఇలాంటి రంగుల కాంబినేషన్లో డిజైన్ చేయించుకోవచ్చు. సిల్క్ చందేరీ బ్లౌజ్ బాడీ పార్ట్ మొత్తం చెక్స్ ఉన్న సిల్క్ చందేరీ ఫ్యాబ్రిక్‌ను తీసుకున్నాం. చేతుల భాగాన్ని పూర్తి ఎంబ్రాయిడరీ చేశాం. రంగుల ముచ్చట సాధారణంగా లంగాఓణీ ధరించేవారు లెహెంగా రంగులోనే జాకెట్టు కూడా ఎంపిక చేసుకుంటారు. కానీ లంగా, ఓణీ, జాకెట్టు.. ఇలా మూడూ మూడు విభిన్నరంగుల కాంబినేషన్లోనూ ధరించవచ్చు. ఫ్యాబ్రిక్స్లోనూ ఆ తేడా చూపించవచ్చు. ఇక్కడ ఇచ్చిన డిజైనర్ లంగా ఓణీలకు సిల్క్ శాటిన్, నెటెడ్, చెక్స్ చందేరీ క్లాత్‌లను ఉపయోగించాను. మూడు ముచ్చటైన రంగుల కాంబినేషన్‌తో డిజైన్ చేస్తే వచ్చిన లంగా ఓణీ కళ ఇది. భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
’కురచ దుస్తులు వేసుకోవద్దు’
ఆగ్రా: కురచ దుస్తులు ధరించవద్దని, రాత్రి సమయంలో ఒంటరిగా తిరగొద్దని టూరిస్టులకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ సూచించారు. పర్యాటల భద్రత గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ... ‘విమానాశ్రయంలో దిగగానే పర్యాటకులకు వెల్కం కిట్ అందజేస్తాం. పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కార్డు కూడా ఇందులో ఉంటుంది. చిన్న పట్టణాల్లో రాత్రి సమయంలో ఒంటరిగా తిరగొద్దు. కురచ దుస్తులు ధరించొద్దు. మీరు వినియోగించే కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఫొటో తీసి మీ స్నేహితులకు పంపాలనే జాగ్రత్తలు ఇందులో రాసివుంటాయ’ని మహేశ్ శర్మ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. సమాజ్‌వాది పార్టీ రెండుగా చీలిపోయిందన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి అవినీతిలో కూరుకుపోయారని, ఆమెకు జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. -
లూప్డ్ ట్విస్ట్ పోనీ
సిగ సింగారం దీన్ని లూప్డ్ ట్విస్ట్ పోనీ అంటారు. ఈ హెయిర్ స్టయిల్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది అన్ని రకాల డ్రెస్సుల మీదకు నప్పుతుంది. ముఖ్యంగా జీన్స్, స్కర్ట్స్, పంజాబీ డ్రెస్సులకు బాగా సూట్ అవుతుంది. ఈ రకం పోనీని వేసుకోవడానికి జుత్తు మరీ ఒత్తుగా ఉండాల్సిన అవసరం లేదు. మరో విశేషం ఏమిటంటే.. ఈ హెయిర్ స్టయిల్‌ను నూనె పెట్టిన జుత్తుతో కూడా వేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ లూప్డ్ ట్విస్ట్ పోనీని మీరూ ట్రై చేయండి. ఎలా అంటే... 1. ముందుగా జుత్తునంతటినీ ఎడమ చెవి వైపుకు తీసుకొచ్చి, చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. 2. ఇప్పుడు ఆ జుత్తుకు రబ్బర్ బ్యాండ్ పెట్టి పోనీ వేసుకోవాలి. 3. తర్వాత బ్యాండ్పైన జుత్తును ఫొటోలో కనిపిస్తున్న విధంగా చేతి వేళ్లతో దూరం చేయాలి. 4. పోనీని ఇప్పుడు అందులోంచి పై నుంచి కిందకు తీయాలి. 5. కింద భాగంలో మిగిలిన జుత్తును చిక్కులు లేకుండా మళ్లీ దువ్వుకోవాలి. కావాలంటే హెయిర్ స్ప్రే చేసుకోవచ్చు. 6. ఫొటోలో కనిపిస్తున్న విధంగా బ్యాండ్ పైన జుత్తును మెల్లిగా కదిలిస్తూ, వదులు చేసుకోవాలి. 7. తర్వాత ఫస్ట్ లూప్‌కు కాస్త కింది భాగంలో మరో బ్యాండ్ పెట్టి, స్టెప్ 3ను రిపీట్ చేయాలి. 8. ఇప్పుడు మిగిలిన పోనీని స్టెప్ 4 లాగే బ్యాండ్ పైన జుత్తులోంచి పై నుంచి కిందకు తీయాలి. తర్వాత ఆ లూప్‌ను కూడా వదులు చేసుకోవాలి. 9. అలా మీ జుత్తు పొడవును బట్టి లూప్స్‌ను వేసుకుంటూ పోవాలి. చివరగా కాస్త జుత్తును వదిలేసి బ్యాండు పెట్టుకోవాలి. కావాలంటే ఈ హెయిర్ స్టయిల్ కుడివైపు కూడా వేసుకోవచ్చు. -
అబ్బాయిలూ స్కర్టులో రావచ్చు..
లండన్: స్కర్టు వేసుకుని స్కూళ్లకు వెళ్లాలనుకునే అబ్బాయిలు నిరభ్యంతరంగా స్కర్టు వేసుకోవచ్చు. రోజూ ప్యాంటు, షర్టులో స్కూలుకు వెళ్లాలనుకునే అమ్మాయిలకు స్కూళ్లో ఎవరూ అడ్డుచెప్పరు. ఇలా తమకు నచ్చిన యునిఫామ్‌లో విద్యనభ్యసించేలా బ్రిటన్ ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ముందుగా 80 ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని అమలుచేస్తున్నారు. లింగవివక్షకు గురయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ప్రభుత్వం ఈ వెలుసుబాటు ఇచ్చింది. ఇలా కొత్త నిబంధనలను అమలుచేస్తున్న పాఠశాలగా బర్మింగ్‌హామ్‌లోని అలెన్స్ క్రాఫ్ట్ స్కూలు రికార్డులకెక్కింది. అయితే, కొత్త నిబంధనలను కొన్ని క్రైస్తవ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. -
అబ్బాయిలకు స్కర్ట్ లు.. అమ్మాయిలకు ప్యాంట్లు!
ప్రభుత్వ పాఠశాలల్లో అబ్బాయిలు, అమ్మాయిలు వారికి నచ్చిన దుస్తులను వేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ యూకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్కడి ట్రాన్స్ జండర్స్ భారీ ఊరట లభించనుంది. గత కొంతకాలంగా యూకేలో నువ్వు అబ్బాయివా? అమ్మాయివా? అనే వేధింపులు వీరిపై పెరిగిపోతుండటంతో అక్కడ కొన్ని సామాజిక సంస్థలు పాఠశాలల్లో బట్టలపై నిబంధనలు తీసేయాలని లింగసమానత్వం పేరుతో డిమాండ్ పెరిగింది. అయిదేళ్లు దాటిన పాఠశాలకు వెళ్లే అమ్మాయైనా, అబ్బాయైనా.. వారికి నచ్చిన దుస్తులు అంటే, అబ్బాయిలు స్కర్ట్ లు, అమ్మాయిలు ప్యాంట్లు వేసుకోవచ్చు. అంతేకాదు ప్రభుత్వం నిర్వహించే దాదాపు 80 స్కూళ్లలో దీనిని అమలు కూడా చేస్తోంది. దీంతో స్కూళ్లలో నలుపు, బూడిద రంగుల స్కర్ట్ లను, అమ్మాయిలు ప్యాంట్లను వేసుకునేందుకు వీలు ఏర్పడింది. -
ఇక పొట్టి దుస్తుల నుంచి విముక్తి
లండన్: ఎట్టకేలకు బ్రిటన్ విమానాల్లో పనిచేసే మహిళా సిబ్బంది పైచేయి సాధించింది. బ్రిటన్ ఎయిర్ వేస్ విమానాల్లో పనిచేసే సిబ్బందికి పొట్టి దుస్తులు ధరించడం నుంచి విముక్తి లభించింది. మహిళా, పురుష సిబ్బంది ఇకపై తమ కాళ్లను కప్పి ఉంచేలా దుస్తులు ధరించేందుకు అనుమతి లభించింది. దీంతో కొన్నేళ్లుగా ఈ ఎయిర్ వేస్ సంస్థకు సిబ్బందికి మధ్య జరుగుతున్న ఘర్షణలాంటి చర్చకు చివరకు తెరపడింది. సాధారణంగా బ్రిటన్ ఎయిర్ వేస్ లో విమాన కేబిన్ సిబ్బంది స్కర్ట్స్ ధరించడం డ్రెస్ కోడ్ గా ఉంది. అయితే, అది తమ మత సాంప్రదాయాలను గౌరవించేలా, కొన్ని వైద్య సంబంధమైన కారణాల దృష్ట్యా తమకు కాళ్లనిండా దుస్తులు వేసుకునేందుకు అనుమతించాలంటూ విమానంలో పనిచేసే సిబ్బంది డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే, అంతకుముందు వారు కావాలనుకుంటే అలా దుస్తులు ధరించే అవకాశం ఉండేది. కానీ, 2010లో కొత్త నిబంధనలు వచ్చి సిబ్బందికి అలా వస్త్రాలంకరణ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కాగా, ఇటీవల వారిడిమాండ్ ను పరిగణించిన విమాన సంస్థ అందుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి బ్రిటీష్ ఎయిర్ వేస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ'సాధారణంగా మా విమానాల్లో పనిచేసే సిబ్బంది అంబాసిడర్ బ్రిటిష్ ఎయిర్ వేస్ యూనిఫాం ధరిస్తారు. పైజామాలకు అనుమతి ఉండదు. అయితే, ఇక నుంచి వారికి ఆ సౌకర్యం ఉంటుంది' అని చెప్పారు. -
అబ్బాయిలూ గౌన్లు వేసుకోవచ్చు: కేంబ్రిడ్జ్ వర్సిటీ
లండన్: ఒకటీ రెండూ కాదు.. 800 ఏళ్లుగా కొనసాగుతున్న పక్కాగా అమలవుతోన్న డ్రెస్ కోడ్ నిబంధనను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సవరించుకుంది. విద్యార్థులు గౌన్లు ధరించవచ్చని, విద్యార్థినులు ట్రౌజర్స్ వేసుకోవచ్చని సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. తొలుత యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సెంయింట్ క్యాథరీన్స్ కాలేజీలో ఈ నిర్ణయం అమలుకానుంది. ఇప్పటివరకు అబ్బాయిలు సూటులోనే కాలేజీకి రావాలని, అమ్మాయిలు జాకెట్, స్కర్టులో మాత్రమే కనిపించాలనే నిబంధన ఉండేది. డ్రెస్ కోడ్ విషయంలో ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడానికిగల కారణం కూడా ఆసక్తికరమైందే.. సెయింట్ క్యాథరీన్ కాలేజీలో పీహెచ్డీ చదువుతోన్న చార్లీ నార్త్ట్రోప్ ఇటీవలే లింగ మార్పిడి చేయించుకున్నాడు. మగాడి నుంచి మగువగా మారాడు. అయితే అప్పటివరకూ తనకు అలవాటయిన ట్రౌజర్స్‌ను ధరించే కాలేజ్‌కు వెళ్లాలనుకున్నాడు. కానీ అందుకు యూనివర్సిటీ నిబంధనలు అడ్డుతగిలాయి. దీంతో చిన్నపాటి ఉద్యమానికి సిద్ధమయ్యాడు. 800 ఏళ్లనాటికి, ప్రస్తుతానికి లింగపరమైన బేధాల్లో వచ్చిన మార్పులను వర్సిటీ ఉన్నతాధికారులకు వివరించే ప్రయత్నం చేశాడు. బ్రిటన్‌లో ఎల్జీబీటీ (లెస్బియాన్స్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) హక్కులను గౌరవించే చట్టాలను కూడా ఓ సారి గుర్తుచేశాడు. ఇంకేముంది.. చార్లీ వాదనకు వర్సిటీ తలొగ్గింది. శతాబ్ధాలుగా అమలవుతోన్న నిబంధనను మార్చివేసింది.