అబ్బాయిలూ స్కర్టులో రావచ్చు..
లండన్: స్కర్టు వేసుకుని స్కూళ్లకు వెళ్లాలనుకునే అబ్బాయిలు నిరభ్యంతరంగా స్కర్టు వేసుకోవచ్చు. రోజూ ప్యాంటు, షర్టులో స్కూలుకు వెళ్లాలనుకునే అమ్మాయిలకు స్కూళ్లో ఎవరూ అడ్డుచెప్పరు. ఇలా తమకు నచ్చిన యునిఫామ్‌లో విద్యనభ్యసించేలా బ్రిటన్ ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ముందుగా 80 ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని అమలుచేస్తున్నారు.
లింగవివక్షకు గురయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ప్రభుత్వం ఈ వెలుసుబాటు ఇచ్చింది. ఇలా కొత్త నిబంధనలను అమలుచేస్తున్న పాఠశాలగా బర్మింగ్‌హామ్‌లోని అలెన్స్ క్రాఫ్ట్ స్కూలు రికార్డులకెక్కింది. అయితే, కొత్త నిబంధనలను కొన్ని క్రైస్తవ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.