పండగ వేళ అమ్మాయిలునట్టింట తిరగాడుతూ ఉంటే..ఆ ఇంట లక్ష్మీ కళ తొణికిసలాడుతుంది. దీపకాంతులతో పోటీపడుతూ అమ్మాయిలు లంగా ఓణీలతో ముస్తాబు అయితే..స్వయంగా లక్ష్మీదేవియే నట్టింట్లో కోటికాంతులై కొలువుదీరుతుంది. చూపుల తోరణాలన్నీఈ దీపావళి వేళ వహ్వాళి అనకుండా ఉండలేవు.
సంప్రదాయ వేడుక అంటే చాలు ఈ తరం అమ్మాయిలతో పాటు యంగ్ అమ్మలు కూడా ముచ్చటపడి ధరించే దుస్తులు లంగా ఓణీలు. వీటిని పండగ వేళ మరికాస్త కళగా ఇలా ధరించవచ్చు.
సిల్క్ శాటిన్
ఈ లెహెంగాలన్నీ సిల్క్ శాటిన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసినవి. రాసిల్క్, వెల్వెట్..తో డిజైన్ చేసిన లెహంగాలు బరువుగా ఉంటాయి. అదే, సిల్క్ శాటిన్ అయితే మంచి ఫాల్ ఉండటంతో పాటు ఫ్యాబ్రిక్ బరువు ఉండదు. ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ లుక్‌ని మరింత బ్రైట్‌గా మార్చేస్తాయి. ఈ లెహెంగాల మీద జర్దోసీ, సీక్వెన్స్, థ్రెడ్, గోల్డ్ జరీతో పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడంతో గ్రాండ్‌గా మెరిసిపోతున్నాయి. నాటి కాలంలో బాగా ఆకట్టుకున్న మోటివ్ డిజైన్స్‌లో మార్పులు తీసుకొచ్చి ఎంబ్రాయిడరీ చేయడంతో వీటికి మరింత కళ వచ్చింది.
నెటెడ్ దుపట్టా
జర్దోసీ, గోల్డ్ జరీతో ఎంబ్రాయిడరీ చేసిన నెటెడ్ దుపట్టాలు ఇవన్నీ. లెహెంగా– బ్లౌజ్‌కు మరింత కాంతిమంతమైన లుక్ రావాలంటే దుపట్టా కలర్‌కాంబినేషన్ ఎంపికలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పండగ లేదా వేడుక సందర్భాన్ని బట్టి ఇలాంటి రంగుల కాంబినేషన్‌లో డిజైన్ చేయించుకోవచ్చు.
సిల్క్ చందేరీ బ్లౌజ్
బాడీ పార్ట్ మొత్తం చెక్స్ ఉన్న సిల్క్ చందేరీ ఫ్యాబ్రిక్‌ను తీసుకున్నాం. చేతుల భాగాన్ని పూర్తి ఎంబ్రాయిడరీ చేశాం.
రంగుల ముచ్చట
సాధారణంగా లంగాఓణీ ధరించేవారు లెహెంగా రంగులోనే జాకెట్టు కూడా ఎంపిక చేసుకుంటారు. కానీ లంగా, ఓణీ, జాకెట్టు.. ఇలా మూడూ మూడు విభిన్నరంగుల కాంబినేషన్‌లోనూ ధరించవచ్చు. ఫ్యాబ్రిక్స్‌లోనూ ఆ తేడా చూపించవచ్చు. ఇక్కడ ఇచ్చిన డిజైనర్ లంగా ఓణీలకు సిల్క్ శాటిన్, నెటెడ్, చెక్స్ చందేరీ క్లాత్‌లను ఉపయోగించాను. మూడు ముచ్చటైన రంగుల కాంబినేషన్‌తో డిజైన్ చేస్తే వచ్చిన లంగా ఓణీ కళ ఇది.
భార్గవి కూనమ్
ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment