Fabric
-
నాణ్యమైన పట్టుచీరను ఎలా గుర్తించాలి..?
మార్కెట్లలో ఎక్కువగా ఇష్టపడే బట్టలలో పట్టు ఒకటి. ఈ పట్టు వస్త్రాలు ధరించగానే ఒక్కసారిగా పండుగ వాతావరణం వచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి పట్టు విషయంలో ఒక్కోసారి మోసపోతుంటాం. అసలు ఏది నకిలి? ఏది నిజమైన పట్టు ? అని ఎలా గుర్తించాలి. ప్రామాణికమైన పట్టు గుర్తించడానికి అనేక పరీక్షల ద్వారా గుర్తించొచ్చని డిజైనర్లు చెబుతున్నారు. ఈ పరీక్షలన్నీ అక్కడికక్కడే చేసి గుర్తించొచ్చు. ప్రామాణిక పట్టును గుర్తించడానికి పలు మార్గాలు ఉన్నాయి అవేంటంటే..టచ్ టెస్ట్నిజమైన పట్టుని త్వరితగతిన గుర్తించేందుకు ఉపయోగించే సులభమైన టెస్ట్ ఇది. వేళ్ల మధ్య పట్టుని రుద్దండి. అసలైన సిల్క్ సహజ లక్షణాలతో వేడెక్కుతుంది. సింథటిక్ ఫ్యాబ్రిక్ అలా చేస్తే చల్లగా ఉంటుంది.రింగ్ టెస్ట్ఉంగరంతో చేసే టెస్ట్ ఇది. ఉంగరం సాయంతో పట్టు ముక్కను లాగే ప్రయత్నం చేస్తారు. పట్టు మృదువైనది కాబట్టి ఉంగరం గుండా సులభంగా వెళ్తుంది. అయితే సింథటిక్ వస్త్రాలు అలా వెళ్లవు. ధర..నిజమైన పట్టు అత్యంత ఖరీదైనది. సింథటిక్ ప్రత్యామ్నాయాల కంటే ఎక్కువ ఖరీదు. తక్కువ ఖరీదులో దొరకడం అనేది అసాధ్యం. మెరుపుని బట్టి..నిజమైన పట్టు మెరుపు నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇది కాంతి పడినప్పుడూ వేర్వేరు షేడ్ రంగుల్లో కనిప్తిసుంది. అదే సింథటిక్ పట్టులో కాంతి పడినప్పుడూ కూడా ఒకేవిధంగా కనిపిస్తుంది. నేతను పరిశీలించడంచేతితో నేసిన పట్టులో వైవిధ్యం కనిపిస్తుంది. ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మెషిన్‌తో నేసిన పట్టులో ఏకరీతిలో మృదువుగా కనిపిస్తుంది. ఈ విలక్షణమైన లక్షణాలు సింథటిక్ పట్టులో కనిపించవు.బర్న్ టెస్ట్..నిజమైన సిల్క్ కాలిన వెంట్రుకల వాసన వెదజల్లుతుంది. పెళుసుగా ఉండే బూడిదను ఉత్పత్తి చేస్తుంది. సింథటిక్ సిల్క్ ప్లాస్టిక్ కాల్చినట్లు వాసన వస్తుంది. తరుచుగా మంటను ఉత్పత్తి చేస్తుంది. ప్లాస్టిక్ అవశేషాలను వదిలివేస్తుంది.( చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!) -
సీజనల్ స్పెషల్ : ఈ స్పెషల్ జ్యూయల్లరీ చూశారా!
వేసవిలో కాటన్ డ్రెస్సుల ప్రాముఖ్యత గురించి తెలిసిందే. అలాగే, ఈ సీజన్‌కి టెక్స్టైల్ జ్యువెలరీ అంతే స్పెషల్‌గా ఉంటుంది. ఎంచుకునే ఫ్యాబ్రిక్ ఏదైనా చేతితో రూపొందించే ఈ జ్యువెలరీ కొనుగోలు ఖర్చూ తక్కువే. అలాగే, ఎవరికి వారు నచ్చినట్టు ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చు. యువతను ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంచే ఈ స్పెషల్ జ్యువెలరీ అంతే తాజాదనపు అనుభూతిని సొంతం చేస్తుంది. ప్రకృతికి దగ్గరగా.. ఫ్యాబ్రిక్ ఎంపిక! పువ్వులంటేనే ప్రకృతి తెలియపరిచే ప్రేమ భాష. డిజైనర్ స్టూడియోలలో వాడగా ఉపయోగించిన మెటీరియల్‌తో అందమైన పూలను తయారుచేయవచ్చు. వాటిని పూసలు, జరీ దారాలతో ఆభరణాలుగా మార్చవచ్చు.ఈ పువ్వుల ఆభరణాలు దుస్తుల అందాన్ని మరింతగా పెంచుతాయి. పాదం నుంచి తల వరకు ప్రతి ఆభరణాన్ని వస్త్రాలంకరణతో మెప్పించవచ్చు. చందేరీ, సిల్క్, నెటెడ్, కాటన్ వంటి ఏ మెటీరియల్ అయినా ఈ ఆభరణాల తయారీలో ఉపయోగించవచ్చు. గార్మెంట్స్, బీడ్స్, జరీ లేదా కాటన్ దారాలను ఉపయోగించి చేసిన నెక్‌పీస్‌లు సంప్రదాయ చీరల మీదకే కాదు వెస్ట్రన్ డ్రెస్సుల మీదకూ ప్రత్యేక హంగుగా నిలుస్తున్నాయి. కాటన్ దారాలు, క్లాత్‌తో తయారుచేసిన పువ్వులను ఉపయోగించి చేసిన బన్ క్లిప్స్ వేసవి సీజన్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎంపిక చేసుకున్న ఫ్యాబ్రిక్‌కి కాంబినేషన్‌గా సిల్వర్ లేదా ఇతర లోహాలతో తయారైన మువ్వలు, గవ్వలు, జూకాలను జత చేయవచ్చు. దీని వల్ల ఈ జ్యువెలరీకి మరిన్ని హంగులు అమరుతాయి. -
మైక్రోసాఫ్ట్‌తో టెక్ మహీంద్రా జట్టు
న్యూఢిల్లీ: బిజినెస్, డేటా నిపుణులకు సులభతరంగా ఉండే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఆధారిత వర్క్‌బెంచ్‌ను రూపొందించేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపినట్లు టెక్ మహీంద్రా వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వినియోగాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వర్క్‌బెంచ్ సిస్టమ్ ఉపయోగపడగలదని, సంక్లిష్టమైన డేటా వర్క్‌ఫ్లోను సరళతరమైన ఇంటర్ఫేస్తో సులభంగా రూపొందించవచ్చని టెక్ మహీంద్రా వివరించింది. వ్యాపారాల వృద్ధిలో తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం తోడ్పడగలదని పేర్కొంది. -
Use Me Works: వేస్ట్ నుంచి బెస్ట్
మన చుట్టూ పేరుకు పోతున్న రకరకాల వ్యర్థాల నుంచే కొత్త అర్థాలను వెతకచ్చు. ఆ అర్థాల నుంచి ఆర్థికంగానూ నిలదొక్కుకోవచ్చు. ఇదే విషయాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తోంది ఢిల్లీ వాసి మీనాక్షి శర్మ. ఫ్యాబ్రిక్ డిజైనింగ్‌లో కోర్సు చేస్తూనే... విపరీతంగా పేరుకుపోతున్న ఫ్యాబ్రిక్ వ్యర్థాల గురించీ ఆలోచించింది. అంతటితో ఆగిపోకుండాఆ వ్యర్థాల నుంచే ఎంతోమందికి ఉపయోగపడే వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టింది. దిల్లీ చుట్టుపక్కల నుంచి నెలకు 200 కేజీల ఫ్యాబ్రిక్ వేస్ట్‌ను సేకరించి, 30 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. మెట్రో నగరాల్లో వాతావరణ పరిస్థితుల గురించి మనలో చాలామందికి ఎంతో కొంత అవగాహన ఉంది. కానీ, రకరకాల కాలుష్యాలని నివారించడం మాత్రం మనవంతు బాధ్యత అనుకోం. ఈ బాధ్యతారాహిత్యం మనకే కాదు మన ముందుతరాలకూ నష్టమే అంటోంది దిల్లీలో అప్స్లైకింగ్ ప్రాజెక్ట్ ‘యూజ్ మి వర్క్’ని విజయవంతంగా కొనసాగిస్తున్న మీనాక్షి శర్మ. కుతుబ్ మినార్ దగ్గర 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న తన క్రియేటివ్ స్టూడియోలో 30 మంది మహిళలు కుట్టుపని చేస్తూ కనిపిస్తారు. చుట్టుపక్కల ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన వేస్ట్ క్లాత్స్ ఉన్న సంచులు నిండుగా కనిపిస్తుంటాయి. వాటిని చూపిస్తూ 34 ఏళ్ల మీనాక్షి శర్మ తన స్వీయానుభవాలను వివరిస్తుంటుంది. ‘వనరులను గౌరవించడం ఎలాగో మా అమ్మానాన్నలను చూస్తూ పెరిగాను. పాత వస్తువులను తిరిగి మరో వాడుకోదగిన వస్తువుగా ఎలా మార్చేవారో వారిని చూసే నేర్చుకున్నాను. చదువుకోవడానికి జమ్మూ నుంచి ఢిల్లీ వచ్చిన నేను డిగ్రీలో ఫ్యాషన్ డిజైనింగ్ ఎంచుకున్నాను. ఆ సమయంలో ఫ్యాషన్ పరిశ్రమలో టన్నులకొద్దీ ఫ్యాబ్రిక్ వ్యర్థాలు మిగిలిపోతున్నాయని తెలుసుకున్నాను. ‘ఆ వేస్టేజ్‌ని తిరిగి ఉపయోగంలోకి తేలేమా..?’ అని ఆలోచించాను. ► పేద మహిళలకు ఉపాధి కాలేజీ పూర్తయ్యాక కెరియర్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏది సరైనది అని ఆలోచించి, వ్యర్థాలవైపుగా కదిలాను. ఇళ్లలో పనులు చేసేవారూ, చిన్న చిన్న కూలి పనులకు వెళ్లే మహిళలను కలిశాను. వారికి కుట్టుపనిలో శిక్షణ ఇచ్చి, డెకార్ ఐటమ్స్ చేయడం మొదలుపెట్టాను. క్లాత్ బ్యాగులు, ఇతర యాక్సెసరీస్, గృహాలంకరణకు ఉపయోగపడే వస్తువులు ఇక్కడ తయారవుతాయి. ముఖ్యంగా పుట్టినరోజు, పండగ రోజుల్లో ఇంటి అలంకరణలో ఉపయోగించే ఐటమ్స్‌ని మహిళలు శ్రద్ధగా తయారు చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే యూజ్ అండ్ త్రో ఐటమ్స్ ని ఈ క్లాత్ ఐటమ్స్ రీ ప్లేస్ చేస్తాయి. వీటివల్ల ఇక్కడి మహిళలకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వస్తుంద’ని వివరిస్తుంది మీనాక్షి శర్మ. ► ఫ్యాక్టరీ టు వార్డ్రోబ్ వీరు తయారు చేసే వస్తువులలో ఫ్యాషన్ ఉపకరణాలు, అందమైన పూలతీగలు, కుషన్ కవర్లు, క్విల్ట్‌లు, బ్యాగులు, రగ్గులు.. వంటివి ఉంటాయి. ‘వ్యర్థాలను సేకరించడం పెద్ద సవాల్’ అంటారు మీనాక్షి. ‘ఇళ్లు, ఫ్యాక్టరీలు, బొటిక్స్ నుంచి స్క్రాప్ అంతా డంప్ చేసే ప్రదేశాలకు చేరుకుంటుంది. మేం ఆ డంపింగ్ నుంచి ఈ వ్యర్థాలను సేకరిస్తాం. కొన్నిసార్లు ప్రజలే తమ పాత దుస్తులను మా స్టూడియోకి కొరియర్లో పంపుతారు. వాటిని బాగు చేసి, అప్‌సైక్లింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాం’ అని చెప్పే మీనాక్షి పదేళ్లుగా ఈ స్టూడియోని నిరంతరాయంగా నడుపుతోంది. తన ‘యూజ్ మి’ స్టూడియో నుంచి వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటుంది ఈ పర్యావరణ ప్రేమిక. ముఖ్యంగా పిల్లలకు వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తే ‘వృ«థా అంటూ ఏదీ ఉండదని’ గ్రహించి వారు జీవితమంతా ఆ విధానాలనే అవలంబిస్తారని తన వర్క్‌షాప్స్, ఆన్లైన్ క్లాసుల ద్వారా మరీ మరీ చెబుతుంది. మీనాక్షి చేస్తున్న ఈ ప్రయోగాత్మక వెంచర్‌కి అమెరికా, లండన్ తదితర దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. ఆలోచనతోపాటు ఆచరణలో పెట్టిన పని ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతుందో తన సృజనాత్మక విధానాల ద్వారా చూపుతుంది మీనాక్షిశర్మ. -
Vidhi Collections: ఈ క్లాత్‌లో అస్సలు గంజి ఉండదు!
న్యాయవాదులు న్యాయం గురించి ఆలోచిస్తారు. న్యాయవాదుల గురించి కేరళ కసవు చేనేత ఆలోచించింది. ‘విధి’ కలెక్షన్ పేరుతో కొంగొత్త ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన చీరలను వారి ముందుంచింది. ‘కసవు’ అనేది కేరళలో ధరించే సంప్రదాయ హాఫ్‌వైట్ ఫ్యాబ్రిక్. ఇది అక్కడి స్థానిక చేనేతకారుల చేతుల్లో రూపుద్దుకుంటుంది. కసవు చీరలు కేరళ సంప్రదాయ పండగ సీజన్లలో ముఖ్యంగా ఏప్రిల్–ఆగస్టు నెలలో విరివిగా కొనుగోళ్లు జరుగుతాయి. ఓనమ్ పండగకు మహిళలు తప్పక కసవు సంప్రదాయ చీరను ధరిస్తారు. కోవిడ్–19 మహమ్మారి వల్ల లాక్డౌన్ విధింపులతో పండగలు, వేడుకలు లేవు. అంతకుముందు ఏడాది వరదల కారణంగా నేత కార్మికులు ఘోరమైన నష్టాలను చవిచూశారు. ఈ కష్టం నుంచి గట్టెక్కడానికి ఈ కొత్త మోనోక్రామ్ చీరలు వినూత్నంగా రూపొందించారు. అయితే, ‘ప్రజలు వీటినే కొనాలని మేం కోరుకోవడం లేదు. మేం సమకాలీన ఉత్పత్తులను సృష్టించాలి, మా హస్తకళ ప్రావీణ్యం తెలియాలనే వీటిని రూపకల్పన చేశాం’ అని సేవ్ ది లూమ్ వ్యవస్థాపకుడు రమేష్ మీనన్ ఈ సందర్భంగా వివరిస్తారు. వీరి ఆలోచనా విధానం నుంచే ‘విధి’ అనే నూతన డిజైన్ కసవు నేతలో పుట్టుకొచ్చింది. సౌకర్యానికే ప్రథమ స్థానం న్యాయవాదుల వేషధారణ గురించి 18వ శతాబ్దం నుండి ఆలోచించనేలేదు. బ్రిటీష్ కోర్టుల నుంచి ప్రేరణ పొందిన ఈ యూనిఫాం చీరలు, సల్వార్ కుర్తాలు నలుపు, తెలుపు లేదా బూడిద రంగులో ఉంటాయి. ప్రత్యేక కాలర్ గల జాకెట్, ఫార్మల్ గౌన్ అదనంగా మహిళలకు నిర్ణయించారు. అంతేకాదు, మరికొన్ని ముఖ్యమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరిస్తారు మీనన్. ‘మన దేశంలో న్యాయస్థానాలు వేడి వాతావరణంలో ఉంటాయి. న్యాయవాదులు రోజుకు 12 నుండి 14 గంటలపాటు పనిలో ఉంటారు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. వారు తమ రెగ్యులర్ వేర్ని మెయింటెయిన్ చేయడానికి సమయం ఉండదు. కోర్టుకు సెలవులు ఉన్నప్పుడు గౌన్లను శుభ్రపరుచుకోవడానికి మాత్రమే కాస్త అవకాశం లభిస్తుంది. కసవు నేతలో నాణ్యమైన పత్తి ఉంటుంది. ఈ క్లాత్‌లో అస్సలు గంజి ఉండదు. దీంతో పనిలో ఉండేవారికి ఈ చీరలు చాలా సౌలభ్యంగా ఉంటాయి. ఈ చేనేతకు ముష్రూ పట్టు నుండి ప్రేరణ పొందాం. మొఘల్ రాచకుటుంబీకుల కోసం అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్‌గా దీనిని చెప్పవచ్చు. బట్ట ఎంతో మృదువుగా ఉంటుంది’ అని వివరిస్తారు. న్యాయవాది అన్నా చాందీ పుట్టిన రోజు సందర్భంగా ‘విధి’ క్లాత్‌ను లాంచ్ చేశారు. ఈ కొత్త చీరల కలెక్షన్‌ను యువ మహిళా న్యాయవాదులు ధరించి అందమైన, అత్యద్భుతమైన, సౌకర్యవంతమైన ఈ చీరల్లో కొత్తగా మెరిసిపోయారు. ఈ చీరలను న్యాయవాదులే కాదు దేశ మహిళలందరూ ధరించి, హుందాతనాన్ని మూటగట్టుకోవచ్చు. ముఖ్యంగా వర్కింగ్ వేర్‌గా ఈ ‘విధి’ సరికొత్త శారీస్ పేరొందుతాయి అని చెప్పచ్చు. -
మెడలో మెరిసే ఫ్యాబ్రిక్ పెయింటింగ్
ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గురించి మనకు తెలిసిందే. కానీ, పెయింటింగ్‌ను ఇలా మెడలో వేసుకోవడం మాత్రం కొత్తగానే ఉంటుంది. అందుకే ఆధునికత కోరుకునేవారి మెడలో పెయింటింగ్ అందంగా ఇమిడిపోయింది. ఏదైనా ఒక పలచని కార్డ్ బోర్డును ఎంచుకోవాలి. దానికి అందంగా ముఖాకృతులు, పువ్వులు, లతలు, దేవతామూర్తులు.. ఇలా ఇష్టానుసారం పెయింటింగ్ వేసుకోవాలి. దానికి గట్టి దారాలు, రంగు రంగుల పూసలు, గవ్వలు, చిన్న చిన్న అద్దాలు, మువ్వలు.. జత చేస్తే.. ఇలా అందమైన హారాలు సిద్ధం అయిపోతాయి. మీరూ వీటిని సులువుగా తయారుచేసుకోవచ్చు. లేదంటే.. ఆన్లైన్, హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లలో కొనుగోలు చేయచ్చు. డిజైన్ అమరికను బట్టి వంద రూపాయల నుంచి వీటి ధరలు ఉన్నాయి. -
ఈ దుస్తులతో అరగంటలో కరోనా ఖతం!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను స్థంభింపచేసినా కానీ అనేక కొత్త ఉత్పత్తులకు అవకాశాలను సృష్టిస్తోంది. ఒకవైపు కరోనా కట్టడికి వ్యాక్సిన్ల తయారీలో అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు తలమునకలై ఉన్నాయి. మరోవైపు కరోనాను అడ్డుకునే విభిన్నమైన విప్లవాత్మక ఉత్పత్తులు, సాధనాల రూపకల్పనలో దిగ్గజ సంస్థలనుంచి స్టార్టప్ కంపెనీల దాకా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతెందుకు కరోనా కారణంగా మొత్తం బిజినెస్ మోడల్ మారిపోయిందని చెప్పవచ్చు. తాజాగా వైరస్ ను మట్టుబెట్టే యాంటీ వైరల్ దుస్తులు, వస్త్ర బ్రాండ్లు మార్కెట్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ దుస్తులు అరగంటలోనే కరోనా వైరస్ ను చంపేస్తుందని చెప్పడం విశేషంగా మారింది. ముంబైకి చెందిన ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ డోనియర్ ఇండస్ట్రీస్ ఈ రకమైన బ్రాండ్లను పరిచయం చేసింది. స్విట్జర్లాండ్ టెక్స్టైల్ సంస్థ హీక్యూ సహకారంతో, నియో టెక్ బ్రాండ్ క్రింద యాంటీ-వైరల్ ఫాబ్రిక్స్ విడుదల చేసింది. కేవలం 30 నిమిషాల్లో కోవిడ్-19 వైరస్ ను చంపేస్తుందని చెబుతోంది. హీక్యూ వైరోబ్లాక్ ఎన్‌పిజె03 టెక్నాలజీ ద్వారా కోవిడ్-19కు చెక్ పెట్టవచ్చని డోనియర్ ఇండస్ట్రీస్ సీఎండీ రాజేంద్ర అగర్వాల్ చెప్పారు. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని కూడా అందుకున్నా మన్నారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లోని పీటర్ డోహెర్టీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునిటీ (డోహెర్టీ ఇన్స్టిట్యూట్) ఈ పరీక్షలు నిర్వహించిందనీ, ఇవి వైరస్ ను 99.99 శాతం నిరోధించినట్టుగా నిర్ధారించినట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా యాంటీ-వైరల్ ఫాబ్రిక్స్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే కరోనా లాంటి ప్రాణాంతాక వైరస్ నివారణ దుస్తులపై పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ ఉత్పత్తులను అమెరికాలోని మెడికల్ టెక్స్టైల్ కంపెనీకి ఎగుమతి చేస్తున్నామనీ, భారతదేశంలోని అనేక రాష్ట్ర పోలీసు విభాగాలకు కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. కరోనా నివారణలో ఈ దుస్తుల సమర్థత నిర్ధారణ అయిన తరువాత భారత మార్కెట్ కోసం తమ ఉత్పత్తిని మరింత పెంచామని అగర్వాల్ చెప్పారు. (భార్యకు కరోనా పాజిటివ్.. మనోవేదనతో భర్త మృతి) ప్రాథమికంగా యాంటీ-వైరల్ దుస్తుల కేటగిరీలో పాలిస్టర్-విస్కోస్ సూటింగ్, వూలుతో చేసిన సూటింగ్స్ అందుబాటులో ఉంచినట్టు అగర్వాల్ తెలిపారు. అంతేకాదు వివిధ పరిశ్రమలు యూనిఫాంలుగా జాకెట్లు, సూట్లు, ప్యాంటు, చొక్కాలు రూపంలో దీన్ని ఉపయోగించవచ్చన్నారు. ఇది కేవలం పై పూత కాదుకాదు కనుక ఎక్కువసేపు ఉంటుందని అగర్వాల్ దీమా వ్యక్తం చేశారు. నిర్దిష్ట రసాయనాన్ని ఫాబ్రిక్ నిర్మాణంలోనే పొందుపరచినందువల్ల తరచూ ఉపయోగించినా, ఉతికినా కూడా దీని ప్రభావం పోదని స్పష్టం చేశారు. అయితే ఈ యాంటీ-వైరల్ బట్టల ధరలు 20 శాతం ఎక్కువ. జూన్ నెలలో 1,000 మంది చిల్లర వ్యాపారుల నుంచి ఆర్డర్లు వచ్చాయని అగర్వాల్ పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా దేశవ్యాప్తంగా ఆయా రిటైల్ కౌంటర్లలో కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రెండు ఉత్పత్తుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకపు ఆదాయంలో కనీసం 15 శాతం పుంజుకుని రూ .200 కోట్లు ఆర్జించాలని ఆశిస్తున్నాయి. కాగా టెక్స్టైల్ టు రిటైల్ సంస్థ అరవింద్ తైవాన్‌కు చెందిన జింటెక్స్ కార్పొరేషన్, హీక్యూ మెటీరియల్స్ సహకారంతో ఇంటెల్లిఫ్యాబ్రిక్స్ బ్రాండ్ కింద యాంటీ వైరల్ దుస్తులను విడుదలు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి భారత్‌లో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ధర ఎక్కువైనా ఈ తరహా దుస్తులు ప్రాధాన్యతను సంతరించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. -
లినెన్ వెన్నెల
మండే ఎండల్లోనైనా..పండు వెన్నెల్ని కురిపిస్తుంది లినెన్ క్లాత్!సమ్మర్ ఫ్రెండ్లీ. కూల్‌గా ఉంటుంది. చర్మానికి బ్రీతింగ్ ఇస్తుంది. అంతే కాదు.. మంచి లుక్ వస్తుంది. లినెన్ ఫ్యాబ్రిక్ ఫ్యాషన్ ఇండస్ట్రీ రూపురేఖల్నే మార్చేసింది. వాతావరణానికి అనుగుణంగా మేనికి హాయినిస్తుంది. చమటను పీల్చుకుంటుంది. దీర్గకాలం మన్నుతుంది. ధరించినవారిని హుందాగా చూపుతుంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్నో సొబగులు అద్దుకున్న లినెన్ అతివలను చీరలతో మరింత అందంగా చూపుతుంది. ఇన్ని సుగుణాలు ఉన్న లినెన్ ఫ్యాబ్రిక్‌కి నాలుగువేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా డెభ్బైల కాలంలో ఐదుశాతంగా ఉన్న లినెన్ ఉత్పత్తులు, తొంభైల కాలం వచ్చేసరికి డెభ్బై శాతానికి పైగా పెరగింది. ఖరీదులోనూ ఘనంగా ఉండే లినెన్ తయారీలో ఎన్నో మార్పులు చోటు చేసుకొని ఇప్పుడు అందరికీ అందుబాటు ధరల్లోకి వచ్చాయి. ప్లెయిన్, చెక్స్, షేడెడ్ కలర్స్, సెల్ఫ్ బార్డర్స్‌తో కనువిందు చేసే లినెన్ చీరలు ముఖ్యంగా వేసవిలో తమ తమ హుందాతనాన్ని చాటుతున్నాయి. ఈ చీరల మీదకు డిజైనర్, సెల్ఫ్బ్లౌజులు.. వేటికవి ప్రత్యేకంగా కనిపిస్తాయి. నిర్వహణ: ఎన్.ఆర్. -
వహ్వాళి
పండగ వేళ అమ్మాయిలునట్టింట తిరగాడుతూ ఉంటే..ఆ ఇంట లక్ష్మీ కళ తొణికిసలాడుతుంది. దీపకాంతులతో పోటీపడుతూ అమ్మాయిలు లంగా ఓణీలతో ముస్తాబు అయితే..స్వయంగా లక్ష్మీదేవియే నట్టింట్లో కోటికాంతులై కొలువుదీరుతుంది. చూపుల తోరణాలన్నీఈ దీపావళి వేళ వహ్వాళి అనకుండా ఉండలేవు. సంప్రదాయ వేడుక అంటే చాలు ఈ తరం అమ్మాయిలతో పాటు యంగ్ అమ్మలు కూడా ముచ్చటపడి ధరించే దుస్తులు లంగా ఓణీలు. వీటిని పండగ వేళ మరికాస్త కళగా ఇలా ధరించవచ్చు. సిల్క్ శాటిన్ ఈ లెహెంగాలన్నీ సిల్క్ శాటిన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసినవి. రాసిల్క్, వెల్వెట్..తో డిజైన్ చేసిన లెహంగాలు బరువుగా ఉంటాయి. అదే, సిల్క్ శాటిన్ అయితే మంచి ఫాల్ ఉండటంతో పాటు ఫ్యాబ్రిక్ బరువు ఉండదు. ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ లుక్‌ని మరింత బ్రైట్‌గా మార్చేస్తాయి. ఈ లెహెంగాల మీద జర్దోసీ, సీక్వెన్స్, థ్రెడ్, గోల్డ్ జరీతో పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడంతో గ్రాండ్‌గా మెరిసిపోతున్నాయి. నాటి కాలంలో బాగా ఆకట్టుకున్న మోటివ్ డిజైన్స్‌లో మార్పులు తీసుకొచ్చి ఎంబ్రాయిడరీ చేయడంతో వీటికి మరింత కళ వచ్చింది. నెటెడ్ దుపట్టా జర్దోసీ, గోల్డ్ జరీతో ఎంబ్రాయిడరీ చేసిన నెటెడ్ దుపట్టాలు ఇవన్నీ. లెహెంగా– బ్లౌజ్‌కు మరింత కాంతిమంతమైన లుక్ రావాలంటే దుపట్టా కలర్‌కాంబినేషన్ ఎంపికలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పండగ లేదా వేడుక సందర్భాన్ని బట్టి ఇలాంటి రంగుల కాంబినేషన్లో డిజైన్ చేయించుకోవచ్చు. సిల్క్ చందేరీ బ్లౌజ్ బాడీ పార్ట్ మొత్తం చెక్స్ ఉన్న సిల్క్ చందేరీ ఫ్యాబ్రిక్‌ను తీసుకున్నాం. చేతుల భాగాన్ని పూర్తి ఎంబ్రాయిడరీ చేశాం. రంగుల ముచ్చట సాధారణంగా లంగాఓణీ ధరించేవారు లెహెంగా రంగులోనే జాకెట్టు కూడా ఎంపిక చేసుకుంటారు. కానీ లంగా, ఓణీ, జాకెట్టు.. ఇలా మూడూ మూడు విభిన్నరంగుల కాంబినేషన్లోనూ ధరించవచ్చు. ఫ్యాబ్రిక్స్లోనూ ఆ తేడా చూపించవచ్చు. ఇక్కడ ఇచ్చిన డిజైనర్ లంగా ఓణీలకు సిల్క్ శాటిన్, నెటెడ్, చెక్స్ చందేరీ క్లాత్‌లను ఉపయోగించాను. మూడు ముచ్చటైన రంగుల కాంబినేషన్‌తో డిజైన్ చేస్తే వచ్చిన లంగా ఓణీ కళ ఇది. భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఆఫ్ వైట్.. ఫుల్ బ్రైట్
మన ఆడపిల్లలు అందంగా ఉంటారుఆ అందానికి నగిషీయే ఆఫ్‌వైట్ శారీ! పూజకు తేజంవేడుకకు ఆకర్షణీయంఆ సౌందర్యానికి చిరునామాయే ఆఫ్‌వైట్ శారీ! ఆఫ్‌వైట్ శారీ సంప్రదాయానికి చిరునామా. అందుకే వివాహ వేడుకలకు, పండగలప్పుడు తప్పనిసరిగా ఈ కళ సందడి చేస్తుంటుంది. పాలమీగడలా ఉండే ఫ్యాబ్రిక్‌కి ఏ రంగు జత చేసినా చక్కగా నప్పుతుంది. బ్రైట్‌గా వెలిగిపోతుంది. కొంత తెలుపు–మరికొంత ఎరుపు లేదా పసుపు, నీలం లేదా నలుపు, ఎరుపు లేదా పింక్.. ఇలా ఏ రంగు కాంబినేషన్‌తో అయినా అందమైన అంచులతో చక్కగా కలుపుకొనే రంగు తెలుపుది. అందుకే బాలీవుడ్ టు టాలీవుడ్ భామలు సైతం ఈవెంట్స్‌కి ఆఫ్వైట్ని కోరి మరీ ఎంచుకుంటారు. వేడుకలలో ఫుల్ బ్రైట్‌గా వెలిగిపోతున్నారు. మన చుట్టూ ఉన్నవారితో మనం కూడా అంతే అందంగా కలిసిపోవాలని, అప్పుడే జీవితం కళవంతంగా తయారవుతుందని తెలుపురంగు చెప్పకనే చెబుతుంటుంది. కొంత ముతక తెలుపు కాంబినేషన్‌తో డిజైనర్లు కాటన్, సిల్క్, పట్టు చీరలను అందంగా నేస్తున్నారు. ఆఫ్ వైట్ శారీని «ఎంచుకోవాలంటే కాటన్ చీర రూ.300/ నుంచి అదే పట్టు చీర అయితే 30 వేల రూపాయల పైబడే ధరలు ఉన్నాయి. అభిరుచి, బడ్జెట్‌ను అనుసరించి ఆఫ్‌వైట్ కాంబినేషన్ శారీని పండగలకు ఎంచుకోవచ్చు. ∙ఎరుపు, పసుపు, పచ్చ, ఆరెంజ్.. ఈ కాంతిమంతమైన అంచులున్న ఆఫ్‌వైట్ చీరలు సంప్రదాయ వేడుకలలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ∙ఆఫ్‌వైట్ శారీకి వైవిధ్యమైన, కాంతిమంతమైన అంచులున్న బ్లౌజలను ధరించవచ్చు ∙వేడిగా, చల్లగా ఉన్న వాతావరణంలోనూ ఈ రంగులు కంటికి హాయినిస్తాయి. ∙తెలుపు లేదా క్రీమ్ రంగు చీరకు సిల్వర్ లేదా బంగారు రంగు అంచులు లేదా బ్లౌజ్ ధరిస్తే స్టైలిష్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తారు ∙మోడల్స్, సెలబ్రిటీలు ఆఫ్వైట్ను ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌లా తీసుకుంటారు ∙తెలుపు రంగు బ్లౌజ్ వేసుకోవాలంటే చికున్, లక్నో వర్క్ చేసిన బ్లౌజ్‌లను ధరించాలి. ముచ్చటగొలిపే మగ్గం వర్క్ లేదా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్‌లను ధరిస్తే లుక్ బ్రైట్‌గా కనిపిస్తుంది ∙ఆఫ్వైట్శారీకి ఇండోవెస్ట్రన్ లుక్ తీసుకురావాలంటే ఫ్రిల్డ్ స్లీవ్స్ బ్లౌజ్, క్రాప్‌టాప్స్, జాకెట్స్, పెప్లమ్ బ్లౌజ్.. లాంటి వెస్ట్రన్ స్టైల్ బ్లౌజ్‌లను ధరించాలి ∙ఆఫ్ వైట్ శారీలో ఎక్కువ రంగులు లేవు మరీ ప్లెయిన్‌గా ఉందని అనిపించినా సరే బ్లౌజ్ డిజైన్‌లో తక్కువ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, ప్రింట్లు.. ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి ∙ఈ రంగు చీరకు ఉన్న ప్రత్యేకత బ్లౌజ్ డిజైన్లలో ట్రెండ్‌ను అనుసరించి ఎంపిక చేసుకుంటే ఆభరణాల అలంకరణ పట్ల ఆందోళన అవసరం లేదు. చీరకట్టుతోనే స్పెషల్ స్టైల్‌ని క్రియేట్ చేయవచ్చు. ►ప్లెయిన్ ఆఫ్‌వైట్ పట్టు చీరకు నీలం రంగు బ్లౌజ్ ఓ ఆకర్షణ. సింపుల్‌గా అనిపించే ఫ్యాబ్రిక్ పెయింట్ లేదా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ ధరించడంతో అందం రెట్టింపు అవుతుంది. ►సంప్రదాయ కంచిపట్టు ఆఫ్‌వైట్ శారీకి మోడ్రన్ లుక్ తీసుకురావాలంటే ఓ చిన్నమార్పు చాలు. స్లీవ్‌లెస్ బ్లౌజ్ బెస్ట్ ఆప్షన్. ►ఆఫ్‌వైట్ శారీకి అదే రంగు బ్లౌజ్ ప్రత్యేక ఆకర్షణతో ఆకట్టుకుంటుంది. వేదిక ఏదైనా, వేడుక ఏదైనా గ్రాండ్‌గా వెలిగిపోతుంది. ►ముంజేతులు దాటిన త్రీ బై ఫోర్త్ బ్లౌజ్ ఆఫ్‌వైట్ శారీకి కొత్త హంగును తీసుకువచ్చింది. ►సింపుల్ కాటన్ ఆఫ్ వైట్ శారీ స్టైల్ సూపర్బ్ అనిపించాలంటే కాంట్రాస్ట్ క్రాప్‌టాప్ సరైన ఎంపిక అవుతుంది. ►ఆఫ్‌వైట్ పట్టు చీర, కొంగును పోలీ ఉండే బ్లౌజ్ రంగు, పెద్ద అంచు సంప్రదాయ వేడుకకు నిండుతనాన్ని తీసుకువస్తుంది. ►ఆభరణాల అలంకరణ లేకున్నా సంప్రదాయ కళను నట్టింటికి తీసుకువచ్చే తేజం ఆఫ్‌వైట్ శారీస్ది. ఇదే రంగు లెహంగా, కుర్తాలకీ వర్తిస్తుంది. ఆఫ్వైట్ని ఏ రూపంగా ధరించినా వేడుకలో అమ్మాయిలు కళగా వెలిగిపోతారు. – కీర్తికా గుప్త, డిజైనర్ -
ఆర్తి ఉంటే చాలు
గజేంద్రుడి కాలు మొసలి నోట్లో ఉన్నది. దానిని విడిపించాలి. అందుకే వెంటనే బయల్దేరాడు. పైగా నువ్వు వచ్చేటప్పుడు నిన్ను నీవు మరిచిపోయి రావాలని కూడా శరణాగతిలో గజేంద్రుడు కోరాడు. ఆలయానికి వెళ్లాలంటే శుచిగా, శుభ్రంగా ఉండాలి. మంత్ర పఠనం చేయాలంటే శౌచం ఉండాలి. కానీ, భగవన్నామం పలకడానికి శౌచంతో సంబంధం లేదు. భగవంతుడిని పేరుపెట్టి పిలిచినా పిలవకపోయినా, గుణగణాదులతో కీర్తించకపోయినా, ఆర్తితో రక్షణ కలగాలన్న భావన పరబ్రహ్మాన్ని ఉద్దేశించి చేస్తే రక్షణ వహించడానికి వచ్చేది సాక్షాత్తూ విష్ణుస్వరూపమే. ఈ పరమ రహస్యాన్ని పోతన భాగవతంలో వెల్లడిస్తాడు. గజేంద్రుడు ఆపదలో చిక్కుకున్నప్పుడు ఎవర్నీ పేరుపెట్టి పిలవలేదు, ఫలానా వారొచ్చి నన్ను రక్షించాలని అడగలేదు. ఏగుణం కానీ, ఏ రూపం కానీ చెప్పలేదు. నాకు రక్షణ కావాలని పిలిచాడు. ‘ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడు అనాదిమధ్యలయుడెవ్వడు సర్వము తానెయైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్’ అన్నాడు. 33 కోట్లమంది దేవతలు లేచి నిలబడ్డారు, ఎవరు వెళ్లాలో బోధపడక. ‘ఇది నాకు వర్తించదు’ అంటే ‘నాకు వర్తించదు’ అని కూర్చున్నారు. కానీ రక్షణ అంటే విష్ణువే రావాలి. అక్కడ గజేంద్రుడి కాలు మొసలి నోట్లో ఉన్నది. దానిని వెంటనే విడిపించాలి. అందుకే వెంటనే బయల్దేరాడు. పైగా నువ్వు వచ్చేటప్పుడు నిన్ను నీవు మరిచిపోయి రావాలని కూడా శరణాగతిలో గజేంద్రుడు కోరాడు. అందుకే ’సిరికిం చెప్పడు...’’ అంటూ ఎవరికీ చెప్పకుండా, ఒంటిమీద వస్త్రం సరిగా ఉందో లేదో కూడా చూసుకోకుండా తనను తాను మరిచిపోయి బయల్దేరి వచ్చాడు. కరి మకరులకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఇక్కడ తెలుసుకోవలసినదేమిటంటే, దేవుణ్ణి మనసులో తలచుకోవడానికి కానీ, ఆయన నామాన్ని స్మరించుకోవడానికి కానీ స్నానం చేయలేదనీ, శుచిగా లేమనీ, పరిసరాలు శుభ్రంగా లేవనీ ఆలోచించనక్కరలేదు. ఆర్తి, భక్తి వుంటే చాలు. -
ఏసీలు అవసరంలేని దుస్తులు వస్తాయట!
కాలిఫోర్నియా: శీతల దేశాల్లో నివసించేవాళ్లు ఉష్ణ లేదా సమోష్ణ దేశాల్లో పర్యటించాలంటే అమ్మో, ఆవాడిని ఎలా తట్టుకుంటామంటూ భయపడి పోతారు. ఇక ఉష్ణ, సమోష్ణ దేశాల్లో నివసించే ప్రజలకు కూడా ఎండాకాలం వచ్చిదంటే వేడికి తల్లడిల్లిపోతారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోకలిగితే వేడిని తట్టుకోవడం చాలా ఈజీ అని శాస్త్రవిజ్ఞానం ఎప్పుడో తేల్చి చెప్పింది. ఏసీ గదుల్లో కాకుండా బయటి వాతావరణంలో కూడా మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఎలా? అందుకు ఎలాంటి ఉపకరణాలు ఉపయోగపడతాయి? సరిగ్గా ఇదే ఆలోచనతో కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ ఆధారిత వస్త్రాన్ని తయారు చేశారు. దీన్ని దుస్తులుగా ధరిస్తే శరీరం ఉష్ణోగ్రత రెండు సిల్సియస్ డిగ్రీలు తగ్గుతుందట. అంటే ఫ్యాన్లు, ఏసీలు ఆన్ చేసుకోకుండా ఇంట్లో ఉండే సౌలభ్యం ఈ దుస్తుల వల్ల కలగుతుందని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన స్టాన్‌ఫర్డ్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఈ కీ ‘సైన్స్’ పత్రికలో తెలియజేశారు. ఇన్ఫ్రారెడ్ (పరారుణ) కిరణాల వల్ల మానవ శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని, ఆ కిరణాలు సోకకుండా తాము తయారు చేసిన వస్త్రం అడ్డుకుంటుందని ఫొటోనిక్స్‌లో నైపుణ్యం కలిగిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ షాన్హు ఫ్యాన్ తెలిపారు. ఇంతవరకు ఈ కిరణాలు అడ్డుకునే దుస్తులు తయారుచేసే దిశగా పెద్దగా పరిశోధనలేవీ సాగలేదని ఆయన చెప్పారు. ఏ రకమైన దుస్తులు ధరించినా శరీరంలో ఎంతో కొంత వేడి పుడుతుందని, చల్లగా ఉంచే దుస్తులు తయారు చేస్తే పలు ప్రయోజనాలు ఉంటాయని ఉద్దేశంతో తాము ప్లాస్టిక్‌తో కూడిన కొత్త వస్త్రం ముక్కలను తయారు చేసి విజయం సాధించామని ఆయన వివరించారు. ప్లాస్టిక్ పాలును తగ్గించి సాధారణ వస్త్రాలకు దగ్గరిగా ఉండేలా ఈ వస్త్రాన్ని అభివృద్ధి చేస్తామని, వివిధ రంగుల్లో ప్రజలు దుస్తులుగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ దుస్తులు మార్కెట్లోకి వచ్చినట్లయితే ఫ్యాన్లు, ఏసీల అవసరంపోయి విద్యుత్ ఆదా అవుతుందని వారు భావిస్తున్నారు. -
మసాముద్రికలు
నృత్యంలో .. శిల్పంలో.. చిత్రంలో .. భాషలో .. యోగాలో... ధ్యానంలో .. అంతేనా...! వస్త్రంలోనూ ముద్రలు. ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన ‘ముద్ర’ వేశారు మసాబా గుప్తా! అరచేతిని అర్ధం చేసుకోవడం హస్తసాముద్రికం. మసాబా డిజైన్స్‌ని అర్థం చేసుకోవడం మసాముద్రికం. చేతులు, పాదాలు, టైపు మిషన్లు, స్పూన్లు, సాసర్లు,..ఇవే కాదు తమిళ లిపి, ఇతర ముద్రలు తెలుపు, నలుపు రంగుల ప్రింట్లుగా ఫ్యాబ్రిక్ మీద అందంగా కొలువుదీర్చుతారు మసాబా గుప్తా. అక్కడక్కడా నియాన్ కలర్స్‌తో దుస్తులకు కొత్త సింగారాలు అద్దుతారు. ఇవే మసాబా గుప్తాను డిజైనర్లలో ప్రత్యేకంగా నిలిపాయి. మసాబా ప్రింట్లుగా అంతటా పేరొందాయి. ముంబయ్ డిజైనర్ అయిన మసాబా గుప్తా నటి నీనాగుప్తా, వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌ల కూతురు. ప్రముఖ డిజైనర్ సత్యపాల్ దగ్గర శిష్యురాలుగా చేరి ప్రావీణ్యం సాధించిన మసాబా తన సృజనతో సెలబ్రిటీలను మరింత స్పెషల్‌గా చూపిస్తున్నారు. ప్రత్యేకంగా ఉండే ఆ డిజైన్లలో శారీస్, ప్రింటెడ్ కుర్తీలు, సల్వార్ కమీజ్, లెహెంగా, గౌన్, టాప్స్, ట్యునిక్స్.. వంటివెన్నో ఉన్నాయి. -
కమీషన్ల కక్కుర్తి!
• యూనిఫారాల కుట్టు ఆర్డర్లలో చేతివాటం • జతకు రూ.5 నుంచి రూ. 8 వరకు కమీషన్ • ఇవ్వని డ్వాక్రా సంఘాలకు మొండిచెయ్యి • నిబంధనలను కాలరాస్తున్న ఎంఈవోలు మహారాణిపేట (విశాఖ) : విద్యాలయాలను తీర్చిదిద్దాల్సినవారే విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి.. బోధనపకరణాలకు అందుతున్న నిధులను బొక్కేస్తున్న కొందరు అధికారులు చివరికి విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫారాలను కుట్టడానికి ఏజెన్సీలను నిర్ణయించే విషయంలోనూ కమీషన్ల కక్కుర్తికి పాల్పడుతున్నారు. చాలా మండలాల్లో మండల విద్యాశాఖాధికారులు, ప్రధానాపాధ్యాయులు కుమ్మక్కై జతకు 5 నుంచి 8 రూపాయల వరకు కమీషన్లు దండుకుంటున్నారు. కమీషన్లు ఇవ్వని ఏజెన్సీలకు ఫ్యాబ్రిక్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. జిల్లాలో 2,36,818 మంది పిల్లలున్నారు. వీరందరికీ రెండేసి జతలు చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అంటే 4,73,636 జతలు కుట్టించాల్సి ఉంది. ఒక్కో జతకు 5 నుంచి 8 రూపాయలు చొప్పున కమీషన్ వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన కనీసం రూ.20 లక్షల వరకు దండుకుంటున్నారని తెలుస్తోంది. డ్వాక్రా సంఘాలపై చిన్న చూపు డ్వాక్రా సంఘాలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులతోపాటు చివరికి ఎంఈఓలు, హెచ్ఎంలు కూడా ఖాతరు చేయడం లేదు. నిబంధనల మేరకు ఈ సంఘాలకు ఇవ్వాల్సిన కట్టు ఆర్డర్లను కమీషన్ యావలో పడి ఈ సంఘాలకు దక్కకుండా చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే యూనిఫారాల కుట్టు బాధ్యతను పాఠశాల యాజమాన్య కమిటీల(ఎస్ఎంసీ) ద్వారా స్థానికంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు అప్పగించాలి. దానికి విరుద్ధంగా కమీషన్ ఇచ్చిన ఏజెన్సీలకే కుట్టుపని అప్పగిస్తూ ఎంఈవోలు డిక్లరేషన్ ఫారాలు ఇస్తున్నారు. అలాగే డబ్బులిచ్చిన ఏజెన్సీలకే వర్క్ ఆర్డర్ ఇస్తూ ఫ్యాబ్రిక్ ఇవ్వాలని ఆప్కోకు సిఫారసు చేస్తున్నారు. కమీషన్ ఇవ్వకపోతే డిక్లరేషన్ ఫారంపై సంతకం పెట్టేదిలేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ఆర్డర్ ఒకరికి...ఫ్యాబ్రిక్ ఇంకొకరికి జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో డ్వాక్రా సంఘాలకు కుట్టు పని ఇస్తూ వర్క ఆర్డర్లు, డిక్లరేషన్లు ఇచ్చారు. వీరిలో కమీషన్ ఇచ్చిన వారికే క్లాత్ సరఫరా చేయాలని ఆప్కోకు సిఫారసు లేఖలు ఇస్తున్నారు. మిగిలిన వారికి వర్క్ ఆర్డర్లు తప్ప క్లాత్ సరఫరా చేయకపోవడంతో వారు పనులు చేపట్టలేకపోతున్నారు. ఉదాహరణకు విశాఖ నగర పరిధిలోని చినగదిలిలో ఒక డ్వాక్రా సంఘానికి వర్క్ ఆర్డర్ ఇచ్చారు. కానీ ఆ సంఘం కమీషన్ ఇవ్వకపోవడంతో ఆప్కోకు ఇవ్వాల్సిన సిఫారసు లేఖపై ఎంఈవో సంతకం చేసినా.. అందులో ఎంత క్లాత్ ఇవ్వాలన్న విషయాన్ని నమోదు చేయకుండా ఖాళీగా వదిలేశారు. ఫలితంగా క్లాత్ సరఫరా కాక ఆ ఏజెన్సీ ఇబ్బంది పడుతోంది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడంలేదు. కాగా ఈ ఏజెన్సీ కమీషన్ చెల్లించకపోవడంతో దీనికి ఇచ్చిన వర్క్ ఆర్డర్‌ను మార్చి ఒక మంత్రి సన్నిహితుడికి చెందిన ఏజెన్సీకి కట్టబెట్టారని తెలిసింది. ఇదొక్కటే కాదు.. జిల్లాలోని చింతపల్లి, జి.కె.వీధి, మాడుగుల, పాడేరు, హుకుంపేట తదితర మండలాలతోపాటు పాటు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ ఇదే దందా సాగింది. కీలక అధికారి అండదండలతోనే డ్వాక్రా మహిళలకు కాకుండా ఏజెన్సీలకు కుట్టుపని దక్కేలా సర్వశిక్షా అభియాన్‌లోని ఒక కీలక అధికారి పావులు కదిపారు. కుట్టుపని దక్కాలంటే ఎంఈఓలకు కమీషన్లు ఇవ్వాలని ఆ అధికారి స్వయంగా ఏజెన్సీలకు సూచించారు. దాంతో ఏజెన్సీలు నేరుగా తమకు నచ్చిన మండలాలకు వెళ్లి కమీషన్లు సమర్పించి వర్క్ ఆర్డర్లు దక్కించుకున్నారు. కన్ని మండలాల ఎంఈవోలతో ఈ అధికారి నేరుగా మాట్లాడి తనకు అనుకూలమైన ఏజెన్సీలకు ఎక్కువమంది విద్యార్థులున్న మండలాల ఆర్డర్లు ఇప్పించినట్లు సమాచారం -
కాటన్‌తో పార్టీవేర్
ఏ కాలమైనా సాయంకాలం పార్టీకి మెరుపుగా ఉండే దుస్తులను ధరించాలనుకుంటారు. అయితే నూలు దుస్తులు మినహా ఇతరత్రా ఏ వస్త్రమైనా వేసవిలో చర్మానికి అసౌకర్యాన్ని కలిగిస్తుంటాయి. కాటన్‌తో కలర్ఫుల్గా కనిపించాలంటే... కాటన్-శాటిన్ క్లాత్‌ల కలయికతో రూపుదిద్దుకున్న ఫ్యాబ్రిక్ ఇప్పుడు అందుబాటులో ఉంది. దీంతో పార్టీ వేర్‌ను డిజైన్ చేసుకోవచ్చు. పార్టీకి చీరలు కట్టుకునేవారైతే కోరా చీరలను ఎంపికచేసుకోవాలి. వీటికి బెనారస్ ప్యాచ్‌లు, బార్డర్లు వేసుకుంటే రిచ్ లుక్ వస్తుంది. కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ ధరించవచ్చు. ఇప్పటి వరకు జాకెట్లు స్లీవ్స్‌కి నె ట్ మెటీరియల్ వాడేవారు. ఎండాకాలం నెట్ స్లీవ్స్ మంటపుట్టిస్తాయి. అందుకని బెనారస్, మల్ మల్ క్లాత్‌తో స్లీవ్స్ డిజైన్ చేసుకుంటే అందంగానూ, సౌకర్యంగానూ ఉంటాయి. కాటన్ కోటా చీరలను అలాగే కట్టుకోకుండా దానికి కట్ వర్క్, ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు. లేదా మంచి ప్రింటెడ్ మల్స్, ప్లెయిన్ మల్స్, క్లాత్ బార్డర్లు, లేసులు వాడి చీరను కొత్తగా డిజైన్ చేసుకోవచ్చు