కాటన్‌తో పార్టీవేర్ | Cotton partiver | Sakshi
Sakshi News home page

కాటన్‌తో పార్టీవేర్

Mar 20 2014 2:15 AM | Updated on Sep 2 2017 4:55 AM

కాటన్‌తో పార్టీవేర్

కాటన్‌తో పార్టీవేర్

ఏ కాలమైనా సాయంకాలం పార్టీకి మెరుపుగా ఉండే దుస్తులను ధరించాలనుకుంటారు.

 ఏ కాలమైనా సాయంకాలం పార్టీకి మెరుపుగా ఉండే దుస్తులను ధరించాలనుకుంటారు. అయితే నూలు దుస్తులు మినహా ఇతరత్రా ఏ వస్త్రమైనా వేసవిలో చర్మానికి అసౌకర్యాన్ని కలిగిస్తుంటాయి. కాటన్‌తో కలర్‌ఫుల్‌గా కనిపించాలంటే...
   

కాటన్-శాటిన్ క్లాత్‌ల కలయికతో రూపుదిద్దుకున్న ఫ్యాబ్రిక్ ఇప్పుడు అందుబాటులో ఉంది. దీంతో పార్టీ వేర్‌ను డిజైన్ చేసుకోవచ్చు.
పార్టీకి చీరలు కట్టుకునేవారైతే కోరా చీరలను ఎంపికచేసుకోవాలి. వీటికి బెనారస్ ప్యాచ్‌లు, బార్డర్‌లు వేసుకుంటే రిచ్ లుక్ వస్తుంది. కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ ధరించవచ్చు.
 

ఇప్పటి వరకు జాకెట్లు స్లీవ్స్‌కి నె ట్ మెటీరియల్ వాడేవారు. ఎండాకాలం నెట్ స్లీవ్స్ మంటపుట్టిస్తాయి. అందుకని బెనారస్, మల్ మల్ క్లాత్‌తో స్లీవ్స్ డిజైన్ చేసుకుంటే అందంగానూ, సౌకర్యంగానూ ఉంటాయి.
 

కాటన్ కోటా చీరలను అలాగే కట్టుకోకుండా దానికి కట్ వర్క్, ప్యాచ్  వర్క్ చేసుకోవచ్చు. లేదా మంచి ప్రింటెడ్ మల్స్, ప్లెయిన్ మల్స్, క్లాత్ బార్డర్లు, లేసులు వాడి చీరను కొత్తగా డిజైన్ చేసుకోవచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement