మార్కెట్‌లలో ఎక్కువగా ఇష్టపడే బట్టలలో పట్టు ఒకటి. ఈ పట్టు వస్త్రాలు ధరించగానే ఒక్కసారిగా పండుగ వాతావరణం వచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి పట్టు విషయంలో ఒక్కోసారి మోసపోతుంటాం. అసలు ఏది నకిలి? ఏది నిజమైన పట్టు ? అని ఎలా గుర్తించాలి.
ప్రామాణికమైన పట్టు గుర్తించడానికి అనేక పరీక్షల ద్వారా గుర్తించొచ్చని డిజైనర్లు చెబుతున్నారు. ఈ పరీక్షలన్నీ అక్కడికక్కడే చేసి గుర్తించొచ్చు. ప్రామాణిక పట్టును గుర్తించడానికి పలు మార్గాలు ఉన్నాయి అవేంటంటే..
టచ్ టెస్ట్
నిజమైన పట్టుని త్వరితగతిన గుర్తించేందుకు ఉపయోగించే సులభమైన టెస్ట్ ఇది. వేళ్ల మధ్య పట్టుని రుద్దండి. అసలైన సిల్క్ సహజ లక్షణాలతో వేడెక్కుతుంది. సింథటిక్ ఫ్యాబ్రిక్ అలా చేస్తే చల్లగా ఉంటుంది.
రింగ్ టెస్ట్
ఉంగరంతో చేసే టెస్ట్ ఇది. ఉంగరం సాయంతో పట్టు ముక్కను లాగే ప్రయత్నం చేస్తారు. పట్టు మృదువైనది కాబట్టి ఉంగరం గుండా సులభంగా వెళ్తుంది. అయితే సింథటిక్ వస్త్రాలు అలా వెళ్లవు.
ధర..
నిజమైన పట్టు అత్యంత ఖరీదైనది. సింథటిక్ ప్రత్యామ్నాయాల కంటే ఎక్కువ ఖరీదు. తక్కువ ఖరీదులో దొరకడం అనేది అసాధ్యం.
మెరుపుని బట్టి..
నిజమైన పట్టు మెరుపు నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇది కాంతి పడినప్పుడూ వేర్వేరు షేడ్ రంగుల్లో కనిప్తిసుంది. అదే సింథటిక్ పట్టులో కాంతి పడినప్పుడూ కూడా ఒకేవిధంగా కనిపిస్తుంది.
నేతను పరిశీలించడం
చేతితో నేసిన పట్టులో వైవిధ్యం కనిపిస్తుంది. ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మెషిన్‌తో నేసిన పట్టులో ఏకరీతిలో మృదువుగా కనిపిస్తుంది. ఈ విలక్షణమైన లక్షణాలు సింథటిక్ పట్టులో కనిపించవు.
బర్న్ టెస్ట్..
నిజమైన సిల్క్ కాలిన వెంట్రుకల వాసన వెదజల్లుతుంది. పెళుసుగా ఉండే బూడిదను ఉత్పత్తి చేస్తుంది. సింథటిక్ సిల్క్ ప్లాస్టిక్ కాల్చినట్లు వాసన వస్తుంది. తరుచుగా మంటను ఉత్పత్తి చేస్తుంది. ప్లాస్టిక్ అవశేషాలను వదిలివేస్తుంది.
( చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!)
Comments
Please login to add a commentAdd a comment