Silk
-
నాణ్యమైన పట్టుచీరను ఎలా గుర్తించాలి..?
మార్కెట్లలో ఎక్కువగా ఇష్టపడే బట్టలలో పట్టు ఒకటి. ఈ పట్టు వస్త్రాలు ధరించగానే ఒక్కసారిగా పండుగ వాతావరణం వచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి పట్టు విషయంలో ఒక్కోసారి మోసపోతుంటాం. అసలు ఏది నకిలి? ఏది నిజమైన పట్టు ? అని ఎలా గుర్తించాలి. ప్రామాణికమైన పట్టు గుర్తించడానికి అనేక పరీక్షల ద్వారా గుర్తించొచ్చని డిజైనర్లు చెబుతున్నారు. ఈ పరీక్షలన్నీ అక్కడికక్కడే చేసి గుర్తించొచ్చు. ప్రామాణిక పట్టును గుర్తించడానికి పలు మార్గాలు ఉన్నాయి అవేంటంటే..టచ్ టెస్ట్నిజమైన పట్టుని త్వరితగతిన గుర్తించేందుకు ఉపయోగించే సులభమైన టెస్ట్ ఇది. వేళ్ల మధ్య పట్టుని రుద్దండి. అసలైన సిల్క్ సహజ లక్షణాలతో వేడెక్కుతుంది. సింథటిక్ ఫ్యాబ్రిక్ అలా చేస్తే చల్లగా ఉంటుంది.రింగ్ టెస్ట్ఉంగరంతో చేసే టెస్ట్ ఇది. ఉంగరం సాయంతో పట్టు ముక్కను లాగే ప్రయత్నం చేస్తారు. పట్టు మృదువైనది కాబట్టి ఉంగరం గుండా సులభంగా వెళ్తుంది. అయితే సింథటిక్ వస్త్రాలు అలా వెళ్లవు. ధర..నిజమైన పట్టు అత్యంత ఖరీదైనది. సింథటిక్ ప్రత్యామ్నాయాల కంటే ఎక్కువ ఖరీదు. తక్కువ ఖరీదులో దొరకడం అనేది అసాధ్యం. మెరుపుని బట్టి..నిజమైన పట్టు మెరుపు నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇది కాంతి పడినప్పుడూ వేర్వేరు షేడ్ రంగుల్లో కనిప్తిసుంది. అదే సింథటిక్ పట్టులో కాంతి పడినప్పుడూ కూడా ఒకేవిధంగా కనిపిస్తుంది. నేతను పరిశీలించడంచేతితో నేసిన పట్టులో వైవిధ్యం కనిపిస్తుంది. ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మెషిన్‌తో నేసిన పట్టులో ఏకరీతిలో మృదువుగా కనిపిస్తుంది. ఈ విలక్షణమైన లక్షణాలు సింథటిక్ పట్టులో కనిపించవు.బర్న్ టెస్ట్..నిజమైన సిల్క్ కాలిన వెంట్రుకల వాసన వెదజల్లుతుంది. పెళుసుగా ఉండే బూడిదను ఉత్పత్తి చేస్తుంది. సింథటిక్ సిల్క్ ప్లాస్టిక్ కాల్చినట్లు వాసన వస్తుంది. తరుచుగా మంటను ఉత్పత్తి చేస్తుంది. ప్లాస్టిక్ అవశేషాలను వదిలివేస్తుంది.( చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!) -
సిల్క్ ఆఫ్ ఇండియా హ్యాండ్లూమ్ ఎక్స్పో 2024 ను ప్రారంభించిన అశ్విని శ్రీ (ఫొటోలు)
-
ఈ డివైజ్‌తో క్షణాల్లో సిల్కీ హెయిర్ సొంతం!
సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్‌ని ఇష్టపడనిదెవరు.. దానికోసం కష్టపడనిదెవరు! ఆ తలకట్టు కోసం పార్లర్లు, హెయిర్ స్పాల చుట్టూ తిరగడం ఆపి ఈ చిత్రంలోని హెయిర్ ట్రీట్మెంట్ అప్లికేటర్‌ను తెచ్చుకోండి. ఇది జుట్టును క్షణాల్లో మృదువుగా మార్చేస్తుంది.ఈ డివైస్.. అరచేతిలో అమరిపోయే చంద్రవంకలా కనిపిస్తుంది. వెనుకవైపు ఉన్న మినీ ట్యాంకర్లో నీళ్లతో పాటు.. సీరమ్ లేదా లోషన్ వంటివి మిక్స్ చేసి బటన్ నొక్కితే ఆవిరి రూపంలో బయటికి వస్తుంది. ఆ ఆవిరిని జుట్టు మొత్తానికి పట్టించుకుంటే చాలు.. సెట్ చేసిన హెయిర్ స్టైల్ సెట్ చేసినట్లుగా.. కదలకుండా ఆకర్షణీయంగా నిలుస్తుంది.అధునాతన మైక్రోటెక్నాలజీతో రూపొందిన ఈ మెషిన్‌తో.. జుట్టుకే కాదు ముఖానికీ ఆవిరి పట్టుకోవచ్చు. ఈ మినీ ట్యాంకర్‌ను డివైస్ నుంచి సులభంగా వేరు చేసుకోవచ్చు. అలాగే ఆ ట్యాంకర్‌కి ప్రత్యేకమైన లాకర్ లాంటి మూత ఉంటుంది. దాన్ని బాటిల్ మూతలా బిగించుకుంటే సరిపోతుంది. ఈ డివైస్ చాలా రంగుల్లో లభిస్తోంది. ఇది అన్ని రకాల జుట్టు స్వభావాలకు అనుకూలమైనది! (చదవండి: -
అరటి నార.. అందమైన చీర
పిఠాపురం: వస్త్ర ప్రపంచంలో కాకినాడ జిల్లా కొత్తపల్లి, గొల్లప్రోలు మండలంలోని చేనేత కార్మికులు చరిత్ర సృష్టించారు. వారు నేసిన జాంధానీ చీరలు మహిళా లోకం అందాన్ని మరింత ఇనుమడింపజేసి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంటున్నాయి. రెండువైపులా ఒకే విధంగా కనిపించడమే జాంధానీ చీరల ప్రత్యేకత. చీర తయారయినప్పుడు ఎంత విలువుంటుందో.. అది కాస్త పాడయినపుడు కూడా ఎంతో కొంత ధర పలకడం దీని విశిష్టత. మిగిలిన ఏ రకం చీరలకూ ఈ అవకాశం లేకపోవడం గమనార్హం. కుటీర పరిశ్రమగా ప్రారంభమైన జాంధానీ చీరల తయారీ నేడు ప్రపంచస్థాయి గుర్తింపునకు నాంది పలుకుతున్నాయి. ప్రతీ ఏటా కోట్ల రూపాయల జాంధానీ చీరల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో స్థానం సంపాదించి విదేశీ ఆర్డర్లు సైతం సా«ధించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్‌ను జోడించి మరింత సోయగాలు అద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ‘జాంధాని’ పేటెంట్ హక్కుతో పాటు ఉప్పాడ కాటన్, సిల్క్ మాదిరిగా ఇండియన్ హేండులూమ్స్లోనూ స్థానం సంపాదించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్‌ను జోడించి మరింత సోయగాలు అద్దేలా చేనేతలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని సహజసిద్ధంగా లభించే అరటి, అవిసె మొక్కల నారతో మంచి మంచి డిజైన్లతో వ్రస్తాలను తయారు చేసేలా వారికి శిక్షణ ఇస్తుంది. బనానా సిల్క్ నేతపై శిక్షణ.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వృత్తిలో నైపుణ్యం సాధించే విధంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ చేనేత అభివృద్ధి కమిషన్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తుంది. ఇందుకోసం కాకినాడ జిల్లాలోని తాటిపర్తి, ప్రత్తిపాడులో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 20 మందికి చొప్పున కొత్త కొత్త డిజైన్లతో బనానా, లినిన్ నేతపై అధికారులు శిక్షణ ఇస్తున్నారు. బనానా దారంతో నేత అరటి బెరడులో ఉండే పీచుతో తయారు చేసిన దారంతో జాంధానీ చీరలు తయారు చేస్తారు. ఈ చీరల్లో ఉపయోగించే రంగులు కెమికల్స్‌కు స్వస్తి పలికి ఆర్గానిక్ పద్ధతిలో ప్రకృతి సిద్ధమైన బనానా దారంను ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. సిల్క్ దారం ఎక్కువ కాలం మట్టిలో కలవకుండా ఉండడం వల్ల కాలుష్యం పెరిగే అవకాశాలు ఉండడంతో బనానా దారానికి ప్రాధాన్యతనిస్తున్నారు. మూసా ఫైబర్‌గా పిలవబడే ఇది వేడి తట్టుకోవడంతో పాటు మంచి స్పిన్నింగ్ సామర్థ్యం కలిగి అత్యధిక నాణ్యతతో ఉంటుంది. ప్రస్తుతం దీనిని కేరళ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న కాలంలో అరటి బెరడులకు గిరాకీ పెరగనుంది. బనానా దారం తయారీకి చర్యలు .. బనానా, లినిన్ దారాలను కేరళ, తమిళనాడు, చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. త్వరలో తయారీకి చర్యలు తీసుకుంటాం. స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్స్ సెక్టార్ ద్వారా విజయవాడలోని వీవర్స్ సర్విస్ సెంటర్ ద్వారా కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం. – కె.పెద్దిరాజు, చేనేత జౌళి శాఖాధికారి, కాకినాడ -
మెక్రాన్ సతీమణికి పోచంపల్లి ఇక్కత్ చీర బహుకరించిన మోదీ..
ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన రెండు రోజులపాటు కొనసాగింది. శుక్రవారం జరిగిన బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీని ఫ్రాన్స్ అత్యన్నత పురస్కారంతో ఆ దేశ అధ్యక్షుడు సన్మానించారు. అయితే.. పర్యటనలో భాగంగా దౌత్య సంబంధాలకు తోడు సంస్కృతిక అంశాలను కూడా జోడించారు. ఆ దేశ పెద్దలకు ప్రధాని మోదీ భారత సంస్కృతికి చెందిన విలక్షణమైన కానుకలను అందించారు. అధ్యక్షుడు మెక్రాన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన సితార్‌ను బహుకరించారు. దక్షిణ భారతదేశంలో గంధపు చెక్కతో చేసే పూరాతన హస్తకళకు చెందిన కళారూపం. సరస్వతీ దేవీ, జాతీయ పక్షి నెమళ్లతో పాటు గణేశుని ప్రతిరూపాలు ఆ సితార్‌పై ఉన్నాయి. మెక్రాన్ సతీమణి చేత.. తెలంగాణ చీర.. ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మెక్రాన్‌కు ప్రధాని మోదీ పోచంపల్లి ఇక్కత్ చీరను బహుకరించారు. చీరను చందనం పెట్టెలో పెట్టి ఆమెకు అందించారు. ఇక్కత్ చీర తెలంగాణకు చెందిన పోచంపల్లిలో ఉద్భవించిన అరుదైన కళారూపం. ఆకర్షనీయమైన రంగులతో క్లిష్టమైన డిజైన్లకు ప్రసిద్ధి చెందిన కళాఖండం. చందనం పెట్టెపై కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు చెక్కబడి ఉన్నాయి. మార్బుల్ ఇన్లే వర్క్ టేబుల్.. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు 'మార్బుల్ ఇన్లే వర్క్'తో అలంకరించబడిన టేబుల్‌ను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. రాజస్థాన్‌లోని మక్రానా నుంచి పాలరాతిని, దేశంలో విలువైన రాళ్లను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. రాళ్లను కత్తిరించి అందంగా తయారు చేసే కళాఖండం. కాశ్మీరీ కార్పెట్.. ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రౌన్-పివెట్‌కు చేతితో అల్లిన కాశ్మీరీ కార్పెట్‌ను బహుకరించారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ కలిగిన కళారూపం ఇది. మృదుత్వం కలిగి వివిధ కోణాల్లో వేరు వేరు రంగుల్ని కలిగి ఉంటుంది. గంధపు ఏనుగు.. ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చెర్కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు బొమ్మను ప్రధాని మోదీ బహుకరించారు. ఏనుగు భారతీయ సంస్కృతిలో జ్ఞానం, బలాన్ని సూచిస్తుంది. ప్రకృతికి, కళలకు మధ్య సామరస్యాన్ని సూచించే అందమైన ప్రతిబింబం ఇది. ఇదీ చదవండి: ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు.. -
ఆ బార్‌తో నాకెలాంటి సంబంధం లేదు
నటిగా రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లోనే మహానటి చిత్రంలో సావిత్రి పాత్రకు జీవం పోసి జాతీయ స్థాయిలో అవార్డు దక్కించకున్న నటి కీర్తి సురేష్. ఆ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తన పంథాను మార్చుకుని గ్లామర్ వైపు దృష్టి సారించింది. అయితే అలాంటి పాత్రలు ఈ అమ్మడికి సరిపడలేదనే విమర్శలు వచ్చాయి. కీర్తీసురేష్ గ్లామరస్‌గా నటించిన చిత్రాల్లో సర్కారి వారి పాట చిత్రం మినహా మిగిలినవేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో తమిళంలో అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో నటించిన సాని కాగితం చిత్రం కీర్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది. విషయం ఏమిటంటే ఇది డిగ్లామర్ పాత్రే. తనకు జరిగిన అన్యాయంపై బాగా ప్రతీకారాలతో రగిలిపోయే పాత్రను కీర్తి సురేష్ సమర్థంగా పోషించి ప్రశంసలు అందుకుంది. అలా చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ దసరా అనే తెలుగు చిత్రంలో డిగ్లామర్ పాత్రలో నటించి మరోసారి నటిగా తన పరిణితిని చాటుకుంది. ఇక అసలు విషయానికి వస్తే దసరా చిత్రంలో సిల్క్ బార్ మద్యం దుకాణం కీలకంగా ఉంటుంది. కాగా బార్ ముందు నటి కీర్తి సురేష్ ఫొటోలు దిగి వాటిని తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అందులో సిల్క్ బార్ సెట్‌ను తొలగించే ముందు తాను దాని ముందు ఫోటోలు దిగాలని, అంతకంటే ఆ బార్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీంతో ఆమె ట్వీట్‌కు లైక్‌ల వర్షం కురుస్తోంది. -
సెరికల్చర్ కాదు.. ‘సిరికల్చర్’!
సాక్షి, హైదరాబాద్: పట్టుగూళ్లు పెంచితే సెరికల్చర్.. సాగు చేస్తే లాభాలేలాభాలు.. అప్పుడు దాన్ని సిరికల్చర్ అనొచ్చేమో! ధర రికార్డుస్థాయిలో ఉండటంతోపాటు లాభాలు దండిగా ఉండటంతో రాష్ట్రంలో పట్టుగూళ్ల రైతుల సందడి పెరుగుతోంది. పట్టు పరిశ్రమను మరింత ప్రోత్సహిస్తే రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచే అవకాశముందని ఉద్యాననిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో ఏడాదిలో 10 నుంచి 11నెలలపాటు సెరికల్చర్‌కు అనుకూల వాతావరణం ఉంటుంది. మనదేశంలో 36 మిలియన్ టన్నుల పట్టు ఉత్పత్తి చేస్తుండగా వినియోగం 68 మిలియన్ టన్నులు ఉంటోంది. దీంతో మల్బరీ సాగుకు అవకాశాలు పెరిగాయి. 2021–22 కేంద్రం బడ్జెట్లో పట్టు దిగుబడిపై వ్యాట్‌ను 7 నుంచి 15 శాతానికి పెంచడంతో చైనా పట్టు దిగుమతులు తగ్గి దేశీయంగా ప్రోత్సహం పెరిగింది. కిలో పట్టు ధరలు రికార్డుస్థాయిలో రూ.730కిపైగా పలుకుతోంది. ఈ నెల రెండున సికింద్రాబాద్ మార్కెట్లో కేజీ 685 పలికింది. రాష్ట్రంలో 12,654 ఎకరాల్లో మల్బరీ సాగు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేనాటికి 3,176 ఎకరాల్లో ఉన్న మల్బరీ సాగు ఇప్పుడు 12,654 ఎకరాలకు విస్తరించింది. రాష్ట్ర అవసరాలు 984 టన్నులు కాగా 306.6 టన్నుల సిల్క్ ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రంలో 6,500 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో మల్బరీ సాగును వరికి ప్రత్యామ్నాయంగా ప్రోత్సహిస్తే బాగుంటుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. పట్టు ఉత్పత్తి ఇలా... : పట్టుపురుగులు మల్బరీ ఆకులను ఆహారంగా తిని 30 రోజుల్లో నాలుగు దశలను పూర్తి చేసుకుంటాయి. చివరిదశలో తన రక్షణ కోసం గూడును ఏర్పాటు చేసుకుంటాయి. ఈ గూడు నుంచే పట్టుదారం ఉత్పత్తి అవుతుంది. ఈ పట్టుతోనే పట్టు వస్త్రాలను తయారు చేస్తారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన పట్టును గద్వాల, పోచంపల్లి, నారాయణపేట్, కొత్తకోటలోని మగ్గం నేత కార్మికులకు అందిస్తోంది. సెరీకల్చర్‌కు కేంద్ర నిధులు... సిల్క్ సమగ్ర పేరుతో షెడ్డుకు అయ్యే రూ.4 లక్షల్లో కేంద్రం రూ.2 లక్షలు గ్రాంట్ ఇస్తోంది. మల్బరీ మొక్కలను కిసాన్ నర్సరీల ద్వారా అందిస్తోంది. యూనిట్ ధర రూ.1.50 లక్షలుకాగా, 50 శాతం రాయితీ కల్పిస్తోంది. ప్లాంటేషన్‌కు అయ్యే ఖర్చు రూ.50 వేలల్లోనూ 50 శాతం రాయితీ ఇస్తోంది. సెరికల్చర్ పథకాల్లో సబ్సిడీలో కేంద్రంవాటా 65 శాతం, రాష్ట్రం 25 శాతం, 10 శాతం రైతు భరించే విధంగా పథకాలున్నాయి. -
రికార్డు స్థాయిలో.. పట్టు‘మనీ’ లాభాలే
పిఠాపురం(తూర్పుగోదావరి): కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో విదేశాలకు సిల్క్ ఎగుమతులు నిలిచిపోయి, స్వదేశీ సిల్క్‌కు గిరాకీ పెరిగింది. ఫలితంగా పట్టుగూళ్ల రేటు ఒక్కసారిగా రెండు రెట్లు పెరిగి, తమ పంట పండిందని రైతులు సంతోషిస్తున్నారు. మరోపక్క మల్బరీ తోటలు, పట్టుగూళ్ల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం తోడవుతోంది. పట్టు పురుగుల పెంపకానికి కేంద్రంగా ఉన్న గొల్లప్రోలు మండలంలోని పట్టు పరిశ్రమ సాంకేతిక సేవా కేంద్రం ద్వారా రైతులకు మంచి తోడ్పాటు ఇస్తున్నారు. వీటన్నింటి ఫలితంగా మల్బరీ సాగు గణనీయంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ 5, పెద్దాపురం డివిజన్ 12, కాకినాడ డివిజన్ 2 మండలాల్లోని 4,500 ఎకరాల్లో 1,100 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. చదవండి: సమగ్ర భూ సర్వేకు సర్కారు కసరత్తు కలిసొచ్చిన ఈ–మార్కెట్ గతంలో జిల్లాలో పండించిన పట్టుగూళ్లను రాష్ట్రంలో పలమనేరు, హిందుపురం, హనుమాన్ జంక్షన్ వంటి ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ–మార్కెట్ ద్వారా కొనుగోళ్లు జరుగుతుండడంతో గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని నోటిఫైడ్ పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రంలో అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి మార్కెట్ అధికారి స్థానికంగా వచ్చిన పట్టుగూళ్ల నాణ్యతను పరిశీలించి, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే కొనుగోలుదారులు ఆన్లైన్లోనే కావాల్సిన పట్టు కొనుగోలు చేసి, దానికి సంబంధించిన నగదును నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన బాధ రైతులకు తప్పింది. పైగా రవాణా ఖర్చులు మిగిలి, గత పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో వారు లాభాలు ఆర్జిస్తున్నారు. భారీగా పెరిగిన ధర పట్టుగూళ్ల ధరలు గత నెలలో కేజీ రూ.300 వరకూ మాత్రమే ఉండేది. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల్లో పట్టుగూళ్ల దిగుబడులు లేకపోవడంతో స్థానిక పట్టుగూళ్లకు గిరాకీ ఏర్పడి ఒక్కసారిగా ధర పెరిగింది. ప్రస్తుతం కిలో పట్టుగూళ్ల ధర రూ.750 నుంచి రూ.900 వరకూ పలుకుతోంది. అది కూడా ఆన్లైన్ మార్కెట్ వల్ల రైతులకు శ్రమ తగ్గిపోవడంతో పాటు లాభాలు తెచ్చి పెడుతోంది. చేబ్రోలు పట్టు పరిశ్రమ సాంకేతిక సేవా కేంద్రం ద్వారా ప్రతి రోజూ 2 నుంచి 5 టన్నుల పట్టుగూళ్ల అమ్మకాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పట్టు సాగు వివరాలు పట్టు సాగు చేస్తున్న మండలాలు-19 సాగు జరుగుతున్న గ్రామాలు-155 సాగు విస్తీర్ణం 4,500 ఎకరాలు పట్టు రైతులు 1,150 మంది పట్టుగూళ్ల దిగుబడి: రోజుకు 5 టన్నులు మన పట్టుగూళ్లకు ఆన్లైన్లో మంచి గిరాకీ చేబ్రోలు పట్టు పరిశ్రమ సాంకేతిక సేవా కేంద్రం ద్వారా విక్రయించే పట్టుగూళ్లకు ఆన్లైన్లో మంచి గిరాకీ ఉంది. మేము మా కేంద్రానికి వచ్చిన పట్టుగూళ్లను పరిశీలించి నాణ్యత, సిల్క్ శాతం నిర్ధారించి ఆన్లైన్లో పెడితే కొనుగోలుదారులు కొనుక్కుంటారు. సిల్క్ శాతం ఎక్కువగా ఉండటంతో మన ఏరియా పట్టుగూళ్లకు మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం దిగుబడి కూడా బాగా పెరిగింది. – ఇంగువ వాసు, మార్కెట్ అధికారి, చేబ్రోలు నోటిఫైడ్ పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రం ప్రభుత్వ ప్రోత్సాహం ప్రభుత్వం ప్రోత్సాహం పెంచడంతో మల్బరీ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మల్బరీ సాగుకు, షెడ్ల నిర్మాణానికి యూనిట్ విలువ రూ.7 లక్షల వరకూ ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుతం దీనిని రూ.10 లక్షలకు పెంచారు. ఇందులో పట్టు పరిశ్రమల శాఖ ద్వారా రూ.3 లక్షలు, రైతు వాటా రూ.లక్ష, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. రైతు రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రభుత్వం రూ.9 లక్షలు ఇస్తోంది. – కోనేటి అప్పారావు, చేబ్రోలు పట్టు పరిశ్రమ సాంకేతిక సేవా కేంద్రం అధికారి ఈ–మార్కెట్‌తో మంచి ఆదాయం ఆన్లైన్ మార్కెట్ వల్ల మాకు శ్రమ తగ్గింది. రవాణా చార్జీలు లేవు. మాకు దగ్గరలోనే కొనుగోళ్లు చేస్తుండడంతో ఖర్చు తగ్గి, లాభాలు పెరిగాయి. గత పదేళ్లలో ఎక్కడా, ఎన్నడూ లేనంతగా రేటు పెరిగింది. దీంతో ఎప్పుడూ రానంత లాభం వచ్చింది. ఆన్లైన్ అమ్మకాలతో రైతులకు పట్టుగూళ్ల పెంపకంపై ఆసక్తి పెరిగింది. – గుండుబిల్లి గణేష్, పట్టు రైతు, చేబ్రోలు ప్రభుత్వ చేయూత పెరిగింది గతంలో పట్టుగూళ్ల పెంపకం కత్తి మీద సాములా ఉండేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు రైతులకు అండగా నిలిచారు గతంలో వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబులు పట్టు రైతుల బకాయిల విడుదలకు విశేష కృషి చేశారు. ప్రస్తుతం పట్టుగూళ్ల రేట్లు ఆశాజనకంగా ఉండడంతో ఆదాయం మరింత పెరిగింది. గతంలో తక్కువ సబ్సిడీ ఇచ్చేవారు. ప్రస్తుతం ప్రభుత్వ చేయూత పెరగడంతో పెట్టుబడి పెద్దగా అవసరం లేకపోతోంది.. దీంతో ఎక్కువ మంది రైతులు మల్బరీ సాగుపై ఉత్సాహం చూపుతున్నారు. – ఉలవకాయల నాగ లోవరాజు, పట్టు రైతు, జెడ్పీటీసీ సభ్యుడు, గొల్లప్రోలు -
Half Saree: వేడుక వేళ సంప్రదాయ కళ
మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ కొంచెం వెనకంజ వేసినా.. పండగలు, వ్రతాలు, పెళ్లిళ్లు అంటూ ఇప్పుడిప్పుడే సందడి మొదలయ్యింది. వేడుకల వేళ వైవిధ్యంగా వెలిగిపోవాలంటే లంగా ఓణీ జోడీ కట్టాల్సిందే. ఆధునికపు హంగులు కోరుకునే నవతరమైనా సంప్రదాయ కట్టుతో మెరిసిపోవాల్సిందే! వేడుకల్లో మనదైన మార్క్ కనిపించాలంటే కొంచెం వినూత్నంగా ఆలోచించవచ్చు. ప్లెయిన్ లెహంగా మీద లైట్‌వెయిట్ పట్టు శారీని ఓణీలా కట్టుకోవచ్చు. ముదురు ఎరుపు, పసుపు, పచ్చ, నీలం వంటి రంగుల ఎంపిక, టెంపుల్ జ్యువెలరీతో చక్కని సంప్రదాయ కళ తీసుకురావచ్చు. కంచిబార్డర్ను హాఫ్‌వైట్ గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ జత చేసిన లెహంగా, అంచులు ఎంబ్రాయిడరీ చేసిన ఓణీ, మగ్గం వర్క్ బ్లౌజ్.. ఈ పర్పుల్ కాంబినేషన్ వేడుకకు వన్నెతెస్తుంది. కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్‌కి కంచిబార్డర్ జత చేసి, అదే రంగు మగ్గం వర్క్ బ్లౌజ్, కాంట్రాస్ట్ దుపట్టా వేయడంతో మంచి కళ వచ్చేసింది. వేడుకలకు ఈ కాంబినేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్లెయిన్ హాఫ్‌వైట్ రాసిల్క్ మెటీరియల్పైన ఎంబ్రాయిడరీ వర్క్ చేసి డిజైన్ చేసిన లెహంగా. మగ్గం వర్క్ చేసిన రెడ్ కలర్ ట్యునిక్, నెటెడ్ దుపట్టాతో సంప్రదాయ కట్టుతోనే ఆధునికపు హంగులు తీసుకురావచ్చు. సంప్రదాయ డ్రెస్సులోనే ఆధునికంగా కనిపించాలనుకుంటే ఫిష్‌కట్ లెహంగాలు సెట్అవుతాయి. ఫ్లోరల్ ప్రింట్ ఉన్న రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన లెహంగా, జర్దోసీ వర్క్ చేసిన షార్ట్ స్లీవ్స్ బ్లౌజ్, నెటెడ్ ఓణీ ముచ్చటైన కాంబినేషన్‌గా ఆకట్టుకుంటుంది. - రజితారాజ్ రావుల డిజైనర్, హైదరాబాద్ -
చందేరీ సిల్క్ డిజైన్స్.. లైట్ అండ్ బ్రైట్
చూస్తే చూపు తిప్పుకోనివ్వనంత బ్రైట్నెస్ కట్టుకుంటే లైట్ వెయిట్నెస్ అదే, చందేరీ చమక్కు. చందేరీకి అంచుగా బెనారస్ సిల్క్ జత చేరినా.. గద్వాల పట్టు కలిసి నడిచినా ముచ్చటైన డిజైన్‌గా మెరిసిపోతోంది. సంప్రదాయ డ్రెస్ డిజైన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు భార్గవి కూనమ్. హైదరాబాదీ డిజైనర్ భార్గవి వివిధ రకాల చేనేతలతో అందమైన దుస్తులను రూపొందిస్తారు. వివాహ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చే డిజైన్స్‌కు పేరెన్నిక గన్న డిజైనర్ చందేరీ సిల్క్‌తో చేసిన డిజైన్స్ ఇవి. లైట్.. బ్రైట్ కాంబినేషన్లో రూపొందించిన ఈ డిజైన్స్ గురించి మరింత వివరంగా... టచందేరీ సిల్క్ డ్రెస్సులు, శారీస్ ఇప్పుడు ఏ విధంగా ట్రెండ్‌లో ఉన్నాయి? మన దేశీయ చేనేతలు ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. వాటిలో చందేరీకి ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. కోరా సిల్క్ మిక్సింగ్‌తో చందేరీ సిల్క్‌ను నేస్తారు. కలర్స్ బ్రైట్‌గా, స్పేషల్‌గా ఉంటాయి. చిన్న బుటీ, అంచులు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. చేనేతకారులను కలిసి, మాదైన ప్రత్యేక డిజైన్స్ చెప్పి ఈ చీరలను నేయిస్తాం. దీని వల్ల ఏ చీర అయినా, ఫ్యాబ్రిక్ అయినా మరో రెప్లికా అంటూ ఉండదు. మీరు చేసిన కాంబినేషన్స్? చందేరీ లెహంగాలను రూపొందిస్తే ఏవైనా రెండు, మూడు కాంబినేషన్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటాను. బెనారస్, గద్వాల, కంచిపట్టు అంచులు ఉంటాయి. వీటి వల్ల లెహంగా లుక్ గ్రాండ్‌గా మారిపోతుంది. వీటికి సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినవి, ప్లెయిన్ బ్లౌజ్‌లు, గ్రాండ్‌గా అనిపించే పట్టు దుపట్టాలను కాంబినేషన్‌గా ఉపయోగిస్తాం. చందేరీ సిల్క్ దుస్తులు ఏ సీజన్‌కి బాగుంటాయి? ఏ సీజన్‌కైనా బ్రైట్నెస్ తెస్తాయి ఇవి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కావడంతో రాబోయే వివాహ వేడకలకు, వేసవి కాలానికి సౌకర్యంగా, మరింత బాగుంటాయి. | ఎవరెవరికి.. ఏ వయసు వారికి చందేరీ ఫ్యాబ్రిక్ దుస్తులు, చీరలు బాగుంటాయి? అన్ని వయసుల వారికి చందేరీ నప్పుతుంది. అయితే, బ్లౌజ్ ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. టీనేజ్, యంగేజ్ వారికి చందేరీ ఫ్యాబ్రిక్‌తో ఆకర్షణీయమైన దుస్తులను రూపొందింవచ్చు. వీటిని ఏ కాంబినేషన్లో ధరిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తారు? లెహంగా లేదా శారీ బ్రైట్ కలర్ ఎంచుకుంటే బ్లౌజ్ ప్లెయిన్‌గా ఉండాలి. కొంచెం ఇండోవెస్ట్రన్ టచ్ కూడా దీనికి ఇవ్వచ్చు. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లతో ఆ ప్రయోగం చేయవచ్చు. అయితే, సందర్భం, వేడుకను బట్టి ఇక్కడ ఇచ్చిన డిజైన్స్‌ను ఎంచుకోవచ్చు. -
సిద్దిపేటలో సిల్క్ రోలింగ్ యూనిట్
సిద్దిపేటజోన్: ఆసియాలోనే అతిపెద్ద సిల్క్ రోలింగ్ యూనిట్‌ను స్థాపించేందుకు ఇండోరమ సింథటిక్ లిమిటెడ్ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు శుక్రవారం సిద్దిపేటలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన కంపెనీ బృందం సభ్యులు శనివారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. టెక్స్టైల్ రంగంలో రూ.3 వేల కోట్ల టర్నోవర్ సాధించిన తమ సంస్థ సిద్దిపేటలో అతిపెద్ద సిల్క్రోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉందని ఇండోరమ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ప్రభుత్వపరంగా యూనిట్ ఏర్పాటుకు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని మంత్రి హరీశ్‌రావు సంస్థ బృందానికి భరోసా ఇచ్చారు. మల్బరీ సాగుపై రైతులు మరింత దృష్టిపెట్టారని, రైతులతో బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకుని సంస్థ రోలింగ్ సెంటర్ ఏర్పాటుపై ముందుకు సాగాలని సూచించారు. సిద్దిపేటలో యూనిట్ స్థాపనకు అవసరమైన స్థలాన్ని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, జాప్యం చేయకుండా యూనిట్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. సిల్క్ రోలింగ్ యూనిట్‌కు తమశాఖ పక్షాన సహకారం ఉంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఉన్ని దుస్తులకు భలే డిమాండ్ !
సాక్షి, నల్లగొండ టౌన్ : చలికాలం రానే వచ్చింది. చలి రోజురోజుకూ పెరుగుతుండడంతో పట్టణ ప్రజ లు ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. సాయంత్రం నుంచి చలి ప్రారంభమై ఉదయం వరకు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాయంత్రం కాగానే ఉ న్ని దుస్తులను ధరిస్తూ చలినుంచి రక్షణ పొందుతున్నారు. పట్టణంలో పలుచోట్ల వెలిసిన దుకాణాలు పట్టణంలోని గడియారం సెంటర్, దేవరకొండ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు తదితర ప్రాంతాల్లో సుమారు 20కిపైగా ఉన్ని దుస్తుల దుకాణాలను వెలిశాయి. చలి తీవ్రత కారణంగా ప్రజలు ఉన్ని దుస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపుతుండడంతో దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా కనబడుతోంది. మంకీ క్యాప్ రూ. 20 నుంచి రూ.50వరకు,స్వెట్లర్ రూ.150 నుంచి 500ల వరకు, మఫ్లర్ రూ.50 నుంచి రూ.100వరకు, చిన్నపిల్లల ఉన్ని దుస్తులు రూ.100 నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు. గత వారం మందకొడిగా సాగిన ఉన్ని దుస్తుల అమ్మకాలు చలి తీవ్రత పెరిగిపోవడంతో ఊపందుకున్నాయి. దీంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నాయి.. చలికాలం కావడంతో చాలా మంది ఉన్ని దుస్తులను కొనడానికి వస్తుండడంతో వ్యాపారులు ధరలు ఎక్కువగా చెబు తున్నారు. ఏది కొనాలన్నా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ధరలు తగ్గించి అమ్మితే బాగుంటుంది. – అనూష, నల్లగొండ అమ్మకాలు పెరిగాయి.. చలి పెరుగుతుండడంతో ఉన్ని దుస్తుల అమ్మకాలు బాగానే పెరిగాయి. రెండు రోజులుగా వ్యాపారం కాస్త ఎక్కువగా పెరిగింది. ఏడాదిలో మూడు నెలలు మాత్రమే మా వ్యాపారాలు సాగుతాయి. – రాజు, వ్యాపారి -
బతుకు చిక్కు!
చేనేత రంగానికి చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం సంక్షేమ పథకాల్లోనూ కోత విధిస్తోంది. ఒక్కొక్కటిగా ఎత్తివేస్తూ నేతన్నలను వీధిన పడేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పట్టుచీరలకు పుట్టినిల్లయిన అనంత చేనేత ప్రభుత్వ తాజా చర్యలతో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ముడిపట్టు రాయితీని అప్పుడప్పుడూ అందజేస్తున్నా.. తాజాగా సిల్క్ యార్న్ డిపోలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేయడం ఆందోళన కలిగిస్తోంది. అనంతపురం సప్తగిరి సర్కిల్ : సెరిఫెడ్ ఎక్సే్జీలుగా పని చేస్తున్న యార్న్ డిపోలు రెండు నెలలుగా మూతపడ్డాయి. వీటి నిర్వహణ ప్రభుత్వానికి ఆదాయ వనరు కాకపోవడం వల్లే వీటిని మూతవేసినట్లు తెలుస్తోంది. క్రమంగా ఎత్తేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని నేతన్నలు వాపోతున్నారు. ఎన్‌హెచ్‌డీసీ(నేషనల్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ స్కీం) కింద నిర్వహించే ఈ సిల్క్ యార్న్ డిపోల ద్వారా చేనేత కార్మికులు కొనుగోలు చేసే ముడిపట్టుపై ఆ రోజు ఉన్న ధరపై(5కిలోల వరకు) 10 శాతం రాయితీ ఇచ్చేవారు. ఉదాహరణకు.. ముడిరేషం ధర కిలో రూ. 4వేలు ఉంటే అందులో పదిశాతం రాయితీ అంటే రూ.400 చొప్పున 5 కిలోలకు రూ.2వేల వరకు రాయితీ అందుతుంది. చేనేతకు ఆసరాగా ఉండాలనే తలంపుతో.. రాష్ట్ర వ్యాప్తంగా పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో సిల్క్ యార్న్ డిపోలను, ఎక్సే్చంజీలను ఏర్పాటు చేశారు. ధర్మవరంలో సిల్క్ ఎక్సే్చంజీని, ప్రయోగశాలను కూడా నెలకొల్పారు. ఇక జిల్లాలో చేనేతలు ఉన్న ప్రాంతాల్లో ఉరవకొండ, రాయదుర్గం, తాడిపత్రి, హిందూపురం పట్టణాల్లో ముడిరేషం కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా సబ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సిల్క్ యార్న్, నాణ్యమైన ముడిరేషం అందజేసేవారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సెరిఫైడ్ చినాంబరి సిల్క్ ఎక్సే్చంజీలను ఏర్పాటు చేసి సిల్కు వస్త్రాలను కూడా కొనుగోలు చేశారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి వ్యవహరిస్తున్న సమయంలో సెరిఫెడ్ శంకు చక్రాలు కలిగిన శేష వస్త్రాలను కొనుగోలు చేసి, ఆర్డర్ ద్వారా సిల్కు వీవర్స్‌కు ఉపాధి చూపించారు. ప్రస్తుతం సెరిఫైడ్ క్రయ విక్రయాలు పూర్తిస్థాయిలో తగ్గిపోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వం గత రెండు నెలలుగా సిల్కు యార్న్ డిపోలను అనధికారికంగా మూసివేసింది. ఈ కారణంగా ఉరవకొండలోని గవిమఠం, ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలో పట్టు రాయితీ, లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆందోళనలో చేనేతలు సిల్క్‌యార్న్ డిపోలు మూతపడటంతో చేనేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న ముడిరేషం ధరలకు ఈ యార్న్ డిపోలలో కొనుగోలు చేస్తే ఎంతో కొంత ఆసరాగా ఉండేది. దీనికి తోడు నాణ్యమైన పట్టు అందేది. అయితే ఈ సెరిఫెడ్ వ్యవస్థ్థ నిర్వీర్యం కావడంతో నేతన్నల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉరవకొండలో సెరిఫెడ్ కార్యాలయం మూత ఉరవకొండ పట్టణం గుంతకల్లు రోడ్డులోని సెరిఫెడ్ కార్యాలయాన్ని గత ఏప్రిల్ 3వ తేదీన ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మూసేశారు. దీనికితోడు జిల్లాలోని ధర్మవరం, తాడిపత్రి, యాడికి తదితర ప్రాంతాల్లో సెరిఫెడ్ కార్యాలయాలు మూతపడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం ప్రయివేట్ సిల్క్ ట్రేడర్స్‌కు కొమ్ముకాస్తూ సెరిఫైడ్ కార్యాలయాలను మూసివేసినట్లు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పట్టు పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
– ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవ్ చౌదరి హిందూపురం రూరల్ : పట్టు పరిశ్రమలోని అన్ని విభాగాల్లో పురోభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవ్ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా కిరికెర పట్టుపరిశోధన కేంద్రంలో పట్టు పరిశ్రమశాఖకు చెందిన నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప , కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టు సాగు, వసతులు, నిర్దేశించిన లక్ష్యాలను జిల్లాల వారీగా సమీక్షించారు. కార్యక్రమంలో కర్నూలు డీడీ సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కుట్టుపట్టు
ముందే పట్టు పట్టుకుందామన్నా పట్టు దొరకదుఅలా జారిపోయే సిల్క్ ఇది.దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్!ఈ చేతి కుట్టు తర్వాతచీర మీదపట్టు దొరుకుద్ది గానీధరే పట్టు చిక్కదు.చూసి ఆనందిద్దాంవీలైనప్పుడు కొందాంలేదంటే...ఈ కుట్టు పట్టుకే కాదుఅన్ని చీరలకూక్రియేటివ్గా కుట్టితక్కువలో కొట్టేద్దాం. ⇔ నలుపు రంగు చీరకు వెడల్పాటి అంచులా ఎంబ్రాయిడరీ పనితనం జిలుగులు పోతోంది. చిరు నగవులతో పోటీపడుతూ కొత్త అందాలు విరబూస్తోంది. ⇔ జరీతో అల్లిన మామిడిపిందెల డిజైన్ అంచుజత చేస్తే ఏ రంగు చీరైనా ఇలా ముచ్చటగారూపుకట్టాల్సిందే! ⇔ రాణీపింక్ చీరపై జరీ దారాలు, ముత్యాల వరుసలు కొంగొత్తగా రూపుకట్టి కొత్త కళను మోసుకొచ్చాయి. ⇔ పట్టుచీరే బంగారం. ఇక ఎంబ్రాయిడరీ హంగులు తోడైతే వేడుకకే సింగారం. ⇔ పచ్చని చీరకు గులాబీ రంగు అంచు సంప్రదాయాన్ని కూడా సై్టలిష్‌గా మార్చేస్తుంది. ⇔ జరీ జిలుగులతోనూ, అద్దాలతోనూ అంచుగా రూపు కట్టిన బంగారు రంగు చీర వేదికపై వెలుగు పూలు వెదజల్లుతుంది. -
రాయితీకి రాం రాం
ధర్మవరం టౌన్ : జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినిచ్చిన చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యంతో సంక్షోభంలో చిక్కుకుపోయింది. మరోవైపు ముడిపట్టు రాయితీ పథకం అస్తవ్యస్తంగా తయారైంది. టీడీపీ అధికారంలోకొచ్చి రెండున్నరేళ్లలో ఇప్పటి వరకు కేవలం 12 నెలలకు మాత్రమే రాయితీ నేతన్నల ఖాతాల్లో జమ అయ్యింది. మిగతా 18 నెలల బకాయి పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించకుండా రాయితీని రూ.1000కి పెంచుతున్నట్లు చెప్పి, బకాయిలను ఎగ్గొట్టేందుకు సిద్ధమైంది. దీంతో నేతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. అందని ముడిపట్టు రాయితీ జిల్లాలో చేనేత సంక్షోభంతో 2012 మార్చి నెలలో ప్రభుత్వం ముడిపట్టుపై రాయితీ ఒక్కో చేనేత కుటుంబానికి ప్రతినెలా రూ.600 బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ముడిపట్టుపై రాయితీ పథకాన్ని అమలయ్యేలా కృషి చేశారు. అప్పటి అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ధర్మవరం పట్టణంలో పథకం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతినెలా క్రమం తప్పకుండా ముడిపట్టుపై రాయితీ నెలకు రూ.600 బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేది. సెరికల్చర్ శాఖ అధికారుల పర్యవేక్షణలో తొలుత నేత కార్మికుడు ముడిపట్టును కొనుగోలు చేసి, ఆతర్వాత బిల్లులను కార్యాలయంలో సమర్పిస్తే పరిహారాన్ని ఖాతాలో జమ చేసేవారు. ఎన్ని కుటుంబాలకు వర్తిస్తుందంటే.. జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, ముదిరెడ్డిపల్లి, సోమందేపల్లి, గోరంట్ల, యాడికి, కోటంక, సిండికేట్ నగర్ తదితర ప్రాంతాల్లో 27 వేల చేనేత కుటుంబాలు ముడిపట్టుపై రాయితీని సద్వినియోగం చేసుకుంటున్నారు. వారిలో ఒక్క ధర్మవరం పట్టణంలోనే 11,400 మంది లబ్ధిదారులు రాయితీ పొందాల్సి ఉంది. హామీలతో సరిపెట్టారు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండున్నర ఏళ్లపాటు నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో కేవలం 12 నెలల పాటు మాత్రమే ఈ పథకం కొనసాగింది. ఆగస్టు నెల మొదటి వారంలో జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు ముడిపట్టు రాయితీ పరిహారం అందిస్తామని, పరిహారం పెంపు రూ.వెయ్యికి పెంచుతున్నామని చేనేతలకు హామీ ఇచ్చారు. అనంతరం నవంబర్ 21న చేనేత మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా పర్యటనకు వచ్చి రూ. 25 కోట్లు నిధులను విడుదల చేశారు. అయితే ఈ నిధులు అక్టోబర్ నెల నుంచి రాయితీకి వర్తిస్తుందని రూ.1000 చొప్పున పరిహారం ప్రతి కార్మికుడికీ అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే పెండింగ్‌లో ఉన్న 18 నెలల బకాయిల గురించి మాత్రం నోరు మెదపలేదు. ముడిపట్టు రాయితీ బకాయి రూ.28 కోట్లు ముడిపట్టు రాయితీ బకాయిలు రూ.28 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఆ మొత్తాన్ని ఎగ్గొట్టి, రాయితీ రూ.1000కి పెంచుతామని చెప్పిన చేనేత మంత్రి కొల్లు రవీంద్ర రూ.25 కోట్లు మంజూరు చేశారు. నిధులు విడుదల చేసి నెలలు గడుస్తున్నా, ఇంత వరకు పరిహారం జమకాక పోవడంతో నేత కార్మికులు ఆందోâýæన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పరిహారం పెంచుతుండటంతో అధికార పార్టీ నాయకులు సెరికల్చర్ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి పాసుపుస్తకాల విచారణ పేరుతో అర్హులను తొలగించి, ఆ స్థానంలో టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు విమర్శలున్నాయి. చేనేత రంగ సంక్షోభ రీత్యా పరిహారాన్ని నెలనెలా కార్మికుల ఖాతాలో జమ చేసి, పెండింగ్ ఉన్న బకాయిలను సత్వరం అందించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. -
తాజాదనానికి 'సిల్క్' కోటింగ్!
వాషింగ్టన్ః పక్వానికి వచ్చిన కాయలు త్వరగా పండటానికి, పండ్లు మంచి రంగులో కనిపించడానికి వ్యాపారులు అనేక రసాయనాల వినియోగానికి పాల్పడుతుంటారు. అయితే అటువంటి రసాయనాల వల్ల శరీరానికి ఎంతో నష్టం కలుగుతుందని, కాల్షియం కార్బైట్ వంటి రసాయనాల వినియోగాన్ని నిషేధించాలని ఆందోళనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే పండ్లపై సిల్క్ కోటింగ్ వేస్తే ఫ్రీజర్ తో అవసరం లేకుండా వారం రోజులపాటు తాజాగా ఉంటాయంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. పండ్లపై కనిపించకుండా ఉండే బయో కంపాటిబుల్ సొల్యూషన్ పూస్తే, మృదువుగా ఉండే పండ్లు రిఫ్రిజిరేటర్ లో భద్రపరచాల్సిన అవసరం ఉండదని తాజా పరిశోధనల ద్వారా కనుగొన్నారు. సహజంగా తయారయ్యే సిల్క్ ద్రావణాన్ని వినియోగించి పండ్లను తాజాగా ఉంచుకోవచ్చంటున్నారు పరిశోధకులు. నీటి ఆధార ప్రక్రియతో సున్నితంగా ఉండే పండ్లను భద్రపరచుకోవడం, ఫ్రీజర్ వినియోగానికి ప్రత్యామ్నాయ మార్గమంటున్నారు. స్ఫటికరూపంలో ఉండే ఫైబ్రాయిన్ ప్రోటీన్ కలిగిన సిల్క్... ఇతర పదార్థాలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అధ్యయనకారులు చెప్తున్నారు. స్ట్రాబరీలపై వేసే సిల్క్ కోటింగ్ 27 నుంచి, 35 మైక్రాన్ల మందం ఉంటుందని, ఈ ప్రకియ అనంతరం స్ట్రాబరీలను సాధారణ గది ఉష్ణోగ్రతలో భ్రదపరచుకోవచ్చని చెప్తున్నారు. పూత వేసిన పండ్లను, వేయని వాటిని విడివిడిగా భద్రపరచి పరిశీలించారు. బీటా షీట్ సిల్క్ కోటింగ్ వేసిన పండ్లు సాధారణంగా నిల్వ ఉంచిన పండ్లకంటే తాజాగా, రసంతో ఉన్నట్లు గమనించారు. ఎడిబుల్ సిల్క్ ఫైబ్రాయిన్ కలిగిన బేటా షీట్ కోటింగ్ వల్ల పండ్లలో ఆక్సిజన్ తగ్గిపోకుండా ఉండి తాజాదనాన్ని మరింతకాలం పెంచుతుందని టఫ్ట్స్ యూనివర్శిటీ పరిశోధకులు ఫియోరెంజో తెలిపారు. ఇదే పద్ధతిని అరటిపండ్ల పై కూడ ప్రయోగించి చూశామని, సిల్క్ కోటింగ్ వేసిన పండ్లపై తొక్కలు ఎక్కువకాలం తాజాగా, మృదువుగా ఉండటాన్ని గమనించామని తెలిపారు. అయితే ఈ సిల్క్ పూత వల్ల పండ్ల ఆకారంలో ఎటువంటి మార్పులు రావని, అయితే పూత వేసిన అనంతరం రుచిలో తేడాలపై ఎటువంటి అధ్యయనాలు నిర్వహించలేదని పరిశోధకులు వివరించారు. సిల్క్ పూత పండ్లను సహజ పద్ధతిలో నిల్వ చేసేందుకుకే కాక, రసాయనాలతో పని లేకుండా ఎగుమతులకు కూడ ఉపయోగంగా ఉంటుందని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుడు బెనెడెట్టో మారెల్లీ తెలిపారు. ఈ తాజా అధ్యయనాల వివరాలను జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో నివేదించారు. -
సూపర్ డూపర్ దుపట్టా!
మ్యాచింగ్ అనుకొనో, ఖరీదనో, కలర్ఫుల్గా ఉందనో.. ఏదో ఒకటి అనుకుని హడావిడిగా వేసుకునేది కాదు దుపట్టా. దానికో స్టైల్ ఉంది. ఓ హంగామా ఉంది. ఓ గ్రేస్ ఉంది. అందుకే ఈ మధ్య తారలు సైతం వీటికో ప్రత్యేకతను కల్పిస్తున్నారు. కచ్‌వర్క్, ప్యాచ్ వర్క్, పుల్కారీ వర్క్, కలంకారీ, అద్దకం.. ఒకటీ రెండు కాదు దుపట్టాకు ఎన్ని హంగులో.. కాస్త దృష్టి పెడితే సొంతంగా ఎవరికి వారు తామే దుపట్టా డిజైనర్ అయిపోవచ్చు. ప్లెయిన్ ఓ ఆకర్షణ సిల్క్ వాటికన్నా హ్యాండ్లూమ్ దుపట్టాల ఎంపిక సరైనది. దీంట్లో మంగళగిరి, కలంకారీ, పోచంపల్లి... వంటి మన చేనేతల దుపట్టాలు ప్రత్యేక ఆకర్షణనే కాదు డ్రెస్‌కు హుందాతనాన్ని జత చేర్చుతాయి. అందుకని వార్డ్‌రోబ్‌లో కొన్ని మన దేశీయ చేనేతల దుపట్టాలను చేర్చితే సాధారణ డ్రెస్సులు ధరించినప్పుడు వాటి లుక్ అసాధారణంగా కనిపించడానికి వీటిని ఎంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ హవా! కచ్, పుల్కారీ, గోటా, కాంతా, కశ్మీరీ, పార్శీ, జర్దోసి, మిర్రర్.. ఇలా మన దేశీయ హస్తకళలో పేరెన్నిక గన్న ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎన్నో ఉన్నాయి. ఈ వర్క్‌లతో అందంగా రూపుకట్టిన దుపట్టాలలో కొన్నింటిని విడిగా ఎంపిక చేసి పెట్టుకోవాలి. ఒక ప్లెయిన్ డ్రెస్ ధరించినప్పుడు దాని మీదకు ప్రత్యేకమైన వర్క్‌తో ఆకట్టుకునే దుపట్టాను ధరిస్తే డ్రెస్ లుక్ పూర్తిగా మారిపోతుంది. ట్రైబల్ కలర్స్ ముదురు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం... రంగు క్లాత్‌లను దుపట్టాలకు ఎంచుకుంటారు. వీటిని నలుచదరంగా కావల్సిన పరిమాణంలో కత్తిరించుకొని ఒక్కో రంగు క్లాత్‌ను వాడుతూ కుట్లు వేస్తారు. దీని మీద ఉదయ్‌పూర్, రాజస్థానీ, గుజరాతీ ప్రాంతాలో గిరిజనుల చేతి కట్లు, అల్లికలను పొందిగ్గా అమర్చుతారు. ఈ దుపట్టాలలో ఒక్కటైనా మీ దగ్గరుంటే లాంగ్ అనార్కలీ, షార్ట్ సల్వార్ కమీజ్‌ల మీదకు ధరిస్తే సంప్రదాయ, ఆధునిక కళ రెండూ ఉట్టిపడతాయి. ఈ కలర్స్, చేతిపనిలో ఉండే గ్రేస్‌ను పసిగట్టిన ప్రసిద్ధ డిజైనర్లు దుపట్టా డిజైనింగ్‌లో పోటీపడుతున్నారు. ప్యాచ్‌ల మెరుపు ఎంబ్రాయిడరీ పనితనం ఉన్నవీ, ప్లెయిన్‌వి, కలంకారీవి.. ఎన్నో ప్యాచ్‌లు విడిగానూ లభిస్తున్నాయి. ఒక డిజైనర్ దుపట్టాను కొనుగోలు చేయాలంటే ఖరీదు ఎక్కువ అని భావించేవారు, తమకుతామే మరింత అద్భుతంగా డిజైన్ చేసుకోగలం అనుకున్నవారు ఈ ప్యాచ్‌లను ఎంపిక చేసుకుంటే చాలు. సాధారణ కుట్లతో ఎంచుకున్న దుపట్టా మీద ప్యాచ్‌లతో అందంగా డిజైన్ చేయవచ్చు. థీమ్ డిజైనింగ్‌పై దృష్టి నేను డిజైన్ చేసిన బ్రైడల్ కలెక్షన్లో లెహంగా దుపట్టాలది ప్రత్యేక ఆకర్షణ. వీటి ద్వారానే బాగా పేరొచ్చింది. మోడల్స్, స్టార్స్ సంప్రదాయంగానూ, ఆధునికంగానూ కనిపించడానికి దుపట్టాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతాను. నాణ్యమైన జరీ, కుందన్స్‌ను వీటి డిజైనింగ్‌లో ఉపయోగిస్తాను. పూర్తి కళాత్మకంగా ఉండేలా థీమ్ డిజైనింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. మనీష మల్హోత్రా డిజైన్స్ అంటేనే ఒక క్లాసీ, స్టన్నింగ్ లుక్ టచ్ తప్పక ఉంటుంది. - మనీష్ మల్హోత్రా, ఫ్యాషన్ డిజైనర్ లేసులు, పూసలు ప్యాచ్‌ల తర్వాత దుపట్టా డిజైనింగ్‌లో చమ్కీ, లేసులు, పూసలు, అద్దాలది ప్రధానంగా ఉంటుంది. కొన్నింటిని దారంతో కుట్టవచ్చు. మరికొన్నింటిని ‘గ్లూ’తో అతికించవచ్చు. ఇది చాలా సులువైన ప్రక్రియ కూడా! లెహంగా దుపట్టా, సల్వార్ కమీజ్ దుపట్టా, అనార్కలీ దుపట్టా.. ఇవన్నీ సంప్రదాయ తరహాకు చెందినవైతే ఆధునిక వస్త్రధారణలోనూ ఈ డిజైనర్ దుపట్టాలను వాడచ్చు. మీదైన స్టైల్‌ని దుపట్టాతో మెరిపించవచ్చు. - ఎన్.ఆర్. -
నెల పండుగ ప్రారంభం
మొదలైన నూకాంబిక కొత్త అమావాస్య జాతర పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పీలా ఆలయ పరిసరాల్లో సందడి అనకాపల్లి: ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతి గాంచిన అనకాపల్లి నూకాంబిక కొత్త అమావాస్య జాతర గురువారం రాత్రి ప్రారంభమైంది. ఏప్రిల్ 18వ తేదీ వరకు ఈ నెల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. శుక్రవారం కొత్త అమావాస్య పండుగ నిర్వహించి సాయంత్రం 5.00 గంటలకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేస్తారు.ఉగాదిని పురస్కరించుకొని శనివారం మళ్లీ దర్శనభాగ్యం కల్పిస్తారు. జాతరలో భాగంగా అమ్మవారి ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. జాతరను లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ రాష్ర్ట ప్రభుత్వం తరపున తొలిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పీలా దంపతులను ఆలయంలోకి మేళతాళాలతో ఆహ్వానించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.సుజాత, భక్త జనమండలి చైర్మన్ బి.ఎస్.ఎం.కె. జోగినాయుడులు పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, పండగ ప్రత్యేకాధికారి ఎన్.వి.మూర్తి ఆధ్వర్యంలో దేవాదాయశాఖ సిబ్బంది, డీఎస్పీ పురుషోత్తం ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం పీలా మహాలక్ష్మినాయుడు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో పీలా శ్రీనివాసరావు, అవంతి మహేష్, గుత్తా ప్రభాకర్ చౌదరి, బుద్ధ నాగజగదీష్, డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ సత్యవతి, కశింకోట ఎంపీపీ సుబ్బలక్ష్మి, మలసాల కుమార్, కాయల మురళి పాల్గొన్నారు. పట్టు వస్త్రాల సమర్పణ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలను పంపారని తెలిపారు. నెలరోజుల పండగకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఆలయ పరిసరాలలో అదనంగా మూడెకరాలను సమీకరించి మరింత అభివృద్ధి పనులు చేపడతామన్నారు. -
శ్రీరామనవమికి టీటీడీ నుంచే పట్టువస్త్రాలు
ఆనవాయితీ కొనసాగిస్తాం: ఈవో గోపాల్ ఖమ్మం: భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ప్రతీ ఏడాదిలాగే 2015లోనూ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు పంపిస్తామని టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఎం.జి. గోపాల్ తెలిపారు. ఆదివారం ఆయన ఖమ్మంలో ‘సాక్షి’తో మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ర్టంగా ఉన్నప్పుడు పట్టువస్త్రాలు టీటీడీ నుంచే అందించామని, రాష్ట్రం విడిపోయాక కూడా ఆనవాయితీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భద్రాచాలం రామాలయ కమిటీ కోరితే ఇక్కడికి కూడా బంగారు తాపడం పంపిస్తామని చెప్పారు. -
దీపావళి నూలు వెలుగులు
దివ్వెల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోవాలి... బాణాసంచా మెరుపులలో తారల్లా తళుక్కుమనాలి... అమావాస్య చీకటిలో నిండు పున్నమిని తలపించాలి... మేని ముస్తాబు విషయంలో అతివల ఆలోచన పండగ వేళ ఇలాగే ఉంటుంది. పండగకు కొత్త వెలుగులు నింపడానికి సాధారణంగా రంగు రంగుల దుస్తుల ఎంపికకు పోటీపడుతుంటారు. నెటెడ్, జార్జెట్, బెనారస్, పట్టు, సిల్క్.. ఇలా అన్నీ మెరిసిపోయే వస్త్రాలతో మేనికి వన్నెలద్దుతుంటారు. ఇందుకు మగవారూ మినహాయింపు కాదు. పట్టు షేర్వాణి లేదా లాల్చీ ధోవతితో కొత్తగా కనిపించాలనుకుంటారు. అయితే, దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చే ఈ పండగ వేళ రెట్టింపు ఆనందాన్ని నట్టింటికి తేవాలంటే మగువలకైనా, మగవారికైనా రక్షణ చర్యలు తప్పనిసరి. అందమైన దుస్తులు అనుకోకుండా దీపాలకు తగిలినా... వెలుగులు విరబూసే చిచ్చుబుడ్లు, మిరుమిట్లు గొలిపే భూచక్రాలు పొరపాటున చీర అంచులకో, పరికిణీ, ఓణీలకో అంటుకున్నా ప్రమాదమే! అందుకే, సురక్షితంగా దీపావళి జరుపుకోవడానికి డ్రెస్ డిజైనర్లు అందిస్తున్న ప్రధాన సూచనలు ఇవి. వీటిని పాటిస్తే పండగ సంబరం రెట్టింపు కాదా మరి! నూరు శాతం కాంతి... ఈ పండగ వేళ నూలు వస్త్రాలు ధరించడం వల్ల రెండు విధాల మేలు కలుగుతుంది. మనదైన చేనేత దుస్తుల వల్ల హుందాతనపు నిండుతనం కలుగుతుంది. ప్రమాద భయమూ దరిచేరదు. అందుకే, కాటన్ దుస్తులకే ఓటేద్దాం! పిల్లలకు ప్రత్యేకం... పిల్లలకు బాణాసంచా అంటే అమితమైన ఇష్టం. ముద్దుగా ఉండే వారిని మరింత అందంగా తయారుచేయడానికి రకరకాల వస్త్రాలంకరణ చేస్తుంటారు పెద్దవారు. అయితే పిల్లలను పండగ వేళ నూటికి నూరు శాతం కాటన్ వస్త్రాలతో అలంకరించడం మేలు. కాటన్‌లోనూ బాందినీ ప్రింట్లు గలవి, రంగు రంగులున్నవి, అద్దాలు, చమ్కీలు, కుందన్స్‌తో కలిపి డిజైన్ చేసినవి లభిస్తున్నాయి. ఈ తరహా దుస్తులను పిల్లల ముస్తాబుకు కేటాయించాలి. అనువైన వస్త్రాలను ధరించి అత్యంత సురక్షితంగా.. దివ్వెల దీపావళిని అంతా ఆనందంగా జరుపుకోవాలి. ఎక్కువ కుచ్చులున్నవి వద్దు! అమ్మాయిల నుంచి అమ్మల దాకా ఇటీవల కాలంలో అతివలంతా డిజైనర్ లంగా ఓణీలు ధరిస్తున్నారు. ఇవి నెటెడ్వి కావడం, పెద్ద కుచ్చులతో విప్పార్చుకున్నట్టు ఉంటాయి. చూడటానికి ఇవి అందంగా, ఆకర్షణీయంగా కనిపించినా త్వరగా నిప్పు రవ్వలకు అంటుకునే అవకాశం ఉంటుంది. సురక్షితంగా దీపావళి జరుపుకోవాలంటే ఈ తరహా మెటీరియల్ వస్త్రాలంకరణకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ధోతీ... ఆల్ ఇన్ వన్... నూలు వస్త్రాలతో పండగ కాంతి ఎలా.. అని ఆలోచించేవారికి ఎన్నో నూతన మార్గాలున్నాయి. అందులో ధోతీ స్టైల్ ప్యాంట్స్ ముఖ్యమైనవి. ఇవి పిల్లలకు, ఆడ, మగ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఏ వయసు వారైనా వీటిని ధరించవచ్చు. స్త్రీలు ధోతీ ప్యాంట్ లేదా హారెమ్ ప్యాంట్ ధరించి పైన షార్ట్ కలర్‌ఫుల్ కుర్తీ వేసుకుంటే అందంగా కనిపిస్తారు. పటియాల మాదిరి ఉండే ఈ ధోతీ ప్యాంట్స్ విభిన్న మోడల్స్‌లో లభిస్తున్నాయి. టపాసులు కాల్చేటప్పుడు వాటి వల్ల ప్రమాదం కలుగుతుందేమో అనే భయమూ ఎక్కువ ఉండదు. మగవారు ధోతీ ప్యాంట్ ధరించడం వల్ల సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే, స్టైల్‌గా ఉండవచ్చు. పైన పొడవాటి లాల్చీ ధరించవచ్చు. పిల్లలకూ ఈ తరహా దుస్తులు లభిస్తున్నాయి. - నిర్మలారెడ్డి -
రెడ్ మిర్చి మూవీ స్టిల్స్
-
అగ్రస్థానానికిఎదగడం కోసం...
హిందీలో పలు చిత్రాల్లో నటించిన పాకిస్తానీ భామ వీణా మాలిక్ ‘సిల్క్’ చిత్రం ద్వారా కన్నడ రంగానికి పరిచయమైంది. ఈ చిత్రాన్ని ‘రెడ్ మిర్చి’ టైటిల్‌తో కన్నడ దర్శకుడు కనసుగార కరణ్ తెలుగులోకి అనువదించారు. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కరణ్ మాట్లాడుతూ -‘‘సినిమా రంగంలో అగ్రస్థానానికి ఎదగడం కోసం ఓ నటి ఏం చేసింది? అనేదే ఈ చిత్రకథ. ఇందులో వీణా మాలిక్ అద్భుతంగా నటించింది. అలాగే, ప్రతినాయకురాలి పాత్రను సన చేసింది. కన్నడంలో ఈ చిత్రం 150 రోజులాడింది. తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జెస్సీ గిఫ్ట్, మాటలు-పాటలు: భారతీబాబు, కెమెరా: జై ఆనంద్, సమర్పణ: పి.వి.ఎల్, దర్శకత్వం: త్రిశూల్. -
అచ్చు బొమ్మలు
అమ్మాయిలను ‘అచ్చు బొమ్మ’లా ఉన్నావంటూ... రకరకాల పోలికలు చెబుతుంటారు.చీరలపై ‘అచ్చు’తో అందమైన బొమ్మలు వేస్తే... చూపరులు సైతం బొమ్మల్లా ఉండిపోవాల్సిందే! ఆ చీరలను కట్టుకున్న అతివలు... కుందనపుబొమ్మల్లా మెరిసిపోవాల్సిందే!హ్యాండ్లూమ్, సిల్క్, పట్టు... మెటీరియల్ ఏదైనా...వేసే డిజైన్‌లో సృజన ఉంటే బామ్మనైనా భామనైనా ‘అచ్చు’ చీరలే ఆకట్టుకుంటాయి. కుచ్చిళ్ల భాగంలో మల్టీకలర్ ఇక్కత్, ఓణీ భాగంలో పసుపురంగు కోటా, అంచుగా బ్లాక్ సీక్వెన్స్ మెటీరియల్‌ను జత చేశారు. దీంతో అటు సంప్రదాయం, ఇటు ఆధునికతల సమ్మేళనంతో చీర ఆకర్షణీయంగా మారింది. ఓణీ భాగంలో జత చేసిన వస్త్రానికి పసుపు రంగును అద్ది,పువ్వులను ‘అచ్చు’గా వేశారు. ఆకుపచ్చ, వంగపండు రంగుల కలయికతో రూపుదిద్దుకున్న హ్యాండ్లూమ్ శారీ ఇది. టెంపుల్ డిజైన్ వచ్చిన బార్డర్ పైన అద్దిన ఆకుపచ్చని ‘అచ్చు’తో ఈ చీర మరింత గ్రాండ్‌గా మారింది. సాదా క్రీమ్ కలర్ టస్సర్ సిల్క్ చీరపై కేరళ మురుగ ఆర్ట్ కనువిందు చేస్తోంది. పెన్ కలంకారి డిజైన్ అనిపించేలా ‘అచ్చు’ వేసి, ఈ డిజైన్‌ను శోభాయమానంగా రూపుకట్టారు. నలుపు, ఎరుపు మేళవింపుతో ఉన్న కోటా చీరపై తెల్లని నెమళ్ల ప్రింట్ ఆకట్టుకుంటుంది. కథాకళి నాట్య భంగిమలను ‘అచ్చు’గా రూపుకట్టి ఈ చీరను అందంగా తీర్చిదిద్దారు. లేత ఆకు పచ్చరంగు చీరకు కనకాంబరపు అంచును జత చేసి, ఆకుపచ్చని లతలు, పువ్వుల శోభ వచ్చేలా ‘అచ్చు’ వేశారు. వేసవిని కూల్ చేసే ఇలాంటి చీరలు ఆధునిక యువతులకు అందమైన అలంకరణ. డ్రెస్ కర్టెసీ: అనుపమ స్నేహాస్ కలర్స్ అండ్ ప్రింట్స్, సిద్ధార్థనగర్, హైదరాబాద్ మోడల్స్: క ల్పన, శాంతిప్రియ ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
కేరింగ్ ఖాదీ!
అదేమిటో! ఎంత సాదాసీదాగా ఉంటే... అంత గొప్పదనం వచ్చేస్తుంది అమ్మాయిలకి! ఇక ఖద్దరు తొడిగారా... మారువేషపు దౌత్యదూతలే! ఈ సిల్కులు, కాటన్లు, ఉన్ని వస్త్రాలు... అమ్మాయిల దగ్గర మార్కులు కొట్టేయడానికి ఎన్ని వేషాలైనా వేయనివ్వండి, ఖద్దరు ఒద్దికకు అన్నీ తలవొగ్గాల్సిందే. ఒద్దిక మాత్రమేనా? ఎంత జాగ్రత్త అని!! వేసవిలో చల్లగా ఉంచుతుంది. శీతాకాలంలో చలిని జల్లెడ పడుతుంది. ఏ రుతువులోనైనా... పదిలంగా చూసుకుంటుంది. ఇక లుక్ అంటారా... ఎవరీ తెలివైన అమ్మాయి అనే సందేహం రాకపోతే... ఖద్దరు ఖద్దరే కాదు. 1- మస్లిన్ ఖాదీ మీద ఎంబ్రాయిడరీ చేసిన టాప్, కలంకారీ ఖాదీతో డిజైన్ చేసిన ప్యానల్ స్కర్ట్. 2- టాప్‌కి ఎరుపురంగు నేచురల్ డై ఖాదీ, బాటమ్‌కి కలంకారీ ఖాదీ కాంబినేషన్‌తో రూపొందించిన ఆల్టర్ నెక్ ఫ్రాక్ ఇది. 3- కలంకారీ ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లాంగ్ ఫ్రాక్ ఇది. క్యాజువల్ డ్రెస్‌గానూ, ఈవెనింగ్ పార్టీవేర్ డ్రెస్‌గానూ ధరించవచ్చు. 4- ప్రింటెడ్ స్కర్ట్ పైన పింక్ ఖాదీ టాప్ వేయడంతో క్యాజువల్‌గానూ, మోడ్రన్‌గానూ కనువిందుచేస్తోంది. ఖాదీ డ్రెస్సుల వాడకంలో... డ్రెస్సులకు గంజి పెట్టడం నేటి తరం అంతగా ఇష్టపడటం లేదు. ఖాదీకి అంతగా గంజిపెట్టాల్సిన అవసరం ఉండదు. 3-4 సార్లు ధరించి, శుభ్రపరిచిన తర్వాత చాలా తక్కువ మోతాదులో గంజి పెట్టి, ఐరన్ చేస్తే చాలు కొత్త డ్రెస్‌లా మారిపోతుంది. ఖాదీ ఫ్యాబ్రిక్ సహజసిద్ధమైన రంగులతో రూపొందించినది. అందుకని ఈ దుస్తులను శుభ్రపరిచేటప్పుడు మిగతా వాటితో కలపకుండా ఉండటం మంచిది. సహజసిద్ధమైన ప్రకృతి గుణాలు గల ఫ్యాబ్రిక్ కాబట్టి ఖాదీ దుస్తుల మీదకు ఉడెన్, టైట, జ్యూట్, బ్యాంబూ... వంటి ఎకో ఫ్రెండ్లీ యాక్ససరీస్ చక్కగా నప్పుతాయి. ఖాదీ ఫ్యాబ్రిక్ సహజంగానే డల్‌గా ఉంటుంది. అందుకని యాక్ససరీస్ (బ్యాంగిల్స్, బ్యాగ్, చెప్పల్స్, గొలుసులు ..) కలర్ఫుల్గా ఉండేవి ధరిస్తే బ్రైట్‌గా కనిపిస్తారు. మోడల్: శ్రావ్య అరవింద్ జాషువా, ఫ్యాషన్ డిజైనర్ త్రిత్వాఖాదీ, హైదరాబాద్ www.facebook.com/thrithvaakhadi