పట్టు పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
Published Sat, Feb 18 2017 12:21 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM
– ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవ్ చౌదరి
హిందూపురం రూరల్ : పట్టు పరిశ్రమలోని అన్ని విభాగాల్లో పురోభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవ్ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా కిరికెర పట్టుపరిశోధన కేంద్రంలో పట్టు పరిశ్రమశాఖకు చెందిన నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప , కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టు సాగు, వసతులు, నిర్దేశించిన లక్ష్యాలను జిల్లాల వారీగా సమీక్షించారు. కార్యక్రమంలో కర్నూలు డీడీ సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement