harticulture
-
‘ఉద్యాన’ ప్రవేశాలకు రెండో దశ వెబ్ ఆప్షన్స్
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల్లో బీఎస్సీ (హానర్సు) హార్టీకల్చర్ కోర్సుకు సంబంధించి మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 12, 13, 14 తేదీల్లో రెండోదశ వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు బుధవారం తెలిపారు. మొదటి కౌన్సెలింగ్ ద్వారా కాలేజీల్లో చేరిన విద్యార్థులు, ఈ కోర్సు కోసం దరఖాస్తు ద్వారా రిజి్రస్టేషన్ చేసుకున్న మిగిలిన విద్యార్థులు అందరూ వెబ్ ఆప్షన్స్‌కు అర్హులు అని పేర్కొన్నారు. హార్టీసెట్–2023 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 21న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫీజుల వివరాలు సెమిస్టర్ ఫీజు జనరల్ సీటు రూ.51,083 పేమెంట్ సీటు రూ.1,38,488 ఫీజులు, ఇతర వివరాల కోసం... ప్రభుత్వ ఉద్యాన కళాశాల వెంకట్రామన్నగూడెం, 7382633648 అనంతరాజుపేట –7382633651 పార్వతీపురం–7382633660 చినలాటరపి–7382633443 నంబర్లలో సంప్రదించవచ్చు. వర్సిటీ గుర్తింపు కళాశాలల్లో ఫీజులు ఎన్ కాలేజ్ ఆఫ్ హార్టీ సైన్సెస్, మార్కాపురం రూ.44,000 శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్, అనంతపురం రూ.77,000 జేసీ దివాకరరెడ్డి హార్టికల్చర్ కాలేజ్, తాడిపత్రి రూ.65,000 కేబీఆర్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సీఎస్.పురం రూ.38,700 -
ఎంపీఈఓ పోస్టుల భర్తీకి 12న ఇంటర్వ్యూలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యానశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఎంపీఈఓ పోస్టుల భర్తీకి ఈ నెల 12న జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈమేరకు సోమవారం..ఉద్యానశాఖ ఏడీ రఘునాథరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. మూడో విడతలో 62 ఎంపీఈఓ పోస్టుల భర్తీకి బీఎస్సీ బాటనీ అభ్యర్థులు 239 మందిని ఇంటర్వ్యూకు పిలిచినట్లు తెలిపారు. ఇంటర్వ్యూలకు ఎంపికయిన అభ్యర్థుల వివరాలు కర్నూలు జిల్లా వెబ్సైట్ www.kurnool.gov.inలో పెట్టామని అభ్యర్థులు చూసుకోవచ్చని తెలిపారు. ఇంటర్వ్యూలకు 12న ఉదయం 8 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. -
మెట్టకు నష్టం
నిడదవోలు రూరల్/కొవ్వూరు : ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం మెట్ట ప్రాంత రైతులను నిలువునా ముంచేసింది. వాణిజ్య పంటల్ని నేలకూల్చి అపార నష్టానికి గురి చేసింది. మొక్కజొన్న పంటకు భారీ నష్టం వాటిల్లగా.. అరటి, నిమ్మ, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వరి దుబ్బులు సైతం నేలనంటాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక కొవ్వూరు, నిడదవోలు, చాగల్లు, ద్వారకాతిరుమల, జీలుగుమిల్లి, టి.నరసాపురం, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొవ్వూరు గరిష్టంగా 18.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాగల్లులో 13.8, ద్వారకా తిరుమలలో 8.8, జీలుగుమిల్లిలో 7.2, నిడదవోలులో 9.2, తాడేపల్లిగూడెంలో 1.2, దెందులూరు 6.2 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 1.3 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. దెబ్బతీసిన ఈదురుగాలులు ఈదురు గాలుల తీవ్రతకు వాణిజ్య పంటలు నేలకొరిగాయి. నిడదవోలు మండలం తాడిమళ్ల, కోరుమామిడి, సూరాపురం, రావిమెట్ల, కంసాలిపాలెం, కాటకోటేశ్వరంలో 800 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలగా, మరో 100 ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లింది. నేలవాలిన పంట లను మండల వ్యవసాయాధికారి జి.సత్యనారాయణ పరిశీలించారు. నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపోవడంతో గ్రామాలు అంధకారంలో మగ్గాయి. దెందులూరు మండలం చల్లచింతలపూడి, కొత్తకమ్మవారిగూడెం, కేఎన్ పురం, తిమ్మనగూడెం, పెరుగ్గూడెం, మేదినరావుపాలెం గ్రామాల్లో 300 ఎకరాల్లో మొక్కజొన్న, అరటి పంటలు నేలకొరిగాయి. ఉంగుటూరు మండలం నీలాద్రిపురం, నల్లమాడు, గోపీనాథపట్నం, గొల్లగూడెం, రామచంద్రపురం గ్రామాల్లో 692 హెక్టార్లలో అకాల వర్షాలకు మొక్కజొన్న పంట దెబ్బతింది. అక్కడక్కడా వరిచేలు, అరటి దెబ్బతిన్నాయి. భీమడోలు మండలం పోలసానిపల్లి, సూరప్పగూడెం, అంబర్‌పేట, దుద్దేపూడి, అన్నేవారిగూడెం తదితర గ్రామాల్లో మొక్కజొన్న నేలకొరిగింది. ఎకరానికి రూ.23 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతులు లబోదిబోమంటున్నారు. చివరి దశలో ఉన్న వరి పంటకు సైతం నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. పలు గ్రామాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాగల్లు మండలంలో శనివారం వేకువజామున ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. చాగల్లు, నెలటూరు తదితర గ్రామాల్లో మొక్కజొన్న, ఆరటి తోటలు నేలకొరిగాయి. పలుచోట్ల వరిచేలు కూడా నేలనంటాయి. చిక్కాల, కలవలపల్లిలో మామిడి కాయ లు నేలరాలాయి. చంద్రవరం, మల్లవరంలో అరటి తోటలు పడిపోయాయి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
సస్యరక్షణతో అధిక దిగుబడులు
ఎమ్మిగనూరురూరల్: మిరప, టమాట పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నరసింహుడు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కలుగొట్ల గ్రామంలో ఉద్యానశాఖ ఆ«ధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిరప, టమాట పంటల్లో దోమలతో ఆకుముడత తెగులు వస్తోందన్నారు. దోమల నివారణకు జిగరు నీలిరంగు అట్టలను ఉపయోగించాలని సూచించారు. ఉద్యానశాఖ అధికారిణి ఇందిర, ఆత్మ బీటీఎం కృష్ణస్వామి, బిందు సేద్యం అధికారి సాంబశివుడు పాల్గొన్నారు. -
పట్టు పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
– ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవ్ చౌదరి హిందూపురం రూరల్ : పట్టు పరిశ్రమలోని అన్ని విభాగాల్లో పురోభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవ్ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా కిరికెర పట్టుపరిశోధన కేంద్రంలో పట్టు పరిశ్రమశాఖకు చెందిన నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప , కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టు సాగు, వసతులు, నిర్దేశించిన లక్ష్యాలను జిల్లాల వారీగా సమీక్షించారు. కార్యక్రమంలో కర్నూలు డీడీ సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
వందశాతం లక్ష్యాలు సాధించాలి
- గ్రీన్హౌస్, షేడ్‌నెట్‌పై మరింత దృష్టి పెట్టాలి – ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్)/దేవనకొండ/కోడుమూరు రూరల్: పండ్లతోటల అభివృద్ది, సూక్ష్మ సేద్యం విస్తరణపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి రైతులకు సూచించారు. మంగళవారం ఆయన కోడుమూరు మండలం ప్యాలకుర్తి, గూడూరు మండలం వై.ఖానాపురం, దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామాల్లో పర్యటించారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, రైతులతోను ముఖాముఖి మాట్లాడారు. సాయంత్రం స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఉద్యాన, ఏపీఎంఐపీ అధికారులు, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో విడివిడిగా సమావేశమై సమీక్షించారు. ఉద్యానశాఖలోని నార్మల్ స్టేట్ ప్లాన్, స్టేట్ హార్టీకల్చర్ మిషన్, ఆకేఈవై కింద ఇచ్చిన లక్ష్యాలు, ఇంతవరకు సాధించిన ప్రగతిపై సమీక్షించారు. ఇప్పటి వరకు ప్రగతి అంతంత మాత్రంగానే ఉందని ఇకపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రీన్ హౌస్, షేడ్‌నెట్ టెక్నాలజీని మరింతగా రైతుల్లోకి తీసుకెళ్లాలన్నారు. పందిరిపై తీగజాతి కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. కొత్త పండ్లతోటల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం ముగిసేలోగా మొక్కలు నాటడం పూర్తి చేయాలన్నారు. డ్రిప్ కోసం వచ్చిన దరఖాస్తులనుజాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. ఆయన వెంట హార్టీ కల్చర్ పీడీ శ్రీనివాసులు, జేడీఏ ఉమా మహేశ్వరమ్మ, ఆయా శాఖల ఏడీలు, సిబ్బంది ఉన్నారు. -
ఉద్యానశాఖ ద్వారా ‘ఇథలిన్’ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: ఇథలిన్ ద్వారా పండ్లను మాగబెట్టే కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉద్యానశాఖ నిర్ణయించింది. బోధన్, ఖమ్మం, హైదరాబాద్‌లలో వీటిని ఏర్పాటు చేస్తామని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో చెప్పారు. ప్రైవేటు రంగంలో వీటిని ఏర్పాటు చేసి, 30 శాతం సబ్సిడీ అందజేస్తామని తెలిపారు. వీటి కోసం 60 శాతం బ్యాంకు రుణం తీసుకోవచ్చ ని, 10 శాతం రైతులు భరించాల్సి ఉంటుందన్నారు.వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మిరప, పసుపు పంటల కోసం కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తామన్నా రు. పండ్లు మాగబెట్టే కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీల కోసం రూ.10కోట్లు కేటాయించామన్నారు.