సస్యరక్షణతో అధిక దిగుబడులు
Published Sat, Feb 18 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM
ఎమ్మిగనూరురూరల్: మిరప, టమాట పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నరసింహుడు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కలుగొట్ల గ్రామంలో ఉద్యానశాఖ ఆ«ధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిరప, టమాట పంటల్లో దోమలతో ఆకుముడత తెగులు వస్తోందన్నారు. దోమల నివారణకు జిగరు నీలిరంగు అట్టలను ఉపయోగించాలని సూచించారు. ఉద్యానశాఖ అధికారిణి ఇందిర, ఆత్మ బీటీఎం కృష్ణస్వామి, బిందు సేద్యం అధికారి సాంబశివుడు పాల్గొన్నారు.
Advertisement
Advertisement