వందశాతం లక్ష్యాలు సాధించాలి
వందశాతం లక్ష్యాలు సాధించాలి
Published Wed, Oct 5 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
- గ్రీన్‌హౌస్, షేడ్‌నెట్‌పై మరింత దృష్టి పెట్టాలి
– ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి ఆదేశాలు
కర్నూలు(అగ్రికల్చర్)/దేవనకొండ/కోడుమూరు రూరల్: పండ్లతోటల అభివృద్ది, సూక్ష్మ సేద్యం విస్తరణపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి రైతులకు సూచించారు. మంగళవారం ఆయన కోడుమూరు మండలం ప్యాలకుర్తి, గూడూరు మండలం వై.ఖానాపురం, దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామాల్లో పర్యటించారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, రైతులతోను ముఖాముఖి మాట్లాడారు. సాయంత్రం స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఉద్యాన, ఏపీఎంఐపీ అధికారులు, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో విడివిడిగా సమావేశమై సమీక్షించారు. ఉద్యానశాఖలోని నార్మల్ స్టేట్ ప్లాన్, స్టేట్ హార్టీకల్చర్ మిషన్, ఆకేఈవై కింద ఇచ్చిన లక్ష్యాలు, ఇంతవరకు సాధించిన ప్రగతిపై సమీక్షించారు. ఇప్పటి వరకు ప్రగతి అంతంత మాత్రంగానే ఉందని ఇకపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రీన్ హౌస్, షేడ్‌నెట్ టెక్నాలజీని మరింతగా రైతుల్లోకి తీసుకెళ్లాలన్నారు. పందిరిపై తీగజాతి కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. కొత్త పండ్లతోటల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం ముగిసేలోగా మొక్కలు నాటడం పూర్తి చేయాలన్నారు. డ్రిప్ కోసం వచ్చిన దరఖాస్తులనుజాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. ఆయన వెంట హార్టీ కల్చర్ పీడీ శ్రీనివాసులు, జేడీఏ ఉమా మహేశ్వరమ్మ, ఆయా శాఖల ఏడీలు, సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement