
భూసారాన్ని పెంపొందించడంతో పాటు దీర్ఘకాలం పాటు ప్రభావం చూపటం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించటంలో ఉపయోగపడే బయోచార్ (కట్టెబొగ్గు) ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పత్తి కట్టె, కంది కట్టె, వరి ΄పొట్టు వంటి పంట వ్యర్థాలతో ఒక ప్రత్యేక పద్ధతిలో దగ్ధం చేయటం ద్వారా బయోచార్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అందుకు ఇప్పటికే అనేక రకాల యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా, న్న, సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ఉండే రొటేటింగ్ డ్రమ్ ఆటోథర్మల్ బయోచార్ యూనిట్‌ను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధ సంస్థ, భోపాల్‌లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (ఐసిఎఆర్-సిఐఎఇ) రూపొందింంది. పేటెంట్ పొందదిన ఈ యూనిట్ పంట వ్యర్థాలను బయోచార్‌గా మారుస్తుంది. వంద కిలోల కట్టెను వాడితే 20–35% కట్టె బొగ్గును అందించే సామర్థ్యంతో పనిచేస్తుంది. చిన్నది. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.
బయోచార్‌ను తయారు చేసే ప్రక్రియను పైరోలిసిస్ అంటారు. పైరోలిసిస్ ఛాంబర్‌తోపాటు రెండు సర్క్యులర్ బీమ్‌లు రెండు వైపులా ఉంటాయి. రొటేటింగ్ హేండిల్, చిమ్నీతో కూడిన గ్యాస్ అవుట్‌లెట్, మూతతోపాటు లోడింగ్ పోర్టు, వీటన్నిటినీ మోసే ఫ్రేమ్ ఉంటాయి. ఈ బయోచార్ ఉత్పత్తి యూనిట్‌ను ఆరుబయట ఉంచి, దాంట్లో పైన ఉండే మూత తీసి పంట వ్యర్థాలను లోపల వెయ్యాలి. ఆ తర్వాత నిప్పంటించాలి. మంట చిన్నగా రగులు కుంటున్నప్పుడు ఎయిర్ బ్లోయర్ ద్వారా గాలిని సరఫరా చెయ్యాలి. ఈ ఛాంబర్ పైభాగాన ఉన్న గ్యాస్ అవుట్‌లెట్ ద్వారా మంట పొగ బయటకు వస్తాయి.
బాగా ఎండబెట్టిన (తేమ సుమారు 10–15% ఉండే) పంట వ్యర్థాలను రియాక్టర్‌లోకి వెయ్యాలి. పూర్తిగా నింపెయ్యకుండా 80% వరకు వెయ్యాలి. రియాక్టర్ యూనిట్‌ను 3–4 సార్లు తిప్పటం ద్వారా మంట కట్టెకు అన్ని వైపులా పూర్తిగా మంట వ్యాపించేలా చెయ్యాలి. బయోచార్ 20 శాతం నుంచి 30% మధ్యలో లభిస్తుంది.
సామర్థ్యం: 1.2 క్యూబిక్ మీటర్లు (సుమారు 150 కిలోల పంట వ్యర్థాల ముక్కలు)
ధర: రూ. లక్ష + 18% జిఎస్‌టి.
వివరాలకు:
డాక్టర్ సందీప్ మండల్,
సీనియర్ సైంటిస్ట్,
ఐసిఎఆర్– సిఐఎఇ, భోపాల్, భారత్.
మొబైల్: 97203 23421