‘మన పంటలు – మన వంటలు’ మూడు రోజుల సదస్సు | manavantalu-maba pantlu sadassulu in Ananthapuram | Sakshi
Sakshi News home page

‘మన పంటలు – మన వంటలు’ మూడు రోజుల సదస్సు

Published Tue, Mar 18 2025 11:25 AM | Last Updated on Tue, Mar 18 2025 11:25 AM

manavantalu-maba pantlu sadassulu in Ananthapuram

మారుతున్న వాతావరణం నేపథ్యంలో ‘మన పంటలు – మన వంటలు’ అనే  శీర్షికతో అనంతపురంలోని పోలిస్‌ కళ్యాణ మండపంలో ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు ఎగ్జిబిషన్, సదస్సులు నిర్వహించనున్నట్లు అనంత సుస్థిర వ్యవసాయ వేదిక కన్వీనర్‌  డా. వై.వి. మల్లారెడ్డి తెలిపారు. ఆహారమే ఆరోగ్యం అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు.. వర్షాధార ప్రకృతి వ్యవసాయంలో పంటలు, వంటల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు మూడు రోజులూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. 23 (ఆదివారం) న ఉ.10.30 గం.కు డా. ఖాదర్‌ వలి ప్రసంగం ఉంటుందన్నారు. 20 స్వచ్ఛంద సంస్థలు కలసి వరుసగా రెండో ఏడాది ఈ సదస్సులు నిర్వహిస్తుండటం విశేషం. 

22,23 తేదీల్లోబయోచార్‌పై శిక్షణ 
వ్యవసాయ వ్యర్థాలతో బయోచార్‌ (బొగ్గు  పొడి)ని తయారు చేసి  పొలంలో తగిన మోతాదులో చల్లితే భూసారం పెరుగుతుంది. ఈ విషయమై రైతులకు లోతైన అవగాహన కల్పించటం కోసం ఘట్‌కేసర్‌ సమీపంలోని పిట్టల ఆర్గానిక్‌ ఫామ్‌ (ఎన్‌ఎఫ్‌సి నగర్‌ – అంకుష్‌పుర్‌ మధ్య)లో జరగనుంది. ప్రసిద్ధ బయోచార్‌ నిపుణులు డా. నక్కా సాయిభాస్కర్‌ రెడ్డి శిక్షణ ఇస్తారని నిర్వాహకులు పిట్టల శ్రీశైలం  తెలిపారు రు. ముందస్తు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. ఇతర వివరాలకు..  70137 84740 నెంబర్‌ను సంప్రదించవచ్చు. 

చదవండి: డాన్‌ ఆఫ్‌ ఫ్రూట్స్‌.. అవొకాడో పండ్ల తోటలు సాగు ఎలా చెయ్యాలి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement