Ananthapur
-
‘బాబూ.. ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?’
సాక్షి, అనంతపురం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైనట్టు తెలిపారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబుది అసమర్థత పాలన. హామీలను అమలు చేయడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైంది. రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధం. ఈనెల 13వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అనంతపురంలో ర్యాలీ, అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తాం. రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?. ధాన్యం కొనుగోలు, మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు.మాజీ ఎంపీ తలారి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ..‘రైతులకు భరోసా కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. రైతులకు ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు. ఈనెల 13వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు. -
తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్సీపీ నేత జావేద్ ఇంటి వద్ద ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి అనుచరుడు వీరంగం సృష్టించాడు. డబ్బులు బాకీ ఉన్నారంటూ వైఎస్సార్సీపీ నేత ఇంటి వద్ద అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. కుటుంబ సభ్యులను నిర్బంధించారని పోలీసులకు వైఎస్సార్సీపీ నేత జావేద్ ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత గోరాకు ఎలాంటి బాకీ లేనని జావెద్ స్పష్టం చేశారు.హోంగార్డుపై టీడీపీ నేత దౌర్జన్యం శింగనమల మండలంలోని ఉల్లికల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేత రంగారెడ్డి తనపై దాడికి ప్రయత్నించాడంటూ శింగనమల పీఎస్‌లో పనిచేస్తున్న హోంగార్డు నాగేంద్ర మంగళవారం సీఐ కౌలుట్లయ్యకు ఫిర్యాదు చేశారు. వివరాలు... సెప్టెంబరులో ఒక రోజు రాత్రి నాయనపల్లి క్రాస్ నుంచి మరువకొమ్మ వరకూ హెడ్ కానిస్టేబుల్ గిరి మహేష్‌తో కలసి, హోంగార్డు నాగేంద్ర గస్తీ విధులు నిర్వర్తించాడు.ఆ సమయంలో టీడీపీ నేత ఉల్లికల్లు రంగారెడ్డికి చెందిన టిప్పరులో అక్రమంగా ఇసుక తరలిస్తుండడం గుర్తించి పోతురాజుకాలువ సమీపంలో అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. దీంతో అప్పటి నుంచి హోంగార్డు నాగేంద్ర ఎక్కడ కనిపించిన రంగారెడ్డి కోపంతో దుర్భాషలాడేవాడు. ఈ క్రమంలో మంగళవారం నాయనవారిపల్లిలో జరిగిన శుభకార్యానికి ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజు హాజరుకానుండడంతో ఎస్ఐ, ఎఎస్ఐ, హెడ్ కానిస్టేబులు, సిబ్బందితో ఎస్కార్ట్ విధుల్లో నాగేంద్ర కూడా పాల్గొన్నాడు. అక్కడ సిబ్బంది భోజనం చేస్తున్న సమయంలో నాగేంద్రపై రంగారెడ్డి దాడికి ప్రయతి్నంచాడు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది అడ్డుకోవడంతో నీ కథ చూస్తా అంటూ బెదిరిస్తూ వెళ్లిపోయాడు. టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. -
జడ్పీ వైస్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర
-
AP: తెలంగాణ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్యాంకర్
సాక్షి,అనంతపురం:బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును గురువారం(అక్టోబర్11) అర్ధరాత్రి అనంతపురంజిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట సమీపంలో ట్యాంకరు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ట్యాంకరు డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హైవే పెట్రోలింగ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను ఇతర బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. జాతీయ రహదారి44పై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.ఇదీ చదవండి: ఈ టీతో నష్టాలే -
అనంతపురం వైద్య కళాశాలలో వేధింపుల కలకలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం :వైద్య విద్యార్థులను వేధించారన్న వార్తలు అనంతపురం మెడికల్ కాలేజీలో కలకలం రేపుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ కాలేజీలోని మూడు విభాగాల్లోని కొందరు అధ్యాపకులు మెడికోలను వేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా.. గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ విభాగాలకు సంబంధించిన అధ్యాపకులు ఈ వేధింపులకు గురిచేసినట్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి.వాస్తవానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులు రాష్ట్రంలోని ఇతర కాలేజీలు, ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసుకుంటారు. ఇప్పుడు ఈ గ్రూపుల్లో అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో వేధింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే వైద్యవిద్య పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని ఏకంగా జనరల్ సర్జరీ విభాగంలో లైంగిక వేధింపులు జరిగాయంటూ తన ఇన్‌స్ట్రాగాంలో వెల్లడించినట్లు మెడికోలు చెబుతున్నారు. ఈ అమ్మాయి చేసిన పోస్టే ఇప్పుడు కలకలం రేపుతోంది.పలు అనుమానాలకు తావిస్తున్న వైనం..ప్రస్తుతం అనంతపురం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థులు (నాలుగేళ్లకు కలిపి) 600 మంది, పీజీ వైద్య విద్యార్థులు 200 మంది ఉన్నారు. కాలేజీలో జరిగే వ్యవహారాలు బయటకు చెబితే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తారన్న భయంతో విద్యార్థినులు మౌనం వహించినట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ అడ్మిషన్లు జరుగుతున్న వేళ వేధింపుల కలకలం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తాం..మాకు కూడా ఈ విషయాలు వారం రోజుల కిందటే తెలిశాయి. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తున్నాం. – డాక్టర్ మాణిక్యాలరావు, ప్రిన్సిపాల్, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలవాళ్లనే అడగండి చెబుతారు..లైంగిక వేధింపుల విషయం నా దృష్టికి రాలేదు. కొంతమంది పాస్డ్‌ఔట్ విద్యార్థులు పోస్ట్ చేశారని మీరే అంటున్నారు. వాళ్లనే అడగండి.. వాళ్లే మీకు ఏం జరిగిందో చెబుతారు. – డాక్టర్ రామస్వామి నాయక్, హెచ్ఓడీ, జనరల్ సర్జరీ విభాగం, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల -
అంతర్జాతీయ వేదికగా వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు
సాక్షి, అనంతపురం: అంతర్జాతీయ వేదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ప్రశంసలు దక్కాయి. రష్యాలో జరిగిన మేయర్ల సదస్సుకు వర్చువల్‌గా హాజరైన అనంతపురం మేయర్ మహ్మద్ వాసీం.. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అమలు చేసిన విద్యా సంస్కరణలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. పాఠశాలల్లో నాడు-నేడు, ట్యాబుల పంపిణీ, ఇంగ్లీష్ మీడియం వంటి వైఎస్ జగన్ చేసిన మంచిని అంతర్జాతీయ డిజిటల్ వీక్ సెమినార్లో మేయర్ వివరించారు. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులను పెద్దఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు మరోసారి కేంద్రం గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. సులభతర వాణిజ్య ర్యాంకులు (ఈవోడీబీ)–2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2022 అమల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజంలో ఉంది.ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పనితీరు భేష్ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ నిర్ణయాలకు కేంద్రం గుర్తింపు -
అనంతపురంలో ఆడటం సంతోషంగా ఉంది: శ్రేయస్ అయ్యర్
దేశవాళీ క్రికెట్లో పాల్గొనటం ద్వారా నైపుణ్యాలను మరింతగా పెంచుకోవచ్చని టీమిండియా స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లు ఈ టోర్నీల్లో ఆడటం వల్ల యువతలో స్ఫూర్తినింపినట్లు అవుతుందని పేర్కొన్నారు. కాగా జాతీయ విధుల నుంచి విరామం లభించినపుడు.. ఫిట్‌గా ఉన్న సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీ-2024లో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ తదితర టీమిండియా స్టార్లు పాల్గొనున్నారు. ఇండియా-ఏ, ఇండియా-బి- ఇండియా-సి, ఇండియా-డి జట్ల తరఫున ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఈ రెడ్‌బాల్ టోర్నీ పోటీలు అనంతపురం వేదికగా గురువారం ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రికెటర్లంతా అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.ఈ క్రమంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా-సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఇండియా-డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అనంతపురం లో జరిగే దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో ఆడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ఫోర్-డే టోర్నీలో ఆడటం ద్వారా నైపుణ్యాలను పదునుపెట్టుకునే అవకాశం దొరుకుతుందని హర్షం వ్యక్తం చేశారు.దులిప్ ట్రోఫీ- 2024 జట్లుఇండియా-ఏశుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఇండియా-సిరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డిశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: సెంచరీ హీరో’కు గాయం.. సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్! -
వామ్మో.. పాము!
పాములు మనుషులను బెంబేలెత్తిస్తున్నాయి. పాముకాటు బాధితుల సంఖ్య ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీగా పెరుగుతోంది. ఎక్కువగా వర్షాకాలంలో పాముకాట్లు నమోదవుతున్నాయి. ఏటా సగటున 2,600 మంది పాముకాటుకు గురవుతున్నారు. రాష్ట్రంలోనే పాముకాటు బాధితుల్లో ‘అనంత’ నాలుగో స్థానంలో ఉంది. వ్యవసాయాధారిత జిల్లా కావడంతో ఎక్కువగా పొలం పనులకు వెళ్లే వారే పాము కాటుకు గురవుతున్నట్టు తాజా గణాంకాల్లో బయటపడింది.సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో అత్యంత విషపూరితమైన పాములుగా నాలుగు రకాల పాములను గుర్తించారు. వీటిలో నాగుపాము, కట్ల పాము, రక్త పింజరి, చిన్న పింజరి లేదా తోటి పింజరి పాములు ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నమోదవుతున్న పాముకాటు కేసుల్లో 23 శాతం ఈ నాలుగు రకాల పాములకు సంబంధించినవేనని తేలింది. ఈ పాములు కాటేసిన 30 నిమిషాల్లో ప్రథమ చికిత్స చేయకపోతే ప్రాణాపాయం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ నాలుగు రకాల పాములు స్వతహాగా కాటువేయడానికి ఆసక్తి చూపించవు. కానీ వాటిని తాకడం, తొక్కడం వంటివి చేసినప్పుడు బలంగా కాటు వేసే అవకాశం ఉందంటున్నారు. కొన్ని నీటిపాములు, జెర్రిగొడ్లు వంటివి ప్రాణాపాయం కాదని, ప్రథమ చికిత్స చేస్తే వెంటనే కోలుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.బాధితుల్లో యువకులే ఎక్కువపాముకాటుకు గురవుతున్న బాధితుల్లో ఎక్కువగా యువకులు, మధ్య వయస్కుల వారే ఉండటం గమనార్హం. పొలం పనులకు వెళ్లేవారిలో వీళ్లే ఎక్కువ. 21–30 ఏళ్ల వయస్కుల్లో 24 శాతం మంది బాధితులుండగా, 31–40 ఏళ్ల మధ్య వయసు వారు 24 శాతం మంది ఉన్నారు. 41–50 ఏళ్ల వారు 19 శాతం మంది పాముకాటు బాధితులు ఉన్నారు. పదేళ్లలోపు చిన్నారుల్లో 10 శాతం మంది ఉన్నారు. ఇదిలా ఉండగా పురుషులే ఎక్కువ మంది పాముకాటుకు గురవుతున్నారు. బాధితుల్లో 63 శాతం మంది పురుషులు, 37 శాతం మంది మహిళలు ఉన్నారు.రాత్రిపూటే పాముకాట్లుపొలం పనులకు వెళ్లే రైతులు లేదా కూలీలు రాత్రి పూట అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న పాముకాట్లు 35 శాతానికి పైగా సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య జరుగుతున్నట్టు వెల్లడైంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపు 32 శాతం మేర కేసులు నమోదయ్యాయి. మిగతా కేసులన్నీ పగలు పూట నమోదైనవిగా గుర్తించారు. పాము కాటుకు గురైన బాధితులు 92 శాతం మంది 108 సర్వీసులోనే ఆస్పత్రులకు చేరారు. మొత్తం బాధితుల్లో 8 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగా, మిగతా 92 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఇదిలా ఉండగా గడిచిన రెండు మాసాల్లో పాముకాటుతో ముగ్గురు మృతిచెందారు. -
జేసీ కేతన్‌గార్గ్ బదిలీ
● రాజమహేంద్రవరం మునిసిపల్కమిషనర్గా నియామకం● అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జెడ్పీ సీఈఓ నిదియాదేవి కూడా బదిలీఅనంతపురం అర్బన్: జేసీ కేతన్‌గార్గ్ బదిలీ అయ్యారు. రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్‌గా ప్రభుత్వం ఆయనను నియమించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేసీతో పాటు అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవిని కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. మేఘస్వ రూప్‌ను మదనపల్లి సబ్ కలెక్టర్‌గా, నిదియాదేవిని రాజంపేట సబ్‌కలెక్టర్‌గా నియమించింది.జేసీగా రెండేళ్లు పూర్తిజాయింట్ కలెక్టర్‌గా కేతన్‌గార్గ్ జిల్లాలో రెండేళ్ల ఐదు నెలలు జిల్లాలో విధులు నిర్వర్తించారు. 2022, ఫిబ్రవరి 5వ తేదీన ఆయన జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఎక్కడా విమర్శలకు తావివ్వకుండా విధులు నిర్వర్తించారు.టీబీ డ్యాంకు కొనసాగుతున్న వరదబొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద పోటు ఆగడం లేదు. శుక్రవారం 1,08,790 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో శనివారం ఉదయానికి 1,16,040 క్యూసెక్కులకు పెరిగింది. జలాశయం ఎగువ ప్రాంతాలైన మలెనాడు, శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్‌మగళూరు, వరనాడులో భారీ వర్షాలు కురుస్తుండడంతో తుంగ నది పోటెత్తుతోంది. ఈ క్రమంలో పరుగులు తీస్తూ నీరంతా టీబీ డ్యాం చేరుతోంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే నాలుగు రోజుల్లో జలాశయం పూర్తిగా నిండవచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 105.788 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి గానూ 65.110 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 1,633 అడుగుల నీటి మట్టానికి గాను 1,621.32 అడుగులకు నీరు చేరింది. ఈ నెల 22 నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు నీరు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే టీబీ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే.జేఎన్టీయూరిజిస్ట్రార్గా కృష్ణయ్యఅనంతపురం: జేఎన్టీయూ (ఏ) రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ ఎస్. కృష్ణయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కృష్ణయ్య విలేకరులతో మాట్లాడారు. రిజిస్ట్రార్‌గా ఎంపిక చేసిన వీసీకి కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. వర్సిటీ పురోగతికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయనకు వర్సిటీ డైరెక్టర్లు, బోధన, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు. కాగా, గతంలో టీడీపీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 వరకూ జేఎన్టీయూ రిజిస్ట్రార్‌గా కృష్ణయ్య పనిచేశారు. ఇటీవల టీడీపీతో కూడిన కూటమి అధికారంలోకి రాగానే రిజిస్ట్రార్‌గా మళ్లీ ఆయననే నియమించడం గమనార్హం. -
పదోతరగతి నుంచే మద్యపానం.. ప్రాణాల మీదకు తెచ్చిన వైనం
సాక్షి, అనంతపురం: పదో తరగతి చదివే సమయం నుంచే ఉన్న మద్యపానం అలవాటు.. ఓ యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మద్యపానం అలవాటైపోయిన ఓ యువకుడికి.. దాని కారణంగా పాంక్రియాస్ (క్లోమం) బాగా పాడైపోయి, కుళ్లిపోయిన స్థితికి చేరుకోవడంతో ప్రాణాపాయం ఏర్పడింది. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో వ్యాపించడంతో శస్త్రచికిత్స చేసినా బతికే అవకాశాలు దాదాపు లేవనే బెంగళూరులోని పలు ఆస్పత్రుల వైద్యులు అసలు కేసు తీసుకునేందుకే ఇష్టపడలేదు. అలాంటి కేసులో అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయడమే కాక.. రోగి ప్రాణాలను విజయవంతంగా కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్.మహ్మద్ షాహిద్ తెలిపారు.“హిందూపురానికి చెందిన 26 ఏళ్ల లోకేష్‌కు తాను పదోతరగతి చదివే సమయం నుంచి మద్యపానం అలవాటు ఉంది. కొంతమందిలో దానివల్ల మరీ అంత సమస్యలు రాకపోయినా, కొందరికి మాత్రం శరీర తత్వం కారణంగా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. లోకేష్‌కు పాంక్రియాస్ చుట్టూ నీరు చేరి, ఒక గోడలా తయారైపోవడమే కాక.. బాగా చీముపట్టి విపరీతమైన ఇన్ఫెక్షన్ (నెక్రోసిస్)కు దారితీసింది. అతడు బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ చదువుతూ వైద్యరంగంలోనే ఉన్నాడు. సమస్య వచ్చిన మొదట్లో ఇక్కడ చూపించుకున్నప్పుడు మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ మనోజ్‌కు చూపించారు. ఆయన కొన్ని మందులు ఇచ్చి, శస్త్రచికిత్స అవసరం అవుతుందని చెప్పారు. దాంతో రోగి, అతడి బంధువులు బెంగళూరు తీసుకెళ్లారు. అక్కడ మూడు నాలుగు పెద్దపెద్ద ఆస్పత్రులకు తిరిగారు. ఇలాంటి కేసులో శస్త్రచికిత్స చేయకపోతే బతికే అవకాశాలు దాదాపు ఉండవు. ఒకవేళ చేసినా, 60-70శాతం మంది చనిపోతారు. బతికేవారిలో కూడా జీవితాంతం ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి ఉండటంతో బెంగళూరు ఆస్పత్రులలో వైద్యులెవరూ ఈ కేసు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో ఉండటంతో పాటు గుండె రేటు కూడా గణనీయంగా పెరిగిపోయింది. రక్తపోటు పడిపోయింది. క్లోమం పూర్తిగా పాడైపోవడంతో దాన్ని తొలగించక తప్పలేదు. ఇన్ఫెక్షన్ ప్రేగులకు కూడా విస్తరించడంతో ముందు జాగ్రత్తగా స్టోమా చేశాం. దీన్ని మరో రెండు మూడు నెలల తర్వాత మళ్లీ లోపల పెట్టేస్తాం.ఈ శస్త్రచికిత్స తర్వాత లోకేష్ పూర్తిగా కోలుకున్నాడు. అయితే, పాంక్రియాస్‌ను తొలగించడం వల్ల భవిష్యత్తులో అతడికి కచ్చితంగా మధుమేహం వస్తుంది. ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. మధుమేహ నియంత్రణకు టాబ్లెట్లు గానీ, ఇన్సులిన్ గానీ వాడాల్సి ఉంటుంది. మద్యపానానికి పూర్తిగా దూరం కావాలి. ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడాలి” అని డాక్టర్ మహ్మద్ షాహిద్ వివరించారు. -
అగ్ని గుండంలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
విడపనకల్లు: అగ్ని గుండంలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని పొలికి గ్రామంలో జరిగింది. వివరాలు.. పొలికి గ్రామంలో చిన్న సరిగెత్తు సందర్భంగా సోమవారం తెల్లవారుజామున పీర్ల దేవుళ్లను ఊరేగించారు.గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ పీర్ల దేవున్ని ఎత్తుకుని అగ్ని గుండం దాటే క్రమంలో అకస్మాత్తుగా పడిపోయాడు. స్థానికులు వెంటనే అగ్ని గుండంలో నుంచి లక్ష్మీనారాయణను బయటకు లాగారు.అప్పటికే ఆయన కాళ్లు, చేతులు తీవ్రంగా కాలి గాయాలయ్యాయి. వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు.