
సాక్షి, అనంతపురం: అంతర్జాతీయ వేదికగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై ప్రశంసలు దక్కాయి. రష్యాలో జరిగిన మేయర్ల సదస్సుకు వర్చువల్‌గా హాజరైన అనంతపురం మేయర్ మహ్మద్ వాసీం.. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అమలు చేసిన విద్యా సంస్కరణలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. పాఠశాలల్లో నాడు-నేడు, ట్యాబుల పంపిణీ, ఇంగ్లీష్ మీడియం వంటి వైఎస్ జగన్ చేసిన మంచిని అంతర్జాతీయ డిజిటల్ వీక్ సెమినార్‌లో మేయర్ వివరించారు.

కాగా, రాష్ట్రంలో పెట్టుబడులను పెద్దఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు మరోసారి కేంద్రం గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. సులభతర వాణిజ్య ర్యాంకులు (ఈవోడీబీ)–2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2022 అమల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజంలో ఉంది.
ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పనితీరు భేష్ అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: వైఎస్ జగన్ నిర్ణయాలకు కేంద్రం గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment