International Platform
-
అంతర్జాతీయ వేదికగా వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు
సాక్షి, అనంతపురం: అంతర్జాతీయ వేదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ప్రశంసలు దక్కాయి. రష్యాలో జరిగిన మేయర్ల సదస్సుకు వర్చువల్‌గా హాజరైన అనంతపురం మేయర్ మహ్మద్ వాసీం.. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అమలు చేసిన విద్యా సంస్కరణలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. పాఠశాలల్లో నాడు-నేడు, ట్యాబుల పంపిణీ, ఇంగ్లీష్ మీడియం వంటి వైఎస్ జగన్ చేసిన మంచిని అంతర్జాతీయ డిజిటల్ వీక్ సెమినార్లో మేయర్ వివరించారు. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులను పెద్దఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు మరోసారి కేంద్రం గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. సులభతర వాణిజ్య ర్యాంకులు (ఈవోడీబీ)–2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2022 అమల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజంలో ఉంది.ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పనితీరు భేష్ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ నిర్ణయాలకు కేంద్రం గుర్తింపు -
తెలుగింటి.. వెలుగులు! ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?
అమ్మానాన్నలు వెంట లేకుండానే... టీచర్లు తోడు లేకుండానే ఈ అమ్మాయిలు ధైర్యంగా దేశం దాటి చైనా వెళ్లారు. శాస్త్ర సాంకేతిక సదస్సులో 38 దేశాల నుంచి హాజరైన బృందాలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. తెలుగు వారి తెలివితేటలను నిరూపించుకున్నారు. అంతర్జాతీయ ప్లాట్‌ఫారంపై అదరగొట్టారు. భావి శాస్త్రవేత్తలుగా భళా అనిపించుకున్నారు. ఎంచక్కా తిరిగి వచ్చారు. తమ అనుభవాలను సాక్షితో సంతోషంగా పంచుకున్నారు.ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?ఆంధ్రప్రదేశ్, కాకినాడకు చెందిన సాయిశ్రీ శ్రుతి చిట్టూరి, లక్ష్మీ ఆశ్రిత నామ, సంజన పల్లా, వైష్ణవి వాకచర్లలకు అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. చైనీస్ అసోషియేషన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, చైనా ఎడ్యుకేషన్ క్యాంప్ రెగ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన యూత్ సైన్స్ టెక్నాలజీ వర్క్‌షాపులో ఈ స్టూడెంట్స్ పాల్గొన్నారు. సదస్సులో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చారు.ఆలోచనలను పంచుకున్నాం..దక్షిణాఫ్రికా, నేపాల్, ఆస్ట్రేలియా, మంగోలియా తదితర దేశాలæవిద్యార్థినుల పరిశోధన అంశాలపై ఆలోచనలు పంచుకోవడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఒకే వయస్సు వాళ్లం ఒక చోట చేరి ఎంపిక చేసుకున్న అంశాలపై విశ్లేషించుకోవడానికి ఈ సదస్సు ఉపకరించింది.– వైష్ణవి. ఎంపీసీ విద్యార్థిని, కాకినాడపురాతన జీవశాస్త్రంపై పరిశోధన..ఈ వర్క్‌షాపు ద్వారా వివిధప్రాంతాల విశిష్టత, ఆయాప్రాంతాల్లో జీవరాశుల స్వభావం, స్థితిగతులపైప్రాథమికంగా కొంత అవగాహన ఏర్పరుచుకుకో గలిగాం. భవిష్యత్తులో శాస్త్రవేత్తలం కావాలనే మా సంకల్పానికి ఈ వర్క్‌షాపు కచ్చితంగా ఉపయోగమే.– సంజన, బైపీసీ విద్యార్థిని, కాకినాడఎనిమిదో ఏడు..చైనా ఏటా ప్రపంచ స్థాయిలో 2017 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వర్క్‌షాపు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, వివిధ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలోచనలను పంచుకోవాలి. అలా భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారీ అమ్మాయిలు. భావి శాస్త్రవేత్తలకు దిక్సూచి: విశ్వం ఆవిర్భావం నుంచి నేటివరకూ ప్రపంచంలో చోటు చేసుకున్న మార్పులపై నిరంతరం పరిశోధనలు కొనసాగడం ఈ వర్క్‌షాపు లక్ష్యం. ఈ వర్క్‌షాపు లో ఎంపీసీ స్టూడెంట్స్ (శృతి, వైష్ణవి) ‘చేజింగ్ ద సన్’ అంశాన్ని, బైపీసీ స్టూడెంట్స్ (లక్ష్మి ఆశ్రిత, సంజన) ఫాజిల్స్ ను ఎంపిక చేసుకున్నారు. వివిధ దేశాల నుంచి ఎంపికైన వారితో తమ అభి్రపాయాలను పంచుకుని విజయ వంతంగా తిరిగి వచ్చారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ. ఫొటోలు: తలాటం సత్యనారాయణ -
ఐరాసలో జగన్ విజన్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పక్షపాతం, పైరవీలకు, అవినీతికి తావులేకుండా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లే విప్లవాత్మక పాలనా సంస్కరణలతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమెరికాలోని ఐక్యరాజ్య సమితి వేదికపై మరోసారి ఆవిష్కృతమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడం.. మహిళా సాధికారిత కోసం ఆయా దేశాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలపై ఐరాస ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన సదస్సుకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కునుకు హేమకుమారి హాజరయ్యారు. ఈమెతోపాటు త్రిపురకు చెందిన జెడ్పీ చైర్పర్సన్ సుప్రియ దాస్ దత్తా, రాజస్థాన్‌కు చెందిన మరో సర్పంచ్ నీరూ యాదవ్‌లు ‘లోకలైజింగ్ ది ఎస్డీజీ–‘విమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా లీడ్ ది వే’ పేరుతో జరిగిన సదస్సులో మహిళా సాధికారిత కోసం భారత్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై వీరు తమ ప్రజంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా కుసుమ హేమకుమారి ఏపీలో మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించే దిశగా సీఎం జగన్ అమలుచేసిన వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రస్తావించారు. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మహిళల అప్పు మొత్తం రూ.25,570.79 కోట్లను నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆయా మహిళలకు అందజేసిందని చెప్పారు. దీంతోపాటు పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించే వారికి వారి వడ్డీ డబ్బులను ప్రభుత్వమే భరించే సున్నావడ్డీ పథకాన్ని కూడా ఆమె ఈ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించారు.పేద మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేలా..ఇక సొంతంగా వ్యాపార అవకాశాలు మెరుగుపరుచుకోవడం ద్వారా పేద మహిళలు తమ కలలను సాకారం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు.. మహిళలు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా విద్యాదీవెన వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సైతం లక్పతీ దీదీ లాంటి కార్యక్రమాలు చేపట్టిందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో తమ గ్రామంలో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు హేమకుమారి వివరించారు.అలాగే, పౌష్టికాహరంపై గర్భిణీలకు అవగాహన కలిగిస్తూ, ప్రభుత్వమే వారికి పోషకాçహారం అందిస్తూ మాతా, శిశు మరణాల నివారణకు చేపట్టిన కార్యక్రమాలను ఆమె చెప్పారు. ఆర్నెల్ల క్రితం 2023 సెప్టెంబరులో ఇదే వేదికపై జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో మన రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ పాఠశాలల పేద పిల్లలు హాజరైన విషయం తెలిసిందే. వీరు కూడా రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వ బడుల బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు.‘స్థానిక’ ప్రభుత్వాల్లో 46 శాతం మంది మహిళలే.. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లా డుతూ.. భారత్‌లో స్థానిక ప్రభుత్వాల స్థాయిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 46 శాతం మంది మహిళలేనని తెలిపారు. అలాగే, దేశంలో బాల్య వివాహాలను నిరోధించడం, విద్యను ప్రోత్సహించడం, ఆర్థికంగా నిలదక్కుకోవడం.. జీవనోపాధి అవకాశాలు కల్పించడం.. పర్యావరణ సుస్థిరత.. క్రీడలు వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రభుత్వాల స్థాయిలో కూడా మహిళలు, బాలికలకు సాధికారత కల్పించే కార్యక్రమాలను త్రిపుర, రాజస్థాన్ నుంచి హాజరైన ప్రతినిధులు వివరించారు. -
Snehalatha Mekala: అట్టడుగు వర్గాల కోసం అంతర్జాతీయ వేదికలపై...
ఎనిమిది దక్షిణాసియా దేశాలూ, అభివృద్ధికి నోచుకోని అనేక ఆఫ్రికాలోని వెనకబడిన దేశాల పల్లెల్లోని అట్టడుగు వర్గాలు, మారుమూల గిరిజనులకు, నగరాల్లోని మురికివాడల్లో రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్న వందలాది సంస్థల్ని సమన్వయం చేసే బాధ్యతలు... చాలా దేశాల్లోని పేదలూ, అణగారిన ప్రజలు, వికలాంగులు, ట్రాన్స్జెండర్స్లాంటి వారి అవసరాలను అంతర్జాతీయ వేదికలపై వినిపించడంతో పాటు వారికి అందాల్సిన సేవలూ, సౌకర్యాల విధాన రూపకల్పనలకు కృషి.. తమ పరిశోధనల్ని అంతర్జాతీయ సంస్థలకూ, వివిధ దేశాల్లోని ప్రభుత్వాలకూ, అక్కడి నేతలకు తెలియజెప్పే పని... అర్ధరాత్రి, అపరాత్రుల్లేకుండా దాదాపు 35 పైగా దేశాల్లో పర్యటనలు... ఇవన్నీ నిర్విరామంగా నిర్వర్తిస్తున్న సార్క్ దేశాల, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల సమన్వయకర్త ‘స్నేహలత మేకల’తో మాటా మంతీ... ► ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న బాధ్యతల గురించి... స్నేహలత : మన దేశంలోనే కాకుండా... మరెన్నో దేశాలలోని కుగ్రామాల్లో, గిరిజన ఆవాసాల్లో, పేదరికం తాండవిస్తున్న కొన్ని దేశాల్లోని మారుమూల పల్లెల్లో, పట్టణ మురికివాడల్లో మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం కల్పనకు అవసరమైన విధాన రూపకల్పనలతో పాటు అనేక సేవా కార్యకలాపాల రంగంలో పాలుపంచుకుంటున్నాను. మనదేశంతోపాటు బాంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, పాకిస్తాన్, మాల్దీవ్స్, శ్రీలంక, నేపాల్ దేశాల్లోని 500 పైగా ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలను సమన్వయపరుస్తూ... అవి తమ అవసరాలను, అభిప్రాయాలను అంతర్జాతీయ వేదికలపైన తెలియజెప్పే బాధ్యతలను, ప్రభుత్వ సహాయాలు అందేందుకు లోపరహితమైన విధాన రూపకల్పనలో పాలుపంచుకునే‘సౌత్ ఏషియన్ కాన్ఫరెన్స్ ఆన్ శానిటేషన్ ఫర్ ఆల్’ (సాకోశాన్) ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. అట్టడుగువర్గాలు, గిరిజనలతో పాటు వికలాంగులు, ట్రాన్స్‌జెండర్స్ లాంటివారి వెతలను అంతర్జాతీయ వేదికలపై వినిపించడమే కాకుండా... ఆ సేవలన్నీ వారికి ఎలా అందాలన్న విధాన రూపకల్పనపై ప్రభుత్వాలతో కలిపి పనిచేస్తుంటాం. ఈ కార్యక్రమాల కోసం బాగా వెనకబడిన ఆఫ్రికా దేశాలు మొదలుకొని... యూఎస్, ఫ్రాన్స్, బెల్జియమ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్ వంటి దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తాం. ► ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ కార్యకలాపాలూ, వాటిల్లో మీ భాగస్వామ్యం... ఇది రెండు విధాలుగా జరుగుతుంది. వివిధ దేశాల్లోని 500 స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో పాటు, బడుగువర్గాలు, నగర మురికివాడల్లోని పేద ప్రజల వెతలు తీర్చడానికి వివిధ దేశాల్లోని హైలెవల్ పొలిటికల్ కమిటీలు, ప్రభుత్వంలోని నేతలు, బాధ్యులందరూ తీసుకోవాల్సిన చర్యలు, అవి జరగడానికి అవసరమైన విధాన నిర్ణయాల రూపకల్పనలో తోడ్పాటు అందిస్తుంటాను. అలాగే అట్టడుగు వర్గాలు, గిరిజనుల గొంతుకను అంతర్జాతీయ వేదికలపై వినిపించడం... ఇదంతా ఒకవైపు కార్యక్రమం. ఇక మరోవైపున మా ప్రతిపాదనలు సాకారమయ్యాక... వీటి నిర్వహణకు కావలసిన పాలనాపరమైన ఆవశ్యకతలు, నిధులు... ఇవన్నీ అనేక దేశాల్లోని బడుగువర్గాలు, నగర మురికివాడల ప్రజలకు చేరేందుకు అవసరమైన సేవలందిస్తుంటాం. ► ఇన్ని దేశాల్లోని ఇన్నిన్ని మారుమూల ప్రాంతాల్లో కార్యకలాపాలకు నిధులెలా? మాకు యునిసెఫ్, శానిటేషన్ అండ్ వాటర్ ఫర్ ఆల్, వాటర్ ఎయిడ్, జీడబ్ల్యూపీ వంటివాటితో పాటు ఇంకా అనేక అంతర్జాతీయ సంస్థలు నిధుల్ని అందిస్తాయి. ► అంతర్జాతీయ కార్యకలాపాల్లోకి మీ ప్రవేశం... ఇందుకు దోహదపడ్డ నేపథ్యం... నా కెరియర్ కర్నూలులో మొదలైంది. వాననీటిని ఒడిసిపట్టి, చెక్‌డ్యామ్స్ వంటివి నిర్మించి, భూగర్భజలాల వృద్ధికి తోడ్పడే ‘వాటర్‌షెడ్’ కార్యక్రమంలో చాలా చిన్నస్థాయి ‘సోషల్ ఆర్గనైజర్’గా కెరియర్ ప్రారంభించా. ఈ కార్యక్రమంలో ఓ వ్యవసాయ అధికారి, ఓ ఇంజనీర్, ఓ ఫారెస్టు అధికారితోపాటు కలిసి ఫీల్డ్‌లో పనిచేయాలి. మారుమూల ప్రాంతాలతోపాటు కొన్నిసార్లు గిరిజన, అటవీ ప్రాంతాల్లోనూ పనిచేయాల్సి వచ్చేది. క్రమక్రమంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలూ, వేదికలపై కార్యకలాపాలతో పాటు ప్రపంచబ్యాంకుకూ, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థలకు కన్సెల్టెన్సీ బాధ్యతలనూ నిర్వర్తించా. ప్రస్తుతం తాజాగా ‘ఫాన్సా’ లో ముఖ్యంగా సమన్వయ బాధ్యతలు. ఈ కార్యక్రమంలోనే భాగంగా హైదరాబాద్‌లోని మెట్రో వాటర్ బోర్డుతో కలిసి ఇక్కడ కూడా నీటి వృథా నివారించడం, వర్షపు నీటిని కాపాడుకోవడం కోసం ఓ ప్రాజెక్టులో భాగం పంచుకున్నా. ► భవిష్యత్తు కార్యకలాపాల గురించి ఏమైనా ప్రణాళికలు? ప్రస్తుతం ఈ సేవలతో పాటు కొంపల్లి ప్రాంతంలో ‘నిశ్చింత’ అనే వృద్ధాశ్రమం నడుపుతున్నా. అది నాకెంతో ఇష్టమైన సేవా కార్యక్రమం. చేయగలిగినంత కాలం చేశాక... నేనూ, నా భర్త... పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్నే ఎంచుకుని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా వీలైనంతమందికి ఆరోగ్యాన్నివ్వాలన్నదే నా సంకల్పం. ఆమె సంకల్పం నెరవేరాలని ఆశిద్దాం. ► మహిళగా వివక్షగానీ, ఇబ్బందులుగానీ ఎదుర్కొన్నారా? స్నేహలత : వివక్ష కాదుగానీ... ఇబ్బందులు చాలానే ఎదుర్కొన్నా. మారుమూల పల్లెలకూ, దట్టమైన అడవుల్లోని చాలా గిరిజన గ్రామాలకు వెళ్లాల్సి రావడంతో నన్ను తీసుకెళ్లడానికి తోటివాళ్లు ఇబ్బంది పడేవారు. పట్నంలో చదువుకున్న ఓ అమ్మాయి ఇలా గ్రామాలు పట్టుకు తిరగడం నాకంటే... నాతోటివాళ్లనీ, గ్రామస్తుల్ని ఇబ్బంది పెట్టేది. వాళ్లతో మమేకం కావడానికీ, వయసుకంటే పెద్దగా కనిపించడానికీ చీరకట్టుతో వెళ్తుండేదాన్ని. అడవిబాటల్లో చీరకట్టుతో ప్రయాణం అదో ఇబ్బంది. కాన్ఫరెన్స్‌ల కోసం ఇంగ్లిష్ తెలియని ఆఫ్రికా ఖండంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటనలు ఓ సవాల్. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడాలేకుండా ఆఫ్రికాలోని బుర్కినాఫాస్ లాంటి చోట్లకు వెళ్లినప్పుడు కేవలం సైగలతో నెట్టుకురావడం లాంటివి ఇబ్బంది కలిగించేవే. ఒంటరిగా దాదాపు 35 దేశాలు తిరుగుతున్నప్పుడు కొన్ని అటవీ ప్రయాణాలు, అర్ధరాత్రి పయనాలు సాహసయాత్రకు తీసిపోనివిగా ఉండేవి. మహిళలకు ఫీల్డ్ జాబ్ అనువు కాదని ఈ రోజుల్లో అనుకోడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. మూడు దశాబ్దాల కిందటే నేనూ, అలాగే మా తరంలోని అనేకమంది చేయగలిగినప్పుడు... ఇప్పుడిది ఓ అంశమే కాదు. – యాసీన్ ఫొటో: రాజేశ్ -
‘టెర్రరిస్ట్ ఫండింగ్ వాచ్ లిస్ట్’లో పాక్!
పారిస్: అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌కు మరో పరాభవం. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతున్న ఆ దేశాన్ని ‘టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ లిస్ట్’లో మళ్లీ చేర్చడానికి రంగం సిద్ధమైనట్లు తెలిసింది. పారిస్‌లో జరుగుతున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌పోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ప్లీనరీ సమావేశాల ముగింపు సందర్భంగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. పాక్‌ను ఆ జాబితాలో చేర్చాలని అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి తొలుత మోకాలడ్డిన చైనా, టర్కీ, సౌదీ అరేబియాలు వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అమెరికా, ఇతర సభ్య దేశాల ఒత్తిళ్ల మేరకే చైనా తన వైఖరి మార్చుకున్నట్లు తెలిసింది. ఉగ్ర ఫండింగ్, మనీ ల్యాండరింగ్ వ్యతిరేక నిబంధనలకు లోబడని పాక్‌ను దారిలోకి తేవడానికే అమెరికా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది. 2012–15 మధ్య కాలంలో పాకిస్తాన్ ‘టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ లిస్ట్’లో ఉంది. పాకిస్తాన్ మరోసారి ఆ నిషేధిత జాబితాలో చేరితే ఆర్థికంగా దెబ్బ తింటుంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల సేవలు కోల్పోనుంది. గతంలో టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ లిస్ట్‌లో ఉన్నప్పుడు అంతర్జాతీయ ద్రవ్య సంస్థ(ఐఎంఎఫ్) నుంచి బెయిల్ అవుట్ పొంది గట్టెక్కింది. ఆలస్యంగా మేల్కొన్నా ఫలితం శూన్యం! ఇటీవల ఉగ్ర సంస్థలపై పాకిస్తాన్ కొరడా ఝుళిపించింది. జమాతే చీఫ్ సయీద్‌కు చెందిన కొన్ని ఆస్తులు, మదర్సాలను స్వాధీనం చేసుకుని ఉగ్ర వ్యతిరేక చర్యలను ప్రారంభించినట్లు బాహ్య ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. జమాతే, ఎఫ్ఐఎఫ్ అనే సంస్థలను నిషేధిస్తున్నట్లు అధ్యక్షుడు మమ్నూన్ హుసేన్ ఫిబ్రవరి 9న ఆర్డినెన్స్ జారీ చేశారు. టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ లిస్ట్‌లో తన పేరు చేర్చకుండా ఉండేందుకు పాకిస్తాన్ ఈ వారంలో ఎఫ్ఏటీఎఫ్ సభ్య దేశాలతో బేరసారాలు నిర్వహించింది. అమెరికా ప్రయత్నాలను భగ్నం చేసినట్లు పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ మూడు రోజుల క్రితం తొందరపడి ప్రకటించారు. -
గొప్ప మేష్టారు
జీవన కాలమ్ కలామ్ వేదిక మీద నిలబడితే ఉపాధ్యాయులయిపోతారు. తన ముందున్న వాళ్లని తన వాళ్లుగా చేసుకునే ఆత్మీయత ఉపాధ్యాయుడిది. నాకనిపించేది - పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల్లోనూ ఆయన ఉపాధ్యాయుడే అయిపోతారు. గొల్లపూడి శ్రీనివాస్ ఫౌండే షన్ సభలకి ముగ్గుర్ని ఆహ్వా నించాలని తాపత్రయ పడేవా ళ్లం - పి.వి. నరసింహారావు, శివాజీ గణేశన్, అబ్దుల్ కలా మ్. అనారోగ్యం కారణంగా నరసింహారావు గారు రాలేక పోయారు. శివాజీ గణేశన్ అవ కాశం ఇవ్వకుండానే వెళ్లిపో యారు. ఒక యువకుని కలల్ని మృత్యువు అర్ధంతరంగా తుంచేయడం ఆయన్ని స్పందింపజేస్తుందని భావిస్తూ మాజీ రాష్ట్రపతిని సంప్రదించాం. వారిని కలవ డానికి నేను వెళ్లలేకపోయాను. పిల్లలు వెళ్లారు. మా కృషిని అభినందిస్తూనే ముందుగా ఒప్పుకున్న కార్యక్రమాల కారణంగా రాలేకపోయారు. అది మా దురదృష్టం. జీవితంలో అవసరాల్ని అతి విచిత్రంగా కుదించు కున్న ఆయన గురించి ఎన్నో కథలున్నాయి. అన్నా విశ్వ విద్యాలయంలో ఆయన ఒక చిన్న గదిలో ఉండేవారట - ఒక పూర్తి ఇంటిని తీసుకోగలిగినా, ఆయనకి వంట చేసే తమిళుడు - ఆయన భోజనం గురించి చెప్పేవాడు. వెర్త కుళంబు, చారు, వడియాలు - ఇంతే ఆహారం. ఆయనకి ఒక సహాయకుడు ఉండేవాడు. ఏనాడూ తన బనీను, అండర్ వేర్ అతనికి ఉతకడానికి ఇచ్చేవారు కారట. రాష్ట్రపతి భవనంలోకి ఒక బ్రీఫ్‌కేసుతో వచ్చి ఆ బ్రీఫ్ కేసుతోనే తిరిగి వెళ్లారని చెప్తారు. తుంబా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఒక సైం టిస్టు పని చేసేవాడు. పొద్దుట ఆఫీసుకి వెళ్తే ఏ రాత్రికో ఇంటికి వచ్చేవాడు. ఒక రోజు భార్య తడబడుతూ చెప్పింది. పిల్లలు ఊళ్లో ఎగ్జిబిషన్‌కి వెళ్లాలనుకుంటున్నా రని. సైంటిస్టు బాధపడిపోయాడు. ఆ రోజు త్వరగా ఇం టికి వస్తాననీ, పిల్లల్ని సిద్ధం చేసి ఉంచమని చెప్పాడు. ఆఫీసుకి వెళ్లి బాస్‌తో ఆ విషయం చెప్పాడు. నిరభ్యం తరంగా వెళ్లమని అన్నాడాయన. తీరా పనిలో పడ్డాక రాత్రి 8 గంటలకి ఆ విషయం గుర్తుకొచ్చింది. తుళ్లి పడ్డాడు. భార్యకిచ్చిన మాట తప్పాడు. సిగ్గుపడుతూ ఇంటికి వచ్చాడు. పిల్లలు కనిపించలేదు. ‘పిల్లలేరీ?’ అని అడిగాడు భార్యని. మీ బాస్ వచ్చి ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్లా రని చెప్పింది. ఆ బాస్ పేరు అబ్దుల్ కలామ్. తన ఉద్యోగంలో ఆయన రెండేసార్లు సెలవు పెట్టా రట. ఆయన తండ్రి పోయినప్పుడు. తల్లి పోయిన ప్పు డు. పొద్దున్నే భగవద్గీత చదువుకుంటారు. 18 గంటలు ఉద్యోగం. రుద్రవీణ వాయిస్తారు. ఆయన రామ భక్తుడి నని ఆయనే చెప్పుకున్నారు. ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగారు: ‘‘మీ దృష్టిలో నాయకత్వ లక్షణాలు ఏమిటి?’’ అని. ఆయన చెప్తూ ‘‘నేనింతవరకూ సూర్యుని చుట్టూ 76 సార్లు తిరి గాను (అంటే వయస్సు 76 సంవత్సరాలు) నేను మరిచి పోలేని విషయం ఒకటుంది. శ్రీహరికోట నుంచి మొద టి ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు ఒక సాంకేతిక లోపం వచ్చింది. అయినా ప్రయోగించవచ్చని నేను నిర్ణ యం తీసుకున్నాను. ఆ ప్రయోగం విఫలమయింది. అం దరూ విమర్శించారు. వెంటనే పత్రికా సమావేశం జర గాలి. మా డెరైక్టర్ సతీష్ ధావన్ ‘‘నేను పత్రికా సమా వేశంలో మాట్లాడుతాను’’ అన్నారు. విమర్శల్ని సూటిగా ఎదుర్కొన్నారు. రెండో ప్రయోగం విజయవంతమ యింది. నన్ను పిలిచి ‘‘పత్రికా సమావేశంలో నువ్వు మాట్లాడు’’ అన్నారు. ఇది గొప్ప పాఠం. మంచి నాయ కుడు వైఫల్యానికి బాధ్యతని ధైర్యంగా తీసుకుంటాడు. విజయాన్ని తన అనుయాయులతో పంచుకుంటాడు’’. ‘‘మీలో పూడ్చుకోలేని పెద్ద లోపమేమిటి?’’ అని ఓ తెలివైన పాత్రికేయుడు అడిగాడట. కలామ్ నవ్వి ‘‘నాకు చేతకాని ఒకే ఒక్క విషయం - రాజకీయం’’ అన్నారట. కలామ్ వేదిక మీద నిలబడితే ఉపాధ్యాయులయి పోతారు. ఆయన ఉపన్యాసం పాఠం చెప్తున్నట్టు ఉం టుంది. తన ముందున్న వాళ్లని తన వాళ్లుగా చేసుకునే ఆత్మీయత ఉపాధ్యాయుడిది. నాకనిపించేది - పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల్లోనూ ఆయన ఉపాధ్యాయుడే అయిపోతారు. విచిత్రంగా ప్రేక్షకులు మొదట ఆశ్చర్య పడి, ఆయన మాటలకు ఆనందపడి - తమకు తెలియ కుండానే విద్యార్థులయిపోతారు. చిన్న పిల్లల్లాగ చప్ప ట్లు కొడతారు. నాకు చాలా ఇష్టమయిన, ఆయన చెప్పిన గొప్ప సూక్తులలో ఒకటి: ‘‘వైఫల్యం నువ్వు కిందపడినప్పుడు కాదు. వైఫల్యం నువ్వు కిందపడి లేవడానికి ప్రయత్నం చెయ్యనప్పుడు’’. ఒక మత్స్యకారుల కుటుంబంలో పుట్టి, అంతులేని పేదరికాన్ని అనుభవించి (ఆయన తల్లి వీలయినంత కిరసనాయిలు ఆదా చేసేవారట - కలామ్ రాత్రివేళల్లో చదువుకోడానికి కలసి వస్తుందని!) కేవలం స్వశక్తితో పద్మశ్రీ అయి, పద్మభూషణ్ అయి, పద్మవిభూ షణ్ అయి, భారతరత్న అయి, ఈ దేశానికి రాష్ర్టపతి అయి, దేశ, విదేశాలలో 40 విశ్వవిద్యాలయాలలో గౌర వ డాక్టరేట్లను అందుకున్న అతి సామాన్య జీవితాన్ని గడిపిన మేష్టారు తప్ప ఈ మాటని ఎవరూ చెప్పలేరు. ఒక వ్యక్తి గొప్పతనం అతని అవసానం చెప్తుందం టారు. అంతిమ క్షణాలలో తనకి అత్యంత ఆత్మీయులైన యువతతో ప్రసంగిస్తూనే వేదిక మీదే తనువు చాలిం చడం అతను సిద్ధ పురుషుడని చెప్పడానికి గొప్ప నిదర్శనం. గొల్లపూడి మారుతీరావు