గొప్ప మేష్టారు | abj abul kalam Intimacy teacher | Sakshi
Sakshi News home page

గొప్ప మేష్టారు

Published Thu, Jul 30 2015 12:09 AM | Last Updated on Tue, Oct 30 2018 7:45 PM

గొప్ప మేష్టారు - Sakshi

గొప్ప మేష్టారు

జీవన కాలమ్
 
కలామ్ వేదిక మీద నిలబడితే ఉపాధ్యాయులయిపోతారు. తన ముందున్న వాళ్లని తన వాళ్లుగా చేసుకునే ఆత్మీయత ఉపాధ్యాయుడిది. నాకనిపించేది - పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల్లోనూ ఆయన ఉపాధ్యాయుడే అయిపోతారు.
 
గొల్లపూడి శ్రీనివాస్ ఫౌండే షన్ సభలకి ముగ్గుర్ని ఆహ్వా నించాలని తాపత్రయ పడేవా ళ్లం - పి.వి. నరసింహారావు, శివాజీ గణేశన్, అబ్దుల్ కలా మ్. అనారోగ్యం కారణంగా నరసింహారావు గారు రాలేక పోయారు. శివాజీ గణేశన్ అవ కాశం ఇవ్వకుండానే వెళ్లిపో యారు. ఒక యువకుని కలల్ని మృత్యువు అర్ధంతరంగా తుంచేయడం ఆయన్ని స్పందింపజేస్తుందని భావిస్తూ మాజీ రాష్ట్రపతిని సంప్రదించాం. వారిని కలవ డానికి నేను వెళ్లలేకపోయాను. పిల్లలు వెళ్లారు. మా కృషిని అభినందిస్తూనే ముందుగా ఒప్పుకున్న కార్యక్రమాల కారణంగా రాలేకపోయారు. అది మా దురదృష్టం.

జీవితంలో అవసరాల్ని అతి విచిత్రంగా కుదించు కున్న ఆయన గురించి ఎన్నో కథలున్నాయి. అన్నా విశ్వ విద్యాలయంలో ఆయన ఒక చిన్న గదిలో ఉండేవారట - ఒక పూర్తి ఇంటిని తీసుకోగలిగినా, ఆయనకి వంట చేసే తమిళుడు - ఆయన భోజనం గురించి చెప్పేవాడు. వెర్త కుళంబు, చారు, వడియాలు - ఇంతే ఆహారం. ఆయనకి ఒక సహాయకుడు ఉండేవాడు. ఏనాడూ తన బనీను, అండర్ వేర్ అతనికి ఉతకడానికి ఇచ్చేవారు కారట. రాష్ట్రపతి భవనంలోకి ఒక బ్రీఫ్‌కేసుతో వచ్చి ఆ బ్రీఫ్ కేసుతోనే తిరిగి వెళ్లారని చెప్తారు.
 తుంబా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఒక సైం టిస్టు పని చేసేవాడు. పొద్దుట ఆఫీసుకి వెళ్తే ఏ రాత్రికో ఇంటికి వచ్చేవాడు. ఒక రోజు భార్య తడబడుతూ చెప్పింది. పిల్లలు ఊళ్లో ఎగ్జిబిషన్‌కి వెళ్లాలనుకుంటున్నా రని. సైంటిస్టు బాధపడిపోయాడు. ఆ రోజు త్వరగా ఇం టికి వస్తాననీ, పిల్లల్ని సిద్ధం చేసి ఉంచమని చెప్పాడు. ఆఫీసుకి వెళ్లి బాస్‌తో ఆ విషయం చెప్పాడు. నిరభ్యం తరంగా వెళ్లమని అన్నాడాయన. తీరా పనిలో పడ్డాక రాత్రి 8 గంటలకి ఆ విషయం గుర్తుకొచ్చింది. తుళ్లి పడ్డాడు. భార్యకిచ్చిన మాట తప్పాడు. సిగ్గుపడుతూ ఇంటికి వచ్చాడు. పిల్లలు కనిపించలేదు. ‘పిల్లలేరీ?’ అని అడిగాడు భార్యని. మీ బాస్ వచ్చి ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్లా రని చెప్పింది. ఆ బాస్ పేరు అబ్దుల్ కలామ్.

తన ఉద్యోగంలో ఆయన రెండేసార్లు సెలవు పెట్టా రట. ఆయన తండ్రి పోయినప్పుడు. తల్లి పోయిన ప్పు డు. పొద్దున్నే భగవద్గీత చదువుకుంటారు. 18 గంటలు ఉద్యోగం. రుద్రవీణ వాయిస్తారు. ఆయన రామ భక్తుడి నని ఆయనే చెప్పుకున్నారు.
 ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగారు: ‘‘మీ దృష్టిలో నాయకత్వ లక్షణాలు ఏమిటి?’’ అని. ఆయన చెప్తూ ‘‘నేనింతవరకూ సూర్యుని చుట్టూ 76 సార్లు తిరి గాను (అంటే వయస్సు 76 సంవత్సరాలు) నేను మరిచి పోలేని విషయం ఒకటుంది. శ్రీహరికోట నుంచి మొద టి ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు ఒక సాంకేతిక లోపం వచ్చింది. అయినా ప్రయోగించవచ్చని నేను నిర్ణ యం తీసుకున్నాను. ఆ ప్రయోగం విఫలమయింది. అం దరూ విమర్శించారు. వెంటనే పత్రికా సమావేశం జర గాలి. మా డెరైక్టర్ సతీష్ ధావన్ ‘‘నేను పత్రికా సమా వేశంలో మాట్లాడుతాను’’ అన్నారు. విమర్శల్ని సూటిగా ఎదుర్కొన్నారు. రెండో ప్రయోగం విజయవంతమ యింది. నన్ను పిలిచి ‘‘పత్రికా సమావేశంలో నువ్వు మాట్లాడు’’ అన్నారు. ఇది గొప్ప పాఠం. మంచి నాయ కుడు వైఫల్యానికి బాధ్యతని ధైర్యంగా తీసుకుంటాడు. విజయాన్ని తన అనుయాయులతో పంచుకుంటాడు’’.

 ‘‘మీలో పూడ్చుకోలేని పెద్ద లోపమేమిటి?’’ అని ఓ తెలివైన పాత్రికేయుడు అడిగాడట. కలామ్ నవ్వి ‘‘నాకు చేతకాని ఒకే ఒక్క విషయం - రాజకీయం’’ అన్నారట. కలామ్ వేదిక మీద నిలబడితే ఉపాధ్యాయులయి పోతారు. ఆయన ఉపన్యాసం పాఠం చెప్తున్నట్టు ఉం టుంది. తన ముందున్న వాళ్లని తన వాళ్లుగా చేసుకునే ఆత్మీయత ఉపాధ్యాయుడిది. నాకనిపించేది - పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల్లోనూ ఆయన ఉపాధ్యాయుడే అయిపోతారు. విచిత్రంగా ప్రేక్షకులు మొదట ఆశ్చర్య పడి, ఆయన మాటలకు ఆనందపడి - తమకు తెలియ కుండానే విద్యార్థులయిపోతారు. చిన్న పిల్లల్లాగ చప్ప ట్లు కొడతారు.

 నాకు చాలా ఇష్టమయిన, ఆయన చెప్పిన గొప్ప సూక్తులలో ఒకటి: ‘‘వైఫల్యం నువ్వు కిందపడినప్పుడు కాదు. వైఫల్యం నువ్వు కిందపడి లేవడానికి ప్రయత్నం చెయ్యనప్పుడు’’. ఒక మత్స్యకారుల కుటుంబంలో పుట్టి, అంతులేని పేదరికాన్ని అనుభవించి (ఆయన తల్లి వీలయినంత కిరసనాయిలు ఆదా చేసేవారట - కలామ్ రాత్రివేళల్లో చదువుకోడానికి కలసి వస్తుందని!) కేవలం స్వశక్తితో పద్మశ్రీ అయి, పద్మభూషణ్ అయి, పద్మవిభూ షణ్ అయి, భారతరత్న అయి, ఈ దేశానికి రాష్ర్టపతి అయి, దేశ, విదేశాలలో 40 విశ్వవిద్యాలయాలలో గౌర వ డాక్టరేట్‌లను అందుకున్న అతి సామాన్య జీవితాన్ని గడిపిన మేష్టారు తప్ప ఈ మాటని ఎవరూ చెప్పలేరు.
 ఒక వ్యక్తి గొప్పతనం అతని అవసానం చెప్తుందం టారు. అంతిమ క్షణాలలో తనకి అత్యంత ఆత్మీయులైన యువతతో ప్రసంగిస్తూనే వేదిక మీదే తనువు చాలిం చడం అతను సిద్ధ పురుషుడని చెప్పడానికి గొప్ప నిదర్శనం.
 
http://img.sakshi.net/images/cms/2015-07/71438196024_Unknown.jpg 







గొల్లపూడి మారుతీరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement